
చెన్నై : ప్రధాని నరేంద్ర మోదీకి ‘చెప్పు’ చూపించాడనే కారణంతో ఓ 46 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలో ఓ ప్రభుత్వం పథకం ఆవిష్కరణకు 2017 డిసెంబర్ 21న అక్కడికి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీకి పాల్లిని అనే వ్యక్తి చెప్పు చూపిస్తూ అవమానపరిచాడు. ఈ ఘటనపై సుమోటో ఫిర్యాదు దాఖలైంది. దీంతో ఆ ఘటనకు పాల్పడిన పాల్లినిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. అతన్ని అరెస్ట్ చేసి, ఎగ్మోర్ కోర్టులో హాజరు పరిచారు. ప్రస్తుతం అతనిపై 15 రోజుల రిమాండ్ విధించారు. అయితే రాజకీయ నాయకులపై లేదా పార్టీ నేతలపై ప్రజలు అసహనం చూపించడం ఇదే తొలిసారి కాదు.
తమ నేతలపై ఉన్న అసహనాన్ని ప్రజలు, లీడర్ల దిష్టిబొమ్మలు దహనం చేసి, కూరగాయలు ముఖంపై విసిరేసి, ఇంకు, షూస్‌లు వారిపైకి విసురుతూ తమ నిరసనను వ్యక్తం చేస్తారు. గతంలో కూడా ఇలాంటి కేసులు చాలానే నమోదయ్యాయి. సెక్యురిటీ సర్కిళ్లను వెనక్కి నెట్టేసి మరీ ఈ ఘటలను పాల్పడుతుంటారు. అంతకముందు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌పై ఓ మహిళ కోడిగుడ్లను విసిరేసి తన నిరసనను వ్యక్తం చేసింది. ఒడిశా బాలసోర్‌లో ప్రజా ర్యాలీ జరుపుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. పట్నాయక్‌పై గుడ్లను విసురుతున్న ఘటనను గుర్తించిన ఆయన సెక్యురిటీలు ఆ మహిళను అడ్డుకున్నారు. ఇలా ప్రజలు తమ రాజకీయనేతలపై తమ అసహనాన్ని వ్యక్తపరుస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment