vishnu vardhan reddy
-
రౌడీ నేత.. భూముల మేత!
ఆయన అక్రమాలు వింటే ఆశ్చర్యపోవాల్సిందే! దౌర్జన్యాలకు అంతేలేదు. రౌడీలను, కేడీలను ప్రోత్సహిస్తూ.. ఇప్పటికీ కొన్ని గ్రామాలను శాస్తిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఎన్నికల్లోనూ గొడవలు సృష్టించడం ఈయనకు రివాజుగా మారింది. కబ్జాలకు పాల్పడుతూ.. ప్రజలను భయభ్రాంతలకు గురిచేస్తూ.. టీడీపీ నేత ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. రౌడీ రాజకీయం చేస్తున్న ఈయనను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రోత్సహించడం ఆ పార్టీ కార్యకర్తలను విస్మయానికి గురిచేస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో విష్ణు అనుచరుడికి టిక్కెట్ ఇవ్వడం.. నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా వినకపోవడం.. తదితర పరిణామాలను చూస్తుంటే టీడీపీ ఎలాంటి ఎజెండాతో ప్రజల్లోకి వెళ్తుందో అర్థమవుతోంది! కర్నూలు: టీడీపీ కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జ్ ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి వివాదాలు సృష్టిస్తూ.. ముఠా కక్షలను ప్రోత్సహిస్తూ రాజకీయాలు చేస్తున్నారు. పచ్చని పల్లెలో గొడవలకు ఆజ్యం పోస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. 1985 నుంచి 1995 వరకు కర్నూలు, సి.బెళగల్, గూడూరు, కల్లూరు మండలాల్లోని ఎన్నో గ్రామాల్లో ఫ్యాక్షన్ గొడవలకు ఈయనే కారణమని విమర్శలు ఉన్నాయి. పర్ల, పోల్‌కల్, కొంతలపాడు, బురాన్‌దొడ్డి, పులకుర్తి, మునగాల, సుంకేసుల తదితర గ్రామాల్లో హత్యలు చేసిన వారిని ఈయన ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికలు జరిగిన ప్రతి సందర్భంలోనూ ఏదో విధంగా గొడవలు సృష్టించడం, ప్రజలను భయాబ్రాంతులకు గురిచేయడం ఈయనకు అలవాటుగా మారింది. ఎన్నికల్లో అశాంతిని నెలకొల్పి గొడవలు సృష్టించడంలో ఈయన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా పోలీసులు రికార్డుల్లో నమోదయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో తాను సూచించిన వ్యక్తి బొగ్గుల దస్తగిరికి సీటు ఇస్తేనే పనిచేస్తాను, లేదంటే ఎవరికి టికెట్ ఇచ్చినా ఓడిస్తానని అధిష్టానానికి అల్టిమేటం పెట్టి తన పట్టును సాధించుకున్నారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబుతో పట్టుబట్టి బూర్ల రామాంజినేయులకు అసెంబ్లీ టికెట్ సాధించుకున్నా విష్ణు సొంత గ్రామాలైన ఎదురూరు, దూద్యాల, కొంతలపాడు, సుంకేసుల గ్రామాల్లో ఆ పార్టీకి మెజార్టీ రాకపోవడం గమనార్హం. కప్పగంతులు ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డికి రాజకీయాల్లో విలువలు లేవు. పార్టీలు మారడం ఈయనకు రివాజుగా మారింది. ఈయన రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీతో మొదలైంది. 1994లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పట్లో విజయభాస్కర్‌రెడ్డితో విభేదించి 1998లో టీడీపీలో చేరారు. అనంతరం 2004లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పాణ్యం నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. మళ్లీ టీడీపీలోకి చేరి కోడుమూరు నియోజకవర్గంలో పెత్తనం నడుపుతున్నారు. విష్ణువర్ధన్‌రెడ్డిపై నమోదైన కేసులు ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసీటీ, దౌర్జన్యాలు, గొడవలు వంటి కేసులు నమోదయ్యాయి. కర్నూలు తాలుకా పోలీస్‌స్టేషన్, మూడు, నాలుగవ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో 8 కేసులు ఉన్నాయి. సెక్షన్ 355, 365, 323 రెడ్‌విత్, ఐపీసీ 34 సెక్షన్ల కింద 244/2011 కేసు నమోదైంది. 147, 447, 506 సెక్షన్ల కింద క్రైం నెంబర్ 179/2013 ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. దీంతో పాటు క్రైం నెంబర్ 45/2009, 40/2016, 21/2013, 232/2019, 244/2011, 179/2013, 45/2016, 85/2019 పలు కేసులు నమోదయ్యాయి. ఎక్కువగా ఎస్సీ, ఎస్టీలను వేధింపులకు గురిచేసి దాడులు చేసిన కేసులే విష్ణువర్ధన్‌రెడ్డిపై నమోదయ్యాయి. దౌర్జన్యంగా భూ కబ్జాలు ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి వందల ఎకరాల భూమిని ఆక్రమించుకుని దౌర్జన్యంగా సాగు చేసుకుంటున్నాడు. తొలిశాపురం సమీపంలోని వందల ఎకరాల వక్ఫ్ బోర్డు భూమిని ఆక్రమించుకుని తన అనుచరులతో సాగు చేయిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఎదురూరు గ్రామంలో 70 ఎకరాలు చెన్నకేశవులస్వామి భూమిని ఆక్రమించుకుని ఏళ్ల తరబడి సాగుచేసుకుంటున్నాడనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ అధికారులు ఒత్తిడి తీసుకురాగా ఈ భూములకు కొంతవరకు భూమిశిస్తు చెల్లించినట్లు సమాచారం. కేసీ కెనాల్‌కు రంధ్రం పెట్టి ప్రతి ఏటా ఎదురూరు గ్రామం దగ్గర వందల ఎకరాల తన భూములకు అక్రమంగా నీటిని మళ్లించుకుని వరి సాగుచేసుకుంటున్నాడు. గార్గేయపురంలో 5 ఎకరాల చెరువు భూమిని నీళ్లు లేని సమయంలో సాగు చేసుకునేందుకు పేదవారికి పట్టాలిచ్చారు. ఆ భూమి హైవే రోడ్డుకు పక్కనే ఉండడంతో విష్ణువర్ధన్‌రెడ్డి కన్నుపడింది. కోట్ల విలువ చేసే ఆ భూమిని తన అనుచరుల మీద కొనుగోలు చేశాడు. ఆరు నెలల క్రితం ఆ చెరువును పూడ్చేందుకు ప్రయత్నించగా అధికారులు విచారణ చేసి పూడిక పనులను నిలుపుదల చేయించారు. ఎన్నికల్లో విష్ణు సృష్టించిన గొడవలు ఇవీ.. ► ఎన్నికలు వచ్చాయంటే విష్ణువర్ధన్‌రెడ్డి పూనకాలు వచ్చినట్లు ఊగిపోతాడు. ఎన్నికల్లో నేరుగా తానే స్వయంగా వెళ్లి దొరికిన ఆయుధాలతో దాడులకు తెగబడడం ఆయనకు అలవాటుగా మారిపోయింది. ► 1985లో పార్లమెంట్ ఎన్నికల్లో ఏరాసు అయ్యపురెడ్డికి కేఈ సోదరులు మద్దతిచ్చి మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఓటమికి కారణమయ్యారనే కోపంతో కేఈ సోదరుల ఇంటిపై రౌడీమూకలతో దాడి చేయించాడు. అప్పట్లో కర్నూలు పాతబస్టాండ్ మొత్తం బీభత్సకరమైన వాతావరణం ఏర్పడింది. ► 1994లో ఆలంపూర్ కాంగ్రెస్ అభ్యరి్థగా ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి పోటీచేసిన సమయంలో ప్రత్యర్థి కొత్తకోట ప్రకా‹Ùరెడ్డి బ్యాలెట్ బాక్స్‌ల్లో ఇంకు పోశాడన్న నెపంతో విష్ణువర్ధన్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి కొత్తకోట ప్రకా‹Ùరెడ్డి అనుచరులను దాదాపు 35 మందిని గాయపరిచినట్లు అలంపూర్ పీఎస్‌లో కేసు నమోదైంది. ► 1998లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డికి మద్దతుగా ఉంటూ ఆ ఎన్నికలో స్వయంగా దౌర్జన్యానికి దిగాడు. కల్లపరిలో తెలుగుదేశం పార్టీ ఏజెంట్‌పై దాడి చేసేందుకు ప్రయతి్నంచగా గ్రామస్తులంతా తిరగబడ్డారు. చివరకు పరిస్థితి విషమించడంతో ఒక ఇంటిలో విష్ణువర్ధన్‌రెడ్డిని బంధించారు. ప్రజలు శాంతించిన తర్వాత ఆ గ్రామ నాయకుడు యువీ రాజారెడ్డి వచ్చి విష్ణును క్షేమంగా ఊరు దాటించాడు. ► 1999 ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో కాంగ్రెస్ పారీ్టకి పడిన ఓట్లు టీడీపీ అభ్యర్థి టీజీ వెంకటేష్ కు పడుతున్నాయని పుల్లారెడ్డి కాలేజీలో పెద్ద ఎత్తున విష్ణువర్ధన్‌రెడ్డి గొడవ చేశాడు. ఓ దశలో అప్పటి ఎమ్మెల్యే ఎం.శిఖామణిపై దాడి చేసేందుకు ప్రయతి్నంచగా విష్ణును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ► మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడిగా తొలగించాలని కర్నూలు జిల్లా నుంచి 50 నుంచి 60 లారీల్లో జనాలను హైదరాబాద్‌కి తీసుకెళ్లి పీసీసీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున అలజడి సృష్టించాడు. ► 2014 ఎన్నికలనంతరం కోడుమూరు నియోజకవర్గంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పారీ్టకి చెందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లను తీసుకెళ్లి తెలుగుదేశం పారీ్టలో చేరి్పంచి కోడుమురు నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జీగా పవర్ పెత్తనం నడిపాడు. ► 2019 ఎన్నికలో తెలుగుదేశం పారీ్టలో ఉంటూ తన చిరకాల ప్రత్యర్థి అయిన కొత్తకోట ప్రకాష్‌రెడ్డిపై గొందిపర్లలో దాడికి తెగబడ్డాడు. తన అనుచరులను ఉసిగొల్పి కొత్తకోట ప్రకాష్‌రెడ్డిపై దాడి చేయించిన ప్రయత్నం అప్పట్లో సంచలనం రేకేత్తించింది. -
ప్రజలకు ప్రధానికి షర్మిల క్షమాపణలు చెప్పాలి
-
కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన నాగం, విష్ణువర్ధన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి మంగళవారం బీఆర్ఎస్లో చేశారు. హైదరాబాద్‌లో తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వీరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. నాగం జనార్ధన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డిని హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి తోడుగా రావాలని కోరినట్లు పేర్కొన్నారు. విష్ణురెడ్డి భవిష్యత్తుపై తాను భరోసా ఇస్తున్నట్లు తెలిపారు. నాగం జనార్ధన్ రెడ్డి నేను అనేక పోరాటాలు చేశామని చెప్పారు. జూబ్లీహిల్స్‌లో పాత, కొత్త నేతలు అందరూ కలిసి పనిచేశాలని పిలుపునిచ్చారు. ఈసారి పాలమూరులో 14కు 14సీట్లు గెలవాలని ఆకాంక్షించారు. తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని సీఎం తెలిపారు. ఎంపీ ప్రభాకర్ రెడ్డి ప్రాణాలు తీసే ప్రయత్నం చేశారన్న కేసీఆర్.. మరోసారి బీఆర్ఎస్ను గెలిపించి ఇలాంటి శక్తులకు బుద్ది చెప్పాలని అన్నారు. చదవండి: ‘ఇంకా ఆధారాలు కావాలా?’.. ఎంపీ దాడిపై కేటీఆర్ ట్వీట్ -
కలలో కూడా ఈ పరిస్థితి వస్తుందనుకోలేదు: పీవీఆర్
సాక్షి, హైదరాబాద్: పీజేఆర్ కొడుకు, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి ఇంటికి మంత్రి హరీష్‌రావు వెళ్లారు. హైదరాబాద్‌లోని విష్ణు నివాసంలో సోమవారం ఆయన్ను కలిసి బీఆర్ఎస్లో చేరాలని ఆహ్వానించారు. కాగా కాంగ్రెస్ జూబ్లీహిల్స్ టికెట్‌ను తనకు కాకుండా అజారుద్దీన్‌కు ఇవ్వడంతో విష్ణువర్దన్‌రెడ్డి అసహానం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే విష్ణువర్ధన్‌రెడ్డి ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసిన విషయం తెలిసిందే. దీంతో విష్ణు బీఆర్ఎస్లో చేరడం లాంఛనంగా మారింది. ఈ సందర్భంగా విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో ఈ పరిస్థితి వస్తుందని కలలోకూడా ఊహించలేదని పేర్కొన్నారు. మా నాన్న(పీజేఆర్) 35 ఏళ్లు, తాను 17 ఏళ్లు కాంగ్రెస్‌కు సేవ చేశామని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో గాంధీభవన్‌ను అమ్మేసే పరిస్థితులు వచ్చాయని విమర్శించారు. అతి త్వరలోనే తాను బీఆర్ఎస్లో చేరనున్నట్లు వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీలో విష్ణుకు సరైన గౌరవం కల్పిస్తామని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన చురుకుగా పాల్గొన్నారని తెలిపారు. విష్ణును బీఆర్ఎస్లోకి ఆహ్వానిస్తున్నామని, ఆయనకు బీఆర్ఎస్ మంచి భవిష్యత్తును ఇస్తుందని చెప్పారు. తెలంగాణ కోసం నిలబడిన వ్యక్తి విష్ణు అని, బీఆర్ఎస్లో చేరేందుకు సుముకుత వ్యక్తం చేశారని తెలిపారు. తాము, విష్ణు అయిదేళ్లు శాసనసభ సభ్యులుగా ఉన్నామని, అనేక ఉద్ధమాల్లో ఆయన తమతో కలిసి పోరాడినట్లు ప్రస్తావించారు. తెలంగాణ వాదులకు, ద్రోహులకు మధ్య యుద్ధం జరుగుతోందని హరీష్ రావు విమర్శించారు. పట్టపగలు డబ్బు కట్టలతో దొరకిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 5 కోట్లకు ఒక్కో ఎమ్మెల్యే టికెట్ అమ్ముకుంటున్నారని కాంగ్రెస్ నేతలే చెప్తున్నారని మండిపడ్డారు. పీసీసీ పదవిని కూడా కొనుక్కున్నారని ఆ పార్టీ నేతలే చెప్తున్నారని అన్నారు. కేసీఆర్ పాలనలో హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి జరగుతోందని, సీఎం పాలనలో హైదరాబాద్‌లో తాగునీటి సమస్య లేదని తెలిపారు. -
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో... కాంగ్రెస్‌కు పూర్వవైభవం లభించేనా?
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం ఆ పార్టీ తెలంగాణ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందనడం నిరి్వవాదాంశం. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతల్లో నిరాశనిస్పృహలే కని్పస్తున్నాయి. ప్రధానంగా నియోజకవర్గంలో పార్టీని నడిపించే యోధుడు ఆశించిన స్థాయిలో చురుగ్గా లేకపోవడమే కారణమంటూ పార్టీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. హైదరాబాద్: ఒకప్పుడు రాష్ట్రంలోనే అతి పెద్ద నియోజకవర్గం అది. జనహృదయ నేత పి.జనార్ధన్‌రెడ్డి (పీజేఆర్) అంటే ఖైరతాబాద్... ఖైరతాబాద్ అంటేనే పీజేఆర్ అనే విధంగా ఉండేది. గెలుపోటములతో సంబంధం లేకుండా ఆయన ప్రజల నడుమే ఉండేవారనడం.. ప్రజామద్దతు ఆయనకే ఉండేదనడం అతిశయోక్తికాదు. పీజేఆర్ అకాల మరణంతో ఆయన తనయుడు పి.విష్ణువర్ధన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించినా పీజేఆర్‌కు ఉన్న ఓర్పు, నేర్పు లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ప్రస్తుత జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రాంతంలో క్రమేపీ ఆ పార్టీ తన ప్రాబల్యాన్ని కోల్పోతూ వచ్చింది. ఇప్పటికీ పీజేఆర్ అభిమానులు, కాంగ్రెస్ నాయకులు పటిష్టంగా ఉన్నా సమర్థవంతంగా నడిపించే నాయకులు లేక పార్టీ చతికిల పడిపోయింది. దీంతో దశాబ్దాలకాలం పాటు వెన్నంటి నడిచిన కేడర్‌కు దిక్కులేకుండా పోయింది. ► అధికార పార్టీ ఒత్తిడిని తట్టుకోలేక మెజారిటీ నాయకులు పార్టీలు మారినా.. ఉన్న కొంత మంది పీజేఆర్‌ను మరువలేక పార్టీని వదలలేక పార్టీలోనే కొనసాగుతున్నారు. ► పీజేఆర్ తనయుడు మాజీ ఎమ్మెల్యే పీవీఆర్ కేవలం ఎలక్షన్స్ ముందు మాత్రమే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పీవీఆర్‌కు సత్తా ఉన్నా నియోజకవర్గంలో సమస్యలు, పార్టీలో యువతను సంఘటితం చేస్తూ పార్టీలో చురుకుగా పాల్గొనకపోవడం పెద్ద సమస్యగా మారింది. పి.విష్ణువర్ధన్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా చురుకుగా ఉండి, ఎప్పుడూ నియోజకవర్గంలోనే ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. క్రమేపీ ఆయనలోని మార్పుల వల్ల పార్టీ బలహీనంగా మారింది. ► ఆయన నివాసం కూడా దోమలగూడలో ఉండటంతో కార్యకర్తలు, నేతలకు ఒకింత సమస్యగానే మారింది. దీంతో కొత్త నాయకత్వం వైపు పలువురు సీనియర్ నేతలు ఎదురుచూపులు చూస్తున్నారు. ఇంతవరకూ పెద్దాయనపై ఉన్న గౌరవంతో ఈ నియోజకవర్గం పార్టీ స్థితిగతులపై దృష్టి సారించిన పార్టీ హైకమాండ్ మారుతున్న రాజకీయ పరిస్థితులపై సీరియస్‌గా దృష్టి సారించినట్లు సమాచారం. గతంలో... దివంగత పీజేఆర్ ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది తన సత్తా చాటుకున్నారు. జాతీయ స్థాయి నాయకుల మన్ననలు పొందారు. ఆయన మరణాంతరం జరిగిన ఉప ఎన్నికల్లో పీజేఆర్ తనుయుడు విష్ణువర్ధన్‌రెడ్డి విజయం సాధించారు. ఆ తరువాత నూతనంగా ఏర్పాటైన జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మరోసారి పి.విషువర్ధన్‌రెడ్డి విజయం సాధించారు. మొత్తంగా ఏడుగురు కార్పొరేటర్లలో నలుగురు కాంగ్రెస్ కార్పొరేటర్లు విజయం సాధించారు. ఆ తరువాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో విష్ణువర్ధన్‌రెడ్డి వరుస అపజయాలను మూటగట్టుకున్నారు. ► టీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి పగ్గాలు చేపట్టాక పార్టీలో నూతనోత్తేజం వస్తుందని అశించిన పార్టీ కేడర్‌కు నిరాశే మిగిలింది. ► మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి పనితీరుతో ఎలాంటి మార్పు రాకపోవడంతో పార్టీని బతికించుకోవడం కోసం తమ ఉనికిని కాపాడుకోవడం కోసం కొత్త నాయకత్వం వైపు చూడక తప్పడంలేదని సీనియర్లు భావిస్తున్నారు. ► సీనియర్ నేతలను సంప్రదించకుండా ఏక పక్షంగా నియామకాలు చేపట్టంపై అసంతృప్తి చెందిన నేతలు నియోజకవర్గంలో పార్టీ ప్రక్షాళన కోసం శ్రీకారం చుట్టారు. అజహరుద్దీన్ పర్యటనలో ఆంతర్యమేమిటో? కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, టీం ఇండియా మాజీ సారథి మహ్మద్ అజహరుద్దీన్ బుధవారం జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో పర్యటించారు. ముఖ్య నేతలను కలుసుకొని వివిధ అంశాలపై చర్చించినట్లు సమాచారం. నియోజకవర్గంలో అభ్యర్థులు గెలుపోటముల్లో ముస్లిం ఓట్లే కీలకం అయిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అజహరుద్దీన్‌ను బరిలోకి దింపితే ఎలా ఉంటుందో అనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. పార్టీ ఢిల్లీ అధిష్టానం సూచనల మేరకే అజహరుద్దీన్ పర్యటన సాగిందని ఆయా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గ బరిలో అధిష్టానం మాజీ ఎమ్మెల్యే పీవీఆర్‌కు మరో అవకాశం ఇస్తుందా.. కొత్త నేతలకు అవకాశం ఇస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి. -
టీడీపీలో ప్రశ్నార్థకంగా మారిన విష్ణువర్దన్‌రెడ్డి రాజకీయ భవిష్యత్
కర్నూలు: రాజకీయంగా కోడుమూరు నియోజకవర్గంలో ఓ వెలుగు వెలిగిన విష్ణువర్దన్‌రెడ్డి రాజకీయ భవిష్యత్ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. 2014లో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి టీడీపీ చేజిక్కించుకోవడంలో కీలకంగా వ్యవహరించిన విష్ణుకు కోడుమూరు నియోజకవర్గంలో ఆ పార్టీ పెద్దపీట వేసింది. అయితే ఇటీవల జరిగిన రాజకీయ పరిమాణాల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు కోట్ల, కేఈ సోదరులకే అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నారు. నేరుగా చెప్పకపోయినా విష్ణు పార్టీలో ఉన్నా లేనట్లుగానే అధిష్టానం వ్యవహరిస్తోంది. తాజాగా లోకేష్ పాదయాత్రలోనూ కోట్ల ఇచ్చిన రూట్ మ్యాప్‌నే పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో విష్ణు కూడా అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈనెల 2న యాత్ర కోడుమూరు నియోజకవర్గంలోకి ప్రవేశించగా బొకే అందజేయడంతో విష్ణు పాత్ర ముగిసింది. రెండోరోజు కోడుమూరులో బసచేసిన లోకేష్‌ను విష్ణు ప్రత్యేకంగా కలిసి మాట్లాడి వెళ్లిపోయారు. ప్రత్యక్షంగా ఆయనకు ఎక్కడా ప్రాధాన్యత దక్కకపోవడం టీడీపీలోనే చర్చనీయాంశంగా మారింది. టీడీపీని నమ్ముకుంటే ఏ స్థాయి నాయకులకై నా చివరకు ఇలాంటి అనుభవం తప్పదనే అభిప్రాయం వినిపిస్తోంది. -
చంద్రబాబు పై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఫైర్
-
ఘాటెక్కి.. చప్పబడ్డ విష్ణు విందు
సాక్షి, హైదరాబాద్: మాజీ సీఎల్పీ నేత పి.జనార్దన్‌రెడ్డి తనయుడు, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి అకస్మాత్తుగా సీనియర్ నాయకులను మంగళవారం తన ఇంటికి లంచ్‌కు పిలవడం కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది. పదిరోజుల క్రితం విష్ణు సోదరి విజయారెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి విష్ణువర్ధన్‌రెడ్డి రాష్ట్ర పార్టీ పెద్దలపై ఆసంతృప్తిగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోని హైదరాబాద్‌లోని సీనియర్ నేతలతోపాటు ఇతర ముఖ్యులను కూడా భోజనానికి ఆహ్వానించారు. పనిలో పనిగా తన అసంతృప్తిని సీనియర్లతో పంచుకోవాలని భావించినట్లుగా ప్రచారం జరిగింది. అయితే పిలిచిన నేతలంతా లంచ్‌కు వెళ్తారా లేదా అని ఆసక్తిరేపుతున్న సమయంలో విష్ణు మీడియాతో మాట్లాడుతూ సాధారణంగానే ప్రతీ ఏటా సీనియర్ నేతలను భోజనానికి ఆహ్వానిస్తుంటానని, పార్టీలో ఎవరు చేరినా తనకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కూడా రావాలని కోరారని, అయితే వారిద్దరు ఢిల్లీలో ఉండటంతో రాలేమని చెప్పారని విష్ణు పేర్కొన్నారు. అదే సమయంలో ఢిల్లీలో రేవంత్ మీడియాతో మాట్లాడుతూ విష్ణు తనను భోజనానికి రావాలని కోరారని చెప్పారు. హైదరాబాద్‌లో తన అభిమానులు, కార్యకర్తలతో సభ పెట్టుకుంటానని అడిగారని, అందుకు తాను అనుమతిచ్చినట్టు వెల్లడించారు. ప్రకటన తర్వాత దిగిన నేతలు... అటు రేవంత్‌రెడ్డి, ఇటు విష్ణువర్ధన్ ప్రకటనలతో సీనియర్ నేతలంతా ఆయన గృహానికి వెళ్లడం ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజ్ శ్రవణ్, గ్రేటర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ డాక్టర్ రోహిణ్‌రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి చామల కిరణ్‌రెడ్డి, జహీరాబాద్ కాంగ్రెస్ నేత మదన్మోహన్రావు, బెల్లయ్య నాయక్ తదితర నేతలు దోమల్‌గూడలోని విష్ణువర్థన్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. అసమ్మతి అనుకునేలోపు... విష్ణు ఆహ్వానించిన జాబితాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి లేరని చాలామంది నేతలు వెళ్లేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. చేరికలపై ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని, దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయాలని నేతలు భావించారు. అసమ్మతి గ్రూపును నడిపిద్దామని భావించిన నేతలకు తీరా విష్ణు ఇచ్చిన స్పష్టతతో మింగుడుపడకుండా అయినట్టు చర్చ జరుగుతోంది. కాగా, విందు అనంతరం వీహెచ్ మాట్లాడుతూ ఒకప్పుడు రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా పనిచేశానని, ఆయనను సోనియాగాంధీ నియమించినందున ఆయన నాయకత్వాన్ని బలపరుస్తానని, అదే సమయంలో రేవంత్‌రెడ్డి కూడా అందర్నీ కలుపుకొని వెళ్లాలని సూచించారు. పీజేఆర్ కుమారుడు విష్ణువర్దన్‌రెడ్డి కాంగ్రెస్‌లోనే ఉంటారని, ఈరోజు లంచ్ మీటింగ్‌తో అందరి అపోహలు తొలగిపోయాయని ఆయన తెలిపారు. తన సమస్యపై కేంద్ర నాయకత్వంతోనే మాట్లాడుతానన్నారు. -
ఇంటికే వస్తా అంటే రమ్మంటిని, కానీ, ఎక్కడా?: జూపల్లి
సాక్షి,నాగర్ కర్నూల్: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బీరం విష్ణువర్ధన్ రెడ్డి పరస్పర సవాళ్లతో కొల్లాపూర్‌లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈనేపథ్యంలో అవాంఛిత ఘటనలు జరగకుండా పోలీసులు అక్కడ భారీ ఎత్తున మోహరించారు. అయితే, చర్చలో పాల్గొనేందుకు జూపల్లి ఇంటికి బీరం ర్యాలీగా వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అరెస్టు చేశారు. ఈక్రమంలో ఎమ్మెల్యే బీరం నిరాధార ఆరోపణలను జూపల్లి మీడియా ఎదుట ఎండగట్టారు. చదవండి👉🏼 విరాట పర్వం.. 30 ఏళ్ల కిందట పేలిన తూటా శంకరన్న చేతిలో సరళ బలి రాత్రి నుంచి చూస్తున్నా.. ఎక్కడా? ‘నేను అంబేద్కర్ చౌరస్తాలో చర్చ పెడదామన్న. కాని చర్చకు ఇంటికే వస్తా అంటే స్వాగతం పలుకుతానని చెప్పా. నీ మాట ప్రకారమే రాత్రి నుంచి ఎదురుచూస్తున్నా. కానీ, ఎమ్మెల్యే రాలేదు. మూడున్నరేళ్లు ఎమ్మెల్యే ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది. అరెస్టు చేయించుకుని తప్పించుకుని పోయినవ్.. ముఖం చాటేసుకున్నవ్. ఎమ్మెల్యే మాట మార్చాడు. నేను మాట మార్చలేదు. హుస్సేన్ సాగర్ కారు ప్రమాదం, ఫ్రుడెన్షియల్ బ్యాంకు వ్యవహారాలపై ఎమ్మెల్యే అవాస్తవాలు మాట్లాడుతున్నాడు. అప్పు తీసుకుని వ్యాపారం చేసాం, ఇది తప్పు అన్నట్లుగా మాట్లాడితే ఎట్లా!. తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేయొద్దని సహచర మంత్రులే సూచించినా నేను వెనక్కి తగ్గలేదు. మిగతా మంత్రులపై ఒత్తిడి వస్తుంది వద్దన్నారు. వెయ్యి కోట్లిచ్చినా అమ్ముడు పోయే వ్యక్తిని కాను. నాది మచ్చలేని చరిత్ర. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద కోర్టులో కేసు వేసిందెవరు? నా పై నిరాధార ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే బీరంపై పరువు నష్టం దావా వేస్తా’అని జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. చదవండి👉🏼కొల్లాపూర్‌లో హై టెన్షన్.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెస్ట్ -
రైతు ఆర్థికాభివృద్ధే లక్ష్యం
గుంటూరు రూరల్: ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో శాస్త్రవేత్తలు పరిశోధనల ద్వారా అభివృద్ధి పరిచిన 24 రకాల నూతన వంగడాలు రైతులకు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నాయని ఉపకులపతి డాక్టర్ విష్ణువర్థన్‌రెడ్డి తెలిపారు. హార్టికల్చర్ విశ్వవిద్యాలయం 13 రకాల నూతన వంగడాలను అభివృద్ధి చేసిందన్నారు. రైతుల ఆర్థికాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గుంటూరు నగర శివారు లాం ఫాం వ్యవసాయ పరిశోధనా స్థానం, ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న అగ్రిటెక్–2021 ఎగ్జిబిషన్, అవగాహన సదస్సు ఆదివారంతో ముగిసింది. చివరి రోజు ముఖ్య అతిథిగా పాల్గొన్న వీసీ మాట్లాడుతూ.. పంటల్లో చీడ పీడలను తట్టుకుని నష్టాలను తగ్గించే విధానాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ ఎగ్జిబిషన్ ఎంతో ఉపయోగపడిందన్నారు. అన్ని జిల్లాల నుంచి రోజుకు 6 వేల మంది రైతులు ఈ సదస్సుల్లో పాల్గొన్నారని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా రైతుల కోసం ఏర్పాటు చేసిన 15 రకాల నూతన వంగడాలు, హైబ్రీడ్ వంగడాలు, సేంద్రియ ఉత్పత్తులు, సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన వ్యవసాయ యంత్రాలు, డ్రోన్ల ద్వారా వ్యవసాయం, ట్రాక్టర్లు, గొర్రులు, తదితరాలు రైతులను ఆకట్టుకున్నాయి. శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు.. రైతులతో చర్చలు జరిపి పంటల మార్పిడి, నూతన వ్యవసాయ విధానాలపై చర్చించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు, పాలక మండలి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
రైతు శ్రేయస్సే లక్ష్యం..
సాక్షి, అమరావతి: రైతు శ్రేయస్సే లక్ష్యంగా కృషిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఆశయసిద్ధికి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కట్టుబడి ఉందని వర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ ఎ.విష్ణువర్ధన్‌రెడ్డి చెప్పారు. దేశంలోనే వినూత్న ప్రయోగంగా ఖ్యాతిగాంచిన వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాలతో (ఆర్బీకేలతో) కలిసి అన్నదాతల సంక్షేమానికి, రైతు ఆదాయం రెట్టింపు చేసేందుకు విస్తృత చర్యలు చేపట్టామన్నారు. విశ్వవిద్యాలయం 50వ స్నాతకోత్సవం మంగళవారం తిరుపతిలోని ఎస్వీ వ్యవసాయ కళాశాలలో జరుగనుంది. వర్సిటీ చాన్సలర్, రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్‌గా పాల్గొనే ఈ స్నాతకోత్సవంలో విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయనున్నట్లు వైస్ చాన్సలర్ చెప్పారు. స్నాతకోత్సవం నేపథ్యంలో ఆయన సాక్షి ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. రైతు సొంతంగా విత్తనాన్ని తయారు చేసుకునేందుకు వర్సిటీ సహకరిస్తుందన్నారు. దీనివల్ల నాణ్యత పెరుగుతుందని, రైతుకు ఖర్చు తగ్గుతుందని చెప్పారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ఇప్పటివరకు 455 వంగడాల విడుదల యూనివర్సిటీ ఇప్పటివరకు హైబ్రిడ్ సహా 455 పంట వంగడాలను విడుదల చేసింది. 2020లో వర్సిటీ రాష్ట్రస్థాయిలో 22, జాతీయస్థాయిలో 10రరకాల వంగడాలను విడుదల చేసింది. బెల్లంపొడి తయారీకి, నాగజెముడుతో తయారు చేసే ఫ్రూట్‌బార్‌కు పేటెంట్లు వచ్చాయి. 13వ స్థానానికి చేరిన వర్సిటీ ర్యాంకు దేశంలో 74 వ్యవసాయ విశ్వవిద్యాలయాలుంటే గతేడాది వరకు ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ ర్యాంకు 31. ఇప్పుడు 13వ స్థానానికి చేరింది. మౌలికవసతులకు తొలి ప్రాధాన్యత రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి మౌలిక వసతుల కల్పన పెద్ద సమస్యగా మారింది. గుంటూరుకు సమీపంలోని లాం ఫాంలో ప్రధాన భవంతుల నిర్మాణం పూర్తికావొచ్చింది. తిరుపతిలో అగ్రి బిజినెస్ సెంటర్‌ను ముఖ్యమంత్రి, గవర్నర్ మంగళవారం ప్రారంభిస్తారు. ఈ ఏడాది లక్ష క్వింటాళ్ల లక్ష్యం వ్యవసాయంలో విత్తనం ఎంత నాణ్యతగా ఉంటే దిగుబడి అంత ఎక్కువగా ఉంటుంది. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా నాణ్యమైన విత్తనాన్నే సరఫరా చేయాలని ఆదేశించారు. దానికనుగుణంగానే రైతు సొంతంగా విత్తనాన్ని తయారు చేసుకునే కార్యక్రమానికి యూనివర్సిటీ శ్రీకారం చుట్టింది. 2020–21లో 43,064 క్వింటాళ్ల బ్రీడర్, ఫౌండేషన్ విత్తనాలను రైతులకు సరఫరా చేశాం. ఈ ఏడాది అంటే 2021–22కి ఆ లక్ష్యాన్ని లక్ష క్వింటాళ్లుగా పెట్టుకున్నాం. రాష్ట్రంలో వినూత్నంగా అమలవుతున్న వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాలతో వర్సిటీ కేంద్రాలు, ఏరువాక కేంద్రాలు అనుసంధానమై రైతులకు రోజువారీ సూచనలు, సలహా ఇస్తున్నాయి. వ్యవసాయ పీజీ కోర్సుల్లో 20 శాతం ఎన్ఆర్ఐ కోటా యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిదిలో వ్యవసాయ పీజీ కోర్సుల్లో 20 శాతం ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటా సీట్లు ప్రవేశపెట్టనున్నట్లు వీసీ డాక్టర్ ఎ.విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపా రు. ఆయన సోమవారం తిరుపతి వ్యవసాయ కళాశాలలో మీడియాతో మాట్లాడారు. పీజీ కోర్సుల్లో సీట్ల సంఖ్య చాలా త క్కువగా ఉందని, దేశవ్యాప్తంగా డిమాండ్ ఉ న్న నేపథ్యంలో పీజీ కోర్సుల్లో 20 శాతం ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటా ప్రవేశపెడుతున్నామని తెలిపారు. దీనిద్వారా మరో 34 సీట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. యూజీ కోర్సుల్లో 10 శాతం సీట్లు ఎన్ఆర్ఐ కోటా కింద ప్రవేశపెట్టామన్నారు. డిప్లమో కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు వ్యవసాయ పాలిటెక్నిక్ డిప్లమో కోర్సుల్లో ప్ర వేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే నోటిఫికేష న్ విడుదల చేశామన్నారు. ఈనెల 13న మొదలయ్యే రిజిస్ట్రేషన్ల ప్రకియ 23 వరకు కొనసాగుతుందన్నారు. 10వ తరగతి పాసైనవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 4,230 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. సెప్టెంబర్‌లోపు అడ్మిషన్లు పూర్తిచేస్తామని తెలిపారు. ఆయన వెంట రిజిస్ట్రార్ గిరిధర్‌కృష్ణ, డీన్ ప్రతాపకుమార్‌రెడ్డి, అసోసియేట్ డీన్ బూచుపల్లి రవీంద్రనాథరెడి తదితరులు ఉన్నారు. -
వ్యవసాయం దండగన్న వ్యక్తి చంద్రబాబు: విష్ణువర్ధన్‌రెడ్డి
సాక్షి, విశాఖపట్నం: పోలవరం ప్రాజెక్టు పెండింగ్ నిధులు ఇవ్వమని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఉత్తరాంధ్ర నీటిపారుదల ప్రాజెక్టులపై ఆదివారం బీజేపీ రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించింది. ఎమ్మెల్సీ మాధవ్, విష్ణువర్ధన్‌రెడ్డి, నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టుకి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేశారని, ఆ ప్రాజెక్టు కోసం రూ.5 వేల కోట్లు ఖర్చు చేశారని పేర్కొన్నారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ, వ్యవసాయం దండగన్న వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. రాయలసీమ ప్రాజెక్టులను చంద్రబాబు నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రానికి అన్ని విధాలుగా కేంద్రం అండగా ఉంటుందన్నారు. అంతర్రాష్ట్ర నదీజలాల వివాదాలను ప్రభుత్వం పరిష్కరించాలని విష్ణువర్ధన్‌రెడ్డి కోరారు. -
పథకం ప్రకారమే చెప్పుతో దాడి
సాక్షి, హైదరాబాద్: గత నెల 23న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి స్టూడియోలో జరిగిన చర్చా వేదికలో శ్రీనివాసరావు పథకం ప్రకారం తనపై చెప్పుతో దాడి చేశారని, అతనిపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముందస్తు పథకం ప్రకారమే చర్చలో పాల్గొన్న శ్రీనివాసరావు తన ప్రతిష్టను దెబ్బతీశారన్నారు. ఈ వ్యవహారంతో తాను భౌతికంగా, మానసికంగా కలత చెందానని తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. -
ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై బహిష్కరణ..
సాక్షి, అమరావతి: పత్రికా ప్రమాణాలు, టీవీ ఛానల్ల నైతిక విలువలను గాలికొదిలేసి.. తెలుగుదేశం పార్టీ కరపత్రికలా, ప్రసార సాధనంలా పని చేస్తున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ బహిష్కరించింది. నిన్న ఏబీఎన్ ఛానల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డిపై జరిగిన దాడి నేపథ్యంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ బీజేపీ మీడియా ఇంచార్జి వుల్లూరి గంగాధర్ వెల్లడించారు. టీడీపీ ప్రయోజనాల కోసం దాడికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేయించకుండా, తిరిగి అతన్ని ఈ రోజు చర్చకు ఆహ్వానించడం సిగ్గుచేటని ఆయన ధ్వజమెత్తారు. మీడియా ముసుగులో తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా పనిచేస్తున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్, ఆంధ్రజ్యోతి పత్రికలపై నేటి నుంచి బహిష్కరణ విధిస్తున్నట్లు తెలిపారు. ఇక నుంచి జరిగే పార్టీ పత్రికా విలేకరుల సమావేశాలకు ఆంధ్రజ్యోతిని ఆహ్వానించరాదని, ఆ టీవీ ఛానల్లో జరిగే చర్చా కార్యక్రమాల్లో బీజేపీ ప్రతినిధులు పాల్గొనరాదని పార్టీ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర బీజేపీ యొక్క ఈ అధికారిక నిర్ణయాన్ని ఉల్లంఘిస్తూ ఏబీఎన్ ఛానల్ తమకు నచ్చిన వారిని డిబేట్ల పేరుతో ఆహ్వానించి, వారి వాయిస్‌ను పార్టీ వాయిస్‌గా ప్రచారం చేసి ప్రజల్ని మోసం చేయాలని చూస్తే ఏబీఎన్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తామని ప్రకటించారు. ఆంధ్రజ్యోతి యాజమాన్యం బేషరతుగా క్షమాపణ చెప్పేవరకు ఈ బహిష్కరణ కొనసాగుతుందని ఆయన తెలిపారు. -
విశాఖపై మాట్లాడే హక్కు టీడీపీకి లేదు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఎస్ఈసీ చర్యల వల్ల సర్పంచ్, వార్డు అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ తీరుపై నిప్పులు చెరిగారు. ప్రజలను దోచుకునే పార్టీ టీడీపీ అని ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో నిజాం షుగర్ పరిశ్రమను ఎత్తివేయలేదా? అని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ విషయంలో ప్రజలకు ఆందోళన అవసరం లేదన్నారు. (చదవండి: టీడీపీలో రచ్చకెక్కిన విభేదాలు..) విశాఖ స్టీల్ ప్లాంట్‌పై మాట్లాడే హక్కు టీడీపీకి లేదని ఆయన ధ్వజమెత్తారు. కరోనా సమయంలో రాష్ట్రాన్ని వదిలేసి పక్కరాష్ట్రంలో కూర్చొని ట్వీట్లు చేసే వ్యక్తులు బీజేపీ గురించి మాట్లాడటం తగదన్నారు. జూమ్ యాప్‌లో ప్రసంగాలు చేసే పెద్దమనిషి విశాఖ స్టీల్ గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. సరిగా తెలుగు చదవటం రాని వ్యక్తి ట్వీట్లు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.(చదవండి: కిడ్నాప్ డ్రామా: నివ్వెరపోయే విషయాలు) -
బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి ఓవరాక్షన్
అనంతపురం: బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారానికి తెరతీశారు. రోడ్ల విస్తరణలో భాగంగా అనంతపురం జిల్లాలోని కదిరి లక్షీనరసింహస్వామి ఆలయ బలిపీఠాన్ని తొలగిస్తున్నారంటూ తప్పుడు ట్వీట్ చేశారు. విష్ణువర్ధన్‌రెడ్డి చేస్తున్న అసత్య ప్రచారాన్ని అనంతపురం జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ డా.సిరి ఖండించారు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ లక్షీనరసింహస్వామి ఆలయ బలిపీఠాన్ని తొలగించే ప్రసక్తే లేదని, అలాంటి ఆలోచన తమకు లేదని ఆమె స్పష్టం చేశారు. బలిపీఠంపై బీజేపీ నేత చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఆమె ఆధారాలతో సహా బయటపెట్టారు. మరోసారి తప్పుడు వార్తలు ప్రచారం చేయరాదని, అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని సిరి హెచ్చరించారు. తప్పుడు వార్తల ప్రచారం విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నామని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారు ఎంతటివారైనా వదిలి పెట్టే ప్రసక్తే లేదని ఆమె హెచ్చరించారు. దేవాలయాల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్దితో వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు గత కొంతకాలంగా ఆలయాలపై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై కేసులు కూడా నమోదు చేసి, దాడులకు పాల్పడిన టీడీపీ, బీజేపీ నేతలను అరెస్టు చేశామని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ఇదివరకే ప్రకటించారు. (చదవండి: ఆలయ ఘటనల్లో తెలుగుదేశం కుట్ర) -
'టీడీపీ నేతలు పడగొట్టి బీజేపీపై నెడుతున్నారు'
సాక్షి, విశాఖపట్నం: దేవాలయాలను కూలదోచిన చంద్రబాబుకు రామతీర్థం వచ్చే అర్హత లేదని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. ఈ మేరకు బుధవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'అధికారంలో ఉండగా చంద్రబాబు 30 దేవాలయాలను పడగొట్టారు. టీడీపీ నేతలు దేవాలయాలు పడగొట్టి బీజేపీపై నెడుతున్నారు. నితిన్ గడ్కరీ చెబితే విజయవాడలో దేవాలయాలు పడగొట్టామంటున్న అచ్చెన్నాయుడు ఆధారాలు చూపించాలి. లేదంటే తన పదవికి రాజీనామా చేయాలి. టీడీపీ పడగొట్టిన దేవాలయాలు పునర్నిర్మించాలని గతంలో బీజేపీ పెద్ద ఎత్తున పోరాటం చేసింది. దేవాలయాలపై చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారు. రామతీర్థంలో శ్రీరామనవమి చేయాలంటే అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు' అంటూ ఫైర్ అయ్యారు. చదవండి: (దేవాలయాలు కూల్చి.. శౌచాలయాలు) బీజీపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. అధికారంలో ఉండగా దేవాలయాలను కూల్చిన చంద్రబాబు.. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు. గతంలో కూలదోసిన దేవాలయాలను చంద్రబాబు ఎందుకు పునర్నిర్మాణం చేయలేదు. ఓట్ల కోసం చంద్రబాబు మత రాజీకీయాలు చేస్తున్నారు' అంటూ విష్ణువర్దన్‌రెడ్డి మండిపడ్డారు. చదవండి: ('పుత్రరత్నం కోసం ఏ ఉన్మాద చర్యకైనా సిద్ధమే') -
'ఉండవల్లి గారు.. ఊసరవెల్లిగా మారొద్దు!'
సాక్షి, అమరావతి : బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌పై ట్విటర్లో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ' ఉండవల్లి గారు .. మీరు ఊసరవల్లిగా మారవద్దు! బిజేపీలో ఎందుకు చేరాలి? ఎందుకు చేరకూడదు? చేరే వాళ్లకు తెలుసు. రాజకీయ అస్త్ర సన్యాసం చేసిన మీలాంటి వారి సలహాలు వారు ఎందుకు తీసుకుంటారు. మీ భ్రమ తప్ప... మీరు ఎవరికోసం మాట్లాడుతున్నారు? ఏ పార్టీని ఆంధ్ర రాష్ట్రంలో బతికించాలి? అని తాపత్రయ పడుతున్నారో దాని వెనుక ఉన్న రహస్యం రాష్ట్ర ప్రజలకు తెలుసు. (చదవండి : ‘రైతులను దేశ ద్రోహులని భావిస్తే పాపం చేసినట్లే’) ఆర్ఎస్ఎస్ గురించి మీరు చాలా విమర్శలు చేశారు. మీరు నమ్మి ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ మీ మాజీ ప్రధాని నెహ్రూ గారు 1963 జనవరి 26 న ఆర్ఎస్ఎస్ ను స్వాతంత్ర దినోత్సవ వేడుకల పెరేడ్ లో ఆహ్వానించారు. మీకే చరిత్ర తెలిసినట్లు 80 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆర్ఎస్ఎస్ గురించి నేడు మీరు వక్రీకరించి హేళనగా మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ ప్రేరణతో నేడు అత్యున్నతమైన రాష్ట్రపతి,ఉప రాష్ట్రపతి, ప్రధాని లాంటి పదవులలో దేశం కోసం పనిచేస్తున్నారు. మేధావులు కదా ఈ చరిత్ర తెలియదా? తెలియకపోవచ్చులే. మనం మేధావి ముసుగులో ఉన్నాం కదా! ' అంటూ చురకలంటించారు.(చదవండి : రాయపాటి లూటీలో బాబు వాటా ఎంత?) -
తిరుపతిలో మకాం వేసిన బీజేపీ నేత విష్ణు
సాక్షి, తిరుపతి: తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టీడీపీ అసంతృప్తి నేతలకు గాలం వేయడానికి బీజేపీ పావులు కదుపుతోంది. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అత్యంత సన్నిహితుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణుకుమార్ రెడ్డి ద్వారా బేరసారాలు మొదలుపెట్టారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకోసమే విష్ణు తిరుపతిలో మకాం వేసినట్లు విశ్వసనీయ సమాచారం. తిరుపతి ఎంపీ బల్లిదుర్గాప్రసాద్ అకస్మిక మరణంతో పార్లమెంట్ ఉప ఎన్నిక అనివార్యం కానుంది. బీజేపీ, టీడీపీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఏకగ్రీవం కావాల్సిన లోక్‌సభ సీ టును ఉపఎన్నికల వరకు తీసుకువెళ్లడానికే సిద్ధమయ్యారు. దుబ్బాక వాపును చూసి, బలుపనుకుని రకరకాల ఎత్తులు వేస్తున్నారు. (శ్రీకాళహస్తిలో నాటకాన్ని రక్తికట్టిస్తున్న బీజేపీ, జనసేన) గత ఏడాదిన్న కాలంగా సీనియర్ టీడీపీ నేతలు పలువురు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వైఖరి నచ్చక కొందరు పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో మరికొందరు టీడీపీకి రాజీనామా చేసినా తర్వాత చంద్రబాబు బుజ్జగింపులతో మెత్తబడ్డారు. అయితే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటువంటి వారి జాబితా దగ్గర పెట్టుకుని బీజేపీ నేతలు సదరు అసమ్మతి నేతలతో మంతనాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. స్ధానికంగా కమలం పార్టీలోని నేతలతో టీడీపీ అసమ్మతి నేతలతో ముందుగా మాట్లాడించి, తర్వాత విష్ణు రంగంలోకి దిగుతున్నారని తెలిసింది. అందులో భాగంగా సోమవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుని తిరుపతికి పిలిపించుకుని మంతనాలు మొదలుపెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. దుబ్బాక గెలుపుతో ఏపీ నాయకత్వంపై ఒత్తిడి తెలంగాణాలోని దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ అనూహ్యంగా గెలవడంతో తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల విషయమై రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి పెరిగినట్లు తెలిసింది. నిజానికి దుబ్బాకలో గెలిచేంత సీన్ కమలానికి లేదు. అయితే టీఆర్ఎస్ను వ్యతిరేకించే అనేక అంశాలు కలసి రావడంతో బీజేపీ నేతలంతా దుబ్బాకలో తిష్ట వేసి, గెలుపు కోసం రేయింబవళ్లు కష్టపడడంతో విజయం సాధ్యమైందనేది వాస్తవం. కాగా దుబ్బాకకు తిరుపతికి మధ్య ఎంత దూరం ఉందో తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో గెలుపునకు బీజేపీ అంతే దూరంలో ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే కమలనాథులు మాత్రం విజయం తమదే అంటూ రెచ్చిపోతున్నారు. (రూ.7,200 కోట్లు తీసుకొని భ్రమరావతిగా మార్చిన చంద్రబాబు) డిపాజిట్ కోల్పోయిన కమలం గత ఎన్నికల్లో విజయం సాధించిన బల్లికి 2.28 లక్షల ఓట్ల మెజారిటీ వస్తే బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదు. కమలం అభ్యర్థికి కేవలం 16 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. అలాంటిది జరగబోయే ఉపఎన్నికలో తమ గెలుపు ఖాయమని వీర్రాజు లాంటి వారు చెబుతుంటే... జనం నవ్వుకుంటున్నారు. అయితే కమలదళం హడావుడి మాత్రం అంతా ఇంతా కాదు. గెలుస్తారో లేదో తెలియదు కానీ టీడీపీ అసమ్మతి నేతలతో పాటు రాజకీయాలకు సంబంధం లేని ప్రముఖులను కూడా తమ వైపునకు మొగ్గేలా బీజేపీ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పనిలో పనిగా జనసేన కార్యకర్తలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. -
సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: బీజేపీ
సాక్షి, అమరావతి : ఆన్లైన్ రమ్మీ, పోకర్ వంటి జూద ఆటలను నిషేంధించిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి, రాష్ట్ర క్యాబినెట్‌కు అభినందనలు తెలిపారు. అనేక కుటుంబాలు, పిల్లలు ఈ వ్యసనానికి బానిసై ఆత్మహత్య చేసుకోవడం జరిగిందన్నారు. అసాంఘిక కార్యక్రమాలపై ప్రభుత్వం చట్టం చేయడం మంచి నిర్ణయమని కొనియాడారు. ఆన్లైన్ రమ్మీ, పోకర్ వంటి జూద క్రీడల నిషేధంతో యువతకు మంచి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. (రమ్మీ, పోకర్‌పై ఏపీ సర్కార్ నిషేధం) -
‘రఘురామకృష్ణంరాజు.. ఆ పనులు చూసుకోండి’
సాక్షి, విజయవాడ : టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయడు తీరుపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ నేతల గురించి మాట్లాడే తీరును మార్చుకోవాలని హితవు కలిపారు. ఓ పక్క చంద్రబాబు నాయుడు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురించి పొగుడుతూ మరోవైపు ఎమ్మెల్యేల చేత తిట్టించడం నీచ రాజకీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 ఏళ్లుగా పత్రికలు, టీవీలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేశారని మండిపడ్డారు. ఇప్పుడేమో ప్రజల్లోకి రాకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. శుక్రవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షంగా టీడీపీ విఫలమైంది. టీడీపీ నేతలు ప్రధాని మోదీని, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజును, ఎంపీ జీవీఎల్‌ను కుల రాజకీయాలకు లక్ష్యంగా చేసుకున్నారా?. చంద్రబాబు విష ప్రచారం రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. టీడీపీని ప్రజలు మర్చిపోయారు. గతంలో పేపర్ పులిగా నిలిచిపోయారు. ఇప్పుడు జూమ్, ట్విటర్లకే పరిమితం అయ్యారు. ఎన్టీ రామారావు ప్రారంభించిన పార్టీ.. ఇప్పుడు కుట్ర రాజకీయాలకు పాల్పడుతోంది. సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి టీడీపీ ఎందుకు భయపడిపోతుందో రాష్ట్ర ప్రజలకు అర్థమవుతోంది. (‘లోకేష్ మీద వలంటీర్‌ను పోటికి పెట్టి గెలిపిస్తాం’) ఆ పార్టీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి అగ్రకుల దుహంకారం బయటపెట్టుకున్నారు. టీడీపీ ఆఫీసు నుంచి అనధికార వెబ్‌సైట్స్, సామాజిక మాధ్యమాల పేరుతో విష ప్రచారం ఎందుకు? ధైర్యం ఉంటే మీ అధికారిక వెబ్సైట్లో అధికారిక ప్రచార మాధ్యమాల్లో ప్రచారం చేయండి?. బీజేపీ మీద చంద్రబాబు, లోకేష్ సామాజిక మాధ్యమాల్లో లక్షల ఖర్చు పెట్టి విష ప్రచారం చేస్తున్నారు. బీజేపీకి సలహాలు ఇచ్చే స్థాయి రఘురామకృష్ణంరాజుకు లేదు. మీకు వేరే వాళ్ళు చాలా పనులు అప్పజెప్పారు. ఆ పనుల్లో బిజీగా ఉండండి. రాష్ట్రంలో ఏం చేయాలో మేము చూసుకుంటాం. గతంలో మా కండువా కూడా కప్పుకున్నారు. బీజేపీతో టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు ఆడుతున్నది ప్రమాదకర ఆట అనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
చంద్రబాబు తీరుపై బీజేపీ నేత ఆగ్రహం
సాక్షి, అమరావతి: “నీకు కుటుంబం, బంధాలు లేవు. మా హక్కులు కాలరాశారు. మా అభివృద్ధిని ఓర్వేకపోతున్నారు. నీ కంటే నేను ముందే సీఎం అయ్యాను. గుజరాత్‌ని ఏం అభివృద్ధి చేసావు? మీ రాష్ట్రం కంటే దక్షిణ భారత దేశంలో అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాయి? మీకు మేము బానిసలం కాదు. మీరు పబ్లిసిటీ పీఎం. మీరు పనిచేసే పీఎం కాదు. మాకు పనిచేసే పీఎం కావాలి” ఇవన్నీ సందర్భానుసారంగా 2018 మర్చి నుండి 2019 ఏప్రిల్ మధ్య నాడు మీరు మాట్లాడిన మాటలు బాబు గారు. గుర్తుఉందా?’’ అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీపై చంద్రబాబు చేసిన దిగజారుడు వ్యాఖలను ప్రజలు మర్చిపోలేదంటూ చురకలు అంటించారు. (ఎవరి ఫోన్‌నైనా ట్యాప్ చేసే అవసరం మాకు లేదు) కాగా ఫోన్ ట్యాపింగ్ అంటూ సరికొత్త డ్రామాకు తెరతీసిన చంద్రబాబు.. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ విషయంపై స్పందించిన విష్ణువర్ధన్ రెడ్డి ట్విటర్ వేదికగా చంద్రబాబు తీరును తూర్పారబట్టారు. గతంలో ప్రధాని మోదీ, బీజేపీపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, ప్రస్తుత లేఖను పోల్చుతూ బాబు అవకాశవాద రాజకీయాన్ని ఎండగట్టారు. అదే విధంగా స్వప్రయోజనాల కోసం అమరావతిని, రైతులను రాష్ట్రాన్ని రావణకాష్టం చేసి రాజకీయ బలిపీఠం ఎక్కించిన విషయంలో బాబు చరిత్రలో నిలిచిపోతారంటూ ఘాటు విమర్శలు చేశారు. ఈ మేరకు.. ‘‘ మన సాయుధ దళాలు నూతన విశ్వాసాన్ని పొందాయి. అంతర్గతంగా, ఉగ్రవాదులు మరియు ఉగ్రవాద శక్తుల నుండి వచ్చే ముప్పు తగ్గింది, దేశం వెలుపల సరిహద్దులు బలోపేతం చేయబడ్డాయి. ఇవి తాజా లేఖలో మీరు మోడీగారికి చేసిన భజన. ఎందుకీ మార్పు? మోడీకి గారికి బిజేపికి మతిమరుపు లేదు ! రాజకీయాల్లో మీరు, మీ పార్టీ అవసరానుగుణంగా భజన చేయడం మీకు మామూలే. 1998,1999 ,2004 ,2014, 2019 మీ నాయకత్వంలో మాకు చాలా రాజకీయ అనుభవం ఉంది. మీ స్వార్థప్రయోజనాలు, మీ కుటుంబ రాజకీయాల కోసం రాష్ట్ర అభివృద్ధిని తాకట్టు పెట్టి, నీ రాజకీయ అవసరాలకోసం మోడీ, బీజేపీని విమర్శించారు. రాష్ట్ర ప్రజలును, దేశ ప్రజలు క్షమించమని కోరండి’’అని విష్ణువర్ధన్ రెడ్డి చంద్రబాబు హితవు పలికారు. -
‘అభాసుపాలై పరువు పోగొట్టుకోవద్దు’
సాక్షి, విజయవాడ: అమ్మఒడి నిధులకు సంబంధించి బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘అమ్మఒడి నిధులపై రాష్ట్ర బీజేపీ నేతల ఆరోపణలు సరికాదు. పరిజ్ఞాన లోపంతో కన్నా లక్ష్మీనారాయణ, విష్ణువర్ధన్‌రెడ్డి ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌లోని అమ్మఒడి లబ్దిదారులకి రాష్ట్ర బడ్జెట్ నుంచే నిధులు కేటాయించారు. ఆలయాల హుండీలు, భక్తుల కానుకల నుంచి నిధులిచ్చారనటం అవివేకం. బ్రాహ్మణ కార్పొరేషన్ దేవాదాయ శాఖలో భాగం అయినంత మాత్రాన నిందలు సరికాదు. సమగ్ర సమాచారం తెలుసుకొని మాట్లాడితే గౌరవంగా ఉంటుంది. అరకొర సమాచారంతో మాట్లాడి అభాసుపాలై మరోసారి పరువు పోగొట్టుకోవద్దు' అంటూ బీజేపీ నాయకులకు మల్లాది విష్ణు సూచించారు. (ఓటేసిన జనమే టీడీపీ ఎమ్మెల్యేని ఛీ కొట్టారు..) -
వాటిపై చంద్రబాబు ఎందుకు మాట్లాడరు?
సాక్షి, విజయవాడ : రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబాటుకి చంద్రబాబే కారణమని బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రాన్ని చంద్రబాబు తన కుమారుడు కోసం ధారదత్తం చేసి ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నాడని దుయ్యబట్టారు. హైకోర్టును రాయలసీమలో పెట్టాలని కోరినా చంద్రబాబు పట్టించుకోలేదని, తాను చెప్పిందే వేదమనేలా చంద్రబాబు వ్యవహరించారని మండిపడ్డారు. అమరావతిలో టీడీపీ నాయకులు నాలుగు వేల ఎకరాల భూములు కొన్నారనే ఆరోపణలపై చంద్రబాబు ఎందుకు నోరు మొదపడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌పై ఎందుకు మాట్లాడటం లేదని, లోకేష్ మంగళగిరిలో ఓడిపోవడానికి గల కారణం ఏంటని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు కొన్న భూములపై వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
‘చంద్రబాబు, పవన్ డ్రామాలు ఆడుతున్నారు’
సాక్షి, విజయవాడ : ఇసుకపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లు డ్రామాలు ఆడుతున్నారని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి విమర్శించారు. గురువారం విజయవాడలో ఏపీ బీజేపీ ఇన్చార్జ్ సునీల్ దేవ్‌ధర్, ఇతర నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. పవన్, చంద్రబాబువి మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ బహిష్కరించిన పార్టీ అని అన్నారు. టీడీపీ, జనసేన వేదికను తమ పార్టీ పంచుకోదని స్పష్టం చేశారు. సునీల్ దేవ్‌ధర్ మాట్లాడుతూ.. బీజేపీతో పొత్తుకు చంద్రబాబు నాయుడుకు శాశ్వతంగా తలపులు మూసేశామని స్పష్టం చేశారు. చంద్రబాబు ఉన్న ఏ వేదికను తాము పంచుకోమని అన్నారు. చంద్రబాబు మళ్లీ తమ వద్దకు రావాలని చూస్తున్నారని తెలిపారు. -
‘పవన్ కల్యాణ్‌తో వేదిక పంచుకోం’
సాక్షి, విజయవాడ : పవన్ కల్యాణ్ సభలో పాల్గొనాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణకు లేదని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. ఇసుక సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాసింది మొదట బీజేపీయేనని తెలిపారు. ఇసుక సమస్యపై గవర్నర్‌ని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చింది కూడా బీజేపీయేనని వెల్లడించారు. సమస్యకి సంఘీభావం తెలుపుతున్నామే తప్ప వేరే పార్టీలకు కాదని స్పష్టం చేశారు. పవన్‌తో వేదికను పంచుకోమని విష్ణువర్ధన్‌రెడ్డి చెప్పారు. నవంబర్ 4న విజయవాడలో బీజేపీ పెద్దఎత్తున మరోసారి ఆందోళన చేపడుతుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ మునిగే నావ.. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు రోజురోజుకీ మారుతున్నాయని బీజేపీ జాతీయ సమన్వయకర్త పురిహెళ్ల రఘురాం అన్నారు. గుడివాడలో బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ కనుమరుగైందని, తెలుగుదేశం పార్టీ మునిగే నావ లాంటిదని ఎద్దేవా చేశారు. జనసేన ఒక గందరగోళ పార్టీ అని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్తమానంలో ఉందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా అండగా ఉండేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గెలిచిన పార్లమెంటు సభ్యులందరూ కొత్తవారు కావడంతో వారికి శిక్షణ తరగతులు అవసరమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సహాయ సహకారాలు వినియోగించుకుని ముందుకు సాగాలని సూచించారు. -
'టీడీపీ ఒక తెలుగు దొంగల పార్టీ'
సాక్షి,గుంటూరు : చంద్రబాబు ఉంటున్న కరకట్ట నివాసం అక్రమమని, దాన్ని తక్షణమే ఖాళీ చేయాలని బీజేపీ నేత, నెహ్రూ యువజన కేంద్రం జాతీయ ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి పేర్కొన్నారు. మరి కొద్దిరోజుల్లో టీడీపీలో చంద్రబాబు, లోకేష్ తప్ప ఎవరు మిగలరని ఎద్దేవా చేశారు. టీడీపీ ఇక తెలుగు దొంగల పార్టీగా పేరు పొందిందని, చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిని నిగ్గు తేల్చాలని స్పష్టం చేశారు.ఆ పార్టీకి చెందిన నేతలంతా తొందర్లోనే తీహార్ జైలుకు వెళ్లక తప్పదని అందుకే వారంతా హిందీ నేర్చుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. ఇప్పటికే టీడీపీ మిత్రపక్షమైన కాంగ్రెస్ నేతలు తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారని గుర్తుచేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన రివర్స్ ట్రేడింగ్ విధానం మంచి ఫలితాలు ఇస్తోందని పేర్కొన్నారు. -
భూబకాసురుడు చంద్రబాబే !
సాక్షి, అనంతపురం : అమరావతిలో రాజధాని పేరుతో 35వేల ఎకరాల భూములను రైతుల నుంచి దౌర్జన్యంగా లాక్కొన్న భూబకాసరుడు మాజీ సీఎం చంద్రబాబు అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన ఐదేళ్ల పాలనలో ఏనాడూ రాయలసీమ నుంచి రాజధానికి రోడ్డు వేయడాన్ని పట్టించుకోని వ్యక్తి నేడు అమరావతిపై మాట్లాడడం సిగ్గుచేటంటూ చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. టీడీపీకి అధికారం కట్టబెట్టలేదన్న అక్కసుతో రాష్ట్రంలో పరిశ్రమలు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. టీడీపీ పాలనలో చోటు చేసుకున్న అవినీతిపై సీబీఐ విచారణ అంటే చాలు చంద్రబాబు భయంతో స్టేలు తెచ్చుకుంటున్నారన్నారు. నిజంగా ఆయన నిజాయితీ పరుడైతే సీబీఐ విచారణకు ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించారు. రాయలసీమ రెండవ రాజధాని విషయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలన్నారు. రాయలసీమ జిల్లాలో కరువు, రైతు ఆత్మహత్యలు, రాజధాని విషయంపై ఈ నెల 14న కడపలో తలపెట్టిన సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి దుద్దకుంట వెంకటేశ్వరరెడ్డి, నగర అధ్యక్షుడు శ్రీనివాసులు పాల్గొన్నారు. -
ఆ విషయంలో జగన్‌కు బీజేపీ సహకరిస్తుంది : విష్ణువర్ధన్ రెడ్డి
సాక్షి: రాష్ట్రంలో గత టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ చేయిస్తామన్న ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉద్దేశాన్ని తాము స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం లక్షా 62వేల కోట్ల అవినీతికి పాల్పడిందని పుస్తకాలు ప్రచురించి వాడవాడలా పంచి పెట్టిన జగన్, వాటిపై ఇప్పుడు ఎటాంటి విచారణ చేపట్టినా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. అయితే అధికారంలోకి వచ్చి రెండు నెలలైనా ఆ దిశగా ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడంతో ప్రజల్లో అనుమానాలు వస్తున్నాయన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో 14 శాతం తక్కువకు చేపట్టిన టెండర్లను రద్దుచేసి రీ టెండరింగ్ చేపడతామంటున్నారు. అలాగైనా గడుకులోపు ప్రాజెక్టు పూర్తి చేయకుంటే బీజేపీ ప్రశ్నిస్తుందన్నారు. -
‘వారంతా స్లీపర్‌సెల్స్‌లోకి వెళ్లిపోయారు’
సాక్షి, విశాఖపట్నం : ఎన్నికల తరువాత ఈవీఎంల మీద మాట్లాడిన నేతలంగా స్లీపర్‌సెల్స్‌లోకి వెళ్లిపోయారని, వారంతా ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి అన్నారు. గత క్యాబినేట్లో కొలువైన మంత్రి నారాయణ కార్పోరేట్ మాఫియాకు అధిపతి అని పేర్కొన్నారు. కార్పోరేట్ వ్యవస్థను సర్వనాశనం చేశారని, కార్పోరేట్ విద్యాసంస్థలు, ఆస్పత్రుల మీద విచారణ చేపట్టాలని కోరారు. రాష్ట్రంలో కొందరు కమ్యూనిస్ట్‌లు, కాంగ్రెస్ పార్టీ కొత్త రాజకీయాలు ప్రారంభించాయన్నారు. వైఎస్ జగన్ నాయకత్వాన కొత్త ప్రభుత్వం ఏర్పాటై వారం రోజులు కాకముందే ప్రత్యేక హోదా, నవ నిర్మాణ దీక్షలు అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. నిర్ణయాత్మక సూచనలు ఇవ్వకుండా దుర్మార్గపు ఆలోచన చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో సారి కూడా రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా రాలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అభివృద్ది వికేంద్రీకరణ జరగాలన్నారు. జిల్లాల పునర్విభజనపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. -
ఓటుకు నోటు ఇవ్వమని మోదీ చెప్పారా?
సాక్షి, అమరావతి : చంద్రబాబులా బీజేపీ ఎప్పుడు రెండు నాల్కల ధోరణితో వ్యవహరించలేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. 'తప్పుడు ప్రచారంతో రెండు రాష్ట్రాల మధ్య విషం చిమ్మడానికి చంద్రబాబు ప్రయత్నించారు. ప్రధాని నరేంద్ర మోదీకి, చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. మీడియా లేని రోజుల్లో ఏం మాట్లాడినా చెల్లిందేమో, కానీ ఇప్పుడు చెల్లదు. రాహుల్ గాంధీ ఆంధ్రాకు వస్తే రాళ్లతో కొట్టండి అన్నాడు చంద్రబాబు. కర్ణాటకలో మాత్రం విభజన బాగా చేసింది కాంగ్రెసే అన్నాడు. బీజేపీ విభజన చేసిన రాష్ట్రాలు కలిసి మెలిసి ఉన్నాయి. ఓటుకు నోటు ఇమ్మని మోదీ చెప్పారా? రూ. 50 లక్షలు రేవంత్ రెడ్డి ద్వారా పంపమని బీజేపీ చెప్పిందా? డబ్బులతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు కొందాం అని చూసిన దొంగల ముఠా మీది. 2014కి ముందు ప్రపంచం మెచ్చిన నాయకుడు మోదీ అని కొనియాడింది మీరే కదా? ఎన్డీఏలో 2019లో కూడా మోదీ ప్రధానిగా ఉండాలని మీరే కదా తీర్మానం పెట్టారు. చంద్రబాబు మానసిక స్థితి మీద అనుమానం ఉంది. ఒక బీసీ ప్రధాని ఉంటే ఓర్చుకోలేని దూరహంకారం మీది? బీసీల పార్టీ అని చెప్పుకుంటే సిగ్గుగా లేదా మీకు? సోనియాగాంధీ సమక్షంలో విభజన బాగా జరిగింది అని చెప్పినందుకు ఆంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఆంధ్రలో చంద్రబాబు ఓటమి ఖాయం కావడంతో, మా ఎమ్మెల్యేలను కొంటున్నారని కొత్త నాటకం మొదలు పెట్టారు. ఈ ఎన్నికల్లో డబ్బులు ఇవ్వలేదు అని తిరుమల వెంకన్న సాక్షిగా ప్రమాణము చేసే దమ్ము ఉందా. మీ పార్టీ ఎంపీ దివాకర్ రెడ్డి కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. రాజకీయాలను డబ్బుల మయం చేసిందే చంద్రబాబు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లోనే రాజకీయ అనైతికతకు బీజం పోశారు' అని విష్ణువర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. -
చంద్రబాబు మానసిక స్థితి మీద అనుమానంగా ఉంది
-
సుకుమార్‌రెడ్డిపై దాడికి యత్నం
కావలి: కావలి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి వ్యవహారశైలిపై ప్రజలు వ్యక్తం చేస్తున్న ఆందోళనలు నిజమయ్యాయి. వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, కావలి నియోజకవర్గంలో ఆ పార్టీ ఎన్నికల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న మన్నెమాల సుకుమార్‌రెడ్డిపై ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మండల కేంద్రమైన అల్లూరులో గ్రామదేవత పోలేరమ్మ తల్లి సాక్షిగా కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి అనుచర నేర గ్యాంగ్ దాడి చేసేందుకు ప్రయత్నించారు. టీడీపీ కావలి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విష్ణు అనుచర నేర గ్యాంగ్‌కు సంబంధించిన 25 మంది ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అలాగే శనివారం రాత్రి కావలిరూరల్ మండలం అన్నగారిపాలెం మాజీ సర్పంచ్, మత్స్యకార నాయకుడు నరసింహంను కాళ్లు విరగ్గొడతామని విష్ణువర్ధన్‌రెడి కుమారుడు హెచ్చరించారు. వివరాలు.. ఆదివారం అర్ధరాత్రి అల్లూరులో పోలేరమ్మ గుడి పక్కవీధిలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయం చుట్టూ విష్ణువర్ధన్‌రెడ్డికి చెందిన నేర గ్యాంగ్ చిత్తుగా మద్యం సేవించి ద్విచక్రవాహనాల్లో చక్కర్లు కొడుతున్నారు. ఆ సమయంలో పార్టీ నాయకులతో కలిసి అటుగా కారులో వెళుతున్న మన్నెమాల సుకుమార్‌రెడ్డిని గమనించిన సదరు గ్యాంగ్, పోలేరమ్మ గుడి ఎదురుగా ద్విచక్రవాహనాన్ని కారుకు అడ్డంగా పెట్టి ఆపేశారు. ఎవరు మీరు.. ఎందుకు వచ్చారని.. మాటలు కలిపి కారులో ఉన్న సుకుమార్‌రెడ్డిని కిందకు దిగేలా చేశారు. వెంటనే సుకుమార్‌రెడ్డి చేతిలో ఉన్న సెల్‌ఫోన్ బలవంతంగా లాగేసుకున్నారు. అడ్డుకోయిన ఆయన వ్యక్తిగత సహాయకుడైన యువకుడిపై కూడా దాడి చేశారు. ఇంతలో కారులో ఉన్న పార్టీ నాయకులు కిందకు దిగి వారితో వాగ్వాదానికి దిగారు. ఇంతలో కర్రలు తీసుకురండి అంటూ కేకలు వేసిన నేర గ్యాంగ్‌తో మన్నెమాల సుకుమార్‌రెడ్డి, పార్టీ నాయకులు సౌమ్యంగా మాట్లాడడంతో వారు వెనక్కి తగ్గి వెళ్లిపోయారు. నరసింహానికి బెదిరింపులు ఇదిలా ఉండగా శనివారం రాత్రి కావలిరూరల్ మండలం అన్నగారిపాలెం మాజీ సర్పంచ్, మత్స్యకారుల నాయకుడు నరసింహం మండలంలోని మత్స్యకారులను వెంటపెట్టుకొని అల్లూరు మండలంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి వద్దకు తీసుకెళ్లి పార్టీలో చేర్చారు. అనంతరం వెనుదిరిగి కావలికి తన బుల్లెట్ వాహనంపై నరసింహం వస్తుండగా అల్లూరులో విష్ణువర్ధన్‌రెడ్డి కుమారుడు విక్రమాదిత్యరెడ్డి అడ్డుకొని బుల్లెట్ తాళం లాగేసుకున్నాడు. కావలి వాళ్లకు అల్లూరులో ఏం పని.. ఈ సారి కావలి వాళ్లు అల్లూరులో కనిపిస్తే కాళ్లు విరగ్గొడతానని హెచ్చరించాడు. ఈ ఘనటలపై మన్నెమాల సుకుమార్‌రెడ్డి సోమవారం అల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతీసేందుకు కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి చేసిన నేరపూరితమైన చర్యగా పరిగణిస్తున్నారు. ఈ దుశ్చర్యలకు వక్రభాష్యం చెబుతూ టీడీపీ అభ్యర్థి కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, మున్ముందు ఇంకా చాలా ఉందని, తాను ఎంత దూరమైనా పోతానని ఎమ్మెల్యేను బెదిరించారు. విష్ణు గ్యాంగ్ దుశ్చర్యలను చూసిన ప్రత్యక్ష సాక్షులు ఆందోళన చెందుతున్నారు. నేనేంటో మున్ముందు చూపిస్తా ... ఎమ్మెల్యేకు విష్ణు వార్నింగ్ కావలి: ‘నా సంగతి తెలియదేమో.. చెప్తా.. ఇంకా టైముంది.. ఎంత దూరం చెప్పాలో అంత దూరం చెప్తా.. పిచ్చి వాగుడు వాగొద్దు.. నేనేందో చూపిస్తా.. నా సంగతి అందరికీ తెలుసు.. చిన్నచిన్న వాళ్లను పెట్టుకొని పిచ్చి వాగుడు వాగుతూ ప్రచారం చేయవద్దు.. ఇదే ఆఖరి వార్నింగ్.. టీడీపీ అధ్యక్షుడు నన్ను గౌరవించి నాకు కావలి టిక్కెట్ ఇచ్చాడు’ అంటూ ఎమ్మెల్యే, కావలి వైఎస్సార్సీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డికి టీడీపీ కావలి అసెంబ్లీ అభ్యర్థి కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి వార్నింగ్ ఇచ్చి తన నైజాన్ని బయటపెట్టేశాడు. అసాంఘికశక్తులకు అంటకాగుతారని, ఎన్నికల వేళ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడానికి కుయుక్తులు పన్నుతున్నారని కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి గురించి నియోజకవర్గంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ అంశాన్ని దగదర్తిలో సోమవారం మీడియా ఆయనను ప్రశ్నించగా వైఎస్సార్సీపీ నాయకులు గ్రామాల్లోకి, ఇళ్లల్లోకి ఎందుకుపోతున్నారని తన అహంభావాన్ని చాటుకున్నారు. రౌడీయిజాన్ని ప్రజలు హర్షించరు కావలి నియోజకవర్గ ప్రజలు రౌడీయిజాన్ని అంగీకరించరు. కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి ముఠా మా పార్టీ నాయకులపై రౌడీయిజం, దౌర్జన్యాలకు పాల్పడుతోంది. అలాగే అల్లూరులో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోని ప్రజలకు వైఎస్సార్సీపీ నాయకులను రానివ్వకూడదని, వారితో తిరగవద్దని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కాలనీల్లోని గిరిజనులు వైఎస్సార్సీపీకి ఓట్లు వేస్తే మీ అంతు చూస్తామని హెచ్చరిస్తున్నారు. కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి ఇలాంటి చర్యల ద్వారా ప్రజల నుంచి ఓట్లు వేయించుకోవాలనుకోవడం అవివేకం. – కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి -
చంద్రబాబు డిప్రెషన్లోకి వెళ్లిపోయారు..
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై బీజేపీ ఏపీ ఉపాధ్యక్షులు విష్ణువర్దన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. విష్ణువర్దన్ రెడ్డి గురువారం విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు ప్రభుత్వం అక్రమంగా జీఓలు జారీ చేస్తోందని ఆరోపించారు. జీఓల జారీలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అవినీతి పాలన చేస్తోన్న చంద్రబాబు నాయుడికి అధికారులు సహకరిస్తే జైలుకెళ్లడం ఖాయమన్నారు. ప్రజల సొమ్మును దోచేశారని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వొద్దని టీడీపీ నేతలు సీఎం ఇంటి దగ్గర గొడవ చేస్తున్నారని దుయ్యబట్టారు. లోకేష్ పిట్టల దొరలా మారారని విమర్శించారు. వైఎస్సార్సీపీ, బీజేపీ మధ్య సంబంధాలున్నాయని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కుట్ర వెన్నుపోటు రాజకీయాలు చేసే చంద్రబాబుకు ఆస్కార్ అవార్డు ఇవ్వవచ్చునని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం ఎంపీలు పార్టీని వీడటంతో చంద్రబాబు డిప్రెషన్లోకి వెళ్లిపోయారని వ్యాఖ్యానించారు. లోకేష్‌కు పౌరుషం ఉంటే రాయలసీమలో పోటీ చేయాలన్నారు. లోకేష్‌కు నిజంగా దమ్ము దైర్యం ఉంటే పులివెందుల నుంచి వైఎస్ జగన్‌పై పోటీ చేసి గెలవాలి.. అప్పుడే ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందన్నారు. ఎలాగూ ఓడిపోతున్నామని గ్రహించి చంద్రబాబు టిక్కెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. పోలవరం, రాజధాని పేరుతో కొట్టేసిన డబ్బులతో తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తోందన్నారు. ఏపీలో టీడీపీ నేతలు ప్రచారానికి వెళితే ప్రజలు రాళ్లతో కొడతారని అన్నారు. దేశంలో ప్రధాని మోదీ మళ్లీ అధికారంలోకి రాకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. లేకుంటే టీడీపీ డబ్బా మూసేస్తారా అని సవాల్ విసిరారు. -
చంద్రబాబుపై విష్ణువర్ధన్‌రెడ్డి ధ్వజం
సాక్షి, అనంపురం: సీఎం చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల డేటాను ఉపయోగించుకోవటం సిగ్గు చేటని బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడిమా సమావేశంలో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రజల డేటా చోరీ విషయంలో సీఎం చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆయన తనయుడు నారా లోకేషలు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో కుట్రలు చేస్తున్నారని ఆనయ ఆరోపించారు. తండ్రి కొడుకులు దొంగల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఏపీ ప్రజల డేటా చోరీ విషయంలో ఇరు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకోవాలని అన్నారు. -
‘ఆయన్ని వెంటనే అరెస్ట్ చేయాలి’
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల్లో పోటీ చేయకుండా పారిపోయిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మీడియాలో చిల్లర ప్రచారం చేస్తున్నాడని, ఎన్నికల కమిషన్ ఆయనపై చర్యలు తీసుకోవాలని.. వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లగడపాటి డ్రామా సర్వేలను ఎవరూ నమ్మరని అన్నారు. తెలుగుదేశం నాటకంలో సూత్రధారి, పాత్రధారి లగడపాటేనన్నారు. ఆయన గెలిస్తే సమైకాంధ్ర ఉద్యమం తీసుకొస్తామని టీడీపీ నేతలు బాహాటంగా చెబుతున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల సొమ్ముని దోచి ఇక్కడ గాంధీ భవన్ సాక్షిగా ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. మహాకూటమి నేతలకు సంబంధించిన కోట్ల రూపాయలు పట్టు పడుతున్నాయని తెలిపారు. రెండు రాష్ట్రాలను కూటమి నేతలు ఒకటి ఎలా చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి పేరుతో దొంగలు అందరూ కలిశారన్నారు. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య ఫలితాలు సాధించబోతోందని, తెలంగాణలో బీజేపీ కీలక భూమిక పోషించబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉండి ఏం లాభం!?
సాక్షి, అనంతపురం : బాబ్లీ పేరుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో సరికొత్త నాటకానికి తెరలేపారని బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దుకాణం బంద్ అయిన విషయాన్ని గ్రహించిన బాబు.. ఉనికిని కాపాడుకునేందుకు, ఓట్లు దండుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారంటూ విమర్శించారు. చంద్రబాబు నాన్ బెయిలబుల్ అరెస్టు వెనుక బీజేపీ హస్తం ఉందన్న ఆరోపణలను ఖండించిన విష్ణువర్ధన్ రెడ్డి... ఆ కేసు పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా అంటూ ప్రశ్నించారు. అయినా 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు కోర్టుకు హాజరు కాకపోతే అరెస్టు వారెంట్ వస్తుందన్న విషయం తెలీదా అంటూ ఎద్దేవా చేశారు. నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటు పేరిట తెలంగాణ ప్రజల సానుభూతి పొందేందుకు బాబు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఆపరేషన్ గరుడా.. పెరుగు వడా ఏమైంది.. టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్ శివాజీ ‘ఆపరేషన్ గరుడా.. పెరుగు’ వడా అంటూ చేసిన ఫిర్యాదుపై విచారణ ఎందుకు చేపట్టలేదంటూ విష్ణువర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. టీడీపీ ముసుగు ధరించిన వ్యక్తి శివాజీ నాటకాలు ఎవరూ నమ్మరన్నారు. అయినా సిల్లీ గల్లీ కేసులకు సుప్రీంకోర్టు న్యాయవాదులు ప్రజల సొమ్ము లక్షల రూపాయలు వెచ్చిస్తారా అంటూ ప్రశ్నించారు. -
విష్ణువర్ధన్‌రెడ్డికి షాక్
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : కోడుమూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ డి.విష్ణువర్ధన్‌రెడ్డికి గట్టిషాక్ తగిలింది. ఆయన ప్రధాన అనుచరుడు తొలిషాపురం పల్లె ఎల్లారెడ్డి టీడీపీకి గుడ్‌బై చెప్పి వైఎస్ఆర్సీపీలో చేరారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, కోడుమూరు సమన్వయ కర్త మురళీకృష్ణ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. బీవై రామయ్య మాట్లాడుతూ.. కోడుమూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీకి కంచుకోట అన్నారు. గత ఎన్నికల్లో జిల్లాలోనే అత్యధికంగా 50 వేలకు పైగా మెజార్టీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మణిగాంధీ గెలుపొందారన్నారు. ఆయన డబ్బుకు అమ్ముడబోయి టీడీపీలో చేరారని, అయినా పార్టీ క్యాడర్ మాత్రం వైఎస్ఆర్సీపీలోనే ఉందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో ౖ వెఎస్ఆర్సీపీకి విజయానికి కోడుమూరు నియోజకవర్గమే నాంది పలకునుందని జోస్యం చెప్పారు. గతంలో కంటే మరో పదివేల మెజార్టీ అధికంగా వస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే నియోజకవర్గంలో బలంగా ఉన్న వైఎస్ఆర్సీపీకి ఎల్లారెడ్డి చేరికతో అదనపు బలం చేకూరిందని సమన్వయ కర్త మురళీకృష్ణ అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేసేందుకు తనవంతు సహకారం అందించాలనే కోరికతో వైఎస్ఆర్సీపీలో చేరినట్లు ఎల్లారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో నాయకులు కె.మహబూబ్‌బాషా, పస్పల వెంటరాముడు, ఆర్.కొంతలపాడు శ్రీనివాసరెడ్డి, సీబెళగల్ డి.విక్రమ్‌కుమార్, ఎం.ముల్లా హకున్, బి,తాండ్రపాడు మాజీ వైఎస్‌సర్పంచ్ ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘ఆ మంత్రికి 10సార్లు ఫోన్ చేశా.. స్పందించలేదు’
సాక్షి, అమరావతి : రాష్ట్ర సాక్షర భారత్ పథకంలో పని చేస్తున్న 21వేల మంది ఉద్యోగులను ఒక లెటర్ ద్వారా తొలగించి వారిని రోడ్డున పడేసారని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాబు వస్తే జాబ్ అన్నారు.. 21వేల మందిని నిరుద్యోగులు చేశారని మండిపడ్డారు. ఉద్యోగాల నుంచి తొలగించిన వారికి భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాక వారిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని విద్యాశాఖ మంత్రికి 10సార్లు ఫోన్ చేశామని తెలిపారు. అయిన ఈ విషయంపై వారు స్పందించలేదన్నారు. 21వేల ఉద్యోగుల ఉసురు తగులుతుందని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 24,470 మంది నిరుద్యోగులను మోసం చేసిందని బీజేపీ నేత విష్ణు వర్థన్ రెడ్డి మండిపడ్డారు. అంతేకాక ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు చీకటి రోజు అని ఆయన పేర్కొన్నారు. సాక్షర భారత్‌లో పని చేస్తున్న 21వేల మంది ఉద్యోగలను తొలగించారు.. 8ఏళ్ళుగా పనిచేస్తున్న వారిని ఉన్న ఫలంగా తీసేస్తే వారి పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. వయోపరిమితి దాటిన వారికి అక్షరాలు నేర్పడం వారి పని.. కానీ వారితో ప్రభుత్వానికి సంబంధించిన పనులు చేయించుకున్నారని విమర్శించారు. ‘600మోమో కాపీని వారికి ఇవ్వకుండానే ఉద్యోగాల నుంచి తొలగించడం అన్యాయం. ఇది కూడా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన పని అని చెప్పి విమర్శలు చేస్తారేమో. 21వేల మందిని తొలగించడం ప్రభుత్వంకు తెలుసో లేదో అర్ధం కావడం లేదు. రూ. 4కోట్ల రూపాయలు 21 వేలమంది ఉద్యోగులకు ప్రభుత్వం ఇవ్వలేదా? మానవతా దృక్పదంతో ఆలోచించి ప్రభుత్వం తక్షణమే స్పందించి మోమోని ఉపసంహరించుకోవాలని’ బీజేపీ నేత విష్ణు వర్థన్ రెడ్డి డిమాండ్ చేశారు. -
సీఎం రమేష్ ఈ నాలుగేళ్లు ఎక్కడికెళ్లావ్
సాక్షి, కడప కోటిరెడ్డి సర్కిల్ : స్వార్థ రాజకీయాల పేరుతో దొంగ దీక్షలు చేపట్టి రాయలసీమ ప్రజలను మోసగించొద్దు. ఈ నాలుగేళ్లలో మీ పుణ్యమా? అని రాయలసీమ నాశనం అయిందని, ఈ ప్రాంత అభివృద్ధి అంశాలపై ఏ చర్చకైనా సిద్ధమా? అని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ విష్ణువర్ధన్‌రెడ్డి టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. శనివారం కడపలోని వైఎస్సార్ మొమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన టీడీపీ తీరుపై నిప్పులు చెరిగారు. రాయలసీమ ప్రాంతాన్ని నాశనం చేయడానికి కడపను వేదికగా చేసుకుని రాజకీయాలు చేయడానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.దీనిని తిప్పి కొట్టడానికి రెండు కోట్ల జనాభా సిద్ధంగా ఉందని హెచ్చరించారు. నాలుగేళ్లుగా సీఎం మొదలుకుని టీడీపీ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కడపలో ఉక్కుఫ్యాక్టరీ సాధ్యం కాదని పలు వేదికలపై చెప్పి ఇప్పుడు ఏర్పాటుకు కేంద్రం వ్యతిరేకిస్తోందని నెపం వేస్తే సహించేది లేదన్నారు. కడప ఉక్కు పరిశ్రమను మేం బాధ్యతగా తీసుకుంటాం. వైఎస్సార్ జిల్లాలో ఎన్నో పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి, ఉదాహరణకు దాదాపు రూ.250 కోట్లు ఖర్చు చేసిన ఏపీ కార్ల్, చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీ, ప్రొద్దుటూరు, మైదుకూరుల్లోని పాలకర్మాగారాలు, దాణా ఫ్యాక్టరీ, తెలుగు గంగ, హాంద్రీ నీవా ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రాయలసీమ అభివృధ్ధిపై చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసి బయటకు రావాలని సీఎం రమేష్‌కు విష్ణువర్ధన్‌రెడ్డి సవాల్ విసిరారు. నాలుగేళ్లుగా ఉక్కుఫ్యాక్టరీ గురించి ఏ మాత్రం పట్టించుకోని మీరు ఇప్పుడు తగుదునమ్మా అంటూ దీక్షలు చేస్తామనడం సిగ్గు అనిపించలేదా? అని ప్రశ్నిస్తున్నామన్నారు. రాయలసీమను రెండో రాజధానిగా ప్రకటించే ధైర్యం టీడీపీకి ఉందా? పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, జమ్ముకాశ్మీర్‌లు రెండో రాజధానిలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారని, అదే తరహాలో రాయలసీమలో రెండో రాజధానిని 30 రోజుల్లో ప్రభుత్వంతో ఒప్పించి ఏర్పాటు చేయించగలరా? అని సవాల్ చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు కందుల రాజమోహన్‌రెడ్డి, సింగారెడ్డి రామచంద్రారెడ్డి, పార్థసారధి,గోసుల శ్రీనివాసరెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగాధర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు పుప్పాల శ్రీనాధరెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు భవానీరెడ్డి, తదితరులు పాల్గొని మాట్లాడారు. -
‘కాంగ్రెస్, టీడీపీ కలిసిపోయాయి’
సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. కర్ణాటకలో కుమారస్వామి ప్రమాణస్వీకారం సందర్భంగా జరుగుతున్న పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడుతూ... కర్ణాటకలో సీఎం ప్రమాణస్వీకార వేదిక సాక్షిగా తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని కించపరస్తూ కాంగ్రెస్, టీడీపీలు కలిసిపోయాయని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రజల గొతు కోసిన కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు కుమ్మకైయారని ఆరోపించారు. చంద్రబాబు ఇలా చేయడం వల్ల ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని, సీఎం చంద్రబాబు ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రముఖ్య పుణ్యక్షేత్రం తిరుమలలో జరుగుతున్న వ్యవహారాలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. టీటీడీ ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు చేసిన ఆరోపణలు, అనుమానాలపై సీబీఐ విచారణ జరిపించాలని, టీటీడీ అంటే టీడీపీ పార్టీ కార్యాలయం కాదని ఎద్ధేవా చేశారు -
అమిత్ షాకు బాబు క్షమాపణ చెప్పాలి
-
‘చంద్రబాబు కనుసన్నల్లోనే దాడి’
సాక్షి, హైదరాబాద్: పధకం ప్రకారమే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై దాడి జరిగిందని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. టీడీపీ నాయకుల చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్‌లో శుక్రవారం లక్ష్మణ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ...‘ఒక రోజు ముందస్తు ప్రణాళికలో భాగంగానే ఈ దాడి జరిగింది. ఇదే విషయాన్ని ఆ ఏరియా ఎస్పీ కూడా చెప్పారు. కానీ వాటిని పోలీసులు ఖాతరు చేయలేదు. ఈ విధమైన చర్యలు చేస్తే టీడీపీ చరిత్ర హీనమై పోతుంది. అమిత్ షాపై దాడి ఘటనకు చంద్రబాబే బాధ్యత వహించాలి. ఆయన కనుసన్నల్లోనే ఈ ఘటన జరిగింది’ అని అన్నారు. బీజేపీ దేశ వ్యాప్త విజయాలను జీర్ణించుకోలేక ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ గెలుపు ఆంధ్రప్రదేశ్‌లో కూడా పాకుతుందనే భయంతో ఇలాంటివి చేస్తున్నారని లక్ష్మణ్ పేర్కొన్నారు. ఏపీ ప్రజలు మీ పాలనపై, మీపై రాజకీయంగా చరమ గీతం పాడతారని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రత్యేక హోదాపై కావాలని యు టర్న్ తీసుకొని ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ప్రత్యేక హోదా పేరు ఎత్తితే జైల్లో పెట్టండి అని చెప్పింది మీరు కాదా అని లక్ష్మణ్ ఈ సందర్భంగా చంద్రబాబును ప్రశ్నించారు. అమిత్ షాకు బాబు క్షమాపణ చెప్పాలి తిరుపతిలో వేంకటేశ్వరుని దర్శనానికి వచ్చిన అమిత్ షా పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడుకు తెలిసే ఈ దాడి జరిగిందని, ఇందుకు బాబు బహిరంగంగా అమిత్ షాకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ దాడి చాలా దురదృష్టకరం వెంకటేశ్వర స్వామి భక్తులపై జరిపిన దాడిగా భావించాల్సి వస్తుందని అన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలోనూ వేలమంది తెలంగాణ భక్తులు స్వామి దర్శనం చేసుకునేవారని, కానీ తిరుపతిలో దాడి జరిగిన పరిస్థితి లేదు. నైతిక పతనం.. పాలక పార్టీ, చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు. దాడిలో అమిత్ షా రెండో వాహనం అద్దాలు పగిలాయని, తిరుపతి చరిత్రలోనే ఇలాంటి ఘటన తొలిసారి అని కిషన్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు అవకాశవాద వైఖరిని తెలుగు ప్రజలు గమనించాలని కోరారు. కర్ణాటక ఎన్నికల తర్వాత అవినీతిని బయట పెడతారని చంద్రబాబు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు ప్రత్యేక హోదా పై విశ్వాసం లేదని, ఆయన ప్రేమంతా 2019లో కుర్చీ నిలబెట్టుకోవటంపైనే ఉందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను వాడుకుంటున్నారని మండిపడ్డారు. దాడి సమయంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారన్నారు. ఇది పిరికి పందల చర్య అమిత్ షాపై టీడీపీ దాడి హేయమైనదని బీజేపీ అధికార ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఇది పిరికి పందల చర్య అని మండిపడ్డారు. నేటి నుంచి టీడీపీ పేరు తెలుగుదేశం రౌడీల పార్టీ (టీడీఆర్పీ) అని మార్చుకొంటే మంచిదని చెప్పారు. దైవ దర్శనానికి వచ్చిన నాయకుడిపై దాడికి దిగటం అమానుషమని అన్నారు. ప్రజల హృదయాలు గెలవలేని పార్టీలే దాడులు, హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తాయన్నారు. బాబు దీనిపై తక్షణమే స్పందించాలన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ రాజకీయ సమాధి అవుతుందనటానికి ఇదే నిదర్శనమని చెప్పారు. టీడీపీ తెలుగు వారి ప్రతిష్టను దిగజార్చిందని, హామీలు నెరవేర్చకపోవడం వల్లనే దాడి చేశామంటే.. 500 హామీలు నెరవేర్చని టీడీపీ నాయకపలను ప్రజలు ఏమి చేయాలి.? అని ప్రశ్నించారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందన్న ద్వేషంతోనే అమిత్ షా పై దాడికి దిగారని విష్ణు వర్ధన్ అన్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యయుతంగానే టీడీపీ ప్రజాక్షేత్రంలో దాడులని ఎదుర్కొంటామని చెప్పారు. టీడీపీ దాడులకు, తాటాకు చప్పుళ్ళకి బీజేపీ భయపడదన్నారు. దైవ దర్శనానికి వచ్చిన వారిపై, రాజకీయాలకోసం దాడి చేసే సంస్కృతి టీడీపీ మాత్రమే నేడు ప్రారంభించిందని చెప్పారు. నైతిక విలువల గురించి మాట్లాడే అర్హత టీడీపీ ఈ రోజు నుంచి కోల్పోయిందని, అమిత్ షా వాహనాల అద్దాలు పగులగొట్టడం ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులు తమ క్రిమినల్ రాజకీయాలు తమంత తాముగా బయటపెట్టుకున్నారని విష్ణు వర్ధన్ రెడ్డి అన్నారు. -
మా నాయకుడి ఇలాకాలో పంచాయితా?
కర్నూలు సీక్యాంప్: సొంత పొలం కోసం వెళ్లిన వ్యక్తులపై దారుణంగా దాడి చేసిన ఘటన ఆర్కే దుద్యాలలో ఆదివారం చోటు చేసుకుంది. ‘మా నాయకుడి ఇలాకాలోనే పంచాయితీ పెడతారా’ అంటూ తెలుగు దేశం పార్టీ కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జ్ విష్ణువర్ధన్‌రెడ్డి వర్గీయులు దాడికి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన బోయ రాముడు, లక్ష్మీదేవి దంపతులు కొన్నాళ్ల క్రితం గ్రామాన్ని వీడి లక్ష్మీదేవి స్వగ్రామమైన నందికొట్కూరు మండలం వడ్డెమానుకు చేరుకున్నారు. వీరికి చెందిన 12 ఎకరాల పొలాన్ని గ్రామానికి చెందిన శేఖర్, బాలచంద్రుడు, రంగయ్య, నగేశ్, లక్ష్మన్న కుటుంబీకులు ఆక్రమించుకుని పంటలు సాగు చేస్తున్నారు. వారం క్రితం లక్ష్మీదేవి దంపతులు దుద్యాలకు చేరుకుని తమ పొలం తమకివ్వాలని కోరారు. అయితే పెద్దల సమక్షంలో పంచాయితీ పెడదామని చెప్పారు. ఈ మేరకు ఆదివారం లక్ష్మీదేవి తన సోదరులు బి. చంద్రస్వామి, రామస్వామిని వెంట తీసుకెళ్లింది. ఆర్.కొంతలపాడు, తులశాపురం, ఆర్.కె.దుద్యాల వాసులు పెద్ద ఎత్తున గ్రామానికి చేరుకుని లక్ష్మీదేవి పొలం ఆమెకు ఇచ్చేలా పంచాయితీ చేశారు. దీనిని జీర్ణించుకోలేని శేఖర్, బాల చంద్రుడు, రంగయ్య, నగేశ్,కుటుంబ సభ్యులు బి.చంద్రస్వాములు, బి.రామస్వామిపై కత్తులు, కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేశారు. తాము విష్ణువర్ధన్‌రెడ్డి వర్గీయులమని, తమ నాయకుడి ఇలాకాలో పంచాయితీ పెడతారా అంటూ దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తాలుకా పోలీసులు తెలిపారు. -
షాబాద్‌లో అదృశ్యం..గుంటూరులో శవంగా ప్రత్యక్షం
షాబాద్(చేవెళ్ల): షాబాద్‌లో అదృశ్యమైన యువకుడి మృతదేహం ఆంధ్రప్రదేశ్‌లో లభ్యమైంది. షాబాద్ ఎస్సై ఎం. రవికుమార్ తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి... షాబాద్ మండలంలోని ఏట్ల ఎర్రవల్లి గ్రామానికి చెందిన పీసరి విష్ణువర్ధన్‌రెడ్డి (26) ఈనెల 14న ఇంట్లో నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. రెండు రోజులు అతని కోసం వెతికిన కుటుంబసభ్యులు ఆచూకీ లభించకపోవటంతో ఈనెల 16న షాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈనెల 18న గుంటూర్ జిల్లా తాడేపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ పాత ఇంట్లో చెట్టుకు ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అతని వద్ద లభించిన ఆధార్‌కార్డు, సెల్‌ఫోన్, డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా తెలంగాణ రాష్ట్రంంలోని రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం ఏట్ల ఎర్రవల్లి గ్రామానికి చెందిన విష్ణువర్దన్‌రెడ్డిగా అక్కడి పోలీసులు గుర్తించి ఇక్కడ పోలీసులకు సమాచారం అందించారు. అదృశ్యమైన యువకుడి ఆచూకీ లభించిందని పోలీసులు అతడి కుటుంబసభ్యులకు సమాచారం అందించి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లారు. అయితే యువకుడు గుంటూరు వరకు ఎందుకు వెళ్లాడనే కోణంలో.. అతని సెల్‌ఫోన్ ఆధారంగా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. యువకుడి మృతదేహాన్ని గురువారం అర్ధరాత్రి వరకు స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు షాబాద్ ఎస్సై తెలిపారు. -
అమిత్ షా లేఖ.. అవమానం ఎలా అవుతుంది?
సాక్షి, అమరావతి : బీజేపీ జాతీయాధ్యక్షుడి హోదాలో అమిత్‌షా లేఖ రాస్తే అది అవమానమేలా అవుతుందని బీజేవైఎం ఏపీ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి టీడీపీ నేతలను ప్రశ్నిస్తున్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీతోపాటు వామపక్ష పార్టీలపై మండిపడ్డారు. ‘అమిత్ షా.. సీఎం చంద్రబాబుకు లేఖ రాస్తే టీడీపీ నేతలు దాన్నేదో తప్పులా చూస్తున్నారు. ఏపీ అసెంబ్లీ పూర్తిగా తెలుగు దేశం కార్యకర్తల సమన్వయ సమావేశంగా మారింది. సభలో ప్రజా సమస్యలు ప్రస్తావించకుండా.. పార్టీ వ్యవహారాలను.. అమిత్ షా లేఖ గుర్చించి ఎలా చర్చిస్తారు?.బీజేపీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు మాట్లాడకుండా టీడీపీ ఏం మాట్లాడుతుంది? కుర్చీలు వేస్తే మేము కూడా మాట్లాడుతాం. అమరావతిలో అన్ని కార్యాలయాలు కట్టినప్పుడు రాజధాని పూర్తయినట్లే కదా. మరి అలాంటప్పుడు అనవసరమైన ప్రకటనలు ఎందుకు?. సెంటిమెంట్.. అయింట్మెంట్.. అంటూ పాలన సాగిస్తున్నారు. నిధుల్లో ఒక్క రూపాయి లెక్క చూపలేదు. ఏపీకి ఇప్పటిదాకా ఇచ్చిన నిధులు వెనక పడిన ప్రాంతాలకు ఇచ్చినవి కాదు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి టీడీపీ ఎన్నికలకు వెళ్లటం ఖాయం’ అని విష్ణువర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘ఆధారాలుంటే మీడియాకు ఇవ్వండి’ బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా.. ఆయన తనయుడు జైషాలపై అవినీతి ఆరోపణలు చేస్తూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. అమిత్ షా అవినీతికి పాల్పడినట్లు మీ దగ్గర ఆధారాలు ఉంటే జాతీయ మీడియాకు ఇవొచ్చు కదా అని చంద్రబాబుకు ఆయన సూచించారు. ‘ఈ దేశంలో 11 మంది ముఖ్యమంత్రులపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణ చేసినంత మాత్రాన వారు అవినీతి పరులు అయిపోరు. నిరూపణ కావాలి. మీ పార్టీ కి చెందిన వ్యక్తి స్టాంపుల కుంభకోణం కేసులో దోషిగా తేలిన వ్యక్తి.. ఇప్పుడు తెలంగాణలో ఉన్నారు. అది తెలుసు కదా!’ అని చంద్రబాబుకు చురకలు అంటించారు. ‘పవన్.. గౌరవం పొగొట్టుకోకండి’ వామపక్ష పార్టీలతో కలిసి పని చేస్తే ఏపీలో ఉన్న అంతో.. ఇంతో గౌరవాన్ని కూడా కోల్పోవాల్సి ఉంటుందని జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్‌కు విష్ణువర్ధన్ సూచించారు. ఎమ్మెల్యేగా పని చేసిన రామకృష్ణ లాంటి వ్యక్తి ప్రధాని మోదీపై వ్యక్తిగత దూషణలు చేయడం సరైందేనా? పవన్ చెప్పాలన్నారు. ఇక లెఫ్ట్ పార్టీలు టెంట్ల కింద పార్టీలని.. ఓట్లు సీట్లు రావని విష్ణువర్దన్ ఎద్దేవా చేశారు. -
కానిస్టేబుల్‌కు రూ.18 లక్షల సాయం
సాక్షి, హైదరాబాద్: విధి నిర్వహణలో బాధ్యతగా ఉంటూ ఆరోగ్యం విషయంలో అలసత్వం వహించడం ఆ కానిస్టేబుల్ ప్రాణాల మీదకు వచ్చేలా చేసింది. వైరల్ ఫీవర్ కాస్త నిమోనియాగా మారి ఏకంగా ఎక్మో చికిత్స వరకు వెళ్లింది. విషమ పరిస్థితుల్లో ఉన్న కానిస్టేబుల్‌కు రూ.18.56 లక్షల నిధులను డీజీపీ అనురాగ్ శర్మ తన విచక్షణ అధికారాలతో మంజూరు చేశారు. చికిత్సకు రోజుకు లక్ష.. రాచకొండ పోలీస్ కమిషనేరేట్ పరిధిలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్లో విష్ణువర్ధన్‌రెడ్డి (31) కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. నెలరోజుల క్రితం వైరల్ ఫీవర్‌తో రావడంతో ఎల్బీనగర్లోని అవేర్ గ్లోబల్ ఆసుపత్రిలో చేరాడు. పరీక్షలు జరిపిన డాక్టర్లు.. విష్ణువర్ధన్‌కు నిమోనియా ఉందని నిర్ధారించారు. పరిస్థితి విషమించడంతో ఎక్మో చికిత్స అవసరమని, దీనికి రోజుకు రూ.లక్ష ఖర్చు అవుతుందని ఆస్పత్రి యాజమాన్యం వివరించింది. కిమ్స్ ఆస్పత్రిలో ఎక్మో (ఊపిరితిత్తులు నిర్వర్తించే పనిని ఈ పరికరం చేస్తుంది), వెంటిలేటర్ ద్వారా చికిత్స జరపగా 25 రోజుల తరువాత విష్ణువర్ధన్ కోలుకున్నాడు. ఆరోగ్య భద్రత కింద వచ్చే రూ.5 లక్షల కంటే అదనంగా 18.56 లక్షలు ఖర్చయింది. ఈ మొత్తాన్ని ఆరోగ్య భద్రత నుండి ఇప్పించవలసిందిగా డీజీపీకి పోలీస్ అధికారుల సంఘం నాయకులు గోపిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, భద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. తన విచక్షణ అధికారాలతో రూ.18.56 లక్షలను అనురాగ్‌శర్మ మంజూరు చేశారు. ‘కిమ్స్’ యాజమాన్యం శుక్రవారం మధ్యాహ్నం విష్ణువర్ధన్‌రెడ్డిని డిశ్చార్చ్ చేసింది. కానిస్టేబుల్ కుటుంబాన్ని ఆదుకు న్నందుకు డీజీపీ, భద్రతా విభాగం ఎస్పీ గోపాల్‌రెడ్డి, పోలీస్ అధికారుల సంఘం నేతలకు రాచకొండ, సైబరాబాద్ నాయకుడు భద్రారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. -
ఇద్దరు యువకులు మృతి
నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండల కేంద్ర శివారులోని వాగులో పడి కొట్టుకుపోయిన ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. స్థానికంగా నివాసముంటున్న రంజిత్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి వాగులోని నీటి ప్రవాహాన్ని చూడటానికి వచ్చి ప్రమాదవశాత్తు అందులో పడి గల్లంతయ్యారు. దీంతో వారిద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టిన స్థానికులకు సోమవారం ఉదయం యువకుల మృతదేహాలు లభించాయి. -
నీటితొట్టెలో పడి చిన్నారి మృతి
కరీంనగర్: తన చిలిపి చేష్టలతో.. అమాయక నవ్వులతో.. ఇంటిల్లిపాదిని సంతోషాల్లో ముంచే ఏడాదిన్నర చిన్నారి ప్రమాదవశాత్తు నీళ్ల తొట్టెలో పడి మృతి చెందాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలంలోని పోతారం (ఎస్) అనే గ్రామంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గంటా విష్ణువర్థన్ రెడ్డి (18 నెలలు) అనే బాలుడు ఇంట్లో ఆడుకుంటూ నీటి తొట్టెలో పడి మృతిచెందాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. -
కోటి సంతకాల పేరుతో కాంగ్రెస్ నాటకం
బీజేపీ యువ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కనిగిరి : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఛీకొట్టినా.. కోటి సంతకాల పేరితో ఆ పార్టీ నాయకులు కొత్త నాటకం ఆడుతున్నారని బీజేపీ యువ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. స్థానిక సాయిబాబ కల్యాణ మండపంలో సోమవారం జరిగిన యువమోర్చ జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై బీజేపీ కట్టుబడి ఉందని, కావాలని కాంగ్రెస్ నాయకులు బురద చల్లుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతొందని భయపడి కాంగ్రెస్ పార్టీ విషప్రచారం చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు చేస్తున్న ఎల్ఈడీ బల్బుల పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో అనేక పథకాలు అమలవుతున్నాయని యువ మోర్చ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రత్యేక హోదా అంశంలో జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు. జీవో నంబరు 101ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ దళిత విభాగం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య మట్లాడుతూ యువత పార్టీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర యాదవ్ మాట్లాడుతూ యువ మోర్చ కార్యకర్తలు గ్రామ స్థాయి నుంచి పార్టీ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా సుద్దికట్టు ఆంజనేయులు బీజేపీలో చేరారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు బత్తిన నరసింహారావు, మువ్వల రమణారావు, గోళి నాగేశ్వరరావు, పల్లి కృష్ణారెడ్డి, శాసనాల సరోజని, లక్ష్మన్, ధనంకుల శివాజీ తదితరులు పాల్గొన్నారు. -
అజ్ఞాతంలో విష్ణు, బెయిల్‌కు యత్నం
-
అజ్ఞాతంలో విష్ణు, బెయిల్‌కు యత్నం
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డి అరెస్ట్‌కు మాదాపూర్ పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. వంశీచంద్ రెడ్డిపై దాడి కేసుకు సంబంధించి ప్రత్యేక టీమ్..గురువారం ఉదయం అదుపులోకి తీసుకునేందుకు అతని నివాసానికి వెళ్లారు. అయితే విష్ణు ఆ సమయంలో ఇంట్లో అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. మరోవైపు ఆయన రెండు సెల్ఫోన్లు కూడా స్విచ్చ్ ఆఫ్ చేసి ఉన్నట్లు సమాచారం. మరోవైపు విష్ణు రంగారెడ్డి కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ పై విచారణను కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. కాగా విష్ణువర్దన్‌రెడ్డి నిన్న గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యను కలిశారు. కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డితో జరిగిన గొడవకు సంబంధించిన వివరాలు ఆయనకు తెలిపారు. విష్ణువర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వంశీతో జరిగిన గొడవ విచారకరం.మా గొడవకు, పార్టీకి ఏ సంబంధం లేదు. మేమంతా కాంగ్రెస్ కుటుంబ స భ్యులం..' అని పేర్కొన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో ఇద్దరు నేతల మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. వంశీచంద్ రెడ్డిపై పోలీసులకిచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటారా అన్న ప్రశ్నకు విష్ణు స్పందించ లేదు -
పొన్నాలను కలిసిన విష్ణువర్దన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్‌రెడ్డి బుధవారం గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యను కలిశారు. కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డితో జరిగిన గొడవకు సంబంధించిన వివరాలు ఆయనకు తెలిపారు. అనంతరం విష్ణువర్దన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్యే వంశీతో జరిగిన గొడవ విచారకరం. మా గొడవకు, పార్టీకి ఏ సంబంధం లేదు. మేమంతా కాంగ్రెస్ కుటుంబ స భ్యులం..’ అని పేర్కొన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో ఇద్దరు నేతల మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. వంశీచంద్ రెడ్డిపై పోలీసులకిచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటారా అన్న ప్రశ్నకు విష్ణు స్పందించ లేదు. -
ముదురుతున్న కాంగ్రెస్ యువ నేతల గొడవ
రాజీకి రాని వంశీచంద్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేసిన జానా, పొన్నాల వెనక్కి తగ్గేది లేదని చెబుతున్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే దాడి చేసింది విష్ణువర్ధన్‌రెడ్డేనని సీసీ కెమెరా ఫుటేజీల్లో వెల్లడి: పోలీసులు సాక్షి, హైదరాబాద్: ఒక వివాహ వేడుకలో పరస్పరం దాడికి పాల్పడిన కాంగ్రెస్ యువనేతల వివాదం మరింతగా ముదురుతోంది. టీ కాంగ్రెస్ పెద్దలు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా... ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి ఇద్దరూ రాజీకి వచ్చేందుకు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది పూర్తిగా తమ వ్యక్తిగత వ్యవహారం అన్నట్లుగా ఇద్దరూ పట్టుపడుతున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఒక వివాహ వేడుకలో వంశీచంద్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి గొడవ పడిన విషయం తెలిసిందే. వారిద్దరూ ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారు. ఈ వివాదం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనే భావనతో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతలు నష్ట నివారణ చర్యలు చేపట్టారు. సీఎల్పీ నేత జానారెడ్డి శుక్రవారమే వంశీచంద్‌తో మాట్లాడారు. ఎంపీ వి.హనుమంతరావు శనివారం విష్ణువర్ధన్‌రెడ్డితో మాట్లాడారు. వంశీచంద్‌తో కూడా మాట్లాడి వివాదం సద్దుమణిగేలా చూస్తానని పేర్కొన్నారు. టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య కూడా రంగంలోకి దిగి... సర్దుకుపోవాలని ఇద్దరినీ కోరారు. వారి తో మాట్లాడి రాజీ కుదిర్చే బాధ్యతను పార్టీ అధికార ప్రతినిధి నిరంజన్‌కు అప్పజెప్పారు. ‘ఇది మా సొంతింటి వ్యవహారం. మేం పరిష్కరించుకుంటాం..’ అని పొన్నాల మీడియాతో వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారం పార్టీకి ఇబ్బందికరంగా మారేలా ఉందని, రాజీ పడాలని సీనియర్ నేతలు చేసిన సూచనను వంశీచంద్, విష్ణు ఇద్దరూ కూడా పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదు. పోలీస్స్టేషన్లలో పెట్టిన కేసులను కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉపసంహరించుకునేది లేదని, ఎవ రిది తప్పయితే వారే మూల్యం చెల్లిస్తారని తమ అనుచరుల వద్ద వారు వ్యాఖ్యానిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వంశీచంద్‌రెడ్డి దీనిని ఢిల్లీ పెద్దలు, రాహుల్‌గాంధీ దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. ఇది పూర్తిగా వ్యక్తిగతమని, గొడవ జరిగింది పార్టీ వేదికపై కానందున పార్టీకి వచ్చే ఇబ్బందేమీ లేదని.. ఇక రాజీ ప్రసక్తి ఎందుకన్న అభిప్రాయాన్ని వంశీచంద్‌రెడ్డి వ్యక్తం చేయగా.. విష్ణు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు చెబుతున్నారు. పెళ్లిలో వంశీచంద్ తనతో కరచాలనం చేసి చెవిలో అసభ్యకర పదజాలంతో మాట్లాడటంతోనే గొడవ జరిగిందని విష్ణు పేర్కొంటున్నారు. వంశీపై దాడికి పాల్పడిన విష్ణు సీసీ ఫుటేజీలో వెల్లడి: సీఐ కాంగ్రెస్ యువ నేతల మధ్య గొడవపై కేసులు నమోదు చేసిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. దీనికి సంబంధించి మాదాపూర్ సీఐ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్యాణ మండపం వైపు వచ్చిన వంశీచంద్‌రెడ్డి విష్ణుతో చేయి కలిపారు. అభినందించిన విష్ణు ఉన్న ఫళంగా వంశీపై దాడికి పాల్పడ్డారు. అడ్డువచ్చిన గన్‌మన్ నజీర్పైన కూడా దాడి చేశాడు. ఆ తర్వాత కొద్ది దూరంలో నిలబడి ఉన్న వంశీపై మళ్లీ దాడి చేశాడు. అయితే సీసీ ఫుటేజీలను బట్టి ప్రభుత్వ ఉద్యోగి అయిన గన్‌మన్‌పై దాడికి పాల్పడినట్లుగా స్పష్టం కావడంతో విష్ణుపై కేసులో ఐపీసీ 332 సెక్షన్‌ను కూడా జతచేశామని సీఐ నర్సింహులు తెలిపారు. విష్ణు ఫిర్యాదు ఆధారంగా వంశీపై కేసు నమోదు చేసినప్పటికీ... వంశీ దాడి పాల్పడినట్లు ఆధారాలు లభించలేదని, అయినా దానిపై దర్యాప్తు చేపడతామని సీఐ వెల్లడించారు. -
మొక్కుతీరకనే.. మృత్యు ఒడికి..
తిరుపతి తుడా, క్రైం: మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం యూరేనిపల్లెకు చెందిన విష్ణువర్ధన్‌రెడ్డి(38) అతని కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి తిరుమలకు వస్తూ ఘోరరోడ్డు ప్రమాదంలో మరణించారు. కారులో బయలుదేరిన విష్ణువర్ధన్‌రెడ్డి(34), అతని తల్లి ప్రమీల(55), తండ్రి దయానందరెడ్డి (58), భార్య కవిత (30), 11 నెలల కూతురు ధన్యశ్రీ మరో గంటలో తిరుమలకు చేరుకోవాల్సి ఉండగా, వారిని విధి వంచిం చింది. మృత్యువు లారీ రూపంలో కబళించింది. మామండూరు అటవీ సమీపానికి చేరుకోగానే కోతుల గుంపు కారు నడుపుతున్న విష్ణువర్ధన్‌రెడ్డి కంటపడింది. ఇదిగో కోతులు అంటూ కుటుంబ సభ్యులకు చూపిం చాడు. అంతే రెప్పపాటులో ప్రమాదం జరిగిపోయింది. వేగంగా వస్తున్న విష్ణువర్థన్‌రెడ్డి కారును అదుపుచేయలేకపోయాడు. ఎదురుగా వస్తున్న టెన్‌టైర్ లారీని ఢీ కొట్టడంతో అక్కడికక్కడే అందరూ మృత్యువుపాల య్యూరు. కారు నుజ్జునుజ్జయింది. ఒడిలో ఉన్న చిన్నారిని బతికించుకుందామని తల్లి ఒడిసిపట్టుకుంది. అయినా ఆమె ప్రయత్నం విఫలమైంది. చిన్నారి కూడా కానరాని లోకాలకు వెళ్లిపోయింది. మృతదేహాలను చూసిన స్థానికులు, వాహనదారులు చలించిపోయారు. అల్లాడిన చిన్నారి ప్రమాదానికి గురైన 11నెలల చిన్నారి 15 నిమిషాల పాటు కొనఊపిరితో కొట్టుమిట్టాడింది. ద్విచక్ర వాహనంపై అటుగా వెళుతున్న వెంకటేష్, శశికాంత్ మానతాహృదయంతో స్పందించారు. ఒకరు 108కు సమాచారమిచ్చారు. మరొకరు ముందుగా తల్లి ఒడిలో ఉన్న చిన్నారిని బయటకు తీశారు. అప్పడు ఆ చిన్నారి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. వాహనం అదరడంతో పాపకు బలంగా సీటు వెనుకభాగం తగలడంతో ఊపిరి తీసుకోలేకపోయింది. చిన్నారి ప్రాణాలతో అల్లాడుతున్నా సహాయకులు ఏమీ చేయలేక కంటతడిపెట్టారు. అంతలోనే శ్వాస విడిచింది. నెత్తురోడుతున్న రోడ్డు మామండూరు ప్రాంతం ప్రమాదాలకు నిలయంగా మారింది. మామండూరు సమీపంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నారుు. శుక్రవారం జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంతో వార్తల్లో నిలిచింది. ఇక్కడ ఏదో ఒకవిధంగా భారీ ప్రమాదాలు జరుగుతున్నాయి. అటవీ ప్రాంతం కావడం, రోడ్డుపైకి జంతువులు రావడం, సడన్ బ్రేక్ వేయడం, వాహనాలు రోడ్డుపైనే పార్కింగ్ చేయడం ప్రమాదాలకు కారణాలని ఆ ప్రాంతీయులు చెబుతున్నారు. శుక్రవారం కూడా కోతుల గుంపు రావడంతోనే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. మరో 10 కిలోమీటర్లు ప్రయాణించి ఉంటే.. మామండూరు నుంచి మరో 10 కిలోమీటర్లు ప్రయాణించి ఉంటే ఆ కుటుంబం ప్రమాదం నుంచి బయట పడేది. రేణిగుంట రోడ్డు నుంచి కరకంబాడి మార్గంలో వెళ్లివుంటే ప్రమాదం నుంచి తప్పించుకునేవారేమో. ప్రమాదం జరిగిన ప్రాంతంలో రోడ్డుకు ఆనుకుని భారీ వృక్షాలు ఉన్నాయి. వాటికి తోడు కోతుల గుంపు రోడ్డుపైకి వచ్చి రావడం ప్రమాదానికి కారణమరుుంది. -
సోలార్ పార్కులు ఏర్పాటు చేస్తున్న సైరస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సోలార్ రంగంలో ఉన్న హైదరాబాద్ కంపెనీ సైరస్ సోలార్ రెండు సోలార్ పార్కులను ఏర్పాటు చేస్తోంది. తెలంగాణలోని నల్గొండలో 100 మెగావాట్లతో, మరొకటి కర్నాటకలో 50 మెగావాట్ల సామర్థ్యంతో నెలకొల్పుతోంది. పార్కు స్థాపనకు కావాల్సిన మౌలిక వసతులను నల్గొండ పార్కులో ఆరు నెలల్లో, కర్నాటక పార్కులో ఏడాదిలో పూర్తి చేస్తామని సైరస్ సోలార్ సీఈవో, ఫౌండర్ విష్ణువర్ధన్‌రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. మౌలిక వసతుల కల్పనకుగాను రూ.150 కోట్లు వెచ్చిస్తున్నట్టు చెప్పారు. పార్కుల్లో పెట్టుబడి పెట్టేందుకు 10-15 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఆసక్తి కనబరుస్తున్నారని వెల్లడించారు. ప్రైవేటు ఈక్విటీ తీసుకుంటున్నట్టు చెప్పారు. ఎంత వాటా విక్రయించేదీ ఇప్పుడే చెప్పలేమని, మెజారిటీ వాటాదారుగా తాము ఉంటామని అన్నారు. సోలార్ పరికరాల తయారీ.. ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ కంపెనీ అయిన సైరస్ సోలార్ దేశవ్యాప్తంగా ఇప్పటికే 90 మెగావాట్ల ప్రాజెక్టులను వివిధ కంపెనీల కోసం ఏర్పాటు చేసింది. మరో 100 మెగావాట్లకు ఆర్డర్లున్నాయని, 18 నెలల్లో పూర్తి చేస్తామని విష్ణువర్ధన్‌రెడ్డి చెప్పారు. తమతో కలిసి సోలార్ పరికరాల తయారీ చేపట్టేందుకు విదేశీ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని వెల్లడించారు. హైదరాబాద్ సమీపంలో ఒకటి, ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్లాంటును నెలకొల్పుతామని పేర్కొన్నారు. ఒక్కో ప్లాంటుకు రూ.100 కోట్లు వ్యయం చేస్తామన్నారు. సోలార్ మాడ్యులర్లు, ఫ్రేమ్‌ల వంటి పరికరాలను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తామని వివరించారు. విద్యుత్ కొరత నుంచి బయట పడాలంటే సౌర విద్యుత్ చక్కని పరిష్కారమని అన్నారు. సోలార్ పాలసీ కోసం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించే సోలార్ పాలసీ కోసం పారిశ్రామికవేత్తలు ఎదురు చూస్తున్నామని సీఈవో చెప్పారు. పంపిణీ నష్టాలు, రాష్ట్రాలు, డివిజన్ల మధ్య పంపిణీ చార్జీల వంటి అంశాల్లో స్పష్టత రావాల్సి ఉందన్నారు. సోలార్ పంపుసెట్ల విషయంలో ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని చెప్పారు. -
విలాసాలకే సింగపూర్ వెళ్లిన సీఎం
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విష్ణువర్ధన్‌రెడ్డి మెదక్‌టౌన్: విలాసాల కోసమే సీఎం కేసీఆర్ సింగపూర్ వెళ్లారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విష్ణువర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన మెదక్‌లో విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం ఇంటర్నెట్లోనే అన్ని దేశాలు కనిపిస్తున్నాయని, దానిని వదిలేసి సింగపూర్ టూర్ పేరుతో సీఎం కేసీఆర్ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారన్నారు. రైతు రుణమాఫీపై కేసీఆర్ హామీఇచ్చి, ఇప్పుడు స్పష్టత ఇవ్వకుండా రైతుల మరణాలకు కారణమవుతున్నారని ఆరోపించారు. దీంతో సీఎం జిల్లాలోనే రైతులు ఎక్కువమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరువుతో రైతులు అల్లాడుతుంటే సీఎం కేసీఆర్ సింగపూర్ వెళ్లడం అవసరమా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ను సింగపూర్‌లా చేస్తానని కేసీఆర్ తెలంగాణ ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు. మెదక్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు ప్రజలు తగినబుద్ధి చెబుతారన్నారు. సీఎం తెలంగాణను అభివృద్ధి చేయకుండా గజ్వేల్ చుట్టూ చక్కర్లు కొట్టడం దురదృష్టకరమన్నారు. -
ఈ మొక్కలు దిగుబడులను హరిస్తాయి
పెనుగొండ (పశ్చిమ గోదావరి): వరి నాట్లు వేసిన 25-30 రోజులకు కూలీలతో కలుపు మొక్కలను తీయించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే అప్పటికే ఈ మొక్కలు భూమిలోని పోషకాలను చాలా వరకూ గ్రహిస్తాయి. దీంతో వరి పైరుకు నష్టం జరుగుతోంది. కలుపు వల్ల వరి దిగుబడి 20-34% తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది. ఈ నేపథ్యంలో వరిలో కలుపు నివారణపై పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరులోని వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మానుకొండ శ్రీనివాసు, ఆంధ్రప్రదేశ్ వరి పరిశోధనా సంస్థ డెరైక్టర్ డాక్టర్ ఎ.విష్ణువర్ధన రెడ్డి అందిస్తున్న సూచనలు... ఇవి మూడు జాతులు వరిని 3 జాతుల కలుపు మొక్కలు నష్టపరుస్తాయి. గడ్డి జాతికి చెందిన వరి మొక్క, అదే జాతికి చెందిన కలుపు మొక్క ఒకేలా ఉంటాయి. అందువల్ల వీటిని గుర్తించి తీసేయడం చాలా కష్టం. వరి చేలో ఊద, గరిక, కరిగడ్డి/కారిగడ్డి, నక్కపీచు/నక్కతోక, చిప్పర గడ్డి, ఉర్రంకి వంటి గడ్డి జాతి కలుపు మొక్కలు కన్పిస్తుంటాయి. ఇక తుంగ జాతి కలుపు మొక్కల వేర్లలో అక్కడక్కడ దుంపలు ఉంటాయి. వీటిలోని ఆహారాన్నే మొక్కలు నిల్వ చేసుకుంటూ పెరుగుతాయి. కాబట్టి ఈ మొక్కను దుంపతో సహా పీకేయాలి. వరి చేలో తుంగ, నీటి తుంగ, బొడ్డు తుంగ, చలి తుంగ, రాకాసి తుంగ వంటి తుంగ జాతి మొక్కలు కన్పిస్తుంటాయి. కొన్ని కలుపు మొక్కల ఆకులు వెడల్పుగా ఉంటాయి. ఈ మొక్కలు విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతాయి. తూటికూర, తూటికాడ, గుంట గలిజేరు, చిన్న నక్కపూత చెట్టు, పులిచింత, నీరుదంటు, ఆమడకాడ, తోటకూర వంటివి ఈ జాతికి చెందిన కలుపు మొక్కలు. యాజమాన్య పద్ధతులతో... గట్ల మీద, సాగు నీటి కాలువల్లో ఉన్న కలుపు మొక్కలను తొలగించాలి. పొలాన్ని బాగా దమ్ము చేస్తే కలుపు బెడద సగం తగ్గుతుంది. పోషకాలు, సాగు నీటి యాజమాన్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే పైరు నేలంతా కమ్ముకొని కలుపును పెరగనీయదు. ప్రతి సంవత్సరం వరి పైరునే వేయకుండా వరి తర్వాత వేరుశనగ లేదా ఇతర పంటలు వేసుకుంటే కలుపు తాకిడి తగ్గిపోతుంది. నాట్లు వేసిన తర్వాత 20, 30 రోజులప్పుడు కలుపు మొక్కలను వేర్లతో సహా తీసేయాలి. అవసరమైతే 40 రోజులప్పుడు మూడోసారి కలుపు తీయించాలి. మొదటిసారి కలుపు తీసిన తర్వాత నత్రజని ఎరువును పైపాటుగా వేస్తే మొక్కలకు ఎక్కువ పిలకలు వస్తాయి. కలుపు తీసిన తర్వాతే ఎరువు వేయాలి. రసాయనాలతో... ఎకరం విస్తీర్ణంలో నాటేందుకు సరిపడే నారుమడిలో విత్తనాలు చల్లిన 7-8 రోజులకు ఊద ని ర్మూలన కోసం 200 లీటర్ల నీటిలో 1.5-2 లీట ర్ల బ్యూటాక్లోర్ కలిపి పిచికారీ చేయాలి. లేకుం టే విత్తనాలు చల్లిన 14-15 రోజులప్పుడు 200 లీటర్ల నీటిలో 400 మిల్లీలీటర్ల సైహలోఫాప్ బ్యూటైల్ 10% కలిపి పిచికారీ చేసుకోవాలి. మాగాణి వరిలో ఊద వంటి ఏకవార్షిక గడ్డి జాతి మొక్కల నిర్మూలనకు నాట్లు వేసిన 3-5 రోజుల మధ్య ఎకరానికి 1-1.5 లీటర్ల బ్యూటాక్లోర్ 50% లేదా 500 మిల్లీలీటర్ల అనిలోఫాస్ 30% లేదా 500 మిల్లీలీటర్ల ప్రెటిలాక్లోర్ 50% లేదా 1.5-2 లీటర్ల బెంధియోకార్బ్ 50% మందును 25 కిలోల ఇసుకలో కలిపి వెదజల్లాలి. లేకుంటే ఎకరానికి 35-50 గ్రాముల ఆక్సాడయార్జిల్ 80% పొడి మందును 500 మిల్లీలీటర్ల నీటిలో కలిపి, ఆ ద్రావణాన్ని నాటిన 3-5 రోజుల మధ్య పొడి ఇసుకలో కలిపి చల్లాలి. చేలో తుంగ, గడ్డి, వెడల్పాటి ఆకులున్న కలుపు మొక్కలు సమానంగా ఉన్నప్పుడు నాట్లు వేసిన 3-5 రోజుల మధ్య ఎకరానికి 4 కిలోల బ్యూటాక్లోర్ 5% గుళికలు+4 కిలోల 2,4-డి ఇథైల్ ఎస్టర్ 4% గుళికలను 20 కిలోల పొడి ఇసుకలో కలిపి వెదజల్లాలి. విత్తనాలు వెదజల్లినప్పుడు... దమ్ము చేసిన పొలంలో నేరుగా విత్తనాలను వెదజల్లినప్పుడు... విత్తనాలు చల్లిన 8-10 రోజుల్లో బ్యూటాక్లోర్+సేఫ్‌నర్ కలిసిన మందు 1.25 లీటర్లు లేదా 500 మిల్లీలీటర్ల అనిలోఫాస్ లేదా ప్రెటిలాక్లోర్+సేఫ్‌నర్ కలిసిన మందు 600 మిల్లీలీటర్లు లేదా 400 మిల్లీలీటర్ల సైహలోఫాప్ బ్యూటైల్‌ను 25 కిలోల ఇసుకలో కలిపి వెదజల్లాలి. విత్తనాలు చల్లిన 15-20 రోజులకు ఎకరానికి 200 లీటర్ల నీటిలో 80 మిల్లీలీటర్ల బిస్ పైరిబాక్ సోడియం లేదా 400 మిల్లీలీటర్ల సైహలోఫాప్ బ్యూటైల్ కలిపి పిచికారీ చేయాలి. విత్తనాలు వేసిన 25-30 రోజులప్పుడు వెడల్పాటి ఆకులున్న కలుపు మొక్కల ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఎకరానికి 400 గ్రాముల 2,4-డి సోడియం సాల్ట్ 80% పొడి మందును 200 లీటర్ల నీటిలో కలిపి కలుపు మొక్కలపై పడేలా పిచికారీ చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు అవసరం కలుపు మందు పిచికారీ చేయడానికి స్ప్రేయర్‌కు ఫ్లడ్జెట్ లేక ప్లేట్ఫేస్ నాజిల్‌ను ఉపయోగించాలి. నేల పొడిగా ఉన్నప్పుడు రసాయనాలు పిచికారీ చేసినా లేదా గుళికలు చల్లినా పనిచేయవు. కలుపు మందును ద్రవ/గుళికల రూపంలో ఇసుకలో కలిపి వాడినప్పుడు చేలో 2-5 సెంటీమీటర్ల వరకు నీటిని నిలగట్టాలి. మందును పొలమంతా సమానంగా పడేలా చల్లుకోవాలి. బయటి నీరు లోపలికి రాకుండా, లోపలి నీరు బయటికి వెళ్లకుండా గట్లను కట్టుదిట్టం చేయాలి. నాలుగైదు రోజుల వరకు ఆ నీటిని తీయకూడదు. పైరు దశ, కలుపు మొక్క జాతిని బట్టి తగిన మందులు వాడాలి. -
కడుపుకోతేమిగిలింది
బోధన్: కన్నవారికి కడుపుకోతే మిగిలింది. తమ కొడుకు వస్తాడని 22రోజులుగా ఎదురుచూస్తున్న వారి ఆశలు ఆడియాశలయ్యాయి. బియాస్‌నదిలో మరో మృతదేహం లభ్యమైంది.. అది బోధన్‌కు చెందిన విష్ణువర్ధన్‌రెడ్డిగా గుర్తించామని హిమాచల్‌ప్రదేశ్ నుంచి వార్త రాగానే.. ఆ కుటుంబం కుప్పకూలింది. ఒక్కసారిగా గుండెలవిసేలా రోదించింది. ప్రమాదం జరిగినప్పటి నుంచే ఏకధాటిగా ఏడుస్తున్నా.. తమ బిడ్డ ఎలాగైన బతికి వస్తాడని కోటిఆశలతో ఉన్న ఆ తల్లిదండ్రుల గుండెలు పగిలాయి. ‘నాన్నా.. నేను విహారయాత్రకు వెళ్తున్నాను.. అని చెప్పి వెళ్లిన నా కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. మమ్మల్ని ఇలా వదిలేసి పోతాడనుకోలేదు.’ అంటూ వెంకటేశ్వర్‌రెడ్డి దంపతులు కన్నీరుమున్నీరవుతున్నారు. బియాస్ నదిలో కొడుకు గల్లంతైన విషయం తెలిసినప్పటి నుంచి తల్లి రమాదేవి మంచం పట్టింది. ఇప్పడింకా కోలుకోలేని స్థితిలో ఉంది. తమ బిడ్డ మధుర జ్ఞాపకాలను తలచుకుంటూ కుమిలిపోతున్న వారిని ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబ నేపథ్యం బోధన్ మండలలోని సాలంపాడ్‌కు చెందిన మేడం వెంకటేశ్వర్ రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడు , ఇదే మండలంలోని అమ్దాపూర్ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం బోధన్ పట్టణంలోని రాకాసీపేట్‌లో స్థిరపడ్డారు. వెంకటేశ్వర్ రెడ్డి బార్య రమాదేవీ దంపతులకు ఇద్దరు సంతానం. కుతూరు అనూష, కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి. అనూష్ హైదరాబాద్‌లో సాప్ట్వేర్ ఇంజనీరు. విష్ణువర్ధన్ రెడ్డి వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ ( ఎలక్ట్రానిక్ ఇస్ట్రుమెంట్షన్ ఇంజనీరింగ్) ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇరువురు బిడ్డలు ఉన్నత చదువుల్లో రాణిస్తుంటే వెంకటేశ్వర్ రెడ్డి కుటుంబం ఎంతో ఆనందంతో ఉన్నారు. విహార యాత్రకు ముందు.. విష్ణువర్ధన్ రెడ్డి బిటెక్ వార్షిక పరీక్షలో జూన్ 1న పూర్తికాగా, 3న కళాశాల విద్యార్థులో విహార యాత్రకు వెళ్లాడు. ఏ నెలల మొదటి వారంలో నాన్నమ్మ ఆదిలక్ష్మికి బాగ లేదంటే బోధన్ వచ్చి మూడు రోజులు ఇక్కడే ఉండి వెళ్లాడు. ఆ తర్వాత వార్షిక పరీక్షలుండటం ఉన్నాయని వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు . హైదరాబాద్‌లో ఉండి పోయాడు. జూన్ 3న కళాశాల విద్యార్థులతో విహార యాత్రకు వెళ్లి బియాస్ నది నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. ఇదే సమయంలో విష్ణు తల్లీదండ్రులు వెంకటేశ్వర్‌రెడ్డి భర్య రమాదేవితో కలిసి విశాఖపట్నంలోని బావమరిది శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో శుభకార్యానికి వెళ్లారు. జూన్ 8న శుభకార్యం ఉండగా, అదే రోజు బియాస్ నదిలో దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ సమాచారం తెలుసుకుని హుటాహుటిన హైదరాబాద్ చేరుకుని విమానంలో హిమాచల్‌ప్రదేశ్ చేరుకున్నారు. వెంకటేశ్వర్‌రెడ్డి సోదరుడు శ్రీనివాస్‌రెడ్డి, వారి స్నేహితులు రాజశేఖర్ కూడా అక్కడి వెళ్లారు. ఐదురోజుల పాటు అక్కడే ఉండి విష్ణు ఆచూకీ కోసం దుఖాన్ని దిగమింగుకుని నిరీక్షించారు. కానీ విష్ణు ఆచూకీ తెలియకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. గల్లంతైన రోజు నుంచి విష్ణు తల్లి రమాదేవి నిద్రాహారాలు మాని మంచం పట్టింది. ఆమెను ఓదార్చడం ఎవరివల్ల కావడం లేదు. 22 రోజులకు లభ్యమైన మృతదేహం విష్ణువర్ధన్‌రెడ్డి హైదరాబాద్‌లో వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ చదువుతున్నాడు. హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్‌నదిపై గల లార్జీడ్యాం వద్ద ఈనెల 8న ఫొటోలు దిగుతుండగా, ఆ డ్యాం గేట్ల ఎత్తివేయడంతో నీటి ప్రవాహంలో 24 మంది విద్యార్థులు గల్లంతయ్యారు. వారిలో విష్ణువర్ధన్‌రెడ్డి కూడా ఉన్నాడు. గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 20 మంది విద్యార్థుల మృత దేహాలను వెలికితీశారు. మరో నలుగురు విద్యార్థుల ఆచూకీ తెలియరాలేదు. 22 రోజులకు సోమవారం బోధన్‌కు చెందిన విష్ణువర్ధన్‌రెడ్డి మృతదేహం లభ్యమైంది. బియాస్ నది గాలింపులో విష్ణువర్ధన్‌రెడ్డి మృతదేహం లభ్యమైనట్లు ఘటన స్థలం వద్ద ఉన్న కళాశాల ప్రతినిధి ప్రణయ్‌రెడ్డి విష్ణు చిన్నాన్న శ్రీనివాస్‌రెడ్డికి ఫోన్‌ద్వారా సమాచారం అందించారు. విష్ణు మృత దేహాన్ని మండి జిల్లా కేంద్రంలో పోస్టు మార్టం నిర్వహించి హైదరాబాద్‌కు తరలించేందుకు అక్కడి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం సాయంత్రం 3 గంటల సమయంలో పోస్టుమార్టం పూర్తి అవుతుందని సమాచారం ఇచ్చారు. మంగళవారం ఉదయం 9.50 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మృత దేహాన్ని ప్రత్యేక విమానంలో తీసుకురానున్నారు. విష్ణువర్ధన్‌రెడ్డి స్వగ్రామమైన సాలంపాడ్‌లో అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబీకులు నిర్ణయించారు. -
జగదీష్‌కు కన్నీటి వీడ్కోలు
రహమత్‌నగర్: బియాస్ నదిలో గల్లంతైన జగదీష్ మృతదేహం శుక్రవారం మధ్యాహ్నం రహమత్‌నగర్‌కు చేరుకోగా, సాయంత్రం అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. ఉదయం నుంచి ఎదురుచూస్తున్న అతడి తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, జగదీష్ మృతదేహాన్ని చూడగానే ఒక్కసారిగా బోరుమని విలపించారు. రోదనలు మిన్నంటాయి. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి అంబులెన్సులో జగదీష్ భౌతిక కాయాన్ని రహమత్‌నగర్‌లోని బంగారు మైసమ్మ దేవాలయం వద్ద ఉన్న అతడి ఇంటికి తీసుకొచ్చారు. పదహారు రోజులుగా కడసారి చూపు కోసం కళ్లు కాయలుకాచేలా ఎదురుచూస్తున్న అతడి తల్లి ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయింది. పలువురు ప్రముఖులు జగదీష్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్, జూబ్లీహిల్స్ ఎమ్యెల్యే మాగంటి గోపీనాథ్, మాజీ ఎమ్యెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు మురళీగౌడ్, ఎంఐఎం నాయకుడు నవీన్ యాదవ్, వైఎస్సార్ సీపీ నాయకుడు డాక్టర్ ప్రపుళ్లరెడ్డి, కార్పొరేటర్ బండపల్లి చంద్రమ్మ, సిటీ కాంగ్రెస్ సెక్రటరీ భవాని శంకర్, బీజేపీ నగర ప్రచార కార్యదర్శి కొలన్ సత్యనారాయణ, టీడీపీ డివిజన్ అధ్యక్షుడు ప్రహ్లాద్, టీఆర్ఎస్ నాయకులు భాస్కర్ సాగర్, నరసింహ, సత్యనారాయణ, పీఎల్ ప్రకాశం, వైఎస్సార్ సీపీ నాయకుడు షేక్ షమీమ్, జేఎల్ మేరి, ఎమ్మార్పీఎస్ నాయకుడు అరుణ్ హాజరై శ్రద్ధాంజలి ఘటించారు. తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సందర్శన చివరి క్షణంలో వాయిదా పడింది. సాయంత్రం ఈఎస్ఐ శ్మశానవాటికలో జగదీష్ అంత్యక్రియలు జరిగాయి. -
మా అదృష్టం ఇంతేనేమో..
బియాస్ నది వద్ద నుంచి తిరిగొచ్చిన వెంకటేశ్వరరెడ్డి బోధన్ టౌన్ : ‘‘జరిగిన దానికి ఎవరినీ నిందించ ను. మా అదృష్టం ఇంతే అనుకుంటా’’ అంటూ వేదన నిండిన హృదయంతో విష్ణువర్ధన్‌రెడ్డి తండ్రి వెంకటేశ్వరరెడ్డి పేర్కొన్నా రు. హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నదిలో ఆదివారం గల్లంతైన ఇంజినీరింగ్ విద్యార్థు ల్లో జిల్లాకు చెందిన విష్ణువర్ధన్‌రెడ్డి కూడా ఉన్న విషయం తెలిసిందే. సమాచారం తెలియగానే ఆయన తండ్రి వెంకటేశ్వరరెడ్డి, చిన్నాన్న శ్రీనివాస్‌రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లారు. శుక్రవారం వరకు విష్ణు ఆచూకీ తెలియలేదు. వెంకటేశ్వరరెడ్డి, శ్రీని వాస్‌రెడ్డి శుక్రవారం స్వగ్రామం బోధన్‌కు తిరిగి వచ్చారు. విషయం తెలుసుకున్న బంధువుల వారి ఇంటికి వచ్చి ఓదార్చారు. గల్లంతైన విద్యార్థులు తమ పిల్లలే అన్నట్లుగా రెస్క్యూ టీం గాలింపు చర్యలు నిర్వహిస్తోందని వెంకటేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణం గా గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోందన్నారు. భార్య రమాదేవి, కూతురు అనూష ఎలా ఉన్నారో అన్న ఆందోళనతో వచ్చానని, రెండు రోజులుండి మళ్లీ సంఘటన స్థలానికి వెళ్తానని పేర్కొన్నారు. కొవ్వత్తులతో నివాళి బోధన్ టౌన్ : ఇండస్ట్రియల్ టూర్‌కు వెళ్లి హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతై మరణించిన ఇంజినీరింగ్ విద్యార్థులకు బోధన్‌కు చెందిన ప్రజాసేవ యువసేన సభ్యులు నివాళులు అర్పించారు. శుక్రవారం రాత్రి స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో కొవ్వత్తులు వెలిగించారు. ఈ సందర్భంగా సొసైటీ వ్యవస్థాపకుడు వేములపల్లి బుజ్జి మాట్లాడుతూ పర్యాటక స్థలాల్లో సూచిక బోర్డులు, ప్రమాదకర ప్రాంతాలలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలను కోరారు. కార్యక్రమంలో యువసేన సభ్యులు ప్రకాశ్, రమణ, బాపురెడ్డి, అనిల్, ప్రసాద్, శంకర్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు. -
దుఃఖాన్ని దిగమింగి..
హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన జిల్లాకు చెందిన విద్యార్థి విష్ణువర్ధన్‌రెడ్డి ఆచూకీ నాలుగు రోజులు గడిచినా లభించలేదు. దీంతో ఆయన తండ్రి వెంకటేశ్వర్‌రెడ్డి నిరాశతో స్వగ్రామానికి పయనమయ్యారు. బోధన్ : నాలుగు రోజుల నిరీక్షణ ఫలించలేదు. బియాస్ నదిలో గల్లంతైన కుమారుడి ఆచూకీ లభించలేదు. నిరాశతో ఆ తండ్రి సంఘటన స్థలంనుంచి వెనుదిరిగారు. పుట్టెడు దుఃఖాన్ని కడుపులో దాచుకొని స్వగ్రామానికి పయనమయ్యారు. హైదరాబాద్ బాచుపల్లిలోని వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతున్న విష్ణువర్ధన్‌రెడ్డి తోటి విద్యార్థులతో ఇండస్ట్రియల్ టూర్‌కు వెళ్లి హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన విషయం తెలిసిందే. విష్ణు బోధన్‌లోని రాకాసిపేట్ ప్రాంతానికి చెందినవారు. కుమారుడి ఆచూకీ కోసం తండ్రి వెంకటేశ్వర్‌రెడ్డి, చిన్నాన్న శ్రీనివాస్‌రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లారు. మూడు రోజులపాటు అక్కడే ఉండి ఆచూకీ లభిస్తుందేమోనని వేచి చూశారు. వెంకటేశ్వర్‌రెడ్డి గురువారం రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. శ్రీనివాస్‌రెడ్డి, ఆయన స్నేహితుడు రాజశేఖర్ మాత్రం అక్కడే ఉన్నారు. గుండెలవిసేలా రోదిస్తున్న తల్లి, సోదరి బోధన్‌లోని రాకాసిపేట్ ప్రాంతంలోని స్వగృహంలో ఉన్న విష్ణు తల్లి రమాదేవి, సోదరి అనుష, అమ్మమ్మ కోటమ్మ, నానమ్మ ఆదిలక్ష్మి, ఇతర బంధువులు అతడి ఆచూకీ కోసం నిరీక్షిస్తున్నారు. వివరాలు తెలియకపోవడంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు. బంధువులు, స్నేహితులు వారిని ఓదారుస్తున్నారు. -
రెండు రోజులైనా..
బోధన్ : అప్పుడే రెండు రోజులు గడిచిపోయాయి. విజ్ఞాన యాత్రకు వెళ్లి హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి జిల్లాలో గల బియాస్ నదిలో గల్లంతైన ఇంజినీరింగ్ విద్యార్థి ఆచూకీ మాత్రం దొరకలేదు. విద్యార్థి తండ్రి, బంధువులు సంఘటన స్థలానికి వెళ్లారు. సమాచారం కోసం అతడి బంధువులు నిరీక్షిస్తున్నారు. బియాస్ నదిలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకున్న జల విషాదంలో బోధన్‌కు చెందిన బీటెక్ విద్యార్థి విష్ణువర్ధన్‌రెడ్డి కూడా చిక్కుకున్న విషయం తెలిసిందే. ఆ ఘటనలో 24 మంది విద్యార్థులు, అధ్యాపకులు కొట్టుకుపోగా మంగళవారం సాయంత్రానికి ఆరుగురి మృతదేహాలు లభిం చాయి. మిగిలిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. విష్ణువర్ధన్‌రెడ్డి తండ్రి వెంకటేశ్వర్‌రెడ్డి, చిన్నాన్న శ్రీనివాస్‌రెడ్డి, వీరి స్నేహితుడు చాపరాల రాజశేఖర్ సోమవారం సాయంత్రం 5 గంటలకు హిమాచల్‌ప్రదేశ్‌లోని ఘటన స్థలానికి చేరుకున్నారు. లార్జి డ్యాం నుంచి బియాస్ నదిలోకి నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో సోమవారం రాత్రి 7 గంటలనుంచి మంగళవారం ఉదయం 5 గంటల వరకు గాలింపు చర్యలు నిలిపివేశారని వారు తెలిపారు.రోజంతా గాళింపు జరిపారని, మళ్లీ మంగళవారం రాత్రి 7 గంటలకు గాలింపు చర్యలు నిలిపి వేశారని, బుధవారం ఉదయం గాళింపు చర్యలు మొదలు పెడతారని పేర్కొన్నారు. వాతావరణ ప్రతికూలత, డ్యామ్‌లో నీటి ఉధృతి వల్ల రాత్రి వేళ గాలింపు చర్యలకు ఆటంకంగా ఉంటోందని తెలిపారు. విషాదంలో.. విష్ణువర్ధన్‌రెడ్డి గల్లంతై రెండు రోజులు గడిచినా ఎలాంటి సమాచారం తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువుల్లో విషాదం నెలకొంది. విష్ణువర్ధన్‌రెడ్డి కుటుంబం బోధన్‌లోని రాకాసిపేట్‌లో నివసిస్తోంది. ఆ ప్రాంతంలో విషాదం అలుముకుంది. బంధువులు సమాచారం కోసం తెలిసినవారికి ఫోన్లు చేస్తున్నారు. -
బోధన్ విద్యార్థి గల్లంతు
బోధన్/ బోధన్ టౌన్ : హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల్లో జిల్లాలోని బోధన్ పట్టణానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి మేడమ్ విష్ణువర్ధన్‌రెడ్డి ఉన్నారు. విష్ణువర్ధన్‌రెడ్డి ఆచూకీ తెలియక పోవడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. విద్యార్థి తండ్రి మే డం వెంకటేశ్వర్‌రెడ్డి, చిన్నాన్న హిమాచల్‌ప్రదేశ్ బయలుదేరి వెళ్లిన ట్లు తెలిసింది. హైదరాబాద్‌లోని బాచుపల్లి వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో విష్ణువర్ధన్‌రెడ్డి బీటెక్ (ఈఐఈ) ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. ఈనెల 3న కళాశాలలోని విద్యార్థులతో కలిసి స్టడీ టూర్‌కు వెళ్లారు.అనూహ్యంగా నది నీటి ఉధృతిలో గల్లంతు కావడం ఆయన కుటుంబంలో విషాదాన్ని నింపింది. కుటుంబ నేపథ్యం .. విష్ణువర్ధన్‌రెడ్డి తండ్రి మేడం వెంకటేశ్వర్‌రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయులు. మండలంలోని అమ్ధాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత శాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. తల్లి రమాదేవి గృహిణి. సోదరి అనూష సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూ హైదరాబాద్‌లో ఉంటున్నారు. బోధన్ మండలంలోని సాలంపాడ్‌కు చెందిన వీరి కుటుంబం బోధన్ పట్టణంలోని రాకాసీపేట్‌లో స్థిరపడింది. ‘పది’ వరకు బోధన్‌లోనే విద్యాభ్యాసం .. ప్రాథమిక విద్య నుంచే విష్ణువర్ధన్‌రెడ్డి చదువులో ప్రతిభ కనబరిచే వాడని కుటుంబసభ్యులు తెలిపారు. 2009-10లో విష్ణువర్ధన్‌రెడ్డి పదో తరగతి పూర్తిచేశారు. 600 మార్కులకు గాను 547 మార్కులు సాధించారు. 2010-12లో హైదరాబాద్ లింగంపల్లి క్యాంపస్‌లోని నారాయణ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ పూర్తి చేశారు. ఎంసెట్‌లో 18 వేల ర్యాంకును సాధించారు. ప్రస్తుతం వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. విష్ణువర్ధన్‌రెడ్డి గల్లంతైన విషయం తెలుసుకుని బంధువులు బోధన్‌లోని ఆయన ఇంటికి తరలివస్తున్నారు. ప్రస్తుతం ఇంటి వద్ద విషువర్ధన్‌రెడ్డి నానమ్మ ఆది లక్ష్మమ్మ, అమ్మమ్మ కోటమ్మ ఉన్నారు. వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గోప్యంగా గల్లంతు సమాచారం .. విష్ణువర్ధన్‌రెడ్డి గల్లంతు విషయాన్ని తల్లి రమాదేవికి తెలియకుండా కుటుంబసభ్యులు జాగ్రత్త పడ్డారు. భర్తతో పాటు శుభకార్యానికి వైజాగ్ వెళ్లిన రమాదేవి, సోమవారం అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్‌లో చెల్లెలు రమాదేవి ఇంట్లో ఆమె ఉన్నట్లు బంధువులు తెలిపారు. కొడుకు గల్లంతు సమాచారం తెలిస్తే తట్టుకోలేదని రమాదేవికి చెప్పకుండా విషయాన్ని గోప్యంగా ఉంచారు. -
నేనే ఏఎస్జీ.. కాదు నేనే!
హైకోర్టులో అశోక్‌గౌడ్, విష్ణువర్దన్‌రెడ్డి వాదులాట సాక్షి, హైదరాబాద్: అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) పోస్టు విషయం లో హైకోర్టులో న్యాయవాదులు పొన్నం అశోక్‌గౌడ్, విష్ణువర్థన్‌రెడ్డి ల మధ్య మొదలైన కుమ్ములాట ఇప్పుడు కోర్టు విచారణ సమయం లో న్యాయమూర్తుల ముందు వాదులాట వరకు వచ్చింది. కొత్త ఏఎస్జీగా తాను నియమితులయ్యానని, తనకు ఆ బాధ్యతలు అప్పగించాలని విష్ణువర్దన్‌రెడ్డి వాదిస్తుంటే.. కాదు తనను తొలగిస్తున్నట్లు ఇంకా ఎటువంటి ఉత్తర్వులూ తనకు అందలేదు కాబట్టి తానే ఏఎస్జీగా కొనసాగుతానని అశోక్‌గౌడ్ చెబుతున్నారు. చివరకు కేంద్ర ప్రభుత్వం తరఫున ఏదైనా కేసు కోర్టులో విచారణకు వచ్చినప్పుడు వారు ఇరువురూ లేచి నేను ఏఎస్జీనంటే.. కాదు నేనే ఏఎస్జీనంటూ వాదించుకుంటున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక న్యాయమూర్తులు తలలు పట్టుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున హైకోర్టులో వాదనలు వినిపించడం ఏఎస్జీ బాధ్యత. మరికొందరు న్యాయవాదులు ఆయనకు సహాయకులుగా ఉంటారు. కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ సోదరుడైన అశోక్‌గౌడ్ 2009లో ఏఎస్జీగా నియమితులయ్యారు. ఆయన ఆ పోస్టులో కొనసాగుతుండగానే విష్ణువర్దన్‌రెడ్డి 2012, సెప్టెంబర్‌లో ఏఎస్జీగా రెండేళ్ల కాల పరిమితితో కేంద్రం నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన అశోక్‌గౌడ్... ఏఎస్జీగా పదవీకాలం పొడిగింపు ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. హైకోర్టు విచారించే రోజువారీ కేసుల జాబితా (కాజ్ లిస్ట్)లో కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరయ్యేందుకు అశోక్‌గౌడ్ పేరే మొన్నటి వరకూ ప్రచురితమయ్యేది. అయితే గత నెలలో అశోక్‌గౌడ్‌ను ఏఎస్జీ పదవి నుంచి రాష్ట్రపతి తొలగించారని, విష్ణువర్థన్రెడ్డే ఆ పదవిలో కొనసాగుతారని, కేసులన్నింటినీ ఆయనకే అప్పగించాలని అశోక్‌ను ఆదేశిస్తూ కేంద్ర న్యాయశాఖ జాయింట్ సెక్రటరీ ఆర్.ఎస్.శుక్లా పేరు మీద ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే అశోక్ మాత్రం ఆ ఉత్తర్వులు తనకు అందలేదంటూ ఏఎస్జీ కార్యాలయాన్ని ఖాళీ చేసేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో విష్ణువర్థన్‌రెడ్డి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను కలసి... శుక్లా ఉత్తర్వులను చూపించి, తానే ఏఎస్జీనని, కాజ్‌లిస్ట్‌లో తన పేరే ముద్రించాలని కోరారు. ఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్ ఆ మార్పు చేశారు. మరోవైపు వారిద్దరూ ఒకరిపై ఒకరు న్యాయమూర్తులకు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై దాఖలైన కేసులు గురువారం వివిధ కోర్టుల్లో విచారణకొచ్చిన సమయంలో ఏఎస్జీ పోస్టు విషయమై అటు విష్ణువర్థన్‌రెడ్డి, ఇటు అశోక్‌గౌడ్ తరఫున ఆయన సహాయక న్యాయవాదులు వాదులాడుకున్నారు. -
నమో నారసింహా.. !
కొల్లాపూర్‌రూరల్, న్యూస్‌లైన్: కొల్లాపూర్ మండలం సింగోటం శ్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగోరోజు శుక్రవారం కీలకఘట్టమైన రథోత్సవం వైభవంగా జరిగింది. దీనికి ముందుగా ఆలయంలో స్వామివారికి ఆలయ చైర్మన్ సురభివంశస్తులు వెంకట జగన్నాదిత్యలక్ష్మారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలకరించిన రథోత్సవంపై స్వామివారి ఉత్సవ మూర్తులను ఏర్పాటు చేశారు. ఊరేగింపునకు ముందు ఆలయచైర్మన్ లక్ష్మారావు మంగళవాయిద్యాలతో పట్టువస్త్రాలు,పూర్ణకుంభంతో వచ్చి ఉత్సవ మూర్తులకు పూజలు నిర్వహించారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే జూపల్లి, కాంగ్రెస్‌పార్టీఇంచార్జ్ విష్ణువర్ధన్‌రెడ్డి, మార్కెట్‌కమిటి చైర్మన్ కమలేశ్వర్‌రావులు ప్రత్యేకపూజలు నిర్వహించారు. స్వామివారి రథాన్ని లాగేందుకు యువకులు, భక్తులు అధికసంఖ్యలో ఆసక్తి కనబరిచారు. మహిళలు పూనకంతో ఊగిపోయారు. రత్నగిరి కొండ సమీపంలో ఉన్న శమీవృక్షం చుట్టూ రథాన్ని ఊరేగించి పూజలు నిర్వహించాక రథాన్ని తిరిగి ఆలయప్రాంగణంలోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా భక్తులు, ప్రజలు లక్ష్మీ నరసింహుని,గోవిందనామస్మరణలు, చప్పట్లతో హోరెత్తించారు. అంతకు ముందు ఉదయం నుంచే ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలలో భక్తులు పెద్ద ఎత్తున సింగోటం చేరుకుని ఆలయ సమీపంలో ఉన్న గుండంలో పుణ్యస్నానాలు ఆచరించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం కొండపై వెలసిన అమ్మవారికి పూజలు చేశారు. జాతరలో ఉన్న తినుబండారాలు,గాజులు,ఆటవస్తువులు, చెరుకుగడల దుకాణాలతో పాటు ఇతర వ్యాపార దుకాణాలన్నీ ప్రజలతో కిటకిటలాడాయి.జిల్లా నలుమూలలనుంచి, హైదారాబాద్‌తో పాటు కర్నూల్ జిల్లాకు చెందిన భక్తులు అధికసంఖ్యలో హాజరయ్యారు. శ్రీవారి సముద్రం చెరువుకు అవతలి వైపు ఉన్న స్వామివారి పాదాల వద్దకు నీటిలో వెళ్లేందుకు మరబోటు ఏర్పాటు చేయడంతో భక్తులు పెద్ద ఎత్తున వెళ్లారు. పూజలలో టీడీపీ ఇంచార్జ్ శ్రీనివాస్‌రెడ్డి, సీఆర్ జగదీశ్వర్‌రావు, సింగోటం సర్పంచ్ వెంకటస్వామి, మాజీసర్పంచ్ లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు హన్మంత్‌నాయక్, నరసింహ్మరావు,టీడీపీ నాయకులు శేఖర్‌శెట్టి, వెంకటేశ్వర్లు స్థానికులు ఉన్నారు.వనపర్తి డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కొల్లాపూర్, కొత్తకోట సీఐలు స్వామి,వెంకటేశ్వర్లుల ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. -
డాక్టర్ రామారెడ్డికి క న్నీటి వీడ్కోలు
అనపర్తి, న్యూస్‌లైన్: ప్రముఖ వైద్య నిఫుణుడు, శ్రీనివాసా నర్సింగ్‌హోమ్ అధినేత డాక్టర్ పోతంశెట్టి రామారెడ్డి (రాము డాక్టర్) అంత్యక్రియలు శుక్రవారం ఉదయం స్థానిక హిందూ శ్మశానవాటికలో నిర్వహించారు. ఆయన కుమారుడు డాక్టర్ జానకి రామారెడ్డి అంతిమ సంస్కారాలను నిర్వహించారు. రామారెడ్డి గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో మరణించిన సంగతి తెలిసిందే. రాము డాక్టర్ మృతదేహం గురువారం అర్ధరాత్రి దాటాక ఇక్కడి ఆయన స్వగృహానికి చేరుకుంది. అప్పటికే ఆయన అభిమానులు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఆయన మృతదేహాన్ని చూసిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో ఆప్రాతం శోకసంద్రమైంది. పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు రాము డాక్టర్ భౌతిక కాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. అంతిమ యాత్ర ఉదయం ఆరు గంటలకు ఆయన స్వగృహం వద్ద ప్రారంభమై శ్రీనివాసా నర్సింగ్‌హోమ్‌కు చేరింది. అక్కడ అభిమానుల దర్శనార్థం కొద్దిసేపు డాక్టర్గారి భౌతిక కాయాన్ని ఉంచారు. అక్కడ నుంచి అంతిమ యాత్ర హిందూ శ్మశానవాటికకు 11 గంటలకు చేరుకుంది. అంతిమ యాత్రలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే పీ విష్ణువర్థన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తేతలి రామారెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గనేత డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, డాక్టర్ టీ సత్యనారాయణరెడ్డి, డాక్టర్ ఏఎస్ఎన్ మూర్తి, డాక్టర్ టీరామగుర్రెడ్డి, డాక్టర్ జీఎస్‌ఎన్‌రెడ్డి, డాక్టర్ టీ నవీన్, డాక్టర్ జగన్మోహనరెడ్డి, డాక్టర్ కర్రి సాయి వెంకట కృష్ణారెడ్డి, రాయవరం ఏరియా రైసుమిల్లర్సు అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్. సత్యనారాయణరెడ్డి, నియోజకవర్గ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం ప్రతినిధి టి. సుధాకరరెడ్డి, వర్తక సంఘం అధ్యక్షులు కర్రి ధర్మారెడ్డి, గ్రామ సర్పంచ్ జి. బాపిరాజు, జీబీఆర్ విద్యా సంస్థల అధిపతి తేతలి ఆదిరెడ్డి, నల్లమిల్లి వెంకటరెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఎన్. వీర్రాఘవరెడ్డి, చిర్ల వీర్రాఘవరెడ్డి, వర్తక సంఘం మాజీ అధ్యక్షుడు సత్తి విశ్వనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పలువురి సంతాపం డాక్టర్ రామారెడ్డి మృతి పట్ల సనాతన ధర్మపరిరక్షణ సమితి అధ్యక్షుడు రెడ్డి సురేష్ శర్మ, ఘంటసాల ఆరాధన కమిటీ అధ్యక్షుడు దుర్భ శ్రీరామ్మూర్తి, పెన్షనర్ల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మిరియాల వీర్రాజు, పీవీఎన్ సూర్యనారాయణ, వాకర్స్ క్లబ్ ప్రతినిధులు తమలంపూడి రామారెడ్డి(ఇంజనీర్), తేతలి త్రిమూర్తులు రెడ్డి, నల్లమిల్లి మురళీమోహన బాలకృష్ణారెడ్డి, ఎన్సీఆర్ మురళి తదితరులు సంతాపం తెలిపారు. ఆస్పత్రులు, వ్యాపార, విద్యా సంస్థల మూసివేత రామారెడ్డి ఆకస్మిక మృతికి సంతాప సూచకంగా అనపర్తిలో శుక్రవారం ఆస్పత్రులు, వ్యాపార, విద్యా సంస్థలు, హోటళ్లు మూసివేశారు.