సాక్షి, అనంతపురం: ఓటుకు కోట్లు కేసులో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ దొంగ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ఏపీ ప్రజల డేటా చోరీ చేసిన ఘనుడు ఐటీ మంత్రి నారా లోకేశ్ అని తెలిపారు. శుక్రవారం అనంతపురంలో ఆమె మాట్లాడుతూ.. ఏపీ ప్రజలను మోసం చేసిన చంద్రబాబు, లోకేశ్‌లను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల విలువైన సమాచారాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించిన వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని అన్నారు. కలర్ ఫొటోలతో కూడిన ఓటరు జాబితా దొంగిలించిన నేరం కింద.. ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీపై అనర్హత వేటు వేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment