
సాక్షి, తాడేపల్లి: విజయసాయిరెడ్డి ఆరోపణలు సరికాదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేవీరావుకు, వైవీ సుబ్బారెడ్డి మధ్య ఎలాంటి సంబంధాలు లేవు. ఇద్దరి మధ్య సంబంధాలుంటే కేవీరావు కేసు ఎందుకు వేశారు?. ఎవరో ఇచ్చిన స్క్రిప్టును సాయిరెడ్డి చదివారు. వైఎస్సార్‌సీపీ ద్వారా ఎదిగిన వ్యక్తి సాయిరెడ్డి. నాయకుడు కష్టకాలంలో ఉంటే ఇలా పార్టీని వీడి వెళ్తారా?’’ అంటూ సుధాకర్ బాబు నిలదీశారు.
‘‘రాజ్యసభను వదిలేసి రాజకీయ సన్యాసం ఎందుకు తీసుకున్నారు?. రఘు రామ కృష్ణంరాజుకు సాయిరెడ్డి తన ఇంటిని ఎందుకు అద్దెకు ఇచ్చారు?. అవతలి వ్యక్తులతో సాయిరెడ్డి ఎందుకు కలిశారు?. సాయిరెడ్డి పదేపదే కోటరీ అని మాట్లాడారు. ఆయనే స్వయంగా ఎంతోమందిని మా నాయకుడికి పరిచయం చేశారు. మరి ఆయన్ని మించిన కోటరీ ఇంకేం ఉంది?. సీఐడీ విచారణ అనేది ఒక బూటకం. విచారణ పేరుతో వచ్చి సాయిరెడ్డి డ్రామా చేశారు’’ అని సుధాకర్‌బాబు మండిపడ్డారు.
‘‘మా నేతలు, పార్టీపై అనవసర ఆరోపణలు చేశారు. సాయిరెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేయటం ద్వారా ఎవరికి లాభం చేకూర్చినట్టు?. కేసులకు, వైఎస్సార్‌సీపీ నేతలకు లింకు పెట్టవద్దు’’ అంటూ సాయిరెడ్డికి సుధాకర్‌బాబు హితవు పలికారు.

Comments
Please login to add a commentAdd a comment