Telugu society
-
‘నైటా’ అధ్యక్షురాలిగా ఏనుగు వాణి
ఆత్మకూరు(ఎం): అమెరికాలోని న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) కొత్త అధ్యక్షురాలిగా ఏనుగు వాణి ఎన్నికయ్యారు. ఏనుగు వాణి స్వగ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలంలోని సిద్దాపురం. న్యూయార్క్ నగరంలోని రాడిసన్ హోటల్లో భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం సమావేశమై నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నైటా కార్యవర్గాన్ని ఏడాదికొకసారి ఎన్నుకుంటారు. నైటాలో మొత్తం వెయ్యి మంది సభ్యులు ఉన్నారు. నైటా ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షురాలిగా ఏనుగు వాణితో పాటు మరో 8 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ వింగ్ నుంచి చైర్మన్‌తో సహా 12 మందితో కార్యవర్గం ఎన్నికైంది. నలుగురిని సలహాదారులుగా ఎన్నుకున్నారు. ఏనుగు వాణి భర్త ఏనుగు లక్ష్మణ్‌రెడ్డి ‘నైటా’ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ వింగ్ నుంచి వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఏనుగు వాణి పుట్టినిల్లు యాదాద్రి జిల్లాలోని వలిగొండ మండలం సుంకిశాల గ్రామం కాగా.. ఇదే జిల్లాలోని ఆత్మకూరు(ఎం) మండలం సిద్దాపురం మెట్టినిల్లు. 25 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ‘నైటా’ ఆధ్వర్యంలో న్యూయార్క్ నగరంలో తెలంగాణ సంప్రదాయాలను చాటిచెప్పే పండుగలను ఘనంగా నిర్వహిస్తుంటారు. అంతే కాకుండా కరోనా సమయంలో, వరదలు వచ్చినప్పుడు న్యూయార్క్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలో సేవా కార్యక్రమాలను చేపట్టారు. సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నారు. -
స్ఫూర్తిమంతంగా సింగపూర్ తెలుగు సమాజం రక్తదాన కార్యక్రమం
శ్రీ సత్యసాయి గ్లోబల్ ఆర్గనైజేషన్ సింగపూర్, శ్రీ సెంపగ వినాయగర్ టెంపుల్, సింగపూర్ సిలోన్ తమిళ్ అసోసియేషన్ మరియు మునీశ్వరన్ కమ్యూనిటీ సర్వీసెస్ సంయుక్తంగా రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సింగపూర్‌లోని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ స్థానిక ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఈ రక్తదాన శిబిరంలో దాదాపు 120 మంది దాతలు రక్తదానం చేశారు. సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి దాతలను అభినందించారు. రక్తదానం గురించి అందరూ అవగాహన పెంచుకోవాలని కోరారు. అందరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. సింగపూర్ తెలుగు సమాజం ఇలాంటి రక్తదాన శిబిరాలను అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తోందన్నారు. అయితే సాటి ఇతర భారతీయ మూలాలు కలిగిన స్థానిక సింగపూర్ భారతీయులతో కలిసి నిర్వహించడం విశేషం. ప్రత్యేకించి కొవిడ్-19 మహమ్మారి సమయంలో 9 సార్లు రక్తదాన శిబిరాలని నిర్వహించి తెలుగు సమాజం రికార్డు సృష్టించిందని పాలెపు మల్లిక్ గుర్తు చేశారు. ఈ శిబిరానికి వైదా మహేష్, రాపేటి జనార్ధన రావు , జ్యోతీశ్వర్ రెడ్డి సమన్వయకర్తలుగా వ్యవహరించారు. దాతలు, పరిశీలకులు, సేవాదళం సభ్యులకు సింగపూర్ తెలుగు సమాజం ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి అనిల్ కుమార్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అందరి సమష్టి కృషితోనే కార్యక్రమం విజయవంతమైనదన్నారు.(చదవండి: ఎంక్యాట్ పై అవగాహన కల్పించిన నాట్స్) -
సింగపూర్ తెలుగు ప్రజలకు కొత్త టెక్నాలజీపై అవగాహన కల్పించిన పీయూష్ గుప్త
సింగపూర్‌లో నివసించే తెలుగు సమాజం శ్రేయస్సు దృష్ట్యా అందరిలో వివిధ టెక్నాలజీ నైపుణ్యతలపై అవగాహన కల్పించడంతో పాటు ఈ కార్యక్రమాల ద్వారా జాతీయ సమగ్రత పెంపొందిచే విధంగా నవంబర్ 6న STS కనెక్ట్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా ప్రముఖ సింగపూర్ బ్యాంక్ డెవలప్వెంట్ ఆఫ్ సింగపూర్ గ్రూప్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి పీయూష్ గుప్త హాజరయ్యారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వివిధ టెక్నాలజీ అంశాలతో పాటు, భవిష్యత్తులో రానున్న సాంకేతిక పరిణామాలు, దానికి మనందరం ఎలా సిద్ధంగా ఉండాలి వాటి పరిణామాలు, క్రిప్టో & డిజిటల్ కరెన్సీ, ముఖ్యంగా యువతకు మార్గనిర్ధేశం, స్ధిరత్వం, సమతూల్యత, జాతీయ సమగ్రత, గ్లోబర్ వార్మింగ్, సామన్యుల తలసరి ఆదాయం పెంచుకోవడానికి సూచనలు వంటి వివిధ విభిన్న అంశాలతో కూడిన “ఫైర్ సైడ్ చాట్ విత్ పీయూష్ గుప్తా” శీర్షికతో మిస్ యూనివర్స్ సింగపూర్ నందిత బన్నా ముఖాముఖి చక్కగా నిర్వహించారు. తదనంతరం వివిధ అంశాలపై వీక్షకులు అడిగిన అనేక ప్రశ్నలకు అంతర్దృష్టితో అత్యంత ఆలోచనా భరితంగా పీయూష్ గుప్తా చర్చించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కోటిరెడ్డి ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని భవిష్య ప్రణాళికను, అవసరాన్ని ప్రారంభోపస్యాసంలో వివరించారు. STS కనెక్ట్స్ అనే కార్యక్రమాన్ని పీయూష్ గుప్త సమక్షంలో అందరి వీక్షకుల నడుమ లాంచనంగా ఆవిష్కరించారు. సుమారు 20 సంస్ధల సహకారంతో నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొని సాంకేతిక అంశాల అవగాహనతో పాటు, జాతీయ సమగ్రతను పెంపొందిచుకొని అంతిమ ప్రయోజనాన్ని పొందాలని కోరారు. ఈ కార్యక్రమానికి వాఖ్యతగా కార్యదర్శి సత్య చిర్ల వ్యవహరించారు. ప్రతి నెల ఒక్కొక్క సాంకేతిక అంశం యొక్క అవగాహనా కార్యక్రమం నిర్వహించబడుతుందని, ఒకరికొకరు సహాయం చేసుకొంటూ సమిష్టిగా అందరూ అభివృద్ధి చెందాలని, సింగపూర్ తెలుగు సమాజం సహకారం అందించడంలో ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. వివిధ మాధ్యమాల ద్వారా సుమారు 1000 మందికిపైగా పాల్గొన్నారని తెలిపారు. తమ విలువైన సమయాన్ని వెచ్చించిన పీయూష్ గుప్తాతో పాటు మిగతా అతిధులకు, నందితా బన్నాకు, వివిధ సంస్ధల కార్యవర్గసభ్యులకు, సింగపూర్ తెలుగుసమాజం కార్యవర్గానికి, వివిధ మాద్యమాల ద్వారా హాజరైన వారందరికీ కార్యక్రమ నిర్వాహకులు, ఉపాధ్యక్షులు అనిల్ పోలిశెట్టి కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ శీర్షికలో డిసెంబర్ 4న సైబర్ సెక్యూరిటీపై పేపాల్ ఆసియా పసిఫిక్ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ ఫోరమ్ మెహతా, జనవరిలో డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై లజాడా డేటా అండ్ ఎంటర్పైజ్ ఇంటలిజెన్స్ హెడ్ ముని వినయ్ లతో అవగాహనా కార్యక్రమం ఉంటుందని, వాటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంపై వీక్షకులు,నిపుణుల నుండి విశేష స్పందన లభించిందని, ఈ కార్యక్రమం తమ నైపుణ్యాలని పెంచుకోవటానికి, తద్వారా కెరీర్ పరంగా ముందుకెళ్లటానికి ఉపయోగపడుతుందని,తదుపరి ప్రోగ్రాం కోసం అందరూ ఆసక్తి గా ఎదురుచూస్తున్నట్లు సింగపూర్ తెలుగు సమాజం ప్రతినిధులు తెలిపారు. -
సింగపూర్‌లో అంగరంగ వైభవంగా సంక్రాంతి వేడుకలు
సింగపూర్: సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో అనాదిగా నిర్వహిస్తూ వస్తున్న సంక్రాంతి సందడి వేడుకలు, ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా జరిగాయి. తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించడమే ధ్యేయంగా పనిచేస్తున్న సింగపూర్ తెలుగు సమాజం.. ఈ ఏడాది కార్యక్రమాన్ని కోవిడ్ నిబంధనలను పాటిస్తూ సోషల్ మీడియా వేదికగా ఎంతో సాంప్రదాయబద్ధంగా నిర్వహించింది. సింగపూర్‌లో నివసిస్తున్న బాలబాలికలు, యువతీ యువకులతో వైవిధ్యభరితమైన సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళలతో రంగవల్లులు, చిన్నారులతో చిత్రలేఖనం పోటీలను నిర్వహించి, కార్యక్రమ వీక్షకులతోనే విజేతలను నిర్ణయించి బహుమతులను అందజేశారు. అలాగే ఈ కార్యక్రమంలో సింగపూర్ కాలమానంలో గుణించిన సింగపూర్ తెలుగు క్యాలెండెర్-2021ను ఆవిష్కరించారు. సంబురాల్లో భాగంగా నిర్వహించిన వైవిధ్యభరితమైన కహూట్ ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలవటంతో పాటు అన్ని వయస్సుల వారిని ఆసాంతం ఆకట్టుకున్నాయి. అన్ని వయనుల వారు ప్రత్యేకమైన ఆటపాటలతో అలరించి, పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు. ఉత్సవాల్లో పాల్గొన్న తెలుగు వారందరికీ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి సంక్రాతి శుభాకాంక్షలతో పాటు స్వాగత వచనాలు పలికారు. గత మూడు సంవత్సరాలుగా తమ కార్యవర్గాన్ని ఆదరించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మున్ముందు కూడా తెలుగువారందరి సహాయ సహకారాలతో అనేక కార్యక్రమాలు చేపడతామన్నారు. అలాగే తెలుగు సమాజం సొంత భవనం కలను త్వరలో సాకారం చేసుకోగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమ నిర్వహణ కార్యదర్శులు శ్రీనివాసరెడ్డి పుల్లన్న, ప్రసాద్ బచ్చు మాట్లాడుతూ.. కోవిడ్ అంక్షల కారణంగా అందరిని ప్రత్యక్షంగా కలవలేకపోయామని, అయినా కూడా అంతర్జాలంలో నిర్వహించిన కార్యక్రమాన్ని సుమారు 500 మంది వరకు వీక్షించారని పేర్కొన్నారు. ప్రతి ఏడాది భోగి పండుగకు ఉచితంగా పంపిణీ చేసే రేగుపండ్లను ఈ ఏడాది పంపిణీ చేయలేకపోయామని వారు పేర్కొన్నారు. ఉత్సవ నిర్వహణకు ఆధ్యంతం సహకరించిన స్వచ్ఛంద సేవకులకు, కార్యవర్గానికి, స్పాన్సర్లకు సింగపూర్ తెలుగు సమాజం కార్యదర్శి సత్య చిర్ల కృతజ్ఞతలు తెలియజేశారు. -
ఏపీఎన్ఆర్టి కోఆర్డినేటర్‌గా యర్రబోతుల శ్రీనివాస్‌రెడ్డి
అమెరికా: గుంటూరు ప్రవాసాంధ్రునికి అరుదైన అవకాశం లభించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టి) అమెరికా రీజనల్ కోఆర్డినేటర్‌గా యర్రబోతుల శ్రీనివాస్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఐటి అండ్ ఇండస్ట్రీ పాలసి ప్రచారం చేస్తూ, పెట్టుబడులు మరియు ఇతర అవకాశాలకు అమెరికాలోని తెలుగు వారికి ఏపీ ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తానని శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. -
కనిగిరి ప్రవాసాంధ్రునికి అరుదైన అవకాశం
ఆస్ట్రేలియా: ప్రకాశం జిల్లా కనిగిరి ప్రవాసాంధ్రునికి అరుదైన అవకాశం లభించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెన్స్ తెలుగు సొసైటీ(ఏపీఎన్ఆర్టి) ఆస్ట్రేలియా కోఆర్డినేటర్‌గా చింతల చెరువు సూర్యనారాయణ రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆస్ట్రేలియాలోని తెలుగు వారికి ఏపీ ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తానని సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. -
సింగపూర్ తెలుగు సమాజం 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ప్రపంచంలోనే భారతదేశం వెలుపల తెలుగు వారి కోసమే స్థాపించబడిన అతి కొద్ది ప్రాచీన సంస్థలలో ఒక్కటైన సింగపూర్ తెలుగు సమాజం ఎప్పటికప్పుడు తన జవసత్వాలను కూడగట్టుకొంటూ, దిన దిన ప్రవర్ధమానంగా విరాజిల్లుతూ 46వ వసంతంలోనికి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. గాన గంధర్వుడు పద్మ భూషణ్ బాల సుబ్రహ్మణ్యానికి, నాట్యమయూరి పద్మశ్రీ శోభా నాయుడికి ఘన నివాళి అర్పిస్తూ.. అంతర్జాల వేదికపై సింగపూర్ తెలుగు సమాజం 45వ ఆవిర్భావ దినోత్సవం, దీపావళి వేడుకల కార్యక్రమం నిర్వహించారు. చదవండి: సింగపూర్‌లో సద్దుల బతుకమ్మ సంబరాలు ఆధ్యాంతం తెలుగుదనం, తెలుగు కళలు, సాహిత్యం ఉట్టిపడుతూ సాగిన సాంస్కృతిక కార్యక్రమాలు మూడు తరాల ఆహుతులను ఎంతగానో అలరించాయి. కార్యక్రమానికి హాజరైన సమాజ పెద్దలు అలనాటి మధుర జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకొని ఆ అనుభవాలను అందరితో పంచుకొన్నారు. అంతేకాకుండా 45 వసంతాల సమాజ ప్రస్థానాన్ని, మధురానుభూతులను , గత సంవత్సర కాలంలో సమాజం నిర్వహించిన కార్యక్రమాలను బుర్రకధ రూపకంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని ఆన్లైన్లో 3000 మంది ప్రేక్షకులు వీక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిధి సందేశం, పూర్వపు కార్యనిర్వాహక సభ్యుల ఉపన్యాసాలు, చెప్పుకోండి చూద్దాం, పాటలు, రాజు కామెడీ, బుర్రకథలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తమ ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులు గాయకులు ప్రవీణ్ కుమార్ కొప్పోలుకి, గాయని సత్యకి, మిమిక్రీ రాజుకి, యాంకర్ నవతకి, బుర్రకథ విజయకుమార్ బృందానికి , ఆర్కెస్ట్రా వెంకటేష్ బృందానికి, తమ బిజీ షెడ్యూల్లో కొంత విలువైన సమయాన్ని వెచ్చించి, అమూల్యమైన సందేశం అందించిన ఇండియన్ హై కమీషనర్ ఇన్ సింగపూర్ పి. కుమరన్, సింగపూర్ తెలుగు సమాజం వారు ఏర్పాటు చేసిన ఛార్టర్డ్ ఫ్లైట్స్ విషయంలో వారు చేసిన సహాయ సహకారాలకు సింగపూర్ తెలుగు సమాజం ప్రెసిడెంట్ కోటి రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. తెలుగు సమాజ కీర్తిని, ప్రజలకు మెరుగైన సేవల్ని అత్యున్నత స్థాయిలో ఇవ్వటానికి తమ కమిటీ నిరంతరం శ్రమిస్తున్నదని తెలిపారు. సింగపూర్‌లో ఉండే తెలుగు వారందరూ సమాజ సభ్యులుగా చేరాలని , ఎల్లప్పుడూ కలసికట్టుగా ఉండాలని కోరారు. తెలుగు భవన నిర్మాణ కలను సాకారం చేసుకొనే దిశగా అందరూ తప్పకుండా సహాయ సహకారాలందించాలని విజ్ఞప్తి చేశారు. ఎస్టీఎస్ పూర్వ కార్యదర్శులు, కోశాధికారులు 45 ఏళ్లుగా సమాజంతో తమకున్న అనుబంధాన్ని నెమరువేసుకుంటూ సందేశాలు పంపినందుకు, కార్యక్రమానికి మా వెన్నంటి ఉన్న స్పాన్సర్లు శుభోదయం గ్రూప్‌కు, లగ్జరీ టూర్స్ అండ్ ట్రావెల్స్‌కు,హమారా బజార్‌కు, సెక్రటరీ సత్య చిర్ల ధన్యవాదాలు తెలిపారు. రమ్య బెహెరా పాడిన అమ్మవారి పాటను ఈ కార్యక్రమంలో ఆవిష్కరించిన శుభోదయం మీడియాకు, ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి కృషి చేసిన సింగపూర్ తెలుగు సమాజం కార్యవర్గ సభ్యులకు, కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికి కార్యక్రమ నిర్వాహకురాలు కురిచేటి స్వాతి కృతఙ్ఞతలు తెలియజేశారు. -
సింగపూర్‌లో సద్దుల బతుకమ్మ సంబరాలు
సింగపూర్: సింగపూర్‌లోని తెలుగు సమాజం ఆధ్వర్యంలో సింగపూర్ తెలంగాణ ఫ్రెండ్స్, టాస్-మనం తెలుగు వారి సహకారంతో అంగరంగ వైభవంగా శనివారం బతకమ్మ సంబరాలు జరిగాయి. ఈ పండుగను సింగపూర్ తెలుగు సమాజం వారు సుమారు 12 సంవత్సరాలుగా దిగ్విజయంగా ప్రతీ ఏడాది నిర్వహిస్తోంది. కరోనా కోరల్లో నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తెలుగు వారందరి క్షేమం మేరకు ప్రత్యేక ఉద్దేశంగా ఈ సంవత్సరం బతుకమ్మ సంబరాలను సాంఘిక మాధ్యమాల ద్వారా జరిపారు. కోవిడ్-19 నిబంధనలు కారణంగా, ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ఐదుగురు-ఐదుగురు సమూహంగా జూం యాప్ ద్వారా, అధిక సంఖ్యలో తెలుగింటి ఆడపడుచులు సింగపూర్ నలువైపులా నుంచి ఆటపాటలతో, కోలాటాల విన్యాసాలతో సద్దుల బతుకమ్మ సంబరాలలో ఆనందంగా పాల్గొని వేడుక జరుపుకున్నారు. క్లిష్ట సమయంలో సైతం పండుగ శోభ ఏమాత్రం తగ్గకుండా రకరకాల పువ్వులతో అనేక రంగురంగులతో తీర్చిదిద్దిన బతుకమ్మలు అందరినీ అలరించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత జూమ్ యాప్ ద్వారా ఈ వేడుకను ఉద్ధేశించి మాట్లాడారు. కోవిడ్-19 పరిస్థితుల్లో కూడా సింగపూర్‌లోని తెలుగు వారు పెద్ద ఎత్తున సద్దుల బతుకమ్మ జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆమె బతుకమ్మ పండుగ విశిష్టతను ఆంతర్యాన్ని వివరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ... మనిషి ప్రకృతితో మమేకమయ్యే పండుగలలో అతి పెద్దదైన ఈ బతుకమ్మ పూల పండుగ ఘనమైన తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అన్నారు. వెయ్యి సంత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ పండుగను సింగపూర్‌లో సాంప్రదాయబద్ధంగా పెద్దఎత్తున నిర్వహించుకోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు. సింగపూర్‌లో నివసిస్తున్న తెలుగువారందికీ ఈ సందర్భంగా తెలుగు సమాజం తరుపున ఆయన బతుకమ్మ, విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సింగపూర్ తెలంగాణా ఫ్రెండ్స్ తరుపున కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. ఒకే ప్రదేశంలో పెద్ద ఎత్తున పండగ చేసుకొనే మనం ప్రత్యేక పరిస్ధితులలో జూమ్ ద్వారా కూడా అట్టహాసంగా జరుపుకోవటం ఆనందంగా ఉందన్నారు. టాస్- మనం తెలుగు తరుపున అనితా రెడ్డి మాట్లాడుతూ... ప్రాంతాలు, మాండలికాలు వేరైనా అందరం కలసికట్టుగా, సంసృతి సాంప్రదాయాలతో పాటు బంధాలు తెలిపే పండుగ ఈ బతుకమ్మ అని తెలియజేశారు. చివరగా ఈ కార్యక్రమం నిర్వహకులు శ్రీనివాస్ రెడ్డి పుల్లన్న మాట్లాడుతూ... ఆన్ లైన్ ద్వారా ప్రసారం చేయబడిన ఈ కార్యక్రమంలో సుమారు 10,000 మందికి పైగా పాల్గొన్నారని చెప్పారు. అదే విధంగా సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ప్రత్యక్ష ప్రసారం చేశామన్నారు. ఈ వేడుకలో పాల్గొని విజయవంతం చేసిన కార్యవర్గ సభ్యులకు, సింగపూర్ తెలంగాణ ఫ్రెండ్స్ సభ్యులు, టాస్ - మనం తెలుగు వారికి , స్పాన్సర్లకు కార్యదర్శి సత్యచిర్లకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. -
‘సింగపూర్ తెలుగు సమాజం’ రక్తదాన శిబిరం
సింగపూర్: సామాజిక సేవా కార్యక్రమాలలో ఎల్లప్పుడూ ముందుండే సింగపూర్ తెలుగు సమాజం, ఈ ఏడాదిలోనే రెండో సారి అక్టోబర్ 11 న స్ధానిక హెల్త్ సర్వీసెస్ అథారిటీ సింగపూర్ బ్లడ్ బాంక్ నందు రక్తదాన శిబిరం నిర్వహించింది. ఎన్నో సంవత్సరాలుగా సింగపూర్ తెలుగు సమాజం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి స్థానికంగా నివసిస్తున్న తెలుగు వారితో పాటు ఇతర దాతలు కూడా స్వచ్ఛందంగా విచ్చేసి రక్త దానం చేశారు. ఈ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. మొత్తం 120 మంది నమోదు చేసుకోగా 100 మంది హాజరయ్యారయి రక్తదానం చేశారు. రక్తదానం చేయాలనుకుంటున్న ఇతరదాతలు తరువాత రోజుల్లో కూడా RO284 కోడ్ ఉపయోగించి రక్తదానం చేయవచ్చని నిర్వాహకులు సోమ రవి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం పట్ల సింగపూర్ తెలుగు సమాజానికి, బ్లడ్ బాంక్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత కోవిడ్ -19 కష్టకాలంలో ముందుకు వచ్చి వెలకట్టలేని రక్తదానం చేసిన దాతలకు సమాజం అధ్యక్షులు కోటి రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. చదవండి: విద్యార్థులకు ‘గాటా’ చేయూత.. -
తెలుగు తెరకు సిసలైన పండగ
సందర్భం: తెలుగుసినిమా పుట్టినరోజు తెలుగు సమాజంపై అమితంగా ప్రభావం చూపుతున్న మాధ్యమం అంటే, నిస్సందేహంగా సినిమానే! కట్టూబొట్టూ, మాట, పాట, మనిషి తీరూ- ఇలా అన్నిటిపైనా ముద్ర వేసిన పాపం, పుణ్యం మన సినిమాలదే. అలాంటి తెలుగు సినిమాకు ఇవాళ పుట్టినరోజు, ప్రేక్షకులకు పండగ రోజు. తొలి పూర్తి తెలుగు టాకీ ‘భక్తప్రహ్లాద’ 83 ఏళ్ళ క్రితం సరిగ్గా ఇదే రోజున విడుదలైంది. ప్రముఖ దర్శకుడు హెచ్.ఎం. రెడ్డి దర్శకత్వంలో తయారై,1932 ఫిబ్రవరి 6న రిలీజవడంతో పూర్తి స్థాయి తెలుగు చిత్రాలు మొదలయ్యాయి. అంతకు ముందు దాకా భాషతో ప్రమే యం లేని మూగచిత్రాలు (మూకీలు) వచ్చేవి. తొలి భారతీయ టాకీ ‘ఆలమ్ ఆరా’ 1931 మార్చి 14న విడుదలవడంతో ఆయా భాషల వారీగా వాక్చిత్రాలు (టాకీలు) రావడం మన దేశంలో మొదలైంది. ‘ఆలమ్ ఆరా’కు దర్శకత్వ శాఖలో పని చేసిన హెచ్.ఎం. రెడ్డే ఆ తరువాత సరిగ్గా ఏడున్నర నెలలకు తొలి దక్షిణ భారతీయ భాషా టాకీ ‘కాళిదాస్’ను రూపొందించారు. ప్రధానంగా తమిళం, కొన్ని తెలుగు మాటలు -పాటలు, అక్కడక్కడా హిందీ డైలాగులతో తయారైన సినిమా ‘కాళిదాస్’. ఆ చిత్రం 1931 అక్టోబర్ 31న విడుదలైంది. దర్శక - నిర్మాతలు అప్పట్లో ‘‘తొలి తమిళ - తెలుగు టాకీ’’ అంటూ ‘కాళిదాస్’కు ప్రకటనలు జారీ చేశారు. ఆ సగం తెలుగు సినిమా విడుదలై, విజయవంతం కావడంతో, ఈ సారి పూర్తిగా తెలుగులోనే తీయాలనే ఆలోచన వచ్చింది. అప్పుడు మళ్ళీ హెచ్.ఎం. రెడ్డి దర్శకత్వంలోనే పూర్తి తెలుగు టాకీగా ‘భక్త ప్రహ్లాద’ రూపొందింది. ఆ చిత్ర నిర్మాణం, సెన్సారింగ్, తొలి విడుదల కూడా బొంబాయిలోనే! నిజానికి, సగం తెలుగున్న‘కాళిదాస్’ కన్నా ముందే, ఈ పూర్తి తెలుగు టాకీ 1931 సెప్టెంబర్ 15న వచ్చిందని కొద్దికాలం ఆధారరహిత ప్రచారం జరిగింది. అయితే, అది వాస్తవం కాదని సీనియర్ జర్నలిస్టు, పరిశోధకుడు డాక్టర్ రెంటాల జయదేవ కొన్నేళ్ళ పరిశ్రమతో, సాక్ష్యాధార సహితంగా ఆ మధ్య నిరూపించారు. ‘భక్త ప్రహ్లాద’ 1932 జనవరి 22న సెన్సార్ పూర్తి చేసుకొని, ఫిబ్రవరి 6న విడుదలైనట్లు అసలు నిజాలు వెలికితీశారు. ఈ తొలి పూర్తి తెలుగు సినిమా కేవలం 18 వేల రూపాయల పెట్టుబడితో, 18 రోజుల్లో నిర్మాణమైంది. మొత్తం 9,762 అడుగుల నిడివిగల 10 రీళ్ళ సినిమా ఇది. ధర్మవరం రామకృష్ణమాచార్యుల నాటకం ఆధారంగా, సురభి నాటక సంస్థ నటులతో సినిమా తీశారు. హిరణ్యకశిపుడిగా మునిపల్లె సుబ్బయ్య, అతని భార్య లీలావతిగా ‘సురభి’ కమలాబాయి, వారి బిడ్డ ప్రహ్లాదుడిగా మాస్టర్ కృష్ణారావు ముఖ్యపాత్రధారులు. అలా మొదలైన సినిమా హంగామా ఇవాళ్టికీ తెలుగునాట అప్రతిహతంగా సాగుతోంది. కానీ, మనవాళ్ళ అశ్రద్ధ వల్ల ఈ చిత్రాల ప్రింట్లే లేవు. ఇప్పటికైనా మన సినిమా పెద్దలు కళ్ళు తెరిచి పుణే ఫిల్మ్ ఆర్కైవ్స్ లాంటి చోట్ల మిగిలిన మన కొద్దిపాటి పాత తెలుగు చిత్రాల ప్రింట్లనైనా డిజిటలైజ్ చేయిస్తారా? మన సినిమాకు అసలైన బర్తడే గిఫ్టి స్తారా? లేక మన తెలుగు ప్రభుత్వాలు పరస్పర విభేదాల్లో పడి వాటినీ గాలిలో కలిపేస్తాయా?