ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ ‘టిక్ టాక్’ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో కంటెంట్ క్రియేటర్లు లబ్ధి చేకూరేలా డబ్బులు సంపాదించుకునే (మానిటైజేషన్) మార్గాన్ని మరింత సులభతరం చేసింది. అందుకు టిక్ టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్‌పై అమెరికా ఒత్తిడే కారణమని తెలుస్తోంది.
టిక్ టాక్‌లో కంటెంట్ క్రియేటర్లు ఏదైనా అంశం మీద వీడియోలు చేస్తుంటారు. ఫలితంగా 5వే ఫాలోవర్స్ ఉన్న టిక్ టాక్ ఛానెల్ క్రియేటర్.. తన ఛానెల్ ద్వారా ఏదైనా వస్తువును సేల్ చేసి అఫిలేట్ మార్కెటింగ్ చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు. తాజాగా, ఆ ఫాలోవర్ల సంఖ్యని 1000కి తగ్గించింది.
అఫిలేట్ మార్కెటింగ్ అంటే?
అమెజాన్, ఇతర అఫిలేట్ నెట్ వర్క్ వెబ్‌సైట్‌లలో యూజర్లకు ఏదైనా నచ్చిన ప్రొడక్ట్‌ను వివిధ మార్గాల్లో అంటే ఫేస్‌బుక్, వెబ్‌సైట్లు, బ్లాగ్స్, యూట్యూబ్ ఛానెల్స్‌లో ప్రమోషన్ చేసి వాటిని అమ్మాల్సి ఉంటుంది. అలా అమ్మితే అమెజాన్ అందుకు ప్రొడక్ట్‌ను బట్టి 10 నుంచి 20 శాతం వరకు కమిషన్‌ను అందిస్తుంది.
న్యాయ పరమైన ఇబ్బందుల్లో టిక్ టాక్
చైనాకు చెందిన టిక్ టాక్ అమెరికాలో న్యాయ పరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. టిక్‌టాక్‌లో డేటా భద్రతపై అగ్రరాజ్యం ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తోంది. పలు సందర్భాలలో టిక్ టాక్‌పై బ్యాన్ విధించే ప్రయత‍్నాలు ముమ్మరం చేసింది. అయితే బ్యాన్ తర్వాత ఎదురయ్యే ఆర్ధికపరమైన పర్యవసానాల గురించి ఆలోచించి వెనక్కి తగ్గింది.
టిక్‌టాక్‌పై వరుస పిటిషన్‌లు
నిషేధ చట్టం న్యాయ విభాగం టిక్‌టాక్‌పై అనుమానం వ్యక్తం చేసింది. 170 మిలియన్ల యూజర్ల డేటాను ప్రమాదంలో పడేసిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌లో డేటా భద్రతపై అనుమానం వ్యక్తం చేసిన అమెరికన్ టిక్ టాక్ యూజర్లు కోర్టులో వరుస పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టింది.
అమ్ముతారా? లేదంటే బ్యాన్ చేయమంటారా?
ఈ సందర్భంగా టిక్ టాక్‌ను అమెరికన్ సంస్థకు అమ్మాలని, లేదంటే నిషేధం విధిస్తామని తెలుపుతూ హౌస్ బిల్లుపై జో బైడెన్ సంతకం చేశారు. అందుకు 270 రోజులు గడువు ఇచ్చింది. అదీ సాధ్యం కాకపోతే మరో 90 రోజుల పొడిగింపుతో టిక్ టాక్‌ను అమెరికన్ సంస్థకు అమ్మాలని లేదంటే దేశంలో నిషేధం ఎదుర్కొవాల్సి ఉంటుందని ఆదేశించింది.
మానిటైజేషన్ నిబంధనల్ని తగ్గించి
దీంతో బైట్ డాన్స్ పై ఒత్తిడి ఎక్కువయింది. ఈ క్రమంలో మానిటైజేషన్ నిబంధనల్ని తగ్గిస్తూ టిక్ టాక్ నిర్ణయం తీసుకున్నట్లు పలు మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై బైట్ డ్యాన్స్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment