
అసెంబ్లీ సమన్వయకర్తలుగా కర్నూలుకు ఇంతియాజ్, మంగళగిరికి మురుగుడు లావణ్య నియామకం
సాక్షి, అమరావతి: ఒక లోక్‌సభ స్థానానికి, రెండు శాసనసభ స్థానాలకు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తలను నియమిస్తూ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. తొమ్మిదో జాబితాలో వైఎస్సార్‌సీపీ నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్తగా వేణుంబాక విజయసాయిరెడ్డి, కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా ఎ.ఎండీ ఇంతియాజ్ (రిటైర్డ్ ఐఏఎస్), మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా మురుగుడు లావణ్యలను నియమించారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.