హైదరాబాద్, సాక్షి: బీఆర్‌ఎస్ అధినేత.. తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి గురువారం పరామర్శించారు. ఉదయం తాడేపల్లి నుంచి హైదరాబాద్ బయలుదేరిన సీఎం జగన్.. 11:30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి స్వాగతం పలికారు.
అనంతరం బంజారాహిల్స్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లారు. ఏపీ సీఎం రాక నేపథ్యంలో ఆ ప్రాంతంలో కోలాహలం నెలకొంది. కేసీఆర్ తనయుడు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏపీ సీఎం జగన్‌కు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఏపీ సీఎం జగన్.. కేసీఆర్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
కేసీఆర్ పరామర్శ అనంతరం.. లోటస్ పాండ్‌కు వెళ్లారు ఏపీ సీఎం జగన్. అరగంట అక్కడ గడిపి ఆ తర్వాత బేగంపేట ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. బేగంపేట నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి.. అక్కడి నుంచి తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు.
గత నెలలో కేసీఆర్ ప్రమాదవశాత్తు జారిపడడంతో ఎడమ తుంటికి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ అయిన అనంతరం తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
#BRS working president @KTRBRS reaches his father #KCR's residence in Banjara Hills to welcome #YSRCP chief, #AndhraPadesh CM @ysjagan who is arriving in #Hyderabad today to meet #KCR and enquire his health condition pic.twitter.com/bafWQxgtB1
— L Venkat Ram Reddy (@LVReddy73) January 4, 2024
Comments
Please login to add a commentAdd a comment