![Telangana Cultural Society New Working Committee - Sakshi](/styles/webp/s3/article_images/2020/12/20/Telangana-Cultural-Society.jpg.webp?itok=QXtdiMnb)
సింగపూర్: తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఏడవ వార్షిక సర్వ సభ్య సమావేశం ఆదివారం జూమ్ ద్వారా నిర్వహించారు. ఈ సమావేశంలో టీసీఎస్ఎస్ నూతన కార్యవర్గం ఏర్పాటైంది. ప్రస్తుత అధ్యక్షుడు నీలం మహేందర్‌ని.. కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ప్రతిపాదించడంతో పాటు నామినేషన్ గడువులోగా ఒకే టీమ్ నుండి నామినేషన్ రావడంతో ఎలాంటి పోటీ లేకుండానే మరోసారి ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తనపై నమ్మకంతో మరోసారి బాధ్యతను అప్పగించి, ఇక్కడి తెలంగాణ వాసులకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నూతన కార్యవర్గం సహకారంతో సొసైటీని మరింత అభివృద్ధి చేయడానికి శాయశక్తుల కృషి చేస్తానని పేర్కొన్నారు.
నూతన కార్యవర్గంలో సొసైటీ అధ్యక్షులుగా నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, సంస్థాగత కార్యదర్శి గడప రమేష్ బాబు, కోశాధికారి కల్వ లక్ష్మణ్ రాజు, ఉపాధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్, గోనె నరేందర్ రెడ్డి, నల్ల భాస్కర్ గుప్త, మిర్యాల సునీత రెడ్డి, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్, జూలూరి సంతోష్, బొడ్ల రోజారమణి, నంగునూరి వెంకట రమణ, కార్యవర్గ సభ్యులు నడికట్ల భాస్కర్, గింజల సురేందర్ రెడ్డి, శ్రీధర్ కొల్లూరి, చకిలం ఫణిభూషణ్, గజ్జి రమాదేవి, నగమడ్ల దీప, ఆరూరి కవిత, గర్రేపల్లి కస్తూరి, వీరమల్లు కిరణ్, రంగ పట్నాల ఎన్నికయ్యారు. కార్యనిర్వాహక వర్గ సభ్యులుగా పెరుకు శివరామ్ ప్రసాద్, గార్లపాటి లక్ష్మా రెడ్డి, అనుపురం శ్రీనివాస్, శివప్రసాద్ ఆవుల, శశిధర్ రెడ్డి, ప్రవీణ్ మామిడాల, పట్టూరి కిరణ్ కుమార్, రవి కృష్ణ కాసర్ల శ్రీనివాస్‌లను ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment