‘సింగపూర్ తెలుగు సమాజం’ రక్తదాన శిబిరం | Blood Donation Campaign by Singapore Telugu Society | Sakshi
Sakshi News home page

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యం లో రక్తదాన శిబిరం

Published Mon, Oct 12 2020 2:05 PM | Last Updated on Mon, Oct 12 2020 2:17 PM

Blood Donation Campaign by Singapore Telugu Society - Sakshi

సింగపూర్‌: సామాజిక సేవా కార్యక్రమాలలో ఎల్లప్పుడూ ముందుండే  సింగపూర్ తెలుగు సమాజం, ఈ ఏడాదిలోనే రెండో సారి అక్టోబర్ 11 న స్ధానిక హెల్త్ సర్వీసెస్ అథారిటీ సింగపూర్ బ్లడ్ బాంక్ నందు రక్తదాన శిబిరం నిర్వహించింది. ఎన్నో సంవత్సరాలుగా సింగపూర్ తెలుగు సమాజం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి స్థానికంగా నివసిస్తున్న తెలుగు వారితో పాటు ఇతర దాతలు కూడా స్వచ్ఛందంగా విచ్చేసి రక్త దానం చేశారు.  ఈ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. మొత్తం 120 మంది నమోదు చేసుకోగా 100 మంది హాజరయ్యారయి రక్తదానం చేశారు.

రక్తదానం చేయాలనుకుంటున్న ఇతరదాతలు తరువాత రోజుల్లో కూడా RO284 కోడ్ ఉపయోగించి రక్తదానం చేయవచ్చని నిర్వాహకులు సోమ రవి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం పట్ల సింగపూర్ తెలుగు సమాజానికి, బ్లడ్ బాంక్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత కోవిడ్ -19 కష్టకాలంలో ముందుకు వచ్చి వెలకట్టలేని రక్తదానం చేసిన దాతలకు సమాజం అధ్యక్షులు కోటి రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

చదవండి: విద్యార్థులకు ‘గాటా’ చేయూత..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement