Data Breach
-
ప్రజల వ్యక్తిగత సమాచారం జనసేన చేతికి ఎలా వెళ్లింది?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో భారీ డేటా ఉల్లంఘన జరుగుతోందని వైఎస్సార్సీపీ ఆందోళన వ్యక్తం చేసింది. బుధవారం పార్టీ ‘ఎక్స్’ ఖాతాలో ఈ మేరకు పోస్టు చేసింది. ప్రభుత్వం వద్ద ఉండాల్సిన రహస్య సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే కాకుండా.. ఆ డేటాను అడ్డంపెట్టుకొని సామాన్య పౌరులను జనసేన కార్యకర్తలు వేధిస్తున్నారని ఆరోపించింది. ఇది పాలనా పతనాన్ని బట్టబయలు చేస్తోందని పేర్కొంది. కూటమి ప్రభుత్వ ఒత్తిళ్లతో పోలీసులు పట్టించుకోకపోవడం వల్ల రాష్ట్రంలో రాజకీయ గూండాయిజం రాజ్యమేలుతోందని, ఫలితంగా ప్రజల భద్రత ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజలకు రక్షణ కల్పిస్తామని చెబుతున్న జనసేన పార్టీ నాయకత్వం రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. ప్రజల సున్నితమైన డేటా నిమిషాల్లోనే జనసేన కార్యకర్తలకు ఎలా చేరుతోందని ప్రశ్నించింది. పోలీసులు, కూటమి కార్యకర్తలు కుమ్మక్కై పని చేస్తున్నారా లేక పోలీసులే తమ వద్ద ఉండాల్సిన పరికరాలను వారి చేతికే ఇచ్చేసి వాడుకోమని చెప్పారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయని పేర్కొంది. డేటా ఉల్లంఘన విషయంలో పరిశోధించడానికి పోలీసులను జవాబుదారీగా ఉంచడానికి, బెదిరింపులను అరికట్టడానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. -
స్టార్ హెల్త్ కస్టమర్ల డేటా లీక్.. ఆన్లైన్లో విక్రయం
న్యూఢిల్లీ: స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్‌కు చెందిన 3.1 కోట్ల మంది చందాదారుల వ్యక్తిగత డేటా ఆన్లైన్లో అమ్మకానికి పెట్టారు. హ్యాకర్ షెన్జెన్ ఏర్పాటు చేసిన ఓ వెబ్ పోర్టల్‌లో స్టార్ హెల్త్ కస్టమర్ల ఫోన్ నంబర్, పాన్, చిరునామా, ముందస్తు వ్యాధుల చరిత్ర తదితర వివరాలు విక్రయానికి పెట్టినట్టు తెలుస్తోంది.స్టార్ హెల్త్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (సీఐఎస్వో) ఈ డేటాను హ్యాకర్‌కు విక్రయించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. యూకేకు చెందిన జేసన్ పార్కర్ అనే పరిశోధకుడు సెప్టెంబర్ 20న ఇందుకు సంబంధించిన సమాచారాన్ని బయటపెట్టడం తెలిసిందే. స్టార్ హెల్త్ కంపెనీకి చెందిన డేటాను షెంజెన్ అనే హ్యాకర్ వెబ్సైట్లో ఉంచినట్టు వెల్లడించారు. స్టార్ హెల్త్ ఇండియాకు చెందిన కస్టమర్లు అందరి సున్నిత డేటాను బయటపెడుతున్నానని, ఈ సమాచారాన్ని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీయే అందించిందని హ్యాకర్ షెంజెన్ క్లెయిమ్ చేయడం గమనార్హం.దీనిపై స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ స్పందిస్తూ.. విచారణకు సీఐఎస్వో సహకరిస్తున్నారని, అతడు తప్పు చేసినట్టుగా ఎలాంటి సమాచారం గుర్తించలేదని స్పష్టం చేసింది. సంబంధిత సమచారాన్ని ఎవరూ వినియోగించకుండా మద్రాస్ హైకోర్ట్ నుంచి ఆదేశాలు పొందినట్టు తెలిపింది. స్వతంత్ర సైబర్ సెక్యూరిటీ నిపుణులతో నిర్వహిస్తున్న ఫోరెన్సిక్ దర్యాప్తు కొనసాగుతుందని ప్రకటించింది. -
ఈపీఎఫ్ఓ, పీఎంఓ డేటా లీకేజీ కలకలం?.. అప్రమత్తమైన కేంద్రం
దేశంలో డేటా లీకేజీ కలకలం రేపుతోంది. ప్రధాని కార్యాలయం (పీఎంఓ), ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ)ల డేటాబేస్ నుంచి డేటా లీకైనట్లు తెలుస్తోంది. ఈ డేటా లీకేజీపై స్పష్టత ఇవ్వాలని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా (CERT-In) కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. డేటా లీకేజీపై సమాచారం ఉంది. కానీ వాస్తవమా? కాదా? అని తెలుసుకునేందుకు రివ్యూ జరుపుతున్నాం. సీఈఆర్టీ.ఇన్ ఇచ్చే రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. డేటా లీకేజీ అంటూ వస్తున్న నివేదికలను పరిశీలిస్తున్నట్లు కేంద్రానికి చెందిన సైబర్ సెక్యూరిటీ నిపుణులు తెలిపారు. ‘డేటా లీకేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. అయితే, సైబర్ నేరస్తులు ఒక సర్వర్ ను యాక్సిస్ చేసినట్లు కొన్ని వాదనలు వినిపిస్తున్నాయని, అందుకు తగ్గ ఆధారాలు లేవు’ అని స్పష్టం చేశారు. గ్లోబల్ సాఫ్ట్వేర్, కోడ్ రిపోజిటరీ గిత్ హబ్‌లో చైనీస్ సైబర్ ఏజెన్సీలకు చెందిన కొన్ని పత్రాలు లీక్ అయ్యాయని, ఈ డాక్యుమెంట్లలో ఈపీఎఫ్ఓ, ఇండియన్ పీఎంఓ, ఇతర పబ్లిక్ నుండి డేటా ఉందని సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ఎక్స్ లో పలు పోస్ట్ లు వెలుగులోకి వచ్చాయి. అయితే, ఈ డేటా లీకేజీ అంశంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. భారత్ లక్ష్యంగా గత ఏడాది నవంబర్ లో విడుదల చేసిన నివేదిక ప్రకారం..ఇటీవల కాలంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, తాజ్ హోటల్స్, ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్ వంటి సంస్థలపై సైబర్ దాడులు జరిగిన సందర్భాలు ఉన్నాయి. దీంతో పాటు ఐటీ, బిజినెస్ ఔట్ సోర్సింగ్ సంస్థలతో సహా పలు సర్వీసులు అందించే సంస్థలపై అత్యధికంగా సైబర్ దాడులు జరిగినట్లు నివేదికలు హైలెట్ చేశాయి. సింగపూర్ కు చెందిన సైబర్ ఫిర్మా 2023 నివేదిక సైతం ప్రపంచ వ్యాప్తంగా జరిగే సైబర్ దాడులు భారత్ ను లక్ష్యంగా చేసుకుని 13.7శాతం ఉందని, ఆ తర్వాత అమెరికా, ఇండో నేషియా,చైనా దేశాలు ఉన్నట్లు తేలింది. -
షాకింగ్: 5.4 మిలియన్ల ట్విటర్ యూజర్ల డేటా లీక్! మస్క్ స్పందన ఏంటి?
న్యూఢిల్లీ: 44 బిలియన్ డాలర్లకు మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ట్విటర్‌ను బిలియనీర్ ఎలాన్ మస్క్ టేకోవర్ చేసి సంచలన నిర్ణయాలతో దూసుకుపోతుండగా మస్క్ భారీ షాక్ ఇచ్చే వార్త ఒకటి తాజాగా హల్ చల్ చేస్తోంది. భారీ ఎత్తున ఉద్యోగ కోతలపై విమర్శలు, తరువాత బ్లూటిక్ వెరిఫికేషన్ ప్లాన్ లాంటి గందరగోళం మధ్య, యూజర్ల భావ ప్రకటనా స్వేచ్ఛ, నకిలీ ఖాతాలకు చెక్ , పూర్తి భద్రత అంటూమస్క్ పదే పదే నొక్కి వక్కాణిస్తున్న తరుణంలో ట్విటర్ హ్యాకింగ్‌కు గురైందన్న వార్త కలకలం రేపింది. అంతర్గత లోపం ద్వారా ట్విటర్ వినియోగదారుల డేటా చోరీ చేసి ఆన్లైన్లో ప్రైవేట్‌గా షేర్ చేసినట్టు తెలుస్తోంది. (అయ్య బాబోయ్ ఇలా అయిపోతామా!మండే మోటివేషన్: ఆనంద్ మహీంద్ర ట్వీట్స్ వైరల్) ఇదీ చదవండి: వాట్సాప్ డేటా బ్రీచ్ కలకలం: ఆ మెసేజెస్ కాల్స్‌కి, స్పందించకండి! సుమారు 5.4 మిలియన్ల (5.5 కోట్లు) ట్విటర్ వినియోగదారుల డేటా లీక్ అయినట్లు వచ్చిన వార్తలకు తోడు అదనంగా 1.4 మిలియన్ల ట్విటర్ ప్రొఫైల్స్ చోరీ అయ్యాయట. ట్విటర్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ (API)ని ఉపయోగించి సెలబ్రిటీల నుండి కంపెనీల వరకు వినియోగ దారుల కీలకమైన వ్యక్తిగత డేటాను లీక్ చేసినట్టు తెలుస్తోంది. ట్విటర్ ఐడీలు, ప్రదేశాలు, పేర్లు, లాగిన్ పేర్లు లాంటి పబ్లిక్ సమాచారంతోపాటు, ఫోన్ నంబర్లు, ఇమెయిల్ అడ్రస్‌లు ఇతర ప్రైవేట్ డేటాను హ్యాకర్లు కొట్టేసి ఆన్లైన్లో అమ్మకానికి పెట్టేశారని సమాచారం. ట్విటర్ డేటా ఉల్లంఘన గత జూలైలోనే హ్యాకర్ 5.4 మిలియన్లకు పైగా ట్విట్టర్ వినియోగదారుల ప్రైవేట్ సమాచారాన్ని హ్యాకింగ్ ఫోరమ్‌లో 30వేల డార్లకు విక్రయించడం ప్రారంభించాని వార్తలొచ్చాయి. అయితే దీంతోపాటు మరో ఏపీఐ ద్వారా 1.4 మిలియన్ల ట్విటర్ ప్రొఫైల్స్ కూడా ఏపీఐ ద్వారా చోరీ అయ్యాయి. అంతేకాదు దాదాపు 7 మిలియన్ ట్విట్టర్ ప్రొఫైల్స్ ప్రైవేట్ సమాచారం లీక్ అయిందని బ్లీపింగ్ కంప్యూటర్ నివేదించింది. ఇంకా, ఆగస్ట్‌లో విక్రయించిన అసలు డేటాలో ఈ ఫోన్ నంబర్లు లేవనీ, ఇంతకుముందు వెల్లడించిన దానికంటే పెద్ద Twitter డేటా ఉల్లంఘన అని పేర్కొంది. మరోవైపు ప్రముఖ హ్యాకింగ్ ఫోరమ్ బ్రీచ్డ్ ఫోరమ్స్ ద్వారా ఈ డేటా విక్రయానికి ఉన్నట్టు ఒక హ్యాకర్ హెచ్చరించాడు. భద్రతా నిపుణుడు చాడ్ లోడర్ తొలుత ఈ వార్తలను ట్విటర్లో పోస్ట్ చేసిని వెంటనే అతని ఖాతాను బ్లాక్ చేయడంతో మాస్టోడాన్‌లో ఈ పెద్ద డేటా ఉల్లంఘనకు సంబంధించిన నమూనాను పోస్ట్ చేసారు.ఈయూ, అమెరికా దేశాలకు చెందిన మిలియన్ల కొద్దీ ట్విటర్ ఖాతాలు ప్రభావితమైందనీ, ఈ ఉల్లంఘన 2021 కంటే ముందుగానే జరిగిందని లోడర్ ట్విటర్లో పోస్ట్ చేశాడు. అంతేకాదు హ్యాకింగ్ ముప్పు మరింత ముదురుతోందని స్వతంత్రంగా ధృవీకరించలేకపోయినప్పటికీ, 17 మిలియన్లకు పైగా రికార్డులు లీక్ చేసినట్టు తెలుస్తోందని వ్యాఖ్యానించాడు. ఈ నివేదికపై ట్విటర్, మస్క్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. కాగా లాగిన్ క్రెడెన్షియల్స్ యాక్సెస్‌లో సమస్యలు, మీ ఖాతా సస్పెండ్ చేయబడిందంటూ మీకు ఇమెయిల్ వస్తే ఫిషింగ్ ఎటాక్‌గా అనుమానించి, ఆ మెయిల్‌ను పరిశీలించడం చాలా అవసరమని నిపుణులు హెచ్చరించారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5051504145.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వాట్సాప్ డేటా బ్రీచ్ కలకలం: ఆ మెసేజెస్ కాల్స్‌కి, స్పందించకండి!
న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్ యాప్ మెటా యాజమాన్యంలోని వాట్సాప్‌లో డేటా బ్రీచ్ యూజర్లకు భారీ షాకిస్తోంది. ఏకంగా 50 కోట్ల యూజర్ల ఫోన్ నంబర్లు ఆన్లైన్ సేల్ అయ్యాయన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. యూఎస్, యూకే, ఈజిప్ట్, ఇటలీ, సౌదీ అరేబియా, భారతదేశంతో సహా 84 వేర్వేరు దేశాల వాట్సాప్ వినియోగదారుల మొబైల్ నంబర్లను ఆన్లైన్లో విక్రయానికి పెట్టినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. 50 కోట్ల యూజర్ల ఫోన్ నంబర్లు విక్రయానికి సైబర్‌న్యూస్ నివేదిక ప్రకారం అతిపెద్ద డేటా ఉల్లంఘనలలో ఒకటిగా భావిస్తున్న ఈ వ్యవహారంలో దాదాపు 500 మిలియన్ల వాట్సాప్ వినియోగదారుల ఫోన్ నంబర్ల డేటాబేస్ ఆన్లైన్లో విక్రయానికి ఉంచారు. 2022 డేటాబేస్‌లో 487 మిలియన్ల యూజర్ల మొబైల్ నంబర్లను విక్రయిస్తున్నట్లు పేర్కొంటూ ఒక థ్రెట్యాక్టర్ ఈ విషయాన్ని పోస్ట్ చేశాడు. డేటా బ్రీచ్ ద్వారా సేకరించిన సమాచారంతో ఫిషింగ్ ఎటాక్స్ చేసే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో వాట్సాప్ వినియోగ దారులు తెలియని నంబర్ల కాల్స్, మెసేజ్‌లకు దూరంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాట్సాప్ డేటాసెట్ ఈ డేటా బ్రీచ్‌లో మనదేశంలో 61.62 లక్షల మంది, అమెరికాకు చెందిన 32 మిలియన్ మంది ఉన్నట్టు నివేదిక పేర్కొంది. ఈజిప్ట్ నుంచి 45 మిలియన్లు, ఇటలీ నుంచి 35 మిలియన్లు సౌదీ నుంచి 29 మిలియన్లు, ఫ్రాన్స్‌నుంచి 20 మిలియన్, టర్కీ నుంచి 20 మిలియన్ల మంది డేటా ఉన్నట్టు పేర్కొంది. రష్యాకు చెందిన 10మిలియన్ల యూజర్లు, యూకే నుంచి 11మిలియన్ పౌరుల ఫోన్ నంబర్ల డేటా లీక్ అయినట్టు తెలిపింది. అమెరికా యూజర్ల డేటాను 7వేల డాలర్లు (సుమారు రూ. 5,71,690)కి విక్రయిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. యూకే, జర్మనీ డేటాసెట్ల ధర వరుసగా 2,500 డాలర్లు (సుమారు. ₹2,04,175) 2వేల డాలర్లు (సుమారుగా ₹1,63,340) అమ్మకానికిపెట్టినట్టు నివేదించింది. కాగా మెటా, తన ప్లాట్‌ఫారమ్స్‌లో డేటా బ్రీచ్ ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం, 500 మిలియన్లకు పైగా ఫేస్బుక్ వినియోగదారుల సమాచారాన్ని ఆన్లైన్లో లీకయ్యాయి. లీకైన డేటాలో ఫోన్ నంబర్లు, ఇతర వివరాలు లీకైన సంగతి తెలిసిందే. -
UK PM: తొలిరోజే విమర్శల జడివాన.. బ్రేవర్మన్ నియామకంపై వ్యతిరేకత
లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ బాధ్యతలు తీసుకున్న వెంటనే విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. డేటా ఉల్లంఘన తప్పిదాలపై లిజ్ ట్రస్ హయాంలో హోంమంత్రిగా రాజీనామా చేసిన భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రేవర్మన్ని తిరిగి నియమించడాన్ని ప్రతిపక్ష లేబర్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. రాజీనామా చేసిన వారం రోజుల్లోనే ఆమెను అదే పదవిలో నియమించడాన్ని తప్పు పట్టింది. బ్రేవర్మన్ నియామకాన్ని రిషి సమర్థించారు. ఆమె తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పారని గుర్తు చేశారు. ఆర్థిక మంత్రిగా జెరెమి హంట్, విదేశాంగ మంత్రిగా జేమ్స్ క్లెవెర్లీలను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. కొత్త మంత్రులతో ఆయన బుధవారం మొట్టమొదటి కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. తొలిసారి ప్రధాని హోదాలో ప్రైమ్ మినిస్టర్ క్వశ్చన్స్ (పీఎంక్యూస్) ఎదుర్కోవడానికి ముందు కేబినెట్ కొత్త మంత్రులతో కలిసి చర్చించారు. యూకే రాజకీయాల్లో పీఎంక్యూస్ కార్యక్రమం అత్యంత కీలకమైనది. ప్రతీ బుధవారం సాయంత్రం జరిగే ఈ కార్యక్రమంలో విపక్ష పార్టీలు, ఎంపీలు ఏ అంశం మీద అడిగిన ప్రశ్నలకైనా ప్రధాని బదులివ్వాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే నిర్ణయాలను రిషి నవంబర్ 17 దాకా వాయిదా వేశారు. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే సన్నాహాలే ఇందుకు కారణమని హంట్ చెప్పారు. కేబినెట్ సమావేశంలోనూ ప్రధానిగా పార్లమెంటు తొలి భేటీలోనూ రిషి చేతికి హిందువులకు పవిత్రమైన దీక్షా కంకణం (మంత్రించిన ఎర్ర తాడు) ధరించి పాల్గొన్నారు. దీనిపై చర్చ జరుగుతోంది. దుష్ప్రభావాలు పోయి మంచి జరగడానికి దీనిని ధరిస్తే దేవుడు రక్షగా ఉంటాడని హిందువులు నమ్ముతారు. హిందూ మత విశ్వాసాలకు చెందిన దీనిని ధరించడంతో రిషి తాను నమ్ముకున్న సంప్రదాయాలను ఎంతో గౌరవిస్తారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. -
శాంసంగ్ యూజర్లకు షాకింగ్ న్యూస్, భారీగా డేటా లీక్
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తన యూజర్లకు భారీ షాకిచ్చింది. శాంసంగ్ ఫోన్లనుంచి భారీఎత్తున డేటా లీక్ అయిందని తాజాగా తెలిపింది. ఇందులో ప్రధానంగా యూజర్ల పుట్టినరోజులు, కాంటాక్ట్ డేటా లాంటి వ్యక్తిగత డేటా ఉల్లంఘన జరిగినట్టు తెలిపింది. ఈ మేరకు కొంతమంది యూజర్లను ఈమెయిల్ ద్వారా అలర్ట్ చేస్తోంది. ఈ ఏడాది జులైలో జరిగిన డేటా ఉల్లంఘనలో అమెరికాలోని శాంసంగ్ యూజర్ల డేటా బహిర్గతమైంది. దీనికి సంబంధించి శాంసంగ్ కంపెనీ ఒక బ్లాగ్‌పోస్ట్ సమాచారంలో తెలిపింది. అనధికారిక థర్డ్ పార్టీ ద్వారా అమెరికా సిస్టమ్‌ల నుంచి వినియోగదారుల ఇంటి చిరునామా, ఫోన్ నంబర్, ఇమెయిల్ లాంటి డేటాను లీక్ చేసినట్టు సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ పేర్కొంది. జులై 2022 చివరలో ఇది చోటు చేసుకుంది. ఆగస్ట్ 4, 2022న నిర్దిష్ట కస్టమర్ల వ్యక్తిగత డేటా ప్రభావితమైందని తేలింది. దీనిపై విచారణ చేయగా భారీ డేటా బహిర్గతమైందని గుర్తించినట్టు 30 రోజుల తర్వాత ఈ పరిమిత సమాచారాన్ని పూర్తిగా విడుదల చేసింది. వెల్లడించింది. అయితే ఇది ఇతర సోషల్ సెక్యూరిటీ నంబర్లు క్రెడిట్, డెబిట్ కార్డ్ నంబర్లను ప్రభావితం చేయ లేదని శాంసంగ్ నిర్ధారించింది. డేటా లీకైన సిస్టమ్‌లను సేఫ్‌గా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. సైబర్ సెక్యూరిటీ నిపుణులు భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారని బ్లాగ్‌లో పేర్కొంది. అలాగే ఈ విషయం గురించి కస్టమర్లను అప్రమత్తం చేస్తున్నామని తెలిపింది. అయినా వ్యక్తిగత సమాచారం కోసం అడిగే లేదా వ్యక్తిగత సమాచారం కోసం అడిగే వెబ్ పేజీలకు డైవర్ట్ చేసే లింక్‌ల పట్ల జాగ్రత్తగా ఉండమని వినియోగ దారులను కోరింది. అనుమానాస్పద లింక్‌లు లేదా అనుమానాస్పద ఇమెయిల్‌ల నుండి అటాచ్మెంట్లపై క్లిక్ చేయడం మానుకోవాలని వినియోగదారులను కోరింది. -
శాంసంగ్‌కు గట్టిషాకిచ్చిన హ్యాకర్లు..! ప్రమాదంలో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ యూజర్లు.!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్‌కు హ్యాకర్లు గట్టిషాక్‌ను ఇచ్చారు. శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్స్‌కు చెందిన సోర్స్ కోడ్‌ను, కంపెనీ అంతర్గత విషయాలను హ్యకర్లు దొంగిలించినట్లుగా తెలుస్తోంది. సోర్స్ కోడ్‌ను హ్యకర్లు దొంగిలించినట్లుగా శాంసంగ్ సోమవారం(మార్చి 8)న ధృవీకరించింది. అత్యంత సున్నితమైన సమాచారం..! ప్రముఖ టెక్ బ్లాగ్ బ్లీపింగ్ కంప్యూటర్(Bleeping Computer) ప్రకారం..గెలాక్సీ స్మార్ట్‌ఫోన్స్‌కు సంబంధించిన సోర్స్ కోడ్‌ను 'Lapsus$' అనే హ్యకర్ల బృందం దొంగిలించినట్లు తెలుస్తోంది. సుమారు 190GB సీక్రెట్ డేటాను హ్యకర్లు సేకరించారు. సోర్స్ కోడ్‌తో పాటుగా, కంపెనీకి సంబంధించిన అంతర్గత డేటాను హ్యకర్లు బహిర్గతం చేశారు. ఇక ఈ సోర్స్ కోడ్‌లో సున్నితమైన కార్యకలాపాల కోసం ఉపయోగించే విశ్వసనీయ ఆప్లెట్ (TA) సోర్స్ కోడ్ , బూట్‌లోడర్ సోర్స్ కోడ్, శాంసంగ్ అకౌంట్‌కు చెందిన ప్రామాణీకరణ కోడ్ వంటివి ఉన్నాయి. కాగా ఈ హ్యకర్ల బృందం గత నెల ఫిబ్రవరిలో NVIDIA నుంచి కూడా డేటాను దొంగిలించింది. ఎలాంటి భయం లేదు..! ఈ సైబర్ దాడిపై శాంసంగ్ వివరణను ఇచ్చింది. ఈ సోర్స్ కోడ్‌లో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్స్ ఆపరేషన్‌కు సంబంధించిన కొంత సోర్స్ కోడ్‌ను కలిగి ఉందని కంపెనీ పేర్కొంది. ఆయా శాంసంగ్ యూజర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కంపెనీ తెలిపింది. దీనిలో గెలాక్సీ యూజర్లకు, కంపెనీ ఉద్యోగుల వ్యక్తిగత సమాచారం లేదని శాంసంగ్ వెల్లడించింది. ఇది కంపెనీ వ్యాపారం లేదా కస్టమర్లపై ఎలాంటి ప్రభావం చూపదని కంపెనీ అభిప్రాయపడింది. ఇటువంటి సంఘటనలను నిరోధించడానికి మరిన్ని పటిష్టమైన చర్యలను అమలు చేస్తామని శాంసంగ్ తెలిపింది. కాగా హ్యాక్ చేసిన డేటాను అత్యంత సున్నితమైనది పరిగణించబడుతుందని శాంసంగ్ పేర్కొంది. చదవండి: క్రేజీ ఆఫర్..! పలు మహీంద్రా కార్లపై రూ. 3 లక్షల వరకు భారీ తగ్గింపు..! -
యూజర్లకు రూ.683 కోట్లను చెల్లించనున్న టిక్‌టాక్..! ఎందుకంటే...?
TikTok May Owe You Money From Its $92 Million Data Privacy Settlement: చైనాకు చెందిన షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ అమెరికన్ యూజర్లకు సుమారు రూ. 683 కోట్లను చెల్లించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 1 వరకు టిక్‌టాక్‌లో నమోదైన యూజర్లకు ఈ మొత్తాన్ని చెల్లించనుంది. క్లాస్ యాక్షన్ సెటిల్మెంట్లో భాగంగా టిక్‌టాక్ యూజర్లకు రూ. 683 కోట్లను పొందడానికి అర్హులు. అందులో భాగంగా టిక్‌టాక్ ఇప్పటికే అర్హత కల్గిన 89 మిలియన్ల అమెరికన్ యూజర్లకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్‌ను పంపినట్లు తెలుస్తోంది. చదవండి: ప్రపంచంలో అత్యంత పొడవైన కారును చూశారా..! ఎందుకంటే..! యూఎస్ యూజర్ల నుంచి వ్యక్తిగత డేటాను వారి అనుమతి లేకుండా టిక్‌టాక్ సేకరించిందనే దావాలు నిరూపితమయ్యాయి. అంతేకాకుండా బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ ప్రైవసీ చట్టాన్ని టిక్‌టాక్ పూర్తిగా ఉల్లంఘించిందని తెలుస్తోంది. క్లాస్ యాక్షన్ వేసిన దావాపై టిక్‌టాక్ ఖండిస్తూనే...అమెరికాలోని యూజర్లకు 92 మిలియన్ డాలర్లను చెల్లించడానికి టిక్‌టాక్ అంగీకరించడం గమనార్హం. అర్హత కల్గిన టిక్‌టాక్ యూజర్లు తమ మాస్టర్‌కార్డ్ , పే పాల్, వెన్మో ద్వారా చెల్లింపులను క్లెయిమ్ చేసుకోవచ్చునని టిక్‌టాక్ పేర్కొంది. అర్హత ఉన్న ప్రతి వ్యక్తి క్లెయిమ్ చేస్తే...సుమారు 5 డాలర్ల నుంచి 0.89 డాలర్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: షాకిచ్చిన ఫోక్స్‌వ్యాగన్! సైలెంట్‌గా ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత? -
డార్క్ వెబ్‌లో ఈ సోషల్‌మీడియా యూజర్ల డేటా అమ్మకం..!
గత కొన్ని రోజుల నుంచి బాగా ప్రాచుర్యం పొందిన సోషల్‌మీడియా యాప్ క్లబ్‌హౌజ్. ఈ యాప్‌తో ఆడియో రూపంలో యూజర్లు తమ భావాలను ఇతరులతో పంచుకోవచ్చును. ఈ యాప్ తొలుత ఆపిల్ ఐవోఎస్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండగా, ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా క్లబ్హౌజ్పై సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. క్లబ్‌హౌజ్ యూజర్లకు చెందిన 3.8 బిలియన్ల ఫోన్ నంబర్లను హాకర్లు డార్క్ వెబ్‌లో అమ్మకానికి ఉంచినట్లు తెలుస్తోంది. భద్రతా పరిశోధకుల అభిప్రాయం ప్రకారం..తాజాగా క్లబ్‌హౌజ్ డేటా బేస్ హ్యాక్ గురైనట్లు గుర్తించారు. మార్క్ రూఫ్ అనే సైబర్ నిపుణుడు క్లబ్‌హౌజ్‌కు చెందిన యూజర్ల ఫోన్ నంబర్లు డార్క్ నెట్లో ఉంచారనే విషయాన్ని ట్విటర్లో పేర్కొన్నారు. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ట్విటర్లో పోస్ట్ చేశాడు. కేవలం క్లబ్‌హౌజ్‌లో ఉన్న వారివి మాత్రమే కాకుండా యూజర్‌కు చెందిన కాంటాక్ట్‌లు యాప్‌తో అనుసంధానించబడిన వ్యక్తుల ఫోన్ నంబర్లు కూడా డార్క్ నెట్లో అమ్మకానికి ఉంచినట్లు పేర్కొన్నాడు. కాగా ఈ డేటా బ్రీచ్‌పై క్లబ్‌హౌజ్ ఇంకా స్పందించలేదు. Full phone number database of #Clubhouse is up for sale on the #Darknet. It contains 3.8 billion phone numbers. These are not just members but also people in contact lists that were synced. Chances are high that you are listed even if you haven't had a Clubhouse login. pic.twitter.com/PfAkUJ0BL5 — Marc Ruef (@mruef) July 23, 2021 -
పెరుగుతున్న సైబర్ దాడులతో రిస్క్
ముంబై: కరోనా రెండో విడత భారత్‌పై తీవ్ర ప్రభావం చూపిందన్నారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్. అయితే మే చివరి నుంచి ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్నట్టు చెప్పారు. పెరుగుతున్న డేటా తస్కరణ, సైబర్ దాడుల సమస్యలను దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. ‘‘2020–21 రెండో అర్ధ భాగంలో కోలుకున్న దేశ ఆర్థిక వ్యవస్థపై.. 2021 ఏప్రిల్, మే నెలల్లో తిరిగి ప్రభావం పడింది. కరోనా వైరస్ కేసులు ఎంత వేగంగా పెరిగాయో.. అంతే వేగంగా నియంత్రణలోకి రావడం వల్ల మే చివరి నుంచి, జూన్ వరకు కార్యకలాపాల్లో పురోగతి నెలకొంది’’ అంటూ ఆర్బీఐ రూపొందించిన ద్వైవార్షిక ఆర్థిక స్థిరత్వ నివేదిక(ఎఫ్ఎస్ఆర్)లో శక్తికాంతదాస్ ప్రస్తావించారు. ఎన్పీఏలు పెరగొచ్చు.. బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు/వసూలు కాని రుణాలు) 2021 మార్చి నాటికి 7.5 శాతం వద్దే స్థిరంగా, ఆరు నెలల ముందునాటి మాదిరే ఉన్నట్టు ఆర్బీఐ ఎఫ్ఎస్ఆర్ తెలిపింది. అయితే 2022 మార్చి నాటికి ఇవి 9.8 శాతానికి పెరిగే అవకాశాలున్నట్టు పేర్కొంది. ఇది కూడా కనీస అంచనాలేనని.. పరిస్థితులు మరీ ప్రతికూలంగా మారితే స్థూల ఎన్పీఏలు 11.22 శాతానికి కూడా పెరిగిపోవచ్చని అంచనా వేసింది. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు 2021 మార్చి నాటికి 9.54 శాతంగా ఉంటే.. 2022 మార్చి నాటికి 12.52 శాతానికి చేరొచ్చని పేర్కొంది. అయితే, ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన ఎఫ్‌ఎస్‌ఆర్‌లో బ్యాంకుల స్థూల ఎన్పీఏలు 2022 మార్చి నాటికి 13.5 శాతానికి పెరగొచ్చని అంచనా వేయడం గమనార్హం. బ్యాంకుల వద్ద తగినంత నిధులున్నట్టు ఈ నివేదిక తాజాగా పేర్కొంది. ఆర్థిక సంస్థల బ్యాలన్స్ షీట్లపై ప్రభావం గతంలో వేసిన స్థాయిలో ఉండకపోవచ్చని శక్తికాంతదాస్ అభిప్రాయపడ్డారు. తాము ప్రకటించిన చర్యలు పూర్తి స్థాయిలో ఆచరణ రూపం దాలిస్తేనే వాస్తవ ప్రభావం ఎంతన్నది తెలుస్తుందన్నారు. ఆర్థిక స్థిరత్వమే తమ ప్రాధాన్యంగా చెప్పారు. రిటైల్, ఎంఎస్ఎంఈ రుణాలపై దృష్టి రిటైల్, ఎంఎస్ఎంఈ రుణాలపై ఎక్కువ ప్రభావం ఉందంటూ వీటిపై బ్యాంకులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎఫ్ఎస్ఆర్ బ్యాంకులకు సూచించింది. అనుకూల మార్కెట్ పరిస్థితులు ఏర్పడితే మూలధన నిధులను పెంచుకోవాలని కోరింది. చదవండి : జెట్ ఎయిర్వేస్లోకి రూ. 1,375 కోట్లు! -
అలర్ట్! భారీగా తమిళనాడు ప్రజల డేటా హ్యాక్
తమిళనాడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్(పీడీఎస్) డేటా దొంగలించబడింది. దాదాపు 50 లక్షల మంది వినియోగదారుల వ్యక్తిగత సమాచారంతో కూడిన డేటాను హ్యాకర్ ఫోరంలో అప్ లోడ్ చేసినట్లు బెంగళూరుకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ టెక్నిశాంక్ తెలిపింది. లీక్ చేయబడ్డ డేటాలో ఆధార్ నెంబర్లు అదేవిధంగా లబ్ధిదారుల సున్నితమైన వివరాలు, వారి కుటుంబ సమాచారం, మొబైల్ నెంబర్లతో సహా ఉన్నాయి. హ్యాకర్లు ఫిషింగ్ దాడుల కోసం ఈ లీక్ చేసిన డేటాను ఉపయోగించవచ్చు. రాష్ట్రంలోని పెద్ద వ్యక్తుల నుంచి నిస్సహాయ ప్రజలను సైబర్ దాడులు జరిగే అవకాశం ఉంది. అయితే, డేటా హ్యాక్ కావడంపై తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా బహిరంగంగా ధృవీకరించలేదు. డార్క్ వెబ్ లో లీక్ అయిన డేటాలో తమిళనాడులో మొత్తం 49,19,668 మంది సమాచారం ఉందని సైబర్ సెక్యూరిటీ స్టార్టప్ తెలిపింది. దీనిలో 3,59,485 ఫోన్ నంబర్లతో ప్రభావిత వినియోగదారుల చిరునామాలు, ఆధార్ నంబర్ల కూడా ఉన్నట్లు ఉంది. లీక్ డ్ డేటా ఫీల్డ్ లలో నవజాత శిశువులతో సహా పౌరులందరి డేటా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'మక్కల్ నంబర్' కూడా ఉన్నట్లు పేర్కొంది. హ్యాక్ అయిన డేటాలో లబ్ధిదారుల కుటుంబ సభ్యుల వివరాలు ఉన్నాయి. ఈ విషయాన్ని మొదట ది వీక్ నివేదించింది. తమిళనాడు ప్రభుత్వంతో సంబంధం ఉన్న వెబ్ సైట్ లేదా ఎక్కడి నుంచి డేటా హ్యాక్ అయ్యింది అనేది ప్రస్తుతం అస్పష్టంగా ఉంది. తమిళనాడు పౌర సరఫరాలు, వినియోగదారుల రక్షణ విభాగం పోర్టల్ లో డ్యాష్ బోర్డ్ పీడీఎస్ వ్యవస్థ కోసం 6.8 కోట్లకు పైగా రిజిస్టర్డ్ లబ్ధిదారులు ఉన్నట్లు చూపిస్తుంది. బెంగళూరుకు చెందిన టెక్నిశాంక్ట్ సీఈఓ నందకిశోర్ హరికుమార్ మీడియాతో మాట్లాడుతూ.. లీక్ అయిన డేటాను జూన్ 28న అప్ లోడ్ చేసినట్లు తెలిపారు. ఈ డేటాను కనుగొన్న కొద్దిసేపటికే ఈ హ్యాక్ అయిన డేటా గురుంచి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్ టీ-ఇన్)కు నివేదించినట్లు టెక్నిశాంక్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. హ్యాక్ అయిన వివరాలకు సంబంధించి తమిళనాడు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫ్ సైబర్ స్పందించి, నివేదికను దర్యాప్తు కోసం ఫార్వర్డ్ చేసినట్లు ధృవీకరించినట్లు హరికుమార్ చెప్పారు. తమిళనాడు పౌర సరఫరాలు & వినియోగదారుల రక్షణ విభాగం (tnpds.gov.in) వెబ్ సైట్ సైబర్ దాడికి గురైనట్లు, "1945వీఎన్" అనే సైబర్ క్రిమినల్ గ్రూప్ హ్యాక్ చేసినట్లు టెక్నిశాంక్ట్ పేర్కొంది. గత డిసెంబర్ లో గాడ్జెట్స్ 360 తెలంగాణ ప్రభుత్వ సైట్ లో ఒక లోపం ఉన్నట్లు పేర్కొంది. ఈ లోపం వల్ల ఉద్యోగుల, పెన్షనర్ల సున్నితమైన డేటాను బహిర్గతం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది. చదవండి: చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్ కేసుపై స్పందించిన ట్విటర్ -
ఆన్లైన్ అంగట్లో లింక్డిన్ యూజర్ల డేటా..!
వాషింగ్టన్: ఉపాధి ఆధారిత ఆన్లైన్ సేవలను అందించే లింక్డిన్ యూజర్ల డేటా ఆన్లైన్లో లీకైనట్లు తెలుస్తోంది. సుమారు 700 మిలియన్ల లింక్డిన్ యూజర్ల డేటా ఆన్లైన్లో బహిర్గతమైనట్లు వార్తలు వస్తున్నాయి. హాకర్లు యూజర్ల డేటాను ఆన్లైన్లో అమ్మకానికి ఉంచారని తెలుస్తోంది. లింక్డిన్ సుమారు 756 మిలియన్ల వినియోగదారులను కలిగి ఉండగా..సుమారు 92 శాతం వరకు వినియోగదారుల సమాచారం ఆన్లైన్లో లీకైంది. వినియోగదారుల ఈ మెయిల్, ఫోన్ నంబర్, పనిచేసే ఆఫీసు, పూర్తి పేరు, ఖాతా ఐడీలతో పాటుగా యూజర్ల సోషల్ మీడియా ఖాతాల లింకులు, వ్యక్తిగత వివరాలు లీకైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా యూజర్ల సాలరీ వివరాలు కూడా లీకైనట్లు తెలుస్తోంది. కాగా తాజాగా లింక్డిన్ డేటా లీక్‌పై స్పందించింది. లింక్డిన్ ఒక ప్రకటనలో.. ‘యూజర్ల డేటా లీక్ జరగలేదని పేర్కొంది. కానీ ఇతర మ్యాడుల్ నెట్వర్స్క్తో హాకర్లు డేటాను పొందారని లింక్డిన్ తెలిపింది. కాగా డేటా లీక్‌పై లింక్డిన్ ప్రతినిధులు దర్యాప్తు చేపడుతున్నారని వివరించింది. కంపెనీ నిర్వహించిన ప్రాథమిక విచారణలో హాకర్లు ఇతర వనరులను ఉపయోగించి డేటాను పొందారని తెలిపింది. లింక్డిన్ తన యూజర్ల గోప్యతకు భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. యూజర్లు తమ ఖాతాలకు కచ్చితంగా 2FA టూ ఫ్యాక్టర్ అథణ్టికేషన్ను ఉండేలా చూసుకోవాలని లింక్డిన్ సూచించింది. సుమారు ఒక మిలియన్ యూజర్ల డేటాను హాకర్లు డార్క్ వెబ్‌లో అమ్మకానికి ఉంచినట్లు తెలుస్తోంది. చదవండి: Reliance: అబుదాబి కంపెనీతో భారీ డీల్ -
Apps: గోప్యత, భద్రతపై యూజర్లలో ఆందోళన
న్యూఢిల్లీ: దేశీయంగా డిజిటలీకరణ వేగవంతమవుతోన్నా.. వ్యక్తిగత వివరాల గోప్యత, భద్రతపైనా యూజర్లలో ఆందోళన ఉంటోంది. ఇటీవల వెబ్సైట్లు, మొబైల్ యాప్‌ల ద్వారా వ్యాపార సంస్థలతో యూజర్లు నిర్వహించే వ్యాపార లావాదేవీలు గణనీయంగా పెరుగుతున్నాయి. దీనిపరై టెక్ దిగ్గజం ఐబీఎం నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. కోవిడ్ విపత్తులో మార్చి 12–26 మధ్య నిర్వహించిన ప్రకారం కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో అన్ని వయస్సుల వారు ఎంతో కొంత డిజిటల్ మాధ్యమం ద్వారా లావాదేవీలు నిర్వహిస్తుండగా .. 35 సంవత్సరాలకు పైబడిన వర్గాల్లో ఇది గణనీయంగా పెరిగింది. ‘కోవిడ్ నేపథ్యంలో వెబ్సైట్లు, మొబైల్ యాప్‌ల ద్వారా దేశీ యూజర్లు అన్ని రకాల వ్యాపారాలు, సంస్థలతో లావాదేవీలు నిర్వహించారు. ముఖ్యంగా బ్యాంకింగ్ (65 శాతం), షాపింగ్/రిటైల్ (54 శాతం) విభాగాల్లో ఈ ధోరణి అత్యధికంగా కనిపించింది‘ అని ఐబీఎం పేర్కొంది. గోప్యతపై ఇప్పటికీ పలువురు యూజర్లు యాప్‌లను వాడటానికి ఇష్టపడకపోవడానికి ప్రధాన కారణాలు గోప్యత, భద్రతపై సందేహాలే. అయినప్పటికీ చాలా మంది ఇలాంటి ఏదో ఒక మాధ్యమాన్ని ఎంచుకుంటున్నారు. సర్వేలో పాల్గొన్న ప్రతి పది మందిలో నలుగురు.. షాపింగ్ చేసేందుకు లేదా ఆర్డరు చేసేందుకు ఆన్లైన్ ప్లాట్‌ఫాంను వాడటానికి ఇష్టపడటం లేదు. యాప్ లేదా వెబ్సైట్లో గోప్యతపై (40 శాతం), భద్రతపై (38 శాతం) సందేహాలు ఇందుకు కారణం‘ అని నివేదిక తెలిపింది. సౌకర్యవంతం మహమ్మారి వ్యాప్తి సమయంలో డిజిటల్ లావాదేవీలందించే సౌకర్యానికి చాలా మంది వినియోగదారులు కాస్త అలవాటు పడినట్లు ఈ సర్వే ద్వారా తెలుస్తోందని ఐబీఎం టెక్నాలజీ సేల్స్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ సేల్స్ లీడర్ ప్రశాంత్ భత్కల్ తెలిపారు. కరోనా పూర్వ స్థాయికి పరిస్థితులు తిరిగి వచ్చినా ఇదే ధోరణి కొనసాగవచ్చని అంచనాలు ఉన్నాయని వివరించారు. భారత్ సహా 22 దేశాల్లో నిర్వహించిన సర్వేలో 22,000 మంది (ఒక్కో దేశంలో 1,000 మంది) పాల్గొన్నారు. మరిన్ని విశేషాలు.. - మహమ్మారి వ్యాప్తి సమయంలో దేశీ యూజర్లు వివిధ కేటగిరీల్లో సుమారు 19 కొత్త ఆన్లైన్ ఖాతాలు తెరిచారు. సోషల్ మీడియా, వినోదం కోసం సగటున 3 కొత్త ఖాతాలు తీసుకున్నారు. - 50 ఏళ్లు పైబడిన వారు వివిధ కేటగిరీల్లో దాదాపు 27 కొత్త ఆన్లైన్ ఖాతాలు తెరిచారు. ఒక్కో కేటగిరీలో మిగతా వయస్సుల వారికన్నా ఎక్కువ అకౌంట్లు తెరిచారు. - దాదాపు సగం మంది (47 శాతం) భారతీయ యూజర్లు చాలా సందర్భాల్లో ఇతర అకౌంట్లకు కూడా ఒకే రకం లాగిన్ వివరాలను ఉపయోగిస్తున్నారు. ఇక 17 శాతం మంది కొత్త, పాత వివరాలు కలిపి ఉపయోగిస్తున్నారు. 35–49 ఏళ్ల మధ్య వారిలో దాదాపు సగం మంది యూజర్లు ఇతర అకౌంట్లకు ఉపయోగించిన క్రెడెన్షియల్స్‌నే మళ్లీ మళ్లీ వాడుతున్నారు. - వెబ్సైట్ లేదా యాప్ భద్రతపై సందేహాలు ఉన్నప్పటికీ జనరేషన్ జెడ్ తరం (1990ల తర్వాత, 2000 తొలినాళ్లలో పుట్టిన వారు) మినహా 57 శాతం మంది యూజర్లు.. భౌతికంగా స్టోర్‌కి వెళ్లడం లేదా ఫోన్ కాల్ ద్వారా ఆర్డర్ చేయడం కన్నా డిజిటల్‌గా ఆర్డరు, చెల్లింపులు చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. - తాము సందర్శించే యాప్‌లు, వెబ్సైట్లను ఇతర యాప్‌లు ట్రాక్ చేసేందుకు యూజర్లు ఇష్టపడటం లేదు. ట్రాకింగ్‌కు సంబంధించి పలు యాప్‌లకు అనుమతులు నిరాకరించినట్లు సర్వేలో పాల్గొన్న వారిలో సగం మంది పైగా వెల్లడించారు. - తమ వ్యక్తిగత డేటా భద్రంగా ఉంచుతాయని యూజర్లు అత్యధికంగా నమ్ముతున్న కేటగిరీల సంస్థల్లో హెల్త్‌కేర్ (51 శాతం), బ్యాంకింగ్/ఆర్థిక సంస్థలు (56%) ఉన్నాయి. సోషల్ మీడియాపై యూజర్లు అత్యంత అపనమ్మకంతో ఉన్నారు. చదవండి : SBI ఖాతాదారులూ ముఖ్య గమనిక! -
RockYou2021: ప్రపంచంలోనే అతిపెద్ద సైబర్ దాడి
ప్రముఖ హ్యాకర్ ఫోరమ్‌లో భారీ మొత్తంలో పాస్వర్డ్ డేటాను లీక్ చేశారు. ఆ ఫోరమ్ 100జీబీ టెక్స్ట్ ఫైల్‌ను ఆన్లైన్లో పోస్ట్ చేసింది. ఇందులో సుమారు 8.4 బిలియన్ల పాస్వర్డ్లు ఉన్నాయి. ఇందులో గతంలో లీకైన డేటా కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ లీకైన డేటలో పాస్వర్డ్లు 6-20 అక్షరాల పొడవు ఉన్నాయి. హ్యాకర్స్ పోస్ట్ చేసిన టెక్స్ట్ ఫైల్లో 82 బిలియన్ పాస్వర్డ్లు ఉన్నట్లు అంతర్జాతీయ సైబర్ క్రైమ్ నిపుణులు తెలిపారు. సైబర్ న్యూస్ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ డేటా దాదాపు 8,45 9,060,239గా ఉంది. 100జీబీ టెక్స్ట్ ఫైల్‌కు అనే ఫోరమ్ యూజర్ 'రాక్యూ 2021(rockyou2021.txt)'గా పేరు పెట్టారు. బహుశా 2009లో రాక్ యూ డేటా పేరుతో లీకైన డేటా కూడా ఉండవచ్చు అని సమాచారం. అందుకే ఈన్ని పాస్‌వర్డ్‌లను కలిగి ఉన్న టెక్స్ట్ ఫైల్‌కు రాక్యూ 2021 అనే పేరు పెట్టవచ్చు. ఆ సమయంలో లీకైన 32 మిలియన్ పాస్‌వర్డ్‌లను సోషల్ మీడియా సర్వర్ ల నుంచి హ్యాక్ చేశారు. అలాగే ఆ ఏడాది సమయంలో 3.2 బిలియన్ పాస్వర్డ్లు లీక్ అయ్యాయి. ఇక్కడ రాక్యూ 2021 కూడా పెద్దదని గుర్తించాలసిందే. ఎందుకంటే రాక్ యూ పేరిట ఈ హ్యాకర్స్ గ్రూప్ చాలా డేటాను లీక్ చేశారు. వీరు కొన్ని ఏళ్లుగా ఈ డేటాను సేకరించారు. వాస్తవానికి, ఆన్లైన్లో కేవలం 4.7 బిలియన్ల మంది మాత్రమే ఉంటే, రాక్యూ 2021 పేరుతో విడుదల చేసిన మొత్తం డేటా ప్రపంచ ఆన్లైన్ నెటిజన్ డేటా కంటే దాదాపు రెండు రెట్లు అధికంగా ఉంది. మరోసారి ఇంత మొత్తంలో చాలా మంది డేటా లీక్ కావడంతో యూజర్ల భద్రత అంశం మరోసారి తెరపైకి వచ్చింది. యూజర్లు తమ వ్యక్తిగత డేటా లీక్ అయిందో లేదో చెక్ చేసుకోవడంతో పాటు తమ పాస్వర్డ్స్ లీక్ అయ్యాయా? లేదా అనేది చెక్ చేసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ మీ పాస్వర్డ్ హ్యాకింగ్‌కు గురైతే వెంటనే పాస్‌వర్డ్‌లను ఛేంజ్ చేయడం ఉత్తమం అని సైబర్ నిపుణులు తెలుపుతున్నారు. చదవండి: హ్యాకర్ల దెబ్బకు భారీగా డబ్బు చెల్లించిన జెబిఎస్ -
సిగ్నల్‌లో ఖాతా, మార్క్ జూకర్బర్గ్ ఫోన్ నెంబర్ లీక్
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్లో మరోసారి హ్యాకింగ్‌కు గురి కావడం ఆందోళన రేపిన సంగతి తెలిసిందే. అయితే అతిపెద్ద డేటా బ్రీచ్‌గా చెబుతున్న తాజా కేసులో ఏకంగా ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఫోన్ నంబర్ కూడా లీక్ కావడం గమనార్హం. మార్క్ జుకర్‌బర్గ్ సిగ్నల్ యాప్‌ను వినియోగిస్తున్నారనీ, ఆయన ఫోన్ నంబర్ ఆన్లైన్లో లీక్ అయిందని భద్రతా పరిశోధకుడు వెల్లడించారు. అలాగే 533 మిలియన్ల ఫేస్బుక్ వినియోగుదారుల వ్యక్తిగత వివరాలు లీకైనట్టు తెలిపారు. ఈ 533 మిలియన్ల మందిలో 60లక్షలమంది భారతీయ వినియోగదారులున్నారు. అమెరికాకు చెందిన వారు 32 మిలియన్లు, 11 మిలియన్ల యూజర్లు యూకేకు చెందినవారున్నారు. ఈ ఫోన్ నంబర్ల డేటాబేస్ హ్యాకర్ల ఫోరమ్‌లో పోస్ట్ చేసినట్టు నివేదించిన సంగతి తెలిసిందే. డేటా లీక్‌కు ప్రభావితమైన వారిలో ఫేస్బుక్ సహ వ్యవస్థాపకులు డస్టిన్ మోస్కోవిట్జ్ , క్రిస్ హ్యూస్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. భద్రతా నిపుణుడు డేవ్ వాకర్ అందించిన సమాచారం ప్రకారం జుకర్ పేరు, పుట్టిన తేదీ, వివాహం, ఫేస్బుక్ యూజర్ ఐడీ తదితర వివరాలన్నీ లీక్ అయ్యాయి. అలాగే జుకర్‌బర్గ్ లీకైన ఫోన్ నంబర్ స్క్రీన్ షాట్‌తో పాటు" మార్క్ జుకర్‌బర్గ్ సిగ్నల్లోఖాతా ఉందంటూ ట్విట్ చేశారు. మరొక భద్రతా నిపుణుడు అలోన్ గాల్ ప్రకారం, ఫేస్బుక్ ఖాతాకు లింక్ చేయబడిన ఫోన్ నెంబర్ల ద్వారా ఈ హ్యాకింగ్ గత జనవరిలోనే జరిగిందన్నారు. దీనిపై స్పందించిన ఫేస్బుక్ ఇదంతా పాత డేటా అని కొట్టిపారేసింది. 2019 ఆగస్టులో ఈ లోపాన్ని సరిదిద్దామని పేర్కొంది. In another turn of events, Mark Zuckerberg also respects his own privacy, by using a chat app that has end-to-end encryption and isn't owned by @facebook This is the number associated with his account from the recent facebook leak. https://t.co/AXbXrF4ZxE — Dave Walker (@Daviey) April 4, 2021 -
డేటా చోరీ: కేంబ్రిడ్జ్ ఎనలిటికాకు సీబీఐ షాక్!
సాక్షి, న్యూఢిల్లీ: ఫేస్బుక్ వినియోగదారుల వ్యక్తిగత డేటా చోరీ కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. డేటా బ్రీచ్ కేసులో సీబీఐ కేంబ్రిడ్జ్ అనలిటికాపై శుక్రవారం కేసు నమోదు చేసింది. 5.62 లక్షల మంది భారతీయ ఫేస్బుక్ వినియోగదారుల వ్యక్తిగత డేటాను అక్రమంగా సేకరించిందనే ఆరోపణలతో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) యూకేకు చెందిన పొలిటికల్ కన్సల్టింగ్ సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికాపై కేసు నమోదు చేసింది. ఇదే ఆరోపణలతో ఆ దేశానికి చెందిన మరో సంస్థ గ్లోబల్ సైన్స్ రీసెర్చ్ (జీఎస్ఆర్ఎల్) ను కూడా కేసులో చేర్చింది. దీనిపై ఫేస్బుక్ కూడా స్పందించింది. సుమారు 5.62 లక్షల భారతీయ యూజర్ల డేటాను అక్రమంగా సేకరించిన గ్లోబల్ సైన్స్ కంపెనీ అక్ర ఆ డేటాను క్యాంబ్రిడ్జ్ అనలిటికాతో పంచుకుందని తెలిపింది. తద్వారా ఎన్నికలను ప్రభావితం చేసిందని ఆరోపించింది. కాగా దేశంలో ఎన్నికలను ప్రభావితం చేసే లక్క్ష్యంతో కేంబ్రిడ్జ్ ఎనలిటికా భారతీయ ఫేస్బుక్ వినియోగదారుల డేటాను ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫేస్బుక్-కేంబ్రిడ్జ్ ఎనలిటికా డేటా చోరీ కేసుపై సీబీఐ దర్యాప్తు చేయనుందని కేంద్ర సమాచా,ప్రసార, సాంకేతిక శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు. -
డేటా బ్రీచ్ : డా. రెడ్డీస్‌కు భారీ షాక్
సాక్షి, ముంబై: హైదరాబాదుకు చెందిన ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్‌కు డేటా షాక్ తగిలింది. సంస్థకు చెందిన సర్వర్లలో డేటాబ్రీచ్ కలకలం రేపింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్లాంట్లను సౌకర్యాలను మూసి వేసింది. సైబర్ దాడి నేపథ్యంలో అన్ని డేటా సెంటర్ సేవలను వేరుచేసినట్లు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీల అందించిన సమాచారంలో డా.రెడ్డీస్ తెలిపింది. సైబర్ దాడిని గుర్తించిన నేపథ్యంలో అవసరమైన నివారణ చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించింది. రాబోయే 24 గంటల్లో అన్ని సేవలను పునఃప్రారంభించాలని ఆశిస్తున్నట్లు డాక్టర్ రెడ్డీస్ సీఈఓ ముఖేష్ రతి తెలిపారు. ఇది తమ కార్యకలాపాలపై పెద్దగా ప్రభావం చూపదన్నారు. (రష్యా వ్యాక్సిన్ ట్రయల్స్ కు గ్రీన్ సిగ్నల్) ఇండియా సహా, అమెరికా, యూకే, బ్రెజిల్, రష్యాలోని ప్లాంట్లు ప్రభావితమైనాయని డా.రెడ్డీస్ వెల్లడించింది. భారతదేశంలో రష్యాకు చెందిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-వీ 2-3 దశల హ్యూమన్ ట్రయల్స్ నిర్వహణకు డా.రెడ్డీస్ కు డీజీసీఐ( డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) అనుమతి లభించిన కొన్నిరోజులకే ఈ పరిణామం చోటుచేసుకోవడం ఆందోళన రేపింది. దీంతో డాక్టర్ రెడ్డీస్ షేర్ 4 శాతం కుప్ప కూలింది. మరోవైపు గత కొంతకాలంగా ఇన్వెస్టర్లకు చక్కని రిటర్న్స్ అందించిన ఫార్మా షేర్లు గురువారం అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. అరబిందో ఫార్మా, సిప్లా భారీగా నష్టపోతున్నాయి. దీంతో నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 2.29 శాతం నష్టంతో ట్రేడవుతోంది. -
జాతీయ భద్రతకు సంబంధించిన డేటా హ్యాక్..!
న్యూఢిల్లీ: జాతీయ భద్రతకు సంబంధించిన డేటాను కలిగి ఉన్న కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయి. చైనా సంస్థ జెన్హూవా డేటా ఇన్ఫర్మేషన్ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంతి, ఆర్మీ చీఫ్‌తో సహా వేలాదిమంది భారతీయులపై రహస్య నిఘా నిర్వహిస్తోందనే ఆరోపణల మధ్య ఈ ఉల్లంఘన జరిగింది. ఈ విషయాన్ని గుర్తించిన వెంటనే ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ కేసు నమోదు చేసింది. ఇందులో దేశ భద్రతకు సంబంధించిన డేటాతో పాటు, ప్రధాని మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు సంబంధించిన పూర్తి సమాచారం ఉంది. (ఆ బాధ్యత రాష్ట్రాలదే: కేంద్ర హోం శాఖ) ఈ హ్యాకింగ్‌కు సంబంధించిన మెయిల్ ఒకటి బెంగళూరు కేంద్రంగా ఉన్న యునైటెడ్ స్టేట్స్కు చెందిన సంస్థ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఎన్ఐసీ ఉద్యోగులకు వచ్చిన ఈ-మెయిల్‌ను ఓపెన్ చేయగానే కంప్యూటర్ వ్యవస్థలు అన్నీ ప్రభావితమై సమాచారం హ్యాక్ అయినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. ఈ ఆరోపణలపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం నిపుణుల కమిటీని (నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో) ఏర్పాటు చేసిందని ఎన్ఐసీ వర్గాలు తెలిపాయి. ఈ కమిటీ 30 రోజుల్లోగా నివేదికను సమర్పించనుంది. -
టిక్‌టాక్ ప్రో పేరిట మెసేజ్ వచ్చిందా?
న్యూఢిల్లీ : దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందనే కారణంతో కేంద్ర ప్రభుత్వం 59 చైనీస్ యాప్‌లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో గూగుల్ ప్లే స్టోర్, ఆప్ స్టోర్లలో ఈ యాప్‌లను తొలగించారు. నిషేధానికి గురైన యాప్‌లలో ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ ఒకటి. ఈ నేపథ్యంలో యువతలో ఆ యాప్‌కు ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని సైబర్ నేరగాళ్లు కొత్త రకం మోసానికి తెరతీశారు. టిక్‌టాక్ పేరిట మొబైల్స్‌కు మెసేజ్‌లు పంపుతూ యూజర్లను బురిడి కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మెసేజ్‌లలో అమాయక ప్రజలను నమ్మించేలా.. ‘మరోసారి టిక్‌టాక్ వీడియోలను ఎంజాయ్ చేయండి.. క్రియేటివ్ వీడియోలను రూపొందించండి. ఇప్పుడు టిక్‌టాక్.. టిక్‌టాక్ ప్రో గా అందుబాటులో ఉంది. డౌన్లోడ్ చేయడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి’ అని రాసి ఉంటుంది.(చదవండి : టిక్‌టాక్ బ్యాన్ : ‘రీల్స్’ వచ్చేసిందిట!) ఆసక్తితో ఆ లింక్ క్లిక్ చేసినవారికి సదరు యాప్ ఐకాన్ అచ్చం టిక్‌టాక్ మాదిరిగానే కనిపిస్తోంది. దాని డౌన్లోడ్ చేసుకున్న వెంటనే అది కెమెరా, మైక్ లాంటి ఇతర అనుమతులు అడుగుతుంది. ఆ తర్వాత ఆ యాప్ పనిచేయదు. ఫోన్లోనే ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో లేని ఇటువంటి యాప్‌లను ఏపీకే ఫార్మట్‌లో డౌన్లోడ్ చేసుకుంటే ఫోన్లోని డేటా చోరికి గురయ్యే అవకాశం ఉంది. వీటి ద్వారా ఫోన్లలో ఉన్న ఇతర సోషల్ మీడియా యాప్‌ల లాగిన్ సమాచారం చోరికి గురవుతందని సైబర్ నిపుణులు చెప్తున్నారు.అలాంటి మెసేజ్‌లను పట్టించుకోకపోతే మంచిదని హెచ్చరిస్తున్నారు. ఇటీవల వినియోగదారుల ఫేస్బుక్ లాగిన్ వివరాలు చోరిపై ఫ్రెంచ్కు చెందిన సైబర్ సెక్యూరిటీ కంపెనీ హెచ్చరికతో.. గూగుల్ ప్లే స్టోర్ నుంచి 25 హానికర యాప్స్‌ను తొలగించింది. (చదవండి : భారతీయులు డేటా ఎక్కడ ఉందో చెప్పిన టిక్‌టాక్!) -
వన్‌ప్లస్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్
బీజింగ్: చైనా మొబైల్ సంస్థ వన్‌ప్లస్ షాకింగ్ న్యూస్ చెప్పింది. తమ వినియోగదారుల వ్యక్తిగత డేటా, ఇతర సమాచారం లీక్ అయిందంటూ బాంబు పేల్చింది. "అనధికార పార్టీ" ద్వారా కస్టమర్ల డేటా లీకైందని వెల్లడించింది. ఈ మేరకు తన వినియోగదారులకు సమాచారాన్ని అందించడం ప్రారంభించింది. అయితే, డేటా ఉల్లంఘనతో ఎంతమంది ప్రభావితమయ్యారనేది కంపెనీ స్పష్టంగా ప్రకటించలేదు. వన్‌ప్లస్ కస్టమర్ల ఆర్డర్ల ద్వారా హ్యాకర్లు వ్యక్తిగత వివరాలను చోరీ చేశారని తెలిపింది. ముఖ్యంగా కస్టమర్ పేర్లు, కాంటాక్ట్ నంబర్లు, ఇమెయిల్, చిరునామా వంటి వివరాలు ఉన్నాయని పేర్కొంది. అయితే, పాస్వర్డ్లు, ఆర్థిక వివరాలు భద్రంగా ఉన్నాయని హామీ ఇచ్చింది. దీనిపై తమ వినియోగదారులను అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతో ఈ సమాచారాన్ని అందిస్తున్నామని వెల్లడించింది. ఈ డేటా బ్రీచ్ మూలంగా కొంతమందికి స్పామ్ మెసేజ్‌లు, నకిలీ ఈమెయిల్స్ రావచ్చని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గత వారమే డేటా లీక్ విషయాన్ని గ్రహించామని, వెంటనే చర్యలు తీసుకున్నామని తెలిపింది. అంతేకాదు సంస్థనుంచి అధికారిక ఇమెయిల్ రాకపోతే, సంబంధిత వినియోగదారుని ఆర్డర్ సమాచారం సురక్షితమనే విషయాన్ని గమనించాలని వన్‌ప్లస్ వివరించింది. దీనిపై మరింత దర్యాప్తు కోసం సంబంధిత అధికారులతో కలిసి పనిచేస్తున్నామని వన్‌ప్లస్ సెక్యూరిటీ టీం ప్రతినిధి జీవ్ సీ ఒక ప్రకటనలో తెలిపారు. -
వెబ్సైట్ హ్యాక్ చేసి ఇసుక కొరత సృష్టించారు!
సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని బ్లూఫ్రాగ్ సంస్థపై సీఐడీ దాడులు మూడోరోజు కొనసాగాయి. ఇసుక కొరత సృష్టించడంలో బ్లూఫ్రాగ్ ప్రయత్నం చేసినట్లు సీఐడీ ప్రాథమిక ఆధారాలు సేకరించింది. వివరాలు.. ఇసుక సరఫరా సంబంధిత వెబ్‌సైట్‌ను బ్లూఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీ సంస్థ హ్యాక్ చేసినట్లు అనుమానం రావడంతో సీఐడీ, పోలీసులు దర్యాప్తు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు బృందాలుగా విడిపోయిన విశాఖ సీఐడీ అధికారులు సంస్థపై సోదాలు కొనసాగించారు. శుక్రవారం జరిగిన దాడుల్లో ఓ కీలకమైన సమాచారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇసుక కొరత సృష్టించినట్లుగా ఆధారాలతో సహా గుర్తించారు. ఇక కంప్యూటర్ల నుంచి స్వాధీనం చేసుకున్న సమాచారాన్ని ఎప్పటికపుడు అమరావతిలోని సీఐడీ ప్రధాన కార్యాలయానికి చేరవేస్తున్నారు. మరోవైపు సైబర్ క్రైం బృందాలు స్వాధీనం చేసుకున్న డేటాను విశ్లేషిస్తున్నారు. ఈ మేరకు అమరావతి ప్రధాన కార్యాలయంలో రెండు ప్రత్యేక సైబర్ క్రైం బృందాలను నియమించినట్టుగా సీఐడీ డీజీ సునీల్ కుమార్ వెల్లడించారు. డేటా విశ్లేషణ కోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేక నిపుణులను రప్పించినట్టు పేర్కొన్నారు. గతంలో సాండ్ వెబ్‌సైట్‌ను బ్లూఫ్రాగ్ సంస్థ నిర్వహించిన విషయం తెలిసిందే. (చదవండి: బ్లూఫ్రాగ్ కాదు ఎల్లో ఫ్రాగే) -
ఇసుక వెబ్సైట్ హ్యాక్.. ‘బ్లూఫ్రాగ్’లో సీఐడీ సోదాలు
సాక్షి, విశాఖ : డేటా చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విశాఖకు చెందిన బ్లూఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీ సంస్థ మరో చోరీలో అడ్డంగా దొరికింది. ఇసుక సరఫరా సంబంధిత వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసినట్లు అనుమానం రావడంతో సీఐడీ, పోలీసులు సంస్థ సర్వర్లలోని డేటాను తనిఖీలు చేశారు. బ్లూ ఫ్రాగ్ సంస్థకు చెందిన పలువురు వ్యక్తులు సైట్‌ను హ్యాక్ చేసి కృత్రిమ కొరత సృష్టించినట్లు సీఐడీకి ఫిర్యాదు అందాయి. దాంతో రంగంలోకి దిగిన సీఐడీ విశాఖలో ఉన్న బ్లూ ఫ్రాగ్స్ కార్యాలయంలో సోదాలు చేసింది. స్థానిక పోలీసులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. స్టాక్‌యార్డ్‌లో పెద్దఎత్తున ఇసుక ఉన్న కూడా ఆన్లైన్లో అప్లై చేస్తే ఇసుక లేనట్లు చూపించేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ సంస్థ రూపొందించినట్లు సీఐడీ విచారణలో తేలింది. కంపెనీ సర్వర్లలో డేటాను తనిఖీ చేసి పలు ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. ఐపీ అడ్రస్‌ల ఆధారంగా మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. గతంలో మన శాండ్ సైట్‌ను బ్లూఫ్రాగ్ సంస్థనే నిర్వహించింది. కాగా, ఇసుక అక్రమార్కులపై ఉక్కుపాదం మోపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తుంది.ఇసుక అక్రమ రవాణా చేస్తే రూ.2లక్షల వరకూ కనీస జరిమానా, రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించాలని నిర్ణయిస్తూ.. ఆంధ్రప్రదేశ్ గణుల చట్టంలో సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. -
‘ఐటీగ్రిడ్ మాదిరిగా కేసు నమోదు చేస్తారా’
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం పౌరుల వ్యక్తిగత సమాచార గోప్యతను దెబ్బతీస్తోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘సమగ్ర వేదిక’పై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పౌరుల వ్యక్తిగత సమాచార వివరాల్ని 25 ప్రభుత్వ శాఖల నుంచి సేకరించి రూపొందించే సమగ్ర నివేదిక ఉద్దేశాలను వెల్లడించాలని అన్నారు. గాంధీ భవన్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల వ్యక్తిగత సమాచారం అందుబాటులో ఉంటుందని టీఎస్ ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ చెప్పడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ప్రజల ఫుట్‌ప్రింట్ కూడా లభిస్తుందన్న జయేశ్ వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ఐటీగ్రిడ్ మాదిరిగానే.. ఆంధ్రప్రదేశ్ ప్రజల సమాచారం చోరీ చేసిందని ఐటీగ్రిడ్ కంపెనీపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారని శ్రవణ్ గుర్తుచేశారు. ఈ కేసును తెలుగుదేశం పార్టీతో ముడిపెట్టి గత ఎన్నికల్లో విమర్శలతో దుమ్మెత్తిపోశారని అన్నారు. మరి తెలంగాణ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించినందుకు టీఆర్ఎస్ ప్రభుత్వంపై కూడా కేసు పెడతారా అని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల వ్యక్తిగత వివరాల్ని క్రోడీకరించి దుర్వినియోగానికి తెర తీసిందని మండిపడ్డారు. ప్రజల అనుమతి లేకుండా అధికారులు వారి వివరాల్ని క్రోడీకరించడం చట్ట విరుద్ధమన్నారు. వ్యక్తిగత సమాచారం వెల్లడవుతోందన్న ఆందోళనల నేపథ్యంలో ఆధార్‌ను అన్ని పథకాలకు ముడిపెట్టొద్దని సుప్రీంకోర్టే ఆదేశించిందని, పౌరుల ఫుట్‌ప్రింట్ కూడా తమవద్ద ఉంటుందని ఐటీ కార్యదర్శి అనడం ఆందోళన కలిగిస్తోందని శ్రవణ్ చెప్పారు. గోప్యంగా ఉండాల్సిన వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వలేదన్న గ్యారెంటీ ఏమిటని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. సైబర్ సెక్యూరిటీ కిందకు వచ్చే ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించాలని, సమగ్ర దర్యాప్తు చేయించాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డికి వినతిపత్రం అందిస్తామని తెలిపారు. -
‘ఐటీ గ్రిడ్స్’కు డేటా ఇచ్చిందెవరు?
సాక్షి, హైదరాబాద్: ఏపీతో పాటు తెలంగాణకు చెందిన దాదాపు 7 కోట్ల మంది పౌరుల ఆధార్ వివరాలు, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని టీడీపీ యాప్ (సేవామిత్ర) తయారీ సంస్థ ఐటీ గ్రిడ్స్ చేతిలో పెట్టిందెవరు? దీని చుట్టూనే ఇప్పుడు సిట్ దర్యాప్తు సాగుతోంది. సెంట్రల్ ఐడెంటిటీ డేటా రెపోసిటరీ (సీఐడీఆర్), స్టేట్ రెసిడెంట్ డేటా హబ్ (ఎస్ఆర్డీహెచ్) వద్ద భద్రంగా ఉం డాల్సిన ప్రజల వ్యక్తిగత సమాచారం ఎలా లీకయిందన్నది వారికి సవాలు విసురుతోంది. ఈ లీకేజీ వెనక ఏపీ సర్కారు పెద్దల హస్తం ఉండొ చ్చని యూఐడీఏఐ అనుమానిస్తోంది. ఇలాంటి అత్యంత గోప్యమైన సమాచారాన్ని ఆయా సంస్థల్లో పనిచేసే విచక్షణ ఉన్న ఏ అధికారీ ఇవ్వడని, ప్రలోభాలకు లేదా పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గితేనే ఆస్కారం ఉంటుందని భావిస్తోంది. తొలుత వేటు పడేది అధికారులపైనే.. ఈ కేసులో ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలోని సిట్ బృందం ఇప్పటికే హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయం నుంచి స్వాధీనం చేసుకున్న 40కిపైగా హార్డ్ డిస్కులను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) సాయంతో విశ్లేషించిన సంగతి తెలిసిందే. డేటా చౌర్యం జరిగిందని ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఇవ్వడంతో సిట్ దర్యాప్తు స్పీడు పెంచింది. ఈ క్రమంలో న్యాయస్థానం ఆదేశాలతో ముందుకెళ్లడం ద్వారా సేవామిత్ర యాప్‌లో ఉన్న వివిధ శాఖల సమాచారం ఎలా వచ్చిందన్న విషయంపై సిట్ దర్యాప్తు చేయనుంది. ఈ స్కాంలో అధికారుల పాత్ర ఉన్నట్లు తేలితే తొలి ముద్దాయిలు వారే అవుతారని తెలుస్తోంది. -
దొంగలపాలైన ‘ఆధార్’
చీకటి పనులకు అలవాటు పడకుండా ఉండాలేగానీ...ఆ ఊబిలోకి దిగబడ్డాక ఇక పైకి రావడమంటూ ఉండదు. స్వల్ప శాతం ఓట్ల తేడాతో 2014లో అధికారంలోకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత అయిదేళ్లూ ఇష్టానుసారం పాలించారు. చట్టాలను, నిబంధనలను తుంగలో తొక్కారు. ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్, ఇతర పార్టీలు, ప్రజా సంఘాలు వీటిపై ఎప్పటికప్పుడు నిలదీసినా ఆయన వైఖరిలో మార్పు రాలేదు. చివరకు ఇది దేనికి దారితీసిందో తెలంగాణ పోలీసులకు అందిన తాజా ఫిర్యాదు తేటతెల్లం చేసింది. సాక్షాత్తూ ఆధార్ ప్రాధికార సంస్థ డిప్యూటీ డైరెక్టర్ టి. భవానీ ప్రసాద్ ఈ ఫిర్యాదు చేశారు. ఆధార్ రికార్డుల్లో నిక్షిప్తమైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని దాదాపు 7 కోట్ల 83 లక్షలమంది ప్రజానీకానికి సంబంధించిన డేటా చోరీకి గురయిందని, ఇది దేశభద్రతకే ముప్పు కలిగిస్తుందని ఆ ఫిర్యాదు సారాంశం. ఇందులో అత్యంత ప్రమాదకరమైనదేమంటే...ఈ డేటాను నిందితులు అమెజాన్ క్లౌడ్ సర్వీస్‌లో నిక్షిప్తం చేశారు. ఆ సర్వీస్‌ను ప్రపంచంలో ఏమూలనున్న నేరగాళ్లయినా హ్యాక్ చేశారంటే కోట్లాదిమంది పౌరుల సమాచారం వారి చేతుల్లో పడుతుంది. దాన్ని ఉపయోగించుకుని వారు ఏంచేయడానికైనా ఆస్కారం ఉంది. గత నెల మొదట్లో తొలిసారి ఈ డేటా చోరీ వ్యవహారం వెలుగులోకొచ్చినప్పుడు చంద్రబాబు, ఆయన సహచరులు చేసిన హడావుడి, దీన్ని రెండు రాష్ట్రాల వివాదంగా చిత్రీకరించేందుకు చేసిన యత్నం వెనకున్న వ్యూహమేమిటో ఇప్పుడు అందరికీ అర్ధమవుతుంది. (చదవండి : ఇది దేశ భద్రతకే సవాల్) జరిగిన నేరం ఎంత తీవ్రమైనదో, దాని పర్యవసానాలేమిటో చంద్రబాబుకు తెలుసు. అందువల్లే డేటా చోరీ వ్యవహారం బయటకు పొక్కగానే ఏపీ పోలీసులు క్షణాల్లో హైదరాబాద్‌కొచ్చి వాలారు. ఫిర్యాదుదారుడు లోకేశ్వర్‌రెడ్డిని అపహరించుకుపోవడానికి ప్రయత్నించారు. తెలంగాణ పోలీసులు అడ్డుకోనట్టయితే ఆయన్ను ఏపీకి తరలించేవారే. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం నియమించిన సిట్‌కు పోటీగా చంద్రబాబు రెండు సిట్లు వేసి పక్కదోవ పట్టించాలని చూశారు. జరిగిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి తెలంగాణపై ఎదురుదాడికి దిగారు. లోకేశ్వర్‌రెడ్డి చేసిన ఫిర్యాదు ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మూడున్నర కోట్లమంది ఓటర్ల వ్యక్తిగత సమాచారం దొంగిలించి దాన్ని తెలుగుదేశం కార్యకర్తల ఫోన్లలో ‘సేవామిత్ర’ యాప్ కింద లభ్యమయ్యే ఏర్పాటు చేశారు. అటు కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర మాత్రమే ఉండాల్సిన ఓటర్ల కలర్ ఫొటోలతో కూడిన జాబితా, ఇటు ఆధార్ డేటా అనుసంధానించి దీన్ని రూపొందించారని అప్పుడు బయటికొచ్చింది. కానీ తాజాగా భవానీ ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మరింత తీవ్రమైనది. ఒక్క ఏపీ ప్రజల డేటా మాత్రమే కాదు...తెలంగాణ ప్రజల డేటా సైతం ఈ దొంగల చేతుల్లో పడిందని వెల్లడైంది. ఈ రెండు రాష్ట్రాల ప్రజానీకం తాలూకు 18 రకాల వ్యక్తిగత సమాచారం సేవామిత్రలో భాగస్వాములుగా ఉన్న తెలుగుదేశం కార్యకర్తల సెల్ఫోన్లకు అందుబాటులో ఉందంటే వీరు ఎంతకు తెగించారో తేటతెల్లమవుతుంది. దీన్ని రూపొందించిన ఐటీ గ్రిడ్స్ సంస్థ సీఈవో అశోక్ ఇంతవరకూ ఆచూకీ లేకుండా పోయాడు. అతగాడు ఎవరి రక్షణలో సేదతీరుతున్నాడో సులభంగానే అంచనా వేసుకోవచ్చు. ఆధార్ డేటాకు కట్టుదిట్టమైన భద్రత ఉన్నదని, అది బయటికి పోయే ప్రసక్తే లేదని విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) చాన్నాళ్లనుంచి బల్లగుద్ది చెబుతోంది. సుప్రీంకోర్టులోనూ ఈ వాదనే వినిపించింది. సంస్థ సీఈఓ అజయ్ భూషణ్ పాండే డేటా చౌర్యం ఎందుకు అసాధ్యమో ధర్మాసనానికి సాంకేతికంగా వివరించి చెప్పారు. ఆయనిచ్చిన వివరణతో అది సంతృప్తిపడినట్టే కనిపించింది. అందుకే కావొచ్చు...పౌరుల వ్యక్తిగత గోప్యతకు ముప్పు కలుగుతుందన్న పిటిషనర్ల వాదన సరికాదని నిరుడు సెప్టెంబర్‌లో వెలువరించిన తీర్పు సందర్భంగా స్పష్టం చేసింది. కానీ ఇప్పుడేమైంది? స్వయానా యూఐడీఏఐ సంస్థే తమ డేటా చోరీకి గురైందని ఫిర్యాదు చేసింది. ఎంత ఘోరం? ఆ సంస్థకు చెందిన నిపుణులు ఇన్నాళ్లనుంచీ ఘనంగా చెప్పుకుంటున్న భద్రత ఐటీ గ్రిడ్స్ పుణ్యమా అని గాలికి కొట్టుకుపోయింది. ఇదంతా చంద్రబాబు ప్రభుత్వ ప్రాపకంతో, ఆయన పార్టీ ప్రయోజనం కోసం చడీచప్పుడూ లేకుండా సాగిపోయింది. తాను, తన పార్టీ ప్రయోజనాలే తప్ప ఎవరేమైపోయినా ఫర్వాలేదనుకునే మనస్తత్వం ఉన్న నాయకులుంటే ఎంతటి కీలక సమాచారమైనా బజారున పడుతుందని ఈ డేటా చోరీ వ్యవహారం వెల్లడించింది. వాస్తవానికి సైబర్ వ్యవహారాల నిపుణుడు డాక్టర్ అనుపమ్ శరాఫ్ ఆధార్ డేటాను ఓటర్ గుర్తింపు కార్డుతో అనుసంధానించడం వల్ల మున్ముందు సమస్యలు తలెత్తే అవకాశమున్నదని... ఓటర్ల జాబితాలను నకిలీ ఓటర్లతో నింపి, నిజమైన ఓటర్ల పేర్లను తొలగించి ఎన్నికల ప్రక్రియను, ఫలితాలను తారుమారు చేసే ప్రమాదమున్నదని హెచ్చరించారు. దాన్ని అటు ఆధార్ ప్రాధికార సంస్థ, ఇటు ఎన్నికల సంఘం పట్టించుకున్న దాఖలా లేదు. అనుపమ్ మాటల్లో ఎంత నిజమున్నదో ఇప్పుడు చంద్రబాబు అండ్ కో నిరూపించారు. తాజా ఎఫ్ఐఆర్నుబట్టి చూస్తే సేవామిత్ర యాప్‌లో రెండు రాష్ట్రాలకూ చెందిన ఆధార్ డేటా, ఓటర్ల జాబితాలు ఉన్నాయి. తమకు ఓటేయరని అనుమానం వచ్చిన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించేందుకు ఈ యాప్ ద్వారా అవకాశమున్నదని ఎఫ్ఐఆర్ చెబుతోంది. డేటా దొంగలు ఈ మొత్తం డేటాను దేన్నుంచి కైంకర్యం చేశారో తేలాల్సి ఉంది. అలాగే దుండగులు ఈ రెండు తెలుగు రాష్ట్రాలతో సరిపెట్టారా లేక ఇతర రాష్ట్రాల డేటాను సైతం తస్కరించారా అన్నది నిర్ధారణ కావాల్సి ఉంది. దీంతోపాటు టీడీపీ సేవామిత్రలో భాగస్వాములుగా ఉన్న ప్రతి ఒక్కరినీ విచారించి ఆ యాప్‌తో ఏమేం చేశారో రాబట్టవలసి ఉంది. ఈ డేటా చౌర్యం లోతు, విస్తృతి ఎంతో... ఎవరెవరు ఇందులో భాగస్వాములో సాధ్యమైనంత త్వరగా కూపీ లాగి, నిందితులను అరెస్టు చేయాలి. -
డేటా చోరి కేసులో సంచలన నిజాలు
-
ఇది దేశ భద్రతకే సవాల్
సాక్షి, అమరావతి/హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ‘సేవా మిత్ర యాప్’ను నిర్వహిస్తున్న ఐటీ గ్రిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పాల్పడిన డేటా స్కామ్ మరో కీలక మలుపు తిరిగింది. ప్రజల వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన ఆధార్ చోరీ నిజమేనంటూ ఆధార్ (యుఐడీఏఐ) అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ టి.భవానీ ప్రసాద్ పోలీసులకు రిపోర్టు చేశారు. ప్రభుత్వ స్కీమ్‌లకు సంబంధించిన సమాచారం, లబ్ధిదారులు, ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తం చోరీకి గురైనట్టు తమ విచారణలో తేలిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఈ నెల 12న ఆయన సైబరాబాద్ జిల్లాలోని మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మాదాపూర్ పోలీసులు ఐటీ గ్రిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తో పాటు పలువురిపై ఎఫ్ఐఆర్ నెంబర్ 278/ 2019లో సెక్షన్ 37, 38,(ఎ)(బి)(జి), 40, 42, 44 ఆధార్ చట్టం 2016 ప్రకారం కేసు నమోదు చేశారు. 18 రకాల వ్యక్తిగత సమాచారం చోరీ ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు 3 కోట్ల మంది ప్రజల ఆధార్, ఓటర్ ఐడీ తదితర వ్యక్తిగత సమాచారం చోరీకి గురవుతోందంటూ లోకేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి మార్చి 2న మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్ సంస్థపై సోదాలు నిర్వహించి ఏడు హార్డ్ డిస్క్‌లు, డిజిటల్ ఎవిడెన్స్‌లను సీజ్ చేశారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్(ఎఫ్ఎస్ఎల్)లో పరీక్షించారు. చోరీ అయిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 7,82,21,397 రికార్డులు ఆధార్ డేటా బేస్‌కు లింక్ అయ్యి ఉన్నట్టు గుర్తించారు. ప్రభుత్వం వద్ద గోప్యంగా ఉండాల్సిన సమాచారంతోపాటు ప్రజల వ్యక్తిగత సమాచారం సైతం ఐటీ గ్రిడ్స్ సంస్థ చేతిలోకి వెళ్లిపోయినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ సమాచారాన్ని తెలుగుదేశం పార్టీ సేవా మిత్ర యాప్‌నకు లింక్ చేసి అనేక అక్రమాలకు ఉపయోగించుకునేందుకే చోరీకి పాల్పడినట్లు స్పష్టమైంది. ఆంధ్ర, తెలంగాణ ప్రజల ఆధార్ డేటాను నిందితుడు అక్రమంగా అమెజాన్‌లో స్టోర్ చేశాడని, ఈ సున్నితమైన డేటా అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరగాళ్ల చేతిలో పడితే దేశ భద్రతకే ముప్పని పోలీసులకు ఇచ్చిన రిపోర్టులో ఆధార్ అథారిటీ డీడీ భవానీప్రసాద్ పేర్కొన్న భాగం ఫిర్యాదుదారుడైన తుమ్మల లోకేశ్వరరెడ్డితో పాటు ముద్దనలాలిగారి జయరామిరెడ్డి, అక్కల మద్దిలేటిరెడ్డి, ఆకుల రవికుమార్, అబ్దాస్ వెంకటప్రతాప్లను నమూనాలుగా తీసుకుని డేటా స్కామ్ తీగ లాగారు. దీంతో టీడీపీ సేవా మిత్ర యాప్‌ను నిర్వహిస్తున్న ఐటీ గ్రిడ్స్ సంస్థ డేటా స్కామ్ గుట్టురట్టు అయ్యింది. ప్రజలకు చెందిన 18 రకాల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసినట్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ(ఎఫ్ఎస్ఎల్) నిర్ధారించింది. వాటిలో ఆధార్ (యూఐడీ) నంబర్‌తోపాటు, ఆధార్ ఎన్రోల్మెంట్(ఈఐడీ) నంబర్, కలర్ ఫొటోతో కూడిన ఓటరు జాబితా, పౌరుని పేరు, స్థానికంగా పిలుచుకునే పేరు, జెండర్, ఫోన్ నంబర్, వారి తండ్రి, సంరక్షకుడు, భర్త పేరు, కేరాఫ్ పేరు, పుట్టిన రోజు, గ్రామం, మండలం, జిల్లా పేరు, జిల్లా ఐడీ, పిన్‌కోడ్, వీటీసీ కోడ్, రాష్ట్రం పేరు, రాష్ట్రం కోడ్ వంటి వ్యక్తిగత వివరాలన్నీ చోరీ చేసినట్లు నిర్ధారణ అయ్యింది. దేశ భద్రతకు సంబంధించిన అంశం.. ఆధార్ ఆథారిటీ డిప్యూటీ డైరెక్టర్(డీడీ) భవానీ ప్రసాద్ పోలీసులకు ఇచ్చిన రిపోర్టులో ఆందోళన కలిగించే అంశాలను ప్రస్తావించారు. ‘యూనిక్ ఐడీ(ఆధార్) అనేది రాష్ట్రానికి సంబంధించినది కాదు. అది పూర్తిగా కేంద్ర పరిధిలోనిది. పౌరుల ఆధార్ ఐడీని టీడీపీ సేవామిత్ర యాప్ కోసం లింక్ చేయడం జాతీయ భద్రతకు ప్రమాదకరమైన అంశంగా పరిగణించాలి. దీన్ని కేవలం ఏపీ, తెలంగాణ ప్రజలకు సంబంధించిన అంశంగా చూడకూడదు. ఈ రెండు రాష్ట్రాల పౌరుల ఆధార్, ఓటర్, తదితర వ్యక్తిగత సమాచారం డేటా చోరీ జరిగింది. ఈ సమాచారం దేశంలో, ప్రపంచ వ్యాప్తంగా ఉండే నేరస్తుల చేతికి చిక్కితే అంతర్జాతీయ మూకుమ్మడి నేరాలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఆధార్‌తోపాటు ప్రజలకు సంబంధించిన మరో 17 కీలక అంశాలు కూడా చోరీ చేసినట్లు ఎఫ్ఎస్ఎల్ నిర్ధారించింది. ప్రజల వ్యక్తిగత సమాచారం ఇలా ఐటీ గ్రిడ్స్‌కు ఇవ్వడం పెద్ద నేరం. అసలు సేవామిత్ర అప్లికేషన్‌పైనే గట్టి అనుమానాలున్నాయి. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు జరగాలి’అని భవానీప్రసాద్ తన రిపోర్టులో పేర్కొనడం గమనార్హం. ప్రధాన నిందితుడికి ప్రభుత్వ పెద్దల షెల్టర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కోట్ల మంది ప్రజల ఆధార్, ఓటర్ ఐడీలను ఓ వ్యూహం ప్రకారం టీడీపీ యాప్ (సేవామిత్ర) తయారీ సంస్థ ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చౌర్యం చేసింది. ఏపీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ పార్టీ అక్రమ మార్గాల్లో అందరి వ్యక్తిగత వివరాలను సేకరించింది. అయితే ఈ సేవామిత్ర యాప్‌లో కేవలం తెలుగుదేశం పార్టీ వారికి చెందిన వివరాలు మాత్రమే ఉన్నాయని ఆ పార్టీ నేతలు చెప్పినదంతా తప్పు అని ఇప్పుడు స్పష్టమైంది. ఎన్నికల్లో గెలవడం కోసం ప్రజలందరి వ్యక్తి గత సమాచారాన్ని చంద్రబాబు, లోకేష్‌ల డైరెక్షన్ మేరకు ప్రభుత్వమే ఐటీ గ్రిడ్స్ సంస్థకు ఇచ్చిందనేందుకు తాజా పరిణామాలే ఉదాహరణ. ఈ నేపథ్యంలో ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఐటీ గ్రిడ్స్ సంస్థ సీఈవో అశోక్‌కు ఏపీ ప్రభుత్వ పెద్దలే షెల్టర్ ఇచ్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పెద్దల స్వార్థం వల్ల ఈ వ్యవహారం ఏపీలోని పలువురు అధికారుల మెడకు చుట్టుకోనుందని తెలుస్తోంది. చట్టాలు ఏం చెబుతున్నాయంటే.. సెంట్రల్ ఐడెంటిటీ డేటా రెపోసిటరీ(సీఐడీఆర్), రాష్ట్రానికి చెందిన స్టేట్ రెసిడెంట్ డేటా హబ్ (ఎస్ఆర్డీహెచ్) వంటి వాటి వద్ద భద్రంగా ఉండాల్సిన సమాచారం ఐటీ గ్రిడ్స్ సంస్థ చేతుల్లోకి వెళ్లడం తీవ్ర నేరం. సీఐడీఆర్, ఎస్ఆర్డీహెచ్లకు చెందిన ప్రతినిధులు విధుల్లో ఉన్నా, లేకున్నా ప్రజలకు చెందిన సమాచారాన్ని బయటకు లీక్ చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే ఆధార్ రెగ్యులేషన్ యాక్ట్ 2016 సెక్షన్ 28(5) ప్రకారం నేరం. ప్రభుత్వ పథకాలు, సర్వేల కోసం కాంట్రాక్టులో భాగంగా ఏదైనా ఏజెన్సీకి ఇచ్చినా ఇతర ప్రయోజనాల కోసం దాన్ని దుర్వినియోగం చేసినా సెక్షన్ 29(3) ప్రకారం నేరం. ఇతర ప్రయోజనాల కోసం, సర్వేలు, ఫలితాలు, ఓటర్ల జాబితాలో తొలగింపులు వంటి తదితర అక్రమాలకు ప్రజల వ్యక్తిగత డేటాను మళ్లించడం సెక్షన్ 38(జి) ప్రకారం నేరం. ప్రజల వ్యక్తిగత డేటాను సేకరించి దాన్ని తమ అవసరానికి అనుగుణంగా చేర్పులు, మార్పులు, తొలగింపులు చేయడం, విలువైన డేటాకు భంగం కలిగించి వేరే ప్రయోజనాలకు వాడుకోవడం సెక్షన్ 38(హెచ్) ప్రకారం నేరం. ఇందుకు సెక్షన్ 40 ప్రకారం మూడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.పది లక్షలు జరిమానా ఉంటుంది. ఆధార్ యాక్ట్ సెక్షన్ 37 ప్రకారం ప్రజల వ్యక్తిగత డేటాను సేకరించడంతోపాటు దాన్ని ఇంటర్నెట్లో వాడుకోవడం, ఇతర వ్యక్తులు, సంస్థలకు ఇచ్చిపుచ్చుకోవడం, ఆ డేటాను ట్రాన్స్‌మీట్ చేయడం, రహస్యంగా దాచడం తీవ్రమైన నేరం. ప్రభుత్వ పెద్దల దన్నుతో డేటా స్కామ్‌కు పాల్పడిన ఐటీ గ్రిడ్స్ సంస్థ ఆ డేటాను అమెజాన్ (అమెరికా) వెబ్ సర్వీసులోని క్లౌడ్ సర్వర్‌లో పెట్టడం తీవ్ర నేరం. సెక్షన్ 44 ప్రకారం దీనిని దేశం బయట జరిగే నేరం (అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా)గా పరిగణిస్తున్నారు. ఈ డేటా మన శత్రుదేశమైన పాకిస్తాన్‌లోని టెర్రరిస్టులకు చిక్కినా, ఆంతర్జాతీయ నేరస్తులకు చిక్కినా దేశ భద్రతకు పెను ముప్పుగా మారే ప్రమాదం ఉంటుంది. ప్రభుత్వ పథకాలు, ప్రజా సాధికార (పల్స్) సర్వే పేరుతో సేకరించిన సున్నితమైన సమాచారంతో అనుసంధానమై ఉండటం ఐటీ యాక్ట్ – 2008 సెక్షన్ 72(ఎ), సెక్షన్ 65, సెక్షన్ 66(బి) కింద పూర్తిగా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే అంశం. ఆధార్ డీడీ రిపోర్టుకు కారణం ఇదే.. టీడీపీ సేవా మిత్ర యాప్ నిర్వహిస్తున్న ఐటీ గ్రిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డేటా స్కామ్‌కు పాల్పడుతున్న వైనంపై ఈ ఏడాది మార్చి 2న ఫిర్యాదు రావడంతో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్ వెస్ట్‌జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర మార్చి 15న కేంద్రం పరిధిలోని ఆధార్ అథారిటీ (యూఐడీఏఐ)కి లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసును సంబంధించిన పూర్తి వివరాలు విచారించిన ఆధార్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్(డీడీ) టీవీ భవానీ ప్రసాద్ ఈ నెల 12న మాదాపూర్ పోలీసులకు రిపోర్టు ఇచ్చారు. -
‘చంద్రబాబు, లోకేశ్‌లను వెంటనే అరెస్ట్ చేయాలి’
సాక్షి, అనంతపురం: ఓటుకు కోట్లు కేసులో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ దొంగ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ఏపీ ప్రజల డేటా చోరీ చేసిన ఘనుడు ఐటీ మంత్రి నారా లోకేశ్ అని తెలిపారు. శుక్రవారం అనంతపురంలో ఆమె మాట్లాడుతూ.. ఏపీ ప్రజలను మోసం చేసిన చంద్రబాబు, లోకేశ్‌లను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల విలువైన సమాచారాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించిన వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని అన్నారు. కలర్ ఫొటోలతో కూడిన ఓటరు జాబితా దొంగిలించిన నేరం కింద.. ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీపై అనర్హత వేటు వేయాలని కోరారు. -
తక్షణమే ఏపీ డీజీపీని మార్చాలి
సాక్షి, న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్న డేటాచోరీ కేసుపై ఏపీ బీజేపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్సీ మాధవ్ తదితరులు శుక్రవారం సీఈసీ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఆధార్, ఓటర్ జాబితా, ప్రభుత్వ పథకాల లబ్దిదారుల వివరాలను ఏపీ ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అప్పగించిన వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ సేవామిత్ర యాప్‌లో ఏపీ ప్రజల ఓటార్ ఐడీ కార్డు వివరాలు, ఆధార్ వివరాలు ఉన్న విషయంపై జోక్యం చేసుకోవాలని, థర్డ్ పార్టీ విచారణ జరిపించి తక్షణం చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. (దేశం దాటిన డేటా చోరీ!) ఏపీ డీజీపీని మార్చాలి.. ఏపీలోని అధికార యంత్రాంగం టీడీపీకి తొత్తుగా వ్యవహరిస్తోందని కన్నా విమర్శలు గుప్పించారు. ఓట్ల తొగింపుపై సరైన విచారణ జరగకుండా ఎన్నికలు జరిగితే ఎన్నికల్లో న్యాయం జరగదని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితాలో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, ఏపీ డీజీపీని మార్చాలని డిమాండ్ చేశారు.కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ....ఓట్ల తొలగింపుపై థర్డ్ పార్టీ విచారణ జరపాలని ఈసీని కోరాం. నమోదు అయిన నకిలీ ఓట్లను ఈసీ తొలగించాలి. ఏపీ డీజీపీని తక్షణం మార్చాలి. రాష్ట్రంలో అధికార యంత్రాంగం టీడీపీ తొత్తులుగా మారిపోయారు. ఓట్ల తొలగింపుపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలి. ఓట్ల అక్రమాల జాబితా వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేయాలని అన్నారు. ఫారం-7 ఎవరైనా దాఖలు చేయొచ్చని ఎంపీ జీవీఎల్ పేర్కొన్నారు. దొంగ ఓట్లను తొలగించకుండా ఉండేందుకు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ తప్పుడు పనులు చేస్తోంది. ఆధార్ డేటా, ఎన్నికల సంఘం మాస్టర్ డేటాను చోరీ చేసి, రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ వాడుకుంటోంది. సీనియర్ అధికారులు టీడీపీ కార్యకర్తలుగా మారారు. ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారు. డేటా చోరీపై ఎన్నికల సంఘం విచారణ జరపాలి. ఓటర్ల జాబితాలో అక్రమాలను సరిదిద్దాలి. ఏపీ డీజీపీ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షానికి చెందిన కార్యకర్తలను వేధిస్తున్నారని జీవీఎల్ ధ్వజమెత్తారు. -
పోలీసుల వెన్నులో వణుకు
సాక్షి, అమరావతి ప్రతినిధి: డేటా స్కాం వ్యవహారంపై తెలంగాణ పోలీసులు సిట్ దర్యాప్తునకు ఆదేశించడంతో రాష్ట్రంలో ఇన్నాళ్లూ అధికార తెలుగుదేశం ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించిన కొందరు పోలీసు అధికారుల వెన్నులో వణుకు మొదలైంది. స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ), ఇంటెలిజెన్స్ అధికారుల ద్వారా బూత్ లెవల్లో ఓటర్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఏడు నెలలపాటు సేకరించిన ఆ శాఖ కీలక అధికారి ఒకరు వాటిని బ్లూ ఫ్రాగ్, ఐటీ గ్రిడ్స్‌కు పంపినట్లు తెలంగాణ పోలీసులు గుర్తించారని ప్రచారం జరుగుతుండటంతో ఇది ఎవరి మెడకు చుట్టుకుంటుందో తెలీక వారు హడలిపోతున్నారు. కంప్యూటర్ ఐపీ నెంబర్ల ఆధారంగా లోతుగా దర్యాప్తు చేస్తే ఏపీలోని అన్ని జిల్లాలకు సంబంధించిన ఇంటెలిజెన్స్ అధికారులు ఈ వ్యవహారంలో ఇరుక్కునే ప్రమాదం ఉన్నట్లు చెబుతున్నారు. (దేశం దాటిన డేటా చోరీ!) అధికార పార్టీ పెద్దలతో ఎంతో సన్నిహితంగా తిరిగే సదరు అధికారి తమతో చేయకూడని పనులు చేయించి రాష్ట్ర ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని నిబంధనలకు విరుద్ధంగా సేకరింపజేసి ఐటీ గ్రిడ్స్ కంపెనీకి చేరవేశారని కొందరు అధికారులు చెబుతున్నారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థను పూర్తిగా పార్టీ వ్యవహారాలకు వాడుకున్న విషయం ఈ వ్యవహారంతో బయటకు వస్తుందని వారంటున్నారు. మరోవైపు.. ఎస్బీ, లా అండ్ ఆర్డర్‌లోని కొందరు పోలీసు అధికారులను సైతం ఇష్టానుసారంగా ఈ వ్యవహారాలకు వాడుకున్నారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వం అండ ఉందని ధీమాగా ఉన్న కొందరు పోలీసు అధికారులు సైతం తెలంగాణ సిట్ తమ బండారాన్ని ఎక్కడ బయట పెడుతుందోనని ఇప్పుడు వణికిపోతున్నారు. (ఫారం–7 ఇవ్వడం తప్పుకాదు ) కాగా, డేటా స్కాం బాగోతంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ‘సిట్’ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఎత్తులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే, తెలంగాణ పోలీసులు, వైఎస్సార్సీపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై కుట్ర పన్నారంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖర్‌బాబును బుధవారం రాత్రి కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లాలోని తుళ్లూరు పోలీసుస్టేషన్లో 120బీ, 418, 420, 380, 409, 166, 177, 188, రెడ్‌విత్ 511 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
డేటా చోరీ కేసులో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు..
మూడుకోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆధార్, ఓటర్ ఐడీ వివరాలతో పాటు ప్రభుత్వం వద్ద ఉండాల్సిన వారి సమగ్ర డేటా చోరీకి గురైన కేసులో లోతుకెళ్లే కొద్దీ దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ డేటాను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్స్ సంస్థను.. విదేశాల నుంచి కంట్రోల్ చేస్తున్నట్లుగా బయటపడింది. 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావటంతోనే ఈ కంపెనీలోకి విదేశీ పెట్టుబడులు ప్రవహించటం.. చివరకు విదేశాల్లోని కంపెనీయే మెజారిటీ వాటాను సొంతం చేసుకోవటం.. అలాంటి కంపెనీ చేతికి ఏపీ, తెలంగాణ ప్రజల డేటా మొత్తం చిక్కటం చూస్తుంటే ఇదెంత పెద్ద కుట్రో తేలిగ్గానే అర్థమవుతుంది. ఆ వివరాలు చూస్తే.. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న ఐటీ గ్రిడ్స్ సంస్థ 2010లో ఆరంభమయింది. ప్రస్తుతం తెలంగాణ పోలీసులు వెదుకుతున్న దాకవరం అశోక్.. ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఐటీ సేవలు, కన్సల్టింగ్ సంస్థగా చెప్పుకొనే ఐటీ గ్రిడ్స్‌కు 2014 వరకు పెద్దగా వ్యాపారమేమీ లేదు. 2014లో మాత్రం అనూహ్యంగా ఈ కంపెనీలోకి రూ.12,78,524.. అది కూడా డాలర్ల రూపంలో అమెరికా నుంచి పెట్టుబడిగా వచ్చాయి. అమెరికాలో మసాచుసెట్స్ రాష్ట్ర చిరునామాతో ఉన్న సాఫ్ట్‌ల్యాబ్స్ అనే సంస్థ ఈ పెట్టుబడి పెట్టి, కంపెనీలో 52% వాటాను సొంతం చేసుకుంది. అప్పటిదాకా ఈ కంపెనీలో అశోక్‌కు 98% వాటా ఉండగా.. అది 46కు తగ్గిపోయింది. ఐటీ గ్రిడ్స్–యూకే పేరిట ఏర్పాటు చేసిన సంస్థకు మిగిలిన 2% వాటా ఇచ్చారు. దీంతో హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న ఐటీ గ్రిడ్స్‌ను 2014 మే నుంచి అమెరికా చిరునామాతో ఉన్న సాఫ్ట్ ల్యాబ్స్ సంస్థే నియంత్రిస్తోంది. వ్యాపారం కూడా విదేశీనే! విశేషమేంటంటే ఈ ఐటీ గ్రిడ్స్ సంస్థ.. 2017 ఆర్థిక సంవత్సరంలో ఐటీ ఎగుమతులు, సేవల ద్వారా రూ.1.41 కోట్లు ఆర్జించినట్లు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ)కు వెల్లడించింది. ఆ రూ.1.41 కోట్లు కూడా విదేశీ వ్యాపారం నుంచే వచ్చినట్లు తెలియజేసింది. అంటే ఈ లెక్కన 2017 మార్చి వరకూ ఈ కంపెనీకి దేశంలో ఒక్క రూపాయి కూడా ఆదాయం లేదు. అలాంటి కంపెనీ చేతికి తెలుగు ప్రజల డేటా మొత్తం చిక్కిందంటే ఏమనుకోవాలి? 2018 ఆర్థిక సంవత్సరంలో మాత్రం రూ.1.45 కోట్ల ఆదాయాన్ని ఆర్జించామని, అందులో రూ.60 లక్షలే విదేశాల నుంచి వచ్చిందని కంపెనీ పేర్కొంది. అంటే విదేశీ ఆదాయం ఒక్క సంవత్సరంలోనే రూ.1.44 కోట్ల నుంచి రూ.60 లక్షలకు పడిపోయింది. నిజానికి మామూలు కంపెనీల విషయంలో ఇలాంటివి జరగటం అసాధ్యం. కానీ చంద్రబాబు నాయుడు, ఏపీ ప్రభు త్వం కనుసన్నల్లో సాగుతున్న కంపెనీ కనుక ఏదైనా సాధ్యమే అనుకోవాలేమో!! సరోజనీదేవి.. ఎవరి బినామీ? ఇన్నాళ్లుగా మెజారిటీ వాటాను తన చేతిలో ఉంచుకుని వస్తున్న సాఫ్ట్ ల్యాబ్స్ సంస్థ.. 2018 మధ్యలో తమ వాటాను కె.సరోజనీ దేవి అనే వ్యక్తికి బదలాయించింది. మామూలుగా ఎవరైనా వాటా కొనుగోలు చేసినపుడు ఆ వివరాలు ఆర్వోసీకి సమర్పిస్తూ.. తన భర్త/తండ్రి పేరు వంటి వివరాలతో పాటు చిరునామా కూడా సమర్పించాలి. కానీ ఈ సరోజనీ దేవి వివరాలు ఏ ఒక్క వివరాన్నీ ఆర్వోసీకి సమర్పించలేదు. అసలు ఈ వాటా మొత్తాన్ని ఆమె ఎంత ధరకు కొన్నారు? ఎంత చెల్లించారు? వంటి వివరాలు సైతం అందజేయలేదు. సరికదా.. మెజారిటీ వాటా ఇప్పటికీ విదేశీ సంస్థలు లేదా వ్యక్తుల నియంత్రణలోనే ఉన్నట్లు చూపించారు. ఎన్నికలకు ముందు ఇలాంటి కీలకమైన సమయంలో ఈ కంపెనీ వాటా చేతులు మారటాన్ని చూసిన వారు.. ఈ సరోజినీదేవి ప్రభుత్వంలోని ముఖ్యనేతలకు బినామీ కావచ్చన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే దాకవరం అశోక్‌ను పోలీసులకు దొరక్కుండా ఏపీ ప్రభుత్వ పెద్దలు కాపాడుతున్నారని, ఆయన పోలీసుల ముందు హాజరైతే తప్ప.. సరోజనీ దేవికి సంబంధించిన వివరాలు బయటకు రాకపోవచ్చని కూడా వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ రకంగా చూసినపుడు తెలుగు ప్రజల కీలక డేటా మొత్తం విదేశీ నియంత్రణలోని సంస్థ చేతుల్లో ఉన్నట్లుగా భావించక తప్పదు. ఆ ఇద్దరూ రాజీనామా చేశారెందుకో? వాటాదారులను పక్కనబెడితే ప్రస్తుతం ఐటీ గ్రిడ్స్‌లో దాకవరం అశోక్, ఆయన భార్య దాకవరం శ్రీలక్ష్మీ కుమారి, తోట నరేందర్ డైరెక్టర్లుగా ఉన్నారు. అయితే గతేడాది ప్రారంభం వరకు ఈ సంస్థలో డైరెక్టర్లుగా కొనసాగిన షేక్ మునీర్ బాషా, కాపా బాలాజీలు ఆ తర్వాత రాజీనామా చేశారు. వీరు రాజీనామాలు చేశాకే సాఫ్ట్‌ల్యాబ్స్ వాటా చేతులు మారటం ఇక్కడ గమనార్హం. మునీర్ బాషా, బాలాజీ ఇద్దరూ కలిసి ముబాకీ సాఫ్ట్వేర్ యాక్సియోమాటిక్ అనే కంపెనీలో డైరెక్టర్లుగా కొనసాగుతుండగా.. ‘తెలుగు గంగ నేచర్ ప్రొడక్ట్స్’పేరిట మరో కంపెనీని కూడా మునీర్ బాషా నడిపిస్తున్నాడు. వ్యవహారం హద్దులు దాటిపోతోందని, డేటా వ్యవహారం కొంపముంచొచ్చని భావించే ఈ ఇద్దరు డైరెక్టర్లు రాజీనామా చేసి ఉంటారన్న అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. (మంథా రమణమూర్తి) -
ఏ క్షణంలోనైనా అశోక్ అరెస్టు!
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం రేపుతోన్న ఐటీ గ్రిడ్స్‌లో ప్రధాన నిందితుడు అశోక్‌ను ఏ క్షణంలోనైనా అరెస్టు చేస్తామని తెలంగాణ పోలీసు వర్గాలు తెలిపాయి. అతడి కదలికలకు సంబంధించి తమ వద్ద పూర్తి సమాచారం ఉందని పేర్కొన్నాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తితో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడం న్యాయ వ్యవస్థను తప్పు పట్టించడమేనన్నాయి. ఇందుకు సంబంధించి ఏపీలో కేసు నమోదైనా అది చట్టపరంగా నిలవదని పేర్కొన్నాయి. పరారీలో ఉన్న నిందితుడికి ఆశ్రయం కల్పించడమే కాకుండా.. అతడిని నిర్దోషిగా నిరూపించేందుకు చేస్తున్న ప్రయత్నాలు న్యాయపరంగా చెల్లేవి కావని తెలిపాయి. నిందితుడిని చట్టం నుంచి కొన్నాళ్లు కాపాడినా చివరికి అతడు కోర్టు బోను ఎక్కక తప్పదని... చట్ట పరిధిలోనే తమ విచారణ కొనసాగుతోందని స్పష్టం చేశాయి. చదవండి : (అశోక్ అమరావతిలో ఉన్నా..అమెరికాలో ఉన్నా...) కాగా ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు 3 కోట్ల మంది ప్రజల ఆధార్, ఓటర్ ఐడీ తదితర వ్యక్తిగత సమాచారం చోరీకి గురవుతోందంటూ మాదాపూర్ పోలీసులకు లోకేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి ఈనెల 2న ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాదాపూర్ పోలీసులు మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలోని ఐటీగ్రిడ్ సంస్థపై దాడులు చేసి కొన్ని కంప్యూటర్లు ట్యాబ్‌లు స్వాధీనం చేసుకున్నారు. 120(బీ), 379, 420, 188తోపాటు ఐపీసీ 72, 66(బీ) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రజల వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన కేసు కావడంతో.. విచారణ నిమిత్తం హైదరాబాద్ రేంజ్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది.(డేటా చోరీ ప్రకంపనలు.. తస్మాత్ జాగ్రత్త!) -
దోషులు ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదు
-
అశోక్ అమరావతిలో ఉన్నా..అమెరికాలో ఉన్నా...
సాక్షి, హైదరాబాద్ : రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న డేటా చోరీ కేసు దర్యాప్తులో పురోగతి సాధించినట్లు సిట్ చీఫ్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఆయన గురువారం సాయంత్రం ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల డేటాను కూడా ఐటీ గ్రిడ్స్ సంస్థ తీసుకుందని, ఈ కేసులో ప్రతి అంశంపైనా క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. డేటా చోరీలో ప్రమేయం ఉన్నవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, ప్రధాన నిందితుడు అశోక్ అమరావతిలో ఉన్నా...అమెరికాలో ఉన్నా వదిలేది లేదని తెలిపారు. చట్టం ముందు అందరూ సమానులే అని, నిందితులు ఎవరైనా వదిలేది లేదని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో ఎన్నో ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దర్యాప్తు పారదర్శకంగా చేయాలని చూస్తున్నామన్నారు. చదవండి...(‘ఐటీ గ్రిడ్స్’పై సిట్) ఐటీ గ్రిడ్స్, బ్లూ ఫ్రాగ్స్ మొబైల్ టెక్నాలజీతో పాటు ఇంకా ఈ కేసులో ఎవరైన ఉన్నారా అన్న కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన డేటా కూడా ఉండటంతో తమకు అనేకు అనుమానాలు వచ్చాయన్నారు. చట్టం ముందు అందరూ సమానులే అని ఈ కేసులో ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు. సిట్‌లో 9మంది అధికారులు ఇప్పటికే విచారణ ప్రారంభించారని, అయితే ఈ కేసు దర్యాప్తుపై మీడియా కూడా సంయమనం పాటించాలని స్టీఫెన్ రవీంద్ర కోరారు. ప్రజల వ్యక్తిగత సమాచారం ఐటీ గ్రిడ్స్ సంస్థకు ఎలా వచ్చింది?. విశ్వసనీయంగా ఉంచాల్సిన డేటా ప్రయివేట్ సంస్థకు ఎవరిచ్చారు?. తెలంగాణ ప్రజల డేటాతో ఎవరికి ప్రయోజనం కలిగించాలనుకుంటున్నారు? అనే అంశాలపై లోతుగా దర్యాప్తు చేపట్టామన్నారు. టీడీపీ సేవామిత్ర యాప్‌లో ఏపీ, తెలంగాణకు చెందిన కొందరు ఓటర్ల వ్యక్తిగత సమాచారం ఉందని అన్నారు. ఇక డేటా గ్రిడ్స్ సీఈవో అశోక్ ఎక్కడున్నాడనేది ఇంకా తెలియలేదని, అతడి కోసం గాలిస్తున్నట్లు స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో పురోగతి ఉందని, మరింత సమాచారం కోసం నిపుణుల సహకారం తీసుకుంటున్నామన్నారు. ఐటీ గ్రిడ్స్ సంస్థపై గతంలో సోదాలు చేసిన నేపథ్యంలో ఏపీ ప్రజల డేటాను గుర్తించామని, ఆ డేటాతో పాటు వారికి చెందిన ఆధార్ వివరాలు ఉన్నాయన్నారు. అలాగే ఈ కేసులో అమెజాన్, గూగుల్ సంస్థలకు నోటీసులు ఇచ్చామని, ఇంకా వాటి దగ్గర నుంచి సమాధానం లేదన్నారు. డేటా చోరీపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన తర్వాత సేవామిత్రలో ఉన్న కొన్ని యాప్స్ తొలగించినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. ఈ కేసు వివరాలను ప్రతిరోజు తెలియచేస్తామని సిట్ అధికారి స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. -
టీడీపీ వెబ్సైట్ క్లోజ్.. అందుకేనా?
-
డేటా చోరీపై విచారణకు ఐదు ప్రత్యేక బృందాలు
-
డేటా చోరీపై విచారణకు ఐదు ప్రత్యేక బృందాలు
సాక్షి, హైదరాబాద్: ఐటీ గ్రిడ్స్ డేటా చోరీ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటైన సిట్ వేగంగా పావులు కదుపుతోంది. ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలోని సిట్ బృందం గురువారం డీజీపీ కార్యాలయంలో సమావేశమైంది. కేసును అన్ని కోణాల్లో విచారణ చేపట్టడానికి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఓ వైపు సాక్షుల, నిందితుల విచారణ చేపడుతూనే మరోవైపు యూజర్ల సమాచారం తీసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం సిట్ ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాట చేసింది. (‘ఐటీ గ్రిడ్స్’పై సిట్) సైబర్ క్రైమ్ పోలీసులతో కూడిన ప్రత్యేక బృందం.. ఈ కేసుకు సంబంధించి సైబర్ నిపుణల సలహాలతో డేటా అనాలసిస్, డేటా రిట్రైవ్ చేపట్టనుంది. ఈ కేసుకు సంబంధించి సాక్షులను, నిందితులను విచారించడానికి సీనియర్ అధికారితో కూడిన ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. మరో టీమ్ ఈ కేసుకు సంబంధించి ఏపీ పోలీసులతో సంప్రదింపులు జరపనుంది. మిగిలిన రెండు ప్రత్యేక బృందాలు ఈ కేసులో ప్రధాన నిందితుడు ఐటీ గ్రిడ్స్ ఎండీ అశోక్ కోసం గాలింపు చేపట్టనున్నాయి. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించిన యూజర్ల సమచారం ఇవ్వాల్సిందిగా అమెజాన్, గూగుల్‌ని కోరింది. డేటా చోరీకి సంబంధించి యూఐడీఎఐ, ఎన్నికల కమీషన్లకు లేఖ ద్వారా సిట్ సమాచారం అందజేయనుంది.(ఇదీ జరుగుతోంది!) -
అధికారిక సమీక్షల్లో అశోక్ దర్జా!
-
టీడీపీ వెబ్సైట్ క్లోజ్.. అందుకేనా?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత డేటా చోరీ స్కాంలో అధికార పార్టీపై ఆరోపణల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. టీడీపీ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ‘ఎర్రర్’ అని చూపిస్తోంది. టీడీపీ యాప్ తయారీ సంస్థ ఐటీ గ్రిడ్స్ సంస్థపై డేటా చోరీ ఆరోపణలు రావడంతో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేగింది. ఈ నేపథ్యంలో టీడీపీ అధికారిక వెబ్సైట్ www.telugudesam.org షట్‌డౌన్ కావడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ సేవా మిత్ర యాప్ సమాచారం బయటపడకుండా ఉండేందుకే వెబ్‌సైట్‌ను మూసేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ ఆన్లైన్ సభ్యత్వాన్ని కూడా ఇంతకుముందే హఠాత్తుగా నిలిపివేశారు. (అంతా పథకం ప్రకారమే!) మంత్రి నారా లోకేశ్‌తో ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ దాకవరం అశోక్‌కు సత్సంబంధాలున్నాయన్న ఆరోపణలకు బలం చేకూరుతోంది. ఏకంగా లోకేశ్‌తో కలిసి ఆయన అధికారిక సమీక్షా సమావేశంలో పాల్గొన్న విషయం బయటపడింది. గుట్టురట్టు కావడంతో అధికారుల్లోనూ ఆందోళన మొదలైంది. మరోవైపు ఐటీ గ్రిడ్స్, బ్లూ ఫ్రాగ్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాల్లో మార్పులు చేయాలని మంత్రి లోకేశ్ ఆదేశించడంతో ఉన్నతాధికారులు ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ ఫైళ్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. డేటా చోరీ కేసులో అన్నివైపుల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు సర్కారు దీని నుంచి బయటపడేందుకు నానా తంటాలు పడుతున్నట్టు కనబడుతోంది. (అధికారిక సమీక్షల్లో అశోక్ దర్జా!) -
తప్పు చేయకుంటే అశోక్ ఎందుకు పరారీ?
సాక్షి, విజయవాడ: ప్రతి నియోజకవర్గంలోను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగించారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. విజయవాడలోని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలోనే 9 వేల ఓట్లను తీసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫారం-7ను టీడీపీ నేతలు ఓట్ల తొలగింపుకు వాడుకుంటున్నారని విమర్శించారు. గత పది రోజులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దీనిపై పోరాటం చేస్తుందని గుర్గుచేశారు. ఎలక్షన్ కమిషన్ విచారణ చేసి ఓట్ల తొలగింపులో వాస్తవాలు బయటపెట్టాలని కోరారు. టీడీపీ సేవామిత్ర యాప్ వ్యవహారం బహిర్గతం కావడంతో.. దాన్ని నుంచి బయటపడేందుకు ఆ పార్టీ నేతలు వైఎస్సార్ సీపీపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. తప్పు చేయకుంటే ఐటీ గ్రిడ్స్ సీఈఓ అశోక్ ఎందుకు పరారీలో ఉన్నాడని సూటిగా ప్రశ్నించారు. గుట్టు బయటపడుతుందని అశోక్‌ను, ఇతర సిబ్బందిని దాస్తోంది టీడీపీ కాదా అని నిలదీశారు. ఏపీ ప్రభుత్వం నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన ఐదు రకాల వ్యక్తిగత డేటా సేవామిత్ర యాప్‌లోకి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. సిట్ విచారణలో మరిన్ని వాస్తవాలు బయటకు వస్తాయని అన్నారు. ఓ పథకం ప్రకారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఓట్ల తొలగింపు చేపట్టారని ఆరోపించారు. సర్వేలన్నీ ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతారని చెబుతున్న విషయాన్ని గుర్తుచేశారు. ఆ భయంతోనే చంద్రబాబు 59 లక్షల ఓట్లను తొలగించారని వ్యాఖ్యానించారు. నేరాన్ని అంగీకరించి చంద్రబాబు తన పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. -
ఐటీ గ్రిడ్స్.. అధికారుల పాత్రపై సిట్ విచారణ!
సాక్షి, హైదరాబాద్: ఐటీ గ్రిడ్స్ డేటా చోరీ కేసుపై ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై చర్చించేందుకు గురువారం సమావేశం కానున్న సిట్ కీలక ఆధారాలను సేకరించేందుకు సన్నద్ధమవుతుంది. డేటా చోరీ కేసుకు సంబంధించిన రికార్డులను, ఆధారాలను సైబరాబాద్ పోలీసులు సిట్‌కు అందజేయనున్నారు. ఈ వివరాలు తీసుకున్న తర్వాత సిట్ ఆధ్వర్యంలో ఐటీ గ్రిడ్స్ సంస్థ ఉద్యోగులను అధికారులు విచారించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటాను ఐటీ గ్రిడ్స్‌కు అందించడంలో ప్రభుత్వ అధికారుల పాత్రపై సిట్ విచారణ మొదలుపెట్టనుంది. (‘ఐటీ గ్రిడ్స్’పై సిట్) కాగా, ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ గురువారం వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఐటీ గ్రిడ్స్ ఎండీ అశోక్ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు 3 కోట్ల మంది ప్రజల ఆధార్, ఓటర్ ఐడీ తదితర వ్యక్తిగత సమాచారం చోరీకి గురైదంటూ ఫిర్యాదులు రావడంతో తెలంగాణ పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ కేసుపై విచారణ చేపట్టిన తెలంగాణ పోలీసుల, తెలంగాణ ప్రభుత్వంపై టీడీపీ అభిమానులు ఆన్లైన్లో ఎదురుదాడికి దిగుతున్న సంగతి తెలిసిందే. (ఇదీ జరుగుతోంది!) -
లోకేష్, అశోక్‌ల దోస్తానాకు సాక్ష్యమిదే..!
సాక్షి, అమరావతి: ఈ ఫొటోలో వృత్తంలో ఉన్న వ్యక్తిని చూశారా.. ఆయనే దాకవరం అశోక్. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ సేవా మిత్ర యాప్ ద్వారా జరిగిన డేటా స్కాంకు సూత్రధారిగా ఉన్న ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ఈయన. ఆధార్, రాష్ట్ర ప్రభుత్వ రహస్య డేటా అక్రమంగా కలిగి ఉన్నారన్న ఆరోపణలతో పోలీసు విచారణ ఎదుర్కొంటున్న ఈయన ఏకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపరంగా జరిగే అధికారిక సమీక్ష సమావేశాల్లో మంత్రి నారా లోకేష్‌తోపాటు సీనియర్ ఐఏఎస్ అధికారులు జవహర్‌రెడ్డి, రామాంజనేయులు, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారుల మధ్యనే దర్జాగా కూర్చొని ఉన్నారు. ఒక రాజకీయ పార్టీ అయిన టీడీపీకి ఐటీ సేవలు అందించే కంపెనీ యజమాని రాష్ట్ర ప్రభుత్వ అధికారిక సమీక్ష సమావేశాల్లో పాల్గొనడానికి అనుమతి లభించడం, మంత్రి, సీనియర్ ఐఏఎస్ అధికారుల మధ్య దర్జాగా కూర్చోవడాన్ని బట్టి చూస్తే.. మంత్రితో ఆయనకున్న సాన్నిహిత్యం ఏమిటో బోధపడుతుంది. టీడీపీ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్‌తో ఉన్న సాన్నిహిత్యం, ఆయన అండతోనే ప్రభుత్వ అధికార సమీక్ష సమావేశాల్లో అశోక్ పాల్గొంటున్నారని అధికారులు సైతం చెబుతుండడం గమనార్హం. (‘ఐటీ గ్రిడ్స్’పై సిట్) లోకేష్ వెంటే ఉంటూ ఎప్పుడూ ఆయన అధికారిక సమావేశాల్లో పాల్గొంటారని వారు చెబుతున్నారు. సచివాలయంలోని ఐదవ బ్లాక్‌లో మంత్రి లోకేష్ చాంబర్లోనే అశోక్ ఎప్పుడూ ఉంటారని.. మంత్రి కార్యాలయంలో ఆయనదే పూర్తి హవా అని అంటున్నారు. టీడీపీకి ఐటీ సేవలందించే అశోక్‌కు చెందిన సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి మంత్రి లోకేష్ శాఖల ద్వారానే కోట్ల రూపాయలు చెల్లింపులు సైతం జరిగాయి. గత ఎనిమిది నెలల్లో నాలుగు విడతల్లో ఈ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.1.01 కోట్లు చెల్లించింది. దీన్నిబట్టి పార్టీకోసం పనిచేసేవారిని ప్రభుత్వ విధుల్లో భాగస్వాముల్ని చేయడమేగాక ప్రభుత్వం నుంచి ఐటీ కాంట్రాక్టులను సైతం కట్టబెట్టారనేది స్పష్టమవుతోంది. మొత్తంగా ఈ తతంగంలో ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన భారీ కుట్ర దాగి ఉందని అధికార వర్గాల్లోనే చర్చ జరుగుతుండడం గమనార్హం. ఇది చదవండి : టీడీపీ మైండ్‌గేమ్! -
వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు
సాక్షి నెట్వర్క్: తెలుగుదేశం ప్రభుత్వం https://www.sakshi.com/tags/data-breachడేటా చౌర్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అధికారపార్టీ నేతలు దాన్నుంచి బయటపడేందుకు ఫారం–7 దరఖాస్తుల వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై అక్రమ కేసుల నమోదుకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్ల నేపథ్యంలో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతలపై భారీ ఎత్తున అక్రమ కేసుల నమోదు చేపట్టారు. ఓట్ల తొలగింపునకు దరఖాస్తులు చేశారంటూ నోటీసులు జారీ చేయడమేగాక ప్రధాన ప్రతిపక్షానికి చెందిన నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేశారు. అంతేగాక వారిని పోలీస్స్టేషన్లకు పిలిపించి భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరించారు. విచారణ పేరుతో వేధింపులకు పాల్పడ్డారు. (ఇదీ జరుగుతోంది!) అక్రమ కేసుల బనాయింపు తీరిదీ.. - అక్రమ ఓట్ల తొలగింపు కోరుతూ ఫారం–7 కింద దరఖాస్తులు చేశారనే పేరిట కృష్ణా జిల్లాలో బుధవారానికి 22 కేసులు నమోదు చేశారు. మైలవరంలో 15 మంది వైఎస్సార్సీపీకి చెందిన బూత్ లెవల్ కన్వీనర్లను పోలీసులు స్టేషన్‌కు పిలిపించి విచారించారు. ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపునకు సంబంధించి ఆన్లైన్లో అర్జీలను తాము దరఖాస్తు చేయలేదని వారు రాతపూర్వకంగా తెలిపారు. జగ్గయ్యపేట మండలం షేర్‌మహ్మద్‌పేటకు చెందిన వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్ డి.కమలేష్రాజును బుధవారం అర్ధరాత్రి చిల్లకల్లు పోలీసుస్టేషన్‌కు చెందిన ఏఎస్ఐ, హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుల్ వచ్చి ఫారం–7 అర్జీపై విచారించారు. కమలేష్‌రాజు పేరిట అతని ఓటును అతనే తొలగించాలని కోరుతూ గుర్తు తెలియన వ్యక్తి ఆన్లైన్లో ఫారం–7 దరఖాస్తు చేయడం గమనార్హం. ఈ విషయమై విచారించేందుకు పోలీసులు అర్ధరాత్రిపూట ఇంటికి రావడమేమిటని కమలేష్‌రాజు వాపోయారు. (మనోడు కాదనుకుంటే ఓటు గల్లంతే!) - శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇప్పటివరకు ఫారం–7 పేరిట 20 కేసులు నమోదయ్యాయి. కావలి సబ్ డివిజన్లో 6, నెల్లూరు రూరల్ సబ్ డివిజన్లో 3, గూడూరు సబ్ డివిజన్లో 3, ఆత్మకూరు సబ్ డివిజన్లో 8 కేసులు చొప్పున నమోదు చేశారు. మంగళవారం గూడూరులో ఆరుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తల్ని విచారణకోసం స్టేషన్‌కు పిలిపించారు. - వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలో ఫారం–7 కింద ఓట్ల తొలగింపునకు దరఖాస్తు చేశారనే ఆరోపణతో వైఎస్సార్సీపీకి చెందిన 90 మందిపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారు. బద్వేలు నియోజకవర్గం కాశీనాయన మండలంలో 1,712 ఓట్లకు తొలగింపునకు వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్ల పేరిట అగంతకులు ఫారం–7 దరఖాస్తు చేశారు. దీనిపై ఒకవైపు విచారణ జరుగుతుండగానే కలసపాడు పోలీసుస్టేషన్ పరిధిలో 12 మందిపై, బి.కోడూరు పోలీసుస్టేషన్ పరి«ధిలో 15 మంది వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్లపై కేసుల నమోదుకు తహసీల్దారు ఆదేశించారు. తమకు తెలియకుండానే ఫారం–7 దరఖాస్తులిస్తే ఎలా కేసులు నమోదు చేస్తారని వీరు విస్తుపోతున్నారు. - పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా వైఎస్సార్సీపీకి చెందిన బూత్ కన్వీనర్లను, ముఖ్య కార్యకర్తల్ని బుధవారం పోలీస్స్టేషన్లకు పిలిపించారు. ఏలూరు మండలం నుంచి 205 మందిని ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వివరాలు సేకరించారు. దరఖాస్తులు మీరే చేశారా లేదా? అని ప్రశ్నించారు. మా పేరుతో ఫొటోతో ఎవరో దరఖాస్తు చేశారు.. మాకు సంబంధం లేదని వారు చెప్పారు. పెదవేగి నుంచి 185 మందిని పిలిపించి విచారించారు. ఆచంటలో బూత్ కన్వీనర్లను ఏలూరు ఎస్పీ కార్యాలయానికి పిలిపించారు. చింతలపూడిలో పలువురిని చింతలపూడి పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. ఇదే రీతిలో జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ బూత్ కన్వీనర్లు, ఇతర కార్యకర్తలను పోలీస్ స్టేషన్లకు పిలిపించి విచారణ పేరుతో భయభ్రాంతులకు గురిచేశారు. - కర్నూలు జిల్లాలో ఇప్పటివరకు 24 సైబర్ క్రైం కేసులు నమోదయ్యాయి. డోన్ నియోజకవర్గానికి సంబంధించి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో పది మంది వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారు. ఇదే నియోజకవర్గంలోని బేతంచర్ల మండలంలో 129 మందికి నోటీసులు జారీ చేస్తున్నట్లు సమాచారం. ఆలూరులో 32 మంది వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్లు, పార్టీ నేతలపై కేసులు నమోదు చేశారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 50 మంది బూత్ కన్వీనర్లపై కేసులు నమోదు చేసి.. విచారణ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. - తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 3వేల మందికి నోటీసులు జారీ చేయడంతోపాటు సుమారు 1,500 మందిపై కేసులు నమోదు చేశారు. వీరందరిని పోలీసు స్టేషన్లకు పిలిపించి విచారణ పేరుతో ఇబ్బందులకు గురిచేశారు. తుని నియోజకవర్గంలో 13 మంది బూత్‌కమిటీ కన్వీనర్లపై కేసు నమోదు చేశారు. ప్రత్తిపాడులో ముగ్గురు బూత్ కమిటీ కన్వీనర్లను పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. గొల్లప్రోలు మండలంలో ఓటర్ల తొలగింపునకు దరఖాస్తు చేశారంటూ 43 మంది వైఎస్సార్ సీపీ బూత్ కమిటీ కన్వీనర్లపై, వైఎస్సార్సీపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులు నమోదు చేసిన బూత్ కమిటీ కన్వీనర్ల ఇళ్లకు పోలీసులు మంగళవారం అర్ధరాత్రి వెళ్లి భయాందోళనలు సృష్టించారు. పోలీస్‌స్టేషన్‌కు రాకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరించారు. బుధవారం ఉదయం వారిని పోలీసుస్టేషన్‌కు తరలించారు. దీనిపై పిఠాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్ దొరబాబు ఆధ్వర్యంలో తహసీల్దారు కార్యాలయం వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. కాకినాడ సిటీలో 20 మంది బూత్‌కమిటీ కన్వీనర్లను పోలీసులు విచారించారు. వారికి నోటీసులిచ్చారు. - శ్రీకాకుళం జిల్లాలో ఫారం–7 దరఖాస్తులు దాఖలు చేసిన వ్యవహారంలో దర్యాప్తు పేరుతో 197 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేశారు. రాజాం నియోజకవర్గంలోని రేగిడి ఆమదాలవలస మండలంలో 59 మంది, వంగరలో 18 మంది, పాలకొండ నియోజకవర్గంలోని సీతంపేటలో 52 మంది, భామినిలో 23 మంది, పలాస మండలం మందసలో 26 మంది, పరాసలో 12 మంది, వజ్రపుకొత్తూరులో ఆరుగురు, నరసన్నపేట నియోజకవర్గంలోని సారవకోటలో ఒకరిపై అక్రమ కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నంలో.. విశాఖపట్నం జిల్లావ్యాప్తంగా 22 పోలీస్ స్టేషన్ల పరిధిలో బుధవారం నాటికి 41 కేసులు నమోదు చేశారు. ఒక్క సబ్బవరం పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఏకంగా 15 కేసులు నమోదయ్యాయి. ఏ.కోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు, అనకాపల్లి టౌన్, మునగపాక పోలీస్స్టేషన్లలో రెండేసి చొప్పున కేసులు నమోదు కాగా, మిగిలిన 20 పోలీస్ స్టేషన్లలో ఒక్కొక్క చొప్పున కేసులు నమోదయ్యాయి. మెజార్టీ కేసులు వైఎస్సార్సీపీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని పెట్టినట్టుగానే తెలుస్తోంది. ఈ కేసులన్నింటిని ఆయా పోలీస్స్టేషన్లు జిల్లా సైబర్ క్రైం విభాగానికి బదలాయించారు. వైఎస్సార్సీపీకి చెందిన మండల, గ్రామ, బూత్ కమిటీ నేతలను స్టేషన్లకు పిలిపించుకుని విచారించిన పోలీసులు వైఎస్సార్సీపీ నేతలిచ్చిన ఫిర్యాదుల మేరకు పెట్టిన కేసుల్లో మాత్రం టీడీపీ శ్రేణులను విచారణకు పిలిచే సాహసం చేయలేకపోతున్నారు. -
ఇదీ జరుగుతోంది!
సాక్షి, హైదరాబాద్: ఐటీ గ్రిడ్స్ వ్యవహారంలో ‘టీడీపీ కీ–పర్సన్’ అనే కోడ్‌తో పిలిచే వారు కీలకంగా వ్యవహరించారని హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఈ ‘కీ’పర్సన్స్ ఎవరనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. ఈ యాప్ వ్యవహారంలో ఆన్లైన్లో జరిగే కీలక పరిణామాలను ఆయన మ్యాప్ రూపంలో వివరించారు. (మనోడు కాదనుకుంటే ఓటు గల్లంతే!) సేవామిత్ర యాప్‌ను రూపొందించిన ఐటీ గ్రిడ్స్ సంస్థ.. వివిధ మార్గాల్లో ఏపీ ప్రజల వ్యక్తిగత, రహస్య డేటా సంగ్రహించింది. దీని ఆధారంగా ఇక్కడి కాల్ సెంటర్లోని వాళ్లు, క్షేత్రస్థాయిలో ఉన్న సర్వేయర్లు ముందుగా రూపొందించుకున్న ప్రశ్నావళి ప్రకారం ఓటర్ల అభిప్రాయాలు సేకరిస్తారు. వారు చెప్పే అంశాలను పొందుపరుస్తూ.. ఆ వివరాలను సేవామిత్ర సైట్‌కు అప్లోడ్ చేస్తారు. ఈ డేటాను ఐటీ గ్రిడ్స్ సంస్థ ఓ క్రమపద్ధతిలో ఏర్పాటు చేస్తుంది. దీన్ని నియోజకవర్గాల్లోని బూత్ స్థాయి సేవామిత్ర కన్వీనర్లకు అనువుగా తయారు చేసి వారికి పంపిస్తుంది. క్షేత్రస్థాయిలో సర్వే చేస్తూ అందులోని ఓటర్ల వివరాలను సరిచూసే ఈ బూత్ స్థాయి కన్వీనర్లు వారి ఆధార్, మొబైల్ నంబర్లు, కులం, రాజకీయ ప్రాధాన్యం వివరాలు సేకరిస్తారు. ఇలా రూపొందించిన డేటాను మళ్లీ హైదరాబాద్‌లోని అయ్యప్పసొసైటీలో ఉన్న ఐటీ గ్రిడ్స్ సంస్థకు పంపిస్తారు. ఈ డేటాను మరికొన్ని కోణాల్లో విశ్లేషించే ఐటీ గ్రిడ్స్ సంస్థ టీడీపీ వ్యతిరేక ఓటర్లు, ఆయా ప్రాంతాల్లో లేని వారిని గుర్తిస్తుంది. ఇలా సమగ్ర విశ్లేషణతో తయారు చేసిన జాబితాలను తెలుగుదేశం పార్టీ ‘కీ’పర్సన్‌కు పంపిస్తుంది. సదరు యాప్‌లో వీరికి ‘టీడీపీ కీ–పర్సన్’అనే కోడ్ వర్డ్ ఇచ్చారు. ఆ కీపర్సన్ తనకు అందిన ఫైనల్ జాబితాలోని ఓటర్లు తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కాదని నిర్ధారించుకుంటాడు. వారి పేరుతో తప్పుడు మార్గంలో ఫామ్–7 రూపొందించి ఓట్లు తొలగించేందుకు ఓటర్ ప్రమేయం లేకుండానే సంబంధిత అధికారికి పంపించేస్తారు. సేవామిత్ర సర్వేలో వేరే పార్టీకి ప్రాధాన్యం ఇచ్చిన వారు తమకు ఓటు వేయరనే ఉద్దేశంతో తొలగించేస్తున్నారు. సర్వే సమయంలో అందుబాటులో లేని వాళ్లు.. పోలింగ్ సమయంలో వచ్చి వేరే పార్టీకి ఓటు వేస్తారనే ఉద్దేశంతో తీయించేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. (‘ఐటీ గ్రిడ్స్’పై సిట్) -
మనోడు కాదనుకుంటే ఓటు గల్లంతే!
అమెరికాలోని జార్జియాలో 2018లో గవర్నర్ ఎన్నికలు జరిగాయి. దీనికి బ్రెయిన్ కెంప్–స్టేసీ అబ్రహమ్ పోటీపడ్డారు. 2010 నుంచి కొన్నాళ్లు జార్జియా సెక్రటరీగా పని చేసిన కెంప్ ఆ ప్రాంతంలో ఉన్న 3.4 లక్షల మంది కలర్ మైనార్టీల ఓట్లు వారి ప్రమేయం లేకుండానే తీసేయించేసి లబ్ధిపొందారు. దీన్ని అక్కడి పరిభాషలో ‘రాంగ్లీపర్జ్’అని అంటారు. అప్పుడు కెంప్ వినియోగించిన విధానం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏపీలో వాడుతోంది. విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో ఓటర్లుగా ఉన్న కందుల రంగారెడ్డి, కందుల నాగమణి అమీర్‌పేటలో ఉంటున్నారు. చిత్తూరుకు చెందిన ఓటర్లు వేణుగోపాల్‌రెడ్డి, నాగవేణి సైతం నగరంలో నివసిస్తున్నారు. వీరికి ఐటీ గ్రిడ్స్ కాల్‌సెంటర్ నుంచి ఐవీఆర్ఎస్ కాల్ వచ్చింది. ఇందులో టీడీపీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సీన్ కట్ చేస్తే.. ఈ నలుగురూ తమ ప్రమేయం లేకుండానే ఏపీలో ఉన్న ఓట్లు కోల్పోయారు. సేవామిత్ర యాప్‌లో కేవలం తెలుగుదేశం పార్టీ వారి సమాచారం మాత్రమే కాదు.. ఏ ఓటర్ ఏ పార్టీకి చెందిన వారు అనే సమాచారం ఉంది. ఇవి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించిన అంశాలివి. ఇలా ఐటీ గ్రిడ్స్ సంస్థను అడ్డంపెట్టుకుని టీడీపీ చేస్తున్న ఎన్నో కుట్రల్లో ఇవి రెండు ఉదాహరణలు మాత్రమే. సాక్షి, హైదరాబాద్: ఐటీ గ్రిడ్స్ రూపొందించిన సేవామిత్ర యాప్‌ను ఆయుధంగా వాడుకుంటూ వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అక్రమంగా లబ్ధిపొందడానికి తెలుగుదేశం పార్టీ భారీ కుట్రకు తెరలేపింది. తమ దురుద్దేశపూర్వక సర్వేల్లో ఎవరైనా తమ పార్టీకీ ఓటు వేయరని తేలినా.. ఆ వ్యక్తి సర్వే సమయంలో సదరు నియోజకవర్గంలో లేకపోయినా వారి ఓట్లు కుట్రపూరితంగా తొలగించేస్తున్నారు. ఈ వ్యవహారంలో టీడీపీ ‘కీ’పర్సన్స్ కీలకపాత్ర పోషించేవారని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. (ఇదీ జరుగుతోంది!) మొదటి వారు తమ ఓటర్లు కాదనే ఉద్దేశంతో, రెండో వారు తమకు వేయకపోయే ప్రమాదం ఉందనే అనుమానంతో ఇలా చేసుండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఐటీ గ్రిడ్స్ సాయంతో తెలుగుదేశం పార్టీ చేసిన, చేస్తున్న అక్రమాలపై నగరంలోని ఎస్సార్‌నగర్ పోలీసుస్టేషన్లో నమోదైన కేసు దర్యాప్తు సాగుతోందని ఆయన వివరించారు. వెస్ట్‌జోన్, టాస్క్‌ఫోర్స్ డీసీపీలు ఏఆర్ శ్రీనివాస్, పి.రాధాకిషన్‌రావులతో కలిసి బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. బాధితులంతా నగరంలో ఉంటున్నవారే హైదరాబాద్‌లోని మధురానగర్‌కు చెందిన దశరథరామిరెడ్డి ఫిర్యాదుతో శనివారం రాత్రి ఐటీ గ్రిడ్స్‌పై ఎస్సార్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడితోపాటు ఇప్పటి వరకు గుర్తించిన బాధితులంతా హైదరాబాద్‌లో ఉంటున్న వారే. ఈ నేపథ్యంలోనే కేసుకు సంబంధించి ‘పరిధి’అనే సమస్య ఉత్పన్నం కాదు. తెలుగుదేశం పార్టీ సేవా మిత్ర యాప్.. ఐటీ గ్రిడ్స్ కంపెనీ సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లో సర్వేలు చేస్తోంది. ఓటర్లకు చెందిన వ్యక్తిగత సమాచారం, ఈసారి ఎన్నికల్లో వారి ప్రాధాన్యం, గుర్తింపు పత్రాల వివరాలు.. ఇలా అనేక అంశాలు సేకరిస్తోంది. (‘ఐటీ గ్రిడ్స్’పై సిట్) దీనికోసం ఐటీ గ్రిడ్స్ సంస్థ వారు చాలా మంది సర్వేయర్లను రంగంలోకి దింపారు. ఈ యాప్‌లో ఉంచడానికి ఓ ప్రత్యేక ప్రశ్నావళిని రూపొందించారు. సదరు ఓటరు నియోజకవర్గంలో ఉంటున్నారా? లేదా? స్వతహాగా ఏ పార్టీకీ చెందిన వారు? రానున్న ఎన్నికల్లో ఆయన ఓటింగ్ ప్రాధాన్యం ఏ పార్టీకి? ప్రశ్నలకు సమాధానాలను ఐటీ గ్రిడ్స్ సంస్థ కాల్ సెంటర్ నుంచి ఫోన్‌కాల్స్ ద్వారా, క్షేత్రస్థాయిలో సర్వేయర్ల ద్వారా సేకరిస్తోంది. దీన్ని ప్రాసెస్ చేసిన తర్వాత టీడీపీ వారికి అందిస్తోంది. వారి ద్వారానే ఓటర్‌కు తెలియకుండానే ఓట్లు తొలగిపోతున్నాయి. అన్ని పార్టీల ఓటర్లతో సర్వే సేవామిత్ర యాప్‌లో కేవలం తెలుగుదేశం పార్టీ వారికి చెందిన వివరాలు మాత్రమే ఉన్నాయని ఆ పార్టీ నేతలు చెప్పడంలో వాస్తవం లేదు. ఒక ఓటరు.. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ, జనసేన, సీపీఐ, సీపీఎం పార్టీల్లో ఎవరికి ప్రాధాన్యం ఇస్తున్నాడు. అనేది తెలుసుకుని యాప్‌లో పొందుపరుస్తున్నారు. ఆయా పార్టీకి రేటింగ్స్ కూడా ఇస్తూ డేటాబేస్ రూపొందించారు. ఐటీ గ్రిడ్స్‌కు చెందిన సేవామిత్ర యాప్ ద్వారా తెలుగుదేశం పార్టీ తమ వ్యతిరేక ఓటర్లను తొలగించి రానున్న ఎన్నికల్లో అక్రమ లబ్దిపొందేందుకు ప్రయత్నిస్తోందంటూ ఫిర్యాదుదారుడు పేర్కొన్న అంశాలన్నీ వాస్తవమే అని పోలీసులు తేల్చారు. ఈ యాప్‌ను అడ్డం పెట్టుకుని టీడీపీ వారు ప్రధానంగా ఆయా ప్రాంతాల్లో ఉండని, తమ పార్టీకి ఓటు వేయరని భావించిన వారి ఓట్లను వారి ప్రమేయం లేకుండానే తొలగిస్తున్నారు. సేవామిత్ర యాప్‌లో ఉన్నది తెలుగుదేశం పార్టీ డేటా మాత్రమే అన్నది వాస్తవం కాదు. ఆంధ్రప్రదేశ్ నుంచి అనేక మంది విద్య, వృత్తి, వ్యాపారాల కోసం హైదరాబాద్‌కు వస్తున్నారు. అలాంటి వారి ఓట్లను కూడా.. వారి ప్రమేయం లేకుండానే తీసేశారు. దీనిపై ఎన్నికల సంఘం నుంచి వివరాలు, మార్గదర్శకాలు తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. ఢిల్లీకి సైబర్ క్రైం బృందం ఐటీ గ్రిడ్స్ సంస్థపై నమోదైన కేసులో సైబరాబాద్ పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టారు. సంస్థ తొలగించిన 80 జీబీ సమాచారాన్ని బయటికి తీసి (రిట్రీవ్ చేసిన).. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు బుధవారం సైబరాబాద్ సైబర్ క్రైం బృందం ఢిల్లీకి బయలుదేరి వెళ్ళింది. ఈ బృందం ఢిల్లీలోని ఎన్నికల ప్రధాన కార్యాలయం, ఆధార్ (యూఐడీఏఐ) కార్యాలయాల అధికారులను కలిసి ఐటీ గ్రిడ్స్ దగ్గరున్న డేటా గురించి ఆరా తీయనున్నారు. ఆధార్ కార్డు, ఓటరు కార్డుకు సంబంధించిన కలర్ ఫొటోలతో కూడిన కాపీలు వీరికెలా వచ్చాయి? అసలు వాటిని ఎవరెవరికి ఇస్తారు? ఇచ్చినా వాటికి సంబంధించిన భద్రతాపరమైన అంశాలేంటి? రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరి పరిరక్షణలో ఈ వివరాలుంటాయి? వీటి గోప్యతకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఈ రహస్య సమాచారాన్ని ప్రైవేటు సంస్థలకు ఇచ్చే ప్రక్రియ ఉందా? ఇస్తే ఎలాంటి చట్టాలు వర్తిస్తాయనే అంశాలపై అధ్యయనం చేయనున్నారు. మరో బృందం బుధవారం కూడా ఐటీ గ్రిడ్స్ సంస్థలో డిలీటెడ్ సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నాలు జరిగాయి. దీని కోసం సైబర్ నిపుణులు పోలీసులతో కలిసి పాల్గొన్నారు. ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లో సున్నితంగా మారడంతో కేసు దర్యాప్తులో నిర్లక్ష్యాన్నికి తావులేకుండా ప్రతి అంశం కీలకంగా మారింది. దీంతో మరోసారి ఐటీ గ్రిడ్ సంస్థపై ఫిర్యాదు చేసిన లోకేశ్వర్‌రెడ్డిని బుధవారం సైబరాబాద్ పోలీసులు స్టేట్మెంట్ను రికార్డు చేసి అతని వద్దను ఆధారాలను పరిశీలించారు. బెదిరించిన పోలీసులు తెలిసిన వాళ్లే... ఐటీ గ్రిడ్స్ సంస్థ పై ఫిర్యాదు చేసిన లోకేశ్వర్‌రెడ్డిని బెదిరించింది ఏపీ పోలీసులేననే ఆధారాలను సైబరాబాద్ పోలీసులు సేకరించారు. లోకేశ్వర్‌రెడ్డి ఇంటి వద్ద సీసీటీవీ ఫుటేజీని, ఆయన కాల్‌డేటాను సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడి ఇంటికి వచ్చిన వారిలో ఏపీకి చెందిన ఓ ఏసీపీ, ఇన్స్పెక్టర్, ఇద్దరు కానిస్టేబుళ్ళు ఉన్నారని సేకరించిన ఆధారాల ద్వారా స్పష్టమైంది. సైబరాబాద్ పోలీసులు బుధవారం అమెజాన్ సర్వీసుకు 91 సీఆర్పీసీ నోటీసులను జారీ చేశారు. మొదటిరోజు నోటీసులు జారీ చేసినా అమెజాన్ వెబ్ సర్వీసు ఇంకా స్పందించలేదు. దీంతో బుధవారం మరో సారి సైబరాబాద్ పోలీసులు 91 సీఆర్పీసీ నోటీసును జారీ చేసి దర్యాప్తుకు అవసరం ఉన్న సమాచారాన్ని త్వరగా ఇచ్చేలా అమెజాన్ సంస్థ చర్యలు తీసుకోవాలని నోటీసులో స్పష్టంచేశారు. -
‘ఐటీ గ్రిడ్స్’పై సిట్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం రేపుతోన్న ఐటీ గ్రిడ్స్ కేసు విచారణ మరింత వేగవంతం కానుంది. ఈ కేసు విచారణ కోసం సిట్‌ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుపై సైబరాబాద్, హైదరాబాద్ రెండు కమిషనరేట్లలోనూ కేసులు నమోదైన నేపథ్యంలో సమగ్ర విచారణ జరిపించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం హైదరాబాద్ రేంజ్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటుచేసింది. సభ్యుల్లోని 9 మంది గతంలో సైబర్ నేరాల విచారణలో రాణించిన నేపథ్యం ఉన్నవారే. అందుకే, కేసును వీలైనంత త్వరగా దర్యాప్తు చేసేందుకు బృందంలోకి వీరిని తీసుకున్నట్లు తెలిసింది. (మనోడు కాదనుకుంటే ఓటు గల్లంతే!) కేసు నేపథ్యమిది ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు 3 కోట్ల మంది ప్రజల ఆధార్, ఓటర్ ఐడీ తదితర వ్యక్తిగత సమాచారం చోరీకి గురవుతోందంటూ మాదాపూర్ పోలీసులకు లోకేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి ఈనెల 2న ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాదాపూర్ పోలీసులు మాదాపూర్‌లోని అయ్యప్పసొసైటీలోని ఐటీగ్రిడ్ సంస్థపై దాడులు చేసి కొన్ని కంప్యూటర్లు ట్యాబ్‌లు స్వాధీనం చేసుకుంది. 120(బీ), 379, 420, 188తోపాటు ఐపీసీ 72, 66(బీ) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మరోవైపు ఎస్సార్ నగర్లోనూ ఇదే అంశంపై మరో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసును స్వయంగా హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. కాగా కొత్తగా ఏర్పాటుచేసిన ఈ సిట్.. తక్షణమే మనుగడలోకి వచ్చేలా, దర్యాప్తు బాధ్యతలు చేపట్టేలా ఆదేశాలు వచ్చాయి. ఇప్పటిదాకా జరిగిన దర్యాప్తు సమాచారమంతా సిట్‌కు బదిలీ కానుంది. గురువారం నుంచి ఈ ప్రత్యేక బృందం రంగంలోకి దిగనుంది. సిట్ కోసం డీజీపీ కార్యాలయంలోనే ప్రత్యేక గదిని కూడా కేటాయించినట్లు సమాచారం. ఇక నుంచి ఈ కార్యాలయం కేంద్రంగానే దర్యాప్తు పర్యవేక్షణ సాగుతుంది. సిట్‌కు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మూడు కమిషనరేట్ల సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు, సీఐడీ విభాగాలు నిత్యం సహకరిస్తాయని ఆదేశాల్లో స్పష్టంచేశారు. (ఇదీ జరుగుతోంది!) ఈ సిట్ బృందం వివరాలు 1. స్టీఫెన్ రవీంద్ర, ఐజీ వెస్ట్‌జోన్ 2. ఎన్.శ్వేత, కామారెడ్డి ఎస్పీ 3. రోహిణి ప్రియదర్శిని, సైబరాబాద్ డీసీపీ (క్రైమ్) 4. జి. శ్రీధర్, నారాయణ్‌పేట్ ఎస్డీపీవో 5. బి.రవికుమార్‌రెడ్డి, సైబరాబాద్ డీఎస్పీ (సైబర్ క్రైమ్) 6. ఎన్.శ్యామ్ ప్రసాద్ రావు, ఏసీపీ, మాదాపూర్ 7. వై. శ్రీనివాస్, ఏసీపీ, సైబరాబాద్ (క్రైమ్) 8. బి.రమేశ్, ఇన్స్పెక్టర్, హైదరాబాద్ (సీసీఎస్) 9. జి.వెంకటరామిరెడ్డి, ఇన్స్పెక్టర్ హైదరాబాద్ (సైబర్ క్రైమ్) -
డేటా చోరీ ప్రకంపనలు.. అదే గనుక జరిగితే!
ప్రస్తుతం రాష్ట్రమంతా ఒకటే చర్చ. డేటా చౌర్యం వార్తలతో తమ వ్యక్తిగత సమాచారం ఎంతవరకు భద్రం అనే అంశంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో థర్డ్ పార్టీ చేతుల్లోకి సున్నిత సమాచారం చేరడం ద్వారా ఎదురయ్యే పరిణామాల గురించి ఐటీ నిపుణులు విస్తుగొలిపే విషయాలు చెబుతున్నారు. ఫేస్బుక్ డేటా చౌర్యం మాదిరి మన డేటా కూడా లీక్ అయినట్లైతే గోప్యతా హక్కు ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఐటీ గ్రిడ్స్ స్కాం వెలుగులోకి వచ్చిన తాజా పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత సమాచార భద్రత ప్రమాదంలో పడింది. ప్రభుత్వ పథకాలు పొందేందుకు మనలో చాలా మంది ఎప్పుడో ఒకసారి దరఖాస్తు చేసుకున్న వాళ్లమే. చంద్రన్న భీమా పథకం కోసమో, ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఇళ్లు కట్టుకోవాలనో లేదా ఆరోగ్య రక్ష ద్వారా లబ్ది పొందాలనో ఆశించిన వాళ్లమే. ఇందులో భాగంగా మన పేరు, చిరునామా, ఫొటో, ఆధార్ నంబర్, సామాజిక వర్గం తదితర విషయాలను ప్రభుత్వ అధికారులకు ఇచ్చి ఉంటాం. అయితే ఈ వివరాలన్నీ ప్రభుత్వం వద్దే కాదు.. టీడీపీ సేవామిత్ర యాప్‌లోకి చేరడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఈ రకంగా ప్రతి వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత, రహస్య సమాచారం ఒక ప్రైవేటు ఏజెన్సీ చేతుల్లోకి వెళ్లడం వల్ల పౌరులకే కాకుండా దేశ భద్రతకు కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. అసలేం జరుగుతోంది... వివిధ ప్రభుత్వ విభాగాల పనితీరును మెరుగు పరచడంలో భాగంగా స్టేట్ రెసిడెంట్ డేటా హబ్ (ఎస్ఆర్డీహెచ్) కోసం ఇటీవల స్మార్ట్ పల్స్ సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ట్యాబ్‌ల ద్వారా ప్రజల సామాజిక, ఆర్థిక సమాచారాన్ని డిజిటల్ పద్ధతిలో సేకరించారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలను ఆధార్ నంబర్ సహా ఎస్ఆర్డీహెచ్ పోర్టల్‌లో నిల్వ చేశారు. అయితే సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఈ సమాచారాన్ని తొలగించాల్సిందిగా ఆదేశించింది. దీంతో ఎస్ఆర్డీహెచ్ పోర్టల్‌లోని డేటాను ధ్వంసం చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ధ్వంసం చేసినట్లుగా చెబుతున్న ఈ డేటాను ఐటీగ్రిడ్స్ అనే సంస్థ తన ‘సేవామిత్ర’యాప్ రూపకల్పనలో ఉపయోగించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వీటి ఆధారంగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, ఓటర్ల వివరాలు, వారు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారు తదితర అంశాలను సేకరించినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదకర ఫీచర్లు ఉన్న ఈ యాప్ ద్వారా పౌరుల ప్రైవేటు డేటాను వివిధ వర్గాలకు విక్రయించే అవకాశం ఉంది. ఇదే గనుక జరిగితే సైబర్ నేరగాళ్ల ఆగడాలకు మనం బలై పోవాల్సి ఉంటుంది. అందుకే ఎవరికైనా వివరాలు చెప్పే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవడం మంచిది. అయితే ప్రభుత్వాన్ని నమ్మి వివరాలు చెప్పినందుకు ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు ఎదురుకావడం నిజంగా విచారకరం. ప్రమాదకర ఫీచర్లు.. సేవామిత్ర యాప్‌లో అనేక ప్రమాదకర ఫీచర్లు ఉన్నట్లు ఐటీ నిపుణులు చెబుతున్నారు. ఫోన్ స్లీపింగ్ మోడ్‌లోకి వెళ్లకుండా అడ్డుకోవడంతోపాటు వినియోగదారులు ఎక్కడ ఉన్నదీ (యూజర్ లొకేషన్) తెలుసుకోవచ్చని పేర్కొంటున్నారు. మన ఫోన్ స్టేటస్‌తో పాటు అందులోని వ్యక్తిగత ఫొటోలు, ఫైల్స్, ఇతర సమాచారాన్ని తెలుసుకోవడం సాధ్యమవుతుందని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఈ యాప్ ద్వారా యూఎస్బీ స్టోరేజీ ఫైల్ సిస్టమ్‌లోని సమాచారాన్నితెలుసుకోవడంతో పాటు... అందులోని సమాచారాన్ని మార్పిడి చేయడం లేదా తొలగించే సామర్ధ్యం కూడా ఉందని చెబుతున్నారు. పౌరుల ఆడియో రికార్డుతో పాటు వైఫై కనెక్షన్ల వివరాలు, నెట్వర్క్ కనెక్షన్లు, బ్లూటూత్‌తో అనుసంధానం, ఆడియో సెట్టింగ్‌లను కూడా మార్చడం వంటివి చేయడం ద్వారా హ్యాకింగ్ బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. హ్యాకింగ్‌కు గురైతే మన బ్యాంకు ఖాతాల వివరాలు, పర్సనల్ ఫొటోలు, వివిధ వ్యక్తులతో మనం జరిపిన సంభాషణలు వీటితో పాటు పూర్తి గోప్యంగా ఉంచుకునే కొన్ని విషయాలు బహిర్గతమయ్యే ప్రమాదం ఉంది. తద్వారా ‘అభిమన్యుడు’ సినిమాలో మాదిరి మనల్ని మనం పూర్తిగా కోల్పోయే విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం సేవామిత్ర యాప్ వల్ల ఒక వ్యక్తి ఫోన్లో ఉన్న డేటా మొత్తం చౌర్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. - అప్రాక్సిమేట్, ప్రిసైజ్ లోకేషన్ : ఒక వ్యక్తి ఫోన్ ఎక్కడ ఉందో తెలుసుకుంటారు. యాప్‌ను డౌన్లోడ్ చేసుకోగానే లోకేషన్ సర్వీస్ ఆన్ అయిపోతుంది. దీనివల్ల బ్యాటరీ చార్జింగ్ కూడా త్వరగా అయిపోతుంది. - ఫోన్ కాల్స్ : ఇది అత్యంత ప్రమాదకరమైన అనుమతి. మీతో సంబంధం లేకుండానే కాల్ లిస్ట్‌లో ఉన్న ఫోన్ నంబర్లకు నేరుగా ఫోన్ చేసి వాళ్లే మాట్లాడతారు. దీనివల్ల కాల్ చార్జీలు యజమానికి పడతాయి. అంతేకాదు ఈ యాప్ ఫోన్ నంబర్‌తో పాటు డివైస్ ఐడీని తెలుసుకోచ్చు. - స్టోరేజ్ సిస్టమ్ : యూఎస్బీ ద్వారా కూడా మెమరీలో ఉన్న సమాచారాన్ని మార్చవచ్చు, లేదా తొలగించవచ్చు. ఫోన్ స్టోరేజ్‌లో ఉన్న డేటాను స్వేచ్ఛగా వినియోగించుకుంటారు. యజమానికి సంబంధం లేకుండానే ఫోన్లో ఫోటోలు, వీడియోలు వంటి వాటిని మార్చవచ్చు, లేదా పూర్తిగా తొలిగించవచ్చు. యజమానికి తెలియకుండా సంబంధం లేని కంటెంట్ వచ్చి చేరిపోవచ్చు. - మైక్రోఫోన్ : మైక్రోఫోన్ ద్వారా యజమాని అనుమతి లేకుండానే కాల్స్‌ను రికార్డ్ చేసుకుంటారు. అంటే యజమాని ఎవరితో ఏమి మాట్లాడారో వారికి తెలిసిపోతుంది. - ఆడియో సెట్టింగ్స్ : స్పీకర్‌కు సంబంధించిన ఆడియో సెట్టింగ్స్ మారిపోతుంటాయి. కాల్ మాట్లాడుతున్నప్పుడు సౌండ్ పెంచడం తగ్గించడం చేస్తుంటారు. -
తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం
హైదరాబాద్: డేటా చోరీ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక సిట్(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకూ చేసిన దర్యాప్తు వివరాలను సిట్‌కు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. సిట్ ఇంచార్జిగా వెస్ట్ జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్రను నియమించారు. సిట్ బృందంలో సైబర్ క్రైం డీసీపీ రోహిణి, కామారెడ్డి ఎస్పీ శ్వేతా రెడ్డి, డీఎస్పీ రవికుమార్, ఏసీపీ శ్రీనివాస్, మరో ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఉండనున్నారు. జంట కమిషనరేట్ల పరిధిలో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు మొత్తం సిట్‌కు బదిలీ చేయనున్నారు. డీజీపీ కార్యాలయంలోనే సిట్‌కు సంబంధించి ప్రత్యేక చాంబర్‌ను కేటాయించనున్నారు. -
ఆర్బీఐ దగ్గరున్న డేటాను కూడా చౌర్యం చేశారు
-
చంద్రబాబు, లోకేశ్ డైరెక్షన్లో క్యాష్ ఫర్ ట్వీట్!
సాక్షి, హైదరాబాద్: డేటా స్కాం బాగోతంలో తెలంగాణ ప్రభుత్వంపై బురద చల్లడంతో పాటు, ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు రెండ్రోజులుగా చంద్రబాబు, లోకేశ్.. సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని ప్రయత్నాలు సాగిస్తున్నట్లు టీఆర్ఎస్ అనుమానిస్తోంది. ఇదే అంశాన్ని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సోమవారం తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ప్రస్తావించారు.# TSGovtStealsData, # KTRStealsData అనే హ్యాష్‌ట్యాగ్‌లతో తెలంగాణ ప్రభుత్వంపై వారిరువురి ఆదేశాల మేరకు ట్వీట్ల దాడి జరుగుతున్నట్లు ఆధారాలు సేకరించారు.(డేటా స్కామ్‌పై మంత్రివర్గంలో మల్లగుల్లాలు) వివిధ రాష్ట్రాల నుంచి ట్వీట్లు: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలతో సంబంధంలేని ట్విట్టర్ అకౌంట్ల నుంచి వేల సంఖ్యలో డేటా చౌర్యం కేసుకు సంబంధించి ట్వీట్లు వచ్చాయి. అయితే, ఈ ట్వీట్ల సారాంశం అంతా.. తెలంగాణ ప్రభుత్వాన్ని దోషిగా చూపేలా ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్ తదితర రాష్ట్రాల నుంచి కూడా తెలుగు పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్‌లను ట్యాగ్ చేస్తూ ట్వీట్లు వెల్లువెత్తడం గమనార్హం. ముంబైకి చెందిన సంజయ్ బఫ్నా అనే వ్యక్తి ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్త క్లిప్పింగ్‌ను ట్యాగ్ చేస్తూ.. ‘వాళ్లు విలువైన సమాచారాన్ని దొంగిలించే ప్రయత్నం చేయడంతోపాటు ఐటీ సంస్థ ఉద్యోగులను కిడ్నాప్ చేసే చర్యలకు పాల్పడినందుకు సిగ్గుపడాలి’ అని ట్వీట్ చేశాడు. ఇదే రీతిలో.. ‘మా నాయకుడితో పోరాడలేకే.. మా అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు’.. అని ముంబైకి చెందిన సంతోష్ శుక్లా అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. బాలీవుడ్ చౌక్ పేరిట.. ‘మా ఆస్తులను దొంగిలించారు. మా నీళ్లను దొంగిలించారు. ఇప్పుడు మా డేటాను దొంగిలిస్తున్నారా? టీఆర్ఎస్ ప్రభుత్వం సిగ్గుపడాలి’.. అనే అర్థం వచ్చేలా ట్వీట్ రాగా, రెండు రాష్ట్రాలతో సంబంధం లేని మరికొంత మంది కూడా ఇదే అర్ధం వచ్చేలా ట్వీట్లు, రీట్వీట్లు చేశారు. వీటిని గమనిస్తే కృత్రిమంగా ఒక ట్రెండ్‌ను సృష్టించి డేటా చోరీ అంశాన్ని పక్కదారి పట్టించేలా చంద్రబాబు ఓ ప్రైవేటు ఏజెన్సీకి భారీగా డబ్బులు ముట్టచెప్పి ఈ క్యాష్ ఫర్ ట్వీట్ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు టీఆర్ఎస్ అనుమానిస్తోంది. దీనిపై ట్విట్టర్ సంస్థకు ఫిర్యాదులు వెళ్లినట్లు తెలిసింది. (సర్వం దోచేశారు) -
బ్లూ ఫ్రాగ్ దాగుడు‘మూత’లు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల సమా చారాన్ని లీక్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న విశాఖలోని బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీ సంస్థ దాగుడు‘మూత’లు ఆడుతోంది. చంద్రబాబు ప్రభుత్వ ఆదేశాల మేరకు సెల్‌ఫోన్ ఆధారిత సేవల పేరిట వైజాగ్‌లోని బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ సంస్థ రాష్ట్ర జనాభా వివరాలు, భౌగోళిక ప్రాంతాలు, ప్రజల ఆధార్ కార్డుల వివరాలు, ఏపీ స్మార్ట్ పల్స్ సర్వే, స్టేట్ రెసిడెంట్ డేటా హబ్‌తోపాటు హైదరాబాద్‌లోని కావ్య డేటా మేనేజ్మెంట్ సర్వీస్ నుంచి ప్రజా సాధికార వేదిక వివరాలను సేకరిస్తోంది. ఈ డేటా మొత్తాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఐటీ గ్రిడ్స్ ఇండియా సంస్థకు అందిస్తోందని డాటా ఎనలిస్ట్ అయిన లోకేశ్వరరెడ్డి మూడురోజులక్రితం తెలంగాణలోని మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. (సర్వం దోచేశారు) అప్పట్నుంచీ విశాఖ నగరం సిరిపురం జంక్షన్‌లోని బ్లూ ఫ్రాగ్ కార్యాలయాన్ని అర్ధంతరంగా మూసివేశారు. సమాచార సేకరణకోసం మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మీడియా ప్రతినిధులు కాపు కాసినా.. కార్యాలయం షట్టర్ తెరవలేదు. అయితే సాయంత్రం 6 గంటల తర్వాత మీడియా ప్రతినిధులు వెళ్లిపోయారని భావించి ఉద్యోగులు కొందరు కార్యాలయాన్ని ఓపెన్ చేశారు. దీంతో సాక్షి ప్రతినిధులు వెళ్లి.. ప్రస్తుతం ఉభయరాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారిన డేటాచోరీలో బ్లూ ఫ్రాగ్ పాత్ర ఏమిటని ప్రశ్నించగా... వారు చాలా దురుసుగా సమాధానమిచ్చారు. తొలుత అసలు ఇది బ్లూ ఫ్రాగ్ కాదని, మ్యాంగో బాక్స్ పేరిట వీడియో గేమ్స్ యాప్‌లు తయారుచేసే కంపెనీ అంటూ వాదించారు. అయితే బ్లూ ఫ్రాగ్ బోర్డే ఉంది కదా ప్రశ్నిస్తే... మాకేమీ తెలియదన్నారు. సంస్థ ఎండీ ఫణిరాజ్ ఎక్కడున్నారని అడిగితే... అస్సలు మేమేమీ చెప్పం అంటూ తిరిగి డోర్ లాక్ చేసేశారు. (ఎన్నికల అక్రమాలకే డేటా చౌర్యం) -
డేటా స్కామ్‌పై మంత్రివర్గంలో మల్లగుల్లాలు
సాక్షి, అమరావతి: స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల డేటాను ప్రైవేటు కంపెనీకిచ్చి నిండా మునిగిన రాష్ట్ర ప్రభుత్వం ఆ నేరం నుంచి బయటపడేందుకు ఎదురుదాడి, పక్కదారి మార్గాలను ఎంచుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్తో లింకు పెట్టి ఎదురు దాడి చేయాలని, విషయాన్ని పక్కదారి పట్టించేలా రకరకాల ప్రచారాలు, ఆరోపణల్ని తెరపైకి తేవాలని నిర్ణయించింది. సచివాలయంలో మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో ఈ అంశంపై సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. దీని నుంచి ఎలా గట్టెక్కాలో చెప్పాలని చంద్రబాబు మంత్రులను కోరినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం, పార్టీ ఇబ్బందుల్లో పడినా మంత్రులు పట్టించుకోవడంలేదని, పార్టీ వాదనను సరిగా వివరించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీన్ని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య జరుగుతున్న వ్యవహారంగా ప్రజలు భావించేలా మాట్లాడాలని, జగన్‌కు మేలు చేసేందుకు టీఆర్ఎస్ దీన్ని వాడుకుంటోందనే ప్రచారాన్ని ముమ్మరం చేయాలని, టీవీల్లో ఇదే విషయాన్ని హోరెత్తించాలని దిశానిర్దేశం చేశారు. (సర్వం దోచేశారు) ఏపీ ప్రభుత్వంపై కేసులు పెడతామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ చేసిన వ్యాఖ్యలను పెద్దవిగా చేసి ఒక అధికారి ఇలా ఎలా మాట్లాడతారనే అంశాన్ని లేవనెత్తి వివాదం చేయాలని సూచించారు. ఏపీ డేటాను చోరీ చేసి కప్పిపుచ్చుకునేందుకు దుష్ప్రచారం చేస్తున్నారనే వాదన జనంలోకి వెళ్లకపోతే ఇబ్బంది పడతామనే అభిప్రాయాన్ని పలువురు మంత్రులు వ్యక్తం చేశారు. ఓట్ల తొలగింపు వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వాదనను ఇంకా గట్టిగా తిప్పికొట్టాలని, ఆ పార్టీయే టీడీపీ ఓట్లు తొలగిస్తోందని ఎదురుదాడి చేయాలని చంద్రబాబు సూచించారు. తమ ఓట్లను వైఎస్సార్సీపీ పార్టీ తొలగించిందని, మంత్రులు, ఎమ్మెల్యేలు కలెక్టర్లు, ఎస్పీలకు ఫిర్యాదు చేయాలని, ప్రశాంత్ కిషోర్ బృందాలపై కేసులు పెట్టించాలని, సర్వేల పేరుతో వారే ఓట్లు తొలగిస్తున్నారని ప్రత్యారోపణలు చేయాలని చెప్పారు. మరోవైపు తెలంగాణతో ఉన్న విభేదాలను తెరపైకి తెచ్చి వాటిపై ఆరోపణలు గుప్పించాలని చంద్రబాబు మంత్రులను ఆదేశించారు. ఉమ్మడి ఆస్తుల విభజన, షెడ్యూల్ 9, 10 సంస్థల విభజనపై కోర్టుకెళ్లే అంశాలను పరిశీలించి వెంటనే రంగంలోకి దిగాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలపై కోర్టుకెళ్లాలని అధికారులను ఆదేశించారు.(‘రియల్ టైమ్’తో కాజేశారు) తెలంగాణ పోలీసులను ఎదుర్కునేదెలా? అదే సమయంలో తెలంగాణ పోలీసులు ఎటువంటి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, వాటిని ఎలా ఎదుర్కోవాలి, వాటిని ఆపడానికి ఉన్న అవకాశాలపై చర్చించారు. ఈ డేటా చోరీకి సంబంధించిన విషయాలపై సాంకేతిక అంశాలను ఐటీ కార్యదర్శి విజయానంద్, ఆర్టీజీఎస్ సీఈఓ అహ్మద్‌బాబు తదితరులు మంత్రులకు వివరించారు. మంత్రివర్గ సమావేశ వివరాలను మీడియాకు వెల్లడించిన మంత్రి కాల్వ శ్రీనివాసులు ఐటీ గ్రిడ్స్ సంస్థకు, ప్రభుత్వానికి ఉన్న సంబంధం ఏమిటనే ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. ఐటీ కార్యదర్శి విజయానంద్ మాత్రం ఆ కంపెనీ తమ సర్వీస్ ప్రొవైడర్ అని చెప్పారు. -
డేటా చోరీ.. దేశంలోనే పెద్ద సాబోటేజ్ క్రైమ్
హైదరాబాద్: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా మరోసారి మండిపడ్డారు. చంద్రబాబు చేసిన డేటా చోరీ స్కాం అనేది దేశంలోనే అతి పెద్ద సైబర్ సాబోటేజ్ క్రైమ్ అని వర్ణించారు. రహస్యంగా ఉండాల్సిన సమాచారాన్ని బజారులో పడేశారని తీవ్రంగా దుయ్యబట్టారు. ఇంకా ఏయే వ్యవస్థల్లోకి టీడీపీ ప్రభుత్వం చొరబడిందో తేల్చాల్సి ఉందన్నారు. దొంగిలించిన సమాచారంతో ఏపీ ప్రజలు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కే ప్రమాదం ఏర్పడిందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్ని బాబు నాశనం చేశాడని ఆరోపించారు. తండ్రీకుమారులు చేసిన డేటా బ్రీచ్ సాధారణ నేరం కాదని వ్యాఖ్యానించారు. ఓట్ల తొలగింపు ద్వారా ఏపీలో విజయం సాధించి ఉంటే భవిష్యత్తులో తమ చెంచాను దేశ ప్రధానిగా చేసుకునే కుట్రకు పాల్పడేవారేనని అన్నారు. అమెరికా ఎన్నికల ఫలితాలను రష్యా మ్యానిపులేట్ చేసిందనే వార్తలే చంద్రబాబుకు ప్రేరణ కలిగించి ఉండవచ్చునని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాజకీయ పోరాటం వదిలి చంద్రబాబు, ప్రజలపై కసి తీర్చుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మామను వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కున్నాడు.. ఇప్పుడు ప్రజల డేటాను దొంగిలించి వారి సర్వస్వం దోచుకునే ప్లాన్ వేశాడని ఆరోపించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బొటాబొటి గెలుపుపైనా అనుమానం కలుగుతోందని అన్నారు. ఎలక్షన్ కమిషన్ ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. పోటీ చేసేందుకూ అభ్యర్థులూ కష్టమే! నోటిఫికేషన్ వెలువడక ముందే టీడీపీ నాయకత్వం ఓటమిని ఓప్పేసుకుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకడం కూడా కష్టంగా ఉందని ఎద్దేవా చేశారు. మొన్నటి దాకా వైఎస్సార్ కాంగ్రెస్ నవరత్నాలను కాపీ కొట్టి ప్రజలను ఏమార్చవచ్చని చూశారు... ఎవరూ నమ్మకపోయేసరికి దొంగదారులు వెతుకుతున్నారని విమర్శించారు. -
‘డేటా చోరీ రెండు రాష్ట్రాల సమస్య కాదు’
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజల సమాచారాన్ని ప్రైవేటు సంస్థలకు అందజేసి.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద నేరానికి పాల్పడిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. ఐటీ గ్రిడ్స్ స్కామ్‌పై ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రజల సమాచారాన్ని రాజకీయాలకు వాడుకోవడం దుర్మార్గమైన చర్య అని ఆయన అభిప్రాయపడ్డారు. ఓటర్ల ప్రొఫైల్ సేకరించి డేటాను దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వ సమాచారం ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఈ డేటాతో చంద్రబాబు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు యత్నించారని ఆరోపించారు. ఇప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చేసరికి తన బండారం బయటపడుతుందని చంద్రబాబు భయపడుతున్నారని విమర్శించారు.(డేటా స్కామ్ డొంక కదులుతోంది!) డేటా చోరికి పాల్పడి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని తెలిపారు. ఇది రెండు రాష్ట్రాల సమస్య కాదని.. ప్రజల భద్రత, గోప్యతకు సంబంధించిన విషయమని పేర్నొన్నారు. దీనిపై లోతైన విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి.. లేకుంటే ప్రజస్వామ్యం అపహాస్యం అవుతుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ప్రయోజనాలకు పచ్చ చొక్కాలకే పరిమితం చేస్తున్నారని విమర్శించారు. దుర్మార్గులు రాజకీయాలు చేస్తే ఇలాంటి నేరాలే జరుగుతాయని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై ఈసీ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. తప్పుచేసిన వారిని పట్టుకుంటే శభాష్ అనకుండా ఏపీ ప్రభుత్వం వింత ఆరోపణలు చేస్తుందని.. ఇది దొంగలు భుజాలు తడుముకున్నట్టు ఉందని ఎద్దేవా చేశారు.(డేటా లీక్.. సీఎంవో నుంచే?) -
చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు
-
ఏ నేరం చేయకపోతే ఉలికిపాటు ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఓటర్ల డేటా కుంభకోణం ఏపీ ప్రభుత్వ పెద్దలను కలవరపాటుకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. ఐటీ గ్రిడ్స్ స్కామ్‌లో తమ గుట్టు బయటపడుతుందనే భయంతో టీడీపీ నేతలు వింత వాదనలు దిగడమే కాకుండా.. కేసును అడ్డుకోవడానికి పలు రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఏపీ పోలీసులను సైతం టీడీపీ నేతలు తమ స్వార్ధానికి బలి చేసే పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా ఈ కేసును పక్కదారి పట్టించేందుకు న్యాయస్థానాల్లో తప్పుడు పిటిషన్లను దాఖలు చేస్తున్నారు. తాజాగా ఈ పరిణామాలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్లో స్పందించారు. సీఎం చంద్రబాబు నాయుడుకు సూటి ప్రశ్నలు వేశారు.(అడ్డంగా దొరకడం మిద్దెలెక్కి అరవడం) ఏ నేరం చేయకపోతే చంద్రబాబుకు ఈ ఉలికిపాటు ఎందుకని ప్రశ్నించిన కేటీఆర్.. తెలంగాణ పోలీసుల విధి నిర్వహణకు ఏపీ పోలీసులు ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని నిలదీశారు. కోర్టులో తప్పుడు పిటిషన్లు ఎందుకు వేస్తున్నారని ప్రశ్నించారు. ఈ చర్యలను చూస్తుంటే కోట్లాది మంది ఏపీ ప్రజల డేటాను చంద్రబాబు ప్రైవేటు కంపెనీలకు అందజేసినట్టు పరోక్షంగా అంగీకరించినట్టు అయిందన్నారు. విచారణ జరిగితే దొంగతనం బయటపడుతుందనేది చంద్రబాబు భయమని కేటీఆర్ పేర్కొన్నారు. చంద్రబాబు ఏపీ ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. అంతకుముందు సోమవారం ఈ వ్యవహారంపై మీడియాతో మాట్లాడిన కేటీఆర్ చంద్రబాబు, లోకేశ్‌లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు, లోకేశ్‌లకు తప్పుచేసి దొరికిపోవడం అలవాటేనని వ్యాఖ్యానించారు. చంద్రబాబు భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఏపీ పౌరుడి ఫిర్యాదు మేరకే ఐటీ గ్రిడ్స్‌పై విచారణ జరుగుతుందని స్పష్టం చేశారు. చంద్రబాబుకు సీఎంగా కొనసాగే నైతిక అర్హత లేదన్నారు. మీరు ఏ నేరం చేయకపోతే ఈ ఉలికిపాటు ఎందుకు? తెలంగాణ పోలీసుల విధి నిర్వహణకు ఏపి పోలీసుల అడ్డంకులు ఎందుకు? కోర్టులో తప్పుడు పిటిషన్లు ఎందుకు? విచారణ జరిగితే డేటా దొంగతనం బయటపడుతుంది అనే కదా మీ భయం @ncbn గారూ? — KTR (@KTRTRS) 5 March 2019 By obstructing Telangana police and filing false petitions in courts, AP CM @ncbn is only indirectly confirming his role in leaking personal information of crores of AP citizens to a private organisation. He needs to answer people of Andhra Pradesh — KTR (@KTRTRS) 5 March 2019 -
ప్రభుత్వ డేటా ప్రైవేటు సంస్థలకు ఎలా చేరింది?
సాక్షి, అమరావతి: ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని రాజకీయ లబ్ధి కోసం దుర్వినియోగం చేస్తారా? అని వామపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈమేరకు సీపీఐ, సీపీఎం నేతలు కె.నారాయణ, పి.మధు సోమవారం వేర్వేరు ప్రకటనలు చేశారు. గత నెల 28న ఒక్కరోజే 1.9 లక్షల ఓట్ల తొలగింపునకు దరఖాస్తులు అందినట్లు ఎన్నికల కమిషన్ చేసిన ప్రకటన దిగ్భ్రాంతి కలిగిస్తోందని, ఈ వ్యవహారం వెనుక ఎవరి హస్తం ఉందో కనిపెట్టాలని డిమాండ్ చేశారు. ఓటర్లు ఉన్నప్పటికీ వారికి తెలియకుండా ఆన్లైన్ పద్ధతిలో వేలాది సంఖ్యలో సామూహికంగా ఓటర్ల జాబితా నుండి పేర్ల తొలగింపు కోసం కొంతమంది వ్యక్తులు ఫారం–7ను దరఖాస్తు చేస్తున్నారంటే ఎన్నికల కమిషన్ ఏమి చేస్తున్నట్టు? అని నిలదీశారు. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీని నిర్వహిస్తున్న ప్రధాన వెండర్‌ను ప్రశ్నిస్తే అసలు విషయం బయటికొస్తుందని పేర్కొన్నాయి. దర్యాప్తు చేసి నిందితులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రభుత్వానికి వామపక్షాలు విజ్ఞప్తి చేశాయి. నకిలీ దరఖాస్తులతో ఓట్ల తొలగింపు ఎలా సాధ్యమో ఎన్నికల కమిషన్ వివరణ ఇవ్వాలని వామపక్ష నేతలు కోరారు. -
‘చంద్రబాబుపై రాజద్రోహం కేసు పెట్టాలి’
విజయవాడ సిటీ: తన స్వార్థ రాజకీయాల కోసం రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ అధికార దుర్వినియోగంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టిన చంద్రబాబుపై రాజద్రోహం కేసు నమోదు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ఎలక్షన్ కమిషన్‌ను డిమాండ్ చేశారు. ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించి ప్రత్యేక యాప్‌లు ద్వారా ఓట్లు తొలగిస్తున్నారని ఆధారాలతో ఇచ్చినా ఎలక్షన్ కమిషన్ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 60 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయని వివరాలతో వైఎస్సార్సీపీ ఇచ్చిన ఫిర్యాదుపై ఎలక్షన్ కమిషన్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. విజయవాడలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్థసారథి ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఆంధ్ర, తెలంగాణలో ఐటీ దాడులు చేస్తే చంద్రబాబు ఉలిక్కిపడతాడు. వైఎస్ జగన్ కేసు దర్యాప్తును ఎన్ఐఏకి అప్పగిస్తే ఆయనకు భయం పట్టుకుంది. ఇప్పుడు ప్రజల వ్యక్తిగత సమాచారాలతో ఓట్లు తొలిగిస్తున్నారని ఐటీ గ్రిడ్స్ సంస్థపై ఫిర్యాదు చేస్తే బెంబేలెత్తుతున్నారని ఎద్దేవా చేశారు. ఇసుక మింగిన గొంతుకతో: వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్ర రాజధానిని అమరావతిని కాదని ఇడుపులపాయకు తీసుకెళ్లతాడని ఇసుక మింగిన గొంతుకతో ప్రజలకు ఏమి చెప్పాలో తెలియక మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తాను వెళ్లిపోవడం ఖాయం అని తెలిసి హైదరాబాద్‌లో రూ.200 కోట్లతో ఇల్లు కట్టుకుంటే... ప్రజలకు అందుబాటులో ఉండి మేళ్లు చేయాలనే తలంపుతో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అమరావతిలో ఇల్లు కట్టుకోవడం దేవినేని ఉమా కళ్లకు కన్పించడం లేదా అని నిలదీశారు. -
ప్రజల భద్రతకు ముప్పు
నెల్లూరు (సెంట్రల్): ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను దొంగచాటుగా తీసుకున్న తీరును చూస్తే ప్రజల భద్రతలకే ముప్పు ఏర్పడిందని నెల్లూరు మాజీ పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరులో మంగళవారం సమరశంఖారావం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ తదితరులతో కలసి మంగళవారం విలేకరుల సమవేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 3.69 కోట్ల ఓట్లు ఉంటే అందులో దాదాపుగా 59 లక్షల ఓట్లు దొంగచాటుగా తొలగించడం, రెండు ఓట్లు చేయించడం వంటి నీచపు పనిని చంద్రబాబు ప్రభుత్వం చేస్తోందని ధ్వజమెత్తారు. దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. (ఏపీ ప్రభుత్వ పాత్రపై.. అనుమానాలు) మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు, నారా లోకేష్ అండదండలతో ఐటి గ్రిడ్స్ పేరుతో ప్రతిపక్షానికి చెందిన ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. ఐదు కోట్ల మందికి చెందిన వ్యక్తిగత సమాచారానికి భద్రత లేకుండా పోయిందన్నారు. టీడీపీ ప్రభుత్వం సేవామిత్ర పేరుతో ప్రత్యేక యాప్‌ను ఏర్పాటు చేసుకుని వ్యక్తిగత వివరాలు సేకరించి ఓట్లు తొలగింపు చేస్తున్నారన్నారు. ప్రజల వ్యక్తి గత సమాచారాన్ని సేకరించడంలో నారా లోకేష్‌తో సన్నిహితంగా ఉంటున్న అశోక్, కిలారి రాజేష్, పెద్ది రామారావు, అబిష్ణ తదితరులు ప్రధాన భూమిక పోషిస్తున్నారన్నారు. ప్రైవేటు ఏజన్సీలకు చంద్రబాబు రూ.కోట్లు కుమ్మరించి ఓట్ల తొలగింపు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రధానంగా ఒక వ్యక్తి సమాచారన్ని మరొక వ్యక్తికి ఇవ్వరాదని సర్వోన్నత న్యాయ స్థానం కూడా చెప్పిందని, కాని నిబంధనలు బుట్టదాఖలు చేసి ఇలా చేయడం బాధాకరమన్నారు. వ్యక్తిగత జాబితాలను సేకరించి ఓట్లు తొలగించడంపై కేంద్ర ప్రభుత్వంతో పాటు, ప్రధాన ఎన్నికల కమిషన్ కూడా దృష్టి సారించి ప్రత్యేక దర్యాప్తు విభాగాన్ని ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలన్నారు. కాగా ఎస్వీజీఎస్ కళాశాల మైదానంలో మంగళవారం జరగనున్న సమరశంఖారావం సభ ఏర్పాట్లను వైఎస్సార్సీపీ నేతలు సోమవారం పరిశీలించారు. (ఏపీ పరువు తీశారు) -
ఏపీ పరువు తీశారు
సాక్షి, గుంటూరు: రాష్ట్ర పోలీసుల ప్రతిష్ట దిగజారిందా.. వారిని అడ్డుపెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆడిన డేంజర్ గేమ్ వికటించిందా.. ప్రస్తుతం రాష్ట్ర ప్రజల నుంచి వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవే. ఓ ప్రైవేటు ఐటీ కంపెనీ చేస్తున్న డేటా చోరీపై తమకందిన ఫిర్యాదు మేరకు దాడులు నిర్వహించిన తెలంగాణ పోలీసులను అడ్డుకునేందుకు రాష్ట్ర పోలీసులు హుటాహుటిన హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం ఏం వచ్చింది.. ఐటీ గ్రిడ్స్ మేనేజర్ వాట్సాప్ మెసేజ్ ఆధారంగా మిస్సింగ్ కేసు నమోదుచేసి డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో వందల మంది పోలీసులు అక్కడకు ఎందుకు వెళ్లారు?.. ఏపీ పోలీసులు మిస్సైనట్లుగా చెబుతున్న ఐటీ గ్రిడ్స్ ఉద్యోగి భాస్కర్‌తోపాటు, మరో ముగ్గురు ఉద్యోగులు సైతం తమ వద్దే ఉన్నారంటూ తెలంగాణ పోలీసులు చెప్పినప్పటికీ ఏపీ పోలీసులు హడావుడి చేయడానికి కారణం ఏంటి?.. చివరకు ఐటీ గ్రిడ్స్ కంపెనీపై ఫిర్యాదు చేసిన లోకేష్‌రెడ్డిపై బెదిరింపులకు పాల్పడాల్సిన అవసరం ఏం వచ్చింది?.. దీంతో వారిపై కేసు నమోదు కావడం చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి పోలీసు శాఖ పరువును తీసిందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐటీ గ్రిడ్స్‌పై తెలంగాణ పోలీసులు దాడిచేస్తే తమ తప్పేమీ లేనప్పుడు ప్రభుత్వ పెద్దలు ఎందుకు ఉలిక్కిపడ్డారన్న ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తోంది. (అదో ‘బ్లాక్మెయిల్’ యాప్) 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలీసు శాఖను నిర్వీర్యం చేస్తోందనే ఆరోపణలున్న విషయం తెలిసిందే. పలు కేసుల్లో ఏపీ పోలీసులపై తమకు నమ్మకం లేదంటూ బాధితులు తెలంగాణ పోలీసులను ఆశ్రయిస్తున్న సందర్భాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ గ్రిడ్స్ అధినేత దాకవరపు అశోక్.. తమ కార్యాలయంలో పనిచేస్తున్న భాస్కర్ అనే ఉద్యోగి గతనెల 28న పెదకాకాని మండలం ఐజేఎం అపార్టుమెంట్ వద్ద నుంచి హైదరాబాద్ బయల్దేరుతున్నట్లుగా ఫోన్ చేశారని, ఆ తరువాత కనిపించడం లేదంటూ గుంటూరు అర్బన్ ఎస్పీ విజయరావుకు వాట్సాప్ మెసేజ్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు హుటాహుటిన హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఓ మిస్సింగ్ కేసులో డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో వందలాది మంది పోలీసులు ఐటీ గ్రిడ్స్ వద్దకు చేరుకోవడం చూస్తుంటే పక్కా పథకం ప్రకారం పోలీసులను హైదరాబాద్‌కు పంపేందుకే మిస్సింగ్ డ్రామా ఆడారనే విషయం స్పష్టమవుతోంది.(చంద్రబాబు, లోకేశ్ మార్గదర్శనంలో...క్యాష్ ఫర్ ట్వీట్!) కాగా, భాస్కర్ తమ అదుపులో ఉన్నట్లు తెలంగాణ పోలీసులు చెప్పినప్పటికీ ఏపీ పోలీసులు హైదరాబాద్‌లోనే ఉండి తెలంగాణ పోలీసులు మిమ్మల్ని ఏమడిగారంటూ ఐటీ గ్రిడ్ సిబ్బంది కుటుంబ సభ్యులను ఆరా తీయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. అంతేకాక, ఐటీ గ్రిడ్స్‌పై ఫిర్యాదు చేసిన లోకేష్‌రెడ్డి ఇంటిపై దాడిచేసి అతనిని బెదిరించి అపహరణకు యత్నించడం చూస్తుంటే పోలీసులు ఎంత అత్యుత్సాహం ప్రదర్శించారో అర్ధమవుతుంది. ఏపీ పోలీసుల తీరును సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ పోలీసులు గుంటూరుకు చెందిన ఓ డీఎస్పీ, సీఐలపై కేసు నమోదు చేశారు. వీరి తీరును సైబరాబాద్ సీపీ తప్పుపట్టడంతోపాటు కేసును తప్పుదారి పట్టించేందుకు ఏపీ పోలీసులు యత్నించారంటూ మండిపడ్డారు. మరోవైపు.. హైకోర్టు హెబియస్ కార్పస్ రిట్‌ను కొట్టివేసి ఐటీ గ్రిడ్స్‌పై పోలీసుల విచారణలో జోక్యం చేసుకోలేమంటూ తేల్చిచెప్పడంతో ఏపీ ప్రభుత్వం, పోలీసుల పరువు పోయింది. ఎన్నికల సంఘం సైతం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవడంతో ఎవరిపై వేటు పడుతుందోనని గుంటూరు అర్బన్ పోలీసులు హడలిపోతున్నారు. (డేటా స్కామ్ డొంక కదులుతోంది!) -
అదో ‘బ్లాక్మెయిల్’ యాప్
సాక్షి, అమరావతి: ‘సేవా మిత్ర’ టీడీపీ కార్యకర్తల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన యాప్‌ను ఒక్కసారి మొబైల్ ఫోన్ లేదా డెస్క్టాప్పై డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. ఇక దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లేనని సాఫ్ట్వేర్ నిపుణులు చెబుతున్నారు. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న మరుక్షణం నుంచి ఫోన్ కంట్రోల్ యాప్ అభివృద్ధి చేసిన ఐటి గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చేతిలోకి వెళ్లిపోతుంది. ఫోన్ ఎక్కడ ఉందన్న విషయంతో పాటు ఫోన్లో మాట్లాడిన మాటలను రికార్డు చేస్తారు. చివరకు ఫోన్లోని ఫోటోలు, వీడియోలు, బ్యాంకు ఖాతాల వివరాలను అన్నీ వారు యధేచ్ఛగా చూడటమే కాకుండా, అవసరమైతే మీకు తెలియకుండానే వారు డిలీట్ చేస్తారు. ఫోన్ కాల్స్‌ను రికార్డు చేసి, ఎస్డీ కార్డులో ఉన్న డేటాను వినియోగించి యజమానుల్ని బ్లాక్ మెయిల్ చేయొచ్చని నిపుణులతో పాటు పోలీసులుకూడా హెచ్చరిస్తున్నారు. (డేటా స్కామ్ డొంక కదులుతోంది!) సేవామిత్ర యాప్ తీసుకునే అనుమతులు, వాటి పర్యవసానాలు.. అప్రాక్సిమేట్, ప్రిసైజ్ లోకేషన్: ఈ అనుమతి ద్వారా ఫోన్ ఎక్కడ ఉందో తెలుసుకుంటారు. యాప్‌ను డౌన్లోడ్ చేసుకోగానే లోకేషన్ సర్వీస్ ఆన్ అయిపోతుంది. దీనివల్ల బ్యాటరీ చార్జింగ్ కూడా త్వరగా అయిపోతుంది. ఫోన్ కాల్స్: ఇది అత్యంత ప్రమాదకరమైన అనుమతి. మీతో సంబంధం లేకుండానే కాల్ లిస్ట్‌లో ఉన్న ఫోన్ నంబర్లకు నేరుగా ఫోన్ చేసి వాళ్లే మాట్లాడతారు. దీనివల్ల కాల్ చార్జీలు యజమానికి పడతాయి. అంతేకాదు ఈ యాప్ ఫోన్ నంబర్‌తో పాటు డివైస్ ఐడీని తెలుసుకోచ్చు. స్టోరేజ్ సిస్టమ్: యూఎస్బీ ద్వారా కూడా మెమరీలో ఉన్న సమాచారాన్ని మార్చవచ్చు, లేదా తొలగించవచ్చు. ఫోన్ స్టోరేజ్‌లో ఉన్న డేటాను స్వేచ్ఛగా వినియోగించుకుంటారు. యజమానికి సంబంధం లేకుండానే ఫోన్లో ఫోటోలు, వీడియోలు వంటి వాటిని మార్చవచ్చు, లేదా పూర్తిగా తొలిగించవచ్చు. యజమానికి తెలియకుండా సంబంధం లేని కంటెంట్ వచ్చి చేరిపోవచ్చు. మైక్రోఫోన్: మైక్రోఫోన్ ద్వారా యజమాని అనుమతి లేకుండానే కాల్స్‌ను రికార్డ్ చేసుకుంటారు. అంటే యజమాని ఎవరితో ఏమి మాట్లాడారో వారికి తెలిసిపోతుంది. ఆడియో సెట్టింగ్స్: స్పీకర్‌కు సంబంధించిన ఆడియో సెట్టింగ్స్ మారిపోతుంటాయి. కాల్ మాట్లాడుతున్నప్పుడు సౌండ్ పెంచడం తగ్గించడం చేస్తుంటారు. -
డేటా స్కామ్ డొంక కదులుతోంది!
సాక్షి, అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతున్న డేటా స్కామ్ డొంక కదులుతోంది. ఈ కేసుకు సంబంధించి సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో విస్తుగొలిపే వాస్తవాలు వెల్లడవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం వద్ద రహస్యంగా ఉంచాల్సిన ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్స్, బ్లూ ఫ్రాగ్ కంపెనీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆయన తనయుడు, రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తేటతెల్లమవుతోంది. ఈ రెండు సంస్థలు గత ఎన్నికల్లో టీడీపీకి సేవలు అందించడం గమనార్హం. టెక్నాలజీని తానే ప్రమోట్ చేస్తున్నట్టు గొప్పలు చెప్పుకునే చంద్రబాబు.. రాష్ట్రంలో అనేక శాఖల పనితీరు, సమాచార సేకరణకు కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం ఖర్చు చేసిన విషయం జగమెరిగిన సత్యం. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రధానంగా హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్స్, విశాఖలోని బ్లూ ఫ్రాగ్ సంస్థలు కోట్ల విలువైన కాంట్రాక్టులు దక్కించుకున్నాయి. ఈ రెండు సంస్థలకు ఎలాంటి అనుభవం లేనప్పటికీ చంద్రబాబు, లోకేశ్‌లు వాటికి పెద్దఎత్తున కాంట్రాక్టులు కట్టబెట్టినట్టు నిర్ధారణ అయ్యింది. (డేటా చోర్.. బాబు సర్కార్) డేటా సేకరణ బాధ్యతలు వీటికే.. 2016, 2017, 2018, 2019లలో అనేక ప్రభుత్వ శాఖల డేటా.. ప్రజల వ్యక్తిగత సమాచార సేకరణకు కూడా ఈ రెండు సంస్థలకే ప్రభుత్వమే అప్పగించింది. 2016లో నిర్వహించిన ప్రజాసాధికార సర్వే బాధ్యతలను సైతం వీటికే అప్పగించారు. కుటుంబ వికాసం, సమాజ వికాసం ప్రాజెక్ట్‌ను బ్లూ ఫ్రాగ్ సంస్థకు ఇచ్చారు. ఇందుకోసం అన్ని శాఖల సమాచారాన్ని ఈ సంస్థకు అందజేయాలని ఆదేశాలు కూడా ఇచ్చారు. ఇదే సంస్థకు 2017లో పంటల సలహా కాంట్రాక్టును రూ.30 కోట్లకు ప్రభుత్వం అప్పగించింది. అయితే, ఇచ్చిన పని సకాలంలో పూర్తి చేయలేకపోవడంతో 2018లో ఆ సంస్థను అధికారులు తప్పించారు. మరోవైపు.. కరెంట్ స్తంభాల జియో ట్యాగింగ్ కాంట్రాక్టును కూడా ఈ రెండు కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఇలా అనేక సర్వీసు ప్రొవైడర్లకు ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వడంతో డేటా చోరీకి అవకాశం కల్పించినట్లయింది. (చంద్రబాబు, లోకేశ్ మార్గదర్శనంలో...క్యాష్ ఫర్ ట్వీట్!) అధికారుల బెంబేలు.. టీడీపీ సర్కారు ప్రమేయంతో జరిగిన డేటా స్కామ్ వ్యవహారం తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనని అధికారులు ఇప్పుడు వణికిపోతున్నారు. మరోవైపు.. రియల్ టైం గవర్నెన్స్, 1100 కాల్ సెంటర్లపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. వీటిలోనే ప్రభుత్వం పౌరుల సమస్త సమాచారాన్ని భద్రపరిచింది. ప్రభుత్వ పథకాల అర్హులను గుర్తించేందుకు ప్రజాసాధికార సర్వే, ఇతర శాఖల సమాచారాన్ని జోడించింది. ఈ పేరుతో లబ్ధిదారుల కలర్ ఫొటోతో కూడిన ఓటరు జాబితా, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలను ప్రభుత్వం సేకరించింది. ఇప్పుడా సమాచారం చోరీకి గురికావడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ బాగోతంలో ఇప్పటికే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ల పాత్రపై చర్చ జరుగుతున్న తరుణంలో పలువురు అధికారుల మెడకు కూడా ఇది చుట్టుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. (‘ఐటీ గ్రిడ్స్’ నుంచి 3 హార్డ్‌డిస్క్‌లు మాయం) -
‘చంద్రబాబు ప్రజాస్వామ్యానికి పట్టిన గ్రహణం’
-
‘చంద్రబాబు ప్రజాస్వామ్యానికి పట్టిన గ్రహణం’
సాక్షి, వైఎస్సార్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీకి, ప్రజాస్వామ్యానికి పట్టిన గ్రహణమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి రామచంద్రయ్య విమర్శించారు. సోమవారం జిల్లాలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల సమాచారాన్ని టీడీపీ ఐటీ కంపెనీలకు ధారాదత్తం చేసిందని ఆరోపించారు. టీడీపీ చాలా పెద్ద నేరానికి పాల్పడిందని.. దీనిని ఎన్నికల సంఘం చాలా సీరియస్‌గా తీసుకోవాలన్నారు. ఐటీగ్రిడ్స్ స్కాంలో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ హస్తం ఉందన్నారు. ఇది ప్రజస్వామ్యంపై, ప్రజల ప్రాథమిక హక్కులపై జరిగిన దాడి అని అన్నారు. కొత్త పంథాలో చంద్రబాబు అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆయా కంపెనీల ఉద్యోగులకు జీతాలు ఎవరిస్తున్నారో, వారికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందో విచారణ చేపట్టాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిపైనే కేసులు పెట్టే సంస్కృతి ఏపీలో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుది ఎంత క్రిమినల్ మైండ్ అనేది ఈ ఘటన ద్వారా అర్థమవుతుందని తెలిపారు. కాగ్ తప్పుపట్టినా, ప్రతిపక్షం ప్రశ్నించినా, జనాలు ఛీకొడుతున్నా.. చంద్రబాబు అక్రమాలు ఆపడం లేదన్నారు. చంద్రబాబు తన గొయ్యిని తానే తవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. -
ఫేస్‌బుక్‌కు మరో భారీ షాక్
వాషింగ్టన్ : గోప్యతా ఉల్లంఘన ఆరోపణలతో ఇబ్బందుల్లో పడిన సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు మరో షాక్ తగలనుంది. భారీగా వినియోగదారుల వ్యక్తిగత వివరాలను వారి అనుమతి లేకుండా విక్రయించిందన్న ఆరోపణలపై విచారణ చేస్తున్న సంస్థ ఫేస్‌బుక్‌కు అత్యధిక జరిమానా విధించే దిశగా కదులుతోంది. పలుమార్లు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున వినియోగదారుల డేటా బ్రీచ్ ఆరోపణల నేపథ్యంలో ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టీసీ) రికార్డు స్థాయిలో జరిమానా విధించాలని భావిస్తోందని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. శుక్రవారం న్యూయార్క్ టైమ్స్ వెల్లడించిన నివేదిక ప్రకారం.. ఫేస్‌బుక్‌పై సుమారు 16 వందల కోట్ల రూపాయలకు మించి పెనాల్టీ విధించాలని ఎఫ్‌టీసీ యోచిస్తోంది. 2012లో గోప్యతా ఉల్లంఘనలకు గాను గూగుల్‌పై ఎఫ్‌టీసీ విధించిన అత్యధిక జరిమానా 22.5 మిలియన్ డాలర్లు. దీనికి మించి ఫేస్‌బుక్‌కు పెనాల్టీ సెగ తాకనుందని వాషింగ్టన్ పోస్ట్ రిపోర్టు చేసింది. అయితే ఈ వార్తలపై ఎఫ్‌టీసీ, ఫేస్బుక్ ఇంకా స్పందించలేదు. కాగా, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8.7 కోట్ల మంది యూజర్ల డేటాను ఫేస్బుక్ విక్రయించిదనే ఆరోపణలు ప్రకంపనలు రేపాయి. మరోవైపు తమ యూజర్ల డేటా లీకైందనే విషయాన్ని ఒప్పుకున్న ఫేస్బుక్ సీఈఓ జుకర్ బర్గ్ అమెరికన్ పార్లమెంటరీ కమిటీ ముందు హాజరయి భవిష్యత్తులో ఇలా జరగకుండా చూస్తామని హమీ ఇచ్చారు. అంతేకాదు పత్రికా ప్రకటనల ద్వారా క్షమాపణలు కోరారు. -
అమెజాన్‌కు ఏమైంది?
ఒకవైపు మార్కెట్ క్యాప్‌లో అమెరికాకు చెందిన ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థగా అవతరించింది. మరోవైపు టీవీ యాంకర్‌తో ప్రేమలో పడిన అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ భార్యకుతో విడాకులకు సిద్ధం..ఇంకోవైపు అమెజాన్‌లో విక్రయదారుల భారీ డేటాలీక్‌తో అమెజాన్ వార్తల్లో నిలిచింది. అంతర్గత వ్యవస్థలో సాంకేతిక లోపం కారణంగా పలు అమెజాన్ ఇండియా పోర్టల్‌లో విక్రయదారుల డేటా లీక్ అయింది. ముఖ్యంగా సెల్లర్స్ వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాల సమాచారం చోరీకి గురైంది. వీరి అమ్మకాలకు సంబంధించిన నెలవారీ ఆర్థిక లావాదేవీల వివరాలు, ఇతరాలు అక్రమంగా బహిర్గతం కావడం కలకలం రేపింది. వరుస డేటాలీక్స్ సోషల్ మీడియా యూజర్లను ఆందోళనలోకి నెట్టివేస్తున్నాయి. ఫేస్బుక్ ఖాతాల డేటాబ్రీచ్ ప్రకంపనలు ఇంకా చల్లారకముందే తాజాగా అమెజాన్ ఇండియాలో మరో డేటా బ్రీచ్ కలకలం రేపింది. అమెజాన్‌లో నమోదైన సెల్లర్స్ ఆర్థిక లావాదేవీల వివరాలు అక్రమంగా ప్రత్యర్థి విక్రయాదారులతోపాటు, ఇతరులకు కూడా అందాయి. దీన్ని అమెజాన్ ఇండియా ధృవీకరించింది. విక్రయదారులు డౌన్లోడింగ్ సందర్భంగా సమస్యలు తలెత్తడంతో డేటా బ్రీచ్ అంశాన్ని గమనించామని వెల్లడించింది. అయితే సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి వెంటనే చర్యలు చేపట్టామని ప్రకటించింది. అయితే ఈ ప్రభావానికి గురైన అమ్మకందారుల సంఖ్యను మాత్రం బహిర్గతం చేయలేదు. కాగా అమెజాన్‌లో దాదాపు150 మిలియన్ల రిజిస్టర్డ్ యూజర్లు వుండగా, సుమారు 40 లక్షలమంది విక్రయదారులుగా నమోదయ్యారు. ఈ నేపథ్యంలో తాజా డాటాలీక్ ప్రభావానికి ఎంతమంది గురయ్యారు? ఎంతమంది సెల్లర్స్ ఫిర్యాదు చేశారనే దానిపై స్పష్టత లేదు. గత ఏడాది కూడా అమెజాన్‌లో దాదాపు ఇలాంటి సమస్యే తలెత్తింది. -
10 కోట్ల కస్టమర్ల డేటా గోవిందా!
ఫేస్బుక్లో డేటా లీక్ ఉదంతం ప్రకంపనలు ఇంకా సమసిపోకముందే తాజాగా డేటా బ్రీచ్ ఆందోళన పుట్టిస్తోంది. ప్రముఖ వెబ్సైట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ (క్వోరా) హ్యాకింగ్‌కు గురైంది. ఈ విషయాన్ని స్వయంగా క్వోరానే వెల్లడించింది. ఈ నేపథ్యంలో క్వోరాఖాతాదారులు తమ తమ పాస్‌వర్డ్‌లను మార్చుకోవాల్సిందిగా కోరింది. అలాగే హ్యాకింగ్‌కు గురైన వినియోగదారులకు సమాచారం ఇస్తున్నట్టు తెలిపింది. సుమారు10కోట్లమంది(100 మిలియన్లు) వినియోగదారుల డేటా చోరికి గురైందని తెలిపింది. గుర్తు తెలియని హ్యాకర్లు "ఒక హానికర మూడవ పక్షం" ద్వారా తమ వ్యవస్థలోకి చొరబడ్డారని ప్రకటించింది. నవంబరు 30న దీన్నిగుర్తించామనీ, విచారణ కొనసాగుతోందని ప్రకటించింది. పేరు, ఇమెయిల్ చిరునామా, ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్లు, లింక్డ్ నెట్‌వర్క్‌లో రిపోర్ట్ చేసిన డేటాతో సహా చోరి యూజర్ల వ్యక్తిగత సమాచారం చోరీ అయిందని కంపెనీ సీఈవో ఆడమ్ డీ ఎంజేలో తన బ్లాగ్‌పోస్ట్‌లో వెల్లడించారు. కాగా ఫేస్బుక్ మాజీ ఉద్యోగులు ఆడమ్ డీఎంజేలో, చార్లీ చీవర్ 2009లో క్వోరా వెబ్సైట్ ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో (పేస్బుక్, ట్వీటర్,వాట్సాప్) సహా పలు రంగాల్లోని ప్రశ్నలకు జవాబు అందించేలా దీన్ని అభివృద్ధి చేశారు. తద్వారా అతితక్కువ కాలంలోనే ముఖ్యంగా యువతలో ఈ వెబ్సైట్ అత్యంత ఆదరణ పొందింది. -
‘20 కోట్లు ఇవ్వకుంటే.. రహస్యాలన్నీ బయటపెడతా’
సొంత కంపెనీలో డాటా బ్రీచ్‌కు పాల్పడింది పేటీఎం చీఫ్ విజయ్ శేఖర్ శర్మ వ్యక్తిగత కార్యదర్శి సోనియా ధావన్. అంతేకాకుండా 20 కోట్ల రూపాయలు ఇవ్వకుంటే ఆ సమాచారన్నంతా బహిర్గతం చేస్తానంటూ ఆయనను బ్లాక్మెయిల్ చేసింది. ఈ విషయమై కంపెనీ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో ఆమెను సోమవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నోయిడాలో కంపెనీ కార్యాలయంలో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని పేటీఎం నోయిడా విభాగం ధ్రువీకరించింది. విచారణ పూర్తయ్యేంత వరకు పోలీసులకు అన్ని విధాలుగా సహకరిస్తామని పేర్కొంది. బాస్ ఫోన్, లాప్టాప్ల నుంచి.. పేటీఎం స్థాపించిన నాటి నుంచి సోనియా ఆ సంస్థలోనే పనిచేస్తోంది. విజయ్ శేఖర్ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన సమయంలో ఆయన లాప్టాప్, మొబైల్, ఆఫీస్ కంప్యూటర్లను వినియోగించేది. ఈ క్రమంలోనే కంపెనీతో పాటు విజయ్ వ్యక్తిగత సమాచారాన్ని కూడా ఆమె దొంగిలించినట్లు తెలుస్తోంది. ఇలా సేకరించిన డేటా మొత్తాన్ని రోహిత్ కోమల్ అనే వ్యక్తికి చేరవేసింది. ఈ నేపథ్యంలో అతడు విజయ్ సోదరుడు, పేటీఎం వైస్ ప్రెసిడెంట్ అజయ్ శేఖర్ శర్మకు ఫోన్ చేశాడు. ‘20 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే డేటాను బహిర్గతం చేసి ప్రజల్లో పేటీఎంకు ఉన్న నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తామంటూ’ బెదిరింపులకు గురిచేశాడు. దీంతో ఈ విషయాన్ని అజయ్ పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. కాగా సోనియా సహా ఆమెకు సహకరించిన వ్యక్తులపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. -
డేటా బ్రీచ్ : ఉబెర్‌కు భారీ జరిమానా
కాలిఫోర్నియా: ప్రముఖ క్యాబ్ అగ్రిగేటర్ ఊబెర్‌కు అమెరికాలో భారీ షాక్ తగిలింది. 2016 నాటి డేటా బ్రీచ్ ఆరోపణలకు సంబంధించి సంస్థకు అమెరికా రాష్ట్రాలు భారీ జరిమానా చెల్లించాల్సి ఉంది. ఉబెర్ డ్రైవర్లు, కస్టమర్ల డేటాను చోరీ చేసిన కేసులో ఊబెర్ సంస్థకు ఈ పెనాల్టీ పడింది. ఇది అతి పెద్ద బహుళ డేటా ఉల్లంఘన పరిష్కారమని న్యూయార్క్ అటార్నీ జనరల్ బార్బారా వ్యాఖ్యానించారు. 2016 లో హ్యాకర్లు ప్రపంచవ్యాప్తంగా 57 మిలియన్ల ( 5.7 కోట్లు) వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడం ద్వారా రైడ్-షేర్ కంపెనీ డేలా చట్టాలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. వీరిలో 25 .6 మిలియన్ల అమెరికన్ యూజర్లు ఉన్నారు. 6లక్షలమంది డ్రైవర్ లైసెన్స్ నంబర్లతో సహా, 10లక్షలకు పైగా ఉబెర్ యూజర్ల ఫోన్ నెంబర్లు, ఈ మెయిల్స్ చోరీకి గురయ్యాయి. కాలిఫోర్నియా కోర్టులో సాగిన ఈ కేసులో అమెరికా రాష్ట్రాలకు భారీ మూల్యం చెల్లించనున్నట్లు ఊబర్ అంగీకరించింది. అమెరికాలోని 50 రాష్ర్టాలతో పాటు డిస్ట్రిక్ ఆఫ్ కొలంబియాకు సుమారు 148 మిలియన్ల డాలర్లు చెల్లించనుంది. ఈ మొత్తం ఆ రాష్ట్రాల మధ్య పంపిణీ అవుతుంది. మరోవైపు ఊబెర్ కొత్త చీఫ్ కొష్రోవ్‌షాహి నవంబర్ లో ఉల్లంఘనను అంగీకరించారు. తాజా ఒప్పందం ప్రకారం ఇకపై తమ కస్టమర్ల డాటాను సురక్షితంగా, భద్రగా ఉంచుతామని ఉబెర్ హామీ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఆయా ప్రభుత్వాలతో నిర్మాణాత్మక , సహకార సంబంధాన్ని నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నామని వెల్లడించింది. డేటా ప్రైవసీ నియంత్రణపై ఒక మానిటర్ కమిటీని ఏర్పాటు చేయనున్నామని తెలిపింది. కాగా ఇప్పటికీ రైడర్స్, డ్రైవర్ల డేటా ఉల్లంఘనపై చికాగో, లాస్ ఏంజిల్స్ నగరాల నుంచి ఉబెర్ వ్యాజ్యాలని ఎదుర్కొంటోంది. డేటా ఉల్లంఘనపై ఇప్పటికే దిద్దుబాటు చర్యలకు దిగిన సంస్థఅప్పటి చీఫ్ ప్రైవసీ అధికారిపై వేటు వేసింది. అలాగే గత జులైలో ఇద్దరు ఆఫీసర్లను నియమించుకుంది. రుబీజెఫోను ప్రధాన గోప్యతా అధికారిగాను, మట్ ఓల్స్‌ను చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌నుగాను నియమించింది. -
భారీ చోరీ : 3.80 లక్షల లావాదేవీలపై ప్రభావం
ఇటీవల ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడులు పెరగడమే కాని, తగ్గడం కనిపించడం లేదు. బడా బడా కంపెనీలు, దిగ్గజ సంస్థలు, పెద్ద బ్యాంక్‌లు సైతం వీటి బారిన పడుతున్నాయి. తాజాగా దిగ్గజ ఎయిర్‌లైన్ సంస్థ బ్రిటిష్ ఎయిర్వేస్ కూడా సైబర్ నేరగాళ్లు బారిన పడింది. బ్రిటిష్ ఎయిర్వేస్కు చెందిన వెబ్సైట్, మొబైల్ అప్లికేషన్‌పై సైబర్ నేరగాళ్లు దాడి చేసి, కస్టమర్ల డేటాను దొంగలించారు. ఈ విషయాన్ని ఆ విమానయాన సంస్థనే ట్విటర్ ద్వారా వెల్లడించింది. యూకేలో బ్రిటిష్ ఎయిర్వేస్ అతిపెద్ద విమానయాన సంస్థ. కస్టమర్ల వ్యక్తిగత డేటా, ఆర్థిక సమాచారం దొంగతనం పాలైన విషయంపై ఈ సంస్థ తమ కస్టమర్లకు క్షమాపణ కూడా చెప్పింది. ఈ డేటా చోరిపై విచారణ చేపట్టినట్టు పేర్కొంది. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 5 మధ్యలో కస్టమర్ల వ్యక్తిగత, ఆర్థిక సమాచారం దొంగతనానికి గురైందని, దాదాపు 3,80,000 లావాదేవీలు దీని బారిన పడినట్టు బ్రిటీష్ ఎయిర్వేస్ వెల్లడించింది. అయితే పాస్‌పోర్టు లేదా ప్రయాణ వివరాలు మాత్రం దొంగతనానికి గురికాలేదని పేర్కొంది. ‘ 21 ఆగస్టు 2018, 22:58 బీఎస్టీ(బ్రిటీష్ స్టాండర్డ్ టైమ్) నుంచి 5 సెప్టెంబర్ 2018, 21:45 బీఎస్టీ వరకు ఏ కస్టమర్లైతే, మా వెబ్సైట్, యాప్‌లో బుకింగ్స్‌ను, షెడ్యూల్ మార్పులను చేపట్టారో, వారి వ్యక్తిగత, ఆర్థిక వివరాలన్నీ చోరికి గురయ్యాయి’ అని బ్రిటీష్ ఎయిర్వేస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఒకవేళ సైబర్ దాడి బారిన పడినట్టు అనిపిస్తే, వెంటనే బ్యాంక్‌లు, క్రెడిట్ కార్డు ప్రొవైడర్ల సూచనలు తీసుకోవాలని కస్టమర్లను ఎయిర్‌లైన్స్ ఆదేశించింది. తదుపరి సమాచారం కోసం ఓ లింక్‌ను అప్డేట్ చేయనున్నట్టు పేర్కొంది. కస్టమర్లను వ్యక్తిగతంగా సంప్రదించి, తమ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పింది. ప్రభావితమైన కస్టమర్ల నగదును పూర్తిగా రియంబర్స్ చేస్తామని, క్రెడిట్ చెకింగ్ సర్వీసుకు చెల్లించనున్నట్టు పేర్కొంది. తాజా సమాచారంపై ఎప్పడికప్పుడు కస్టమర్లకు అప్డేట్ చేస్తామని తెలిపింది. ప్రస్తుతం దీన్ని పరిష్కరించామని, తదుపరి బుకింగ్స్‌పై దీని ప్రభావం ఏ మాత్రం ఉండదని చెప్పింది. పోలీసులు, సంబంధిత అధికారులు ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నారు. -
ఫేస్‌బుక్‌కు జరిమానా విధించిన బ్రిటన్
-
58 కోట్ల ఫేస్బుక్ ఖాతాలు ఔట్, ఎందుకు?
శాన్ఫ్రాన్సిస్కో: డేటా లీక్ నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ భారీ ఎత్తున ఫేక్ అకౌంట్లను తొలగించింది. కేవలం మూడు నెలల్లోనే ఈ ఖాతాలకు చెక్ పెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 58.3కోట్ల నకిలీ ఖాతాలను తొలగించినట్టు తెలిపింది. అంతేకాదు ఫేస్బుక్లో లక్షలాది నకిలీ ఖాతాలను రూపొందించే పయత్నాలను నిరోధిస్తున్నామని వెల్లడించింది. భారీ ఎత్తున డేటా బ్రీచ్ ఆరోపణలతో యూజర్ల గోప్యత ప్రశ్నార్థకంగా మారడంతో తన ఫ్లాట్‌పాంలో సెక్యూరిటీ అంశాలను సమీక్షిస్తోంది. ఇందులో భాగంగా నకిలీ అకౌంట్లను ఏరివేసేందుకు సన్నద్ధమైంది. యూజర్ డేటా దుర్వినియోగం విచారణలో భాగంగా తమ ప్లాట్‌ఫాంపై దాదాపు 200 యాప్స్‌ను తొలగించినట్టు ప్రకటించిన ఫేస్బుక్ తాజాగా ఈ చర్య తీసుకోవడం విశేషం 2018 మొదటి మూడునెలల్లో 583 మిలియన్ల నకిలీ ఖాతాలను రద్దు చేసింది. ఈ మేరకు ఫేస్బుక్ మంగళవారం ఒక ప్రకటన జారీ చేసింది. లైంగిక వేధింపులు, హింసాత్మక చిత్రాలు, తీవ్రవాద ప్రచారాలు లేదా ద్వేషపూరిత ప్రసంగం లాంటి కమ్యూనిటీ ప్రమాణాలను దృష్టిలోవుంచుకుని ఆయా ఖాతాలను డిలిట్ చేసినట్టు వెల్లడించింది. దీంతోపాటు 837 మిలియన్ల పోస్టులను తొలగించామని వివరించింది. కేంబ్రిడ్జ్ ఎనలిటికా డేటా బ్రీచ్ కుంభకోణం తరువాత ఫేస్బుక్ దిద్దుబాటు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతి రోజూ మిలియన్ల కొద్దీ నకిలీ ఖాతాలను నిరోధిస్తున్నట్టు చెప్పింది. అయినప్పటికీ నకిలీ ప్రొఫైల్స్ బెడద భారీగా ఉందని చెప్పింది. ఇది యాక్టివ్ అకౌంట్లను 3-4 శాతం ప్రభావితం చేస్తున్నట్టు పేర్కొంది. -
200 యాప్స్ తొలగించిన ఫేస్బుక్
బెంగళూరు : ఇటీవల డేటా చోరి ఉదంతంతో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ తీవ్ర విమర్శలు పాలైన సంగతి తెలిసిందే. తన ప్లాట్‌ఫామ్స్ పై ఉన్న థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా డేటా దుర్వినియోగమవుతుందని ఫేస్బుక్ సైతం గుర్తించింది. దీంతో కంపెనీ తన ప్లాట్‌ఫామ్‌ను సమీక్షించడం ప్రారంభించింది. ఈ సమీక్షలో భాగంగా తొలి స్టేజీలో 200 యాప్స్‌పై ఫేస్బుక్ వేటు వేసింది. యూజర్లకు చెందిన డేటాను దుర్వినియోగ పరిచారో లేదో తెలుసుకునే క్రమంలో 200 యాప్స్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు ఫేస్బుక్ ప్రొడక్ట్ పార్టనర్షిప్స్ వైస్ ప్రెసిడెంట్ ఇమి ఆర్చిబాంగ్ తెలిపారు. ఈ విచారణలో భాగంగా వేలకొద్దీ యాప్స్‌ను పరిశీలిస్తున్నట్టు కూడా చెప్పారు. ఫేస్బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకర్‌బర్గ్ సైతం తమ ప్లాట్‌ఫామ్‌పై యాప్స్‌పై విచారణ చేపట్టనున్నట్టు మార్చి నెలలోనే ప్రకటించారు. 2014లో డేటా యాక్సస్ నియంత్రించడానికి కంటే ముందు పెద్ద మొత్తంలో సమాచారాన్ని సేకరించిన అన్ని యాప్స్‌పై తాము విచారణ చేపట్టనున్నట్టు జుకర్‌బర్గ్ పేర్కొన్నారు. ఈ విచారణ కోసం తమకు పెద్ద ఎత్తున్న అంతర్గత, బహిరంగ నిపుణులతో కూడిన టీమ్‌లు ఉన్నాయని ఆర్చిబాంగ్ చెప్పారు. వీరు వెంటనే ఈ విచారణ ఫలితాలను వెల్లడించనున్నారని పేర్కొన్నారు. కేంబ్రిడ్జ్ అనలిటికా అక్రమంగా ఫేస్బుక్ యూజర్ల డేటాను పొందిన తర్వాత ఈ సోషల్ మీడియా దిగ్గజం పెద్ద ఎత్తున్న డేటా స్కాం విమర్శలు పాలైంది. ఈ స్కాండల్ అనంతరం ఫేస్బుక్ బిలియన్ల కొద్దీ మార్కెట్ విలువను కోల్పోయింది. తాము తప్పు చేసినట్టు జుకర్‌బర్గ్ సైతం ఒప్పుకుని, ఫేస్బుక్ యూజర్లకు క్షమాపణ చెప్పారు. ప్రస్తుతం ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ఫేస్బుక్ ప్లాట్‌ఫామ్‌ను అత్యంత సురక్షితంగా రూపుదిద్దుతున్నారు. -
ట్విటర్ కూడా అమ్మేసిందట!
సాక్షి, న్యూఢిల్లీ: ఫేస్బుక్ డేటా బ్రీచ్ ఆందోళన యూజర్లను ఇంకా వీడకముందే..తాజాగా మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్‌కూడా యూజర్ల డేటాను విక్రయిచిందన్న వార్తలు మరింత కలవరం పుట్టించాయి. ట్విటర్‌కు చెందిన యూజర్ డేటా కేంబ్రిడ్జ్ ఎనలిటికా చేజిక్కించుకుంది. అనంతరం ఈ సమాచారాన్ని వినియోగదారుల సమ్మతి లేకుండానే పొలిటికల్ కన్సల్టింగ్ సంస్థకు విక్రయించింది. గ్లోబల్ సైన్స్ రీసెర్చ్ (జిఎస్ఆర్, అలెగ్జాండర్ కోగన్ సొంత వ్యాపార సంస్థ) భారీ ఎత్తున తమ వినియోగదారుల డేటాను తస్కరించిందని ట్విటర్ మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. 2015లో కేవలం ఒక రోజులోనే నెలరోజులకు సంబంధించిన భారీ డేటాను చోరిచేసిందని పేర్కొంది. బ్లూంబర్గ్ అందించిన సమాచారం ప్రకారం 2015లో, జీఎస్ఆర్ సంస్థకు డిసెంబరు 2014 నుంచి ఏప్రిల్ 2015 దాకా పబ్లిక్ ట్వీట్ల రాండం శాంపిల్‌కోసం ఐదు నెలల వ్యవధిలో తన అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్‌పై వన్‌టైం యాక్సెస్ ఇచ్చామని ట్విటర్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా నేడేటా లీక్ అయ్యిందని గుర్తించినట్టు వివరించింది.అయితే ఇటీవల డేటా బ్రీచ్ నివేదిక నేపథ్యంలో అంతర్గత సమీక్షలో ఈ విషయాన్ని గుర్తించామనీ, దీంతో కేంబ్రిడ్జ్ ఎనలిటికా, దాని అనుబంధ సంస్థలు, ప్రకటనకర్తలను తొలగించినట్టు పేర్కొంది. కాగా యూజర్ల సమాచార భద్రతలో ట్విట్టర్ వైఫల్యం, డేటా దుర్వినియోగాన్ని నిరోధించడంలో విఫలమైనందుకు మరోసారి తీవ్ర దుమారం రేగింది. -
మరో బాంబు పేల్చిన ఫేస్బుక్
శాన్ ఫ్రాన్సిస్కో: డేటా భద్రత యూజర్లకు పెద్ద సమస్యగా పరిణమిస్తోంది. ఇప్పటికే సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం ఫేస్బుక్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది వినియోగదారుల డేటా లీక్ ప్రకంపనల నుంచి ఇంకా తేరుకోకుండానే ఫేస్బుక్ అధినేత మార్క్ జూకర్ బర్గ్ మరో బాంబు పేల్చారు. డేటా బ్రీచ్ ప్రమాదం మరింత పొంచి వుందని యూజర్లు, ఇన్వెస్టర్లను హెచ్చరించింది. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ)కు సమర్పించిన త్రైమాసిక నివేదికలో భవిష్యత్తులో మరింతగా డేటా లీక్ ఉండే అవకాశముందని ఫేస్బుక్ వెల్లడించింది. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ కు అందించిన త్రైమాసిక నివేదికలో, కేంబ్రిడ్జ్ ఎనలైటికా గురించి ప్రస్తావించకుండానే యూజర్లకు ఈ హెచ్చరిక చేసింది. థర్డ్ పార్టీల అవాంఛనీయ కార్యాచరణ ద్వారా వినియోగదారుల డేటా లీక్ సంఘటనలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపింది. తమ సంస్థ నుంచి మరింత డేటాను ఇతరులు తస్కరించి వాటిని దుర్వినియోగం చేసే అవకాశముందని ఫేస్బుక్ ఎస్ఈసీకి తెలిపింది. ఇది తమ కీర్తి, ప్రతిష్టలకు తీవ్ర హాని కలిగించవచ్చు. తమ వ్యాపారాన్ని, ఆర్థిక ఫలితాలను ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చని పేర్కొంది. కాగా ఫేస్బుక్ నుంచి అక్రమంగా సేకరించిన కోట్ల మంది యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని కేంబ్రిడ్జ్ అనలిటికా లీక్ చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదంలో అమెరికా, బ్రిటన్ చట్ట సభలు ఇప్పటికే విచారణ ప్రారంభించాయి. అంతేకాదు ఈ వ్యవహారంలో కంపెనీ నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించక తప్పదని అంచనా. -
ఏ డేటా దొంగలించారో చెప్పండి?
డేటా చోరి విషయంలో అమెరికా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు, బ్రిటిష్ రాజకీయ విశ్లేషక సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికాకు మరోసారి కేంద్ర ప్రభుత్వం నోటీసులు పంపింది. గతంలో పంపిన నోటీసులకు ఈ సంస్థలు ఇచ్చిన సమాధానాలు సరియైన విధంగా లేకపోవడంతో, ప్రభుత్వం తిరిగి మరోసారి నోటీసులు జారీచేసింది. ప్రభుత్వం పంపిన తొలి నోటీసుకు కేంబ్రిడ్జ్ అనలిటికా చెప్పీ చెప్పనట్టు, తప్పించుకునే తీరులో స్పందన తెలియజేసింది. దీంతో మరిన్ని ప్రశ్నలను కేంద్రం సంధించింది. ఈ అదనపు ప్రశ్నలకు వచ్చే నెల 10వ తేదీలోపు వివరణ ఇవ్వాలని కేంద్రం ఆ సంస్థలను ఆదేశించింది. అయితే ఈ సారి పంపిన నోటీసుల్లో భారత్‌కు సంబంధించి ఏ తరహా సమాచారం సేకరించారు? సంబంధిత డేటాను కొట్టేయడానికి వాడిన టూల్స్ ఏంటని ప్రశ్నించింది. అటు ఫేస్ బుక్ స్పందన సైతం లోపాలమయంగానే ఉండడంతో మరిన్ని వివరణలు కోరింది. ఫేస్బుక్ ఈ విషయంపై క్షమాపణ కోరింది. అంతేకాక భారత్‌కు చెందిన 5.62 లక్షల యూజర్ల సమాచారం డేటా చోరి బారిని పడినట్టు పేర్కొంది. భారత్ చట్టాలు, గోప్యత నిబంధనలు ఉల్లంఘిస్తూ.. భారత్‌లో కార్యకలాపాలు సాగించే విదేశీ ఐటీ కంపెనీలకు ఇది స్ట్రాంగ్ మెసేజ్ లాంటిదని ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి చెప్పారు. భవిష్యత్తులో యూజర్ల డేటా దుర్వినియోగం పాలవకుండా ఉండేందుకు ఎలాంటి ప్రణాళికలను చేపడుతుందో తెలుపాలని కూడా ఫేస్బుక్ ప్రభుత్వం ఆదేశించింది. -
రికార్డు సృష్టించిన ఫేస్బుక్
శాన్ఫ్రాన్సిస్కో : ఇటీవల సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ఎదుర్కొంటున్న డేటా చోరి సంక్షోభం, తన ఫలితాలపై ఏ మాత్రం ప్రభావం చూపలేదు. బుధవారం ప్రకటించిన తొలి క్వార్టర్ లాభాల్లో ఫేస్బుక్ ఆల్-టైమ్ హై స్థాయిని రికార్డు చేసింది. కంపెనీ నికర లాభాలు ఈ క్వార్టర్లో దాదాపు 65 శాతం మేర జంప్ చేశాయి. గతేడాది ఇదే కాలంలో ఇవి 4.9 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అదేవిధంగా రెన్యూలు 49 శాతం పెరిగి 12 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వీటిలో వ్యాపార ప్రకటనల ద్వారా వచ్చిన రెవెన్యూలు అగ్రస్థానంలో ఉన్నాయి. మార్చి నుంచి కొనసాగుతున్న ప్రైవసీ స్కాండల్‌తో ఫేస్బుక్ సతమతమవుతున్నా.. ఈ ఫలితాలు ఆ కంపెనీకి కాస్త ఊరట కలిగించాయి. గతేడాది కంటే కూడా ఈ ఏడాదే రోజుకు 13 శాతం ఎక్కువ మంది ఫేస్‌బుక్‌లోకి లాగిన్ అవుతున్నట్టు కంపెనీ పేర్కొంది. అయితే ప్రస్తుతం నెలకొన్న డేటా స్కాండల్ ప్రభావం రెండో క్వార్టర్లో చూపించవచ్చని విశ్లేషకులంటున్నారు. యూజర్ల ప్రమేయం లేకుండా ఫేస్బుక్ కేంబ్రిడ్జ్ అనలిటికాతో యూజర్ల డేటా పంచుకుందనే ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. దీంతో ఫేస్బుక్ డిలీట్ అనే ఉద్యమం నడుస్తోంది. ఇన్ని ప్రతికూల ప్రభావాలు ఉన్నప్పటికీ, తమకు 2018 ఏడాది చాలా బలంగా ప్రారంభమైందని ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ అన్నారు. డేటా స్కాండల్‌పై పలు క్లాస్ యాక్షన్ దావాలను ఫేస్బుక్ ఎదుర్కొంటోంది. ఈ వివాదంతో స్టాక్ కూడా 14 శాతం కిందకి పడిపోయింది. అయితే బలమైన క్వార్టర్ ఫలితాలను ఫేస్బుక్ ప్రకటించడంతో ఫేస్బుక్ షేర్లు పుంజుకుని, 4 శాతానికి పైగా లాభాలు పండిస్తున్నాయి. -
ఫేస్బుక్ సీఈవోకి చుక్కలు చూపించారు!
కేంబ్రిడ్జ్ అనలిటికా డేటా చోరి ఉదంతంపై తొలి రోజు ఎక్కడా తడబాటు, కంగారు లేకుండా.. చాలా కూల్‌గా, కామ్‌గా అంతకు మించి ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తూ సమాధానాలు చెప్పిన ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌కు, రెండో రోజు అమెరికన్ సెనేటర్లు చుక్కలు చూపించారు. మొదటి రోజుతో పోలిస్తే, రెండో రోజు కఠినతరమైన ప్రశ్నలతో జుకర్‌బర్గ్‌ను గుక్క తిప్పుకోనివ్వలేదు. కంపెనీ డేటా సేకరణ అంశాలపై సెనేటర్లు సమాధానం చెప్పలేని ప్రశ్నలనే సంధించారు. ఒకానొక దశలో జుకర్‌బర్గ్ తీవ్ర అసహనానికి కూడా గురయ్యారు. వినియోగదారుల గోప్యతకు మించి పలు అంశాలపై కూడా ఆయన్ని ప్రశ్నించారు. బుధవారం హౌజ్ ఎనర్జీ, కామర్స్ కమిటీ ముందు హాజరైన జుకర్‌బర్గ్‌కు దాదాపు ఐదు గంటల పాటు చట్టసభ్యులు ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు. మొత్తంగా రెండో రోజులు 100 మంది చట్టసభ్యులు 10 గంటల పాటు జుకర్‌బర్గ్‌ను విచారించినట్టు తెలిసింది. కేంబ్రిడ్జ్ అనలిటికా డేటా స్కాండల్‌పై అమెరికన్ కాంగ్రెస్ జరిపిన తుది విచారణ ఇంతటితో ముగిసింది. ఈ విచారణలో కూడా జుకర్‌బర్గ్ పదే పదే తాను పెద్ద తప్పు చేశానని ఒప్పుకున్నారు. కానీ ఇలాంటి సమాధానం ఇచ్చే ఛాన్స్ మళ్లీ ఇవ్వకుండా కేవలం ‘యస్’ లేదా ‘నో’ రూపంలో మాత్రమే సమాధానం చెప్పేలా న్యూజెర్సీకి చెందిన డెమొక్రాటిక్ ప్రతినిధి ఫ్రాంక్ పలోన్ ప్రశ్నలు సంధించారు. డేటా సేకరణను తగ్గించడానికి ఏమైనా డీఫాల్ట్ సెట్టింగ్స్‌ను ఫేస్బుక్ మార్చడానికి సిద్ధంగా ఉందా? అనే ప్రశ్న పలోన్ అడిగారు. కానీ ఇది చాలా క్లిష్టమైన అంశమని, కేవలం ఒక్క పదంతో సమాధానం చెప్పలేమని జుకర్‌బర్గ్ అన్నారు. దీంతో మీ సమాధానం తమల్ని నిరాశకు గురిచేసిందని పలోన్ అన్నారు. 2011లో ఫెడరల్ ట్రేడ్ కమిషన్‌తో చేసుకున్న ఒప్పందాన్ని ఫేస్బుక్ డేటా పాలసీ, థర్డ్ పార్టీ యాప్స్‌తో కలిసి ఉల్లంఘిస్తుందనే అంశంపై పలువురు చట్టసభ్యులు ప్రశ్నలు సంధించారు. ఒకవేళ అలా చేస్తే, భారీ మొత్తంలో జరిమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తమ ప్లాట్‌ఫామ్‌పై అక్రమంగా ఒపియాడ్స్‌ను విక్రయించుకునేందుకు అనుమతి ఇస్తూ... యూజర్లను ఫేస్బుక్ బాధపరుస్తుందని ఓ చట్టసభ్యుడు మండిపడ్డారు. ఇప్పటి వరకు జుకర్‌బర్గ్ చెప్పిన క్షమాపణల లెక్కలు తీసిన ఇల్లినాయిస్కు చెందిన ఓ డెమొక్రాట్, తమ స్వీయ నియంత్రణ సంస్థ పనిచేయడం లేదనడానికి ఇదే రుజువు అని చురకలు అంటించారు. యూజర్లు కానీ వారి డేటాను కూడా ఫేస్బుక్ షాడో ప్రొఫైల్స్‌తో సేకరిస్తుందంటూ డెమొక్రాటిక్ సహోద్యోగి, న్యూ మెక్సికో ప్రతినిధి బెన్ లుజాన్ ఆరోపించారు. ఇలా కేంబ్రిడ్జ్ అనలిటికాతో ఫేస్బుక్ షేర్చేసిన 8.7 కోట్ల మంది డేటా ఉదంతంపై చట్టసభ్యులు ప్రశ్నలు మీద ప్రశ్నలు సంధించారు. కానీ సమయం తక్కువగా ఉండటంతో ఒక్కొక్క చట్టసభ్యునికి కేవలం 5 నిమిషాలు సమయం మాత్రమే కేటాయించారు. -
ఓ.. నో... జుకర్‌బర్గ్ ఆన్సర్
వాషింగ్టన్ : ఫేస్బుక్ డేటా చోరిపై అమెరికన్ కాంగ్రెస్ ముందుకు వచ్చిన ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌ను కాస్త సందిగ్థతలో పడేసే ప్రశ్నలే ఎదురయ్యాయి. వందల కొద్దీ ప్రశ్నలు సంధించిన అమెరికన్ చట్టసభ్యులు, వ్యక్తిగత సమాచారాన్ని జుకర్‌బర్గ్‌కు సంధించారు. గత రాత్రి ఎక్కడ నిద్ర పోయారని జుకర్‌బర్గ్‌ని సెనేటర్ డిక్ డర్బిన్ అడిగారు. ఆన్లైన్ డిజిటల్ ప్రైవసీపై విచారణ జరిపిన డర్బిన్, ఆ ప్లాట్‌ఫామ్‌పై చేరిన యూజర్ల వ్యక్తిగత సమాచార విషయంలో ఫేస్బుక్ పాత్ర ఏమిటో తెలుసుకోవడం కోసం, గత రాత్రి ఎక్కడ ఉన్నారో తెలుపడానికి మీరు సౌకర్యవంతంగానే ఉన్నారా? అంటూ ప్రశ్నించారు. డర్బిన్ సంధించిన ప్రశ్నలకు కాస్త ఆందోళనకు గురైన జుకర్‌బర్గ్, ఎనిమిది సెకన్ల పాటు మౌనం వహించి, చివరికి తన వ్యక్తిగత సమాచారాన్ని చెప్పడానికి నిరాకరించారు. ఈ వారంలో ఎవరికైనా మెసేజ్ చేశారా? ఆ పేర్లను మీరు మాతో పంచుకోగలరా? అంటూ మరో డెమొక్రాట్ ప్రశ్నించారు. మళ్లీ కూడా జుకర్‌బర్గ్ సమాధానం చెప్పడానికి నిరాకరించారు. ఇలా వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వడానికి జుకర్‌బర్గ్ అసలు ఆసక్తి చూపించలేదు. ఫేస్బుక్ ఖాతాదారుల సమాచారాన్ని కేంబ్రిడ్జి అనలిటికా సంస్థ దుర్వినియోగం చేసిందనే ఆరోపణలపై జుకర్‌బర్గ్ అమెరికన్ కాంగ్రెస్ ముందుకు వచ్చారు. దాదాపు 8.7 కోట్ల మంది ఫేస్బుక్ యూజర్ల సమాచారాన్ని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రభావితం చేసేందుకు వాడారని ఆరోపణలపై ఆయన సెనేటర్లకు క్షమాపణ చెప్పారు. సెనేటర్లకు ఇచ్చిన బహిరంగ ప్రకటనలో, ఫేక్ న్యూస్, ద్వేషపూరిత ప్రసంగం, డేటా గోప్యత లేకపోవడం, 2016 ఎన్నికల్లో రష్యన్ సోషల్ మీడియా జోక్యం వంటి పలు అంశాలపై ఆయన క్షమాపణలు చెబుతున్నట్టు ప్రకటించారు. 8.7 కోట్ల మంది ఫేస్బుక్ యూజర్ల సమాచారం లీక్ అయినందుకు బాధ్యత తానే అని జుకర్‌బర్గ్ ఒప్పుకున్నారు. -
కెరీర్లో తొలిసారి.. ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి
వాషింగ్టన్ : ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తన కెరీర్లో మొదటిసారి అమెరికన్ కాంగ్రెస్ ముందుకు వచ్చారు. ఫేస్బుక్ డేటా చోరిపై ఇటీవల ప్రపంచవ్యాప్తంగా పెల్లుబుక్కుతున్న ఆగ్రహ జ్వాలలపై జుకర్‌బర్గ్ అమెరికన్ కాంగ్రెస్‌కు క్షమాపణలు చెప్పారు. ఇప్పటికే పలుమార్లు బహిరంగంగా క్షమాపణలు చెప్పిన జుకర్‌బర్గ్, అమెరికన్ కాంగ్రెస్ ముందు చెప్పడం ఇదే తొలిసారి. అమెరికన్ కాంగ్రెస్ ముందుకు వచ్చిన జుకర్‌బర్గ్, చట్టసభ్యులు అడిగే ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరయ్యారు. రెండు రోజుల సమావేశ నేపథ్యంలో నేడు కూడా జుకర్‌బర్గ్ హౌజ్ ఎనర్జీ, కామర్స్ కమిటీ ముందు హాజరుకాబోతున్నారు. ఫేస్బుక్ ఖాతాదారుల సమాచారాన్ని కేంబ్రిడ్జి అనలిటికా సంస్థ దుర్వినియోగం చేసిందనే ఆరోపణలతో ప్రస్తుతం జుకర్‌బర్గ్ అతలాకుతలమవుతున్నారు. దాదాపు 8.7 కోట్ల మంది ఫేస్బుక్ యూజర్ల సమాచారాన్ని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రభావితం చేసేందుకు వాడారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సెనేటర్లకు ఇచ్చిన బహిరంగ ప్రకటనలో, ఫేక్ న్యూస్, ద్వేషపూరిత ప్రసంగం, డేటా గోప్యత లేకపోవడం, 2016 ఎన్నికల్లో రష్యన్ సోషల్ మీడియా జోక్యం వంటి పలు అంశాలపై ఆయన క్షమాపణలు చెబుతున్నట్టు ప్రకటించారు. 8.7 కోట్ల మంది ఫేస్బుక్ యూజర్ల సమాచారం లీక్ అయినందుకు బాధ్యత తానే అని జుకర్‌బర్గ్ ఒప్పుకున్నారు. ‘ఇది నా తప్పే. క్షమాపణలు చెబుతున్నా. ఫేస్బుక్ నేనే ప్రారంభించా. నేనే నడుపుతున్నా. కాబట్టి జరిగిన దీనికి నేనే బాధ్యత’ అంటూ పశ్చాతాపానికి గురయ్యారు. కేంబ్రిడ్జ్ అనలిటికా కూడా దీనిపై ఓ ట్వీట్ చేసింది. ఫేస్‌బుక్‌ను తాము హ్యాక్ చేయలేదని లేదా చట్టాలనూ ఉల్లంఘించలేదని పేర్కొంది. ఫేస్బుక్ అందించిన టూల్ ద్వారానే అమెరికా ఎన్నికల సందర్భంగా తాము ఈ డేటాను సేకరించామని చెప్పింది. ఫేస్బుక్ గుత్తాధిపత్యంపై చట్టసభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన.. తమ కంపెనీ గుత్తాధిపత్యం కలిగి ఉందని భావించవద్దని జుకర్‌బర్గ్ చట్టసభ్యులను కోరారు. అమెరికన్ యూజర్లు తమ స్నేహితులతో సంభాషించడానికి, ఎప్పడికప్పుడు అందుబాటులో ఉండటానికి సగటున ఎనిమిది యాప్స్‌ను వాడుతున్నారని, వాటిలో టెక్ట్సింగ్ యాప్స్ నుంచి ఈ-మెయిల్ వరకు ఉన్నాయన్నారు. ఎన్నికలను ప్రభావితం చేయడానికి కొంత మంది రష్యాకు చెందిన గ్రూప్‌లు సోషల్ నెట్‌వర్క్‌ను వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని, వారిపై తాము పోరాడుతున్నామని చెప్పారు. వారు తమ సిస్టమ్స్‌ను, ఇతర ఇంటర్నెట్ సిస్టమ్స్‌ను కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. కానీ వారి బారిన పడకుండా ఉండటానికి తాము శతవిధాలా కృషిచేస్తున్నామన్నారు. అమెరికా కాంగ్రెస్ ముందుకు వచ్చిన మార్క్ జుకర్‌బర్గ్‌కు వందల కొద్దీ ప్రశ్నలను చట్టసభ్యులు సంధించారు. అమెరికా కాంగ్రెస్ హాజరయ్యే ముందు జుకర్‌బర్గ్ ఉన్న హోటల్ గదిలో ఎలా ఉందని దగ్గర్నుంచి... ఆయన మెసేజ్‌లు చేసిన స్నేహితుల వివరాల వరకూ... అన్ని విషయాలను జుకర్‌బర్గ్‌ను చట్టసభ్యులు అడిగారు. -
ఫేస్‌బుక్‌కు మరో టెక్ దిగ్గజం షాక్
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ యూజర్ల డేటాలీక్ దుమారం మరింత ముదురుతోంది. ఇప్పటికే పలు టెక్ కంపెనీలు, టెక్ దిగ్గజాలు వినియోగదారుల గోప్యతా వివరాలు లీక్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా వాట్సాప్ సహ వ్యవస్థాపకుడు బ్రియన్ ఆక్టన్ డిలీట్ ఫేస్బుక్ అంటూ సంచలనానికి తెరతీయగా ఇపుడు ఈ కోవలోకి మరో టెక్ దిగ్గజం చేరారు. ఆపిల్ కో ఫౌండర్ స్టీవ్ వోజ్నియాక్ ఫేస్బుక్ ఖాతాను తొలగించి తన నిరసనను ప్రకటించారు. తాజాగా ఫేస్బుక్ స్వయంగా ప్రకటించిన వివరాల ప్రకారం పొలిటికల్ డేటా అనాలసిస్ కంపెనీ కేంబ్రిడ్జ్ అనలిటికా యూజర్ల అనుమతి లేకుండా అమెరికాలో దాదాపు 87కోట్లు, ఇండియాలో 5లక్షలకుపైగా యూజర్ల లీక్ అయిందన్నవార్త ప్రకంపనలు రేపింది. ఈ సంక్షోభం నేపథ్యంలో మల్లగుల్లాలుపడుతున్న ఫేస్‌బుక్‌కు ఇపుడు వోజ్నియాక్ రూపంలో మరో షాక్ తగిలింది. ఆపిల్ సహ-వ్యవస్థాపకుడు స్టీవ్ వోజ్నియాక్ తన ఫేస్బుక్ అకౌంట్‌ను క్లోజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఫేస్బుక్ పై పలు విమర్శలు గుప్పించారు.యూజర్లు అందించిన వ్యక్తిగత వివరాలతో ప్రకటనల ద్వారా భారీ మొత్తంలో డబ్బులు దండుకుంటోందని ఆయన మండిపడ్డారు. యూజర్ల సమాచారం ఆధారంగానే ఈ లాభాలు సాధించింది.కానీ వినియోగదారులకు ఎలాంటి లాభాలు ముట్టలేదంటూ ఆయన విమర్శించారు. యాపిల్ సంస్థ తన ఉత్పత్తుల ద్వారా లాభాలనార్జిస్తోందన్నారు. మరోవైపు గోప్యతా కుంభకోణం, ఇతర దుర్వినియోగాల నేపథ్యంలో ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ విచారణను ఎదుర్కోనున్నారు. మంగళ, బుధవారాల్లో తన సాక్ష్యాన్ని నమోదు చేయనున్నారు. -
డేటా బ్రీచ్: ఫేస్బుక్ కొత్త ఫీచర్
కోట్లాదిమంది వ్యక్తిగత సమాచారం లీక్ అయిందన్న దుమారంనుంచి బయటపడేందుకు సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్ దిద్దుబాటు చర్యలకు దిగింది. యూజర్ డేటా బ్రీచ్‌ను అడ్డుకునేందుకు ప్రైవసీ కంట్రోల్లో మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఈ క్రమంలో ఫేస్బుక్లోతాజాగా కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తేనున్నామని బుధవారం ప్రకటించింది. యూజర్ల గోప్యతను కాపాడే ప్రయత్నాల్లో భాగంగా ‘యాక్సెస్ యువర్ ఇనఫర్మేషన్’ అనే కొత్త ఫీచర్‌ను పరిశీలిస్తున్నట్టు తెలిపింది. అంతేకాదు డేటా చోరీలో థర్డ్ పార్టీ డేటా ప్రొవైడర్లకు చెక్ పెట్టేలా 'పార్టనర్ కేటగిరీలను' మూసివేస్తున్నట్లు కూడా ప్రకటించింది. రాబోయే వారాలలో డేటా సెక్యూరిటీ యూజర్ల నియంత్రణలో ఉంచడానికి అదనపు చర్యలు తీసుకుంటున్నామని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అధికారి ఎరిన్ ఎగాన్, డిప్యూటీ జనరల్ న్యాయవాది అషిలే బెరింగ్గెర్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపారు. వినియోగదారులకు వారి సమాచారం భాగస్వామ్యంపై మరింత నియంత్రణ ఇవ్వాలనే యోచనలో ఈ కొత్త గోప్యతా టూల్ ను పరిచయం చేయనున్నట్టు చెప్పింది. మెనూలో సెక్యూరిటీ షార్ట్‌కట్స్ ద్వారా యూజర్ల ఫేస్బుక్ ఖాతాలకు అదనపు భద్రతను అందించడంతోపాటు , వినియోగదారులు డేటా, యాక్టివిటీపై ఇతరుల యాక్సెస్‌ను మరింత నియంత్రిచుకోవచ్చని, యాడ్స్‌కు కూడా చెక్ పెట్టవచ్చని తెలిపారు. అయితే ఇది ఇంకా ప్రయోగదశలో ఉందనీ, త్వరలోనే ఈ ఫీచర్‌ను లాంచ్ చేస్తామని వెల్లడించారు. కాగా ఫేస్బుక్ డేటాలీక్ చేస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో సాధారణ యూజర్నుండి సెలబ్రిటీల దాకా ఫేస్బుక్ ఖాతా గోప్యతపై అందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వాట్సాప్ కో ఫౌండర్ బ్రియాన్ ప్రకనటతో డిలీట్ ఫేస్బుక్ ఉద్యమం మరింత ఊపందుకుంది. మరోవైపు బాలీవుడ్ నటుడు ఫరాన్ అక్తర్ ఫేస్బుక్ అకౌంట్‌ను శాశ్వతంగా డిలీట్ చేస్తున్నట్టు ప్రకటించిన తెలిసిందే. -
ఫేస్‌బుక్‌పై ఎఫ్‌టీసీ విచారణ షురూ!
వాషింగ్టన్: ఫేస్బుక్ డేటా బ్రీచ్‌పై విచారణను యుఎస్ ఫెడరల్ ట్రేడ్ కమీషన్ (ఎఫ్‌టీసీ) ధృవీకరించింది. అమెరికా బ్రిటిష్ కంపెనీ కేంబ్రిడ్జ్ ఎనలిటికాతో సంబంధాలు, 5కోట్ల ఖాతాదారుల వ్యక్తిగత డేటా దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో ఫేస్బుక్, గోప్యతా అభ్యాసాలపై విచారణ కొనసాగుతోందని బ్యూరో ఆఫ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్టింగ్ డైరెక్టర్ టామ్ పాల్ వెల్లడించారు. ఎఫ్‌టీసీ చట్ల నిబంధనల ఉల్లంఘనతోపాటు, వినియోగదారులకు హాని కలిగించే అక్రమ చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని సోమవారం జారీ చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఫేస్బుక్ ప్రైవసీ ఆచరణపై తీవ్ర ఆందోళన రేపిన ఇటీవల ప్రెస్ నివేదికలను పరిశీలిస్తున్నామని, వినియోగదారుల ప్రైవసీ భద్రతకు తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామని పాల్ చెప్పారు. ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా పరిగణిస్తున్నామన్నారు. మరోవైపు అమెరికాలోని 37 రాష్ట్రాలకు చెందిన అటార్నీ జనరల్స్ ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌కు ఒక లేఖ రాశారు. కోట్లాది వినియోగదారుల డేటా లీక్‌పై వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతూ లేఖ రాశారు. అనుమతి లేకుండా వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్నిథర్డ్ పార్టీకు ఎలా అందిస్తారంటూ ఈ లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గోప్యతపై చేసిన వాగ్దానాలను భంగపరిచిన ఫేస్‌బుక్‌ను యూజర్లు ఇపుడు ఎలా విశ్వసిస్తారని ప్రశ్నించారు. తమ నమ్మకం వమ్ము అయిందని పేర్కొన్నారు. వినియోగదారుల డేటాను తారుమారు చేయడంలో ఫేస్బుక్ పాత్రపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. న్యూజెర్సీ అటార్నీ జనరల్ గుర్బీర్ ఎస్ గ్రేవల్ సహా 37మంది అటార్నీ జనరల్స్ స ఈ లేఖపై సంతకాలు చేశారు. కాగా అమెరికా ఎన్నికల సందర్భంగా ఫేస్బుక్ తన ఖాతాదారుల డేటాను కేంబ్రిడ్జి ఎనలిటికాకు విక్రయించిందన్న వార్త ప్రకంపనలు పుట్టించింది. దీంతో తప్పు ఒప్పుకున్న ఫేస్బుక్ వ్యవస్థాపకుడు జుకర్‌బర్గ్ క్షమాపణ కోరడంతోపాటు, దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టు ప్రకటించారు. అలాగే బ్రిటన్, అమెరికాలోని ప్రముఖ పత్రికల్లో ప్రకటనల రూపంలో క్షమాపణలు కోరారు. యూజర్ల సమాచారాన్ని భద్రంగా ఉంచాల్సిన బాధ్యత తమపై ఉందనీ అది చేయలేకపోతే ఈ స్థానానికి అనర్హులమంటూ ప్రకటనలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే టాప్ టెక్ కంపనీలు ఫేస్బుక్ పేజీలను డిలీట్ చేయడంతో ఈ వివాదంలో యూజర్ల భద్రతపై ఆందోళన మరింత ముదురుతోంది. -
నమో బాటలోనే కాంగ్రెస్ యాప్..
సాక్షి, పాట్నా : ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నమో యాప్ యూజర్ల అనుమతి లేకుండానే వారి డేటాను అమెరికన్ కంపెనీకి పంపుతోందని ఫ్రెంచ్ హ్యాకర్ ఎలియట్ అల్డర్సన్ ఆరోపించిన క్రమంలో తాజాగా కాంగ్రెస్ యాప్ సైతం సింగపూర్‌లోని ఓ కంపెనీకి సమాచారాన్ని చేరవేస్తోందని సంకేతాలు పంపారు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి కాంగ్రెస్ అధికారిక యాప్ ద్వారా సభ్యత్వానికి ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే వారి వ్యక్తిగత వివరాలు పార్టీ సభ్యత్వ ఆన్లైన్ పేజ్‌కు హెచ్‌టీటీపీ ద్వారా వెళతాయని అల్డర్సన్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ మెంబర్షిప్ పేజ్ ఐపీ అడ్రస్ సింగపూర్‌లోని ఓ సర్వర్‌కు అనుసంధానమైందని చెప్పుకొచ్చారు. అల్డర్సన్ ట్వీట్ నేపథ్యంలో కాంగ్రెస్ తీరును పలువురు ట్విటర్ యూజర్లు తప్పుపట్టారు. మరోవైపు వేరొక దేశంలో సర్వర్లు ఉన్నంతమాత్రాన డేటా లీకవుతుందనేందుకు వీలులేదని మరికొందరు చెబుతున్నారు. రాజకీయ కోణంలోనే అల్డర్సన్ ఇలాంటి ట్వీట్లు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే సాంకేతిక అంశాలను ప్రజల ముందుంచేందుకే తన ప్రయత్నమని ఇందులో తనకెలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని ఫ్రెంచ్ హ్యాకర్ అల్డర్సన్ చెప్పుకొచ్చారు. కాగా, ఐఎన్‌సీ అధికారిక యాప్‌లో భద్రతా లోపాలపై ఫ్రెంచ్ హ్యాకర్ ట్వీట్ చేసిన గంటకే గూగుల్ ప్లేస్టోర్ నుంచి తన యాప్‌ను కాంగ్రెస్ తొలగించింది. మరోవైపు కాంగ్రెస్ యాప్‌ను తొలగించడంపై బీజేపీ స్పందించింది. నమోయాప్ను డిలీట్ చేయాలని డిమాండ్ చేసిన రాహుల్ చివరకు కాంగ్రెస్ యాప్‌నే తొలగించారని ఆ పార్టీ ఎద్దేవా చేసింది. -
‘రాహుల్ మాటలు నమ్మొద్దు’
సాక్షి, న్యూఢిల్లీ : నమో యాప్‌లో డేటా ఉల్లంఘనలపై మోదీ సర్కార్‌ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. ‘మీ డేటాను అమెరికాలోని ప్రైవేట్ కంపెనీకి ప్రధాని నరేంద్ర మోదీ అప్పగిస్తారని మీరు అనుకుంటున్నారా...ఇలాంటి అవాస్తవ కథనాలను విశ్వసించకండ’ ని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ సహాయ మంత్రి కేజే అల్ఫోన్స్ అన్నారు. ఆధార్‌లో ప్రజలు పేరు, చిరునామాలే ఇస్తారని, యూఐడీఏఐ వద్ద ఉండే బయోమెట్రిక్ డేటా బహిర్గతం కాదని తాను ప్రజలకు హామీ ఇస్తానన్నారు. అయితే ఆధార్ సమాచారాన్ని ఉపయోగించుకునేందుకు ప్రభుత్వ ఏజెన్సీలకు తాము అనుమతిస్తామని స్పష్టం చేశారు. కాగా, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ నమో యాప్ డేటా ఉల్లంఘనలకు పాల్పడుతోందని ట్వీట్ చేశారు. అమెరికన్ కంపెనీలకు యూజర్ల సమాచారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అమ్మచూపుతున్నారని ఫ్రెంచ్ హ్యాకర్ ప్రకటనల ఆధారంగా రాహుల్ ప్రధానిని టార్గెట్ చేస్తూ ట్వీట్ల దాడి సాగించారు. కీలకమైన ఈ వ్యవహారాన్ని ఎత్తిచూపడంలో మీడియా అలసత్వం ప్రదర్శిస్తోందని కూడా రాహుల్ ఆరోపించారు. -
షాకింగ్: వేలాది పీఎన్బీ కార్డుల డేటా లీక్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ స్కాంగా నిలిచిని పంజాబ్నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో మరిన్ని షాకింగ్ విషయాలు తాజాగా వెలుగు చూశాయి. పీఎన్బీకి చెందిన వేలాదిమంది వినియోగదారుల కార్డుల సమాచారం హ్యాకింగ్‌కు గురైనట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. కస్టమర్లకు చెందిన గోప్యమైన విషయాలు వెబ్సైట్లో అమ్మకానికి అందుబాటులో ఉన్నాయనీ, కనీసం మూడు నెలలుగా ఈ పక్రియ కొనసాగుతున్నట్టు నివేదించింది. బెంగళూరులోని సింగపూర్-రిజిస్టర్డ్ కంపెనీ ఈ డేటీ చోరికి పాల్పడినట్టు హాంకాంగ్ ఆధారిత పత్రికనుటంకిస్తూ ఆసియా నెట్వర్క్ రిపోర్ట్ చేసింది దాదాపు పీఎన్బీకి చెందిన 10వేల వినియోగదారుల సమాచారం లీక్ అయినట్టు తెలిపింది. ఇది గూగుల్ లాంటి ఇతర సెర్చ్ సైట్లలో ఇది కనిపించదనీ, కానీ చట్టవిరుద్ధంగా సున్నితమైన సమాచారం, కొనుగోలు, విక్రయాలు చేస్తాయని క్లౌడ్ సెక్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ టెక్ అధికారి రాహుల్ శశి తెలిపారు. సీవీవీ సహా పేర్లు, గడువు తేదీలు, వ్యక్తిగత గుర్తింపు సంఖ్యలు , కార్డ్ ధృవీకరణ ఇతర డేటా అమ్మకానికి అందుబాటులో ఉన్నాయన్నారు. ఇలా రెండు సెట్ల డేటా అందుబాటులో ఉన్నట్టు చెప్పారు. సీవీవీ నెంబర్‌తో సహా కొందరివి, లేకుండా కొంత డేటా బహిర్గమైందన్నారు. డేటాలో చివరి స్టాంపు తేదీ జనవరి 29, 2018 ఉందనీ, అంటే ఇప్పటికీ వేలసంఖ్యలో పీఎన్బీ డేటా వారికి అందుబాటులో ఉన్నట్టుగా భావించాలన్నారు. మరోవైపు దీన్ని ధృవీకరించిన పీఎన్బీ అధికారి విర్వానీ..దీనిపై ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్టు తెలిపారు. దీంతో పీఎన్బీ కార్డుదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. -
ఆధార్ హ్యాకింగ్‌పై స్పందించిన నీలేకని
సాక్షి, బెంగళూరు: ఆధార్ డేటా హ్యాకింగ్‌పై యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) మాజీ ఛైర్మన్ నందన్ నీలేకని ఎట్టకేలకు స్పందించారు. ఆధార్‌ను అప్రతిష్ట పాలు చేసేందుకే ఆధార్‌పై కావాలనే బురద చల్లుతున్నారని మండిపడ్డారు. ఆధార్‌ను దుర్వినియోగపరిచేందుకు "కల్పిత ప్రచారం" చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ అవార్డ్ కార్యక్రమం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రిబ్యూన్ కేసులో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ గురించి ప్రస్తావిస్తూ ఆధార్‌పై నిర్మాణాత్మక దృష్టిలేకుండా.. ప్రతికూల అభిప్రాయాలతో ఉంటే.. చర్యలు కూడా ప్రతికూలంగానే ఉంటాయన్నారు. అందువల్ల ప్రజలు నిర్మాణాత్మక అభిప్రాయాన్ని కలిగి ఉండటం మంచిదని పేర్కొన్నారు. మరోవైపు యుఐడిఎఐ తాజా విధానాన్ని నందన్ నీలేకని స్వాగతించారు. ఈ వ్యవహారంలో ఆధార్ సంస్థ కీలక ప్రకటన చేసిందని ప్రశంసించారు. ఇక ప్రతివారు తమ వర్చువల్ ఐడీ క్రియేట్ చేసుకోవచ్చని, ఇది చాలా ముఖ్యమైన ఫీచర్లను అందిస్తోందని చెప్పారు. దీంతో ఆధార్ నెంబర్‌ను వెల్లడి చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అలాగే ఇతర ఏజెన్సీలు ఆధార్ నెంబర్లను సేకరించే ఛాన్స్ ఉండదని తెలిపారు. అటు సుప్రీకోర్టు ఆధార్‌ను గుర్తిస్తుందనే నమ్మకం తనకుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కాగా ఆధార్ వివరాలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రమవుతున్న నేపథ్యంలో యూనిక్ ఐడెంటిటీ అథారిటీ ఆఫ్ ఇండియా యూఐడీఏఐ చర్యలు చేపట్టింది. వర్చువల్ ఐడీ, పరిమిత కేవైసీ కోడ్ అనే రెండంచెల వ్యవస్థను ప్రవేశపెట్టనుంది. తాత్కాలిక వర్చువల్ ఐడీని జారీ చేసే విధానాన్ని ఇప్పటికే అభివృద్ధి చేస్తోంది. మార్చి ఒకటి నుంచి ఇది పూర్తిస్థాయి అమల్లోకి రానుంది. -
5వేల యుఐడిఎఐ అధికారులకు షాక్
సాక్షి, న్యూఢిల్లీ: ఆధార్ డేటా బ్రీచ్ వ్యవహారం పై యుఐడిఎఐ సంచలన నిర్ణయం తీసుకుంది. అన్ని స్థాయిల్లో భారీ సంఖ్యలో ఉద్యోగులపై ఆంక్షలు విధిస్తూ అధికారులకు షాకిచ్చినట్టు తెలుస్తోంది. యుఐడిఎఐ వ్యవస్థలో యాక్సెస్‌పై దాదాపు 5వేల మంది అధికారుల అధికారాలను కోత పెట్టిందని సీనియర్ అధికారి వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఎకనామిక్స్ టైమ్స్ నివేదించింది. ఆధార్ యాక్సెస్ కోసం అధికారులకు ఇచ్చిన అన్ని ప్రత్యేక అధికారాలను తక్షణమే ఉపసంహరించుకుందని పేరు చెప్పడానికి ఇష్టపడని సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు.యుఐడిఎఐ వ్యవస్థను పునఃపరిశీలిస్తున్న నేపథ్యంలో సంబంధిత అధికారి వివరాలను పూర్తిగా పరిశీలించిన అనంతరం కేవలం బయోమెట్రిక్ ద్వారా మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుత వ్యవస్థ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కొంతమంది ప్రభుత్వ అధికారులతోపాటు ఇతర ప్రైవేట్ ఆపరేటర్లకు "పరిమితమైన" యాక్సెస్ ఉంది. ముఖ్యంగా 12 ఏళ్ల ప్రత్యేక గుర్తింపు సంఖ్యను నమోదు చేయడం ద్వారా పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొదలైన ఆధార్ హోల్డర్ వివరాలను వీక్షించేందుకు వీరికి అనుమతి ఉంది. తద్వారా ఆధార్‌లో మార్పులు, చేర్పులు చేసేందుకు అవకాశం కల్పించింది. ఆధార్ మార్పుల కోసం 5 లక్షల రిక్వెస్టులు యుఐడిఎఐ వస్తున్నాయిని తెలిపారు. తాజా మార్పు ప్రకారం ఆధార్ కార్డ్ హోల్డర్ వేలిముద్రల ద్వారా యాక్సెస్‌ను ప్రామాణీకరిస్తారు. దీంతో అందుబాటులో ఉన్న సమాచారం ఆ వ్యక్తికి పరిమితం చేయబడుతుంది. ఈ చర్య తాత్కాలికంగా కొంత ఇబ్బంది కలిగించినప్పటికీ భవిష్యత్తులో హ్యాకింగ్‌లను నివారించగలదని భావిస్తున్నామని అధికారి తెలిపారు. కాగా కేవలం రూ.500లకే ఆధార కార్డ్ డేటా వివరాలు లభ్యమని ది ట్రిబ్యూన్ వార్తాపత్రిక నివేదించడం సంచలనం రేపింది. అయితే ఈ వార్తలను ఖండించిన యుఐడిఎఐ సదరు జర్నలిస్టుపై కేసు నమోదు చేయడం మరింత విమర్శలకు దారి తీసింది. -
యుఐడిఎఐ అధికారులను అరెస్ట్ చేయండి!
అమెరికన్ విజిల్ బోయర్ ఎడ్వర్డ్ స్నోడెన్ మరోసారి ఆధార్ హ్యాకింగ్ వివాదంపై స్పందించారు. ఆధార్ డేటా హ్యాకింగ్‌పై సమాచారం అందించిన రిపోర్టర్‌కు మద్దతుగానిలిచిన ఆయన భారత ప్రభుత్వం చర్యలపై అభ్యంతరం వక్తం చేశారు. మంగళవారం ట్విట్టర్ ద్వారా స్పందించిన స్నోడెన్ లీకింగ్‌ను బయటపెట్టిన జర్నలిస్టుపై చర్యలుకాదు.. లీకింగ్ వ్యవహారం, అక్రమాలపై విచారణ చేపట్టాలంటూ ప్రభుత్వానికి ఒక గట్టి హెచ్చరిక చేశారు. ఈ అక్రమాలను బయటపెట్టిన జర్నలిస్టుపై విచారణకు బదులుగా, యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) అధికారులను శిక్షించాలనిహితవు పలికారు. నిజానికి ఆధార్ డేటా ఉల్లంఘనను బయటపెట్టిన ఆ జర్నలిస్టుకు అవార్డు దక్కాలి గానీ, విచారణ కాదు అని ట్వీట్ చేశారు. భారత ప్రభుత్వం నిజంగా న్యాయం చేయాలనుకుంటే కోట్లాది భారతీయుల గోప్యతను నాశనం చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా సంస్కరణలను ప్రవేశపెట్టాలన్నారు. దీనికి బాధ్యులైనవారిని అరెస్ట్ చేయాలనుకుంటే.. యుఐడిఎఐ వారిని అరెస్ట్ చేయాలని స్నోడెన్ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇటీవల ఆధార్ డేటా కేవలం రూ.500 లకే మార్కెట్లో లభ్యమవుతోందన్న వార్తలపై కూడా స్నోడెన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. The journalists exposing the #Aadhaar breach deserve an award, not an investigation. If the government were truly concerned for justice, they would be reforming the policies that destroyed the privacy of a billion Indians. Want to arrest those responsible? They are called @UIDAI. https://t.co/xyewbK2WO2 — Edward Snowden (@Snowden) January 8, 2018 -
ఆధార్ డేటా హ్యాకింగ్‌పై స్పందించిన ప్రభుత్వం
సాక్షి, న్యూఢిల్లీ: ఆధార్ భద్రతపై మరోసారి ఆందోళనలను చెరలేగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఆధార్ సమాచారం హ్యాకింగ్ నుంచి పూర్తిగా సురక్షితమని యుఐఎఐ (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) మరోసారి స్పష్టం చేసింది. కేవలం రూ. 500కే పది నిముషాల్లో కోట్లాది మంది ఆధార్ వివరాలు బహిర్గతం అన్న వార్తలపై స్పందించిన యుఐఎఐ ఇవి పూర్తిగా నిరాధారమైనవని, ఇలాంటి రూమర్లను వ్యాప్తి చేయడం ప్రజలను తప్పుదారి పట్టించడమేనని కొట్టిపారేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నుండి సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ, ఆధార్ వ్యవస్థ పూర్తిగా సురక్షితమైందని, దీని గోప్యతపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని హామీ ఇచ్చారు. ఈ వ్యవహారంపై విచారణ అనంతరం సంబంధిత వ్యక్తికి షోకాజ్ నోటీసు జారీ చేయనున్నట్టు వెల్లడించారు. పేటీఎం ద్వారా రూ.500 చెల్లిస్తే పది నిముషాల్లో ఆధార్ డేటా హ్యాకింగ్. ఓ రాకెట్ గ్రూప్ లోని ఏజెంట్ లాగిన్, ఐడీ, పాస్ వర్డ్ ఇస్తారని, ఈ పోర్టల్ లో ఏ ఆధార్ నెంబరును నమోదు చేసినా ఈ సంస్థ వద్ద నమోదైన ఆ వ్యక్తి డీటైల్స్ అన్నీ అందుతాయని వార్తలు వచ్చాయి. వందల కోట్లకు పైగా భారతీయుల ఆధార్ వివరాలను ఐదు వందల రూపాయలకే అందజేయనున్నామంటూ వాట్సాప్ లో ఓ అజ్ఞాత గ్రూప్ విక్రయదారులు చెబుతున్నారని, ఇది తమ ఇన్వెస్టిగేషన్ లో వెల్లడైందని ” ది ట్రిబ్యూన్ ” పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆధార్ డేటా బయటికి పొక్కడం లేదా చోరీకి గురి కావడంవంటిదేదీ జరగడానికి ఆస్కారం లేదని ఈ సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. వ్యక్తుల డేటా పూర్తి సురక్షితంగా, భద్రంగా ఉంటుందని ప్రభుత్వం హామీ ఇచ్చింది. -
చరిత్రలో అతిపెద్ద సైబర్ దాడి!
-
చరిత్రలో అతిపెద్ద సైబర్ దాడి!
న్యూయార్క్: ప్రముఖ ఇంటర్నెట్ దిగ్గజం యాహూ ఖాతాలో మరోసారి పెద్ద ఎత్తున హ్యాక్ అయ్యాయి. గతంలోనే ఒకసారి తమ ఖాతాలు భారీగా హ్యాకింగ్ కు గురయ్యాయని ధృవీకరించిన యాహూ మరోసారి షాకింగ్ న్యూస్ వెల్లడించింది. తమ ఖాతాలపై మరో మేజర్ సైబర్ ఎటాక్ జరిగిందని యాహూ వెబ్ సైట్ లో ప్రకటించింది. దాదాపు 100కోట్ల (1బిలియన్)కు పైగా ఖాతాలు హ్యాక్ అయినట్టు ప్రకటించడం ఆందోళన రేపింది. తమ వినియోగదారుల ఖాతాల నుంచి వ్యక్తిగత సమాచారం అపహరణకు గురైనట్టు తెలిపింది. 2013 ఆగస్టులో జరిగిన ఈ దాడి చరిత్రలోనే అతిపెద్ద సైబర్ దాడిగా పేర్కొంది. ఈ నేపథ్యంలో తమ యూజర్లకు పలు సూచనలు చేస్తూ తమ పాస్వర్డ్లు, సెక్యూరిటీ ప్రశ్నల సమాధానాలు మార్చుకోవాలని యూహూ పేర్కొంది. దీంతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో పడిన యాహూ మరిన్ని కష్టాల్లో చిక్కుకుపో్యింది. 2014లోనూ యాహూ తమ నెట్వర్క్ నుంచి 50 కోట్ల యూజర్ల అకౌంట్ల వివరాలు హ్యాకింగ్‌కు గురయ్యాయని తెలిపింది. 50 కోట్ల యూజర్ల సమాచారం హ్యాకింగ్ గురవడమే ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద సైబర్ నేరంగా ఉంది. అయితే, తాజాగా 100 కోట్ల మంది యూజర్ల అకౌంట్లు హ్యాకింగ్ గురయ్యాయని తెలపడం కలకలం రేపుతోంది. గతంలో తమ యూజర్ల వివరాలను తస్కరించిన హ్యాకర్లు అప్పటి లాగే ఇప్పుడు కూడా యూజర్ల పేర్లు, ఈమెయిల్ ఐడీలు, టెలిఫోన్ నంబర్లు, పాస్‌వర్డ్‌లతో పాటు, ఎన్క్రిప్టెడ్, అన్ ఎన్క్రిప్టెడ్ సెక్యూరిటీ ప్రశ్నలు, సమాధానాలు అపహరించినట్లు తెలిపింది. అయితే తమ యూజర్లకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ సమాచారం, పేమెంట్ డేటా మాత్రం అపహరణకు గురికాలేదని యాహూ స్పష్టం చేసింది. కాగా ఇంటర్నెట్ వ్యాపారాన్ని అమ్మకానికి పెట్టిన సంస్థ అష్టకష్టాలు పడింది. చివరికి అమెరికా టెలికాం కంపెనీ వెరిజాన్ 4.8బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. అయితే యాహూ న్యూస్ సర్వీస్ తోపాటు, బ్లాగింగ్ ప్లాట్ ఫాం టంబ్లర్, ఫోటో షేరింగ్ సైట్ ఫ్లికర్, యాహూ ఫినాన్స్ ద్వారా టెక్ సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. -
భారీ అకౌంట్ల చోరీపై యాహూ ధ్రువీకరణ
వందల మిలియన్ యూజర్ అకౌంట్ల డేటా దొంగతనానికి పాల్పడినట్టు యాహూ కంపెనీ బహిరంగంగా ధ్రువీకరించబోతుంది. ఈ విషయంపై అధికార వర్గాలు ఓ ప్రకటన విడుదలచేశాయి. వందల మిలియన్ యాహూ యూజర్ అకౌంట్లు ఈ చోరీ బారిన పడినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. యూజర్ అకౌంట్ల హ్యాకింగ్ విషయం ఆగస్టులోనే బయటికి వచ్చింది. దాదాపు 200 మిలియ్ యాహూ యూజర్ అకౌంట్ ఆధారాలను పీస్ అనే హ్యకర్ అమ్మకానికి పెట్టినట్టు రిపోర్టు వచ్చాయి. సుమారు 1,07,000కు ఈ అకౌంట్లను రియల్డీల్ మార్కెట్ ప్లేస్‌లో హ్యాకర్ అమ్మకానికి పెట్టాడని వార్తలు గుప్పుమన్నాయి. అయితే దీనిపై విచారణ కొనసాగుతుందని, చోరీపై యూజర్లు కంగారు పడాల్సిన పనిలేదని యాహూ భరోసా ఇచ్చింది. కానీ ప్రస్తుతం ఈ అకౌంట్ల చోరిని యాహూ సైతం ధ్రువీకరించేందుకు సిద్దమైంది. ఈ డేటాలో యూజర్ల పాస్వర్డ్లు, వ్యక్తిగత సమాచారం, ఇతర ఈమెయిల్ అడ్రస్‌లు ఉన్నాయి. ఇటీవలే యాహూ కోర్ వ్యాపారాలైన ఇంటర్నెట్ ఆస్తులను వెరిజోన్ సుమారు రూ.32,500 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కొనుగోలు ప్రక్రియ ముగింపు దశకు వస్తున్న నేపథ్యంలో ఈ హ్యాకింగ్‌ను యాహూ ధృవీకరిస్తున్నట్టు వెల్లడవడం, ఆ కంపెనీపై ఎలాంటి ప్రభావం చూపనుందోనని మార్కెట్ వర్గాల్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ ఒప్పందం ముగిసే వరకు సీఈవో మారిస్సా మేయర్ రాజీనామా చేయబోతున్నారనే వార్తలు సైతం హల్ చల్ చేస్తున్నాయి.