
మీడియాతో మాట్లాడుతున్న నేత విష్ణువర్ధన్‌రెడ్డి
సాక్షి, అనంపురం: సీఎం చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల డేటాను ఉపయోగించుకోవటం సిగ్గు చేటని బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడిమా సమావేశంలో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రజల డేటా చోరీ విషయంలో సీఎం చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆయన తనయుడు నారా లోకేషలు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో కుట్రలు చేస్తున్నారని ఆనయ ఆరోపించారు. తండ్రి కొడుకులు దొంగల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఏపీ ప్రజల డేటా చోరీ విషయంలో ఇరు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకోవాలని అన్నారు.