
అమెరికా: గుంటూరు ప్రవాసాంధ్రునికి అరుదైన అవకాశం లభించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్‌ఆర్‌టి) అమెరికా రీజనల్ కోఆర్డినేటర్‌గా యర్రబోతుల శ్రీనివాస్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఐటి అండ్ ఇండస్ట్రీ పాలసి ప్రచారం చేస్తూ, పెట్టుబడులు మరియు ఇతర అవకాశాలకు అమెరికాలోని తెలుగు వారికి ఏపీ ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తానని శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.