హత్య కేసులో కొత్త మలుపు
బెంగళూరు: కన్నడ నటి పవిత్ర గౌడను ఆన్‌లైన్‌లో వేధించాడన్న పట్టారాని కోపంతో రేణుకస్వామి అనే చిరుద్యోగిని నటుడు దర్శన్ తూగుదీప, అతని అనుచరులు హతమార్చారన్న కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. దర్శన్ సన్నిహిత నటి పవిత్ర గౌడను ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా పేర్కొంటూ పోలీసులు గురువారం బెంగళూరులో 24వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట రిమాండ్ రిపోర్ట్‌ను సమర్పించారు. స్వామికి కరెంట్ షాక్ ఇచ్చి హింసించామని ఇప్పటికే అరెస్టయిన ఒక నిందితుడు నేరాన్ని అంగీకరించాడు.
ఈ వివరాలను రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు ప్రస్తావించారు. హత్య తర్వాత అరెస్ట్, కేసు నుంచి తప్పించుకునేందుకు, మృతదేహాన్ని మాయం చేసి ఆధారాలను ధ్వంసంచేసేందుకు దర్శన్ భారీగా ఖర్చుచేశారని, అందుకోసం స్నేహితుడు మోహన్ రాజ్ నుంచి రూ.40 లక్షల అప్పు తీసుకున్నారని పోలీసులు వెల్లడించారు. షాక్ ఇచ్చేందుకు వాడిన ఎలక్ట్రిక్ షాక్ టార్చ్‌ను, ఆ రూ.40 లక్షల నగదును పోలీసులు ఇప్పటికే స్వా«దీనం చేసుకున్నారు. దర్శన్, మరో ముగ్గురిని పోలీస్ కస్టడీకి, పవిత్ర గౌడను జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని కోర్టును పోలీసులు కోరారు.
ఘటనాస్థలిలో చెప్పులతో కొట్టిన పవిత్ర
చిత్రదుర్గ ప్రాంతంలో రేణుకస్వామిని కిడ్నాప్‌చేసి 200 కి.మీ.ల దూరంలోని బెంగళూరుకు తీసుకొచ్చి షెడ్‌లో కట్టేసి కొట్టేటపుడు నటి పవిత్ర గౌడ అక్కడే ఉన్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆమె కూడా రేణుకస్వామిని తన చెప్పులతో కొట్టారని పోలీసులు పేర్కొన్నారు. అసభ్య సందేశాలు పంపిన స్వామికి బుద్ది చెప్పాలని అక్కడే ఉన్న దర్శన్‌ను పవిత్ర ఉసిగొలి్పందని ఆయా వర్గాలు వెల్లడించాయి. రేణుకస్వామి పోస్ట్‌మార్టమ్‌లో కొత్త విషయాలు వెల్లడయ్యాయి. సున్నిత అవయవాలపై దాడితో వృషణాలు చితికిపోయాయని, ఒక చెవి కనిపించలేదని నివేదిక పేర్కొంది. రేణుకస్వామి గతంలో ఇన్‌స్టా్రగామ్‌లో పోస్ట్ చేసి డిలీట్‌చేసిన మెసేజ్‌లను వెలికి తీసివ్వాలని దాని మాతృ సంస్థ ‘మెటా’ను పోలీసులు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment