Slippers attacks
-
రేణుకస్వామి కేసులో ఏ1గా పవిత్ర!
బెంగళూరు: కన్నడ నటి పవిత్ర గౌడను ఆన్లైన్లో వేధించాడన్న పట్టారాని కోపంతో రేణుకస్వామి అనే చిరుద్యోగిని నటుడు దర్శన్ తూగుదీప, అతని అనుచరులు హతమార్చారన్న కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. దర్శన్ సన్నిహిత నటి పవిత్ర గౌడను ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా పేర్కొంటూ పోలీసులు గురువారం బెంగళూరులో 24వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట రిమాండ్ రిపోర్ట్‌ను సమర్పించారు. స్వామికి కరెంట్ షాక్ ఇచ్చి హింసించామని ఇప్పటికే అరెస్టయిన ఒక నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. ఈ వివరాలను రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు ప్రస్తావించారు. హత్య తర్వాత అరెస్ట్, కేసు నుంచి తప్పించుకునేందుకు, మృతదేహాన్ని మాయం చేసి ఆధారాలను ధ్వంసంచేసేందుకు దర్శన్ భారీగా ఖర్చుచేశారని, అందుకోసం స్నేహితుడు మోహన్ రాజ్ నుంచి రూ.40 లక్షల అప్పు తీసుకున్నారని పోలీసులు వెల్లడించారు. షాక్ ఇచ్చేందుకు వాడిన ఎలక్ట్రిక్ షాక్ టార్చ్‌ను, ఆ రూ.40 లక్షల నగదును పోలీసులు ఇప్పటికే స్వా«దీనం చేసుకున్నారు. దర్శన్, మరో ముగ్గురిని పోలీస్ కస్టడీకి, పవిత్ర గౌడను జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని కోర్టును పోలీసులు కోరారు. ఘటనాస్థలిలో చెప్పులతో కొట్టిన పవిత్ర చిత్రదుర్గ ప్రాంతంలో రేణుకస్వామిని కిడ్నాప్‌చేసి 200 కి.మీ.ల దూరంలోని బెంగళూరుకు తీసుకొచ్చి షెడ్లో కట్టేసి కొట్టేటపుడు నటి పవిత్ర గౌడ అక్కడే ఉన్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆమె కూడా రేణుకస్వామిని తన చెప్పులతో కొట్టారని పోలీసులు పేర్కొన్నారు. అసభ్య సందేశాలు పంపిన స్వామికి బుద్ది చెప్పాలని అక్కడే ఉన్న దర్శన్‌ను పవిత్ర ఉసిగొలి్పందని ఆయా వర్గాలు వెల్లడించాయి. రేణుకస్వామి పోస్ట్‌మార్టమ్‌లో కొత్త విషయాలు వెల్లడయ్యాయి. సున్నిత అవయవాలపై దాడితో వృషణాలు చితికిపోయాయని, ఒక చెవి కనిపించలేదని నివేదిక పేర్కొంది. రేణుకస్వామి గతంలో ఇన్‌స్టా్రగామ్‌లో పోస్ట్ చేసి డిలీట్‌చేసిన మెసేజ్‌లను వెలికి తీసివ్వాలని దాని మాతృ సంస్థ ‘మెటా’ను పోలీసులు కోరారు. -
దళిత యువకుడికి ఘోర అవమానం.. పరారీలో మాజీ సర్పంచ్!
లక్నో: ఓ దళిత యువకుడికి ఘోర అవమానం జరిగింది. అందరి ముందు యువకుడిపై గ్రామ సర్పంచ్ చెప్పుతో దాడి చేసి, చంపేస్తామని బెదిరించాడు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో వెలుగుచూసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచ్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. యువకుడిపై దాడి నేపథ్యంలో భీమ్ ఆర్మీ కార్యకర్తలు ఛాపర్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఆ ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. దినేష్ కుమార్(27) అనే దళిత యువకుడిపై.. తాజ్పుర్ గ్రామ సర్పంచ్ శక్తి మోహన్ గుర్జార్, రేటా నగ్లా గ్రామ మాజీ సర్పంచ్ గాజే సింగ్‌లు దాడి చేశారు. చెప్పుతో కొడుతూ చంపేస్తామని యువకుడిని బెదిరించారు. వీడియోలు తీసి ఎస్సీ వర్గానికి చెందిన ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేశారు. భారతీయ శిక్షా స్మృతి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు నగర ఎస్పీ అర్పిత్ విజయ్‌వర్గియా తెలిపారు. గ్రామ సర్పంచ్ శక్తి మోహన్‌ను అరెస్ట్ చేశామని, రెండో వ్యక్తి పరారీలో ఉన్నట్లు చెప్పారు. In UP's Muzaffarnagar, a village head and his people thrashed a SC youth with slippers in public and threatened him with death while abusing caste slurs. They also recorded the incident and made it viral to humiliate the SC people. pic.twitter.com/MeiPTfo9KF — Mission Ambedkar (@MissionAmbedkar) August 20, 2022 ఇదీ చదవండి: Viral Video: గేదె ముందు యువతి కుంగ్‌ఫూ స్టెప్పులు.. దెబ్బకు చిర్రెత్తడంతో.. -
బాలిక హత్యాచార కేసు: జడ్జికి చేదు అనుభవం!
సంచలనం సృష్టించిన హజిరా బాలిక హత్యాచార కేసులో ఎట్టకేలకు తుది తీర్పు వెలువడింది. నిందితుడు సుజిత్ సాకేత్‌ను దోషిగా నిర్ధారిస్తూ సూరత్ జిల్లా(గుజరాత్) కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే తీర్పు వెలువరించిన జడ్జికి.. కోర్టు హాల్లోనే చేదు అనుభవం ఎదురైంది. జీవితాంతం జైల్లోనే మగ్గాలంటూ సుజిత్‌కు ప్రత్యేక(పోక్సో) న్యాయమూర్తి దోషిగా ప్రకటించిన వెంటనే నిందితుడు సుజిత్ సాకేత్ కోపంతో ఊగిపోయాడు. తన కాలి చెప్పులను తీసి జడ్జి పీఎస్ కళ మీదకు విసిరాడు. అయితే ఆ చెప్పులు జడ్జి మీద పడలేదు. ఆయనకు కాస్త ముందున్న సాక్షి బోనులో పడ్డాయి. దీంతో న్యాయమూర్తి కంగుతినగా.. పోలీసులు వెంటనే సుజిత్‌ను అదుపు చేశారు. Special POCSO Judge P.S. Kala ఇదిలా ఉంటే జడ్జి పీఎస్ కళ గతంలోనూ పోక్సో నేరాలకు సంబంధించి సంచలన తీర్పులెన్నింటినో వెలువరించారు. త్వరగతిన తీర్పులు వెలువరిస్తారని ఆయనకు పేరుంది. గతంలోనూ ఓ కేసులో నిందితుడిని ‘చచ్చే వరకు జైళ్లోనే మగ్గాలి’ అంటూ తీర్పు ఇచ్చారు. పలు కేసుల కోసం ఆయన అర్ధరాత్రిళ్లు సైతం విచారణలు కొనసాగించడం విశేషం. ఇదిలా ఉంటే హజిరా ఉదంతంలో బాధితురాలు ఐదేళ్ల బాలిక. ఆమె ఓ వలస కార్మికుడి కుటంబానికి చెందింది. మధ్యప్రదేశ్‌కు చెందిన సుజిత్ వలస మీద హజిరాకు వచ్చి.. ఆ కుటుంబం పక్కనే ఉండేవాడు. ఈ ఏడాది ఏప్రిల్ 30న చాక్లెట్ ఆశ చూపించి..ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆపై బాలికను హతమార్చాడు. ఈ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో కేసు ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ చేశారు. ఘటన తర్వాత నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసిన పోలీసులు.. ఈ కేసులో 26 మంది సాక్షులను విచారించారు. మరోవైపు కోర్టు కూడా 53 డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌లను పరిశీలించాకే తుది తీర్పు వెలువరించింది. ఇక తుదితీర్పు సందర్భంగా గుమిగూడిన జనాలు.. నిందితుడిని అక్కడికక్కడే ఉరి తీయాలంటూ నినాదాలు చేయడం విశేషం. -
బాన్సువాడలో పోకిరికి దేహశుద్ధి
-
కమల్ హాసన్‌పై చెప్పుల దాడి
చెన్నై : ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్‌కు చేదు అనుభవం ఎదురయ్యింది. ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న కమల్ హాసన్ మీద చెప్పులు విసిరారు. బుధవారం ఓ రోడ్ షో లో పాల్గొన్న కమల్ హాసన్ మీద ఓ వ్యక్తి చెప్పు విసిరాడు. అయితే, అది కమల్ హాసన్‌కు తగలలేదు. మరికొందరు కూడా కమల్ మీదకు చెప్పులు విసిరే ప్రయత్నం చేయబోగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ దాడిలో పోలీసులు బీజేపీ కార్యకర్తలతో పాటు హనుమ సేన కార్యకర్తలపై కూడా కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం కమల్ హాసన్ స్వతంత్ర భారత దేశంలో మొట్టమొదటి ఉగ్రవాది ఓ హిందూ అని, అతని పేరు నాథూరామ్ గాడ్సే అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా పెను దుమారం రేపాయి. కమల్ హాసన్ మీద చర్యలు తీసుకోవాలంటూ పలు హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. కమల్ హాసన్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు కూడా చేశారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కమల్ హాసన్ మీద చెప్పుల దాడి జరిగింది. -
కన్నా లక్ష్మీ నారాయణపై చెప్పుల దాడి
-
కన్నా లక్ష్మీ నారాయణపై చెప్పుల దాడి
సాక్షి, నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణపై చెప్పుల దాడి జరిగింది. బుధవారం నెల్లూరు జిల్లాలో కావలిలో ర్యాలీ నిర్వహిస్తున్న ఆయనపై తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్త ఒకరు చెప్పులు విసిరారు. దీంతో బీజేపీ కార్యకర్తలు అతడిని చితకబాదారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలిస్తున్నా, వెంబడించి మరీ చావబాదారు. అనంతరం చెప్పుల దాడికి నిరసనగా నిరసనగా బీజేపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. రాష్ట్రంలో టీడీపీ రౌడీయిజాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. కాగా, చెప్పుల దాడి ఘటనపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్రంగా స్పందించారు. టీడీపీ నేతలు కొరివితో తల గోక్కుంటున్నారని హెచ్చరించారు. తన ఇంటిపైకి కూడా టీడీపీ నాయకులు రౌడీలను పంపిస్తున్నారని ఆరోపించారు. హోం మంత్రి, డీజీపీ, గవర్నర్లను ఈ విషయంపై కలిశామని గుర్తు చేశారు. రాష్ట్రానికి నాలుగేళ్లలో ఏం చేశామనే విషయాన్ని ప్రజలకు చెప్పడానికే పర్యటన చేస్తున్నట్లు వెల్లడించారు. పర్యటన విజయవంతం అయితే ఓడిపోతామని భయపడుతున్న చంద్రబాబు ఇలాంటి దాడులకు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. -
ప్రధాని మోదీకి ‘చెప్పు’ చూపించాడని..
చెన్నై : ప్రధాని నరేంద్ర మోదీకి ‘చెప్పు’ చూపించాడనే కారణంతో ఓ 46 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలో ఓ ప్రభుత్వం పథకం ఆవిష్కరణకు 2017 డిసెంబర్ 21న అక్కడికి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీకి పాల్లిని అనే వ్యక్తి చెప్పు చూపిస్తూ అవమానపరిచాడు. ఈ ఘటనపై సుమోటో ఫిర్యాదు దాఖలైంది. దీంతో ఆ ఘటనకు పాల్పడిన పాల్లినిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. అతన్ని అరెస్ట్ చేసి, ఎగ్మోర్ కోర్టులో హాజరు పరిచారు. ప్రస్తుతం అతనిపై 15 రోజుల రిమాండ్ విధించారు. అయితే రాజకీయ నాయకులపై లేదా పార్టీ నేతలపై ప్రజలు అసహనం చూపించడం ఇదే తొలిసారి కాదు. తమ నేతలపై ఉన్న అసహనాన్ని ప్రజలు, లీడర్ల దిష్టిబొమ్మలు దహనం చేసి, కూరగాయలు ముఖంపై విసిరేసి, ఇంకు, షూస్‌లు వారిపైకి విసురుతూ తమ నిరసనను వ్యక్తం చేస్తారు. గతంలో కూడా ఇలాంటి కేసులు చాలానే నమోదయ్యాయి. సెక్యురిటీ సర్కిళ్లను వెనక్కి నెట్టేసి మరీ ఈ ఘటలను పాల్పడుతుంటారు. అంతకముందు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌పై ఓ మహిళ కోడిగుడ్లను విసిరేసి తన నిరసనను వ్యక్తం చేసింది. ఒడిశా బాలసోర్‌లో ప్రజా ర్యాలీ జరుపుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. పట్నాయక్‌పై గుడ్లను విసురుతున్న ఘటనను గుర్తించిన ఆయన సెక్యురిటీలు ఆ మహిళను అడ్డుకున్నారు. ఇలా ప్రజలు తమ రాజకీయనేతలపై తమ అసహనాన్ని వ్యక్తపరుస్తుంటారు. -
వీఐపీలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దు: తిరుపతి అర్బన్ ఎస్పీ
అలిపిరిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు, తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ నేత వి.హనుమంతరావు కారుపై చెప్పులు పడిన సంఘటన మీద అర్బన్ ఎస్పీ రాజశేఖర్ బాబు స్పందించారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకోడానికి శనివారం తిరుమల వచ్చిన ఆయన.. హైదరాబాద్‌లో సీమాంధ్ర ప్రజలు ఉద్యోగాలు చేయటానికి అర్హులు కాదంటూ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. హైదరాబాద్‌లో సీమాంధ్ర ప్రజలు నివసించవచ్చు కానీ... ఉద్యోగాలు చేయరాదంటూ వీహెచ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో సమైక్యవాదులు ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని అలిపిరి దిగువ ఘాట్ వద్ద అడ్డుకున్నారు. ఈ సంఘటనపై అర్బన్ ఎస్పీ రాజశేఖర్‌బాబు స్పందించారు. వీఐపీలు ఎవరు వచ్చినా వారు తిరుమల పవిత్రతను కాపాడేలా ఉండాలని ఆయన సూచించారు. తిరుమలకు వచ్చే ఏ వీఐపీ అయినా ఉద్యమకారులను చెర్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని, వీహెచ్ చేసిన వ్యాఖ్యల వల్లే ఉద్యమకారులు ఆవేశానికి గురయ్యారని ఎస్పీ చెప్పారు. జడ్ ప్లస్ కేటగిరీ కన్నా ఎక్కువ భద్రతను వీహెచ్‌కు కల్పించామని, అలిపిరి ఘటనలో ఏడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని తెలిపారు. దాడులకు పాల్పడినవారిని కూడా గుర్తించామని, త్వరలోనే వారిని అదుపులోకి తీసుకుంటామని వెల్లడించారు. అదే సమయంలో హైదరాబాద్‌లో సీమాంధ్రుల విషయమై వీహెచ్ చేసిన వ్యాఖ్యలను కూడా పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. -
వీహెచ్ వావానంపై చెప్పులతో దాడి
-
వీహెచ్ వావానంపై చెప్పులతో దాడి
తిరుమలలో శ్రీవారి దైవ దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావుకు సమైక్యసెగ తగిలింది.. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న సమైక్యవాదులు ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని అలిపిరి దిగువ ఘాట్ వద్ద అడ్డుకున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వారు పెద్ద పెట్టున్న నినాదాలు చేశారు. ముందుకు కదలకుండా కారు ముందు బైఠాయించారు. వీహెచ్ కారుపై చెప్పులు విసిరారు. పోలీసులు స్వల్ప లాఠీ చార్జ్ చేయడంతో పలువురు సమైక్యవాదులు గాయపడ్డారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన ఆయన... హైదరాబాద్‌లో సీమాంధ్ర ప్రజలు ఉద్యోగాలు చేయటానికి అర్హులు కాదంటూ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీసింది. హైదరాబాద్‌లో సీమాంధ్ర ప్రజలు నివసించవచ్చు కానీ... ఉద్యోగాలు చేయరాదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉందని భావించిన పోలీసులు భారీ భద్రత నడుమ వీహెచ్‌ను రేణిగుంట విమానాశ్రయానికి తరలించారు. (ఫోటో: టి.సుబ్రహ్మణ్యం )