
సాక్షి, అమరావతి : అక్రమ కట్టడాలన్నింటి కూల్చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చర్చలను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచన మంచిదే అన్నారు. కరువు ప్రాంతాల సాగు, తాగు నీటి కష్టాలు తీర్చే దిశగా చర్చలు జరగాలని కోరుకున్నారు. కేసులున్నవారే బీజేపీలో చేరుతున్నారనడం సరి కాదన్నారు. నిందితుల విషయంలో చట్టం తన పని చేసుకుపోతుందని తెలిపారు. పార్టీ ఫిరాయింపులుపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయంపై తానేమి స్పందించనన్నారు.
Comments
Please login to add a commentAdd a comment