amarica
-
‘ఈవీ’లు... టైంబాంబులు!
“టిక్.. టిక్.. టిక్..” అంటూ నిశ్శబ్దంగా ఆడుతున్న టైంబాంబులు అవి! ఆదమరిస్తే ఏ క్షణమైనా అంటుకోవచ్చు. కన్ను మూసి తెరిచేంతలో ఉవ్వెత్తున మంటలు చెలరేగవచ్చు. విధ్వంసం సృష్టించవచ్చు. ప్రాణాలు తీయవచ్చు. ఆస్తినష్టం కలిగించవచ్చు. ఇంతకీ ఏమిటవి అంటారా? కాలుష్యం కలిగించకుండా పర్యావరణానికి ఎంతో మేలు చేస్తున్నాయని మనం ఎంతో గొప్పగా చెబుతున్న ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ). అమెరికాలో తాజాగా విరుచుకుపడుతున్న హరికేన్ ‘మిల్టన్’ మరో ఉపద్రవాన్ని మోసుకొస్తోంది. ఈవీలు, హైబ్రిడ్ వాహనాలు వంటి రీఛార్జి బ్యాటరీ ఆధారిత ఇంధనాన్ని వాడే వస్తువాహనాలతో ప్రస్తుతం అమెరికన్లకు ముప్పు పొంచివుంది.ఇదంతా వాటిలోని లిథియం-అయాన్ బ్యాటరీలతోనే. ఎలక్ట్రిక్ కార్లు మాత్రమే కాకుండా రీఛార్జి బ్యాటరీల శక్తితో పనిచేసే స్కూటర్లు, బైకులు, హోవర్ బోర్డులు, వీల్ ఛైర్లు, లాన్ మూవర్స్, గోల్ఫ్ కార్లు, బొమ్మలతోనూ ఇకపై అప్రమత్తంగా మెలగక తప్పదు. హరికేన్ ‘మిల్టన్’ ఉప్పునీటి వరద ముంపు బారినపడిన ఈవీలను అగ్నికీలలు చుట్టుముట్టే అవకాశముంది. హరికేన్ల ప్రభావంతో 15 అడుగుల లోతుతో ఉప్పునీటి వరద నీరు చేరుకునే తీరప్రాంతాలు అమెరికాలో చాలా ఉన్నాయి.కొద్ది రోజుల క్రితం హరికేన్ ‘హెలెన్’ వచ్చిపోయాక అమెరికాలో పలు చోట్ల లిథియం-అయాన్ బ్యాటరీలు వేడెక్కి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ల కారణంగా 48 ఎలక్ట్రిక్ వస్తువాహనాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఫ్లోరిడాలోని ఓ ఇంటి గ్యారేజీలో నిలిపివుంచిన టెస్లా కారు ఇటీవలి ‘హెలెన్’ ప్రభావపు ఉప్పునీటి ముంపు కారణంగా మంటల్లో ఆహుతి కావటంతో ఆ ఇంట్లోని వారు భయంతో బయటకు పరుగులు తీశారు. గతంలో 2022లో సంభవించిన హరికేన్ ‘ఇయాన్’ సందర్భంగానూ అమెరికాలో పలు ఈవీలు అగ్నికి ఆహుతయ్యాయి.తొలుత వేడి... తర్వాత మంటలు! ఈవీల్లో లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ లోపల సెల్స్, జ్వలించే స్వభావం గల విద్యుద్వాహక ద్రావణి ఉంటాయి. ఉప్పునీరు విద్యుద్వాహకం. ఈ-బైకులతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాలు లేదా ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వాహనాల్లో వెయ్యి రెట్లు ఎక్కువగా సెల్స్ (చిన్న ఘటాలు) ఉంటాయి. ఎక్కువ సెల్స్ ఉండే హై ఎనర్జీ బ్యాటరీలు విఫలమయ్యే అవకాశాలు మరింత అధికం. సాధారణ వర్షపు నీటితో లేదా నదుల మంచినీటితో తలెత్తే ముంపుతో ఈవీలకు పెద్దగా నష్టం ఉండదు. కానీ ఎక్కువ కాలం... అంటే కొన్ని గంటలు లేదా ఒకట్రెండు రోజులపాటు ఉప్పునీటిలో వాహనాలు మునిగితే మాత్రం ఉప్పు వల్ల ఈవీ ‘బ్యాటరీ ప్యాక్’ దెబ్బతింటుంది.ఉప్పునీటికి ‘తినివేసే’ (కరోజన్) లక్షణం ఉంది. బ్యాటరీ లోపలికి ఉప్పునీరు చేరాక విద్యుద్ఘటాల్లోని ధనాత్మక, రుణాత్మక టెర్మినల్స్ మధ్య కరెంటు ప్రవహించి షార్ట్ సర్క్యూట్లు సంభవిస్తాయి. ఫలితంగా వేడి పుడుతుంది. విద్యుద్ఘటాలను వేరు చేసే ప్లాస్టిక్ లైనింగ్ ఈ వేడికి కరిగిపోతుంది. దాంతో వేడి ఓ శృంఖల చర్యలాగా (థర్మల్ రన్ అవే) ఒక విద్యుద్ఘటం నుంచి మరో విద్యుద్ఘటానికి ప్రసరించి మరిన్ని షార్ట్ సర్క్యూట్లతో విపరీతంగా వేడిని పుట్టిస్తుంది. అలా చివరికి అగ్గి రాజుకుని వాహనాలు బుగ్గి అవుతాయి.ఎత్తైన ప్రదేశాలకు తరలించాలి హరికేన్లు తీరం దాటడానికి మునుపే ప్రజలు అప్రమత్తమై తమ ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈవీలు తుపాన్ల ఉప్పునీటిలో తడవకుండా, వరద ముంపులో నానకుండా వాటిని ఎత్తైన, సురక్షిత ప్రదేశాల్లో భద్రంగా పార్క్ చేయాలి. ఇంటికి కనీసం 50 అడుగుల దూరం అవతల వాటిని పార్క్ చేయడం వల్ల రిస్క్ తగ్గుతుంది. తుపాన్లు/హరికేన్లు దాటిపోయాక రీ-స్టార్ట్ చేయడానికి ముందు బ్యాటరీ వాహనాలను ఖాళీ ప్రదేశాలకు తరలించాలి.వాటిని మెకానిక్ సాయంతో అన్ని రకాలుగా పరీక్షించాకే పునర్వినియోగంలోకి తేవాలి. వరద నీటిలో మునిగిన వాహనాలను పరీక్షించకుండా నేరుగా కరెంటు ప్లగ్గులో వైరు పెట్టి వాటిని రీఛార్జి చేయడానికి ఉపక్రమించరాదు. ఆ వాహనాలను ఇళ్లలోనే ఉంచి రీ-స్టార్ట్ చేస్తే లిథియం-అయాన్ బ్యాటరీలు వేడెక్కి, మంటలు అంటుకుని గృహాలు సైతం అగ్నిప్రమాదాల బారినపడవచ్చు. హరికేన్ ‘మిల్టన్’ నేపథ్యంలో ఈవీల వినియోగదారులకు పలు హెచ్చరికలు చేస్తూ ఫ్లోరిడా ఫైర్ మార్షల్ జిమ్మీ పాట్రోనిస్ ఓ ప్రకటన విడుదల చేశారు.- జమ్ముల శ్రీకాంత్ (Courtesy: The New York Times, The Washington Post, CBS News, Business Insider) -
అమెరికాలో భారతీయులకు గుడ్‌న్యూస్.. మూడేళ్లు పొడిగింపు
అమెరికాలో గ్రీన్ కార్డ్ పునరుద్ధరణ కోసం సుదీర్ఘంగా నిరీక్షిస్తున్న భారతీయులకు ఆ దేశ ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. ఇటువంటివారి గ్రీన్ కార్డ్ చెల్లుబాటును 36 నెలలు పొడిగిస్తున్నట్లు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) ప్రకటించింది.ఈ నిర్ణయం సెప్టెంబర్ 10 నుండి అమలులోకి వచ్చింది. యూఎస్సీఐఎస్ ప్రకారం.. గడువు ముగిసిన లేదా ముగింపునకు వచ్చిన గ్రీన్ కార్డ్ పునరుద్ధరణ కోసం ఫారమ్ I-90ని సమర్పించిన దరఖాస్తుదారులకు ప్రయోజనం చేకూరుతుంది. ఫారమ్ I-90 రసీదు ఉన్నవారికి గతంలో గ్రీన్ కార్డ్ చెల్లుబాటు పొడిగింపు 24 నెలలు ఉండేది. ఇప్పడది 36 నెలలు అయింది.గ్రీన్‌కార్డ్ కాల వ్యవధి ముగిసినప్పుడు యూఎస్‌లో నివాసముంటున్నవారు తమ చట్టపరమైన స్థితికి రుజువుగా గడువు ముగిసిన గ్రీన్ కార్డ్‌తో పాటు కార్డ్ పొడిగింపు నోటీసులను సమర్పించవచ్చు. కొత్త కార్డు కోసం వేచి ఉన్నప్పుడు ఇది ఉపాధి అధికారంగా కూడా పనిచేస్తుంది.అమెరికాలో పనిచేసే వృత్తి నిపుణులకు శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డును జారీ చేస్తారు. దీని కాల వ్యవధి పదేళ్లు ఉంటుంది. ఆ తర్వాత దీన్ని పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. గడువు ముగిసినవెంటనే కానీ లేదా మరో 6 నెలల్లో గడువు ముగుస్తుందనగా కానీ పునరుద్ధరణకు దరఖాస్తు చేసుకోవచ్చు.గ్రీన్ కార్డ్ హోల్డర్లు యునైటెడ్ స్టేట్స్ నుంచి బయటి దేశాలకు రాకపోకలు సాగించవచ్చు. అయితే ఏడాది కంటే ఎక్కువ కాలం దేశం విడిచి ఉండేందుకు వీలుండదు. ఒక వేళ అలా ఉంటే వారి గ్రీన్ కార్డ్ రద్దవుతుంది. వారు మళ్లీ దీని కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. -
ట్రంప్ ‘ఐ హేట్ టేలర్ స్విప్ట్’ పోస్ట్.. క్యాష్ చేసుకున్న పాప్ స్టార్
అమెరికన్ పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్.. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న కమలా హారిస్ కి మద్దతుగా నిధులు సేకరిస్తున్నారు. ఐ హేట్ టేలర్ స్విప్ట్ అంటూ ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్ ను టేలర్ స్విప్ట్ అస్త్రంగా మలుచుకున్నారు. ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా స్విప్టీస్ ఫర్ కమలా అని పిలిచే టేలర్ స్విప్ట్ అభిమానుల సంస్థ కమలా హారిస్ ప్రచారం కోసం 40వేల డాలర్లకు పైగా నిధుల్ని సేకరించినట్లు ప్రకటించింది. అమెరికన్ పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్.. అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రత్యర్థి కమలా హారిస్‌కి తాను ఓటు వేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. అయితే టేలర్ స్విఫ్ట్ నిర్ణయంపై డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డారు. ఐ హేట్ టేలర్ స్విప్ట్ అంటూ తన సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్ వేదికగా పోస్ట్ చేశారు. అంతేకాదు హారిస్ కు మద్దతు పలికిన టేలర్ స్విఫ్ట్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. అయితే ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్ ను ఉపయోగించిన టేలర్ స్విప్ట్ అభిమానులు ఈ భారీ మొత్తంలో నిధులు సేకరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా .. ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్ ను మేం ఒక అవకాశంగా మరల్చుకున్నాం. సోషల్ మీడియాలో ట్రంప్ కామెంట్స్ ను ఉపయోగించి ప్రచారం చేశాం. ప్రచారం మంచి ఫలితాల్ని అందించింది.మేము ప్రజల దృష్టిని ఆకర్షించడానికి మీమ్లను ఉపయోగిస్తాము. వాటి అనుగుణంగా నెటిజన్ల భావోద్వేగాల్ని తమకు అనుగుణంగా ఎలా మార్చుకోవాలో తెలుసు. వాస్తవానికి ద్వేషించేవారు ద్వేషిస్తారని మాకు (టేరల్ స్విప్ట్ అభిమానులు)తెలుసు. అలా ద్వేషించేవాళ్ల కంటే మేం ఇంకా మంచి పనులు చేయగలమని తెలుసు అని కమల ఫర్ స్విఫ్టీస్ కమ్యూనికేషన్స్ టీమ్ మెంబర్ కార్లీ లాంగ్ వ్యాఖ్యానించారు. -
అమెరికాలో సీఎం రేవంత్ టీమ్ బిజీబిజీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో ఒక వైపు సీఎం రేవంత్ రెడ్డి మరో వైపు మంత్రి శ్రీధర్ బాబు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా పలు కంపెనీల సీనియర్ లీడర్షిప్ టీమ్‌తో చర్చించారు. ఈ సమావేశానికి తెలంగాణ ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు హాజరు అయ్యారు.కాగా, ఆపిల్ సంస్థ హెడ్ క్వార్టర్ ఆపిల్ పార్క్‌ను సీఎం రేవంత్ బృందం సందర్శించనున్నారు. ఆపిల్ మ్యానిఫాక్చర్ టీమ్‌తో సీఎంతో పాటు, మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి భేటీ కానున్నారు.ట్రినేట్ కంపెనీ సీఈఓతో కూడా చర్చించనున్న సీఎం.. ఆరమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీతో భేటీ అయి హైదారాబాద్‌లో ఆ కంపెనీ డేటా సెంటర్ల విస్తరణ కోసం చర్చలు జరపనున్నారు. పలువురు టెక్ కంపెనీల ప్రతినిధులతో లంచ్ మీటింగ్ నిర్వహించనున్నారు. అంగెన్ సంస్థ సీనియర్ లీడర్‌షిప్‌తో పెట్టుబడులపై చర్చించనున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాల సంస్థ రెనేశాస్, మ్యానిఫాక్చర్ సంస్థ అమాట్‌తో పెట్టబడులపై చర్చించనున్న సీఎం.. పలు బిజినెస్ సంస్థలతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనున్నారు. -
అమెరికాలో ఎన్ఆర్ఐల అతిపెద్ద కమ్యూనిటీ సెంటర్
ప్రవాస భారతీయులకు సంబంధించి అమెరికా చరిత్రలో ఒక కొత్త శకం మొదలైంది. జూన్ 15న ఇల్లినాయిస్లోని షాంబర్గ్‌లో మొట్టమొదటి, అతిపెద్ద యూఎస్ ఇండియన్ కమ్యూనిటీ సర్వీస్ సెంటర్ నేషనల్ ఇండియా హబ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా అహింసా విశ్వభారతి వ్యవస్థాపకుడు ఆచార్య డాక్టర్ లోకేష్ ముని సమక్షంలో యోగా ఫెస్ట్ నిర్వహించారు.కమ్యూనిటీ, సాంస్కృతిక, వినోద కేంద్రం అయిన ఈ హబ్ భారతీయ అమెరికన్ల ఐక్యతకు దోహదం చేస్తుంది. లాభాపేక్షలేని కేంద్రం లక్ష్యం అన్ని యూఎస్ కమ్యూనిటీలను, అన్ని వయసుల వర్గాలను సానుకూలంగా ప్రభావితం చేయడానికి రూపొందించిన సమగ్ర సేవలు, కార్యకలాపాలను అందించడం, ఆశావాదం, పురోగతి భావాన్ని పెంపొందించడం.1,10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన క్లాస్-ఏ భవనమైన నేషనల్ ఇండియా హబ్‌ను కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి, చికాగో ఇండియన్ కాన్సులేట్ గౌరవ కాన్సుల్ జనరల్ సోమనాథ్ ఘోష్, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి, రాయబారి డాక్టర్ ఔసఫ్ సయీద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు నేషనల్ ఇండియా హబ్ నాయకత్వాన్ని ప్రశంసించారు. ఇది యూఎస్‌లో మోడల్ కమ్యూనిటీ సెంటర్‌గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.నేషనల్ ఇండియా హబ్ ఫౌండర్, చైర్మన్ హరీష్ కొలసాని వార్తా మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కేంద్రం లక్ష్యం, విజన్ ను పంచుకున్నారు. ఈ ఐకానిక్ సెంటర్ ప్రపంచంలోనే అతిపెద్ద భారతీయ కమ్యూనిటీ సెంటర్ గా నిలుస్తుందని, సరిహద్దులు లేకుండా సమాజానికి సేవ చేయడానికి అంకితమైన 60కి పైగా సేవా సంస్థలు ఇందులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఒకే గొడుగు కింద అత్యధిక సేవా సంస్థలను కలిగి ఉన్న హబ్ ఇప్పటికే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కు అర్హత సాధించిందని వివరించారు. -
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఓహియో రాష్ట్రంలోని ఓ నైట్ క్లబ్లో గుర్తు తెలియని అంగతకులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ పోలీస్ గ్రెగ్ బోడ్కర్ ప్రకారం..అవలోన్ డాన్స్ క్లబ్లో తెల్లవారుజామున సుమారు 1:45 గంటలకు క్లబ్‌కు వచ్చిన వారి మధ్య వాగ్వాదం తలెత్తిందని, దీంతో ఆగ్రహానికి గురైన నిందితుడు కాల్పులు జరిపినట్లు చెప్పారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన బాధితుల పరిస్థితి విషయం ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ఈ కాల్పులు జరిపింది ఎవరు? అందుకు కారణాలు. నిందితులు వివరాల గురించి స్పష్టత రావాల్సి ఉండగా.. మరణించిన బాధితుల వయస్సు 20 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని స్థానిక పోలీసులు వెల్లడించారు. -
ఆ దేశానికి వెళ్లొద్దు.. అమెరికా హెచ్చరిక
వెనిజులా దేశ సందర్శనకు ఎవరూ వెళ్లొద్దని అమెరికా తమ పౌరులను హెచ్చరించింది. పౌర అశాంతి, నియంతృత్వం వైపు పయనించడం, నిరంతర ఉగ్రవాద బెదిరింపులు, అమెరికా వ్యతిరేక సెంటిమెంట్ పెరుగుతన్న నేపథ్యంలో వెనిజులా సందర్శన విషయంలో అమెరికా అత్యున్నత స్థాయి ప్రయాణ సలహాను మరోసారి జారీ చేసింది.వెనిజులా సందర్శనలో అత్యవసర పరిస్థితులు ఎదురైతే తాము ఏమీ చేయలేమని అమెరికా పౌరులను ఆ దేశ ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. అక్కడ పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని, తప్పనిసరై వెనిజులాను సందర్శించాలనుకునేవారు తమ కుటుంబ సభ్యులు, కావాల్సినవారితో 'ప్రూఫ్ ఆఫ్ లైఫ్' ప్రోటోకాల్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నాన్నారు. ఎవరైనా కిడ్నాప్, అపహరణ లేదా నిర్బంధానికి గురైనప్పుడు ఆ వ్యక్తి ఇంకా జీవించి ఉన్నాడా లేదా అని ధ్రువీకరించుకునేందుకు పాటించే ప్రక్రియే ఈ ప్రూఫ్ ఆఫ్ లైఫ్ ప్రోటోకాల్. వెనిజులాలో అమెరికా పౌరులను అక్రమంగా నిర్బంధించే ప్రమాదం ఉందని, అక్కడి భద్రతా దళాలు అమెరికా పౌరులను ఐదేళ్ల వరకు నిర్బంధించాయని విదేశాంగ శాఖ తెలిపింది.విస్తారమైన కరేబియన్ సముద్రతీరానికి, సుందరమైన ద్వీపాలకు వెనిజులా ప్రసిద్ధి. ఒకప్పుడు ఏటా లక్షలాది అమెరికన్ పర్యాటకులు ఈ దేశాన్ని సందర్శించేవారు. 2013లో నియంత హ్యూగో చావెజ్ మరణం తరువాత నికోలస్ మదురో అధికారం చేపట్టినప్పటి నుంచి సందర్శకుల సంఖ్య బాగా క్షీణించింది. 2019లో వెనిజులా నుంచి అమెరికా సిబ్బందిని ఉపసంహరించుకోవడం ప్రారంభించినప్పుడు మొదటిసారి ఇలాంటి హెచ్చరికను జారీ చేసిన అమెరికా.. ఇప్పుడు మరోసారి తమ పౌరులను హెచ్చరించింది. -
అమెరికాలో టిక్ టాక్.. ‘ఇక డబ్బులు సంపాదించడం చాలా ఈజీ’
ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ ‘టిక్ టాక్’ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో కంటెంట్ క్రియేటర్లు లబ్ధి చేకూరేలా డబ్బులు సంపాదించుకునే (మానిటైజేషన్) మార్గాన్ని మరింత సులభతరం చేసింది. అందుకు టిక్ టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్‌పై అమెరికా ఒత్తిడే కారణమని తెలుస్తోంది. టిక్ టాక్‌లో కంటెంట్ క్రియేటర్లు ఏదైనా అంశం మీద వీడియోలు చేస్తుంటారు. ఫలితంగా 5వే ఫాలోవర్స్ ఉన్న టిక్ టాక్ ఛానెల్ క్రియేటర్.. తన ఛానెల్ ద్వారా ఏదైనా వస్తువును సేల్ చేసి అఫిలేట్ మార్కెటింగ్ చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు. తాజాగా, ఆ ఫాలోవర్ల సంఖ్యని 1000కి తగ్గించింది.అఫిలేట్ మార్కెటింగ్ అంటే?అమెజాన్, ఇతర అఫిలేట్ నెట్ వర్క్ వెబ్సైట్లలో యూజర్లకు ఏదైనా నచ్చిన ప్రొడక్ట్‌ను వివిధ మార్గాల్లో అంటే ఫేస్బుక్, వెబ్సైట్లు, బ్లాగ్స్, యూట్యూబ్ ఛానెల్స్‌లో ప్రమోషన్ చేసి వాటిని అమ్మాల్సి ఉంటుంది. అలా అమ్మితే అమెజాన్ అందుకు ప్రొడక్ట్‌ను బట్టి 10 నుంచి 20 శాతం వరకు కమిషన్‌ను అందిస్తుంది. న్యాయ పరమైన ఇబ్బందుల్లో టిక్ టాక్ చైనాకు చెందిన టిక్ టాక్ అమెరికాలో న్యాయ పరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. టిక్‌టాక్‌లో డేటా భద్రతపై అగ్రరాజ్యం ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తోంది. పలు సందర్భాలలో టిక్ టాక్‌పై బ్యాన్ విధించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అయితే బ్యాన్ తర్వాత ఎదురయ్యే ఆర్ధికపరమైన పర్యవసానాల గురించి ఆలోచించి వెనక్కి తగ్గింది. టిక్‌టాక్‌పై వరుస పిటిషన్లు నిషేధ చట్టం న్యాయ విభాగం టిక్‌టాక్‌పై అనుమానం వ్యక్తం చేసింది. 170 మిలియన్ల యూజర్ల డేటాను ప్రమాదంలో పడేసిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌లో డేటా భద్రతపై అనుమానం వ్యక్తం చేసిన అమెరికన్ టిక్ టాక్ యూజర్లు కోర్టులో వరుస పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టింది.అమ్ముతారా? లేదంటే బ్యాన్ చేయమంటారా?ఈ సందర్భంగా టిక్ టాక్‌ను అమెరికన్ సంస్థకు అమ్మాలని, లేదంటే నిషేధం విధిస్తామని తెలుపుతూ హౌస్ బిల్లుపై జో బైడెన్ సంతకం చేశారు. అందుకు 270 రోజులు గడువు ఇచ్చింది. అదీ సాధ్యం కాకపోతే మరో 90 రోజుల పొడిగింపుతో టిక్ టాక్‌ను అమెరికన్ సంస్థకు అమ్మాలని లేదంటే దేశంలో నిషేధం ఎదుర్కొవాల్సి ఉంటుందని ఆదేశించింది.మానిటైజేషన్ నిబంధనల్ని తగ్గించిదీంతో బైట్ డాన్స్ పై ఒత్తిడి ఎక్కువయింది. ఈ క్రమంలో మానిటైజేషన్ నిబంధనల్ని తగ్గిస్తూ టిక్ టాక్ నిర్ణయం తీసుకున్నట్లు పలు మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై బైట్ డ్యాన్స్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. -
అమెరికాలో తగ్గిన నిరుద్యోగం
వాషింగ్టన్: అమెరికాలో గతవారం నిరుద్యోగ భృతి కోసం అప్లయి చేసుకునే వారి సంఖ్య తగ్గినట్లు తెలుస్తోంది. లేబర్ డిపార్ట్మెంట్ గణాంకాల ప్రకారం.. మే 18తో ముగిసిన వారానికి స్టేట్ అన్ఎంప్లాయిమెంట్ బెన్ఫిట్స్ కోసం అప్లయి చేసుకునే వారి సంఖ్య 8,000 తగ్గి 215,000కి చేరింది. ఆర్థికవేత్తల అంచనా ప్రకారం తాజా వారంలో 220,000మంది నిరుద్యోగ భృతి కోసం అప్లయి చేసుకునే అవకాశం ఉందని అంచనా వేశారని రాయిటర్స్ కథనం వెల్లడించింది. మార్చి 2022 నుండి ఫెడరల్ రిజర్వ్ నుండి 525 బేసిస్ పాయింట్ల విలువైన వడ్డీ రేటు పెంపు నేపథ్యంలో లేబర్ మార్కెట్ స్థిరంగా కొనసాగుతున్నట్లు తేలింది. -
‘జెల్లె స్కామ్’.. డబ్బులు పోగొట్టుకున్న అమెరికన్ బ్యూటీ
అమెరికన్ బ్యూటీ బ్రియానా సియాకా ‘జెల్లె స్కామ్’లో డబ్బులు పోగొట్టుకున్నారు. ఈ స్కామ్ పట్ల అందరూ అప్రమత్తంగా హెచ్చరించారు. అసలేంటీ స్కామ్, డబ్బులు ఎలా పోగొట్టుకున్నది ఆమె వివరించారు.న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. యూఎస్‌లో మాజీ మిస్ న్యూయార్క్ అయిన బ్రియానా సియాకా టిక్‌టాక్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఇద్దరు యువకులు తన నుంచి 2,000 డాలర్లు (రూ. 1.66 లక్షలు) ఎలా లాక్కున్నారో వివరించారు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్న సియాకా, తాను మాడిసన్ స్క్వేర్ పార్క్‌లో కూర్చుని పాడ్‌కాస్ట్ వింటుండగా ఇద్దరు కుర్రాళ్లు తన వద్దకు వచ్చి తమ బాస్కెట్‌బాల్ జట్టు కోసం నిధులు సేకరిస్తున్నామని, తమకు సహాయం చేయాలని కోరారని చెప్పారు.తాను వారికి కొంత డబ్బు ఇవ్వడానికి అంగీకరించానని, కానీ తన వద్ద నగదు లేకపోవడంతో జెల్లె యాప్ ద్వారా చెల్లించేందుకు ఒప్పుకొన్నట్లు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తమ అకౌంట్ వివరాలు నమోదు చేసేందుకు తన ఫోన్ తీసుకున్నాడని, మరో కుర్రాడు తనను మాటల్లో పెట్టగా అతను తన అకౌంట్ నుంచి 2,000 డాలర్లు వారి ఖాతాకు మళ్లించుకున్నారని వివరించారు. న్యూయార్క్ పోలీసుల ప్రకారం, ఇది చాలా సాధారణమైన స్కామ్. దీని దుండగులు విరాళాల పేరుతో డబ్బును స్వాహా చేస్తారు."నేను ఆశ్చర్యపోయాను. ఈ అబ్బాయిలు చాలా మంచిగా, అమాయకంగా మాట్లాడితే వారు నిజంగానే తమ జట్టు కోసం విరాళాలు సేకరిస్తున్నారని అనుకున్నాను" అని సియాకా చెప్పారు. జెల్లె (Zelle) అనేది జేపీ మోర్గాన్ చేజ్, బ్యాంక్ ఆఫ్ అమెరికాతో సహా ఏడు బ్యాంకుల యాజమాన్యంలోని పీర్-టు-పీర్ నెట్వర్క్. 2017లో ప్రారంభమైన జెల్లె అతిపెద్ద యూఎస్ పీర్-టు-పీర్ చెల్లింపుల నెట్‌వర్క్‌లలో ఒకటిగా ఎదిగింది. -
పదండి.. డైనోసార్లను వేటాడుదాం!
ఒకప్పుడు అడవుల్లో వేట కామన్. నాడు రాజులు సరదాకి చేస్తే.. ఆదివాసీలు ఇప్పటికీ ఆహారం కోసం వేటాడుతుంటారు. ఏ జింకలో, అడవి పందులో అయితే సరే. మరీ పులిని వేటాడాలంటే కష్టం. అది నిషేధం కూడా. మరి ఏకంగా డైనోసార్‌నే వేటాడాలనుకుంటే.. అందుకు అఫీషియల్‌గా లైసెన్స్ కూడా ఇస్తే.. ఆశ్చర్యంగా అనిపిస్తోందా.. ఆ సంగతులేమిటో తెలుసుకుందామా.. అది డైనోసార్ ల్యాండ్.. ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల డైనోసార్ల అవశేషాలు బయటపడినా.. అమెరికా మాత్రం స్పెషల్. ఒకప్పుడు భారీ సంఖ్యలో డైనోసార్లు తిరుగాడిన నేల అది. అందులోనూ ఉటా రాష్ట్రంలోని వెర్నల్ ప్రాంతంలో వేలకొద్దీ డైనోసార్ల శిలాజాలను గుర్తించారు. మనం డైనోసార్లను వేటాడటానికి అధికారికంగా లైసెన్సులు ఇచ్చేది కూడా ఇక్కడే. దానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. పర్యాటకులు అక్కడికి వెళ్లినప్పుడు దరఖాస్తు చేసుకుంటే లైసెన్స్ ఇచ్చేస్తారు. కానీ వేటాడటానికి డైనోసార్లు దొరుకుతాయా అని మాత్రం అడగొద్దు సుమా. పర్యాటకం కోసం.. శిలాజాల గుర్తింపు కోసం.. ఉటా ప్రాంతంలో పర్యాటకాన్ని పెంచేందుకు, డైనోసార్ల శిలాజాల వెలికితీతకు ఊపునిచ్చేందుకు 1951లో ‘డైనోసార్ హంటింగ్ లైసెన్స్’లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ ప్రాంతానికి ‘డైనోసార్ కంట్రోల్ ఏరియా ఆఫ్ యూంటా కౌంటీ’ అని పేరు పెట్టారు. ఈ వినూత్న ఆలోచనతో పర్యాటకులు కూడా పెరిగారు. ఏటా 60 వేల మందికే లైసెన్స్‌లు ఇస్తారు. అంతేకాదు చాలా రూల్స్ కూడా పాటించాల్సి ఉంటుంది. ►లైసెన్స్ పొందినవారు టీ–రెక్స్ డైనోసార్లలో కేవలం ఒక పెద్ద మగదానిని మాత్రమే వేటాడాలి. ►ఒక డిప్లోడాకస్ గిగాంటికస్ (అతిభారీ శాఖాహార డైనోసార్)ను వేటాడొచ్చు. అయితే దాని బరువు 5 వేల పౌండ్లు (2,268 కేజీలు)కన్నా ఎక్కువగా ఉండాలి ►ఏవైనా రెండు మగ స్టెగోసార్ (వీపుపై ముళ్లలా ఉండేవి) డైనోసార్లను వేటాడొచ్చు. ►టెరోడాక్టిల్ (పక్షుల్లా ఎగిరేవి) డైనోసార్లను అయితే నాలుగింటిని వేటాడొచ్చు. అయితే ఇందులో పిల్ల డైనోసార్లు ఉండొద్దు. కుప్పలు కుప్పలుగా డైనోసార్ల ఎముకలు ఉటా స్టేట్‌లోని వెర్నల్ ప్రాంతంలో సుమారు రెండు లక్షల ఎకరాల ప్రాంతంలో ‘డైనోసార్ నేషనల్ మాన్యుమెంట్’ ఉంది. దీన్నే డైనోసార్ ల్యాండ్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతమంతా సుమారు 15 కోట్ల ఏళ్ల కిందటి డైనోసార్ల శిలాజాలు ఉన్నాయి. కొన్నిచోట్ల పదుల కొద్దీ డైనోసార్ల శిలాజాలు కుప్పల్లా ఉండటంతో.. ‘డైనోసార్ ఎముకల క్వారీ’లుగా వ్యవహరిస్తుండటం గమనార్హం. పర్యాటకులు ఈ ప్రాంతంలో కలియదిరగవచ్చు. కొన్ని డైనోసార్లను ముట్టుకోవచ్చు కూడా. ..మరి పదండి.. డైనోసార్లను వేటాడుదాం.. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
రిలయన్స్ స్నాక్స్ బిజినెస్.. భారత్‌లోకి అమెరికన్ బ్రాండ్ చిప్స్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ రంగంలో కార్యకలాపాలు మరింతగా విస్తరించే క్రమంలో అమెరికాకు చెందిన బ్రాండెడ్ కన్జూమర్ ఫుడ్స్ తయారీ సంస్థ జనరల్ మిల్స్‌తో రిలయన్స్ రిటైల్ చేతులు కలిపింది. తద్వారా అత్యంత వేగంగా ఎదుగుతున్న స్నాక్స్ ఉత్పత్తుల విభాగంలోకి అడుగుపెట్టింది. దేశీ మార్కెట్లో అలాన్స్ బ్యూగుల్స్ బ్రాండ్ కార్న్ చిప్స్ స్నాక్స్‌ను ప్రవేశపెట్టినట్లు రిలయన్స్ రిటైల్‌లో భాగమైన రిలయన్స్ కన్జూమర్ ప్రోడక్ట్స్, (ఆర్సీపీఎల్) తెలిపింది. ముందుగా కేరళతో ప్రారంభించి ఇతర రాష్ట్రాల్లో క్రమంగా వీటిని అందుబాటులోకి తేనున్నట్లు వివరించింది. వీటి ధర రూ. 10 నుంచి ప్రారంభమవుతుంది. 110 బిలియన్ డాలర్ల ఎఫ్ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్) మార్కెట్లో గణనీయ మార్కెట్ వాటాను దక్కించుకునే ప్రయత్నాల్లో భాగంగా ఆర్సీపీఎల్ ఇటీవల క్యాంపా, సోస్యో, రస్కిక్, టాఫీమ్యాన్ తదితర బ్రాండ్స్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: రిలయన్స్ రిటైల్ చేతికి లోటస్ చాకొలెట్లు -
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. భారతీయ టెక్కీ దుర్మరణం
ఫ్లోరిడా: అమెరికాలో సోమవారం (మే 15) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ భారతీయ టెక్కీ దుర్మరణం చెందారు. ఫ్లోరిడా రాష్ట్రంలోని తాంపాలో పాదచారుల క్రాస్ వద్ద రోడ్డు దాటుతున్న మరియప్పన్ సుబ్రమణియన్ (32)ను ఓ కారు రెడ్ సిగ్నల్‌ను జంప్ చేసి వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. మరియప్పన్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. ఆయన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కంపెనీలో టెస్ట్ లీడ్‌గా పనిచేస్తున్నారు. మరియప్పన్‌కు భార్య, నాలుగేళ్ల కొడుకు ఉన్నారు. వీరు భారత్‌లో ఉంటున్నారు. కాగా మరియప్పన్ ఈ మధ్యనే జాక్సన్విల్లే నుంచి తాంపాకు వచ్చారు. మరియప్పన్ కుటుంబానికి సహాయం అందించేందుకు ‘గో ఫండ్ మీ’ అనే పేజీ ద్వారా ఫండ్ రైజింగ్ చేపట్టారు. అలాగే తాంపా, జాక్సన్విల్లే ప్రాంతాల్లోని కమ్యూనిటీ గ్రూప్ సభ్యులు మరియప్పన్ మృత దేహాన్ని భారత్‌లోని కుటుంబ సభ్యుల వద్దకు చేర్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇదీ చదవండి: అమెరికాలో అదృశ్యమైన ఎన్ఆర్ఐ లహరి మృతి -
మూత పడనున్న మరో బ్యాంక్? షేర్లు భారీగా పతనం...
అమెరికా సిలికాన్ బ్యాంక్ దివాలా తర్వాత అమెరికాకు చెందిన మరో బ్యాంక్ మూతవేత దిశగా పయనిస్తోంది. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ బ్యాంక్‌తోపాటు మరో ఐదు బ్యాంకింగ్ సంస్థలను మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ డౌన్‌గ్రేడ్ కోసం పరిశీలనలో ఉంచింది. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ షేర్లు ఆదివారం (మార్చి12న) ఓపెనింగ్‌లో రికార్డు స్థాయిలో 67 శాతం పడిపోయాయి. ఫెడరల్ రిజర్వ్, జేపీ మోర్గాన్ చేజ్ అండ్ కోతో సహా ఒప్పందాల కార్యకలాపాల నిర్వహణ కోసం 70 బిలియన్ డాలర్లకుపైగా అన్ఓపెన్డ్ లిక్విడిటీని కలిగి ఉన్నట్లు బ్యాంక్ ప్రకటించినప్పటికీ షేర్ల పతనం ఆగలేదు. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనం తర్వాత స్టాక్ మార్కెట్లో పెద్ద బ్యాంకింగ్ సంస్థలు ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాయి. మూడీస్ పరిశీలనలో ఉంచిన బ్యాంకుల్లో ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌తో పాటు వెస్ట్రన్ అలయన్స్ బాన్‌కార్ప్, ఇంట్రస్ట్ ఫైనాన్షియల్ కార్ప్, యూఎంబీ ఫైనాన్షియల్ కార్పొరేషన్, జియన్స్ బాన్‌కార్ప్, కొమెరికా ఇంక్ సంస్థలు ఉన్నాయి. బ్యాంకింగ్ సంస్థలు బీమా చేయని నిధుల లిక్విడిటీపై ఆధారపడటం, పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలలో అవాస్తవిక నష్టాలపై క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడిస్ ఆందోళన వ్యక్తం చేసింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ షేర్లు 61.83 శాతం తగ్గాయి. గత వారంలో ఈ బ్యాంక్ స్టాక్ విలువ 74.25 శాతం పడిపోయింది. ఇంతకుముందు ట్రేడింగ్ రోజున దీని విలువ ఒక్కో షేరుకు 19 డాలర్ల కనిష్ట స్థాయికి చేరుకుంది. సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ పతనానికి చేరుకునే ముందు ఇలాంటి సంకేతాలకే ఇచ్చాయి. ట్రేడింగ్ నిలిపేసే ముందు ప్యాక్‌వెస్ట్ బ్యాంక్ షేర్లు 82 శాతం క్షీణించాయని, వెస్ట్రన్ అలయన్స్ బాన్‌కార్ప్ సంస్థ షేర్లు సగానికి పైగా పడిపోయాయని వియాన్ అనే సంస్థ నివేదించింది. -
నాటి పేపర్ బాయ్.. నేడు అమెరికాలో సైంటిస్టు
కడప సెవెన్‌రోడ్స్(వైఎస్సార్ జిల్లా): కన్నవారు దూరమైన దుర్భర బాల్యం. ఇతరుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బతకాల్సిన దైన్యం. అవమానాలు, ఆటంకాలు, మరెన్నో ప్రతిబంధకాలు. కష్టాలన్నీ కట్టకట్టుకు వచ్చినా ఆయన పట్టుదల, పరిశ్రమ ముందు అవి తలవంచక తప్పలేదు. బాల్యంలోనే ఎన్నో సవాళ్లను చెరగని చిరునవ్వుతో ఎదుర్కొన్నారు. ఒకప్పుడు వీధుల్లో పేపర్ బాయ్‌గా తిరిగిన ఓ యువకుడు అంచెలంచెలుగా ఎదిగి నేడు అమెరికాలో మంచి సైంటిస్టుగా రాణిస్తున్నారు. ప్రస్తుతం ‘‘సెంటర్ ఫర్ రీ జనరేటివ్ స్పోర్ట్స్ మెడిసిన్’’ డిప్యూటీ డైరెక్టర్‌గా మల్టీ డిసిప్లినరి రీసెర్చి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఎన్నో అద్భుత విజయాలు తన ఖాతాలో వేసుకుని నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న కడప నాగరాజుపేటకు చెందిన ఆయన పేరు డాక్టర్ రావూరి సుదీర్‌కుమార్. బాల్యం గడిచిందిలా! పసితనంలోనే తల్లిదండ్రులు దూరం కావడంతో అవ్వ చల్లా కమలమ్మ అక్కున చేర్చుకుంది. ఐదవ తరగతి వరకు నాగరాజుపేట గుండాచారి బడిలో చదువుకున్నారు. విశ్రాంత ఉపాధ్యాయురాలైన అవ్వ కమలమ్మకు చదువు విలువ ఏమిటో బాగా తెలుసు. చదువే నిజమైన ఆస్తి అంటూ మనవడికి తరచూ నూరిపోసేది. అవ్వ మాటలు ఆయనను ఎంతో ప్రభావితం చేశాయి. గుంతకల్లు, గుత్తిలో పిన్ని ఇంట హైస్కూల్ విద్యాభ్యాసం సాగింది. సైన్స్ పట్ల జిజ్ఞాస గుత్తి రైల్వే ఇంగ్లీషు మీడియం హైస్కూలులో తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు ఆకుల నుంచి విద్యుత్ తయారవుతుందని ‘ఎలక్ట్రానిక్స్ ఫర్ యూ’ అనే పత్రికలో చదివాడు. అందుకు జిల్లేడు, బొంత జెముడు ఆకులు పనికి వస్తాయని సు«దీర్ కనుగొన్నారు. ఇలా ఆయన బయో లాజికల్ బ్యాటరీ తయారు చేశాడు. అప్పట్లో హైదరాబాదులో జరిగిన సైన్స్ ఫెయిర్‌లో రాష్ట్రపతి వెంకట్రామన్ నుంచి సర్టిఫికెట్ అందుకున్నారు. సిమ్లాలో జరిగిన ఇంటర్ స్టేట్ సైన్స్ ఫెయిర్‌కు ఈ ప్రయోగం ఎంపికైంది. ఇంటర్మీడియేట్ కడప సెయింట్ జోసెఫ్ జూనియర్ కళాశాలలో, 1994–97లో ఆర్ట్స్ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశాడు. తాను ఇంకొకరికి భారం కారాదని భావించి పేపర్ బాయ్‌గా, వీడియో కెమెరామెన్‌గా కొన్నాళ్లు పనిచేశారు. గ్రూప్-4, బ్యాంకు పరీక్షలు రాశారు. బీఈడీలో ఉచిత సీటు వచ్చింది. సైంటిస్టు కావాలన్న బలమైన ఆకాంక్ష వల్ల వాటిని వదులుకున్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ వైరాలజీ ప్రవేశానికి కిశోర్ అనే స్నేహితుడు రూ. 400 సాయం చేసి దరఖాస్తు చేయించగా సీటు వచ్చింది. తిరుపతిలో ఉన్న మరో పిన్ని ఇంటిలో ఉంటూ చదువు కొనసాగించారు. తన ఖర్చులు తాను సంపాదించుకోవాలని ప్రైవేటు డిగ్రీ కళాశాలలో పార్ట్ టైం అధ్యాకునిగా పనిచేశారు. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా తన జుట్టు తానే కట్ చేసుకోవడం నేర్చుకున్న ఆయన ఒక సెలూన్ కూడా ప్రారంభించాలని భావించారు. వెటర్నరీ వైరాలజీ పైన ఎమ్మెస్సీ ప్రాజెక్టు వర్క్‌ను తిరుపతిలో చేశారు. 1999లో ఎమ్మెస్సీ పూర్తయ్యాక అక్కడి కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్‌లో ఐసీఏఆర్–ఐఏఆర్‌టీ ఫెలోషిప్ జాబ్ చేశారు. జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకులో ఉన్న బెంగళూరులోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్సీ)లో మోనోక్లోనల్ యాంటీ బాడీస్‌పై పనిచేశారు. వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చి ఇన్స్టిట్యూట్లో డయాగ్నస్టిక్స్ చేశారు. ఈ సమయంలో రెడ్డీస్ ల్యాబ్‌లో ఉద్యోగం వచ్చింది. అయితే అదే సమయంలో ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో హెచ్ఐవీ–1పై పనిచేసే అవకాశం తలుపు తట్టగా, దాన్నే ఎంచుకున్నారు. దీంతో ఆయన జీవితం పెద్ద మలుపు తిరిగింది. హెచ్ఐవీ సోకిన వ్యక్తిలో రోగ నిరోధకశక్తి తగ్గిపోయి త్వరగా మరణానికి చేరువవుతాడు. అలాంటి వ్యక్తుల్లో వచ్చిన జన్యుపరమైన మార్పులను గుర్తించి దానికి తగ్గట్టు కాంబినేషన్ మందుల్లో ఎలాంటి మార్పులు చేయాలన్న అంశంపై పరిశోధన చేశారు. ఆయనకు 2006లో పీహెచ్‌డీతోపాటు పేటెంట్ హక్కులు లభించాయి. అమెరికాలో పరిశోధనలు సుదీర్ అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోగల పిట్స్బర్గ్ యూనివర్సిటీకి పోస్టు డాక్టోరల్ ఫెలోషిప్‌పై వెళ్లారు. మెంటార్‌గా కూడా పనిచేశారు. రీసెర్చి అసోసియేట్‌గా తొమ్మిదేళ్లు పిట్స్‌బర్గ్‌లో ఉన్నారు. నిర్వీర్యం చేసిన హెచ్ఐవీ వైరస్‌లోకి ఉపయోగకరమైన జన్యువులను పంపి తద్వారా వచ్చిన నిర్వీర్య వైరస్‌ను మూల కణాల ఉత్పత్తి, రొమ్ము క్యాన్సర్ నిరోధానికి ఉపయోగించడంపై పరిశోధన చేశారు. కొలరాడోలోని స్టెడ్మన్ ఫిలిప్పన్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ (ఎస్‌పీఆర్‌ఐ)లో ‘వార్థక్య దశకు చెందిన కణాలను గుర్తించి నిర్మూలించడం ద్వారా మెరుగైన వృద్ధాప్య జీవితం’ అనే అంశంపై పరిశోధన చేశారు. అక్కడి ప్రసిద్ధ శాస్త్రవేత్తలతో కలిసి జీన్ థెరఫి, స్టెమ్‌సెల్ బయాలజీ, టిష్యూ ఇంజినీరింగ్ అంశాల్లో పనిచేశారు. అమెరికా ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, డిపార్టుమెంటు ఆఫ్ డిఫెన్స్, యూఎస్ ఒలంపిక్ అండ్ పారాలింపిక్ నేషనల్ మెడికల్ సెంటర్లో పరిశోధనలు చేశారు. గ్రాంట్ అవార్డ్స్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్‌గా ప్లాస్టిక్ సర్జరీ ఫౌండేషన్ గ్రాంటు, కో ఇన్వెస్టిగేటర్‌గా ఎన్ఐహెచ్, డీఓడీ ప్రభుత్వ గ్రాంటు, కో ప్రిన్సిపల్ సైంటిస్టుగా ప్రైవేటు ఇండస్ట్రీ ఫండింగ్ లభించాయి. ఎడిటోరియల్ బోర్డు మెంబర్, గెస్ట్ ఎడిటర్, సైంటిఫిక్ రివ్యూవర్‌గా పలు అంతర్జాతీయ రీసెర్చి జనరల్స్‌లో పనిచేశారు. పలు సైంటిఫిక్ సమ్మిట్స్‌కు చైర్ పర్సన్, కో చైర్ పర్సన్‌గా వ్యవహరించారు. కొలరాడో స్టేట్ యూనివర్సిటీలో అఫిలియేట్ సైంటిస్టుగా నియమితులయ్యారు. కండరాల్లో మూల కణాలు కనుగొన్న ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ జానీ హువర్డ్‌తో కలిసి ప్రస్తుతం సెంటర్ ఫర్ రీ జనరేటివ్ స్పోర్ట్స్ మెడిసిన్ (సీఆర్‌ఎస్‌ఎం)లో మల్టీ డిసిప్లినరీ రీసెర్చి ప్రాజెక్టులు నిర్వహిస్తున్నారు. చదవండి: బీజేపీకి ‘కన్నం’ అందుకేనా?.. నెక్ట్స్ ఏంటి?.. జరిగేది అదేనా? ఆకాంక్షతోపాటు నిరంతర కృషి అవసరం ఏ రంగంలోనైనా ఉన్నత స్థాయికి వెళ్లాలన్న ఆకాంక్ష ఒక్కటే ఉంటే సరిపోదు. అందుకు తగ్గట్టు నిరంతర కృషి ఉన్నప్పుడే లక్ష్యాన్ని అందుకోగలమని విద్యార్థులు గుర్తించాలి. నిరుత్సాహ పడకుండా అవకాశాలు వచ్చేంత వరకు ఓపిక అవసరం. ఒకప్పుడు ఏమీ లేని నేను ఇప్పుడు ఒక స్థాయి లో ఉన్నానంటే అది మా అవ్వ కమలమ్మ, మా ఇద్దరు పిన తల్లులతోపాటు స్నేహితులు కిశోర్, ప్రసాద్, రాజు, మేనమామ చల్లా రాజేంద్ర వరప్రసాద్ (సీఆర్వీ ప్రసాద్), టీచర్లు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఇచ్చిన సహకారమే కారణం. – -డాక్టర్ రావూరి సుధీర్‌కుమార్, నాగరాజుపేట, కడప -
టిక్‌టాక్‌కు భారీ షాక్.. యాప్‌పై అమెరికా ప్రభుత్వం నిషేధం!
భద్రతా పరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటూ అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో టిక్ టాక్‌ను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే నిషేధం దేశ మొత్తం కాకుండా కేవలం అమెరికా ప్రభుత్వ డివైజ్‌లలో వినియోగించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అందుకు సంబంధించి మార్గదర్శకాల్ని విడుదల చేసింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు టిక్ వినియోగించే అవకాశం కోల్పోనున్నారు. చైనా దేశం బైట్ డ్యాన్స్ సంస్థకు చెందిన టిక్‌టాక్ వినియోగడంతో సెక్యూరిటీ సమస్యలు ఉత్పన్నమవుతాయని అమెరికా ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేసింది. ముందస్తు చర్యల్లో భాగంగా అమెరికా కాంగ్రెస్‌లో హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ (ప్రతినిధుల సభ) టిక్ టాక్‌ను వినియోగించకుండా నిషేధం విధిస్తూ హౌస్ చీఫ్ అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్ (సీఏఓ) చట్టసభ సభ్యులు, ఇతర సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే వారు టిక్ టాక్‌ను వినియోగించేందుకు అనువుగా ఉండే అన్నీ డివైజ్‌లలో యాప్‌ను డిలీట్ చేయాలని కోరారు. ఇప్పటికే గత వారం టిక్ టాక్ యాప్ సాయంతో అమెరికన్లు, ఇతర అంతర్గత సమాచారాన్ని ట్రాక్ చేస్తుందని 19 రాష్ట్ర ప్రభుత్వాలు..గవర్నమెంట్‌కు చెందిన డివైజ్‌లలో మాత్రమే యాప్‌ను వినియోగించకుండా తాత్కాలికంగా బ్లాక్ చేశాయి. జో బైడెన్ సంతకంతో కొద్ది రోజుల క్రితం అమెరికా ప్రభుత్వం సెప్టెంబర్ 30, 2023 వరకు ఫెడరల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ విభాగాల నిర్వహణకోసం 1.66 ట్రిలియన్ డాలర్ల నిధుల విడుదల చేసేందుకు ఆమోదించింది. దీంతో పాటు టిక్‌టాక్‌పై నిషేధం విధించాలని నిర్ణయం తీసుకుంది. సంబంధిత ఫైల్స్ మీద దేశాధ్యక్షుడు జోబైడెన్ సంతకం చేస్తే.. నిషేధం వెంటనే అమల్లోకి రానుంది. అమెరికాలో యాప్‌ను నిషేధించాలని యాప్ వాడకుండా దేశవ్యాప్తంగా నిషేధాన్ని అమలు చేయాలని యూఎస్ చట్టసభ సభ్యులు ప్రతిపాదన తెచ్చారు. కానీ జోబైడెన్ ప్రభుత్వం కేవలం హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్, వారి శాఖలకు చెందిన ఉద్యోగులు టిక్‌టాక్ వినియోగంపై ఆంక్షలు విధించింది. కాగా, అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టిక్ టాక్ యాజమాన్యం బైట్‌డ్యాన్స్ స్పందించలేదు చదవండి👉 ‘నాతో గేమ్స్ ఆడొద్దు’..!, ట్విటర్ ఉద్యోగులకు ఎలాన్ మస్క్ వార్నింగ్! -
ఎవరివైనా.. ఎవరికైనా.. అవయవాలు అందరికీ..
సాక్షి సెంట్రల్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వివిధ కారణాలతో అవయవాలు దెబ్బతిని దాతల కోసం ఎదురుచూస్తున్నారు. తమ శరీరంతో మ్యాచ్ అయ్యే అవయవం ఎప్పుడు దొరుకుతుందా అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకీడుస్తున్నారు. మనుషుల్లో వేర్వేరు గ్రూపుల రక్తం ఉండటం, ఆ రక్తానికి అనుగుణంగానే అవయవాలన్నీ అభివృద్ధి చెంది ఉండటమే దీనికి కారణం. అదే ఎవరి అవయవమైనా, ఎవరికైనా అమర్చగలిగితే.. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలను కాపాడొచ్చు. ఈ అద్భుతాన్ని సాకారం చేసేదిశగా అడుగులు పడుతున్నాయ్. ఆ వివరాలేమిటో తెలుసుకుందాం.. చదవండి: ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ హాయిగా బరువు తగ్గండి.. అవయవాలు ఉన్నా.. అమర్చలేక.. ఏదైనా ప్రమాదంలోనో, బ్రెయిన్‌డెడ్ వంటి కారణాలతోనో చనిపోతున్నవారి అవయవాలను అవసరమైన వారికి అమర్చలేని పరిస్థితి అన్నిచోట్లా ఉంది. అవయవాలు ఎక్కువసేపు జీవంతో ఉండకపోవడం, వాటి పరిమాణం కూడా ఎక్కువ తక్కువగా ఉండటం, తగిన స్వీకర్తలు సమీపంలో లేకపోవడం కూడా దీనికి కారణం. ఈ నేపథ్యంలోనే.. ఏ గ్రూపు రక్తం వారి అవయవాన్ని అయినా.. మరే గ్రూపువారికైనా అమర్చగలిగే విధానంపై అమెరికాలోని టొరొంటో యూనివర్సిటీ అజ్మెరా ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్ శాస్త్రవేత్తలు పరిశోధన చేపట్టారు. పలువురు దాతల నుంచి సేకరించిన ఊపిరితిత్తులను ‘యూనివర్సల్ లంగ్స్ (ఏ రక్తం గ్రూపువారికైనా అమర్చగలిగే ఊపిరితిత్తులు)’గా మార్చగలిగారు. ఏ రక్తం వారికి.. ఎలా? సాధారణంగా మన ఎర్రరక్త కణాలపై, రక్తనాళాల లోపలి పొరలపై.. ఏ, బీ అనే రెండు రకాల యాంటీజెన్లు ఉంటాయి. ఇందులో ‘ఏ యాంటీజెన్’ ఉన్న రక్తాన్ని ‘ఏ’ గ్రూప్‌గా.. ‘బీ యాంటీజెన్’ ఉన్న రక్తాన్ని ‘బీ’ గ్రూప్‌గా.. రెండు యాంటీజెన్లు ఉన్న రక్తాన్ని ‘ఏబీ’ గ్రూపుగా.. అసలు యాంటీజెన్లు లేని రక్తాన్ని ‘ఓ’ గ్రూప్‌గా వర్గీకరించారు. ►మరోవైపు మన శరీరంలోకి ప్రవేశించే సూక్ష్మజీవులు, ఇతర జీవకణాలను నాశనం చేసే యాంటీబాడీలు కూడా రక్తంలో ఉంటాయి. ఇవి రక్తం, ఇతర కణాలపై ఉండే యాంటీజెన్లను గుర్తించి.. అవి మన శరీరానివి కాకుండా, వేరే విధంగా ఉంటే దాడి చేస్తాయి. ►ఉదాహరణకు.. రాజు రక్తం ‘ఏ’ గ్రూప్‌కు చెందినది. ఆయనకు ‘బీ’ గ్రూప్ రక్తం ఎక్కిస్తే.. ఈ రక్తంలోని ‘బీ’ యాంటీజెన్పై రాజు శరీరంలోని యాంటీబాడీలు దాడి చేస్తాయి. దీనితో రక్తం గడ్డ కట్టి మరణించే ప్రమాదం ఉంటుంది. కృత్రిమ పరికరంలో అమర్చి.. సాధారణంగా దాతల నుంచి సేకరించిన ఊపిరితిత్తులను కొంత సమయం పాటు సజీవంగా ఉంచడానికి ‘ఎక్స్ వివో లంగ్ పర్ఫ్యూజన్ (ఈవీఎల్పీ)’ అనే పరికరాన్ని వినియోగిస్తారు. దాని ద్వారా పోషకాలను, నీటిని ఊపిరితిత్తులకు అందజేస్తారు. టొరొంటో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కూడా ఈ పరికరంలో ఊపిరితిత్తులను ఉంచి ప్రయోగం చేశారు. మన జీర్ణవ్యవస్థలోని బ్యాక్టీరియాలతో.. ‘ఏ, బీ, ఏబీ’ గ్రూపుల రక్త కణాలపై ఉండే యాంటీజెన్‌ను తొలగించి.. ‘ఓ’ గ్రూపుగా మార్చడంపై ఇప్పటికే బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. ఇలా మార్చితే.. సదరు రక్తాన్ని ఎవరికైనా ఎక్కించేందుకు వీలవుతుంది. ఈ క్రమంలో మన జీర్ణవ్యవస్థ, పేగుల్లో ఉండే ఒక రకం బ్యాక్టీరియా విడుదల చేసే రెండు ఎంజైమ్‌లు (ఎఫ్పీగాలెనేస్ డీసెటైలేజ్, ఎఫ్పీగలాక్టోసమినిడేజ్) దీనికి తోడ్పడతాయని గుర్తించారు. ఆ పరిశోధనను టొరొంటో శాస్త్రవేత్తలు పరిగణనలోకి తీసుకున్నారు. ►సదరు బ్యాక్టీరియా ఎంజైమ్‌లను సేకరించారు. ఈవీఎల్పీ పరికరంలో ఊపిరితిత్తులకు పంపే పోషకాలతో పాటు ఆ ఎంజైమ్‌లను కూడా పంపారు. ►ఈ ఎంజైమ్‌లు ఊపిరితిత్తుల్లోని రక్తనాళాల ద్వారా ప్రయాణిస్తూ.. వాటిలో ఉన్న ‘ఏ, బీ యాంటీజెన్’లను నిర్వీర్యం చేశాయి. దీనితో సదరు ఊపిరితిత్తులు ‘ఓ’ గ్రూపు కిందకి మారాయి. అంతేకాదు ఈ ప్రక్రియలో సదరు ఊపిరితిత్తులకు ఎటువంటి హాని జరగలేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటే అవయవం కోసం ఎదురుచూస్తున్న ఎవరికైనా ఈ ఊపిరితిత్తులను అమర్చేందుకు వీలైనట్టే. ‘ఓ’ గ్రూపు వారికి ఎక్కువగా.. ఓ గ్రూప్ రక్తం ఉన్న వారి అవయవాలను అందరికీ అమర్చవచ్చు. దీంతో ఈ గ్రూప్ అవయవాలకు డిమాండ్ పెరిగింది. మరోవైపు ఓ గ్రూప్ వాళ్లకు అదే గ్రూప్ వాళ్ల అవయవాలే సరిపోతాయి. డిమాండ్ పెరగడంతో సొంత ఓ గ్రూప్ వాళ్లకే ఆర్గాన్స్ దొరకని పరిస్థితి ఏర్ప డింది. అవయవ మార్పిడి కోసం ఈ గ్రూప్ వాళ్లు ఎదురుచూస్తూ చూస్తూ మరణిస్తున్నారు. ఏడాదిన్నరలో మనుషులపై.. యూనివర్సల్ లంగ్స్‌కు సంబంధించి మరింత పరిశోధన చేసి, భద్రతపై పూర్తిస్థాయి స్పష్టతకు వస్తామని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ మార్సెలో సైపెల్ తెలిపారు. ఏడాదిన్నరలో మనుషులపై పూర్తిస్థాయి క్లినికల్ ట్రయల్స్ చేసే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ఇది విజయవంతమైతే.. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రాణాలను కాపాడవచ్చన్నారు. రక్తం కొరత ఉండనట్టే.. రక్తం నుంచి యాంటీజెన్లను తొలగించేందుకు చేపట్టిన పరిశోధన దాదాపు కొలిక్కి వచ్చినట్టు బ్రిటిష్ కొలంబియా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. యాంటీజెన్లను నిర్వీర్యం చేసే ఎంజైమ్‌లను కృత్రిమంగా ఉత్పత్తి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఏ రక్తాన్ని ఎవరికైనా ఎక్కించవచ్చని, రక్తం కొరత అనేదే ఉండకపోవచ్చని స్పష్టం చేస్తున్నారు. -
ఉద్యోగులకు షాక్, టీకా వేయించుకుంటారా..ఉద్యోగం నుంచి తొలగించమంటారా!
ప్రపంచ దేశాల్లో ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో దిగ్గజ కంపెనీలు..వర్క్ కల్చర్ విషయంలో కాంప్రమైజ్ అవుతున్నాయి. కానీ వ్యాక్సినేషన్ విషయంలో మాత్రం తలొగ్గడం లేదు. గూగుల్,ఇంటెల్ వంటి దిగ్గజ సంస్థలు వ్యాక్సినేషన్ అంశంలో ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాయి. వ్యాక్సిన్ వేయించుకోవాలి, లేదంటే ఉద్యోగం నుంచి తొలగిస్తామని సంచలన ప్రకటనలు చేయగా..ఇప్పుడు అదే దారిలో మరో దిగ్గజ సంస్థ ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చింది. అమెరికాకు చెందిన ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థ 'సిటీ గ్రూప్' ప్రధాన కార్యాలయం 'వాల్ స్ట్రీట్' ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది.వ్యాక్సిన్ వేయించుకుంటారా? లేదంటే విధుల నుంచి తొలగించమంటారా? అని ప్రశ్నిస్తూ గడువు విధించింది. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం..జనవరి 14 నాటికి వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ అందించని ఉద్యోగుల్ని అన్ పెయిడ్ లీవ్‌తో పాటు, విధుల నుంచి తొలగించేందుకు సిద్ధమైనట్లు బ్లూమ్ బెర్గ్ తన కథనంలో పేర్కొంది. కొంతమంది ఉద్యోగుల్ని బోనస్ అనర్హులుగా ప్రకటించనుంది. ఒకవేళ ఆఫీస్ నియమ నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగులు ఉంటే బోనస్‌లు తీసుకునే ముందు కంపెనీకి వ్యతిరేకంగా వ్యవహరించమని తెలిపే ఒప్పొంద పత్రాలపై సంతకం చేయాల్సి ఉంటుంది. సిటీగ్రూప్ సిబ్బందిలో 90శాతం కంటే ఎక్కువ మంది అమెరికన్ ఉద్యోగులకు ఈ నియమాల్ని అందుబాటులోకి తెచ్చింది. మతపరమైన లేదా ఆరోగ్య పరంగా మినహాయింపు ఇచ్చింది. ఒమిక్రాన్ కేసులు తీవ్రతరం కావడంతో అమెరికాలో ఆయా సంస్థలు రిటర్న్-టు-ఆఫీస్ ప్లాన్, వర్క్‌ప్లేస్ లో వ్యాక్సినేషన్ వంటి అంశాల గురించి చర్చలు జరుపుతున్నాయి.ఈ నేపథ్యంలో సిటీ గ్రూప్ దాదాపు 70వేల మంది ఉద్యోగులకు జాబ్ కావాలంటే వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందేనని నియమాల్ని అమలు చేసింది. అదే సమయంలో గోల్డ్‌మన్ సాచ్స్ గ్రూప్, జెపి మోర్గాన్ వంటి సంస్థలు ఉద్యోగులకు టీకా అవసరం ఉన్నా, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగుల విషయంలో కాస్త ఉదారంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: వారంలో 5 రోజుల కంటే తక్కువ పనిదినాలున్న దేశాలు ఇవే..త్వరలో భారత్.. -
ప్రచ్ఛన్నయుద్ధంలో... అమెరికా కొత్త ఎత్తుగడ
నూతన యుద్ధ కూటమిలకు నాందిపలకడం, తాను చేసే ప్రతి యుద్ధానికి ఒక కారణం చూపి నామకరణం చేసి ప్రజలను నమ్మించడంలో ఆరితేరిన దేశం అమెరికా. ఇటీవలిదాకా ప్రాచుర్యంలోకి వచ్చిన క్వాడ్ (అమెరికా,జపాన్, ఆస్ట్రేలియా, భారత్) కూటమి కానీ, ఇప్పుడు కొత్తగా దాని నాయకత్వంలో ఏర్పడిన ‘ఆకస్’ (ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికా) కూటమి కానీ అమెరికన్ యుద్ధతంత్రంలో సరికొత్త వ్యూహాలేనని చెప్పాలి. అసియా–పసిఫిక్‌లో ‘భద్రత, శ్రేయస్సు’ కోసమని ఎప్పటిలాగే అమెరికా బొంకుతున్నప్పటికీ, చైనా విస్తరణ బూచిని చూపెట్టి కొత్త యుద్ధరంగాన్ని సిద్ధం చేస్తున్న వ్యూహంలో భాగమే ‘అకస్’ అని స్పష్టమవుతోంది. గత కొన్నేళ్లుగా చతుర్బుజ కూటమి క్వాడ్ (అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్) పేరిట పసిఫిక్ మహా సముద్ర ప్రాంతంలో ఆధిపత్య రాజకీయాలకు అమెరికా తెరతీసింది. కానీ 8 వేలకు పైచిలుకు అణ్వస్త్రాలను కలిగి ఉన్న అమెరికాకు, కేవలం 300 అణ్వస్త్రాలు గల చైనాతో భద్రతకు ముప్పంటే పసిపిల్ల వాడు కూడా నమ్మలేడు. ఆసియా పసిఫిక్ ప్రాంతం లోని డిగోగార్షియా, బహ్రైన్, డ్జిబౌటీ, గువామ్, తైవాన్, జపాన్, ఫిలిప్ఫైన్స్, జపాన్, దక్షిణ కొరియాలలో అమెరికా ఇప్పటికే సైన్యాన్ని, క్షిపణులను, యుద్ధనౌకలను మోహరించింది. ఇప్పటివరకూ హాట్ టాపిక్‌గా ఉన్న ‘క్వాడ్’ (అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్) కూటమికి ఈనెల 24న అధ్యక్షుడు బైడెన్ ఆతిథ్యమిచ్చారు. అయితే అంతకంటే ముందుగా ఈ కూటమిని కాస్తా చల్లారబర్చి నూతన త్రిభుజ కూటమిగా (ఆస్ట్రేలియా, యూకే, అమెరికా) ‘అకస్’ను అమెరికా అధ్యక్షుడు, బ్రిటన్, ఆస్ట్రేలియా ప్రధానులు ప్రకటించారు. దీంట్లో భాగంగా ఆస్ట్రేలియా జలాంతర్గాములకు అణుఇంధనంతో నిర్మించే సాంకేతిక పరిజ్ఞానాన్ని అమెరికా, బ్రిటన్లు అంది స్తాయి. ఈ కొత్త కూటమి ఏర్పాటు అసియా–పసిఫిక్‌లో ‘భద్రత, శ్రేయస్సు’ కోసమని ఎప్పటిలాగే అమెరికా బొంకుతోంది. అందుకే ఆకస్ ఒప్పందం వెనుక అమెరికా ప్రచ్ఛన్నయుద్ధ మనస్తత్వమే దాగి ఉందని చైనా ఆరోపించింది. వాస్తవం ఏమిటంటే, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆసియా ఖండంలో తన ప్రాబల్యాన్ని పెంచుకోటానికి భారత్, చైనాలను యుద్ధ ముగ్గులోకి దింపి, పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్లుగా అమెరికా వ్యవహరిస్తోంది. దీనికోసం 2011లోనే ‘ఆసియా పివోట్’ పథకాన్ని అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యూహాత్మకంగా ఆస్ట్రేలియాలో ప్రకటిం చాడు. ప్రశాంతంగా ఉండే ఆసియా–పసిఫిక్ ప్రాంతం నాటినుంచే ఉద్రిక్తతల నడుమ పయనిస్తోంది. ‘అకస్’ ఏర్పాటుతో నాటో యుద్ధ కూటమిలో, ఈయూ దేశాల్లో లుకలుకలు ప్రారంభమైనాయి. ఫ్రాన్స్ తన రాయబారులను అమెరికా, ఆస్ట్రేలియాలనుంచి వెనకకు రప్పించి, ఇది అమెరికా వెన్నుపోటని తీవ్రంగా హెచ్చరించింది. బ్రిటన్‌తో రక్షణశాఖ చర్చలను రద్దు చేసుకొంది. ఈ ఆకస్ ఒప్పందం అసలు ఉద్దేశం భద్రతకు సంబంధించినది కానేకాదు, అమెరికా యుద్ధ పరిశ్రమల కార్పొరేట్లకు లాభాలను ఆర్జిం చడం కోసమే. ఆస్ట్రేలియాతో ఫ్రాన్స్ లోగడ 2016లో డీజిల్‌తో నడిపే 12 జలాంతర్గాములను 36,400 కోట్ల డాలర్లతో ఎగుమతి చేయటానికి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తాజా ‘ఆకస్’ ఒప్పందంతో ఫ్రాన్స్ ఒప్పందం చిత్తు కాగితంగా మారింది. ఈ కూటముల జోలికి పోకుండా భారత్ తటస్థంగా ఉండి, అలీనోద్యమాన్ని ప్రోత్సహించటమే శ్రేయస్కరం. బుడ్డిగ జమిందార్ వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్, కె.ఎల్. యూనివర్సిటీ ‘ 98494 91969 -
100 రోజుల్లో 10 కోట్ల మందికి టీకా
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ కోవిడ్ వ్యాక్సినేషన్‌పై కొత్త లక్ష్యాలను ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన మొదటి 100 రోజుల్లో దేశంలోని 100 మిలియన్ల (10కోట్ల) మందికి టీకా అందజేస్తుందని ప్రకటించారు. కోవిడ్‌తో తీవ్రంగా దెబ్బతిన్న తమ దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం ఘోరంగా విఫలమైందని వ్యాఖ్యానించారు. ఈనెల 20వ తేదీన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న బైడెన్ డెలావెర్‌లోని, విల్మింగ్టన్లో శుక్రవారం తన బృందంతో దేశంలో ఆరోగ్య సంక్షోభంపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తిగా విఫలమైంది. టీకా కార్యక్రమం ఎక్కడ జరుగుతోందో ఇప్పటికీ కచ్చితంగా ఎవరికీ తెలియని పరిస్థితి ఉంది. (చదవండి: ట్రంప్‌నే కాదు, వీళ్లను కూడా పిట్ట పొడిచింది!) అవసరమైన చోట టీకా సరఫరా లేదు. ఒక పక్క లక్షలాదిమందికి టీకా అవసరం ఉండగా, మరోపక్క లక్షలాదిగా డోసులు దేశవ్యాప్తంగా ఫ్రిజ్‌లలో నిరుపయోగంగా పడి ఉన్న విషయం మాత్రం అందరికీ తెలుసు’అని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిని గాడినపెట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై తాము చర్చించామన్నారు. ‘దేశంలో సంభవిస్తున్న కోవిడ్ మరణాల్లో 80 శాతం వరకు ఉన్న 65 ఏళ్లు పైబడిన వారికి ముందుగా టీకా ఇస్తాం. ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ప్రస్తుత వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. వ్యాక్సినేషన్ సైట్ల సంఖ్యను మరింతగా పెంచుతాం. మోబైల్ క్లినిక్‌లను పెంచుతాం. వ్యాక్సినేషన్ సాధ్యమైనంత త్వరగా కొనసాగించేందుకు ఔషధ దుకాణాలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటాం. సుదూర ప్రాంతాల్లోనూ వ్యాక్సినేషన్ సైట్లు ప్రారంభిస్తాం. డిఫెన్స్ ప్రొడక్షన్ చట్టాన్ని వినియోగించుకుని, ప్రైవేట్ ఉత్పత్తి సంస్థల ద్వారా వ్యాక్సినేషన్‌కు అవసరమైన సామగ్రిని ఉత్పత్తిని చేయిస్తాం’అని తెలిపారు. ఉత్పత్తి అయిన డోసుల్లో సగానికి పైగా నిల్వల ఉంచుతూ ట్రంప్ యంత్రాంగం తీసుకున్న నిర్ణయంతో ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఇందులో చాలా భాగం వ్యాక్సిన్‌ను విడుదల చేసి, మరింత మందికి వ్యాక్సినేషన్ అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. చదవండి: కోవిడ్ అష్టదిగ్భంధం -
ఏపీఎన్ఆర్టి కోఆర్డినేటర్‌గా యర్రబోతుల శ్రీనివాస్‌రెడ్డి
అమెరికా: గుంటూరు ప్రవాసాంధ్రునికి అరుదైన అవకాశం లభించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టి) అమెరికా రీజనల్ కోఆర్డినేటర్‌గా యర్రబోతుల శ్రీనివాస్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఐటి అండ్ ఇండస్ట్రీ పాలసి ప్రచారం చేస్తూ, పెట్టుబడులు మరియు ఇతర అవకాశాలకు అమెరికాలోని తెలుగు వారికి ఏపీ ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తానని శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. -
ఈసారి వైట్‌హౌస్ ఎవరి సొంతం?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గతంలో కీలక ఘట్టంగా భావించే ప్రధాన అభ్యర్థుల మధ్య తుది డిబేట్ ముగిసింది. పోలింగ్ పది రోజుల్లో పూర్తవుతుంది. బైడెన్ గెలిస్తే మధ్య తరగతి ప్రజలపై పన్నులు ‘రెండు, మూడు, నాలుగు రెట్ల వరకూ పెంచేస్తారు’ అని ట్రంప్ తన ప్రసంగాల్లో హెచ్చరిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో జయాపజయాలు నిర్ణయించే మధ్య తరగతికి బైడెన్ నుంచి పన్నుల భయం వెంటాడడం ట్రంప్‌కు కలిసొచ్చే అంశం. బైడెన్ గెలిస్తే ఇతర దేశాల నుంచి అమెరికాకు అవసరం లేని, తగినన్ని నైపుణ్యాలు లేని వారు పెద్ద సంఖ్యలో వస్తారనీ, దేశం కమ్యూనిజం వైపు పయనిస్తుందన్న ట్రంప్ మాటలను నమ్మే జనం ఇంకా ఉన్నారు. అయితే వారు ఆయన్ని గెలిపించేంత సంఖ్యలో ఉన్నారా అనేది ప్రశ్న. ఈ 59వ అధ్యక్ష ఎన్నికల్లో దేశాధినేత డొనాల్డ్ ట్రంప్ మరోసారి గెలిచి వైట్‌హౌస్‌లో కొనసాగుతారో, డెమొక్రాట్ జోసెఫ్ బైడెన్ విజయం సాధించి 46వ ప్రెసిడెంట్ అవుతారో నవంబర్ నాలుగున తేలిపోతుంది. కిందటి ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి డెమొ క్రాటిక్ పార్టీ అభ్యర్థి స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నారని ఎన్నికల సర్వేలు చెబుతున్నాయి. 2016లో తొలి మహిళా అభ్యర్థి హిల్లరీ క్లింటన్.. రిప బ్లికన్ ప్రత్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై సునాయాసంగా గెలిచేంత ఆధిక్యం సాధించారని అప్పటి ఒపీనియన్ పోల్స్ సూచిం చాయి. ఆ ఎన్నికల్లో హిల్లరీ ట్రంప్ కన్నా రెట్టింపు మొత్తంలో ఎన్నికల నిధులు సేకరించగలిగారు. ఇప్పుడు ట్రంప్ కంటే మూడు రెట్లు ఎక్కువగా బైడెన్ ఖాతాలో ఎన్నికల నిధులున్నాయి. కిందటి పోలింగ్ రోజు ఎగ్జిట్ పోల్స్ సైతం హిల్లరీకే విజయం త«థ్యమని స్పష్టం చేశాయి. చివరికి అన్ని అంచనాలను తలకిందులు చేస్తూ ట్రంప్ విజయం సాధించారు. ఈ నేపథ్యంలో అనుకూల సర్వే ఫలితాలు, పుష్కలంగా ఎన్నికల నిధులు, ట్రంప్ నాలుగేళ్ల గందరగోళ పాలన వంటి అంశాల ఆధారంగా బైడెన్ కచ్చితంగా గెలుస్తారనే నమ్మకం ఎన్నికల పరిశీలకుల్లో కనిపించడం లేదు. తనకు వ్యతిరేక పరిస్థితు లున్నాయని మీడియా, రాజకీయ పండితులు చెబుతున్నా గెలుపు తన దేన్నట్టు ట్రంప్ మాట్లాడుతున్నారు. ఏ మూలనో ఓటమి అనుమానం ఉన్న కారణంగా తాను ఓడిపోతే అమెరికాకు అంతా కీడే జరుగుతుం దని హెచ్చరిస్తూ, పరాజయం పాలయ్యాక దేశం విడిచిపోతాననే వరకూ వెళ్లారు ట్రంప్. ముందస్తు భారీ ఓటింగ్‌తో ఉత్కంఠ ట్రంప్, బైడెన్ మద్దతుదారులు కోవిడ్–19 మహమ్మారితోపాటు రాజ్యాంగం కల్పించిన వెసులుబాటుతో ముందస్తు పోలింగ్‌లో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. గురువారం సాయంత్రానికి పోలింగ్ కేంద్రాల్లో, మెయిల్ ద్వారా ఓట్లేసిన ఓటర్ల సంఖ్య దాదాపు నాలుగు కోట్ల 75 లక్షలు దాటిపోయింది. వారిలో సగం మంది బైడెన్ మద్దతు దారులని, 25 శాతం మంది ట్రంప్‌కు ఓటేశారని సర్వేల అంచనా. కరోనావైరస్ 33 కోట్లమంది అమెరికన్లను ఈ ఏడాది మార్చిలో నలు వైపుల నుంచి చుట్టుముట్టే వరకూ ట్రంప్‌కు అనుకూలంగా జనాభి ప్రాయం ఉంది. ఆయన 2017 జనవరి 20న పదవి చేపట్టినప్పటి నుంచి మార్చి వరకూ కొత్త ఉద్యోగాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా ముందుకు సాగుతోంది. ఫలితంగా ట్రంప్ మరో 4 సంవత్సరాల పాలన ఖాయమనే అంచనాలను కరోనా తారు మారు చేస్తుందేమోననే అనుమానాన్ని తాజా పరిణామాలు బలపరి చేలా కనిపిస్తున్నాయి. కరోనా వైరస్ సోకి దాదాపు మూడు లక్షల మంది అమెరికన్లు మరణించారని అంచనా. మహమ్మారి సృష్టించిన ఆర్థిక సంక్షోభం వల్ల దేశంలో నేడు నిరుద్యోగం 14 శాతం దాటింది. ట్రంప్ ఈ పరిణా మాల వల్ల తనకు ఎన్నికల్లో నష్టమని భావించడం లేదు. మొదట్నించీ ట్రంప్ కరోనాను ప్రమాదకరమైన వైరస్ కాదనే రీతిలో మాట్లాడారు. తాను మాస్క్ చాలా నెలలు ధరించకపోవడమేగాక, ప్రజలకు కూడా దాని అవసరం లేదని చెప్పారు. చివరికి ఇటీవల కోవిడ్ వైరస్ సోకినా ఆస్పత్రిలో త్వరగా కోలుకుని నాలుగు రోజులకే బయటికొచ్చేశారు. స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు పెద్దపీట వేసే అమెరి కన్లలో ఎక్కువమందికి మాస్క్ పెట్టుకోవడం, ప్రభుత్వాలు లాక్డౌన్ పేరిట కార్యకలాపాలు బంద్ చేయడం నచ్చలేదు. లాక్డౌన్ వల్ల ప్రాణాలు కాపాడుకునే విషయం దేవుడెరుగు, పనీపాటా లేక తమ ఉపాధి కోల్పోయామనే భావన సాధారణ జనంలో నెలకొంది. ఇలాంటి అమెరికన్లకు లాక్డౌన్ అనవసరమనే ట్రంప్ ధోరణి తమకు అనుకూలంగా ఉందనిపిస్తోంది. కరోనా అదుపులోకి రాకముందే లాక్డౌన్ నిబంధనలను సడలించా లని ట్రంప్ రాష్ట్రాలపై ఒత్తిడి చేయడం కూడా గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల ప్రజలను ఆకట్టుకుంది. ఈ అంశాలు దృష్టిలో పెట్టుకునే ట్రంప్ రెండ్రోజుల క్రితం ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ,‘‘ట్రంప్ సూపర్ రికవరీకి (కోవిడ్ నుంచి నాలుగు రోజులకే కోలుకుని ప్రచారంలోకి దూకడం), బైడెన్ కుంగుబాటుకు మధ్య జరుగుతున్న ఎన్నికలివి’’ అని ప్రకటించారు. కరోనా అదుపు విషయంలో అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫాచీ ధోరణిని దుయ్యబడుతూ ఆయనను మూర్ఖుడని ట్రంప్ దూషిం చారు. అయినా, ఈ మహమ్మారి విషయంతో తన చర్యలు, ప్రవర్తన సగటు అమెరికన్లకు నచ్చాయన్న ధీమా ట్రంప్‌లో కనిపిస్తోంది. కోవిడ్–19తో తాను ఎన్నికల్లో నష్టపోయేది లేదనే ఆయన అంచనా వేస్తున్నారు. ఇంకా ఓటేయని ట్రంప్ మద్దతుదారుల్లో ఉన్న ఉత్సాహం బైడెన్ సానుభూతి పరుల్లో లేదని కూడా కొన్ని సర్వేలు సూచిస్తు న్నాయి. ‘కమలా హ్యారిస్ మీ మొదటి మహిళా ప్రెసిడెంట్ కాజాలరు’ మొన్న పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో, ‘‘కమలా, కమలా.. మీ మొదటి మహిళా అధ్యక్షురాలు కాలేరు. మీరు అలా జరగనివ్వకూడదు!’’ అంటూ ఓటర్లను రెచ్చగొట్టేరీతిలో ట్రంప్ మాట్లాడారు. ఒకవేళ డెమొక్రాట్ బైడెన్ గెలిచి రెండేళ్లకే కన్ను మూస్తే–రాజ్యాంగం ప్రకారం వైస్ ప్రెసిడెంట్ పదవిలో ఉండే కమలా హ్యారిస్ అధ్యక్షురాలయ్యే ప్రమాదం ఉందని ట్రంప్ ఇలా పరోక్షంగా ప్రజలను హెచ్చరిస్తున్నారు. సగం భారతీయ, మరో సగం ఆఫ్రికన్ మూలాలున్న కమల అమెరికా అధ్యక్షురాలైతే దేశం నాశనమౌతుందని ఆయన భయపెడుతున్నారు. ఇంకా, బైడెన్ గెలిస్తే మధ్య తరగతి ప్రజలపై పన్నులు ‘రెండు, మూడు, నాలుగు రెట్ల వరకూ పెంచేస్తారు’ అని కూడా ట్రంప్ తన ప్రసంగాల్లో హెచ్చరిస్తున్నారు. అధ్యక్ష ఎన్ని కల్లో జయాపజయాలు నిర్ణయించే మధ్య తరగతికి బైడెన్ నుంచి పన్నుల భయం వెంటాడడం ట్రంప్‌కు కలిసొచ్చే అంశం. దేశంలోకి చదువుల పేరుతో, ఉద్యోగాల కోసం వచ్చే విదేశీయుల వలసలను కట్టడి చేస్తానంటూ 2016 ఎన్నికల్లో స్థానిక అమెరికన్ల ఓట్లను కొల్ల గొట్టారు ట్రంప్. ఆయన కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా హెచ్1బీ, ఇతర వీసాల జారీని కఠినతరం చేశారు. ఈ నాలుగేళ్లలో విదేశాల్లో పుట్టి అమెరికాకు వరదలా వచ్చిపడే వారి సంఖ్యను ట్రంప్ గణనీయంగా తగ్గించగలిగారు. అగ్రరాజ్యంలో పెరుగుతున్న పేదరికం, ప్రపంచీకరణ వల్ల అమెరికాలో ఫ్యాక్టరీలు మూతబడిన నేపథ్యంలో ఆసియా దేశాల నుంచి వస్తు, సేవల దిగు మతులు పెరగడాన్ని ట్రంప్ కట్టడి చేశారు. దీంతో ట్రంప్‌నకు దేశంలో మూడో వంతు జనం గట్టి మద్దతుదారులయ్యారు. చైనా విషయంలో ట్రంప్ వైఖరి ఈ వర్గం ప్రజలను ఆకట్టుకుంటోంది. బైడెన్ గెలిస్తే ఇతర దేశాల నుంచి అమెరికాకు అవసరం లేని, తగినన్ని నైపుణ్యాలు లేని వారు పెద్ద సంఖ్యలో వస్తారనీ, దేశం కమ్యూనిజం వైపు పయని స్తుందన్న ట్రంప్ మాటలను నమ్మే జనం ఇంకా ఉన్నారు. అయితే, వారు ఆయనను గెలిపించేంత సంఖ్యలో ఉన్నారా అనేది నవంబర్ మొదటి వారంలో మాత్రమే తేలుతుంది. ఫలితాలు వచ్చే వరకూ విజేతపై సస్పెన్స్ తప్పదు! మాజీ ఉపాధ్యక్షుడు బైడెన్ గెలుస్తారని ఎన్నికల సర్వేలు, ట్రంప్‌దే విజయమని రాజకీయ జ్యోతిష్యులు చెబుతున్నా మునుపెన్నడూ లేనంత ఉత్కంఠను అమెరికా అధ్యక్ష ఎన్నికలు రేకెత్తిస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం దేశ అధికార పీఠాలకు ‘బయటి వ్యక్తి’గా ప్రచారం చేసుకుని ట్రంప్ గెలిచారు. కానీ, వైట్‌హౌస్‌లో కూర్చుని ఇన్నేళ్లు పాలించాక ఆయనకు గొప్ప పాలకుడనే పేరైతే రాలేదు. సరిగ్గా ఎన్నికల ఏడాదిలోనే కష్టాలు చుట్టుముట్టాయి. ఒకవేళ ఓడిపోతే, గత 32 ఏళ్ల అమెరికా ఎన్నికల చరిత్రలో ఒకసారి మాత్రమే అధ్యక్ష పదవికి ఎన్నికైన జేమ్స్(జిమ్మీ) కార్టర్, జార్జి హెచ్ డబ్ల్యూ బుష్ (సీనియర్ బుష్) జాబితాలో ట్రంప్ చేరతారు. అలాగే, జో బైడెన్ విజయం సాధిస్తే రెండో రోమన్ కేథలిక్ అధ్య క్షుడిగా రికార్డుకెక్కుతారు. (1960 ఎన్నికల్లో 43 ఏళ్ల వయసులో గెలిచిన జాన్ ఎఫ్ కెనడీ మొదటి కేథలిక్) అంతేగాక, ఉపాధ్యక్షునిగా పనిచేసి అధ్యక్షుడైన నేతగా సీనియర్ బుష్ తర్వాత 32 ఏళ్లకు బైడెన్ పేరు చరిత్రకెక్కుతుంది. కాకతాళీయమైనా మరో ఆసక్తికర విషయం ఏమంటే–1946లో పుట్టిన ముగ్గురు నేతలు అమెరికా అధ్యక్షుల య్యారు. ఆ ఏడాది ట్రంప్ కన్నా కొన్ని నెలలు ఆలస్యంగా పుట్టిన బిల్ క్లింటన్, జార్జి డబ్ల్యూ బుష్ (జూనియర్ బుష్) రెండుసార్లు అధ్యక్షుల య్యారు. మరి ఇదే ఆనవాయితీ కొనసాగితే ట్రంప్ కూడా 2020లో గెలవాలని ఆయన అభిమానులు ఆశపడుతున్నారు. ఎం. నాంచారయ్య వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు మొబైల్ : 79819 42329 -
అమెరికా ఎటువైపు?
అమెరికాలో అందరి అభిప్రాయంగా ప్రచారంలో వున్న అంశాన్నే తాజా సర్వే కూడా మరోసారి ధ్రువీకరించింది. ఈసారి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నెగ్గే ఛాన్స్ లేదన్నది ఆ సర్వే సారాంశం. అమెరికాలో అత్యధికులు ట్రంప్ ప్రత్యర్థి, డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్‌నే కోరుకుంటు న్నారని ఆ సర్వే చెబుతోంది. అంతకన్నా ముఖ్యమైనదేమంటే... ఓటు హక్కున్న ప్రవాస భారతీ యుల్లో మూడింట రెండొంతులమంది ఈసారి బైడెన్‌కే ఓటేస్తామని తెలిపారు. ఎన్నారై ఓటర్లలో 72 శాతంమంది బైడెన్‌కు అనుకూలంగా వుంటే ట్రంప్‌కు 22 శాతంమంది అనుకూలం. సాధారణంగా భారతీయులెప్పుడూ డెమొక్రాటిక్ పార్టీకే అనుకూలంగా వుంటారు. గత అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ నెగ్గాలని కోరుకున్నవారిలో భారతీయులు గణనీయంగానే వున్నారన్న అభిప్రాయం కలగడానికి అప్పుడు కొంతమంది చేసిన హడావుడి, ఆయన శిబిరంలో ఎన్నికల బాధ్యతలు చూసేవారిలో గణనీయ సంఖ్యలో ఎన్నారైలు వుండటం కొంత కారణం. దాంతోపాటు అప్పట్లో ట్రంప్ కోసం కొందరు యజ్ఞం నిర్వహించారు. ఆ ఎన్నికల్లో ఎన్నారై ఓట్లలో 16 శాతం ట్రంప్‌కు వెళ్లాయని లెక్కలు చెబుతున్నాయి. ఆయనపై పోటీచేసిన డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ 77 శాతం ఎన్నారైలు ఓటేశారు. దీన్నిబట్టి చూస్తే ట్రంప్ ఓట్లు అప్పటికీ ఇప్పటికీ 6 శాతం మేర పెరిగాయి. మరో 6 శాతం మంది ఎటూ తేల్చుకోలేనివారున్నారని తాజా సర్వే వెల్లడించింది. వీరిలో ఎంత శాతాన్ని ట్రంప్ తనవైపు తిప్పుకుంటారన్నది చూడాల్సివుంది. పెన్సిల్వేనియా, మిచిగాన్, ఫ్లారిడా, నార్త్ కరోలినా రాష్ట్రాల్లో భారతీయ అమెరికన్లు ఎక్కువగా వుంటారు. కనుక అక్కడ వీరి మద్దతు కీలకమవుతుంది. ఎన్నారై ఓటర్లలో ట్రంప్‌వైపు మొగ్గిన వారి సంఖ్య గతంకన్నా పెరగడానికి అక్కడ ప్రధాని నరేంద్ర మోదీకున్న ఆదరణ కారణం. వాస్తవానికి ఇదింకా ఎక్కువగానే వుండేది. కానీ ట్రంప్ తెంపరితనం దాన్ని తగ్గించింది. ఒకపక్క ఎన్నికలు ముంగిట్లోకొచ్చిన తరుణంలో ఈ నెల మొదటివారంలో హెచ్ 1బీ వీసాలపై కొత్త ఆంక్షలు విధించారు. అమెరికా కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించడం కోసమే వీటిని తీసుకొచ్చానని ట్రంప్ ప్రకటించారు. ఎలాంటి కారణం చూపి అయినా ప్రభుత్వం వీసా నిరా కరించడానికి ఈ నిబంధనలు వీలు కల్పిస్తున్నాయని, ఇందువల్ల తమకెంతో నష్టం జరుగుతుందని భారతీయులు వాపోతున్నారు. అయితే శ్వేత జాతి అమెరికన్లలో కూడా తన పరపతి తగ్గుతోందని తెలిశాకే ట్రంప్ ఈ కొత్త ఆంక్షల్ని అమల్లోకి తెచ్చారన్నది రాజకీయ నిపుణుల అభిప్రాయం. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ తన ప్రత్యర్థికన్నా దాదాపు 8 నుంచి 10 శాతం అధికంగా ఓట్లు తెచ్చుకున్న అయోవా, ఒహాయో, టెక్సాస్ రాష్ట్రాల్లో ఈసారి కేవలం అయోవా రాష్ట్రంలో మాత్రమే ఆయన లబ్ధి పొందుతారని ఒక సర్వే గతంలో చెప్పింది. అయితే ఒహాయో, ఫ్లారిడాల్లో బైడెన్ వెనకబడ్డారని తాజా సమాచారం. ఈ రెండూ రెండో ప్రపంచ యుద్ధం మొదలుకొని ఇప్పటివరకూ అధ్యక్షుడిగా ఎంపికైనవారి వెనకే వున్నాయి. గత నెల 29న ట్రంప్, బైడెన్ల సంవాదం తర్వాత బైడెన్ ఆధిక్యత కనబరిచారని దాదాపు అన్ని మీడియా సంస్థలు ప్రకటించాయి. ఎన్బీసీ అయితే అంతక్రితం రెండు వారాలకన్నా బైడెన్ ఆధిక్యత ఆరు శాతం పెరిగిందని... ఆయనకు 53 శాతంమంది మద్దతు పలికితే, ట్రంప్‌కు 39 శాతంమంది అనుకూలంగా వున్నారని తేల్చింది. గత ఎన్నికల్లో తన ప్రత్యర్థికన్నా ఒక శాతం ఓట్ల ఆధిక్యత సాధించిన మిచిగాన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో బైడెన్ ఆధిక్యత చాలా ఎక్కువగా వుందన్నది సర్వే చెబుతున్న మాట. ఈ మూడూ పారిశ్రామికంగా ప్రాముఖ్యం వున్నవని, ఇక్కడ కార్మికుల సంఖ్య ఎక్కువగా వుంటుందని గమనిస్తే ట్రంప్ పరిస్థితి ఎలావుందో అంచనా వేసుకోవచ్చు. ఇవన్నీ గ్రహించబట్టే ట్రంప్ ఉత్సాహంగా వున్నట్టు కనబడేందుకు ప్రయత్నిస్తున్నారు. బైడెన్‌తో సంవాదం జరిగిన రెండ్రోజుల తర్వాత తనకు కరోనా వైరస్ సోకిందని ఆయన ప్రకటించారు. ట్రంప్ తానే కరోనా వైరస్ బారిన పడటంతో ఆ వ్యాధిని అరికట్టడంలో విఫలమయ్యారన్న ప్రచారాన్ని ధ్రువీకరించినట్టయింది. అధ్యక్షుడిగా ఎన్నికయ్యేవారు మంచి ఆరోగ్యంతో ఉండాలని, శక్తివంతంగా కనబడాలని అమెరికన్లు కోరుకుంటారు. అలాంటివారే సమస్యలనుంచి తమను కాపాడగలడన్న నమ్మకం వారికుంటుందంటారు. బైడెన్‌తో జరిగిన సంవాదంలో ఓటమిపాలై వున్న ట్రంప్‌కు కరోనా వైరస్ కూడా సోకిందంటే ఇక చెప్పేదేముంది? కనుకనే వ్యాధినుంచి కోలుకున్నవారు పాటించాల్సిన నియమాలను కూడా పక్కనబెట్టి రెండు వారాలు కాకుండానే ఆయన ఎన్నికల రంగంలోకి ఉరికారు. ఇప్పటికే చాలామంది అమెరికన్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరి సంఖ్య కోటీ పది లక్షల వరకూ ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో ముందుగా ఓటే యడం ఇదే ప్రథమం అంటున్నారు. మిగిలినవారు ఓటేయడానికి ఇక మూడు వారాల సమయం మాత్రమే వుంది. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పాపులర్ ఓటు పెద్దగా పరిగణనలోకి రాదు. ఎలక్టోరల్ కాలేజీ ఓట్లే కీలకమైనవి. గత దఫాలో పాపులర్ ఓటు హిల్లరీ పక్షానే వున్నా ఆమె ఓటమి పాలయ్యారని గుర్తుంచుకుంటే... సర్వేలు చూసి ట్రంప్‌ను పరాజితుడిగా లెక్కేయడం సరికాదని అర్థ మవుతుంది. ఇంతవరకూ చేసిన సర్వేలన్నిటా ట్రంప్ కన్నా దాదాపు 10 శాతం ఆధిక్యత కనబరు స్తున్నా ఓటర్ల పూర్తి విశ్వాసాన్ని చూరగొనడంలో బైడెన్ విఫలమయ్యారని గ్యాలప్ సంస్థ తేల్చింది. ట్రంప్ మళ్లీ విజేత అవుతారని 56 శాతంమంది ఓటర్లు భావిస్తుంటే... 40 శాతంమంది మాత్రమే బైడెన్ నెగ్గుతారని అనుకుంటున్నారని ఆ సర్వే తెలిపింది. నిరుద్యోగం, వర్ణ వివక్ష, కరోనా వైరస్ వంటి అనేక అంశాలు అమెరికా ఎన్నికల్లో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కనుకనే ట్రంప్ గెలుపు అనుమానమేనని సర్వేలు అంటున్నాయి. అందులో ఎంతమేర వాస్తవం వుందో వచ్చే నెలలో తేలిపోతుంది. -
భారత టెకీల్లో ‘హెచ్1బీ’ గుబులు..
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ స్థానికులను ప్రసన్నం చేసుకొనేందుకు దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసా నిబంధనల పేరుతో విసిరిన రాజకీయ కార్డు అగ్రరాజ్యంలోని భారతీయుల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. వీసాల రెన్యువల్‌తోపాటు కొత్త వీసాల దరఖాస్తుకు ప్రస్తుత మున్న నిబంధనలను కఠినతరం చేస్తూ విడుదల చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లక్షలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ట్రంప్ పాలనా యంత్రాంగం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అమెరికాలోని దాదాపు 2.8 లక్షల మంది భారతీయ ఐటీ నిపుణులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా తీవ్ర నష్టం వాటిల్లనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అక్కడి కంపెనీలకు కన్సల్టెన్సీలుగా పనిచేస్తున్న భారతీయ ఐటీ కంపెనీలకు కూడా తాజా ఉత్తర్వుల వల్ల భారీ నష్టం జరగనుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఐటీ ఉద్యోగాలు చేస్తున్న వారే కాక పలు యూనివర్సిటీల్లో చదువుకుంటున్న విద్యార్థుల ఉపాధి అవకాశాలకు కూడా ఈ ఉత్తర్వులు గండి కొడతాయని అంటున్నారు. మనోళ్లకు గడ్డుకాలమే... తాజా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో కనీస వార్షిక వేతన పరిమితి ఏకంగా 45 శాతం పెంపుతోపాటు కంపెనీ ఉద్యోగులు, కన్సల్టెన్సీ ఉద్యోగుల వీసాల రెన్యువల్ కాలపరిమితిలో మార్పు, రెన్యూవల్ ఫీజు పెంపు, అమెరికాలో ఐటీ సంబంధిత అడ్వాన్స్డ్ డిగ్రీ పూర్తి చేసినవారికే వీసాలివ్వాలనే నిబంధనలు ఉండటం భారతీయ ఐటీ నిపుణులు, ఉద్యోగుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేయనున్నాయి. ఇకపై హెచ్1బీ వీసా దరఖాస్తుదారులు 1.10 లక్షల డాలర్ల కనిష్ట వార్షిక వేతనం ఉంటేనే వీసా పొందడానికి అర్హత పొందుతారు. ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం 65 వేల డాలర్లుంటేనే వీసాకు దరఖాస్తు చేసుకొనే అవకాశముండేది. ఈ నిబంధనల అమలు వల్ల సగం మంది భారతీయ ఐటీ ఉద్యోగులకు గడ్డుకాలం ఎదురుకానుంది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీ సామాజిక అధ్యయనాల సంస్థ సర్వే ప్రకారం హెచ్1బీ వీసాపై అమెరికాలో పని చేస్తున్న ఐటీ ఉద్యోగుల్లో 56 శాతం మంది... అంటే దాదాపు 3.5 లక్షల మంది ఏటా 67 వేల నుంచి లక్ష డాలర్లలోపు వార్షిక వేతనం పొందుతున్నారు. వారిలో 2.80 లక్షల మంది భారతీయ ఐటీ ఉద్యోగులే ఉన్నారు. తాజా నిబంధనలతో వారంతా ప్రస్తుత వీసా గడువు ముగిశాక అమెరికాలో ఉద్యోగం చేయాలంటే వారి వార్షిక వేతనం 1.10 లక్షల డాలర్లు ఉండాల్సిందే. వార్షిక వేతనం 1.10 లక్షల డాలర్లు ఉన్న ఉద్యోగుల వీసా కాలపరిమితిలోనూ మార్పులు జరిగాయి. ఇంత మొత్తంలో వేతనం ఉన్నప్పటికీ వారు నేరుగా కంపెనీ ఉద్యోగులు అయితేనే వీసాను మూడేళ్లపాటు రెన్యువల్ చేయనున్నారు. అదే కన్సల్టెన్సీల ద్వారా కంపెనీలకు పనిచేసే వారి వీసాలను మాత్రం కేవలం ఏడాదికే ఇవ్వనున్నారు. ఈ నిబంధనల అమలు అమెరికన్ ఐటీ కంపెనీలకు ఔట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగులను అందించే దాదాపు 65 వేల కన్సల్టెన్సీ సంస్థలకూ నష్టం చేకూరుస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏమవుతుంది? ట్రంప్ తెచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను కోర్టుల్లో సవాల్ చేస్తే న్యాయ సమీక్ష ముందు నిలవదనే అభిప్రాయం నిపుణుల్లో వ్యక్తమవుతోంది. ఈ విషయమై యూనివర్సిటీ ఆఫ్ షికాగోకు చెందిన ప్రొఫెసర్ రెజినా డిక్షన్ మాట్లాడుతూ ‘ట్రంప్ పాలనా యంత్రాంగం తెచ్చిన కొత్త ప్రతిపాదనలు న్యాయ సమీక్ష ముందు నిలుస్తాయా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. అమెరికాలో స్థానికంగా ఐటీ నిపుణులు దొరకడమన్నది అంత తేలికైన విషయం కాదు. అమెరికా ప్రభుత్వం ఈ విషయంలో కఠినంగా ఉంటే కంపెనీలు ఇతర దేశాలకు తరలే ప్రయత్నాలు తప్పక చేస్తాయి’అని అభిప్రాయపడ్డారు. నెల జీతం వీసా ఖర్చుకే..! తాజా నిబంధనలతో ఏటా వీసాలు రెన్యువల్ చేసుకోవాల్సి రావడం కన్సల్టెన్సీ ఉద్యోగులకు భారం కానుంది. ఒక్కసారి హెచ్1బీ వీసా కోసం దరఖాస్తు చేయాలంటే వీసా ఫీజు, అటార్నీ ఖర్చులన్నీ కలిపి 7–8 వేల డాలర్ల వరకు ఖర్చవుతుంది. అంటే ఏటా దాదాపు ఒక నెల జీతం వీసా ఖర్చుకే సరిపోతుందన్నమాట. ఇక అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులకూ తాజా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అశనిపాతంగా మారనుంది. గురువారం నుంచి అమల్లోకి వచ్చిన వీసా నిబంధనల ప్రకా రం అమెరికాలో అడ్వాన్స్డ్ డిగ్రీ అంటే గ్రాడ్యుయేట్ అయినవారికి, అది కూడా ఐటీ చదువులు చదివినవారికే వీసాలు జారీ చేయనున్నారు. ఎలక్ట్రికల్, మెకానికల్ లేదా సివిల్ ఇంజనీరింగ్ చేసినవారిని ఐటీ ఉద్యోగాలకు అనుమతించరు. అమెరికాలో ఏదో ఒక ఎంఎస్ డిగ్రీ చేసి ఐటీ ఉద్యోగం చేయొచ్చనుకొనే వారి ఆశలు గల్లంతైనట్లే. సివిల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్ అయి నవారు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో ఐటీ సబ్జెక్టులు చదవనివారు ఇప్పటికే ఐటీ ఉద్యోగాలు దొరకబుచ్చుకున్నా వారికి ఇకపై హెచ్1బీ వీసా ఇవ్వడం కుదరదు. ప్రస్తుతం అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న 3 లక్షల మందిలో సగం మంది ఐటీయేతర గ్రాడ్యుయేట్ కోర్సు ల్లోనే ఉన్నారు. తాజా నిబంధనలతో వారి భవితవ్యం ప్రశ్నార్థకం కానుంది. (చదవండి: ‘హెచ్1బీ’పై మరిన్ని ఆంక్షలు) -
కరోనా వ్యాక్సిన్ వచ్చాకే... మైదానాలకు వస్తాం!
న్యూయార్క్: లీగ్‌లు, ఆటలు ప్రస్తుతానికైతే కోవిడ్ –19 వల్ల జరగట్లేదు. ఒకవేళ త్వరలో ఆటలు మొదలైనా కూడా ప్రేక్షకులు కరువయ్యే అవకాశాలున్నాయి. అమెరికా ప్రజల్లో చాలా మంది కరోనాకు మందు, వ్యాక్సిన్ లేదు కాబట్టి ప్రత్యక్షంగా చూసేందుకు స్టేడియాలకు వెళ్లబోమని చెప్పారు. ఇటీవల అక్కడ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో 72 శాతం మంది ప్రస్తుతం ఆరోగ్యకర పరిస్థితులేవీ లేవు కాబట్టి ఆటలకు హాజరు కాబోమని చెప్పారు. 12 శాతం ప్రజలు మాత్రం ఆటలు చూసేందుకు ఆసక్తి కనబరిచినప్పటికీ గ్యాలరీలో సామాజిక దూరం పాటిస్తేనే వెళ్తామని చెప్పారు. కేవలం 13 శాతం మంది మాత్రం ఏదేమైనా ప్రత్యక్ష వీక్షణను ఆస్వాదించేందుకు సిద్ధమేనన్నారు. స్టిల్మన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ పరిధిలో షార్కీ ఇన్స్టిట్యూట్ ఈ నెల 6,7,8 తేదీల్లో ఈ పోల్ నిర్వహించింది. మొత్తం 762 మంది అభిప్రాయాల్ని సేకరించగా... ఇందులో పాల్గొన్న అమెరికన్లు మాత్రం ఇంతకుముందులా ఆటల కోసం ఎగబడి మైదానాలకెళ్లి చూడాలనుకోవడం లేదని... టీవీల్లో చూసేందుకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.