‘అభాసుపాలై పరువు పోగొట్టుకోవద్దు’ | Malladi Vishnu Fires On BJP Leaders | Sakshi
Sakshi News home page

బీజేపీ నేతలపై మల్లాది విష్ణు ఫైర్‌

Published Tue, Jul 21 2020 5:16 PM | Last Updated on Tue, Jul 21 2020 5:45 PM

Malladi Vishnu Fires On BJP Leaders - Sakshi

మల్లాది విష్ణు

సాక్షి, విజయవాడ: అమ్మఒడి నిధులకు సంబంధించి బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘అమ్మఒడి నిధులపై రాష్ట్ర బీజేపీ నేతల ఆరోపణలు సరికాదు. పరిజ్ఞాన లోపంతో కన్నా లక్ష్మీనారాయణ, విష్ణువర్ధన్‌రెడ్డి ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌లోని అమ్మఒడి లబ్దిదారులకి రాష్ట్ర బడ్జెట్ నుంచే నిధులు కేటాయించారు. ఆలయాల హుండీలు, భక్తుల కానుకల నుంచి నిధులిచ్చారనటం అవివేకం. బ్రాహ్మణ కార్పొరేషన్ దేవాదాయ శాఖలో భాగం అయినంత మాత్రాన నిందలు సరికాదు. సమగ్ర సమాచారం తెలుసుకొని మాట్లాడితే గౌరవంగా ఉంటుంది. అరకొర సమాచారంతో మాట్లాడి అభాసుపాలై మరోసారి పరువు పోగొట్టుకోవద్దు' అంటూ బీజేపీ నాయకులకు మల్లాది విష్ణు సూచించారు. (ఓటేసిన జనమే టీడీపీ ఎమ్మెల్యేని ఛీ కొట్టారు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement