ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణపై చెప్పుల దాడి జరిగింది. బుధవారం నెల్లూరు జిల్లాలో కావలిలో ర్యాలీ నిర్వహిస్తున్న ఆయనపై తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్త ఒకరు చెప్పులు విసిరారు. దీంతో బీజేపీ కార్యకర్తలు అతడిని చితకబాదారు.