kanna lakshmi narayana
-
కన్నా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా: మంత్రి అంబటి
-
ఎన్నికల ఖర్చుకోసం బీజేపీ ఫండ్ పంపితే మింగిన ఘనత కన్నాది: అంబటి
-
వాడకమంటే బాబుదే.. సీనియర్ నేత 30 ఏళ్ల సేవలు గుర్తులేవా?
వాడుకుని వదిలేయడంతో చంద్రబాబును మించినవాళ్లు లేరు అనేది దేశవ్యాప్తంగా తెలిసిందే. తనకు అవసరం ఉంటే ఆకాశానికి ఎత్తేసి తరువాత మొహం చాటేయడంతో ఆయన్ను మించినవాళ్లు లేరని ఎప్పటికప్పుడు స్పష్టమవుతూనే ఉంది. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అంటే వాస్తవానికి చంద్రబాబు అపారమైన ప్రేమ చూపిస్తారు. చూపిస్తారో నటిస్తారో తెలియదుకానీ.. టీడీపీ ప్రభుత్వం దిగిపోయిన కొన్నాళ్ళకు కోడెల శివప్రసాద్ తన పిల్లలు చేసిన అరాచకాలకు బాధ్యత వహించాల్సి వచ్చింది. వాస్తవానికి ఆయన్ను ఇనుమేట్ల గ్రామంలో పోలింగ్ రోజున ప్రజలు తరిమి కొట్టడం, ఇన్ని దెబ్బలు కాసినా ఆయన ఎన్నికల్లో ఓడిపోవడం తెలిసిందే. బాబు శవ రాజకీయం.. ఆఖరుకు ప్రభుత్వ ఆఫీస్ కుర్చీలు సైతం ఆయన కుమారుడు శివరామ్ ఎత్తుకురావడమే కాకుండా సత్తెనపల్లిలో వీధి వ్యాపారుల నుంచి సైతం మామూళ్లు వసూళ్లు చేసిన అరాచకాలు.. తరువాత ఆయన కేసులు ఎదుర్కొని అవమానాలు పాలై చివరకు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆయన చనిపోయాక అది ప్రభుత్వం చేసిన హత్య అని ఆరోపణలు చేసి ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్ పార్టీ ఆఫీసులో ఒకరోజు.. మంగళగిరి పార్టీ ఆఫీసులో ఒకరోజు.. నరసరావుపేటలో ఒక రోజు ఇలా మూడు రోజులు ఆయన శవంతో రాజకీయం చేశారు చంద్రబాబు. ఆ తరువాత శివరామ్‌ను ఓదార్చి నీ పొలిటికల్ కెరీర్ నేను చూసుకుంటాను అంటూ రెండు.. రెండంటే రెండే.. కన్నీటి బొట్లు కుడికన్ను నుంచి కార్చి వెళ్లిపోయారు. ఇక అక్కడ మళ్ళీ తమ పార్టీ నుంచి పోటీ చేయడానికి ఎవరూ లేకపోవడం, శివరామ్ గానీ పోటీ చేస్తే ఇనుమెట్ల సీన్ మళ్ళీ రిపీట్ అవుతుందని భయం. ఇవన్నీ కలగలిసి ఆ తరువాత శివరామ్‌కు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా దూరం పెట్టారు. అంటే కోడెలను వాడుకున్నారు.. ఆయన చనిపోయాక ఆయన కుటుంబానికి కెరీర్ క్లోజ్ చేసేశారు. అదన్నమాట బాబుగారి వాడకం. శివమెత్తుతోన్న శివరామ్.. శని పట్టుకున్నా వదులుతుందేమో కానీ చంద్రబాబు పట్టుకుంటే మాత్రం వదలడు అనే నానుడి ఒకటి తెలుగు తమ్ముళ్లు తరచుగా చెప్పుకుంటారు. బతికి ఉండగా కోడెల శివప్రసాద్‌ను అనగదొక్కి మంత్రి పదవి ఇవ్వకుండా స్పీకర్ పదవి కట్టబెట్టి మూలన కూర్చోబెట్టిన చంద్రబాబు. ఇప్పుడు కూడా ఆ కుటుంబాన్ని వెంటాడుతూనే ఉన్నారు చంద్రబాబు. తన తండ్రి రాజకీయ వారసత్వం తనకు వస్తుందని, సత్తెనపల్లి ఎమ్మెల్యే టికెట్ తనకే ఇస్తారని ఆశిస్తూ ఉన్న శివరామ్‌ను చంద్రబాబు పూర్తిగా పక్కన పడేసి.. అదే స్థానంలో కన్నా లక్ష్మి నారాయణను ప్రొజెక్ట్ చేయడంతో శివరామ్ శివాలెత్తి పోతున్నారు. ‘ముప్పై ఐదేళ్ల తన తండ్రి సేవలు గుర్తుకు రాలేదా.. మా కుటుంబానికి న్యాయం చేస్తాం అని గతంలో ఇచ్చిన హామీ మర్చిపోయారా’ అని నేరుగా చంద్రబాబుపై దుమ్మెత్తి పోస్తున్నాడు శివరామ్. వాస్తవానికి కోడెల గత ముప్పై ఐదేళ్ల రాజకీయం ఒకెత్తు కాగా 2014-2019 మధ్య చేసిన రాజకీయం ఇంకో ఎత్తు అని చెప్పాలి. ఇనేళ్లు తాను నిర్మించిన పొలిటికల్ కెరీర్ సౌధాన్ని జస్ట్ ఐదేళ్లలో కొడుకు శివరామ్ కూల్చేశాడు. తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని జిల్లావ్యాప్తంగా దోపిడీలు..సెటిల్మెంట్లు, దందాలు చేశారు. ఆఖరుకు చిన్న వ్యాపారుల నుంచి కూడా వసూళ్లు.. బిజినెస్ అవకాశం ఇస్తానంటూ ఎందరి దగ్గరో వసూళ్లు.. అడిగితే బెదిరింపులు.. ఇవన్నీ కలగలిసి ఏకంగా కోడెల శివ ప్రసాద్‌ను పోలింగ్ రోజున ఇనుమేట్ల గ్రామంలో ప్రజలు వెంటాడి కొట్టిన పరిస్తితి ఎదురైంది. ఇక తెలుగుదేశం పరిస్థితి చూసి సత్తెనపల్లిలో ఓటర్లు నవ్వుకుంటున్నారు. ప్రజల ప్రశ్నలు ఇవే.. - సత్తెనపల్లి ఎవరి ఆస్తి? - మేమే పాలిస్తామని ఎవరైనా ఎలా చెప్పుకుంటారు? - ఈ పవర్ చంద్రబాబు చేతికి ఎవరిచ్చారు? - సత్తెనపల్లికి ఎవరు రుణపడి ఉన్నారు? - ఇన్నాళ్లు కోడెల చేసిందేంటీ? - స్పీకర్‌గా ఉంటూ ఫర్నీచర్ ఎత్తుకురావడమేంటీ? - కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లికి ఏంచేశారు? - అసలు టీడీపీకి ఎందుకు ఓటేయాలి? - పదవుల కోసం పార్టీలు మారిన వారిని ఎందుకు ఎంచుకోవాలి? - రాజకీయ అవసరాల కోసం సత్తెనపల్లిని తాకట్టు పెడతారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇది కూడా చదవండి: టీడీపీలో అగ్గిరాజేసిన కేశినేని నాని.. తగ్గేదేలే అంటూ పచ్చ బ్యాచ్‌కు కౌంటర్! -
టీడీపీలో ముసలం.. కోడెల కుమారుడు శివరాం సంచలన వ్యాఖ్యలు
సాక్షి, పల్నాడు జిల్లా: సత్తెనపల్లి టీడీపీలో ముసలం పుట్టింది. నియోజకవర్గ ఇంచార్ద్ నియామకం టీడీపీలో కాక రేపుతోంది. అనుచరులతో కోడెల కుమారుడు శివరాం సమావేశమయ్యారు. టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా కన్నా లక్ష్మీనారాయణ నియామకాన్ని వ్యతిరేకిస్తున్న కోడెల శివరాం.. పట్టణంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. ఇన్‌ఛార్జ్‌గా కన్నా పేరు ప్రకటనపై తమకు సమాచారం లేదని కోడెల శివరాం మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో కన్నా అరాచకాలను కోడెల అడ్డుకున్నారని, టీడీపీని అవమానించిన నాయకులకు పెద్దపీట వేస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. ‘‘లాలుచి రాజకీయాలు మాకు తెలియదు. తెలుగుదేశం పార్టీని కోడెల బతికించారు. కొంత మంది నాయకులు మాపై కుట్రలు చేస్తున్నారు. టీడీపీ అధిష్టానం మమ్మల్ని పట్టించుకోవటం లేదు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అధిష్టానం సత్తెనపల్లిని టార్గెట్ చేసింది’’ అంటూ శివరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: టీడీపీకి షాకిచ్చిన కొట్టే వెంకట్రావు దంపతులు -
కన్నా... నీ బతుకు ఏంటో తెలుసుకో..
మాచర్ల: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పుణ్యాన మంత్రివై రాజకీయ జీవితాన్ని పెంపొందించుకున్న నువ్వు ఈ రోజు సీఎం జగన్మోహన్రెడ్డిపై విమర్శలు చేస్తున్నావ్..పార్టీలు మారగానే స్థాయి మరచిపోయి వ్యవహరిస్తున్నావు... నీకు ప్రజలు బుద్ధి చెబుతారు... వైఎస్ కుటుంబం గురించి మాట్లాడితే తరిమికొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని గుర్తుంచుకో.. కన్నా అని పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం మాచర్లలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సీఎం జగన్మోహన్రెడ్డి పాలన గురించి మాట్లాడుతూ రాక్షస పాలన అని చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమరావతి రాజధానిలో సుమారు 51 వేల మందికి ఇళ్ల పట్టాలు, 5 వేల మందికి టిడ్కో ఇళ్లు ఇవ్వటంపై జీర్ణించుకోలేక కన్నా లక్ష్మీనారాయణ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. రాజధానిలో పేదలకే ఇవ్వకూడదన్నట్లు మాట్లాడటం దారుణంగా ఉందన్నారు. మంత్రిగా పనిచేసిన నీకు రాజకీయ బిక్ష పెట్టిన రాజశేఖర్‌రెడ్డి కుటుంబాన్ని మరచిపోయి అధికారం కావాలని తపనతో మూడు పార్టీలు మారిన నువ్వా జగన్ గురించి మాట్లాడేది అని ప్రశ్నించారు. ఎట్లాబడితే అట్లా మాట్లాడుతున్నావు. మీకు బినామి ఆస్తులున్న అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదా వారు ఏం పాపం చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలిస్తే అది రాక్షస పాలన అవుతుందా? రాజకీయమంటే పేదలకు ఇళ్లు ఇవ్వటమా? ఇదేనా నువ్వు నేర్చుకున్న రాజకీయం అని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను పీఆర్కే ప్రశ్నించారు. మరోసారి రాజశేఖర్‌రెడ్డి, సీఎం జగన్ గురించి మాట్లాడితే పల్నాడులో తిరగవు. గుర్తుంచుకో.. నువ్వు టీడీపీలో చేరగానే అది మంచి పార్టీ అయిందా? రంగాను హత్య చేసినప్పుడు నువ్వు చంద్రబాబు గురించి మాట్లాడింది గుర్తుందా? ఇయ్యాల వాళ్లు దేవుళ్లు.. సీఎం జగన్ రాక్షసుడా దయ్యాలు వేదాలు వల్లించినంటుంది. నువ్వు మాట్లాడే తీరు. ఇప్పటికే నీకు ప్రజలు బుద్ధి చెప్పారు. సీటు ఎక్కడొస్తుందో తెలియని నువ్వు చంద్రబాబు మెప్పు కోసం విమర్శలు చేస్తే సహించేది లేదంటూ పీఆర్కే ఘాటుగా హెచ్చరించారు. -
ఇంత‘కన్నా’ దారుణం ఉంటుందా?
నెహ్రూనగర్ (గుంటూరు తూర్పు): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకల్లో టీడీపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ అత్యుత్సాహం ప్రదర్శించారు. లాడ్జిసెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహాన్ని ఆధునీకరించి దానికి అంబేడ్కర్ సర్కిల్‌గా నామకరణం చేసి ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని కుల, దళిత సంఘాల నాయకులతో, అన్ని పార్టీ నాయకులను కలుపుకుంటూ శుక్రవారం ఉదయం 9 గంటలకు అధికారికంగా షెడ్యూల్ ప్రకటించారు. దీనికి సంబంధించి గురువారం సాయంత్రమే సమాచారం అందరికీ చేరవేసింది. అయితే టీడీపీ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ నిర్ణయించిన షెడ్యూల్ కన్నా ముందే వచ్చి ప్రొటోకాల్‌ను కాదని అంబేడ్కర్ విగ్రహానికి దండ వేస్తానని, తన అనుచరులతో కలిసి విగ్రహం వద్ద దౌర్జనం చేయసాగారు. దీన్ని ఖండిస్తూ దళిత కార్పొరేటర్ బోడపాటి ఉషారాణి భర్త వైఎస్సార్సీపీ నాయకులు బోడపాటి కిషోర్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మేరుగ నాగార్జునలు ఉదయం 9 గంటలకు అధికారికంగా వచ్చి అంబేడ్కర్ సర్కిల్‌గా నామకరణం చేసి ప్రారంభిస్తారని, ఆ తరువాత దండ వేయాలని సూచించినప్పటికీ దౌర్జన్యంగా తోసుకుంటూ వెళ్లడంతో పాటు దూషిస్తూ, దాడి చేయడానికి యత్నించి భయభ్రాంతులకు గురిచేసి మరి అంబేడ్కర్ విగ్రహానికి దండ వేశారు. మాజీ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి అయి ఉండి కన్నా లక్ష్మీనారాయణ ప్రోటోకాల్ పాటించకుండా దళిత నాయకుడిని తోసేసి, దాడి చేసేందుకు ప్రయత్నించడాన్ని ఖండిస్తూ స్థానిక అరండల్‌పేటలో పోలీస్ స్టేషన్లో దళిత, గిరిజన కార్పొరేటర్లు కన్నాపై ఫిర్యాదు చేశారు. దళిత కార్పొరేటర్ భర్తకు క్షమాపణ చెప్పాలి దళిత కార్పొరేటర్ బోడపాటి ఉషారాణి భర్త కిషోర్‌పై టీడీపీ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ విచక్షణ కోల్పోయి దాడికి యత్నించి అంబేడ్కర్ విగ్రహానికి దండ వేయడం చాలా బాధాకరమైన విషయమని నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు పేర్కొన్నారు. -
కన్నా కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి.. ఇప్పుడు టీడీపీలోకి వెళ్లాడు: మంత్రి అంబటి
-
టీడీపీలో కన్నా చేరికపై రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు
-
కన్నాను ఓడించడం గ్యారెంటీ.. నన్ను, బాబును ఎన్ని మాటలు అన్నారో!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ‘కన్నా లక్ష్మీనారాయణ జిల్లాలో ఎక్కడ పోటీచేసినా ఓడించడం గ్యారెంటీ. ఆయన్ని టీడీపీలోకి తీసుకోవడం చంద్రబాబుకు తప్ప ఎవరికీ ఇష్టంలేదు. కన్నాను టీడీపీలోకి తీసుకోవడం నాకే కాదు.. సీనియర్లందరూ సిగ్గేస్తుందని అంటున్నారు’ అని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్ పార్టీలో దీర్ఘకాలం పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ సోము వీర్రాజుకు ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించి ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేనలో చేరతారనే ఊహాగానాలకు తెరదించుతూ గురువారం ఆయన సైకిల్ ఎక్కనున్నారు. ఈ నేపథ్యంలో రాయపాటి సాంబశివరావు ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. ‘నేను చాలా అసంతృప్తితో ఉన్నా. కన్నాను పార్టీలో చేర్చుకోవడం పెద్ద తెలివి తక్కువ పని. నన్ను, చంద్రబాబును కన్నా ఎన్నేసి మాటలు అన్నాడు. పందులు, కుక్కలు, నక్కలు అంటూ వ్యక్తిగతంగా, సామాజికవర్గాన్ని దుమ్మెత్తిపోశాడు. అలాంటి వ్యక్తిని దగ్గరకు తీసుకోవడం ఏమిటి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి అవసరమని చంద్రబాబు చెబుతున్నారు. అయినా ఆయన్ను చూసి ఏమిటి భయపడేది? అతనికి ఎన్ని ఓట్లు వసా్తయి. నేను గుంటూరు లోక్‌సభ స్థానానికి, ఆయన పెదకూరపాడు అసెంబ్లీకి పోటీచేసినప్పుడు నాలుగైదు వేల ఓట్లు మెజార్టీ నాకే వచ్చేవి. నరసరావుపేటలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఓట్లెన్ని వచ్చాయో అందరికీ తెలిసిందే’ అంటూ ఎద్దేవాచేశారు. ఏమాత్రం మంచి పద్దతి కాదు ‘పార్టీలో ఉన్న వారిని చంద్రబాబు దెబ్బతీయడం ఏమాత్రం సరికాదు. అందరి ముడ్డి కిందకు తెస్తున్నారు. అలా చేయడం తప్పు, అన్యాయం. ఇలా చేసుకుంటూ పోతే పార్టీలో ఎవరు నిలబడతారు? ఇలాగైతే నేనిక చంద్రబాబు వద్దకు వెళ్లను. ఎందుకు వెళ్లాలి? పార్టీలో మాకు టికెట్ ఇస్తామంటే తప్ప వెళ్లి కలిసేది లేదు. పార్టీలో ఇన్నేళ్లు పనిచేశా. నాకేం చేశారు? ఏమి ఇచ్చారు’ అని ఆవేదన వ్యక్తంచేశారు. నన్ను మాట్లాడవద్దన్నారు ‘చంద్రబాబు ఫోన్ చేశారు. కన్నాను తీసుకుంటున్నాం. నీతో పర్సనల్‌గా మాట్లాడతానన్నారు. అదేవిధంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫోన్ చేసి సార్ హైదరాబాద్ వెళ్లారు. వచ్చాక మీతో మాట్లాడతారు. అప్పటివరకు కన్నా గురించి ఎవరితోనూ మాట్లాడవద్దు. స్టేట్మెంట్లు ఇవ్వవద్దు అని చెప్పారు. పార్టీలో కన్నా చేరుతున్నారని ఆఫీసు నుంచి ఎవరో ఫోన్‌చేశారు. నేను రావడంలేదన్నాను. నేను వెళ్లను కూడా’ అని రాయపాటి చెప్పారు. 12 ఏళ్లు కోర్టులో కేసు నడిపారు ‘కన్నా నాపై 2010లో పరువు నష్టం దావా వేశారు. 12 ఏళ్లు కోర్టులో కేసు నడిపారు. రెండుసార్లు కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. గత ఏడాది నవంబరు రెండో తేదీ న్యాయమూర్తి ద్వారా రాజీ చేసుకున్నారు. టీడీపీలో చేరాలనుకునే రాజీ కుదుర్చుకున్నట్లు ఉంది. చంద్రబాబుపైనా అనేక కేసులు వేశారు. ఇవన్నీ అందరికీ తెలుసు. అయినా కన్నాను పార్టీలోకి తీసుకోవడమే విచిత్రం’ అని రాయపాటి ఆవేదన వ్యక్తంచేశారు. -
బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా
-
బీజేపీకి కొత్త జాతీయ కార్యనిర్వాహక కమిటీ
సాక్షి , న్యూఢిల్లీ: రాబోయే ఎన్నికలు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన బీజేపీ అందుకనుగుణంగా పార్టీ కొత్త జాతీయ కార్య నిర్వాహక కమిటీని గురువారం ప్రకటించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించిన ఈ కమిటీలో ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్, గడ్కరీ, గోయల్, అద్వానీ, మురళీ మనోహర్ జోషి సహా 80 మంది సభ్యులు ఉన్నారు. మంత్రివర్గంలో కొత్తగా చేరిన అశ్విని వైష్ణవ్, మన్సుఖ్ మాండవీయ, జ్యోతిరాదిత్య సింధియా, మీనాక్షి లేఖిలను కమిటీలోకి తీసుకున్నారు. లఖీమ్‌పూర్ ఘటనలో రైతులకు న్యాయం జరగాలని, కారకులకు శిక్ష పడాలంటూ సంబంధిత వీడియోను ట్వీట్‌చేసిన పార్టీ ఎంపీ వరుణ్ గాంధీకి కొత్త కమిటీలో చోటు దక్కలేదు. మోదీ సర్కార్ విధానాలపై విమర్శలు చేసిన మాజీ కేంద్రమంత్రి బీరేందర్ సింగ్‌తోపాటు వ్యవసాయ చట్టాల్లో రైతు అనుకూల వ్యాఖ్యలు చేసిన ఎంపీ మేనకాగాంధీని కమిటీ నుంచి తప్పించారు. కమిటీలో ఆంధ్రప్రదేశ్ నుంచి కన్నా లక్ష్మీనారాయణకు చోటు కల్పించారు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మాజీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వివేక్ వెంకట్‌స్వామి, గరికపాటి మోహన్‌రావులకు స్థానం లభించింది. ప్రత్యేక ఆహ్వానితులుగా తెలంగాణ నుంచి ఈటల రాజేందర్, విజయశాంతిలకు అవకాశం కల్పించారు. కమిటీలో 50 మంది ప్రత్యేక ఆహ్వానితులు, 35 మంది పార్టీ పదాధికారులు, 179 మంది శాశ్వత ఆహ్వానితులకూ చోటు కల్పించారు. శాశ్వత ఆహ్వానితుల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, మాజీ సీఎంలు, జాతీయ మోర్చాల అధ్యక్షులు, రాష్ట్ర విభాగాల అధ్యక్షులు తదితరులు ఉన్నారు. -
నిజాలు బయటకు రావట్లేదు: కన్నా ఫణీంద్ర
సాక్షి, సిటీబ్యూరో: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడలు మృతి కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. సుహారిక మృతిలో అనేక అనుమానాలు ఉన్నాయంటూ ఆమె భర్త కన్నా ఫణీంద్ర సైబరాబాద్ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోయిందని చెబుతున్న సుహరిక మృతిపై అనుమానం ఉందని, కేసు విచారణ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని శుక్రవారం సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్‌ను కోరారు. 2020 మే 29న సుహరిక చనిపోయిన సమయంలో ఉన్న ప్రవీణ్, వివేక్, వివాస్, పవన్‌లతో పాటు సుహరిక తల్లి సాగరిక కూడా నిజాలు దాస్తున్నారని, వారిని మళ్లీ విచారించి న్యాయం చేయాలని సీపీకి సమర్పించిన ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు. (‘కన్నా’ కోడలు అనుమానాస్పద మృతి) సీబీఐటీ సమీపంలోని ఫామ్ హౌస్‌లోనే సుహరిక చనిపోయి ఉంటుందని, అది దాచి ఏఐజీ ఆసుపత్రికి ఐదు నిమిషాల వ్యవధిలో చేరే మీనాక్షి బాంబూస్ విల్లా నంబర్ 28లో జరిగినట్టుగా చెబుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ‘ఎందుకంటే మెడికో లీగల్ కేసు రికార్డు ప్రకారం 11.30 గంటల ప్రాంతంలోనే అచేతనంలోనే ఉందని, 12.45 గంటల ప్రాంతంలోనే ఏఐజీ ఆసుపత్రికి తీసుకొచ్చారని, 1.13 గంటల ప్రాంతంలో సుహరిక చనిపోయిన విషయాన్ని తనకు చెప్పారన్నారు. సుహరిక తల్లి కూడా తన కూతురి మృతిపై ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంలో రాయదుర్గం పోలీసులు కేసు విచారణ సజావుగా త్వరితగతిన సాగేలా చూడాల’ని కన్నా ఫణీంద్ర కోరారు. -
‘అభాసుపాలై పరువు పోగొట్టుకోవద్దు’
సాక్షి, విజయవాడ: అమ్మఒడి నిధులకు సంబంధించి బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘అమ్మఒడి నిధులపై రాష్ట్ర బీజేపీ నేతల ఆరోపణలు సరికాదు. పరిజ్ఞాన లోపంతో కన్నా లక్ష్మీనారాయణ, విష్ణువర్ధన్‌రెడ్డి ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌లోని అమ్మఒడి లబ్దిదారులకి రాష్ట్ర బడ్జెట్ నుంచే నిధులు కేటాయించారు. ఆలయాల హుండీలు, భక్తుల కానుకల నుంచి నిధులిచ్చారనటం అవివేకం. బ్రాహ్మణ కార్పొరేషన్ దేవాదాయ శాఖలో భాగం అయినంత మాత్రాన నిందలు సరికాదు. సమగ్ర సమాచారం తెలుసుకొని మాట్లాడితే గౌరవంగా ఉంటుంది. అరకొర సమాచారంతో మాట్లాడి అభాసుపాలై మరోసారి పరువు పోగొట్టుకోవద్దు' అంటూ బీజేపీ నాయకులకు మల్లాది విష్ణు సూచించారు. (ఓటేసిన జనమే టీడీపీ ఎమ్మెల్యేని ఛీ కొట్టారు..) -
అచ్చెన్న అరెస్ట్‌ను సమర్థించిన బీజేపీ..
సాక్షి, గుంటూరు: ఈఎస్ఐ స్కాంలో టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్‌ను బీజేపీ సమర్థించింది. ఎవరు అవినీతికి పాల్పడినా చర్యలు తీసుకోవాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వ పాలనలో భారీగా అవినీతి జరిగిందన్నారు. అవినీతిపరులపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల ముందే వైఎస్ జగన్ చెప్పారని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. (‘చంద్రబాబు, లోకేష్ జైలుకెళ్లక తప్పదు’) శిక్ష అనుభవించాల్సిందే.. విజయవాడ: ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు పాత్ర రుజువైందని బీజేపీ అధికార ప్రతినిధి లక్ష్మీపతి రాజా అన్నారు. తప్పు చేసిన వాళ్లు శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు. అవినీతికి పాల్పడిన సొమ్మును అచ్చెన్నాయుడు నుంచి రికవరీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఈఎస్ఐ స్కాం విషయంలో ప్రధానిమంత్రి మీద కూడా అచ్చెన్నాయుడు గతంలో బురద చల్లారని గుర్తుచేశారు. ఈఎస్ఐ స్కాంలో ప్రధాని పేరు ప్రస్తావిస్తే సహించేది లేదన్నారు. అచ్చెన్నాయుడును కిడ్నాప్ చేశారని చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. అచ్చెన్నాయుడుని ఇంటికెళ్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. ఈఎస్ఐ స్కాంలో అవినీతి జరిగిందని ఏసీబీ అధికారులు కూడా ధ్రువీకరించారని లక్ష్మీపతి రాజా పేర్కొన్నారు. (అచ్చెన్న అరెస్ట్.. చంద్రబాబు కొత్త డ్రామా) అచ్చెన్నాయుడు అరెస్ట్ సబబే.. తూర్పుగోదావరి: టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ సబబేనని బీజేపీ నేత సోము వీర్రాజు అన్నారు. ప్రతి పక్షనేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. బీసీలందరూ బయటకు వచ్చి నిరసన తెలపాలని ఆయన మాట్లాడటం దారుణమని సోము వీర్రాజు పేర్కొన్నారు. -
రాజకీయ విమర్శలకు ఇది సమయం కాదు
-
ఏపీ బీజేపీ నేతలకు హైకమాండ్ ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ : రాజకీయ విమర్శలకు ఇది సమయం కాదని, లోతైన అధ్యయనం లేకుండా ఆరోపణలు చేయరాదని ఏపీ బీజేపీ నేతలకు ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచించారు. బుధవారం ఆయన ఏపీ బీజేపీ ఎంపీలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బీజేపీ అమలు చేస్తున్న ‘ఫీడ్ ద నీడ్’ అనే కార్యక్రమంపై సమీక్షలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఏ ఒక్కరూ ఆకలితో అలమటించే పరిస్థితి రాకుండా అందరికీ అవసరమైన సాయం చేయాలన్నారు. బీజేపీ యంత్రాంగం పూర్తి స్థాయిలో సేవా కార్యక్రమాల్లో నిమగ్నం కావాలని సూచించారు. ఈ సందర్భంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంపై కన్నా లక్ష్మీనారాయణ, ఇతర నేతలు చేసిన విమర్శలు ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఇకపై పార్టీ నేతలు ఏ ఆరోపణలు అయినా చేసే ముందు అందుకు సంబంధించి వివరాలు, ఆధారాలు కేంద్ర పార్టీకి అందజేయాలని.. జాతీయ నాయకత్వం ఆమోదిస్తేనే ఆరోపణలు చేయాలని ఆదేశించినట్టు తెలిసింది. ఏపీలో బీజేపీ స్వతంత్ర ప్రతిపక్షంగా వ్యవహరించాలని, టీడీపీ, వైఎస్సార్సీపీతో సమదూరం పాటించాలని ఆదేశించినట్టు సమాచారం. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే విమర్శలా! బీజేపీ అధికార ప్రతినిధి పురిగళ్ల రఘురాం అమరావతి: కరోనా వైరస్ కారణంగా రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే తెలుగుదేశం పార్టీ నేతలు సలహాలు ఇవ్వడం మాని విమర్శలు గుప్పించడం బాధాకరమని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి పురిగళ్ల రఘురాం పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్రంలో కూర్చుని లేఖలు రాస్తూ కాలయాపన చేస్తున్నారు. తమ శాసన సభ్యులను బాబు 12 గంటల పాటు నిరాహార దీక్షలు చేయమని చెప్పారే తప్ప.. పేద ప్రజలను ఆదుకోమని చెప్పక పోవడం దురదృష్టకరం. సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కరోనా వైరస్, ఆర్థిక పరిస్థితులపై సూచనలు, సలహాలు ఇవ్వకుండా దిక్కుమాలిన విమర్శలకు దిగటం ఆయన రాజకీయ జీవితంపై అసహ్యం వచ్చే విధంగా ఉంది. రాజకీయాలకు తావు లేకుండా అందరం కలిసి కరోనాపై పోరాడాల్సిన సమయమమిది. ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాలను సమన్వయం చేస్తూ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.’ అని అన్నారు. -
బాబు డైరెక్షన్ కన్నా యాక్షన్
-
కన్నా! మీరు సుజనాకు అమ్ముడుపోయారా?
సాక్షి, అమరావతి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ ఇమేజ్ పెరిగినా రాష్ట్రంలో ఆ పార్టీ ఎదగకపోవడానికి చంద్రబాబుకు అమ్ముడుపోయిన కన్నా లాంటివారే కారణమని’ సోమవారం ట్వీట్ చేశారు. ‘బాబు ప్యాకేజీ ఆఫర్ అవసాన దశలో ఉన్నవారినీ లేపి కూర్చోపెడుతుంది. మొదటి నుంచి బీజేపీలో ఉన్నవారు... కన్నాలాంటి జంబూకాలను వదిలించుకోవాలి’ అని సూచించారు. ‘మళ్లీ అడుగుతున్నా...కన్నా! మీరు సుజనాకు అమ్ముడుపోయారా? లేదా? టీజేపీ (టీడీపీ జాకాల్స్ పార్టీ) వారు కాకుండా బీజేపీ వారు నా మీద విమర్శలు చేస్తే సమాధానం ఇస్తా.’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. (‘అధికారం కోల్పోయినా.. సీఎం అనే భ్రమలోనే..’) చదవండి: ‘మనవడితో ఆడుకోక.. ఈ చిటికెలెందుకు? -
14 ఏళ్లు సీఎంగా చేసిన అనుభవం ఇదేనా?
సాక్షి, అమరావతి: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ఎలా బయటపడాలి అని అన్ని దేశాలు ఆందోళన చెందుతున్న ఇటువంటి సంక్షోభ సమయంలోనూ చంద్రబాబు రాజకీయ లబ్ధికోసం తాపత్రయం పడటం దారుణమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైరస్ భయంతో ప్రజలు తల్లడిల్లుతున్న సమయంలో చంద్రబాబు రాష్ట్రం వదిలి హైదరాబాద్‌లో కూర్చుని లేఖల పేరుతో ప్రభుత్వంపై రాళ్లు వేస్తున్నారని మండిపడ్డారు. లాక్డౌన్ వల్ల ప్రభుత్వానికి ఆదాయం రాకున్నా సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా ఆగలేదని అంబటి తెలిపారు. పేదలకు రూ.1,000 పంచితే దానిపై కూడా బాబు రాజకీయ విమర్శలు దారుణమన్నారు. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు ఘోరంగా తిరస్కరించినా బాబుకు బుద్ధిరాలేదని ధ్వజమెత్తారు. ఆ 1,000 రూపాయాలు కేంద్రం ఇచ్చినది కాదన్నారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన బాబు సాధించిన అనుభవం ఇదేనా అని మండిపడ్డారు. విపత్కర సమయంలో ఏ నాయకుడైనా ప్రజలకు అండగా ఉంటారా, రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతారా అని మండిపడ్డారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ► ఉద్యోగ సంఘాల నేతలతో మాట్లాడిన తర్వాతే జీతం వాయిదా రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరిస్థితిని అర్థం చేసుకుని ఉద్యోగులు సమ్మతించినా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. ► సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు చేస్తే ప్రజలు బాబును క్షమించరు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు చంద్రబాబు లేఖలు ఎందుకు రాయడం లేదన్నారు. ఒకవేళ కేసీఆర్‌కు లేఖ రాస్తే క్వారంటైన్లో పెడుతారేమోనని భయపడుతున్నారా అని ప్రశ్నించారు. ► బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ చెప్పినట్లు చేయడం కాదు. కేంద్రం నుంచి నిధులు తెప్పించాలి. అంతేగాని మాపై రాళ్లు వేస్తే ఆ పార్టీకి ప్రయోజనం ఉండదు. ► ఇప్పటికైనా రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్రానికి బాబు లేఖలు రాయాలి. లేకుంటే ప్రజలు బాబును రాజకీయాల నుంచి నిష్క్రమించే వరకు తీసుకువెళ్తారు. -
‘ఆ వీడియో ఎక్కడిదో బయటపెట్టాలి’
సాక్షి, అమరావతి : కరోనా వైరస్‌ను ఎదుర్కునేందుకు దేశమంతా సంఘటితంగా పోరాడుతుంటే.. టీడీపీ నేతలు మాత్రం రాజకీయ విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా చంద్రబాబు రాజకీయ విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కల్యాణ్, కన్నా లక్ష్మీనారాయణ విధానాలు ఒకేలా ఉన్నాయని విమర్శించారు. కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోటి 33 లక్షల మందికి రూ.1000 అందిస్తే.. దాన్ని కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. రూ.1000 పంపిణీలు అవినీతి జరిగినట్లు చూపిస్తే ప్రభుత్వం కచ్చితంగా చర్యలు తీసుకుంటుందన్నారు. రూ. 1000 ఇచ్చి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలన్నట్లుగా కన్నా లక్ష్మీనారాయణ ఓ వీడియో పెట్టారని.. చిత్తశుద్ధి ఉంటే ఆ వీడియో ఎక్కడిదో బయటపెట్టాలని సవాల్ విసిరారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రెవెన్యూ లోటు కింద కేంద్రం నిధులు విడుదల చేసిందన్నారు. ఏపీతో పాటు 13 రాష్ట్రాలకు ఆ నిధులు విడుదలయ్యాయని, అంతేకాని ఏపీకి ప్రత్యేకంగా ఇచ్చిదేమీ లేదని ఆరోపించారు. -
‘ఆ విషయాన్ని బీజేపీ నేతలు గుర్తుపెట్టుకోవాలి’
సాక్షి, అమరావతి : ‘వెల్లంపల్లి- ఊసరవెల్లి’ అంటూ బీజేపీ చేసిన ట్వీట్‌కు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కౌంటర్ ఇచ్చారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను మించిన రాజకీయ ఊసరవెల్లి ఎవరూ లేరని ఎద్దేవా చేశారు. ఒక వేలు ఇతరుల వైపు చూపిస్తే నాలుగు వేళ్లు నీ వైపు చూపిస్తాయన్న విషయాన్ని ఏపీ బీజేపీ నేతలు గుర్తుపెట్టుకోవాలన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్వీటర్ వేదికగా రాష్ట్ర బీజేపీ నేతలపై విరుచుపడ్డారు. ‘2009లో మంత్రిగా పనిచేసి..2014లో బీజేపీలో చేరి..2018లో వైఎస్సార్సీపీలోకి చేరడానికి సర్వం సిద్ధం చేసుకొని గుండెపోటు డ్రామాలత్బో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కించుకున్న మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కంటే రాజకీయ ఊసరవెల్లి ఎవరైనా ఉంటారా? గోదావరి-కృష్ణా పుష్కరాలలో వేల కోట్లను దోచి, వందల దేవాలయాలను కూల్చిన మీకు, మీ పార్టీ అధ్యక్షుడు కన్నాకు హిందూ దేవాలయాల గురించి, హిందూ ధర్మం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. అమరేశ్వరం ఆలయానికి చెందిన భూములను భూబకాసురుల నుంచి కాపాడింది అప్పటి ప్రతిపక్షనేత, ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గారే. దేవాలయ భూములు పరిరక్షణ విషయంతో మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. దేవుడిని, హిందూ ధర్మాన్ని ఓట్ల రాజకీయం కోసం వాడుకునే మీకు దేవుడు తగిన శిక్ష వేస్తాడు’ అని మంత్రి వెల్లంపల్లి ట్వీట్ చేశారు. -
సొంత అజెండాతో సుజనా,కన్నా
-
టీడీపీకి యామిని గుడ్ బై!
సాక్షి, గుంటూరు : ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకున్న టీడీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు బీజేపీ చేరారు. తాజాగా ఆ పార్టీ అధికార ప్రతినిధి సాధినేని యామిని కూడా టీడీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. యామిని బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను యామిని కలిసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఆమె బీజేపీలో చేరనున్నారనే వార్తలకు మరింత బలం చేకూరింది. గత ఎన్నికల సమయంలో సాధినేని యామిని సోషల్ మీడియాలో టీడీపీ తరఫున విస్తృత ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత ఆమె సోషల్ మీడియాలో పోస్టులను తగ్గిస్తూ వచ్చారు. పలు సందర్భాల్లో ఆమె చేసిన పోస్టులు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన సంగతి తెలిసిందే. -
‘ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరడం లేదు’
సాక్షి, విజయనగరం : టీడీపీ ఎంపీలపై ఉన్నది కేవలం ఆరోపణలు మాత్రమే.. అవి నిజం కావాలని లేదు కదా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎవరూ బీజేపీలో చేరడం లేదని ఆయన స్పష్టం చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 2014 ముందు వరకూ చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఉండేది.. కానీ ఇప్పుడు 12 కోట్ల సభ్యత్వాలతో బీజేపీ అతి పెద్ద రాజకీయ పార్టీగా మారిందన్నారు. ఆగస్టు 11 వరకూ బీజేపీ సభ్యత్వ నమోదు జరుగుతుందని తెలిపారు. గడిచిన ఐదేళ్లలో మోదీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే మళ్లీ ఎన్డీఏకు పట్టం కట్టేలా చేశాయన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వం నచ్చి, మెచ్చి, ఢిల్లీ నుంచి గల్లీ వరకూ చేరికలు జరుగుతున్నాయన్నారు. ఆర్థిక సంస్థల దాడులను ప్రశ్నించడం దౌర్భాగ్యం అన్నారు కన్నా. బీజేపీని అనడం సరి కాదు : పురంధరేశ్వరి కర్ణాకటలో ఏర్పడిన రాజకీయ సంక్షోభానికి బీజేపీని బాధ్యులని చేయడం సరికాదన్నారు కేంద్ర మాజీ మంత్రి పురందరేశ్వరి. కాంగ్రెస్ నన్ను క్లర్క్ కన్నా హీనంగా చూస్తుందని అనేక సందర్భాల్లో కుమార్ స్వామి స్వయంగా ఆవేదన వ్యక్తం చేయడం నిజం కాదా అని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుత సంక్షోభానికి కాంగ్రెస్-జేడీఎస్ అంతర్గత విబేధాలే కారణం అన్నారు. -
హాయ్‌ల్యాండ్‌లో రెండోరోజు బీజేపీ నేతల భేటీ
సాక్షి, గుంటూరు : మంగళగిరి హాయ్‌ల్యాండ్‌లో శనివారం ఏపీ బీజేపీ ముఖ్యనేతల సమావేశం రెండో రోజు జరుగుతోంది. ఇతర పార్టీల నుంచి వచ్చే సుమారు 75 మంది కీలక నేతల చేరికపై సమావేశంలో చర్చించనునారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ, పురందరేశ్వరి, జీవీఎల్, వి మురళీదరన్, సోము వీర్రాజు, సతీష్ జి, సునీల్ దియోదర్ పాల్గొన్నారు. ఇతర పార్టీల నుంచి చేరికలు, సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతానికి చేపట్టవలసిన చర్యలపై చర్చించారు. జమిలీ ఎన్నికలు వస్తే సన్నద్దతపై చర్చించారు. నేడు మూడు గంటలకు తెలంగాణ బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. -
కేంద్ర పథకాలను జన్మభూమి కమిటీలు దోచుకున్నాయి
సాక్షి, విజయవాడ : కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలను జన్మభూమి కమిటీల పేరుతో దోచుకున్నారని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఆరోపించారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీకి కులం, మతం రంగు పూయాలని చాలా మంది ప్రయత్నించారన్నారు. కానీ కులమతాలకతీతంగా పార్టీలో చేరికలు జరుగుతున్నాయన్నారు. ఇందిరా గాంధీ టైంలో గరీబీ హఠావో తప్ప ఇంకే పథకం లేదన్నారు. మోదీ టీ అమ్ముకునే స్థాయి నుంచి వచ్చారని.. బీజేపీలో నాయకులందరూ కింది స్థాయి నుంచి వచ్చారని.. ప్రజల కష్టసుఖాలు బాగా తెలుసని కన్నా పేర్కొన్నారు. దేశంలో ప్రజలు మోదీ పాలనను కోరుకుంటున్నారన్నారు. -
హాయ్‌ల్యాండ్‌లో బీజేపీ నేతల సమావేశం
సాక్షి, గుంటూరు : మంగళగిరి హాయ్‌ల్యాండ్‌లో శనివారం ఏపీ బీజేపీ ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఇతర పార్టీల నుంచి వచ్చే సుమారు 75 మంది కీలక నేతల చేరికపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ, పురందరేశ్వరి, జీవీఎల్, వి మురళీదరన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత మురళీధర్ రావు మాట్లాడుతూ.. భారత్ మాతా కీ జై అనే పలికి.. దేశం కోసం పని చేసే కార్యకర్తలున్న ఏకైక పార్టీ బీజేపీ అన్నారు. స్వాతంత్ర్యం తర్వాత కాంగ్రెసేతర ప్రభుత్వం.. ఇందిరా గాంధీ తరహా పూర్తి స్థాయి మెజార్టీ సాధించి అధికారంలోకి వచ్చిన పార్టీ బీజేపీ అని మురళీధర్ రావు పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీని ఆపడం ఎవరి తరం కాదన్నారు మురళీధర్ రావు. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ బీజేపీ మాత్రమే అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేదు.. ఇక టీఆర్ఎస్ను వ్యతిరేకించే వారికి బీజేపీనే ప్రత్యామ్నాయం అన్నారు. బీజేపీకి 11 కోట్ల మందితో సభ్యత్వం ఉందని.. ప్రపంచంలో ఏ పార్టీకి ఇంత భారీ సభ్యత్వం లేదన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు తేడా లేదని.. రెండూ కాళ్లు పట్టుకునే పార్టీలే అని విమర్శంచారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్యకర్తలు పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు వచ్చే నెల జూలై 6 నుంచి ఆగస్టు11 వరకూ సంఘటనా పర్వత్ పేరుతో సభ్యత్వ నమోదు ఉంటుందన్నారు. -
‘అక్రమ కట్టడాలు కూల్చితే మాకేం అభ్యంతరం లేదు’
సాక్షి, అమరావతి : అక్రమ కట్టడాలన్నింటి కూల్చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చర్చలను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచన మంచిదే అన్నారు. కరువు ప్రాంతాల సాగు, తాగు నీటి కష్టాలు తీర్చే దిశగా చర్చలు జరగాలని కోరుకున్నారు. కేసులున్నవారే బీజేపీలో చేరుతున్నారనడం సరి కాదన్నారు. నిందితుల విషయంలో చట్టం తన పని చేసుకుపోతుందని తెలిపారు. పార్టీ ఫిరాయింపులుపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయంపై తానేమి స్పందించనన్నారు. -
సీఎం జగన్‌కు ఏడు లేఖలు రాసిన కన్నా
సాక్షి, అమరావతి : గత ప్రభుత్వం హయాంలో చోటుచేసుకున్న పలు అక్రమాలు, ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఈ సందర్భంగా పోలవరం ముంపు వల్ల నష్టపోతున్న గిరిజనులను అన్ని విధాలా ఆదుకోవాలని విఙ్ఞప్తి చేశారు. అదే విధంగా టీడీపీ ప్రభుత్వం కేటాయించిన భూములపై విచారణ జరిపించాలని కోరారు. అంతేకాకుండా ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేయాలని సూచించారు. ప్రభుత్వ దేవాలయాల ఆస్తులు పరిరక్షించాలని విఙ్ఞప్తి చేశారు. అగ్రిగోల్డ్ స్కాంపై సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. అదే విధంగా విజయవాడలో కూల్చేసిన 50 ఆలయాల పునర్నిర్మాణం చేపట్టాలని కోరారు. ఏళ్ల తరబడి పెండింగులో ఉన్న చుక్కల భూముల సమస్యను పరిష్కరించాలని విఙ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన.. ముఖ్యమంత్రికి ఏడు లేఖలు రాశారు. -
ప్రధాని మోదీ చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు
-
‘14.6 కోట్ల మంది రైతులకు లబ్ది’
సాక్షి, గుంటూరు : దేశాభివృద్ధికై గత ఐదేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ పడిన కష్టాన్ని గుర్తించిన ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. శనివారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అఖండ విజయం సాధించిన ప్రధాని మోదీ మొదటి క్యాబినెట్ మీటింగ్‌లోనే చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ సిద్ధి(పీఎంకేఎస్ఎస్) పథకం ద్వారా రూ. 14.5 కోట్ల మంది రైతులకు రూ.6 వేల చొప్పున పెట్టుబడి లబ్ది చేకూరుతుందని తెలిపారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో క్యాడర్‌ను బలోపేతం చేస్తామని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. సర్పంచ్ నుంచి జడ్పీటీసీల వరకు కొత్త వారిని చేర్చుకుని..ఎన్నికల్లో పోటీ చేస్తామని వెల్లడించారు. అయితే కోర్ కమిటీతో చర్చించిన తర్వాతే ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. సీఎంగా పనిచేసిన చంద్రబాబు గత ఐదేళ్లలో రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రం పాటు పడలేదని విమర్శించారు. ఇతరులతో గొడవలు పెట్టుకోవడం తప్ప ఆయన చేసిందేమీ లేదని మండిపడ్డారు. కాంట్రాక్టుల్లో రివర్స్ టెండరింగ్ వల్ల అభివృద్ధి ఆగిపోతుందన్నది అపోహ మాత్రమేనని పేర్కొన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : ప్రధాని మోదీ చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు -
ఫలితాల అనంతరం టీడీపీని కాంగ్రెస్‌లో విలీనం
-
‘అందుకే బాబు.. నీ సీటు మారుస్తున్నారు’
సాక్షి, అమరావతి : ప్రధాన మంత్రి నరేంద్రమోదీ యావంతా దుస్తులు మార్చడంపైనే ఉంది కానీ దేశంపై లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్విటర్ వేదికగా వ్యంగ్యంగా స్పందించారు. నరేంద్ర మోదీ గంటకో డ్రెస్ మారుస్తారో లేదో తెలియదు కానీ చంద్రబాబు మాత్రం ఊసరవెల్లి కంటే ఘోరంగా రంగులు మారుస్తారని ఎద్దేవా చేశారు. నిమిషానికో మాట మారస్తూ నిజాయితీగా ఉన్న అధికారుల సీటు మారుస్తారని ఆరోపించారు. ఎమ్మెల్యేలను కొని వాళ్ల పార్టీ మార్చారని, అందుకే ఈ ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబు సీటుని మారుస్తున్నారని ట్విట్ చేశారు. మోదీ గారు గంటకో డ్రెస్ మారుస్తారో లేదో తెలియదుగానీ.. నువ్వు మాత్రం ఊసరవెల్లి కన్నా ఘోరంగా రంగులు మారుస్తావ్. నిమిషానికి ఒక మాట మారుస్తావ్. నిజాయితీగా ఉండే అధికారుల సీటు మారుస్తావ్. ఎమ్మెల్యేలను కొని వాళ్ళ పార్టీ మారుస్తావ్. అందుకే ప్రజలు ఈ ఎన్నికలలో నీ సీట్ మారుస్తున్నారు. @ncbn pic.twitter.com/sVV0SWrC6E — Chowkidar Kanna Lakshmi Narayana (@klnbjp) May 2, 2019 -
చంద్రబాబు ఇప్పుడు ఈ ఏడుపు ఏంటి?
సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ట్విటర్ వేదికగా మరోసారి విమర్శస్త్రాలు సంధించారు. ’చంద్రబాబు...! అసలు ఈవీఎం కనిపెట్టమని చెప్పిందే నువ్వు కదా!. వీవీ ప్యాట్‌లో ఎవరికి ఓటు పడిందో చూసి కూడా ఇప్పుడు ఈ ఏడుపు ఏంటి?. ఓటమిని హుందాగా స్వీకరించలేని నీ గోల ప్రజలు పట్టించుకోవడం లేదని గ్రహించు. ఇక పచ్చ మీడియాతో ప్రజలను తప్పుదోవ పట్టించలేవు. ప్రజలే నిన్ను సాగనంపడానికి బాధ్యతగా ఓటు వేశారు.’ అంటూ ఆయన శనివారం ట్వీట్ చేశారు. ‘యూ టర్న్ బాబు, ఈవీఎంల విషయంలో ఆడలేక మద్దెల ఓడు లాగా ఉంది నీ వ్యవహారం.. సిగ్గు లేకుండా అవినీతి చేసి బుకాయించడం, రాజ్యాంగ సంస్థల పట్ల నమ్మకం లేకపోవడం, గుడ్డ కాల్చి పక్కన వాళ్లమీద వేయడం, ఎన్నికల అయిపోయినా ఇంకా ఎవరిని మభ్యపెట్టేందుకు ఈ పిచ్చి వేషాలు. ఓటమి భయం నిన్ను మరింత దిగజారేలా చేస్తోంది.’ అంటూ చంద్రబాబుపై కన్నా మండిపడ్డారు. చంద్రబాబు.! అసలు EVM కనిపెట్టమని చెప్పిందే నువ్వు కదా! VVPATలో ఎవరికి ఓటు పడిందో చూసి కూడా ఇప్పుడు ఈ ఏడుపు ఏంటి? ఓటమిని హుందాగా స్వీకరించలేని నీ గోల ప్రజలు పట్టించుకొవడం లేదని గ్రహించు.. ఇక పచ్చ మీడియాతో ప్రజలను తప్పుదోవ పట్టించలేవు.ప్రజలే నిన్ను సాగనంపడానికి బాధ్యతగా ఓటు వేశారు. pic.twitter.com/bzAcIcford — Chowkidar Kanna Lakshmi Narayana (@klnbjp) 13 April 2019 కాగా ఒక గుర్తుకు ఓటేస్తే మరో గుర్తుకు వెళ్తోందని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈసీ పూర్తిగా విఫలం అయ్యిందంటూ ఆయన ఆరోపణలు కూడా చేశారు. దీనిపై చంద్రబాబు ఇవాళ సీఈసీకి 18 పేజీలతో కూడిన లేఖను సమర్పించారు. -
అంబులెన్స్‌లలో డబ్బులను తరలిస్తున్నారు
-
చంద్రబాబు వీరితోనా నీ ప్రచారం..? : కన్నా
సాక్షి, అమరావతి : సీఎం చంద్రబాబు నాయుడుపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. అధికారం కోసం వేర్పాటువాద, అరాచక నాయకులతో చేతులు కలుపుతావా చంద్రబాబు? అంటూ ట్వీట్ చేశారు. వేర్పాటువాద ఫారూఖ్ అబ్దుల్లా, అబద్ధాల ఆరవింద్ కేజ్రివాల్, అరాచక రాజకీయ హత్యలతో మమతా..వీరితోనా నీ ప్రచారం..? అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వీరితో రాజకీయ పొత్తులు పెట్టుకుని నీ స్థాయి మరింత దిగజారిపోయింది అని నిప్పులు చెరిగారు. వినాశ కాలే విపరీత బుద్ధి: అధికారం కోసం వేర్పాటువాద, అరాచక నాయకులతో చేతులు కలుపుతావా చంద్రబాబు? వేర్పాటువాద ఫారూఖ్ అబ్దుల్లా,అబద్ధాల ఆరవింద్ కేజ్రివాల్,అరాచక రాజకీయ హత్యలతో మమతా.. వీరితోనా నీ ప్రచారం..? వీరితో రాజకీయ పొత్తులు పెట్టుకుని నీ స్థాయి మరింత దిగజారిపోయింది. pic.twitter.com/u5ONgLJcHI — Chowkidar Kanna Lakshmi Narayana (@klnbjp) April 3, 2019 -
ఆంధ్రజ్యోతికి ధన్యవాదాలు: కన్నా
సాక్షి, అమరావతి : ‘అధికారం టీడీపీదే’ అనే జోక్‌ని ప్రచురించి మనసారా నవ్వించినందుకు ఆంధ్రజ్యోతి పత్రికకు ధన్యవాదాలంటూ ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్వీట్ చేశారు. ఏపీలో అధికారం టీడీపీదే అని లోక్‌నీతి సర్వే పేరుతో ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఓ తప్పుడు కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందిస్తూ లక్ష్మీనారాయణ వ్యంగ్యంగా.. ఆంధ్రజ్యోతిని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. ఒకప్పుడు తెలుగు పత్రికలు ఫూల్స్ డే నాడు హాస్యాస్పద కథనాలు ప్రచురించేవని తెలిపారు. అయితే గత కొంతకాలంగా ఈ సంప్రదాయం కనిపించడం లేదని.. కానీ ఆంధ్రజ్యోతి తిరిగి ప్రారంభించిందన్నారు. ‘అధికారం టీడీపీదే’ అనే తప్పుడు కథనంతో ఏప్రిల్ 1న నాడు మనసారా నవ్వించినందుకు ఆంధ్రజ్యోతికి ధన్యవాదాలు అంటూ కన్నా ట్వీట్ చేశారు. గతంలో తెలుగు పత్రికలు ఏప్రిల్ 1st ఫూల్స్ డే నాడు హాస్యాస్పదంగా కథనాలు వేసేవారు.. ఎందుకో మిగతా పత్రికలు ఆ సంప్రదాయం ఆపేసాయి.. కానీ నేటి ఆంధ్రజ్యోతి "అధికారం టీడీపీదే" అని ఏప్రిల్ 1st నాడు నవ్వులు పూయించింది.. జోక్ ని ప్రచరించి మనసారా నవ్వించినందుకు ఆంధ్రజ్యోతికి ధన్యవాదాలు. pic.twitter.com/MUe1L88FNP — Chowkidar Kanna Lakshmi Narayana (@klnbjp) April 1, 2019 ఇదిలా ఉండగా ఏపీలో టీడీపీకే అత్యధిక స్థానాలు వస్తాయంటూ ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. అయితే దీనిని ఎస్డీఎస్ లోక్‌నీతి సర్వే సంస్థ తీవ్రంగా ఖండించింది. తమ అనుమతి లేకుండా సంస్థ పేరును ప్రచురించినందుకు సంబంధిత పత్రికపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది కూడా. (చదవండి: అడ్డంగా దొరికిన ఆంధ్రజ్యోతి..!) -
బాబూ లీకేష్.. అఫిడవిట్లో కాపీనేనా?
సాక్షి, హైదరాబాద్ : ఇటీవల ఎన్నికల ప్రచారంలో నోరు జారి పప్పులో కాలేసిన మంత్రి నారా లోకేష్... ఎన్నికల అఫిడవిట్లోనూ తప్పు చేసి నవ్వుల పాలయ్యారు. అఫడవిట్లో భర్తపేరు దగ్గర తండ్రి పేరు రాసి ఇచ్చారని, తండ్రి చంద్రబాబు నాయుడు అఫిడవిట్‌ను కాపీ చేశారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్విటర్ వేదికగా విమర్శించారు. ‘బాబు లీకేష్, "ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?" అనే సామేత నిజంచేశావ్. నువ్వు అవినీతిలో డాడీకి కాపీ.! తెలివిలో డాడీకి కలర్ జిరాక్స్ అనుకున్నాం.. కానీ ఆఖరికి అఫిడవిట్ లోనూ కాపీనేనా!? ఇద్దరికి అఫిడవిట్ సరిగ్గా వేయడం రాదు కానీ అమరావతిని అమెరికా చేస్తా అని కేఏ పాల్ కబుర్ల చెబుతారు’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక ఈ అఫిడవిట్ కాపీలు సోషల్ మీడియాలో తెగహల్‌చల్ చేస్తున్నాయి. ‘ఇది మా కర్మరా.!’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. చదవండి : నోరు జారిన లోకేశ్.. ఆర్కే సెటైర్! బాబు లీకేష్, "ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?" అనే సామేత నిజంచేశావ్. నువ్వు అవినీతిలో డాడీకి కాపీ.! తెలివిలో డాడీకి కలర్ జిరాక్స్ అనుకున్నాం కానీ ఆఖరికి అఫిడవిట్ లోనూ కాపీనేనా!? ఇద్దరికి అఫిడవిట్ సరిగ్గా వేయడం రాదు కానీ అమరావతిని అమెరికా చేస్తా అని KA పాల్ కబుర్ల చెబుతారు pic.twitter.com/v4vLPCAUkV — Chowkidar Kanna Lakshmi Narayana (@klnbjp) March 23, 2019 -
మేమంతా చంద్రబాబు తీరు చూసి నవ్వుకొనేవాళ్లం..
అవినీతి సొమ్ము వెదజల్లి ప్రజల తీర్పును కొనుక్కోలేరు. ఈ నిజాన్ని చంద్రబాబు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. చంద్రబాబు స్వభావమే అంత. ఏదో ఒక ఆధారం చూసుకొని ఎన్నికలు గట్టెక్కాలని చూస్తారు. 2004లో అవినీతి సొమ్ము, బాకా ఊదే మీడియా చంద్రబాబును రక్షించలేకపోయాయి. ఇప్పుడూ అంతే. అవేమీ రక్షించలేవు. ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. అవినీతి, అరాచక ప్రభుత్వం పోవాలని కోరుకుంటున్నారు.రాష్ట్రంలో చంద్రబాబు పాలనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... ♦ ‘చంద్రబాబు ఒంటరిగా ఎన్నికలకు వెళుతున్నారని ఎవరన్నారు? అడ్డంగా దోచేసిన రూ.వేల కోట్ల అవినీతి సొమ్ము ఆయనకు తోడుంది. మసిపూసి మారేడుకాయచేసి చూపించే మీడియా అండగా ఉంది. మరి ఒంటరిఅని ఎలా అనగలం?’ ♦ ‘చంద్రబాబును మళ్లీ నమ్మితే రాష్ట్రాన్ని భగవంతుడు కూడా రక్షించలేడు. మళ్లీ వస్తే జరిగే అవినీతి, అరాచకం అంచనాల కందదు’ ♦ ‘బాబుకు, వైఎస్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది.. వైఎస్ ప్రజల మనిషి’ ♦ ‘కాపీ కొట్టడం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. వైఎస్ ప్రకటించే పథకాలను ముందుగానే తెలసుకొని ప్రతిపక్ష నేతగా ఉన్న బాబు అవన్నీ కావాలని డిమాండ్ చేసేవారు. ‘‘నేను డిమాండ్ చేశాను.. ప్రభుత్వం ఇచ్చింది’’ అని చెప్పేవారు’ ♦ ‘2014లో తల్లి కాంగ్రెస్.. పిల్ల కాంగ్రెస్ అన్నారు. జగన్‌కు ఓటేస్తే కాంగ్రెస్‌కు ఓటేసినట్లే అన్నారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ చంకలో చంద్రబాబు దూరారు’ ♦ ‘గత ఎన్నికల్లో మోదీ ఇమేజితో ఎన్నికలు గట్టెక్కారు. ఇప్పుడు అదే బీజేపీని బూచిగా చూపిస్తున్నారు. జగన్‌కు ఓటేస్తే మోదీకి వేసినట్లేనని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. జగన్ ఓటు బ్యాంకును చీల్చడానికి బాబు చేస్తున్న కుట్ర ఇది’ అని అంటున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. ఏ గాలికి ఆ చాప ఎత్తడం బాబు నైజం 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీని వాడుకొని చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఎన్డీఏలోనే ఉంటూ మోదీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. 2015 బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలోనే బాబు చేస్తున్న కుటిలయత్నాలను చెప్పాను. చంద్రబాబు తెలివితేటలన్నీ మాకు తెలుసు. 30 ఏళ్లుగా అతన్ని చూస్తున్నాం. స్వయం ప్రకటిత మేధావి చలసాని శ్రీనివాస్, సినిమా యాక్టర్ శివాజీ ద్వారా మోదీకి వ్యతిరేకంగా మాట్లాడించారు. నాలుగేళ్లకుపైగా బీజేపీతో ఉండి, ఎన్నికలకు ఏడాది ముందు మోదీకి వ్యతిరేకంగా పాట అందుకున్నారు. ఏ గాలికి ఆ చాప ఎత్తడం బాబుకు అలవాటే. బాబు పాలనలో అభివృద్ధి ఊసే లేదు దేశంలో ఏ రాష్ట్రానికీ ఇవ్వనన్ని నిధులు కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చాయి. అవినీతి చేయడానికి అవకాశం లేని పథకాల కింద ఇచ్చిన నిధులను తీసుకోవడానికి చంద్రబాబు ఇష్టపడలేదు. కొన్ని నిధులను తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇవ్వడానికి ఇష్టం లేక కొన్ని నిధులను తీసుకోలేకపోయారు. భారీగా నిధులు తీసుకున్న పథకాల్లో తీవ్రమైన అవినీతికి పాల్పడ్డారు. ఈ 5 సంవత్సరాల్లో తాను ఇది చేశానని చెప్పడానికి చంద్రబాబుకు ఏమీ లేదు. అవినీతి, అరాచకం తప్ప.. ఈ ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ఏమీ చేయలేదు. ఈ ఎన్నికల్లో లబ్ధికోసం కేంద్రం నిధులు ఇవ్వలేదని, అభివృద్ధి జరగకపోవడానికి బీజేపీనే కారణమని దోషిగా నిలబట్టి పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తున్నారు. రాజధానిని దోపిడీ కేంద్రంగా మార్చారు గుంటూరు జిల్లా ప్రజల త్యాగం దోపిడీకి గురైంది. మూడు పంటలు పండే 53 వేల ఎకరాలు తీసుకొని రాజధానిని దోపిడీ కేంద్రంగా మార్చుకొని లూటీ చేశారు. పర్యావరణాన్ని గాలికి వదిలి లక్షల మంది ప్రాణాలతో చంద్రబాబు చెలగాటమాడుతున్నారు. కృష్ణా నదిలో ఇసుక తోడి రాజధాని ప్రాంతాన్ని మెరక చేస్తున్నారు. సీఎం కుర్చీ ఎక్కగానే హామీలు మరచిపోయారు 2014లో అడ్డమైన హామీలు ఇచ్చి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. సీఎం కుర్చీ ఎక్కగానే హామీలు మరిచిపోయారు. రుణమాఫీ చేయలేదు. బ్యాంకులకు రుణాలు చెల్లించవద్దని ఎన్నికల్లో చెప్పారు. బాబు సీఎం అయిన తర్వాత బంగారు నగలన్నీ బ్యాంకులు వేలం వేశాయి. డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదు. ఒక్క హామీనీ నిలబెట్టుకోలేదు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ముందున్న ఒకేఒక మార్గం... ప్రజల సొమ్ముతో ఓట్లు కొనుక్కోవడం. 2019 జనవరి తర్వాత.. ఉన్నట్లుండి సంక్షేమ పథకాలు గుర్చొచ్చాయి. ప్రజలకు నేను చెప్పేది ఒక్కటే. చంద్రబాబు వ్యక్తిత్వాన్ని గుర్తుపెట్టుకోండి. గత ఎన్నికల్లో ఇచ్చిన ఇచ్చిన హామీలను మరిచిపోయారు. చంద్రబాబు మళ్లీ వస్తే అవినీతి, అరాచకం.. అంచనాలకు అందదు. నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా వైఎస్ ప్రజల మనిషి. వైఎస్‌తో చంద్రబాబుకు పోలికా! నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది ఇద్దరికీ. మరో మాట అక్కర్లేదు. అవినీతి కోణాలెన్నో రాజధానిలో చూశా రాజధాని గుంటూరు జిల్లాకు వచ్చినప్పుడు నేను స్వాగతించాను. సంతోషించాను. కానీ.. చంద్రబాబు, ఆయన మనుషులు, మంత్రులు, అధికార పార్టీ నాయకులు రాజధానిని బంగారు బాతుగా మార్చుకున్నారు. వరదలు వస్తే గుంటూరు, కృష్ణా జిల్లాలకు ప్రాణ, ఆస్తి నష్టం ఎంత జరుగుతుందో అంచనా వేయలేం. రాజధాని కుంభకోణాలు ఒకటీరెండూ కాదు. దోపిడీలో వినూత్న కార్యక్రమం అది. గుంటూరుకు రాజధాని వచ్చిందని సంతోషించాలో, దోపిడీ–పర్యావరణ విధ్వంసం గురించి బాధపడాలో ప్రజలకు అర్థం కావడం లేదు. జగన్ ఓటు బ్యాంకును దెబ్బతీయాలనే కుట్ర దీని వెనుక జగన్ ఓటు బ్యాంకును దెబ్బతీయాలనే కుట్ర దాగి ఉంది. మైనార్టీ ఓట్లు జగన్‌కు రాకుండా చేయడానికి చంద్రబాబు ఈ కుట్రను అమలు చేస్తున్నారు. దానికి ఆయన అనుకూల మీడియా తందానా అంటోంది. టీడీపీ మేనిఫెస్టో ఎలా ఉండబోతోందో ఆరు నెలల క్రితం నేనే చెప్పాను. నాలుగున్నర సంవత్సరాలలో చంద్రబాబు అవినీతి తప్ప అభివృద్ధి చేయలేదని వెల్లడించాను. 2019 ఎన్నికల అజెండాగా ‘బీజేపీ బూచి’గా ఎంపిక చేసుకుంటారని చెప్పాను. ఇప్పుడు ఎన్నికలొచ్చాయి. నేను ఆరు నెలల క్రితం చెప్పిన దానికి, ఇప్పటికీ ఏమైనా తేడా ఉందా? చంద్రబాబు కుయుక్తులన్నీ నాకు తెలుసు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ‘తల్లి కాంగ్రెస్... పిల్ల కాంగ్రెస్’ అన్నారు. జగన్‌కు ఓటేస్తే తల్లి కాంగ్రెస్‌కు ఓటేసినట్లేనని ప్రచారం చేసి లబ్ధి పొందారు. తల్లి కాంగ్రెస్‌కు.. జగన్‌కు సంబంధం లేదని చంద్రబాబుకు తెలియని విషయం కాదు. ఇప్పుడేమో.. అదే తల్లి కాంగ్రెస్ చంకలో చంద్రబాబు దూరారు. చంద్రబాబు నైజమే అంత. ఏదో ఒకదాన్ని బూచిగా చూపించాల్సిందే తప్ప.. తాను ఏం చేశాడో ఎప్పుడూ చెప్పరు. తన గురించి ఎన్నికల్లో చెబితే ప్రజలు ఛీకొడతారని ఆయనకు స్పష్టంగా తెలుసు. బాబుకు అండగా అవినీతి సొమ్ము రాష్ట్రంలో అడ్డంగా దోచేసిన రూ.వేల కోట్ల అవినీతి సొమ్ము ఆయనకు అండగా ఉంది. చంద్రబాబు ఒంటరిగా వెళుతున్నారని ఎవరు చెప్పారు? ఈ ఎన్నికల్లో డబ్బును వెదజల్లి గట్టెక్కగలననే నమ్మకంతో చంద్రబాబు ఎన్నికలకు వెళుతున్నారు. చంద్రబాబు నంది అంటే నంది అని, పంది అంటే పంది అని ప్రచారం చేసి.. తిమ్మిని బమ్మిని చేయడానికి బాకా ఊదే పత్రికలు, టీవీలు ఆయనకు తోడుగా ఉన్నాయి. అడ్డంగా రాష్ట్రాన్ని దోచేసినా, అవినీతిని విచ్చలవిడిగా చేసినా, అడ్డమైన పనులు చేసినా.. ఆ మీడియా అండగా ఉంది. అవన్నీ తోడుగా ఉంటే.. చంద్రబాబు ఒంటరిగా ఎన్నికలకు వెళుతున్నారని ఎలా అనగలం? జగన్ పథకాలు కాపీ కొడుతున్నారు కాపీ కొట్టడం చంద్రబాబు రక్తంలోనే ఉంది. మూడు దశాబ్దాలుగా ఆయన్ను చూసిన వాడిగా చెబుతున్నా. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ అంతే. ప్రభుత్వం ప్రకటించే పథకాలు, కార్యక్రమాలను ముందుగా తెలుసుకునేవాడు. అలా తెలుసుకోవడానికి చంద్రబాబు మనుషులు కొద్ది మంది ప్రభుత్వంలో ఏదో స్థాయిలో ఉండేవారు. ఆ పథకంలో ఉన్న వాటిని ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేసే వారు. తీరా వైఎస్ రాజశేఖరరెడ్డి పథకాన్ని ప్రకటించగానే.. ‘నేను డిమాండ్ చేశాను ముందే, ప్రభుత్వం దిగొచ్చి ప్రకటించింది’ అని చంద్రబాబు నిస్సిగ్గుగా చెప్పేవారు. మేమంతా బాబు తీరు చూసి నవ్వుకొనేవాళ్లం. ఇప్పుడు జగన్ నవరత్నాల పథకాలను కాపీ కొడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. -
చంద్రబాబు ఫామ్ 7 పై రాద్దాంతం చేస్తున్నారు
-
త్వరలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం
-
‘చంద్రబాబును తరిమే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి’
-
రైతు ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారా? : కన్నా
సాక్షి, అమరావతి : సీఎం చంద్రబాబు సభకోసం ఓ రైతును అన్యాయంగా చంపిన ఘటనపై బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. చారిత్రక కొండవీడు కోటలో చంద్రబాబు పర్యటన ఓ రైతు కుటుంబం ఇంట్లో తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. మీ రైతు వ్యతిరేక వైఖరితో మరో రైతుని బలిచేశారని చంద్రబాబుపై కన్నా ట్విట్టర్లో నిప్పులు చెరిగారు. 'పొలాన్ని దేవాలయంగా భావించే రైతు పట్ల మీరు అధికార దర్పాన్ని చూపి పోలీసులతో కొట్టించడం వలన ప్రాణాలు విడిస్తే కనీసం కేసు, విచారణ లేకుండా ఆత్మహత్య అని ఎలా మీరు ప్రకటిస్తారు? ప్రజలకు వర్తించే చట్టాలు మీకు వర్తించవా? కొండవీడు ఉత్సవాల ఏర్పాట్ల కోసం కోటయ్యకు చెందిన పచ్చని పంటపొలాలను తన సమ్మతి లేకుండా తీసుకునే హక్కు మీకు, పచ్చ కార్యకర్తలుగా పనిచేస్తున్న పోలీసులకు ఎవరిచ్చారు?! సామాన్య రైతు ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారా? మీలాంటి దౌర్జన్యం చేసే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం ఈ రాష్ట్ర దౌర్భాగ్యం' అని పేర్కొన్నారు. @ncbn, మీ రైతు వ్యతిరేక వైఖరికి మరో రైతుని బలిచేశారు. పొలాన్ని దేవాలయంగా భావించే రైతు పట్ల మీరు అధికార దర్పాన్ని చూపి పోలీసులతో కొట్టించడం వలన ప్రాణాలు విడిస్తే కనీసం కేసు,విచారణ లేకుండా ఆత్మహత్య అని ఎలా మీరు ప్రకటిస్తారు? ప్రజలకు వర్తించే చట్టాలు మీకు వర్తించవా?#ShameOnYouCM — Kanna Lakshmi Narayana (@klnbjp) February 19, 2019 ముఖ్యమంత్రి రాక సందర్భంగా భద్రతా ఏర్పాట్లు, సభ పేరుతో కాపుకొచ్చిన పండ్ల తోట, పూల తోటను ధ్వంసం చేయడం, పొలంలోకి రాకుండా తనను అవమానించడంతో ఓ రైతన్న తల్లడిల్లాడు. పొలంలోకి వెళ్లేందుకు ప్రయత్నించి పోలీస్ దెబ్బలకు రైతు నేలకొరిగిన ఘటన సోమవారం గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. కొన ఊపిరితో ఉన్న తన తండ్రిని ఆస్పత్రికి తరలించేందుకు అనుమతించాలని మృతుడి కుమారుడు వేడుకున్నా పోలీసులు అందుకు అంగీకరించలేదు. సీఎం వస్తున్నారంటూ అంబులెన్స్, ఆటోలను కూడా రానివ్వలేదు. చేసేదిలేక చేతులపైనే కోటయ్యను గ్రామస్థులు మోసుకెళ్లారు. మార్గమధ్యలోనే కోటయ్య ప్రాణాలు విడిచాడు. -
‘ఆ ఆంబోతు దొరికిన చోటల్లా దోచేస్తోంది’
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన కుమారుడ్ని అచ్చోసిన ఆంబోతులా ఊరి మీదకు వదిలారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. ఆ ఆంబోతు దొరికిన చోటల్లా దోచేస్తోందని మంత్రి నారా లోకేష్‌ను ఉద్ధేశిస్తూ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానన్నారని చెప్పి చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్నారని తెలిపారు. ఇప్పుడు ఏపీ ఎన్నికలకు కాంగ్రెస్‌ను దూరం పెట్టడం వంటి దిక్కుమాలిన రాజకీయాలు చంద్రబాబుకే చెల్లు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజల సొమ్ముని దీక్షల పేరుతో చంద్రబాబు దుబారా చేస్తున్నారని తెలిపారు. కేంద్రంపై నిరసన తెలపాలనుకుంటే ఒక్కడే ఢిల్లీ వెళ్లి దీక్ష చేయొచ్చుకదా అని ప్రశ్నించారు. పోలవరాన్ని తాము కట్టిస్తుంటే అది తన ఘనతగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. ఈ ఐదేళ్లలో అవినీతి, అక్రమాలు, అరాచకం తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారా?.. కేంద్ర నిధులతో కట్టిన నిర్మాణాలను మేము చూపిస్తాం, రాష్ట్రం కట్టించిన ఒక్క ప్రాజెక్టునైనా మీరు చూపించగలరా అని ప్రశ్నించారు. చంద్రబాబు సంస్కారహీనుడు కాబేట్టే మోదీ భార్య గురించి మాట్లాడారని చెప్పారు. ప్రధాని రాష్ట్రానికి వస్తే ఆహ్వానించాలన్న కనీస ప్రోటోకాల్ పాటించకుండా.. చంద్రబాబు ఆంధ్రుల పరువు నిలువునా తీశాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి పది లక్షల కోట్లు ఇచ్చామని గడ్కరీ లెక్కలు చెప్పారని, కాదంటే దీనిపై చర్చకు రావాలంటూ సవాల్ చేశారని వెల్లడించారు. కానీ చంద్రబాబు ముందుకు రాలేకపోయాడని, యూటర్న్ ముఖ్యమంత్రి ఇప్పుడు మతిస్థిమితం లేని ముఖ్యమంత్రి అయ్యారంటూ ఎద్దేవా చేశారు. -
‘చంద్రబాబు దొంగలా బెజవాడకు పారిపోయారు’
సాక్షి, అమరావతి : ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిధిగా గుంటూరులో ఆదివారం జరిగిన బీజేపీ ప్రజాచైతన్య సభలో ఆయన మాట్లాడుతూ.. ‘అవినీతి, అక్రమాలతో కోట్ల రూపాయల ప్రజల ఆస్తులను చంద్రబాబు కొల్లగొట్టారు. అలా కూడబెట్టిన సొమ్ముతో నేడు ఓట్లు కొనుక్కునే స్థితికి వచ్చారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయారు. దొంగలా రాత్రికి రాత్రే విజయవాడకు పరార్ అయ్యారు. చంద్రబాబు నిర్వాకంతో ఏపీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడలో అద్దెలు కట్టుకోలేక అవస్థలు పడుతున్నారు. కనీసం ఉద్యోగలుకు జీతాలు ఇచ్చుకునే పరిస్థితి లేకుండా రాష్ట్రాన్ని దిగజార్చారు’ అని మండిపడ్డారు. పోలవరం నిర్మాణానికి 100 శాతం నిధులు కేంద్రమే ఇస్తోందని తెలిపారు. అనంతపురంలో కియా కార్ల తయారీ పరిశ్రమ రావడానికి ప్రధాని నరేంద్ర మోదీ చొరవే కారణమని కన్నా కొనియాడారు.ఏపీ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాల సహకరిస్తోందని వెల్లడించారు. ఐదేళ్లుగా రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్నారని విమర్శించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభం ఉందని చెప్పుకునే చంద్రబాబు తన అనుభవాన్ని రాష్ట్రాభివృద్ధిలో ఎందుకు చూపించడంలేదని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు దమ్ముంటే అభివృద్ధి అంటే ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. ప్రధాని మోదీ రైతులకు రూ.6 వేల ఇన్పుట్ సబ్సిడీ ప్రకటించారని గుర్తు చేశారు. మోదీ ఆధ్వర్యంలో దేశం ముందుకెళ్తోందని అన్నారు. -
మోదీ దేశానికే గర్వకారణం
-
ఇదేం పిచ్చి బాబు!?
సాక్షి, అమరావతి: చిత్తూరులోని దొడ్డిపల్లెలో జరిగిన పసుపు కుంకుమ సభ సందర్భంగా ప్రజలకు పంచిపెట్టిన భోజనంతోపాటు అప్పడాలపై సీఎం చంద్రబాబునాయుడు ఫొటోలు ముద్రించడంపై సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు పేలుతున్నాయి. ప్రజలకు అందించిన తిండిపైనా నేతల ఫొటోలు ముద్రించి పబ్లిసిటీకి ఉపయోగించుకోవడమేంటని పలువురు మండిపడుతున్నారు. తాజాగా బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈ అంశంపై ట్విట్టర్లో సెటైర్లు సంధించారు. ‘ఆశ-దోచే-అప్పడం బాబు..! కుర్చీ మీద ఆశతో రాష్ట్రాన్ని దోచి ప్రచార పిచ్చితో ఆఖరికీ అప్పడాలపై, టిష్యూ పేపర్లపై, బాత్రూం కమోడ్లపై కూడా ప్రచారం చేసుకుంటున్నావ్! ఇదేం పిచ్చి బాబు!?’ అని నిలదీశారు. కొంపదీసి శారదా స్కాం మీ హస్తముందా? పశ్చిమ బెంగాల్లో మమతాబెనర్జీ హైడ్రామా విషయంలో కేంద్రంపై విమర్శలు చేసిన చంద్రబాబుపైనా కన్నా మండిపడ్డారు. గుమ్మడికాయ దొంగలు ఎవరంటే మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు చంద్రబాబు అని నిలదీశారు. ‘కొంపతీసి 'శారదా స్కామ్'లో కూడా 'తమరి హస్తం' ఉందా?!? 'పచ్చ కామెర్లు' వాడికి లోకం 'పచ్చగా' కనిపిస్తుందని సామెత మీకు వర్తిస్తుంది’ అని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య దేశంలో దీదీ గుండాగిరి, చంద్రబాబు దాదాగారి మరెంతో కాలం సాగదని అన్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు ఉందా? అని కన్నా ప్రశ్నించారు. ‘కాకినాడలో మహిళలను ఫినిష్ చేస్తా అన్నప్పుడు ఏమైంది మీ ప్రజాస్వామ్యం? అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేని దూషించినప్పుడు ఏమైంది ప్రజాస్వామ్యం? సెక్రటేరియట్లో నాయీబ్రాహ్మణులను బెదిరించినప్పుడు ఏమైంది ప్రజాస్వామ్యం?’అని వరుస ట్వీట్లలో చంద్రబాబును కన్నా ప్రశ్నించారు. ఆశ-దోచే-అప్పడం బాబు..! కుర్చీ మీద ఆశతో రాష్ట్రాన్ని దోచి ప్రచార పిచ్చితో ఆఖరికి అప్పడాలపై,టిష్యూ పేపర్ లపై బాత్రూం కమోడ్లపై కూడా ప్రచారం చేసుకుంటున్నావ్..! ఇదేం పిచ్చి బాబు!?@ncbn pic.twitter.com/s1TH9U0qsd — Kanna Lakshmi Narayana (@klnbjp) 4 February 2019 గుమ్మడికాయ దొంగలు ఎవరంటే మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు @ncbn ? కొంప తీసి 'శారదా స్కామ్' లో కూడా 'తమరి హస్తం' ఉందా?!? 'పచ్చ కామెర్లు' వాడికి లోకం 'పచ్చగా' కనిపిస్తుందని సామెత మీకు వర్తిస్తుంది.. ప్రజాస్వామ్య దేశంలో దీదీ గుండాగిరి,మీ దాదాగారి మరెంతో కాలం సాగదు. pic.twitter.com/y2Lo8Noc0k — Kanna Lakshmi Narayana (@klnbjp) 3 February 2019 ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత మీకుందా చంద్రబాబు? కాకినాడలో మహిళలను ఫినిష్ చేస్తా అన్నప్పుడు ఏమైంది మీ ప్రజాస్వామ్యం? అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేని దూషించినప్పుడు ఏమైంది ప్రజాస్వామ్యం? సెక్రటేరియట్లో నాయీబ్రాహ్మణులను బెదిరించినప్పుడు ఏమైంది ప్రజాస్వామ్యం? https://t.co/sMB2fOO3OP — Kanna Lakshmi Narayana (@klnbjp) 3 February 2019 -
చంద్రబాబు అగ్రకులాల మధ్య చిచ్చు పెడుతున్నారు
-
చంద్రబాబు మానసిక స్థితి సరిగ్గా లేదు
పశ్చిమగోదావరి, తాడేపల్లిగూడెం: దోచుకున్న సొమ్ముతో ఓటుకు రూ.25,000 ఇచ్చి అధికారంలోకి తిరిగి రావాలని సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. సమస్యల పరిష్కారం కోసం నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావును సోమవారం రాత్రి దీక్షా శిబిరం వద్ద ఆయన కలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు మానసిక స్థితి సరిగ్గా లేదన్నారు. ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాడో తెలియని విధంగా బాబు ఉన్నారన్నారు. తాను మారానని , అధికారమిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని ప్రజలను సీఎం చంద్రబాబు నమ్మించి గొంతు కోశారన్నారు. నమ్మి ఓట్లేసి గెలిపించిన జిల్లా ప్రజలకు సీఎం ద్రోహం చేశారని ఆరోపించారు. భూకుంభకోణాలు, మట్టి, మైనింగ్ కుంభకోణాలతో రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారన్నారు. రాజధానికి 20 వేల ఎకరాలు సరిపోతాయనుకుంటే, 54 వేల ఎకరాలను రైతుల నుంచి లాక్కుని వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. జన్మభూమి కమిటీల నుంచి సీఎం కొడుకు వరకు రాబంధుల మాదిరి దోచేసుకుంటున్నారని విమర్శించారు. తక్షణం ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావుకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు జిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ చంద్రబాబుకు సీఎంగా ఉండే అర్హత లేదన్నారు. చంద్రబాబు నిట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చినప్పుడు ఇచ్చిన హామీలనే అమలు చేయాలని మాణిక్యాలరావు అడుగుతున్నారన్నారు. సీఎం సరిగ్గా ఉంటే గూడెంలో ఎమ్మెల్యే దీక్ష చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. బీజేíపీ రాష్ట్ర నాయకులు అడపా నాగేంద్ర తదితరులు ఉన్నారు. -
బీజేపీకి చంద్రబాబే క్యాంపెనర్: బీజేపీ అధ్యక్షుడు
సాక్షి, గుంటూరు: సీఎం చంద్రబాబు నాయుడు నిత్యం కేంద్రంపై దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీకి చంద్రబాబు ఓ క్యాంపెనర్‌గా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయాలు ముఖ్యం కాదని ఏపీకి ప్రధాని నరేంద్ర మోదీ సహాయం చేస్తున్నారని తెలిపారు. కేంద్రం నుంచి వచ్చే ప్రతి పనిలో చంద్రబాబు కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరి సోమవారం గుంటూరు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక్క గడ్కరి శాఖ నుంచే మూడు లక్షల కోట్ల నిధులు ఏపీకి వచ్చాయని వివరించారు. ‘నోట్ల రద్దు చేయాలని కేంద్రానికి లేఖ రాసింది నేనే అని చెప్పిన మాటలు చంద్రబాబు మర్చిపోయారా? డీమానిటైజేషన్ కమిటీకి కన్వీనర్ చంద్రబాబే గుర్తుంది కదా. ఏదైనా సమస్య ఉంటే దానికి బాబే బాధ్యత వహించాలి. మోదీ మరలా ప్రధాని అయితే జైలుకు పోతామనే భయంతో దొంగలంతా ఓ చోటకు చేరారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మోదీ అంతటి ధైర్యశాలైన ప్రధానిని చూడలేదు. 2014 కంటే అత్యధిక మెజారిటీతో మోదీ తిరిగి ప్రధాని అవుతారు’అంటూ కన్నా లక్ష్మీనారాయణ విశ్వాసం వక్తం చేశారు. -
ఏపీ అభివృద్ధికి చంద్రబాబే అడ్డంకి
కడప కోటిరెడ్డిసర్కిల్/అగ్రికల్చర్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందకపోవడానికి సీఎం చంద్రబాబునాయుడే ప్రధాన అడ్డంకి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ధ్వజమెత్తారు. శుక్రవారం కడప నగరంలోని కందుల ఎస్టేట్‌లో రాయలసీమస్థాయి శక్తికేంద్రాల ప్రముఖ్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీ అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రం విడిపోయిన సందర్భంలో ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిందన్నారు. ఈ విషయాన్ని నిర్భయంగా చెప్పే దమ్ము,ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. అనంతపురం జిల్లాలో కియా మోటార్స్ పరిశ్రమ వచ్చిం దంటే అది ప్రధాని మోదీ చలువేనని అన్నారు. రాయలసీమ జిల్లాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి కూడా చొరవ తీసుకున్నట్లు చెప్పారు. ప్రాజెక్టులకు కోట్లరూపాయలు ఇచ్చి పూర్తిచేయమని కేంద్రం చెబితే ఆ నిధులను తన అనుయాయులైన కాం ట్రాక్టర్లకు ఇచ్చుకుని కమీషన్ నొక్కేశారన్నారు. నీరు –చెట్టు పేరుతో చెరువులను చెరపట్టి దోపిడీకి తెరతీశారన్నారు వైఎస్ఆర్ జిల్లా కేంద్రమైన కడప నుంచి ఎన్నికల శంఖారావం పూరిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రజలు నిజాయితీ పరిపాలన అందించాలని అధికారమిస్తే సీఎం చంద్రబాబు ఆ అధికారాన్ని స్వప్రయోజనాలకు వాడుకున్నారని నిప్పులు చెరిగారు. 2014న సీఎంగా ప్రమాణ స్వీకారం రోజున కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి పీయూస్ గోయల్ ఈ రాష్ట్రానికి 24 గంటలు కరెంటు ఇస్తున్నట్లు ప్రకటించారని అన్నారు. దాన్ని కూడా తామే ఇస్తున్నట్లు సీఎం చెప్పుకోవడం దారుణమన్నారు. రాయలసీమ వెనుకబాటు తనానికి చంద్రబాబు తీరే కారణమన్నారు. రూ.75 వేల కోట్ల విలువ చేసే మట్టిని అమ్ముకుని టీడీపీ నాయకులు సొమ్ము చేసుకున్నారన్నారు. ఇలా ఒకటేమిటి అన్ని పథకాల్లోను అవినీతిని పారించారని దుమ్మెత్తి పోశారు. కడప ఉక్కుఫ్యాక్టరీ స్థాపన కోసం వనరులకు సంబంధించి సమాచారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం కోరగా అందుకు ఎలాంటి సహకారం, సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. అఖిల భారత మహిళా మోర్చా ఇన్చార్జి దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో పాలక ప్రభుత్వం రైతులను, డ్వాక్రా మహిళలను, నిరుద్యోగ యువతను మోసం చేసిందని ఆరోపించారు.ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందని అన్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ మాట్లాడుతూ బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పడే పరిస్థితి లేదన్నారు. ఎందుకంటే ఉత్తరప్రదేశలోని అఖిలేష్, మాయావతి ఇప్పటికే కూటమి నాయకుడిగా చెప్పుకుంటున్న సీఎం చంద్రబాబును ముందు మీ పీఠం గురించి ఆలోచించి రమ్మనట్లు ఢిల్లీలో చెప్పుకుంటున్నారన్నారు. తొమ్మిది సంవత్సరాల్లో హైదరబాద్‌ను నేనే కట్టానని చెబుతున్న సీఎం చంద్రబాబు మరి ఐదేళ్లలో అమరావతిలో రాజధానిని ఎందుకు కట్టలేకపోయారో? ప్రజలకు సమాధానం చెప్పాల న్నారు. దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వాల్లో ఏపీలోని టీడీపీ సర్కార్ నాలుగో స్థానంలో ఉందని సాక్షాత్తు ఢిల్లీలోని సీడీఎఫ్ నివేదిక ఇచ్చిందన్నారు. కర్నూలు ఇన్చార్జి కపిలేశ్వరయ్య మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం అభివృద్ధికి నిధులు ఇస్తే వాటిని టీడీపీ నాయకులు అప్పనంగా భోం చేశారని దుమ్మెత్తిపోశారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందుల రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ శక్తి కేంద్రాల ప్రముఖ్‌లు ఎన్నికల వరకు పెద్ద యజ్ఞం చేయాలన్నారు. పార్టీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ మాధవ్, రాష్ట్ర కార్యదర్శులు వంగల శశిభూషణ్‌రెడ్డి, సుంకర శ్రీనివాస్, అడపా నాగేంద్ర, చల్లపల్లి నరసింహారెడ్డి, భాను ప్రకాష్‌రెడ్డి, నీలకంఠ,బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు నాగోతు రమేష్‌నాయుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి బండి ప్రభాకర్, కర్నూలు, అనంతపురం చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల పార్టీ అధ్యక్షులు హరీష్, అంకాల్‌రెడ్డి, చంద్రారెడ్డి, పుప్పాల శ్రీనాధ్‌రెడ్డి,బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బత్తల పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఆయన్ని చూసి ఊసరవెల్లి సిగ్గుపడుతోంది’
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2014లో ఏం మాట్లాడాడు.. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడో చూసి ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతోందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు సిద్ధాంతాలు లేవన్నారు. చంద్రబాబు కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోవటం, దొంగలందరూ ఒక్కటయ్యారన్న దానికి నిదర్శనంగా పేర్కొన్నారు. టీడీపీ నాయకులు దోచిన అవినీతి సొమ్ము ప్రధాని నరేంద్రమోదీ కక్కిస్తాడనే భయం వారికి పట్టుకుందని అన్నారు. -
కేంద్రం సొమ్ముతో రాష్ట్రం సోకులా?
పామర్రు: పేద ప్రజల సంక్షేమం కోసం కేంద్రం నిధులను మంజూరుచేస్తుంటే వాటిని తమవిగా చెప్పుకుంటూ ప్రజలను టీడీపీ ప్రభుత్వం వంచిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో పార్టీనేతల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో పలు పథకాలకు పేర్లు మార్చి జన్మభూమి కమిటీలు చెబితేనే ఇస్తామంటూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. జన్మభూమి కమిటీల ద్వారా టీడీపీ బినామీలకే మంజూరు చేస్తున్నారని ఆరోపించారు. వివిధ పన్నుల ద్వారా వచ్చిన నిధులను జన్మభూమి, సీఎం, సీఎం కుమారుడు పేరిట విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారన్నారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి నిధులు మంజూరు చేస్తుంటే వాటిని పక్కదారి పట్టించి కేంద్రం నిధులు ఇవ్వడం లేదని దుష్పచారం చేస్తోందన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. పథకాలకు నిధులు కేంద్రం ఇస్తుంటే ట్యాంక్యూ సీఎం అని మెసేజ్‌లు పెట్టించుకోవడం ఎంత దారుణం అన్నారు. రానున్న ఎన్నికలలో ఏపీలోని అన్ని నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తామని తెలిపారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే విధంగా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి వాటి ప్రకారం విధులు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి, జాతీయ కార్యవర్గసభ్యుడు షేక్ బాజీ, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తురగా నాగభూషణం, జిల్లా అధ్యక్షుడు కుమారస్వామి, నియోజకవర్గ అధ్యక్షులు ఎస్పీ నాగేశ్వరరావు, పార్టీనేతలు కాకర్ల సత్యనారాయణ, ఏకె ప్రసాద్, నాంచారయ్య, రామిరెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రానికి 4.70 లక్షల గృహాలు మంజూరు చిలకలపూడి(మచిలీపట్నం):కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 4.70 లక్షల గృహాలు కేటాయించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న భూదందాలకు నిరసనగా బీజేపీ భూ రక్షణ దీక్ష కార్యక్రమాన్ని శనివారం కలెక్టరేట్ సమీపంలో నిర్వహించారు. కన్నా మాట్లాడుతూ ఎన్ఆర్ఈజీఎస్కు ఇంత రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌కు ఎక్కువ నిధులు కేటాయించిందన్నారు. నరేంద్రమోడీ, బీజేపీ ప్రభుత్వం అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. బీజేపీ రాష్ట్ర కో–ఇన్చార్జ్ సునీల్ థియోడర్ మాట్లాడుతూ చంద్రబాబు దొంగ కాదని గంజ దొంగగా అభివర్ణించారు. కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మాట్లాడుతూ దళితులు, వెనుకబడిన వర్గాల వారు కూలీ, నాలీ చేసుకుంటూ సంపాదించుకున్న భూమిని కూడా వదలకుండా లాక్కోవటం దుర్మార్గమన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబుకు కుటుంబరావు, బుద్దా వెంకన్నలు బ్రోకర్లుగా మారారన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు దారా సాంబయ్య, తురగా నాగభూషణం, ఆర్గనైజింగ్ సెక్రటరీ జీఆర్ రవీంద్రరాజు, మైనార్టీ మోర్చ నాయకులు షేక్ బాజీ, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జి ఆలపాటి లక్ష్మీనారాయణ, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి కూనపరెడ్డి శ్రీనివాసరావు, నాయకులు పంతం గజేం ద్ర, వైవీఆర్ పాండురంగారావు పాల్గొన్నారు. -
సోనియాను ఇటలీ దెయ్యం అన్నారు..
-
‘దొంగలకు పెద్దదొంగ చంద్రబాబు’
సాక్షి, ఏలూరు : చంద్రబాబు ఆధ్యర్యంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో శనివారం నిర్వహించిన బీజేపీ ప్రజా ఆవేదన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ.. ఏపీలో దోపీడి పాలనకు వ్యతిరేకంగా ఈ ధర్నా నిర్వహించామన్నారు. టీడీపీ నేతలు రాష్ట్రాన్ని ఇష్టానుసారంగా దోచుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో భూ అక్రమాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దొంగలకు కాపలా కాస్తున్న పెద్ద దొంగ చంద్రబాబు నాయుడు అని విమర్శించారు. ఆయన రాజకీయ జీవితమంతా నమ్మక ద్రోహం, మోసాలతోనే సాగిందన్నారు. చంద్రబాబు అవినీతి, అక్రమాలు, దోపీడీ గురించి వంద పేజీల పుస్తకం రాసినా సరిపోదని ఎద్దేవా చేశారు. మోసం చేయడంలో బాబు దిట్ట నమ్మిన వారి మోసం చేయడంలో చంద్రబాబు నాయుడు దిట్ట అని కన్నా విమర్శించారు. రిజర్వేషన్ల పేరుతో పలు కులాలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబును నమ్మి ఓట్లు వేసిన మహిళలకు రుణమాఫీ చేయకుండా మోసం చేశారన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు. చంద్రబాబు ప్రచారదాహానికి గోదావరి పుష్కరాల్లో 29 మంది పేదలు బలి అయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి పట్టిన శని అని చెప్పిన చంద్రబాబు ఆ పార్టీతో ఎలా పొత్తు పెట్టుకుంటున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఐటీ దాడులు జరుగుతుంటే చంద్రబాబుకి ఉలికిపాటు ఎందుకుని ప్రశ్నించారు. బాబు సీఎం కావడానికి వెన్నెముకగా నిలిచిన పశ్చిమ గోదావరి జిల్లాకు ఆయన చేసిన అభివృద్ది శూన్యమన్నారు. 2019లో అభివృద్ధి కావాలో.. అవినీతికావాలో ప్రజలే తేల్చుకోవాలని కన్నా పిలుపునిచ్చారు. -
ఏపీని అప్పులమయంగా మార్చింది
-
‘పర్యావరణాన్ని ఎలా నాశనం చెయ్యాలో చెప్తావా బాబూ..’
సాక్షి, పశ్చిమగోదావరి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా కలక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. కొవ్వూరులో జరిగిన పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షునిగా కోడూరి లక్ష్మీనారాయణ ప్రమాణస్వీకారోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయనతో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వ అవినీతిని తూర్పారాబట్టారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం పెద్ద డ్రామా కంపెనీల తయారయిందని అన్నారు. లిక్కర్, ఇసుక మాఫియా ఆగడాలకు కొవ్వూరు నియోజకవర్గాన్ని అడ్డాగా మార్చారని ధ్వజమెత్తారు. అడ్డగోలు ఇసుక, మట్టి తవ్వకాలతో పర్యావరణాన్ని కాలరాస్తున్న చంద్రబాబు పర్యావరణంపై ఐక్యరాజ్యసమితి సమావేశంలో మాట్లాడతాననడం.. దెయ్యాలు వేదాలు వల్లించడమేనని ఎద్దేవా చేశారు. ఉచిత ఇసుక పేరుతో ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టి టీడీపీ నేతల జేబుల్లోకి నేరుగా తీసుకెళ్లడమే బాబు ఉద్దేశమని కన్నా ఆరోపించారు. -
చంద్రబాబు పచ్చి అవకాశవాది
-
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం‘‘ చంద్రబాబు’’
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంతో ప్రజల ముందుకు వచ్చి డ్రామా వేస్తారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పచ్చి అవకాశవాదని విమర్శించారు. గతంలో కాంగ్రెస్‌ను దూషించి ఇప్పుడు చేతులు కలపటం దారుణమని అన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పుట్టిందని గుర్తుచేశారు. టీడీపీ డ్రామా కంపెనీ అని, పార్టీ సిద్ధాంతం అంటూ ఏమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలో చంద్రబాబు కన్నా అవినీతిపరుడు మరొకరు లేరని తేల్చిచెప్పారు. ఆపరేషన్ గరుడ అంటూ కొత్త నాటకంతో సినీనటుడు ముందుకు వచ్చాడని పేర్కొన్నారు. స్వలాభం కోసం చంద్రబాబు ఎవరితోనైనా చేతులు కలుపుతారని ధ్వజమెత్తారు. -
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు
-
అసమర్థ ప్రభుత్వం మీది కాదా?
గుంటూరు: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి మరోసారి బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖాస్త్రం సంధించారు. పదోసారి మరో ఐదు ప్రశ్నలు సంధించారు. ఇలా మొత్తం ఇప్పటి వరకు పంపిన 50 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని లేఖ ద్వారా డిమాండ్ చేశారు. ఆ ప్రశ్నలు ఇవే.. ప్రశ్న నెంబర్ 46: మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో అవినీతి రహిత, సుపరిపాలనను అందిస్తామని వాగ్దానం చేశారు. ప్రతి నియోజకవర్గంలో బహిరంగ సభను ఏర్పాటు చేసి ‘మా ప్రజా ప్రతినిధులు గానీ, మా నాయకులు గానీ చేసిన ఒక్క అవినీతి పనినైనా చెప్పగలరా’ అని ప్రజలను అడిగే ధైర్యం ఉందా? మీ ఎంఎల్ఏ, ఎంపీ, ఎంఎల్సీల అవినీతి అరాచకాలపై ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధమా? సీబీఐ విచారణకు సిద్ధమా? ప్రశ్న నెంబర్ 47: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మొదట ర్యాంక్ వచ్చిందని చెబుతున్నారు కదా! ఈ నాలుగు సంవత్సరాలలో మీ పచ్చ నాయకులు, ప్రజా ప్రతినిధులు తమవి గానీ తమకు సంబంధించినవి గానీ ఎన్ని పరిశ్రమలను, వ్యాపారాలను ఇతర రాష్ట్రాలలో పెట్టారు? మన రాష్ట్రంలో ఎన్ని పెట్టారు? నిజాయతీగా ప్రజలకు చెప్పగలరా? ప్రశ్న నెంబర్ 48: బీజేపీ మీద కోపంతో బ్యాంకింగ్ వ్యవస్థను కుప్పకూల్చాలని ప్రయత్నించడం లేదా? తద్వారా కోట్లాది ప్రజలను గందరగోళంలోకి నెట్టాలని చూడటం లేదా? డిమానిటైజేషన్, డిజిటల్ కరెన్సీని బహిరంగంగా బలపరచి, ఈ మధ్య కాలంలో కావాలని కుట్రపూరితంగా బ్యాంకింగ్ వ్యవస్థ మీద బాధ్యతారాహిత్య ప్రకటనలను చేస్తూ ప్రజలలో లేనిపోని అనుమానాలు లేవనెత్తుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం లేదా?. రాజ్యంగపదవిలో ఉన్న ఒక పార్టీ అధ్యక్షుడు చేయవలసిన పనేనా ఇది? మీ కుట్రపూరిత ప్రకటనల వల్ల ఒక్కసారిగా బ్యాంకింగ్ వ్యవస్థ, ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలితే ఈ దేశం, ప్రజలు ఏమి కావాలి.. మీ స్వార్థం కోసం ద్రోహం చేయవచ్చా? ప్రశ్న నెంబర్ 49: వెనకబడిన జిల్లాల అభివృద్ధికి అహర్నిశలూ పాటుబడుతున్నామని చెప్పే మీరు వెనకబడిన విజయనగరం జిల్లా అభివృద్ధిని తుంగలో తొక్కలేదా? సాగునీటికి తాగునీటికి ఎంతో ముఖ్యమైన తారక రామ తీర్థ సాగర్ ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడం వల్ల ఆ ప్రాజెక్టు అటక ఎక్కిన వాస్తవం కాదా?. తోటపల్లి రిజర్వాయర్ ఫీల్డ్ చానల్స్‌ను పూర్తి చేయలేదు. వెంగళరావు సాగర్ అదనపు ఆయకట్టు పెంపుదల పక్కన పెట్టేశారు. మీ మేనిఫెస్టోలో పెట్టిన సాలూరు బైపాస్‌ను మర్చిపోయారు. జిల్లాలోని జూట్ మిల్లులను తెరిపించడంతో విఫలమై 10 వేల మంది కార్మికుల భవితవ్యాన్ని చీకట్లోకి నెట్టేసిన ఘనత మీది కాదా? వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు మీకుందా? ప్రశ్న నెంబర్ 50: ఎంతో వెనకబడిన ప్రకాశం, వైఎస్సార్ జిల్లాలకు వరప్రసాదిని అయిన వెలుగొండ ప్రాజెక్టు ఈరోజుకీ పూర్తి చేయలేని అసమర్థ ప్రభుత్వం మీది కాదా? 4.59 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు అందించే అత్యంత ప్రాధాన్యత గల ఈ ప్రాజెక్టునే పూర్తి చేయలేని అసమర్థ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు ఉందా? -
సీఎం చంద్రబాబుకు కన్నా బహిరంగ లేఖ
-
రెండుకళ్ల సిద్ధాంతంలో చంద్రబాబు రాటు దేలారు
-
‘బాబు 1500 రోజుల పాలన.. అవినీతి కుంభకోణాలు’
సాక్షి, విజయవాడ : సీఎం చంద్రబాబు పాలనపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు 1500 రోజుల పాలనలో 15 ప్రాజెక్టులైనా కట్టారా అని కన్నా నిలదీశారు. ఆయన మంగళవారం రాజమండ్రిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు 1500 రోజుల పాలనలో అవినీతి కుంభకోణాలు తప్ప ఏమీ లేవని మండిపడ్డారు. చంద్రబాబు అనుభవజ్ఞుడని అధికారం కట్టబెడితే అవినీతి పాలన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని చంద్రబాబు రాత్రికి రాత్రి పారిపోయి విజయవాడ వచ్చారని కన్నా పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏపీకి రావలసిన వేల కోట్ల రూపాయలను ఓటు నోటు కేసుకు భయపడి అడగడలేదని విమర్శించారు. ప్రత్యేక ప్యాకేజీని చంద్రబాబు అంగీకరించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్యాకేజీ ఇచ్చినందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు టీడీపీ నేతలు సన్మానాలు కూడా చేశారన్నారు. అంతేకాక ప్రధాని మోదీని అభినందిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. కాగా, చంద్రబాబు నాలుగేళ్ల పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలని కన్నా డిమాండ్ చేశారు. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. చంద్రబాబు అనుభవం అబద్దాలు ఆడటానికి ఉపయోగపడుతుందని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. -
టీడీపీ టార్గెట్‌గా కమలనాథుల విమర్శలు
-
‘కేంద్రం నిధులతో చంద్రబాబు అవినీతి’
సాక్షి, గుంటూరు : సీఎం చంద్రబాబు నాయుడి తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. బీజేపీ కార్యకర్తల సమావేశం శుక్రవారం గుంటూరులో జరిగింది. ఈ సమావేశానికి కేంద్రమంత్రి జేపీ నడ్డా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రులు కామినేని, మాణిక్యాలరావు, గోకరాజు గంగరాజు, పురందేశ్వరి, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ఏపీలో కుక్కను మేక అని నమ్మించే ప్రయత్నం చంద్రబాబు, ఆయన భజన మీడియా చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్న అది కేంద్రం సహకారంతోనే అని కన్నా అన్నారు. ‘అంతేకాక దేశంలో ఉన్న అన్ని ఎయిమ్స్‌లలో ఏపీకే అత్యధిక నిధులు కేటాయించారు. ఏపీకి అన్ని రంగాల్లో సింహాభాగం నిధులు కేటాయించారు. నాలుగేళ్ళుగా చంద్రబాబు కేంద్రం నిధులు తీసుకుంటూ అవినీతికి పాల్పడుతున్నారు. చంద్రబాబు చేసే అవినీతిని ప్రజలందరికి తెలియజేయాలి. బాబు తాను బురద పూసుకుంటూ.. దానిని మనకి పూయాలని చూస్తున్నాడు. అంతేకాక ఏపీలో బాబు మోసం చేయని కులం అంటూ ఉందా? వెనక్కి తిరిగి చూసుకుంటే బాబుదంతా అవినీతి చరిత్ర. త్వరలో ఇంటింటికి బీజేపీలో భాగంగా బాబు అవినీతిని ప్రజలందరికి వివరించాలని’ కన్నా లక్ష్మీనారాయణ సమావేశంలో పేర్కొన్నారు. మోదీ చరిష్మా ప్రపంచ వ్యాప్తంగా.. సమావేశంలో కేంద్రమంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రంగాలలో సమూలమైన మార్పులు తెచ్చారు. ‘దేశంలో అభివృద్ధి జరుగుతుందని ప్రతిపక్షం కూడా చెప్పక తప్పలేదు. ప్రధాని మోదీ వచ్చాక అవినీతి, లంచాలు కనుమరుగై పోయాయి. గత పాలనలో అవినీతి, లంచగొండితనం ప్రపంచ వ్యాప్తంగా మారుమోగింది. ప్రధాని చరిష్మా ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతుంది. మోదీ పని తీరుపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి. రైతులకు ఆదాయం పెంచడం కోసం వ్యవసాయంలో అనేక మార్పులు తెచ్చారు. మోదీ పాలనలో దేశం త్వరితగతిన ఎదుగుతుంది. మొదటి క్యాబినెట్లో పోలవరంకు నిధులు కేటాయించాం. ఏపీ అభివృద్ధిలో మా చిత్తశుద్దికి అదో నిదర్శనం’ కేంద్ర మంత్రి జేపి నడ్డా తెలిపారు. -
ఆ చేతులను నరకడమే బాబు నైజం
సాక్షి, విశాఖపట్నం : సాయం చేసిన చేతులను నరకడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నైజమని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ మండిపడ్డారు. గురువారం విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన బాబుపై నిప్పులు చెరిగారు. గత ఎన్నికల్లో చంద్రబాబు జనసేన, బీజేపీ కాళ్లు పట్టుకొని అధికారంలోకి వచ్చారని, నాలుగేళ్లు కలిసిఉన్న అనంతరం విమర్శలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు రావడం చంద్రబాబుకు ఇష్టం లేదని అందుకే వాటి గురించి ఇంకా సమాచారం ఇవ్వలేదని విమర్శించారు. ఉక్కు ఫ్యాక్టరీ అంశాన్ని చంద్రబాబు రాజకీయంగా వాడుకుంటున్నరని మండిపడ్డారు. కడప ఉక్కు గురించి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటి వరకూ నిర్వాసితుల వివరాలతో పాటు ఇతర సమాచారం ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఫీజబిలిటీ లేదని సెయిల్ చెప్పినా, రాయలసీమ వెనుకబడిన ప్రాంతం కావడంతో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కేంద్రం అంగీకరించిందన్నారు. టీడీపీ ప్రతీ అంశాన్ని రాజకీయం చేయడానికి యత్నిస్తోందంటూ ఆయన మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో ప్రజలకు చెప్పడానికి కొత్తగా హామీలు లేవని, అన్నీ 2014 ఎన్నికల్లోనే ఇచ్చి ప్రజలను మోసం చేశారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు కేంద్రంను నిందించడమే మేనిఫెస్టోగా సీఎం పనిచేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో విపరీతమైన అవినితి జరుగుతోందని కన్నా ఆరోపించారు. పోలవరం పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయని నిర్వాసిత గిరిజనులు ఆరోపించారని.. తప్పుడు పత్రాలు, రికార్డులు సృష్టించి భూములను లాక్కున్నారని విమర్శించారు. విశాఖ రైల్వే జోన్‌ను కూడా కేంద్రం ఇస్తుందని దానికి ఇంకా సమయం ఉందని తెలిపారు. ఏపీ అభివృద్ధి ధ్యేయంగా కేంద్రం నిధులు విడుదల చేస్తోందని అన్నారు. కానీ చంద్రబాబు మాత్రం అన్యాయం చేస్తున్నారంటూ బీజేపీ, కేంద్రంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో ఏపీ ప్రజలను ఓటు అడిగే హక్కు కేవలం బీజేపీ కి మాత్రమే ఉందని కన్నా అన్నారు. -
వెన్నుపోటు పొడవడం చంద్రబాబు సహజగుణం
-
కత్తి, పరిపూర్ణానంద ఎపిసోడ్: కన్నా ట్వీట్
సాక్షి, హైదరాబాద్ : లక్షలాది మంది హిందూవులు ఆరాధించే పరిపూర్ణానంద స్వామిని హౌజ్ అరెస్టు చేయడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంగళవారం ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు. పరిపూర్ణానంద హౌజ్ అరెస్టు అయిన జులై 9ను బ్లాక్ డేగా అభివర్ణించారు. కాగా, రాముడిని దూషిస్తూ కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పాదయాత్ర చేపడుతున్న పరిపూర్ణనంద స్వామిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఏ మతానికి చెందిన దేవుడిని లేక దేవతను ఉద్దేశించి తప్పుగా మాట్లాడేవారికి కఠిన శిక్షలు విధించేలా చట్టాన్ని తేవాలనే సదుద్దేశంతోనే స్వామి పాదయాత్ర తలపెట్టారన్నారు. ఇదేమైనా నేరమా అని ప్రశ్నించారు. మన పాలన ఇలా ఉందంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి స్వామీజీని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. July 9 was another black day in democracy as a Hindu sanyasi, Paripoornananda Swamiji, adored by lakhs of Hindus in Telugu States, was detained at his camp in Hyderabad by State police preventing from taking a paadayaatra. (1/2) — Kanna Lakshmi Narayana (@klnbjp) July 10, 2018 His crime was that he sought a legislation to be brought in facilitating "severe punishment for defaming or decrying Gods or Goddesses of any religion." What a great Governance we have ! Let wisdom dawn on Government and Swamiji be released (2/2) — Kanna Lakshmi Narayana (@klnbjp) July 10, 2018 -
నాలుగేళ్లలో బాబు రాష్ట్రానికి చేసింది శూన్యం
-
నాలుగేళ్లలో బాబు చేసిందేమీ లేదు: కన్నా
సాక్షి, ప్రకాశం: చంద్రబాబు నాలుగేళ్లలో జగన్ మోహన్ రెడ్డిని, పవన్ కల్యాణ్‌ని తిట్టుకుంటూ బతకడం తప్ప రాష్ట్రానికి చేసింది శూన్యమని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఆరోపించారు. ఒంగోలు బీజేపీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో దాడులు చేస్తూ సంస్కారంలేని వాడిగా బాబు ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు. గడిచిన నాలుగేళ్లలో చంద్రబాబు రాష్ట్రంలోని ఏ సెక్టార్‌కి మేలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం సొమ్ముతో రాష్ట్ర ప్రభుత్వం షో చేస్తోందని, కేంద్ర నిధులను టీడీపీ నేతలు దోచుకుంటున్నారని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్ట్‌ని బాబు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. రామాయపట్నం పోర్ట్ కోసం కేంద్రానికి ఎందుకు ప్రతిపాదనలు పంపడం లేదని ప్రశ్నించారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం వివరాలు అడుగుతుంటే ఇవ్వకుండా బాబు దొంగ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం పక్కా గృహాలు అధికంగా మంజూరు చేసిందని తెలిపారు. బాబు రాష్ట్రాన్ని దోచుకుంటుంటే.. ప్రజలు వలయంగా నిలబడాలా అని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే అవినీతి రహితంగా పాలన చేస్తామని కన్నా చెప్పారు. -
ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది
-
కేంద్రం ఇస్తున్న నిధులను టీడీపీ కాజేస్తుంది
-
విజయ డెయిరీ గాలికి.. హెరిటేజ్ డెయిరీకి అందలం..
సాక్షి, తిరుపతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవినీతి కోరల్లో కూరుకుపోయిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. టీడీపీ నేతలు బరితెగించి అవినీతికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రైతులను పట్టించుకోకుండా సీఎం చంద్రబాబు హ్యాపీ సండే కార్యక్రమాలు నిర్వహిస్తూ హ్యాపీగా ఉంటున్నారని మండిపడ్డారు. నయవంచన దీక్షలను ఆపి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. చిత్తూరు డెయిరీని గాలికి వదిలేసిన చంద్రబాబు సొంత హెరిటేజ్ డెయిరీని అందలం ఎక్కించారని ఆరోపించారు. చిత్తూరులోని చక్కెర ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. -
కన్నా లక్ష్మీ నారాయణపై చెప్పుల దాడి
-
కన్నా లక్ష్మీ నారాయణపై చెప్పుల దాడి
సాక్షి, నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణపై చెప్పుల దాడి జరిగింది. బుధవారం నెల్లూరు జిల్లాలో కావలిలో ర్యాలీ నిర్వహిస్తున్న ఆయనపై తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్త ఒకరు చెప్పులు విసిరారు. దీంతో బీజేపీ కార్యకర్తలు అతడిని చితకబాదారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలిస్తున్నా, వెంబడించి మరీ చావబాదారు. అనంతరం చెప్పుల దాడికి నిరసనగా నిరసనగా బీజేపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. రాష్ట్రంలో టీడీపీ రౌడీయిజాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. కాగా, చెప్పుల దాడి ఘటనపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్రంగా స్పందించారు. టీడీపీ నేతలు కొరివితో తల గోక్కుంటున్నారని హెచ్చరించారు. తన ఇంటిపైకి కూడా టీడీపీ నాయకులు రౌడీలను పంపిస్తున్నారని ఆరోపించారు. హోం మంత్రి, డీజీపీ, గవర్నర్లను ఈ విషయంపై కలిశామని గుర్తు చేశారు. రాష్ట్రానికి నాలుగేళ్లలో ఏం చేశామనే విషయాన్ని ప్రజలకు చెప్పడానికే పర్యటన చేస్తున్నట్లు వెల్లడించారు. పర్యటన విజయవంతం అయితే ఓడిపోతామని భయపడుతున్న చంద్రబాబు ఇలాంటి దాడులకు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. -
‘నిధులు మావి.. ప్రచారాలు మీవా’
సాక్షి, నెల్లూరు: జన్మభూమి కమిటీల పేరుతో తెలుగుదేశం పార్టీ నేతలు నిధులను దిగమింగుతున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం ఏం చేసిందో, శ్వేతపత్రం విడుదల చేయగలదా అని ప్రశ్నించారు. రైతులకు నకిలీ విత్తనాలు అమ్ముతున్నా పట్టించుకునే దిక్కు లేదు.. చేనేత రంగానికి ఏదేదో చేశామని చెప్తున్నారని, అసలు రుణాలు ఎంతవరకు మాఫీ చేసారో చెప్పగలరా అని నిలదీశారు. హౌస్ ఫర్ ఆల్ స్కీంలో కాంట్రాక్టర్లును మేపుతూ ప్రభుత్వం కమీషన్లు తీసుకుంటోందని ఆరోపించారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ప్రతి అభివృద్ధి కేంద్రం నిధులతోనే జరుగుతున్నాయన్నారు. నిధులు తమవి.. ప్రచారాలు మీవి.. పథకాలు మీ కార్యకర్తలకా.. ఇదెక్కడి న్యాయమని ఆయన ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. చంద్రబాబు రాజకీయ లబ్దికోసం యూటర్న్ తీసుకుని ప్రజలని పక్కదారి పట్టిస్తున్నారన్నారు. ప్రత్యేక ప్యాకేజి తీసుకొంటూ.. కేంద్రం ఏమీ చేయలేదని చెప్పడం సరికాదన్నారు. -
రాయలసీమ అభివృద్ధికి చంద్రబాబు అడ్డుపడుతున్నారు
-
‘బాబు అవినీతి అందలమెక్కి కులుకుతున్నారు’
సాక్షి, కర్నూలు: రాష్ట్రంలో అవినీతి, అరాచక, అసమర్థత పాలన సాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కడప ఉక్కు పరిశ్రమ సమాచారాన్ని కేంద్ర ఉక్కు శాఖా మంత్రికి ఇవ్వకుండా.. ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎం రమేష్‌తో దీక్ష చేయిస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు అవినీతి అందెలమెక్కి కులుకుతున్నారని అన్నారు. సోమ్ము మాది.. అవినీతి మీది అని మండిపడ్డారు. బాబు మీకు దమ్ముంటే రాష్ట్ర అభివృద్ధిపై రాష్ట్ర వాటా, కేంద్రం వాటాపై శ్వేతపత్రం విడుదల చేయండని డిమాండ్ చేశారు. దేశంలో పేదరిక నిర్మూలన కోసం ప్రధాని నరేంద్ర మోదీ 150 సంక్షేమ పథకాలు ప్రవేశపేట్టారని గుర్తుచేశారు. 2019 ఎన్నికల్లో బీజేపీ గెలిచి అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. బాబు బీజేపీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టి ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారని తెలిపారు. బాబులో ఒక అపరిచితున్ని చూస్తున్నామని కన్నా అన్నారు. జిల్లాకు నాలుగేళ్లలో కేంద్రం 14 విద్యా సంస్థలు నెలకొల్పిందని పేర్కొన్నారు. తక్కువ ఫీజుతో ప్రైవేట్ స్కూళ్లలో చదువుకునే అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. -
విజయవాడలో బీజేపీ నేతల ధర్నా