తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం | Blood donation camp byTelangana Cultural Society Singapore | Sakshi
Sakshi News home page

తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

Apr 24 2023 12:53 PM | Updated on Apr 24 2023 1:10 PM

Blood donation camp byTelangana Cultural Society Singapore - Sakshi

సింగపూర్‌: తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో ఏప్రిల్ 23 న ఇక్కడి హెల్త్ అండ్ సైన్సు అథారిటీ (HSA) సమక్షంలో, 11 ఔట్ రమ్ రోడ్ లో ఏర్పాటు చేసిన TCSS రక్త దాన శిబిరం విజయవంతం అయింది. వరుసగా గత పద్నాలుగు సంవత్సరాల నుండి ఈ రక్తదాన శిబిరాన్ని TCSS నిర్వహిస్తుంది. సొసైటీ పిలుపు మేరకు ఎంతో మంది దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ శిబిరం లో పాల్గొని రక్త దానం చేశారు.

ఈ సందర్భంగా హెల్త్ అండ్ సైన్సు అథారిటీ ఆఫ్ సింగపూర్ అధికారులు మాట్లాడుతూ దశాబ్దానికి పైగా క్రమం తప్పకుండా ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయం అన్నారు. మరియు ఎల్లప్పుడూ ఇలాంటి లాభాపేక్ష లేని సామాజిక కార్యక్రమాలు చేస్తున్న తెలంగాణ కల్చరల్ సొసైటీ ని కొనియాడడం తో పాటు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తలుగా రవి చైతన్య మైస, సంతోష్ వర్మ మాదారపు , వెంకట రమణ వ్యవహరించారు.  సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ఉపాధ్యక్షులు గోనె నరేందర్ రెడ్డి, కమిటీ సభ్యులు శశిధర్ రెడ్డి, ప్రవీణ్ మామిడాల , సంతోష్ వర్మ మాదారపు , ఇతర సభ్యులు ముక్కా కిషోర్, ముక్కా సతీష్, వినయ్ చంద్, నవీన్ కటకం, మల్లిక్ పల్లెపు, నవీన్ నోముల,సాయి బాలె  తదితరులు రక్తదానం చేశారు.

ఈ రక్తదాన సేవ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన వారందరికి సొసైటీ తరపున సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్ గుప్త, కమిటీ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల ధన్యవాదాలు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement