coordinator
-
నెల్లూరు వైఎస్సార్సీపీ లోక్‌సభ సమన్వయకర్తగా విజయసాయిరెడ్డి
సాక్షి, అమరావతి: ఒక లోక్‌సభ స్థానానికి, రెండు శాసనసభ స్థానాలకు వైఎస్సార్సీపీ సమన్వయకర్తలను నియమిస్తూ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. తొమ్మిదో జాబితాలో వైఎస్సార్సీపీ నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్తగా వేణుంబాక విజయసాయిరెడ్డి, కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా ఎ.ఎండీ ఇంతియాజ్ (రిటైర్డ్ ఐఏఎస్), మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా మురుగుడు లావణ్యలను నియమించారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. -
Shombi Sharp: ప్రపంచానికి భారత్ అవసరం
న్యూఢిల్లీ: సామాజిక అంశాలపై పెట్టుబడుల పరంగా భారత్ కంపెనీలు ముందున్నందున ప్రపంచానికి భారత్ అవసరం ఎంతో ఉందని ఐక్యరాజ్యసమితి భారత రెసిడెంట్ కోర్డినేటర్ శొంబిషార్ప్ పేర్కొన్నారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో వ్యాపారాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఢిల్లీలో కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)పై జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా శొంబి మాట్లాడారు. భారత ప్రయాణంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత అనివార్యమంటూ.. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడానికి చేస్తున్న ప్రయత్నాలలో వ్యాపారాలు ముందున్నట్టు చెప్పారు. సీఎస్ఆర్ విషయంలో, భారత్ ప్రపంచాన్ని నడిపిస్తున్నట్టు తెలిపారు. ‘‘ప్రపంచంలో సగానికి సగం దేశాలు విద్య, ఆరోగ్యం కంటే తమ అప్పులు తీర్చడానికే ఎక్కువ కేటాయింపులు చేయాల్సి వస్తోంది. ఇలాంటి సమస్యలను ప్రపంచం ఎదుర్కొంటోంది. ఇటీవలి జీ20 సదస్సు సందర్భంగా భారత్ నాయకత్వ పాత్ర పోషించింది’’అని శొంబి పేర్కొన్నారు. కంపెనీల చట్టంలోని నిబంధనల ప్రకారం లాభాల్లోని కంపెనీలు క్రితం మూడేళ్ల కాలంలోని సగటు లాభాల నుంచి 2 శాతాన్ని సామాజిక కార్యక్రమాల కోసం (సీఎస్ఆర్) వ్యయం చేయాల్సి ఉంటుంది. -
సామాజిక న్యాయంతో కొత్త సమన్వయకర్తలు
సాక్షి, అమరావతి: సామాజిక న్యాయం అనేది నినాదం కాదు.. అనుసరించాల్సిన విధానమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి చాటిచెప్పారు. కేబినెట్ నుంచి నామినేటెడ్ పదవుల వరకూ సింహభాగం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇచ్చి రాజ్యాధికారంలో వాటా కల్పించి సామాజిక న్యాయమంటే ఇదీ అని దేశానికి చాటిచెప్పిన సీఎం జగన్ తాజాగా 11 నియోజకవర్గాలకు నూతన సమన్వయకర్తల నియామకంలోనూ అదే విధానాన్ని పాటించారు. ప్రస్తుతం అగ్రవర్ణాలకు చెందిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు నియోజకవర్గాలకు కొత్త సమన్వయకర్తలుగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించారు. మంత్రులు విడదల రజని, మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్‌లు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలను మార్పు చేశారు. మరింత మెరుగైన ఫలితాలే లక్ష్యంగా.. ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సీఎం వైఎస్ జగన్ సమాయత్తం చేస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితులను శాస్త్రీయంగా, క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ మరింత మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా, సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ మార్పుచేర్పులు చేస్తున్నారు. ఈ క్రమంలో 11 నియజకవర్గాలకు కొత్త సమన్వయకర్తలను నియమించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ నియోజకవర్గ సమన్వయకర్తగా చేనేత సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవిని సీఎం జగన్ నియమించారు. గాజువాక ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి కుమారుడు, నియోజకవర్గ సమన్వయర్త దేవన్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వరికూటి రామచంద్రరావును నియమించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజినిని నియమించారు. ఆమె ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్తగా కాపు సామాజిక వర్గానికి చెందిన మల్లెల రాజేష్‌నాయుడిని నియమించారు. -
Vishala Reddy Vuyyala: విశాల ప్రపంచం
ఈ ఏడాది మనదేశంలో జీ 20 సదస్సులు జరిగాయి. దేశదేశాల ప్రతినిధులు మనదేశంలో అడుగుపెట్టారు. వారికి మనదేశం గురించి సరళంగా వివరించాలి. ఆ వివరణ మనకు గర్వకారణంగా సమగ్రంగా ఉండి తీరాలి. అందుకు ఒక గిఫ్ట్ బాక్స్‌ను రూపొందించారు విశాల రెడ్డి. మిల్లెట్ బ్యాంకు స్థాపకురాలిగా తన అనుభవాన్ని జోడించారు. మన జాతీయ పతాకాన్ని గర్వంగా రెపరెపలాడించారు. విశాలాక్షి ఉయ్యాల. చిత్తూరు జిల్లాలో ముల్లూరు కృష్ణాపురం అనే చిన్న గ్రామం ఆమెది. ప్రపంచ దేశాల ప్రతినిధులు హాజరైన జీ 20 సదస్సులో సమన్వయకర్తగా వ్యవహరించారు. మనదేశంలో విస్తరించిన అగ్రికల్చర్, కల్చర్, ఆర్ట్, క్రాఫ్ట్, కళావారసత్వాలను కళ్లకు కట్టారు. అంత గొప్ప అవకాశం ఆమెకు బంగారు పళ్లెంలో పెట్టి ఎవ్వరూ ఇవ్వలేదు. తనకు తానుగా సాధించుకున్నారు. ‘ఆడపిల్లకు సంగటి కెలకడం వస్తే చాలు, చదువెందుకు’ అనే నేపథ్యం నుంచి వచ్చారామె. ‘నేను బడికెళ్తాను’ పోరాట జీవితంలో ఆ గొంతు తొలిసారి పెగిలిన సమయమది. సొంతూరిలో ఐదవ తరగతి పూర్తయిన తర్వాత మండల కేంద్రంలో ఉన్న హైస్కూల్‌కి వెళ్లడానికి ఓ పోరాటం. కాళ్లకు చెప్పుల్లేకుండా పదికిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి చదువుకున్నారు. ఆ తర్వాత కాలేజ్... కుప్పంలో ఉంది. రోజూ ఇరవై– ఇరవై నలభై కిలోమీటర్ల ప్రయాణం. డిగ్రీ కర్నాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో. అప్పటికి ఇంట్లో పోరాడి కాలేజ్‌కి వెళ్లడానికి ఒక సైకిల్ కొనిపించుకోగలిగారామె. ప్రయాణ దూరం ఇంకా పెరిగింది. మొండితనంతో అన్నింటినీ గెలుస్తూ వస్తున్నప్పటికీ విధి ఇంకా పెద్ద విషమ పరీక్ష పెట్టింది. తల్లికి అనారోగ్యం. క్యాన్సర్‌కి వైద్యం చేయించడానికి బెంగుళూరుకు తీసుకువెళ్లడం, డాక్టర్లతో ఇంగ్లిష్‌లో మాట్లాడగలిగిన చదువు ఉన్నది ఇంట్లో తనకే. బీఎస్సీ సెరికల్చర్ డిస్కంటిన్యూ చేసి అమ్మను చూసుకుంటూ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ డిస్టెన్స్‌లో బీఏ చేశారు. అమ్మ ఆరోగ్యం కోసం పోరాటమే మిగిలింది, అమ్మ దక్కలేదు. ఆమె పోయిన తర్వాత ఇంట్లో వాళ్లు ఏడాది తిరక్కుండా పెళ్లి చేసేశారు. మూడవ నెల గర్భిణిగా పుట్టింటికి రావాల్సి వచ్చింది. ఎనిమిది నెలల బాబుని అక్క చేతిలో పెట్టి హైదరాబాద్‌కు బయలుదేరారు విశాలాక్షి ఉయ్యాల. ‘తొలి ఇరవై ఏళ్లలో నా జీవితం అది’... అంటారామె. ‘మరో ఇరవై ఏళ్లలో వ్యక్తిగా ఎదిగాను, మూడవ ఇరవైలో వ్యవస్థగా ఎదుగుతున్నా’నని చెప్పారామె. హైదరాబాద్ నిలబెట్టింది! ‘‘చేతిలో పదివేల రూపాయలతో నేను హైదరాబాద్‌లో అడుగు పెట్టిన నాటికి ఈవెంట్స్ రంగం వ్యవస్థీకృతమవుతోంది. ఈవెంట్స్ ఇండస్ట్రీస్ కోర్సులో చేరిపోయాను. ఇంగ్లిష్ భాష మీద పట్టుకోసం బ్రిటిష్ లైబ్రరీ, రామకృష్ణ మఠం నుంచి పుస్తకాలు తెచ్చుకుని చదివేదాన్ని. మొత్తానికి 2004లో నెలకు మూడు వేల జీతంతో ఈవెంట్ మేనేజర్‌గా ఉద్యోగంలో చేరాను. ఆ తర్వాత నోవాటెల్‌లో ఉద్యోగం నా జీవితానికి గొప్ప మలుపు. ప్రపంచస్థాయి కంపెనీలలో ఇరవైకి పైగా దేశాల్లో పని చేయగలిగాను. నా పేరుకు కూడా విశాలత వచ్చింది చేసుకున్నాను. హైదరాబాద్‌లో రహగిరి డే, కార్ ఫ్రీ డే, వన్ లాక్ హ్యాండ్స్ వంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహించాను. ప్రదేశాలను మార్కెట్ చేయడంలో భాగంగా హైదరాబాద్‌ని మార్కెట్ చేయడంలో భాగస్వామినయ్యాను. ఒక ప్రదేశాన్ని మార్కెట్ చేయడం అంటే ఆ ప్రదేశంలో విలసిల్లిన కల్చర్, ఆర్ట్, క్రాఫ్ట్ అన్నింటినీ తెలుసుకోవాలి, వచ్చిన అతిథులకు తెలియచెప్పాలి. అలాగే రోడ్ల మీద ఉమ్మడం, కొత్తవారి పట్ల దురుసుగా ప్రవర్తించడం వంటి పనులతో మన ప్రదేశానికి వచ్చిన వ్యక్తికి చేదు అనుభవాలు మిగల్చకుండా పౌరులను సెన్సిటైజ్ చేయాలి. ఇవన్నీ చేస్తూ నా రెండవ ఇరవై ముగిసింది. అప్పుడు కోవిడ్ వచ్చింది. హాలిడే తీసుకుని మా ఊరికి వెళ్లాలనిపించింది. అప్పుడు నా దగ్గరున్నది పదివేలు మాత్రమే. నాకు అక్కలు, అన్నలు ఏడుగురు. నా కొడుకుతోపాటు వాళ్ల పిల్లలందరినీ చదివించాను. అప్పటికి నేను పెట్టిన స్టార్టప్ మనుగడ కూడా ప్రశ్నార్థకమైంది. పదివేలతో వచ్చాను, ఇరవై ఏళ్ల తర్వాత పదివేలతోనే వెళ్తున్నాను... అనుకుంటూ మా ఊరికెళ్లాను. ఊరు కొత్త దారిలో నడిపించింది! నా మిల్లెట్ జర్నీ మా ఊరి నుంచే మొదలైంది. మా అక్క కేజీ మిల్లెట్స్ 15 రూపాయలకు అమ్మడం నా కళ్ల ముందే జరిగింది. అవే మిల్లెట్స్ నగరంలో యాభై రూపాయలు, వాటిని కొంత ప్రాసెస్ చేస్తే వంద నుంచి రెండు– మూడు వందలు, వాటిని రెడీ టూ కుక్‌గా మారిస్తే గ్రాములకే వందలు పలుకుతాయి. తినే వాళ్లకు పండించే వాళ్లకు మధ్య ఇంత అగాథం ఎందుకుంది... అని ఆ అఖాతాన్ని భర్తీ చేయడానికి నేను చేసిన ప్రయత్నమే మిల్లెట్ బ్యాంక్. ఈ బ్యాంక్‌ను మా ఊరిలో మొదలు పెట్టాను. ఒక ప్రదేశం గురించి అక్కడి అగ్రికల్చర్, కల్చర్, ఆర్ట్, క్రాఫ్ట్ అన్నీ కలిస్తేనే సమగ్ర స్వరూపం అవగతమవుతుంది. నేను చేసింది అదే. మా మిల్లెట్ బ్యాంకు జీ 20 సదస్సుల వరకు దానంతట అదే విస్తరించుకుంటూ ఎదిగింది. ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, చేర్యాల పెయింటింగ్స్, ఉత్తరాది కళలు, మన రంగవల్లిక... అన్నింటినీ కలుపుతూ ఒక గిఫ్ట్ బాక్స్ తయారు చేశాను. ప్రతినిధులకు, వారి భాగస్వాములకు భారతదేశం గురించి సమగ్రంగా వివరించగలిగాను. జీ20 ద్వారా ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్న నా మిల్లెట్ బ్యాంకు మరింతగా వ్యవస్థీకృతమై ఒక అమూల్లాగా ఉత్పత్తిదారుల సహకారంతో వందేళ్ల తర్వాత కూడా మనగలగాలనేది నా ఆకాంక్ష. మిల్లెట్ బ్యాంకుకు అనుబంధంగా ఓ ఇరవై గ్రీన్ బాక్స్‌లు, సీడ్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేయాలి. రైతును తన గింజలు తానే సిద్ధం చేసుకోగలిగినట్లు స్వయంపోషకంగా మార్చాలనేది రైతు బిడ్డగా నా కోరిక’’ అని మిల్లెట్ బ్యాంకు, సీడ్ బ్యాంకు స్థాపన గురించి వివరించారు విశాలరెడ్డి. స్త్రీ ‘శక్తి’కి పురస్కారం టీసీఈఐ (తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ) నిర్వహిస్తున్న ‘స్త్రీ శక్తి అవార్డ్స్ 2023’ అవార్డు కమిటీకి గౌరవ సభ్యురాలిని. ఈ నెల 17వ తేదీన హైదరాబాద్, గచ్చిబౌలిలో పురస్కార ప్రదానం జరుగుతుంది. గడచిన ఐదేళ్లుగా స్త్రీ శక్తి అవార్డ్స్ ప్రదానం జరగనుంది. ఇప్పటి వరకు తెలంగాణకు పరిమితమైన ఈ అవార్డులను ఈ ఏడాది జాతీయస్థాయికి విస్తరించాం. పదిహేనుకు పైగా రాష్ట్రాలతోపాటు మలేసియా, యూఎస్‌లలో ఉన్న భారతీయ మహిళల నుంచి కూడా ఎంట్రీలు వచ్చాయి. అర్హత కలిగిన ఎంట్రీలు 250కి పైగా ఉండగా వాటిలో నుంచి 50 మంది అవుట్ స్టాండింగ్ ఉమెన్ లీడర్స్ పురస్కారాలందుకుంటారు. జీవితంలో ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నారు, ఆత్మస్థయిర్యం కోల్పోకుండా ముందుకు సాగిన వైనం, వారు సాధించిన విజయాలు– చేరుకున్న లక్ష్యాలు, ఎంతమందికి ఉపాధినిస్తున్నారు, వారి భవిష్యత్తు ప్రణాళికలు కార్యాచరణ ఎలా ఉన్నాయనే ప్రమాణాల ఆధారంగా విజేతల ఎంపిక ఉంటుంది. – విశాల రెడ్డి ఉయ్యాల ఫౌండర్, మిల్లెట్ బ్యాంకు – వాకా మంజులారెడ్డి ఫొటోలు: ఎస్. ఎస్. ఠాకూర్ -
వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచే ఆదాల పోటీ: సజ్జల
సాక్షి, తాడేపల్లి: నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఆదాల పోటీ చేస్తారన్నారు. సీఎంను కలిసిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు. వైఎస్సార్సీపీ గెలుపు కోసం కృషి చేస్తా: ఆదాల ఆదాల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ, రూరల్ ఇంఛార్జ్‌గా నియమించడం సంతోషకరమన్నారు. వైఎస్సార్సీపీ గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు. ఇకపై అన్ని కార్యక్రమాలు ఆదాల నేతృత్వంలోనే: బాలినేని బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబును కోటంరెడ్డి కలిసి టిక్కెట్ హామీ తీసుకున్నారని, బాబును కలిసిన తర్వాత ట్యాపింగ్ అంటూ మాట్లాడుతున్నారని బాలినేని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్‌పై రుజువు చేసి మాట్లాడాలని, రెండేళ్లుగా ఫోన్ ట్యాపింగ్ అంటూ ఇప్పుడెందుకు మాట్లాడారంటూ ఆయన దుయ్యబట్టారు. రూరల్ ఇంఛార్జ్‌గా ఆదాల ప్రభాకర్‌రెడ్డిని సీఎం ఖరారు చేశారు. ఇకపై అన్ని కార్యక్రమాలు ఆదాల నేతృత్వంలోనే జరగనున్నాయని బాలినేని స్పష్టం చేశారు. చదవండి: టీడీపీలో చేరే ఎమ్మెల్యేలు బావిలో దూకినట్టే: మంత్రి పెద్దిరెడ్డి -
YSRCP: విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా అడారి ఆనంద్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా అడారి ఆనంద్‌ను నియమిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. చదవండి: విద్యారంగంలో జగన్ జైత్రయాత్ర -
‘టీమ్ వైఎస్ఎస్ఆర్’ కోఆర్డినేటర్‌గా మల్లాది సందీప్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ టీమ్ వైఎస్ఎస్ఆర్ స్టేట్ కో-ఆర్డినేటర్‌గా మల్లాది సందీప్‌కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిలకు సందీప్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని మల్లాది పేర్కొన్నారు. కీలక బాధ్యతలను అప్పగించిన పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల నమ్మకాన్ని వమ్ము చేయకుండా చిత్తశుద్ధితో పనిచేస్తానని సందీప్‌కుమార్ తెలిపారు. చదవండి: సమస్యలు లేవంటే ముక్కు నేలకు రాస్తా -
ఏపీఎన్ఆర్టి కోఆర్డినేటర్‌గా యర్రబోతుల శ్రీనివాస్‌రెడ్డి
అమెరికా: గుంటూరు ప్రవాసాంధ్రునికి అరుదైన అవకాశం లభించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టి) అమెరికా రీజనల్ కోఆర్డినేటర్‌గా యర్రబోతుల శ్రీనివాస్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఐటి అండ్ ఇండస్ట్రీ పాలసి ప్రచారం చేస్తూ, పెట్టుబడులు మరియు ఇతర అవకాశాలకు అమెరికాలోని తెలుగు వారికి ఏపీ ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తానని శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. -
కనిగిరి ప్రవాసాంధ్రునికి అరుదైన అవకాశం
ఆస్ట్రేలియా: ప్రకాశం జిల్లా కనిగిరి ప్రవాసాంధ్రునికి అరుదైన అవకాశం లభించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెన్స్ తెలుగు సొసైటీ(ఏపీఎన్ఆర్టి) ఆస్ట్రేలియా కోఆర్డినేటర్‌గా చింతల చెరువు సూర్యనారాయణ రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆస్ట్రేలియాలోని తెలుగు వారికి ఏపీ ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తానని సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. -
కో ఆర్డినేటర్‌పై టీడీపీ వర్గీయుల దాడి
రెంటచింతల(మాచర్ల): వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్‌పై టీడీపీ వర్గీయులు హత్యాయత్నానికి తెగబడ్డారు. గుంటూరు జిల్లా రెంటచింతల మండలం పశర్లపాడు గ్రామానికి చెందిన గాదె బ్రహ్మారెడ్డి కొంతకాలంగా గుంటూరులో ఉంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం పశర్లపాడు నుంచి రెంటచింతలకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా పిల్లివాగు సమీపంలో టీడీపీకి చెందిన నల్లబిరుదు నర్సింహారావు, అతని మేనల్లుడులు రాయంకుల నాగేశ్వరరావు, రాయంకుల రాజశేఖర్ కలిసి కర్రలు, గొడ్డలి, బరిసెలతో హత్యాయత్నానికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన బ్రహ్మారెడ్డిని స్థానికులు గురజాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బ్రహ్మారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చల్లా సురేష్ తెలిపారు. -
వైఎస్ జగన్ నమ్మకాన్ని నిలబెడతా..
సాక్షి, తూర్పుగోదావరి: వైఎస్సార్సీపీ రాజమండ్రి నగర కో-ఆర్డినేటర్‌గా శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. పదవీ స్వీకారోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్సార్సీపీని విజయ పంథాన నడిపిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆళ్ల నాని, సుభాష్ చంద్రబోస్, కన్నబాబు, తానేటి వనిత, విశ్వరూప్, ఎంపీలు భరత్, గీత, అనురాధ, ఎమ్మెల్యేలు జగ్గిరెడ్డి, రాజా, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
వరదలో చిక్కుకున్న 40 మంది కూలీలు
సాక్షి, ములుగు: తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో.. వాగులు, వంకలు వరదలతో ఉప్పొంగుతున్నాయి. బుధవారం జిల్లాలోని మండపేట మండలంలో తిమ్మాపూర్ వద్ద ముసలమ్మ వాగు వరద నీటితో ఉదృతంగా పారుతోంది. కూలీ పనులకు వెళ్లిన 40 మంది వాగు దాటుతూ.. వారదలో చిక్కుకొని ఆరు గంటలపాటు వరద నీటిలో నరకయాతన అనుభవించారు. దీంతో తమను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశారు. ఈ ఘటనతో మండలంలో ఆందోళన వాతావరణం నెలకొంది. కాగా సమాచారం అందుకున్న పిసా చట్టం కోఆర్డినేటర్, స్థానిక గ్రామస్తులు బాధితులను రక్షించేందుకు సాహసం చేసి తాళ్ల సాయంతో వాగును దాటించారు. దీంతో వరద నీటి నుంచి సురక్షితంగా బయటపడ్డ కూలీలు ఊపిరి పిల్చుకున్నారు. -
యాంకర్‌కు మత్తుమందు ఇచ్చి..
సాక్షి, హైదరాబాద్: సినిమాల్లో అవకాశం కల్పిస్తా మని నమ్మించి, ప్రేమిస్తున్నానని పెళ్లి చేఐసుకుంటానని మాయ మాటలు చెప్పి, ఓ సినీ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్, యాంకర్‌కు మత్తుమందు ఇచ్చి లైంగికదాడికి పాల్పడిన జూనియర్ ఆర్టిస్టుపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా , మానేపల్లి గ్రామానికి చెందిన కొండా పుల్లారెడ్డి అలియాస్ శ్రీశాంత్ రెడ్డి శ్రీకృష్ణానగర్‌లో ఉంటూ సినిమా షూటింగ్‌లకు యువతులను సరఫరా చేసే కో–ఆర్డినేటర్‌గానే కాకుండా సినిమాల్లో నటిస్తున్నాడు. గత ఏడాది అక్టోబర్‌లో నటి, యాంకర్, డబ్బింగ్ ఆర్టిస్టుతో అతడికి పరిచయం ఏర్పడింది. గత డిసెంబర్ 10న బోరబండలోని ఆమె గదికి వెళ్లిన శ్రీశాంత్ ద్రాక్షరసంలో మత్తుమందు కలిపి తాగించాడు. ఆమె మత్తులోకి జారుకున్న అనంతరం లైంగికదాడికి పాల్పడటమే కాకుండా, బీరువాలో ఉన్న 40 తులాల బంగారు ఆభరణాలు, రూ.5 లక్షల నగదు తీసుకుని పరారయ్యాడు. కొద్దిరోజుల తర్వాత ఆమె నిలదీయగా పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆ తర్వాత ఎన్నిమార్లు అడిగినా దాటవేస్తుండటంతో బాధితురాలు గురువారం నటి శ్రీరెడ్డిని కలిసి తనకు న్యాయం చేయాలని కోరింది. అదే సమ యంలో శ్రీశాంత్ రెడ్డి తనను కొందరు బెదిరిస్తున్నారంటూ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వచ్చాడు. మధ్యాహ్నం శ్రీశాంత్ రెడ్డి పోలీస్‌స్టేషన్‌లో ఉన్నట్లు తెలుసుకున్న బాధితురాలు అక్కడికి చేరుకోగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో ఆమెతో పాటు వచ్చిన మరో యువతి చెప్పుతో కొట్టేందుకు యత్నించగా ఉద్రిక్తత నెలకొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సినిమాల్లో అవకాశం కల్పిస్తానని శ్రీశాంత్‌రెడ్డి క్యాస్టింగ్ కౌచ్‌కు పాల్పడుతున్నాడని, ఎంతో మంది యువతులను నిర్మాతలు, దర్శకులు, హీరోల వద్దకు పంపాడని ఆరోపించారు. కార్యాలయాలకు యువతులను పిలిపించుకుని వారికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసి నగదు, నగలు దొంగిలిస్తున్నాడని తెలిపారు. -
టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక
పామిడి : జీ కొట్టాల గ్రామంలో 12 దళిత కుటుంబాలకు సంబంధించి 50 మంది వైఎస్సార్సీపీ నియో జకవర్గ సమన్వయకర్త వై వెంక టరామిరెడ్డి సమక్షంలో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీ కం డువాలతో వారిని వైవీఆర్ పార్టీ లోకి ఆహ్వానించారు. పార్టీలో చేరినవారి లో ఈశ్వరయ్య, హనుమంతు, ఓబులేసు, ఆదినారాయణ, ఉలింద, లక్ష్మీదేవి, రమాదేవి, రాధమ్మ, తదితర కుటుం బాలవారున్నారు. ప్రజాసంకల్పయాత్ర చేస్తూ నిరంతరం ప్రజలకో సం శ్రమిస్తూ , ప్రత్యేకహోదా సాధన కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న జగన్ పట్ల ఆకర్షితులమై పార్టీలో చేరినట్లు వారు చెప్పారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టన చంద్రబాబు పీకి ప్రత్యేకహోదా విషయంలో పూటకో మాట, రోజుకో యూటర్న్‌లతో ఐదుకోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కేంద్రం వద్ద చంద్రబాబు తాకట్టు పెట్టారని వైవీఆర్ విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయలబ్ధి కోసం తిరిగి ప్రత్యేకహోదాను తెరపైకి తెచ్చి రంగులేని డ్రామాలతో దొంగదీక్ష, సైకిల్‌యాత్రతో ఐదుకోట్ల ఆంధ్రుల చెవుల్లో పూలు పెడుతున్న సీఎం బాబును ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. మొదటి నుం చి ప్రత్యేకహోదా కోసం అలుపెరుగని పోరాటాలు చేస్తూ విలువలతో కూడిన రాజకీయ పోరాటం చేస్తున్న జగన్‌కు రోజురోజుకూ ప్రజాదరణ అధికమవుతోందన్నారు. ప్రత్యేకహోదా సాధన, రాష్ట్రాభివృద్ధి జగన్‌తోనే సాధ్యమన్నది జనం అభిమతమన్నారు. బాధితులకు రూ.50 వేలు అందజేత ఇటీవల దాడిలో గాయపడి మృతి చెందిన దళిత ప్రసాద్ కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వై వెంకటరామిరెడ్డి ఆదివారం పరామర్శించారు.జీ కొట్టాల గ్రామంలోని బాధిత కుటుం బ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ పోషణకు రూ.50 వేలను వారికి అందజేశారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే అన్ని విధాల ఆదుకుంటామని వారికి భరోసా ఇచ్చారు. -
నన్నే ప్రేమించాలి.. నన్నే పెళ్లి చేసుకోవాలి
బంజారాహిల్స్: ‘నన్నే ప్రేమించాలి... పెళ్లంటూ చేసుకుంటే నన్నే చేసుకోవాలి.. ఇంకెవరితోనైనా మాట్లాడావో ఖబడ్దార్..! ఎవరితో మాట్లాడాలన్నా నా అనుమతి తీసుకోవాలి.. నా మాట వినకపోయావో.. నీ క్యారెక్టర్ మంచిది కాదని చిత్రపరిశ్రమతో పాటు నీ కుటుంబ సభ్యుల్లో కూడా బదనాం చేస్తా అంటూ ఓ యువకుడు తనను మానసిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తూ ఓ సినీనటి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీకృష్ణానగర్, పిల్లర్ నంబర్ 3 వద్ద నివసించే వర్ధమాన నటికి (23)ని రెండు నెలలుగా జూనియర్ ఆర్టిస్ట్‌లను సరఫరా చేసే కో–ఆర్డినేటర్ రాజు వేధింపులకు గురి చేస్తున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడమేగాక ప్రతి రోజూ ఆమె గది వద్దకు వెళ్లి న్యూసెన్స్ చేస్తున్నాడు. ఎవరితోనైనానా మాట్లాడాలంటే తన అనుమతి తీసుకోవాలని లేకపోతే మీ తల్లిదండ్రులకు చెడుగా చెబుతానని బెదిరిస్తున్నాడు. ఈ నెల 17న ఆమె తాను నటిస్తున్న సినిమా దర్శకుడితో మాట్లాడుతుండగా అక్కడికి వచ్చి అతడితో నీకు సంబంధం ఏంటంటూ ప్రశ్నించాడు. తనతో పాటు బైక్ ఎక్కకపోతే దుష్ప్రచారం చేస్తానని హెచ్చరించడంతో రాజుపై చర్యలు తీసుకోవాలని తనకు రక్షణ కల్పించాలని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. జేబులో యాసిడ్ సీసా పెట్టుకొని తనను బెదిరిస్తున్నాడని ఆరోపించింది. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చింతలపూడి సమన్వయకర్తగా దమ్ము సుహాసిని
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తను నియమించింది. పార్టీకి చెందిన సీనియర్ నేత దమ్ము సుహాసినిని నియోజకవర్గ సమన్వయ కర్తగా నియమిస్తూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పత్రికా ప్రకటన వెలువడింది. ఈసందర్భంగా సుహాసిని పార్టీ అధినేతకు కృతజ్ఞతలు తెలిపారు.ప్రజా సమస్యలను తెలుసుకుంటూ పార్టీ ఆశయాలతో పాటు, నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి తనవంతు కృషిచేస్తానని అన్నారు. -
చంద్రబాబుపై ప్రజలకు భ్రమలు తొలగాయి
- వైఎస్సార్ సీపీ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ కో–ఆర్డినేటర్ సునీల్ కరప : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ప్రజలు పెట్టుకున్న భ్రమలు తొలగిపోయాయని, గ్రామాల్లో, నగరాల్లో ఎక్కడ చూసినా వ్యతిరేకత కనిపిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ కో–ఆర్టినేటర్ చలమలశెట్టి సునీల్ అన్నారు. బుధవారం కరప వచ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన విధంగా నవ్యాంధ్ర ప్రదేశ్‌ను కూడా అభివృద్ధి చేస్తారని ప్రజలు నమ్మి గెలిపించారన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం పేరు చెప్పి ప్రచారం చేసుకోవడమే కానీ చేసిందేమీ కనిపించడంలేదన్నారు. అమలు సాధ్యంకానీ వాగ్దానాలతో అధికారం చేజిక్కించుకున టీడీపీ వాటిని అమలుచేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. జన్మభూమి కమిటీలు నియమించడంతో అవినీతిని గ్రామస్థాయికి తీసుకుపోయారని సునీల్ విమర్శించారు. తమ పార్టీ అధినేత వైఎస్జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా ప్రధాని నరేంద్రమోదీని కలిస్తే తప్పేంటని ప్రశ్నించి, దీన్ని అధికార పార్టీ నాయకులు, మంత్రులు రాజకీయం చేయడం తగదన్నారు. ప్రధానిని ఎవరైనా కలవవచ్చన్న రాజకీయ పరిజ్ఞానం కూడా లేకపోవడం శోచనీయమన్నారు. అనంతరం కార్యకర్తలతో మాట్లాడుతూ టీడీపీ సాగిస్తున్న అవినీతి పాలనపై జగన్ చేస్తున్న పోరాటాన్ని ప్రజలకు వివరించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. -
పార్టీ బలోపేతానికి కృషి చేస్తా
∙వైఎస్సార్ సీపీ గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షులు దుర్గేష్ మధురపూడి నుంచి భారీ కాన్వాయితో ఘనస్వాగతం పలికిన అభిమానులు దానవాయిపేట(రాజమహేంద్రవరం): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం సిటీ, రూరల్ నియోజవర్గాల్లో పటిష్ట కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి డివిజన్‌స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆ పార్టీ గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్ పేర్కొన్నారు. గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడిగా నియామకం అనంతరం గురువారం నగరానికి వచ్చిన దుర్గేష్‌కు పార్టీ నాయకులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. మధురపూడి విమానాశ్రయం నుంచి భారీ కాన్వాయి, మోటర్ సైకిళ్ల తో ర్యాలీగా ఆయన వెంట వచ్చారు. గాడాల, కోలమూరు, కొంతమూరు, క్వారీ సెంటర్ మీదుగా కంబాలచెరువు సెంటర్‌కు చేరుకుని మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్మకంతో తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తానన్నారు. 2019 ఎన్నికల్లో పార్టీని వ్యూహాత్మకంగా ముందుకు తీసుకువెళ్లి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామన్నారు. రాజమహేంద్రవరం సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో పటిష్ట కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. నెలావారీ సమావేశాలు నిర్వహించి ఇప్పటి నుంచే ఎన్నికలకు సమాయత్తం చేస్తామని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలను ఎండగట్టి పాలకుల వైపల్యాలను ప్రజల్లోకి తీసుకువెళతామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చేలా పని చేయడమే తన ధ్యేయమని ప్రకటించారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో ఆ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గుత్తుల మురళీధర్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు రావిపాటి రామచంద్రరావు, నక్కా రాజబాబు, ఆచంట సుబ్బారాయుడు, ఆచంట కళ్యాణ్, గంటి నరసయ్య, సలాది ప్రసాద్, వెలుగుబంటి అచ్యుతరామయ్య, సాపిరెడ్డి సూరిబాబు, ముద్రగడ జమ్మి, యొజ్జు వాసు, చెరుకూరి సత్యనారాయణ, తాడేపల్లి గణేష్, తోరాటి శ్రీను, మెండా దత్తులు, యండ్ల మహేష్, మార్తి లక్షీ్మనాగేశ్వరావు, సిటీ, రూరల్ నియోజక వర్గాల నేతలు ఆయన వెంట ర్యాలీగా Ðð ంట వచ్చారు. వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ల అభినందనలు... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడిగా ఎన్నికైన కందుల దుర్గేష్‌ను ఆ పార్టీ నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలా రెడ్డి, కార్పొరేటర్లు బొంతా శ్రీహరి, ఈతకోట బాపన సుధారాణి, పిల్లి నిర్మల పార్టీ నాయకులు మజ్జి అప్పారావు, పెంకె సురేష్ గురువారం ఆయన నివాసానికి వెళ్లి అభినందనలు తెలిపారు. -
వైఎస్సార్సీపీ ఏలూరు సమన్వయకర్తగా శ్రీధర్
హైదరాబాద్: వైఎస్సార్సీపీ నేత కోటగిరి శ్రీధర్ శుక్రవారం ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యలయం ఓ ప్రకటన విడుదల చేసింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పశ్చిమ గోదావరికి చెందిన శ్రీధర్‌ను ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమిస్తున్నట్లు పేర్కొంది. -
జమ్మలమడుగులో YSRCP సమావేశం
-
పస్తులు
♦ 8 నెలలుగా వేతనాల్లేవ్.. ♦ దుర్భరస్థితిలో సాక్షరభారత్ కోఆర్డినేటర్లు ♦ జిల్లాలో 2,154 మంది గ్రామ కోఆర్డినేటర్లు ♦ మండల కోఆర్డినేటర్ల పరిస్థితీ అంతే... ♦ పత్రికలకు సైతం రాని బిల్లులు జోగిపేట: జిల్లాలోని సాక్షర భారత్ కోఆర్డినేటర్లు దుర్భర స్థితిని ఎదుర్కొంటున్నారు. ఎనిమిది మాసాలుగా వేతనాలు అందక పోవడంతో పస్తులతో కాలం గడుపుతున్నారు. ఇదిగో ఇప్పుడిస్తాం..అప్పుడిస్తాం అంటూ అధికారుల మాయ మాటలు చెప్పి ఊరిస్తున్నారే తప్ప జీతాలు మాత్రం ఇవ్వడంలేదు. దీంతో కుటుంబాలు గడవక కోఆర్డినేటర్ల అవస్థలు వర్ణణాతీతం. గ్రామీణ ప్రాంతాల్లోని అక్షరాస్యులను సంపూర్ణ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ‘సాక్షరభారత్’ కార్యక్రమాన్ని 2010లో ప్రారంభించింది. ఇటీవలే 5వ దశ సాక్షర భారత్ కార్యక్రమం పూర్తయ్యింది. త్వరలో ఆరో దశకు కూడా ప్రారంభించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తొంది. సంపూర్ణ అక్షరాస్యత సాధిస్తేనే సమాజం వేగవంతంగా ప్రగతి సాధిసాధిస్తుందనే సదాశయంతో కేంద్ర సాక్షరభారత్ చేపట్టింది. ఇందుకు ప్రతి గ్రామ పంచాయతీలో రెండు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. రెండు కేంద్రాలలో ఇద్దరు సాక్షర భారత్ కో ఆర్డినేటర్లను నియమించింది. ఉదయం వేళ పత్రికలు చదవడానికి అడల్డ్ ఎడ్యుకేషన్ సెంటర్ (ఏఈసీ) సాయంత్రం సమయంలో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు సాక్షర భారత్ కేంద్రాలను ప్రారంభించింది. కోఆర్డినేటర్లకు నెలకు రెండు వేల రూపాయల గౌరవ వేతనం, ఇవ్వాలని నిర్ణయించి అర్హులైన వారిని సాక్షర భారత్ కోఆర్డినేటర్లుగా గ్రామానికి ఇద్దరిని ఎంపిక చేసింది. ఏఈసీ కేంద్రాన్ని ఒకరు, సాక్షర భారత్ కేంద్రాన్ని మరొకరు ఉదయం, సాయంత్రం సమయాల్లో తెరచి ఉంచాలని విధి విధానాలను రూపొందించింది. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు మండలానికి ఒకరు చొప్పున మండల సాక్షర భారత్ కోఆర్డినేటర్‌గా నియమించింది. వీరికి నెలకు 6వేల చొప్పున వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. జిల్లాలో మొత్తం 2,154 మంది వీసీఓలు, 46 మంది ఎంసీఓలు పనిచేస్తున్నారు. వీరికి గత సంవత్సరం అక్టోబర్ వరకు వేతనాలను అందజేశారు. నవంబర్ మాసం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి వేతనాలు అందించలేదు. జిల్లా అంతట వేతనాలు లేక అలమటిస్తున్నారు. ప్రతినిత్యం కేంద్రాలను తెరచి సంపూర్ణ అక్షరాస్యత కోసం కృషి చేస్తున్న తమకు వేతనాలు ఇవ్వకపోవడం భావ్యం కాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లుగా పత్రికలకూ బిల్లులు లేవు ప్రతి గ్రామ పంచాయతీలోని సాక్షర భారత్ కేంద్రంలో రెండు దినపత్రికలు వేసుకోవాలనే నిబంధన ఉంది. దీంతో సాక్షర భారత్ కోఆర్డినేటర్లు దినపత్రికలు వేసుకుంటున్నారు. రెండేళ్లుగా దినపత్రికలకు సైతం బిల్లులు చెల్లించడంలేదని గ్రామాల కోఆర్డినేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల నెలా తామూ పత్రికల ఏజెంట్లకు డబ్బులు చెల్లిస్తున్నామన్నారు. తమకు మాత్రం రెండేళ్లుగా పత్రికల బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కోఆర్డినేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో వేతనాలు వస్తాయి జిల్లాలో పనిచేస్తున్న మండల, గ్రామ కోఆర్డినేటర్లకు పెండింగ్‌లో ఉన్న వేతనాలు త్వరలో వస్తాయి. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో అధికారులు తమకు తెలియజేశారు. వేతనాలకు సంబంధించిన బడ్జెట్ రిలీజ్ అయ్యిందని, ఆరు మాసాల వేతనాలు చెల్లించే అవకాశం ఉంది. గత సంవత్సరం అక్టోబర్ మాసం వరకు మండల, గ్రామ కోఆర్డినేటర్లకు వేతనాలు చెల్లించాం. గ్రామాల్లో సాక్షర భారత్ కేంద్రాలను కూడా ప్రతి రోజు నడిపేందుకు గ్రామ కోఆర్డినేటర్లు చర్యలు తీసుకోవాలి. - ఉషామార్థా సాక్షర భారత్ డిప్యూటీ డెరైక్టర్ -
సాక్షర భారత్ కోఆర్డినేటర్ ఆత్మహత్యాయత్నం
శాయంపేట: వరంగల్ జిల్లా శాయంపేట మండల సాక్షర భారత్ కో ఆర్డినేటర్ గురువారం ఆత్మహత్యాయత్నం చేశాడు. 16 నెలలుగా తనకు వేతనాలు అందడం లేదంటూ సాక్షర భారత్ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్న కుమారస్వామి ఎంపీడీవో కార్యాలయం వద్ద వంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయబోగా పోలీసులు అడ్డుకున్నారు. కమీషన్ ఇవ్వనందున వేతనాల ఫైలుపై ఎంపీపీ రమాదేవి సంతకం చేయడంలేదని అతడు వాపోయాడు. -
జీతాలు ఇంకెప్పుడిస్తరు!
శివాజీనగర్, న్యూస్‌లైన్ : నిరక్షరాస్యత నిర్మూలనకోసం అమలు చేస్తున్న సాక్షర భారత్ కార్యక్రమం అభాసుపాలవుతోంది. తొమ్మిది నెలలుగా వేతనాలు అందక కార్యక్రమ కోఆర్డినేటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో మండల, గ్రామ స్థాయి కోఆర్డినేటర్లు సుమారు 1,400 మంది పనిచేస్తున్నారు. మండల కోఆర్డినేటర్లకు నెలకు రూ. 6 వేలు, గ్రామ కోఆర్డినేటర్లకు రూ. 2 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తున్నారు. అయితే మండల కోఆర్డినేటర్లకు ఏడు నెలలుగా, గ్రామ కోఆర్డినేటర్లకు తొమ్మిది నెలలుగా వేతనాలు అందడం లేదు. వేతనాలు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కోఆర్డినేటర్లు పలుసార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయింది. దీంతో వారు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. అన్ని జిల్లాల్లోని కోఆర్డినేటర్లంతా కలిసి ఈ నెల 30వ తేదీన హైదరాబాద్‌లోని వయోజన విద్య డెరైక్టరేట్‌ను ముట్టడించాలని నిర్ణయించారు. పెండింగ్‌లో ఉన్న వేతనాలను విడుదల చేయాలని, కనీస వేతనం పెంచాలని, వయోజన విద్యాశాఖలో ఖాళీగా ఉన్న సూపర్వైజర్ పోస్టులను మండల కోఆర్డినేటర్లు, అంగన్వాడీ కార్యకర్తలతో భర్తీ చేయాలని, ఆరోగ్య భద్రత కల్పించాలని, ప్రతి నెల క్రమం తప్పకుండా వేతనాలివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఎనిమిది ప్రధాన డిమాండ్లతో డెరైక్టరేట్ ముట్టడికి సిద్ధమవుతున్నారు. వేతనాలు విడుదల చేయాలి సాక్షర భారత్ కోఆర్డినేటర్లకు ఏడెనిమిది నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. దీంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి వేతనాలు మంజూరు చేయాలి. గ్రామ కోఆర్డినేటర్ల వేతనాన్ని రూ. 4 వేలకు, మండల కోఆర్డినేటర్ల వేతనాన్ని రూ. 12 వేలకు పెంచాలి. నెలనెలా క్రమం తప్పకుండా వేతనం అందేలా చర్యలు తీసుకోవాలి. -శంకర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు,సాక్షర భారత్ ఉద్యోగుల సంఘం, ఇందూరు