
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తను నియమించింది. పార్టీకి చెందిన సీనియర్ నేత దమ్ము సుహాసినిని నియోజకవర్గ సమన్వయ కర్తగా నియమిస్తూ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పత్రికా ప్రకటన వెలువడింది.
ఈసందర్భంగా సుహాసిని పార్టీ అధినేతకు కృతజ్ఞతలు తెలిపారు.ప్రజా సమస్యలను తెలుసుకుంటూ పార్టీ ఆశయాలతో పాటు, నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి తనవంతు కృషిచేస్తానని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment