
TikTok May Owe You Money From Its $92 Million Data Privacy Settlement: చైనాకు చెందిన షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ అమెరికన్ యూజర్లకు సుమారు రూ. 683 కోట్లను చెల్లించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 1 వరకు టిక్‌టాక్‌లో నమోదైన యూజర్లకు ఈ మొత్తాన్ని చెల్లించనుంది. క్లాస్ యాక్షన్ సెటిల్‌మెంట్‌లో భాగంగా టిక్‌టాక్ యూజర్లకు రూ. 683 కోట్లను పొందడానికి అర్హులు. అందులో భాగంగా టిక్‌టాక్ ఇప్పటికే అర్హత కల్గిన 89 మిలియన్ల అమెరికన్ యూజర్లకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్‌ను పంపినట్లు తెలుస్తోంది.
చదవండి: ప్రపంచంలో అత్యంత పొడవైన కారును చూశారా..!
ఎందుకంటే..!
యూఎస్ యూజర్ల నుంచి వ్యక్తిగత డేటాను వారి అనుమతి లేకుండా టిక్‌టాక్ సేకరించిందనే దావాలు నిరూపితమయ్యాయి. అంతేకాకుండా బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ ప్రైవసీ చట్టాన్ని టిక్‌టాక్ పూర్తిగా ఉల్లంఘించిందని తెలుస్తోంది. క్లాస్ యాక్షన్ వేసిన దావాపై టిక్‌టాక్ ఖండిస్తూనే...అమెరికాలోని యూజర్లకు 92 మిలియన్ డాలర్లను చెల్లించడానికి టిక్‌టాక్ అంగీకరించడం గమనార్హం.
అర్హత కల్గిన టిక్‌టాక్ యూజర్లు తమ మాస్టర్‌కార్డ్ , పే పాల్, వెన్మో ద్వారా చెల్లింపులను క్లెయిమ్ చేసుకోవచ్చునని టిక్‌టాక్ పేర్కొంది. అర్హత ఉన్న ప్రతి వ్యక్తి క్లెయిమ్ చేస్తే...సుమారు 5 డాలర్ల నుంచి 0.89 డాలర్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి: షాకిచ్చిన ఫోక్స్‌వ్యాగన్! సైలెంట్‌గా ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత?
Comments
Please login to add a commentAdd a comment