suhasini
-
ఆస్పత్రిలో చేరిన హీరో కమల్ హాసన్ సోదరుడు
ప్రముఖ నటుడు, దర్శకుడు చారు హాసన్‌ని ఆస్పత్రిలో చేర్పించారు. ఈ విషయాన్ని ఈయన కుమార్తె, ఒకప్పటి హీరోయిన్ సుహాసిని చెప్పుకొచ్చింది. దీపావళి పండగ ముందు అంటే గురువారం రాత్రి చారు హాసన్.. అస్వస్థతకు గురికావడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: 'లక్కీ భాస్కర్' సినిమా రివ్యూ)'దీపావళికి ముందే మా నాన్న అస్వస్థతకు గురయ్యారు. మా పండగ ఎమర్జెన్సీ వార్డులో గడిచిపోయింది. ప్రస్తుతం ఆయన సర్జరీకి సిద్ధమవుతున్నారు' అని సుహాసిని తన్ ఇన్ స్టాలో రాసుకొచ్చింది. ఈ క్రమంలోనే ఆయన త్వరగా కోలుకోవాలని నెటిజన్స్, కమల్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 15 సినిమాలు) View this post on Instagram A post shared by Suhasini Hasan (@suhasinihasan) -
చంద్రబాబుపై క్రిమినల్ కేసు..!?
-
ఆస్పత్రి పాలైన హీరో కమల్ హాసన్ సోదరుడు.. ఏమైందంటే?
ప్రముఖ హీరో కమల్ హాసన్ సోదరుడు చారు హాసన్ ఆస్పత్రి పాలయ్యారు. ప్రస్తుతం ఈయన వయసు 93 ఏళ్లు. ఈ వయసులో వచ్చే అనారోగ్య సమస్యల కారణంగా తాజాగా అస్వస్థతకు గురయ్యారు. ఈ మేరకు హాస్పిటల్లో చేర్చారు. ఈ క్రమంలోనే ఈయన కూతురు, ప్రముఖ నటి సుహాసిని ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. తండ్రి పరిస్థితి గురించి ఆసక్తికరంగా రాసుకొచ్చింది.(ఇదీ చదవండి: ఎన్నాళ్ల నుంచో ఇబ్బంది పడుతున్నాం.. హీరో రాజశేఖర్ ట్వీట్)కమల్ హాసన్‌కి చారు హాసన్ అన్నయ్య. వీళ్లిద్దరి మధ్య 15 ఏళ్ల గ్యాప్ ఉంది. ఇకపోతే చారు హాసన్ కి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సుహాసిని ఇందులో ఒకరు. తెలుగు, తమిళ సినిమాల్లో అప్పట్లో హీరోయిన్ గా చాలాగుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తల్లి పాత్రలు పోషిస్తోంది.ఇదిలా ఉండగా నటుడు, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న చారు హాసన్.. 1979 నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. 93 ఏళ్ల వయసులోనూ 'హర' అనే సినిమాలో నటించారు. తాజాగా ఆరోగ్య రీత్యా వచ్చే సమస్యల కారణంగా ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం తన తండ్రికి ఏం పర్లేదని, కోలుకుంటున్నారని సుహాసిని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: టాలీవుడ్ తీరుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి) View this post on Instagram A post shared by Suhasini Hasan (@suhasinihasan) -
అంగన్వాడీ కార్యకర్తపై టీడీపీ నేత పల్లె అనుచరుల దుశ్చర్య
పుట్టపర్తి అర్బన్: శ్రీసత్యసాయి జిల్లా ఓడీ చెరువు మండలం నారసింపల్లి తండాకు చెందిన మినీ అంగన్వాడీ కార్యకర్త , ఎస్టీ కులానికి చెందిన సుహాసినిపై టీడీపీ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అనుచరుడు ఆంజనేయులు బలాత్కారానికి యత్నించాడు. వివరాల్లోకి వెళితే సుహాసిని కుమార్తె కదిరిలో చదువుతోంది. ఆదివారం సెలవు కావడంతో ఇంటికి కుమార్తెను ఇంటికి తీసుకొస్తుండగా.. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో నాయనాకోట తండాలో కాపుకాసిన పల్లె అనుచరుడు ఆంజనేయులు, అతని కుటుంబ సభ్యులు సుహాసిని చీర లాగి బలాత్కారం చేయబోయారు. ఆమె వద్ద ఉన్న సెల్‌ఫోన్ లాక్కున్నారు. అడ్డొచ్చిన ఆమె తల్లిపై దాడిచేసి చేయి విరగ్గొట్టారు. కులం పేరుతో దూషించారు. తోటి కార్యకర్తను కాపాడిందని.. ఓడీచెరువు మండలం వీరప్పగారిపల్లి అంగన్వాడీ కార్యకర్త పోస్టును తన కుటుంబ సభ్యులకు ఇప్పించుకోవాలని ఆంజనేయులు ప్రయతి్నస్తున్నాడు. ఈ క్రమంలోనే స్థానిక అంగన్వాడీ కార్యకర్త నాగమణిని వేధింపులకు గురి చేశారు. దీంతో ఆమె మనస్తాపానికి గురై ఈ నెల 27న ఆత్మహత్యకు ప్రయతి్నంచింది. అంగన్వాడీ కేంద్రంలోనే సెల్ఫీ వీడియో తీసి ఆంజనేయులు ఆగడాలను వివరిస్తూ పురుగుమందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లింది.పక్క గ్రామమైన నారసింపల్లి తండాకు చెందిన మినీ అంగన్వాడీ కార్యకర్త సుహాసినికి విషయం తెలియడంతో వెంటనే సదరు కేంద్రానికి వెళ్లి తోటివారితో కలిసి నాగమణిని 108 వాహనంలో కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నాగమణి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. కాగా.. నాగమణిని రక్షించిందనే కోపంతో సుహాసినిపై పల్లె అనుచరుడు ఆంజనేయులు దాషీ్టకానికి ఒడిగట్టాడు. బాధితురాలు జాయింట్ కలెక్టర్ అభిõÙక్కుమార్, ఎస్పీ కార్యాలయంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా అంగన్వాడీ కార్యకర్తపై దాడి చేసిన ఆంజనేయులు, అతని కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీదేవి, గౌరవాధ్యక్షుడు వెంకటే‹Ù, అధ్యక్షుడు మహబున్నీషా, కోశాధికారి శ్రీదేవి,కార్యదర్శి దిల్షాద్ పాల్గొన్నారు. -
సూర్యాపేటలో ఘోరం: ఆడపిల్ల అని తెలిసి అబార్షన్, వైద్యం వికటించి..
సూర్యాపేటటౌన్: పుట్టేది ఆడపిల్ల అని తెలిసి భార్యకు ఆర్ఎంపీతో భర్త అబార్షన్ చేయించగా, వైద్యం వికటించి ఆమె మృతిచెందింది. మృతురాలి కుటుంబసభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండలం ఎంజీనగర్‌తండాకు చెందిన రత్నావత్ హరిసింగ్‌కు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం వెన్నారం గ్రామ పంచాయతీ పరిధిలోని రాముతండాకు చెందిన సుహాసిని(26)కి ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు. సుహాసిని మూడోసారి గర్భవతి కాగా, స్కానింగ్‌లో ఆడపిల్ల అని తెలియడంతో హరిసింగ్ సుహాసినికి అబార్షన్ చేయించాలనుకున్నాడు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి డాక్టర్ సలహా తీసుకోగా.. ఏడో నెలలో అబార్షన్ చేయిస్తే తల్లీబిడ్డకు ప్రమాదం ఉంటుందని ఆమె చెప్పింది. అయినా, సుహాసినిని రెండురోజుల క్రితం బలవంతంగా హరిసింగ్ హుజూర్నగర్ ప్రాంతంలో ఓ ఆర్ఎంపీతో అబార్షన్ చేయించాడు. అయితే వైద్యం వికటించి సుహాసిని పరిస్థితి విషమంగా మారింది. మెరుగైన వైద్యం కోసం కోదాడకు, ఆపై ఖమ్మంకు అక్కడ నుంచి సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకురాగా ఆమె మృతి చెందింది. అయితే సుహాసిని మృతిచెందిన విషయాన్ని హరిసింగ్ కుటుంబసభ్యులకు చెప్పకుండా ఎంజీనగర్ తండాకు తీసుకొచ్చాడని, గ్రామస్తులు గమనించి విషయం తమకు తెలిపారని మృతురాలి బంధువులు ఆరోపించారు. ఈ ఘటనపై చివ్వెంల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. సూర్యాపేటటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని పంపించారు. అయితే పోలీసులు ఫిర్యాదు తీసుకోవట్లేదని ఆరోపిస్తూ మృతురాలి కుటుంబ సభ్యులు సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట గురువారం ధర్నా చేపట్టారు. దీంతో పోలీసులు ఫిర్యాదు తీసుకున్నారు. పీహెచ్డీ చేసిన హరిసింగ్.. హరిసింగ్ నెలరోజుల క్రితమే ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ అందుకున్నాడని, ఉన్నత చదువులు చదివిన వ్యక్తే బలవంతంగా అబార్షన్ చేయించి సుహాసిని మృతికి కారణమయ్యాడని మృతురాలి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సుహాసిని అంటే మీకు ఇష్టమా లేక ప్రేమనా..?
-
నమ్మించి.. నట్టేట్లో తోసేసి..
రావులపాలెం/తాడేపల్లి రూరల్: ఓ బిడ్డతో కలిసి ఉంటున్న మహిళను ప్రేమ పేరుతో నమ్మించాడు.. మూడేళ్ల పాటు సహజీవనం చేశాడు. ఓ చిన్నారికి జన్మనిచ్చాడు. అనంతరం వారిని ఎలాగైనా వదిలించుకోవాలనుకున్నాడు. మాయమాటలు చెప్పి తల్లీబిడ్డలను గోదావరి బ్రిడ్జి పైకి తీసుకువచ్చి.. నిర్దాక్షిణ్యంగా నదిలోకి తోసేశాడు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం వద్ద జరిగిన ఈ ఘటనలో తల్లి, ఏడాది చిన్నారి గల్లంతవ్వగా.. 13 ఏళ్ల బాలికను పోలీసులు రక్షించారు. వివరాలు.. భర్తతో విభేదాల వల్ల పుప్పాల సుహాసిని(36) కృష్ణా జిల్లా గుడివాడ నుంచి గుంటూరు జిల్లా తాడేపల్లికి వచ్చి ఓ హోటల్లో పనిచేస్తూ కుమార్తె లక్ష్మీ సాయి కీర్తనతో కలిసి జీవిస్తోంది. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన ఉలవ సురేశ్ కూడా తాడేపల్లిలోని ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. సురేశ్‌కు అప్పటికే వివాహమైంది. అయినా సుహాసినిని ప్రేమిస్తున్నానంటూ నమ్మించాడు. ఎన్టీఆర్ కరకట్ట మీద ఉన్న ఓ ఇంట్లో మూడేళ్లుగా కలిసి జీవిస్తున్నారు. జెర్సీ(ఏడాది పాప) జన్మించిన తర్వాత గొడవలు మొదలై ఇద్దరూ విడిపోయారు. సుహాసిని తన ఇద్దరు బిడ్డలతో కలిసి క్రిస్టియన్‌పేటలో ఉంటోంది. సురేశ్ తరుచూ వచ్చి సుహాసినితో గొడవ పడేవాడు. దీంతో సుహాసిని తన పెద్ద కుమార్తె కీర్తనకు ఫోన్ ఇచ్చి.. ఇంటికి ఎవరైనా వచ్చి బెదిరిస్తే 100కు ఫోన్ చేయాలని ధైర్యం చెప్పి పనికి వెళ్లేది. ఈ నేపథ్యంలో సురేశ్ దుస్తులు కొందామని నమ్మించి సుహాసిని, లక్ష్మీకీర్తన, జెర్సీలను శనివారం రాత్రి కారులో రాజమహేంద్రవరం తీసుకువచ్చాడు. అక్కడి నుంచి రావులపాలెం తెచ్చాడు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో గౌతమీ గోదావరి పాత బ్రిడ్జి పైకి కారును తీసుకువచ్చి ఆపాడు. ఆ తర్వాత కొంతసేపటికి సెల్ఫీ తీసుకుందామంటూ సుహాసినిని బ్రిడ్జి గోడపై కూర్చోమని చెప్పి.. సుహాసినితో పాటు జెర్సీని గోదావరిలోకి తోసేశాడు. అనంతరం కారులో కూర్చుని ఫోన్లో పాటలు వింటున్న కీర్తనను కూడా బయటకు తెచ్చి గోదావరిలోకి తోసేశాడు. ఆ తర్వాత సురేశ్ కారులో పరారయ్యాడు. సకాలంలో స్పందించిన పోలీసులు బ్రిడ్జి పై నుంచి పడిపోతున్న సమయంలో కీర్తన బ్రిడ్జికి ఉన్న కేబుల్ పైపును బలంగా పట్టుకుంది. తన వద్ద ఉన్న ఫోన్‌తో తెల్లవారుజామున 3.50 గంటలకు 100 నంబర్‌కు డయల్ చేసింది. పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది ఫోన్ లొకేషన్ ఆధారంగా 10 నిమిషాల్లోనే అక్కడికి చేరుకొని ఆమెను రక్షించారు. ప్రథమ చికిత్స అందించి డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. సుహాసిని, కీర్తన ఆచూకీ కోసం పోలీసులు బోట్లతో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడి కోసం మరో బృందం విస్తృతంగా గాలిస్తోంది. కీర్తన ప్రాణాలను కాపాడిన పోలీసులను ఎస్పీ శ్రీధర్ అభినందించారు. -
పొన్నియిన్ సెల్వన్ క్యాలెండర్ ఆవిష్కరణ
తమిళసినిమా: 2022లో అనూహ్య విజయం సాధింన చిత్రం పొన్నియిన్ సెల్వన్. దర్శకుడు మణిరత్నం అద్భుత సృష్టి ఇది. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఇందులో విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యరాయ్, త్రిష, శరత్ కుమార్, ప్రకాశ్‌రాజ్, విక్రమ్‌ప్రభు వంటి హేమాహేమీలు నటించిన ఈ చిత్రానికి ఆస్కార్ నాయకుడు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించిన విషయం తెలిసిందే. కల్కి రాసిన నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్ర రెండవ భాగం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా పొన్నియిన్ సెల్వన్– 2 చిత్రం ఏప్రిల్ 28న తెరపైకి రానుంది. దర్శకుడు మణిరత్నం సతీమణి, నటి సుహాసిని వ్యవస్థాపకురాలుగా నామ్ ఫౌండేషన్ నిర్వహిస్తున్నారు. దీనికి దర్శకుడు కూడా గౌరవ ఫౌండర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇది స్వచ్ఛంద సేవ ఫౌండేషన్. దీని ద్వారా పలుసేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా నామ్– 2023 పేరుతో పొన్నియిన్ సెల్వన్ చిత్రం దృశ్యాలతో క్యాలెండర్‌ను పొందుపరిచారు. బుధవారం సాయంత్రం స్థానిక టీ.నగర్‌లోని ఆ సంస్థ కార్యాలయంలో విడుదల చేశారు. మణిరత్నం, సుహాసినితో పాటు నామ్ ఫౌండేషన్ నిర్వాహకుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జయంరవి, జయరాం, రఘు పాల్గొని క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. -
'నిన్నే చూస్తు' మూవీ రివ్యూ
టైటిల్ : నిన్నే చూస్తు దర్శకుడు: కె. గోవర్ధనరావు నటీనటులు: శ్రీకాంత్ గుర్రం, బుజ్జి(హేమలత రెడ్డి), సుహాసిని, సుమన్, సాయాజి షిండే, భానుచందర్, కిన్నెర, జబర్దస్త్ మహేష్ తదితరులు బ్యానర్ : వీరభద్ర క్రియేషన్స్ ప్రొడ్యూసర్: పోతిరెడ్డి హేమలత రెడ్డి సంగీతం: రమణ్ రాతోడ్ ఎడిటర్ : నాగిరెడ్డి కెమెరా : ఈదర ప్రసాద్ విడుదల తేదీ: అక్టోబర్ 27, 2022 శ్రీకాంత్ గుర్రం, బుజ్జి (హేమలతా రెడ్డి) హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం నిన్నే చూస్తు. ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్టోబర్ 27న విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం.. కథ అమలాపురంలో ఉండే కృష్ణ (శ్రీకాంత్ గుర్రం) తన తండ్రి బాను చందర్‌ను హత్య చేసిన వారిని చంపాలని రగిలిపోతుంటాడు. బ్యాగ్‌లో గన్ పెట్టుకొని తల్లి సుహాసినికి ఇంటర్వ్యూ పేరుతో బయటకు వెళ్లి తన తండ్రిని చంపిన వారిని వెదుకుతూ ఉంటాడు. చివరకు తన తండ్రిని చంపిన వ్యక్తి వైజాగ్‌లో ఉన్నాడని తెలిసి అక్కడకు వెళ్లి చంపడానికి ట్రై చేస్తే అది మిస్ అవుతుంది. వైజాగ్‌లోని ప్రముఖ వ్యాపారవేత్త జగదీశ్ చంద్ర ప్రసాద్ (సుమన్), ఇంద్ర (కిన్నెర)ల కూతురు సత్య (హేమలతా రెడ్డి/ బుజ్జి ) అమెరికాలో చదువుకుని ఇండియాకు తిరిగి వస్తుంది. తన ఫ్రెండ్ స్వాతి(ప్రెసిడెంట్ కూతురు)ని కలవడానికి అమలాపురం వస్తుంది సత్య. ఈ క్రమంలో హీరోహీరోయిన్లిద్దరూ ప్రేమలో పడతారు. వీరి ప్రేమను కృష్ణ అమ్మ కూడా ఒప్పు కుంటుంది. పెద్దలతో మాట్లాడి పెళ్లి చేసుకుందాం వైజాగ్ రమ్మంటుంది సత్య. దాంతో వైజాగ్ వెళ్లిన కృష్ణకు ఇంతకాలం తను చంపాలనుకున్న వ్యక్తి, ఎంతో ఇష్టంగా ప్రేమించిన సత్య తండ్రి జగదీశ్ చంద్ర ప్రసాద్ ఇద్దరూ ఒక్కరే అని తెలుసుకుంటాడు. అతడి మీద కోపంతో సత్యతో నువ్వంటే ఇష్టం లేదు "ఐ హేట్ యు" అని చెప్పి వస్తాడు. దీంతో సత్య తల్లి ఇంద్ర (కిన్నెర) సొంత అన్న అయిన సాయాజి షిండే కొడుకుతో సత్యకు పెళ్లి ఫిక్స్ చేస్తారు. అసలు జగదీశ్ చంద్ర ప్రసాద్ కృష్ణ నాన్న భానుచందర్‌ను ఎందుకు చంపాడు? జగదీశ్‌ను కృష్ణ చంపాడా లేదా? సత్య కృష్ణను పెళ్లాడిందా? లేక తన బావను పెళ్లి చేసుకుందా? అన్న విషయాలు తెలియాలంటే "నిన్నే చూస్తు".. సినిమా చూడాల్సిందే! నటీనటుల పనితీరు అమ్మను ప్రేమగా చూసుకొనే కొడుకుగా, సత్యను ప్రేమించే లవర్‌గా, మరో వైపు తండ్రిని చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకునే కొడుకుగా పలు షేడ్స్ వున్న పాత్రలో శ్రీకాంత్ చక్కగా నటించాడు. ఒక వైపు నిర్మాతగా మరోవైపు హీరోయిన్గా బుజ్జి(హేమలతా రెడ్డి) ఆకట్టుకుంటుంది. హీరోహీరోయిన్స్ తల్లిదండ్రులు, హీరో ఫ్రెండ్స్ వారి పాత్రలకు తగ్గట్లు నటించారు. సాంకేతిక నిపుణుల పనితీరు కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా ప్రేమ ఎప్పుడూ ఓడిపోకూడదు అనే ఆలోచనను దర్శకుడు కె గోవర్ధనరావు అద్భుతంగా తెరకెక్కించాడు. రమణ్ రాథోడ్ సంగీతం బాగుంది. సినిమాటోగ్రాఫర్ ఈదర ప్రసాద్ అందించిన విజువల్స్ పర్వాలేదు. లవ్ కు స్టార్స్ ఇవ్వకూడదు, ప్రేమను ప్రేమగా గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి లాంటి డైలాగ్స్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయి. నాగిరెడ్డి ఇంకాస్త ఎడిటింగ్ చేసుంటే బాగుండేది. చదవండి: అప్పుడే సమంతతో లవ్‌లో పడ్డా: విజయ్ దేవరకొండ బన్నీ భార్య స్నేహారెడ్డి చీర ఖరీదెంతో తెలుసా? -
హిందీ భాష వివాదంపై సుహాసిని స్పందన, ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు
Suhasini Respond On Hindi Language War: ప్రస్తుతం సినీ పరిశ్రమంలో హిందీ భాష వివాదం హాట్‌టాపిక్‌గా నిలిచింది. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హిందీ జాతీయ భాష కాదంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో సుదీప్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్‌ల మధ్య ట్విటర్ వార్ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ వార్‌పై సౌత్, నార్త్ సినీ సెలెబ్రెటీలు స్పందిస్తు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సీనియర్ నటి సుహాసిని హిందీ భాష వివాదంపై స్పందించారు. చదవండి: ‘లైగర్’కి రికార్డు డీల్స్, డిజిటల్, ఆడియో రైట్స్‌కు కళ్లు చెదిరే ఆఫర్స్ నటులు అన్న తర్వాత అన్ని భాషలను నేర్చుకోవాలని ఆమె అన్నారు. హిందీ భాష చాలా బాగుంటుందని, అది కూడా నేర్చుకోవాలని ఆమె సూచించారు. హిందీ వాళ్లు మంచి వాళ్లని, వాళ్లతో మాట్లాడాలంటే హిందీ నేర్చుకోవాలని చెప్పారు. అలాగే తమిళం వాళ్లు కూడా మంచి వాళ్లేనని, హిందీ వాళ్లు కూడా తమిళంలో మాట్లాడితే సంతోషంగా ఉంటుందని సుహాసిని వ్యాఖ్యానించారు. తమ ఇంట్లో పని చేసే వాళ్లలో కొంతమంది తెలుగు మాట్లాడతారని, మరికొంతమంది హిందీ మాట్లాడతారన్నారు. చదవండి: లెటెస్ట్ అప్డేట్: ఈ నెలలోనే ఓటీటీకి ఆర్ఆర్ఆర్, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్! ఆ తర్వాత ఆ భాషే కావాలి.. ఈ భాషే కావాలంటే మనకు తిండి దొరకని పరిస్థితి ఏర్పడుతుందని సుహాసిని అభిప్రాయపడ్డారు. అందుకే అందరూ అన్ని భాషలు నేర్చుకోవాలన్నారు. దీంతో సుహాసిని వ్యాఖ్యలపై తమిళ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా సుహాసినిని ట్రోల్ చేస్తున్నారు. హిందీ భాష మాట్లాడాలనిపిస్తే హిందీ సినిమాలే చేసుకుంటూ బాలీవుడ్లోనే ఉండాల్సిందంటూ సుహాసినిపై సటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. -
మర్డర్ కేసుపై ‘ఫోకస్’ పెట్టిన విజయ్ శంకర్
విభిన్నమైన సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందుతున్న విజయ్ శంకర్ మరో విలక్షణమైన కథతో మన ముందుకు రానున్నారు. స్కైరా క్రియేషన్స్ సమర్పణలో నిర్మాణ విలువల విషయంలో ఏ మాత్రం రాజీపడని రిలాక్స్ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి ‘ఫోకస్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ కన్ఫర్మ్ చేశారు. ఉత్కంఠభరితమైన స్క్రీన్ ప్లేతో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా జి. సూర్యతేజ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మర్డర్ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో ఆసక్తికరమైన మలుపులతో ప్రేక్షకులను ఆద్యంతం ఆశ్చర్యపరిచే సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘ఫోకస్’ మూవీ తెరకెక్కుతోందని మూవీ యూనిట్ పేర్కొంది. ప్రముఖ నటి సుహాసిని మణిరత్నం కీలక పాత్ర పోషిస్తుండగా, అషూరెడ్డి హీరోయిన్గా నటిస్తోంది.భాను చందర్, జీవా, షియాజీ షిండే, భరత్ రెడ్డి, సూర్య భగవాన్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. ‘మర్డర్ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో చాలా సినిమాలు వచ్చాయి..కానీ మా ఫోకస్ చిత్రం వాటంన్నింటికి విభిన్నమైనది. మర్డర్ మిస్టరీ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్స్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు మా చిత్రం కొత్త తరహా అనుభూతిని ఇస్తుంది. సినిమాను గురించిన మరిన్ని విశేషాలు, వివరాలను త్వరలో వెల్లడిస్తాం’అని చిత్ర దర్శకుడు సూర్యతేజ తెలిపారు. -
మణిరత్నం, సుహాసినిల ప్రేమపెళ్లి.. ట్విస్ట్ ఏంటో తెలుసా?
Suhasini Maniratnam Love Story: సుహాసిని.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఇది. తెలుగు నాట పుట్టకపోయినా.. తెలుగువారి మదిలో చెరిగిపోని స్థానం సంపాదించుకున్నారామె. వాస్తవానికి.. సుహాసిని తమిళ చిత్రాలతో అరంగేట్రం చేసినప్పటికీ.. టాలీవుడ్లోనే స్టార్ హీరోయిన్గా జేజేలు అందుకున్నారు. ఇక ఈ నటి పెళ్లి ప్రముఖ దర్శకుడు మణిరత్నంతో జరిగిన విషయం తెలిసిందే. ఈ జంటకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే ఈ జంట పెళ్లి గురించి అనేక వదంతులు వచ్చాయి. వీరిది ప్రేమ వివాహమా? లేదా పెద్దలు కుదిర్చిన పెళ్లా? అని చాలా మందికి ఇప్పటికీ ఓ తీరని సందేహమే! వీరి పెళ్లి ఎలా జరిగిదంటే.. 1988లో సుహానికి తండ్రి చారుహాసన్(హీరో కమల్ హాసన్ అన్నయ్య) అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారట. అప్పుడు సుహాసిని తండ్రి దగ్గరకు వెళ్తే.. ఇకపై సినిమాలు చెయ్యొద్దని అన్నారట. ఆమె గురించి, మణిరత్నం గురించి బయట వదంతులు వస్తున్నాయని, దీని గురించి ఒక్కసారి అతనితో మాట్లాడమని చెప్పాడట. తండ్రి సూచనతో సుహాసిని మణిరత్నంకు ఫోన్ చేసి మాట్లాడారట. అయితే అప్పటికే మణిరత్నంపై ఒక రకమైన గౌరవం ఉన్న సుహాసినికి ఫోన్ సంభాషణ ద్వారా అది మరింత పెరిగింది. ప్రత్యక్షంగా కలుసుకొని గంటలు, గంటలు మాట్లాడుకున్నారట. ఈ క్రమంలో వారి మధ్య ప్రేమ పుట్టి, అది కాస్త పెళ్లి వరకు వెళ్లింది. అయితే ఈ విషయాన్ని ఇంట్లో చెప్పలేదట. ఇరు కుటుంబాల పెద్దలే మాట్లాడుకొని వీరి వివాహం జరిపించారట. ఈ విధంగా ఇండస్ట్రీలో వచ్చిన వదంతులే మణిరత్నం, సుహాసినిల పెళ్లికి పునాదులు వేశాయి. 1988 ఆగస్ట్ 25న వీరి వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు. పేరు నందన్ . అన్నట్లు ఈ రోజు(ఆగస్ట్ 15) సుహాసిని పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆమె బర్త్‌డే విషెస్ తెలియజేశారు. -
మణిశర్మ స్వరాలకు కీరవాణి గాత్రం తోడైతే..
ధ్రువన్, నియా త్రిపాఠి, సుహాసిని, నాజర్ తదితరులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'బలమెవ్వడు'. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా, టైటిల్ సాంగ్‌ని కీరవాణి ఆలపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. సంగీత ప్రపంచంలో మణిశర్మ, కీరవాణిలది ప్రత్యేక స్థానం. అలాంటిది ఓ సాంగ్ కోసం ఇద్దరూ కలిశారు. మణిశర్మ స్వరాలకి కీరవాణి గాత్రం అందించారు. ఈ లిరికల్ సాంగ్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. ఇక సత్య రాచకొండ దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రాన్ని ఆర్ బి మార్కండేయులు నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన "బలమెవ్వడు" కాన్సెప్ట్ టీజర్‌కు మంచి ఆధరణ లభిస్తుంది. -
పోలీసులకు చిక్కిన నిత్య పెళ్లికూతురు సుహాసిని
-
'బలమెవ్వడు'లో పవర్ఫుల్ పాత్రలో సుహాసినీ
దశాబ్దాలుగా తెలుగు, తమిళ చిత్రాల్లో తన అద్భుత నటనతో ప్రేక్షకుల హృదయంలో స్థానం సంపాదించుకున్నారు సుహసినీ. తెలుగు ప్రేక్షకులకు సుహసినీ అంటే ప్రత్యేక అభిమానం. వాళ్ల అభిమానాన్ని కాపాడుకునేలా గొప్ప క్యారెక్టర్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు సుహసినీ. గతంలో 'రాఖీ' చిత్రంలో ఆమె పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్రకు ఎంత పేరొచ్చిందో మనందరికీ తెలిసిందే. ఈసారి మరో పవర్ ఫుల్ పాత్ర ద్వారా మన ముందుకు రాబోతున్నారు. "బలమెవ్వడు" సినిమాలో డాక్టర్ యశోద పాత్రలో నటిస్తున్నారు సుహసినీ. మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాడే నిజాయితీ గల వైద్యురాలి పాత్రలో సుహసినీ జీవించనున్నట్లు తెలుస్తోంది. ధృవన్ కటకం, నియా త్రిపాఠీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న "బలమెవ్వడు" సినిమా వైద్యరంగంలోని దోపిడీని ప్రశ్నించబోతోంది. సత్య రాచకొండ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్బీ మార్కండేయులు నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన "బలమెవ్వడు" కాన్సెప్ట్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోందని చిత్రయూనిట్ పేర్కొంది. -
నిత్య పెళ్లికూతురు సుహాసినికి ఏకంగా దొంగల టీమే ఉంది!
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: అనాథనని చెబుతూ పెళ్లి పేరుతో యువకులను మోసం చేస్తున్న కిలాడి లేడి నిత్య పెళ్లికూతురు సుహాసిని మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఒక సంవత్సరంలో సుహాసిని ఇద్దరిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని మోసం చేస్తూ ఉంటుందని ఆమె చేతిలో మోసపోయిన బాధితుడు ‘సాక్షి’కి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పక్కా ప్లాన్ ప్రకారం సుహాసిని ట్రాప్ చేసి మోసాలు చేస్తూ ఉందని పేర్కొన్నారు. సుహాసినికి దొంగల టీం ఉందని, తన లాగా సుహాసిని చేతిలో మోసపోయిన బాధితులు చాలా మందే ఉన్నారని తెలిపారు. సుహాసిని మోసాలు తమకు తెలిసిన తర్వాత ఇంట్లో నుంచి గోడ దూకి పారిపోయిందని వెల్లడించారు. పారిపోయే ముందు ఇంట్లో బీరువాలో ఉన్న బంగారం అంతా తీసుకెళ్లిందని తెలిపారు. తమ దగ్గర మొత్తం 16లక్షలు తీసుకొని వెళ్ళిందని, అదే సమయంలో మణుగూరు పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేస్తే కంప్లెట్ తీసుకులేదని పేర్కొన్నారు. సుహాసిని ఎపిసోడ్లో తమ కుటుంబం పూర్తిగా ఇబ్బందుల్లో పడిందని, తన ఎపిసోడ్ తర్వాత తిరుపతిలో సునీల్ అనే వ్యక్తి మోసం చేసిందన్నారు. -
తారలు కలిసి మెరిశారు: చాలా ఎంజాయ్ చేశాం!
తమిళసినిమా: 1980 సంవత్సరంలో ప్రముఖ కథానాయకులు, నాయకిలుగా వెలుగొందిన తారలు కొన్ని ఏళ్లుగా ఏడాదికోసారి ఒక చోట కలిసి సరదాగా గడపడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. దక్షిణాదికి చెందిన రజనీకాంత్, చిరంజీవి, మమ్ముట్టి, నటీమణులు రాధిక శరత్‌కుమార్, సుహాసిని, అంబిక, రాధ, లిజి మొదలగు పలువురు నటీనటులు ఏడాదికి ఒకసారి ఒక ఫాంహౌస్లాంటి ప్రాంతంలో కలుసుకుని తమ అనుభవాలను, అనుభూతులను పంచుకుంటుంటారు. అదేవిధంగా ఈ వీకెండ్లో 1980లో ప్రముఖ నాయికలుగా రాణించిన నటీనటులు చెన్నైలో కలుసుకుని సరదాగా ముచ్చట్లు చెప్పుకొని పసందైన విందు ఆరగించి ఆనందంగా గడిపారు. అలా కలుసుకున్న వారిలో నటి రాధిక శరత్‌కుమార్, కుష్బూ, సుహాసిని, రాధ, అంబిక, పూర్ణిమా భాగ్యరాజ్, లిజి, నటుడు రఘు వున్నారు. ఫొటోలను నటి రాధిక శరత్‌కుమార్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. అందులో ఆమె పేర్కొంటూ 1980లలో ప్రముఖ హీరో హీరోయిన్లుగా రాణించిన వారందరూ ఇప్పటికీ సన్నిహితంగా మెలుగుతున్నారు. అయితే కరోనా కారణంగా రెండేళ్లుగా తాము కలుసుకోలేకపోయామని ప్రస్తుతం లాక్డౌన్ సడలింపుతో ఈ వీకెండ్లో మళ్లీ తామంతా కలుసుకుని గత అనుభవాలను, అనుభూతులను పంచుకుని ఆనందంగా గడిపినట్లు తెలిపారు. ఇందుకు స్పందించిన ఖుష్బూ సుందర్.. ‘‘చాలా చాలా ఎంజాయ్ చేశాం. ఎంతో ఉల్లాసంగా గడిపాం’’ అని పేర్కొన్నారు. -
నాన్నని ‘నాగులు బావ’ అని పిలిచేవాళ్లు
ఆరడుగుల ఆజానుబాహుడు.. కన్ను తిప్పుకోలేని వస్త్రధారణ.. అందంగా కనిపించే విలక్షణ విలన్... సూటు వేసుకుంటే నిజాం నవాబు.. ‘భలే మామా భలే...’ ‘ఇదే మన తక్షణ కర్తవ్యం...’ ‘బాబులు గాడి దెబ్బ అంటే గోల్కొండ అబ్బ అనాలి..’ ‘రారోయి మా ఇంటికీ! మావా! మాటున్నదీ! మంచి మాటున్నదీ!’ ఈ మాటలపాటల ప్రత్యేకతలతో తెలుగు సినీ ప్రేక్షకులకు చేరువయ్యారు... కొద్ది సినిమాలలో నటించి, అతి కొద్దికాలం మాత్రమే జీవించి, తెలుగు సినీ పరిశ్రమలో అందమైన విలన్‌గా ముద్ర వేసుకున్న ఆర్. నాగేశ్వరరావు గురించి జ్ఞాపకాలుగా ఆర్ద్రమైన గుండెతో పంచుకున్నారు సింగపూర్‌లో నివాసం ఉంటున్న వారి పెద్ద కుమార్తె సుహాసిని.. ‘నాన్న పోయేనాటికి నా వయసు ఎనిమిది సంవత్సరాలు. నాన్నకు మాసివ్ అటాక్ రావటం, మేడ మీద నుంచి ఆయనను కిందకు తీసుకు రావటం, అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకు వెళ్తుండగా దారిలోనే మరణించటం, ఇంటికి తీసుకువచ్చి హాలులో.. నిండైన విగ్రహంలాంటి నాన్నను పడుకోపెట్టడం.. పక్కనే అమ్మ కన్నీరుమున్నీరవ్వటం... నా మనసు ఆయన జ్ఞాపకాలలోకి పరుగులు తీస్తూనే ఉంటుంది. ఐస్‌క్రీమ్ చేసి పెట్టేవారు.. నాన్న సికింద్రాబాద్ జీరాలో పుట్టి పెరిగారు. నాన్న నాయనమ్మ కడుపులో ఉండగా తాతగారు పోయారు. అప్పటికే నాన్నకు ఒక అన్నయ్య ఉన్నారు. నాన్న వాళ్ల అన్నయ్య ఇంట్లోనే పెరిగారు. అది నాన్న సొంత ఇల్లే. నాన్న మంచి పొజిషన్‌కి వచ్చాక ఆ ఇల్లు వాళ్లకి ఇచ్చేశారు. నాన్న నవాబులతో దోస్తీగా ఉండేవారు. ఆయన మాట్లాడే భాషలో తెలంగాణ నవాబుల హిందీ ఉర్దూ మాండలికం ఉండేది. అమ్మ రత్నాబాయి గుంటూరు లో పుట్టి పెరిగింది. నాన్నగారిది మేనరికం. మేం ఐదుగురు పిల్లలం. మోహన్, తాతాజీ, సుహాసిని (నేను), శ్యామ్, చాందినీ. అన్నయ్యలు, తమ్ముడు గతించారు. నేను, చెల్లి మాత్రమే ఉన్నాం. నాన్న పోయేనాటికి చెల్లెలికి నాలుగేళ్లు, నాకు ఎనిమిది సంవత్సరాలు. అందరం హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాం. ప్రస్తుతం సింగపూర్‌లో ఉంటున్నాను. దొంగరాముడు చిత్రంలో సావితి, ఆర్. నాగేశ్వరరావు రిక్షాలో వెళ్లమన్నారు.. అమ్మ వాళ్లందరూ తరచుగా భద్రాచలం వెళ్లేవారు. రైల్వే స్టేషన్ మా ఇంటికి దగ్గరే. కాని అందరూ పని పూర్తి చేసుకుని వెళ్లేసరికి ట్రైన్ టైమ్ అయిపోయేది. అందుకని నాన్న పరుగెత్తుకుంటూ, ఇంజన్ డ్రైవర్ దగ్గరకు వెళ్లి, రైలు ఆపించేవారట. బ్రిటిష్ టైమ్‌లో తాతయ్య (అమ్మవాళ్ల నాన్న) ట్రైన్ ఇంజిన్ డ్రైవర్‌గా ఉండేవారు. బహుశః అందుకే ఆపేవారేమో. ‘జీవితంలో కష్టపడటం నేర్చుకోవాలి, స్కూల్‌కి రిక్షాలో వెళ్లండి’ అని చెప్పేవారు నాన్న. సినిమాలలో ఎంత బిజీగా ఉన్నా, ప్రతి ఆదివారం స్వయంగా ఐస్‌క్రీమ్ తయారుచేసి పెట్టేవారు. అవకాశం ఉన్నప్పుడు బీచ్‌కి తీసుకెళ్లి, మాతో దాగుడు మూతలు ఆడేవారు. డ్రై ఫ్రూట్స్ తెచ్చేవారు.. మేం పొద్దున్నే నిద్ర లేచి హాల్లో కూర్చుని చదువుకుంటుంటే చూడటం ఇష్టం నాన్నకు. కారులో అన్నవరం తీసుకువెళ్లేవారు. నదీ తీర ప్రాంతంలో డ్రైవింగ్ చేయటం చాలా ఇష్టం. అక్కడ స్నేహితులందరితో కలిసి భోజనం చేసేవారు. ప్రతి వారం మద్రాస్ ప్యారిస్ కార్నర్ నుంచి స్వీట్స్, పూలు, కూరలు తెచ్చేవారు. ఆ రోజుల్లోనే అంటే 1955 ప్రాంతంలోనే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తెచ్చేవారు. అమ్మ వంటలు బాగా చేసేది. నాన్న మంచి ఆహారం మితంగా తినేవారు. ప్రతిరోజూ రాత్రి పరాఠాలు, నాన్‌వెజ్ తినేవారు. హైదరాబాద్ స్టయిల్ ఆహారం ఇష్టపడేవారు. మీగడ పెరుగంటే చాలా ఇష్టం. ఎస్.వి. రంగరావుతో నాగేశ్వరరావు నాగులు బావ అనేవారు.. అప్పుడు మేం ఉన్న మా ఇంటితో ఎప్పటికప్పుడు కొత్త అనుబంధం ఏర్పడుతూనే ఉంది. ఆ ప్రాంతానికి వెళ్లినప్పుడల్లా, అక్కడ నాన్నతో కలిసి పెరిగిన వాళ్లు, ‘‘మీ నాన్నతో కలిసి పెరిగాం. మేమంతా చనువుగా ఆయనను ‘నాగులు బావ’ అని పిలిచేవాళ్లం’’ అని చెబుతుంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఎస్పి రోడ్లో ఇప్పటికీ పాత హార్డ్‌వేర్ దుకాణాలున్న ప్రాంతానికి వెళితే, ‘మిమ్మల్ని బాగా చూసినట్లు ఉంది. అచ్చం నాన్నగారిలా ఉన్నారు’ అంటూ, నాన్నను గుర్తు తెచ్చుకుంటారు. నాన్న నిండైన విగ్రహమే అందుకు కారణం. అమ్మ 90 సంవత్సరాలు వచ్చేవరకు జీవించింది. నాన్న గురించి అమ్మ చెప్పే మాటలు వింటూ పెరిగాను. ఇప్పటికీ గుర్తుండిపోయింది... నాన్న పోయిన రోజున ఆయనను తీసుకురావటం బాగా గుర్తుంది. గదిలో పడుకుని ఉండగా మాసివ్ అటాక్ వచ్చి అతి పిన్న వయసులోనే కన్నుమూశారు. ఆయనను చూడటానికి జనం తండోపతండాలుగా వచ్చారు. ఆ చేదు జ్ఞాపకం ఇంకా పచ్చిగానే ఉంది . నాన్న గురించి వింటూ, పెరగటం వల్ల, నాన్నలా ఉండాలనే భావన నాకు తెలియకుండానే అలవాటైపోయింది. ఆయన పర్సనాలిటీ నాకు వచ్చిందని గర్వపడతాను. నాన్న ఇప్పటికీ మా మనసులో, ఆలోచనలలో, చేతలలో సజీవంగానే ఉన్నారు. నాన్నకి అందమే కాదు, వ్యక్తిత్వం, అస్తిత్వం కూడా ఉన్నాయి. తల్లిదండ్రులతో ఉన్న బంధం మరచిపోవటం కష్టం. సుహాసిని నాన్న వెరీ పర్టిక్యులర్ నాన్న ఆజానుబాహువు. అందమైనవారు. నాన్న స్టయిల్ని చాలామంది ఫాలో అయ్యేవారు. నవాబుల కంటె హుందాగా, గొప్పగా ఉండేవారు. నాన్న దగ్గర 300 సూట్లున్నాయి. షూస్ లెక్క చెప్పలేను. ఏ సూట్లో చూసినా ఎంతో కంఫర్టబుల్‌గా అనిపించేవారు. ఎస్వి రంగారావు అంకుల్ గృహప్రవేశానికి నాన్న హై కాలర్ (నెహ్రూ కాలర్) బ్లాక్ సూట్, ఎస్విఆర్ వైట్ సూట్, టోపీ ధరించారు. అతిథులందరికీ నాన్న విస్తళ్లు వేసి వడ్డించారు. అడ్డగీతల రా సిల్క్, బ్రైట్ ఎల్లో... హై కాలర్ స్వెటర్‌తో ఇంగ్లీషు దొరలా ఎంతో దర్పంగా, హుందాగా అనిపించేవారు. మా అందరికీ నాన్నే బట్టలు కొనేవారు. ఒకసారి నాకు అద్దాలు కుట్టిన నల్ల లంగా తీసుకువచ్చారు. అది నాకు బాగా గుర్తుండిపోయింది. ఇప్పటికీ అలాంటి లంగా కనిపిస్తే, ఆ రోజులు గుర్తుకు వస్తాయి. – సుహాసిని సంభాషణ: వైజయంతి పురాణపండ -
ఒకే కారులో తిరిగాం, పెళ్లనేశారు: యంగ్ హీరో
బాలాదిత్య.. హీరోగా కెరీర్ ప్రారంభించడానికి ముందే బాలనటుడిగా ఎన్నో సినిమాల్లో మెప్పించాడు. లిటిల్ సోల్జర్స్, జంబలకిడిపంబ హిట్లర్, అబ్బాయిగారు, బంగారు బుల్లోడు, హలో బ్రదర్, సమరసింహా రెడ్డి వంటి పలు చిత్రాల్లో నటనతో ఆకట్టుకున్న అతడు చంటిగాడు సినిమాతో హీరోగా మారాడు. ఆయన నటించిన అన్నపూర్ణమ్మ గారి మనవడు ఇటీవలే రిలీజై మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం అతడు సినిమాలతో పాటు సీరియళ్లలోనూ నటిస్తూ బుల్లితెర మీద కూడా సందడి చేస్తున్నాడు. ఇదిలా వుంటే 'చంటిగాడు' సినిమాలో తనతో స్క్రీన్ షేర్ చేసుకున్న సుహాసినిని బాలాదిత్య పెళ్లి చేసుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. దానిపై అతడు తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సుహాసిని, తాను మంచి స్నేహితులమని చెప్పాడు. తాము పెళ్లి చేసుకోబోతున్నామని వచ్చిన వార్తల్లో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేశాడు. ఎప్పుడైనా ఫంక్షన్లకు వెళ్లినప్పుడు ఇద్దరం ఒకే కారులో ప్రయాణించేవాళ్లమని, అది చూసి కొందరు తప్పుగా అనుకున్నారని తెలిపాడు. తమ మధ్య ఉన్నది స్నేహం మాత్రమేనని క్లారిటీ ఇచ్చాడు. మేం రెండు సినిమాల్లో కలిసి నటించేసరికి పెళ్లి చేసుకుంటున్నామంటూ వార్తలు రాసేశారు. కానీ మాకు అలాంటి అభిప్రాయమే లేదని తేల్చి చెప్పాడు. చదవండి: ప్రతిఒక్కరి జీవితానికి అన్వయించుకునే కథ అన్నపూర్ణమ్మ గారి మనవడు ఐసీయూలో సినీ రచయిత, కేటీఆర్ సాయం! -
ఇలాంటి వార్తలను నమ్మకండి :నటి సుహాసిని
ప్రముఖ దర్శకులు మణిరత్నం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్లో అకౌంట్ ఓపెన్ చేస్తే అభిమానులకు ఆనందమే. బుధవారం అలాంటి ఆనందమే దక్కింది. అయితే ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. జూన్ 2న మణిరత్నం పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్లోకి ఎంట్రీ ఇచ్చారన్నట్లుగా కొన్ని వార్తలు వచ్చాయి. వీటిపై మణిరత్నం భార్య, ప్రముఖ నటి సుహాసిని స్పందించారు. ‘‘బుధవారం మణిరత్నం ట్విటర్ అకౌంట్‌ను స్టార్ట్ చేసినట్లుగా ఒక వ్యక్తి మణిరత్నం పేరుతో ట్వీట్ చేశాడు. ఇలాంటి నకిలీ అకౌంట్‌ను నమ్మొదు. దయచేసి అప్రమత్తంగా ఉండండి’’ అని పేర్కొన్నారు సుహాసిని. -
కమల్ హాసన్ కూతురితో నటి తీన్మార్ స్టెప్పులు!
సాక్షి, చెన్నై: విశ్వనటుడు కమల్ హాసన్ కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజాకర్షణ లక్ష్యంగా ఆగమేఘాలపై ప్రచారం నిర్వహిస్తున్నారు. కమల్‌కు మద్దతుగా ఆ నియోజకవర్గంలో సినీ నటి, ఆయన అన్న చారుహాసన్ కుమార్తె సుహాసిని కూడా సుడిగాలి ప్రచారంలో భాగమయ్యారు. వీరికి తోడుగా కమల్ కూతురు అక్షర హాసన్ కూడా క్యాంపెయిన్‌లో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆమె తరచూ అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కమల్‌కు ఓటేయడంటూ అక్షర, సుహాసిని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేపట్టారు. ఈ క్రమంలో వీళ్లిద్దరూ డప్పు చప్పుళ్లకు తీన్మార్ డ్యాన్స్‌లు చేసి జనాలను ఆకట్టుకున్నారు. బ్యాండ్ సౌండ్‌కు ఎంతో ఎనర్జిటిక్‌గా స్టెప్పులేసిన వీరి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: కమల్ పార్టీ అభ్యర్థి ఇంట్లో రూ.10 కోట్ల నగదు స్వాధీనం ఒకే వేదికపై మామ అల్లుడు (రజనీకాంత్, ధనుష్)కు అవార్డులు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1691347313.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘సిటీని అద్భుతంగా తీర్చిదిద్దే వారికే ఓటు’
సాక్షి, హిమాయత్‌నగర్ : వేగంగా విస్తరిస్తున్న మన హైదరాబాద్ సిటీలో మరిన్ని కొత్త కట్టడాలు రావాల్సిన అవసరం ఉంది. విదేశాల్లోని సిటీల్లా, రీసెంట్గా ప్రారంభించిన దుర్గం చెరువు ఫ్లైఓవర్ లాంటివి ఏర్పాటు చేస్తే సిటీ కొత్త కొత్తగా ఉంటుంది. టెక్నాలజీతో పాటు, శానిటేషన్ వంటి వాటిలో కూడా మార్పులు ఎంతో అవసరం. ఈ ఎన్నికల్లో సిటీని మరింత అద్భుతంగా తీర్చిదిద్దే వారికి ఓటువేసి ఎన్నుకుందాం. - సుహాసిని, బుల్లితెర నటి ఓటు వేస్తేనే భారతీయుడు లక్డీకాపూల్: ఓటు ప్రజల హక్కు.. తప్పకుండా ఓటును వినియోగించుకోవాలి. ఏ పార్టీ వారికైనా కానివ్వండి.. కానీ ఓటు మాత్రం కచ్చితంగా వేయాలి. ఓటు వేసినప్పుడే ప్రజాప్రతినిధులను ప్రశ్నించే హక్కు ఉంటుంది. ఓటు వేస్తేనే మనం భారతీయులం.. ఓటు వేయని వాళ్లు భారతీయులే కాదన్నది నా అభిప్రాయం. నానక్‌రామ్‌గూడలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్కి వెళ్తే ఏదో అబ్రాడ్‌లో ఉన్నట్లు ఉంటుంది. సిటీలో రోడ్లపై దృష్టి పెట్టాలి. రోడ్లను వెడల్పు చేసి ట్రాఫిక్ని తగ్గించగలిగితే ఇంకా గొప్ప సిటీ అవుతుంది. – సప్తగిరి, సినీనటుడు -
ఆ ఒత్తిడి మా మీదా ఉంది
సీనియర్ నటి సుహాసినిలో దర్శకురాలు కూడా ఉన్నారు. గతంలో ‘ఇందిర’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారామె. దాదాపు 25 ఏళ్ల తర్వాత మళ్లీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు సుహాసిని. అమేజాన్ ప్రైమ్ నిర్మించిన ‘పుత్తమ్ పుదు కాలై’ అనే యాంథాలజీలో ఓ భాగానికి దర్శకత్వం వహించారామె. ‘కాఫీ, ఎనీవన్?’ టైటిల్‌తో తెరకెక్కిన ఈ భాగంలో అనూహాసన్, శ్రుతీహాసన్ నటించారు. ఈ నెల 16న ఈ యాంథాలజీ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా సుహాసిని మాట్లాడుతూ– ‘‘కాఫీ, ఎనీవన్’ కథలో మా కజిన్ అనూహాసన్, శ్రుతీహాసన్ నటించారు. మా నాన్న చారుహాసన్, బాబాయి కమల్‌హాసన్‌ని కూడా యాక్ట్ చేయించాలనుకున్నాను. తర్వాత వద్దనుకున్నాను. ఈ లాక్డౌన్ సమయంలో సుమారు ఆరు షార్ట్ స్టోరీలు సిద్ధం చేసుకున్నాను’’ అన్నారు. కుటుంబ సభ్యులకే అవకాశాలు, నెపోటిజమ్ అనే టాపిక్ గురించి మాట్లాడుతూ – ‘‘నేను చారుహాసన్, కమల్‌హాసన్ కుటుంబానికి చెందిన వ్యక్తిని అనేది ఎవ్వరం మార్చలేం. ఆ నెపోటిజమ్ ఒత్తిడి మా మీదా ఉంది. మా తర్వాతి తరం అయిన శ్రుతీహాసన్ వంటి వాళ్ల మీద ఇంకా ఉంది. అయితే సౌతిండియాలో నెపోటిజమ్ అనే మహమ్మారి ఇంకా రాలేదనుకుంటున్నాను’’ అన్నారు సుహాసిని. -
కట్ చెప్పలేదు.. కట్టేసుకున్నారు..!
(వెబ్ స్పెషల్): ఇంటర్వ్యూల్లో చాలా మంది హీరోయిన్లు చెప్పే మాట తాము డైరెక్టర్స్ చాయిస్ అని. అంటే.. దర్శకులు చెప్పినట్లు తాము చేస్తామని అర్థం. కొన్ని కొన్ని సార్లు ఈ చెప్పే వారి మాటలు అవతలి వారి మనసును తాకుతాయి. దాంతో ఒకరి మీద ఒకరికి ఇష్టం, ప్రేమ కలుగుతాయి. అది కాస్త పెళ్లికి దారి తీస్తుంది. దాంతో కట్ చెప్పలేక వారితో జీవితాన్ని ముడి వేసుకున్నారు. హీరోయిన్లు దర్శకులను వివాహం చేసుకోవడం ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉంది. మరి ఇంతకు ఏ హీరోయిన్ ఏ దర్శకుడిని పరిణయం ఆడిందో చూడండి.. సుహాసిని-మణిరత్నం హీరోయిన్, దర్శకుల వివాహం టాపిక్ వస్తే వెంటనే గుర్తుకు వచ్చేది సుహాసిని-మణిరత్నంల పేర్లే. ఆమె అందం, అభినయాల కలబోత అయితే.. ఆయన భారతీయ ఆత్మను ప్రతిబింబించే చిత్రాల దర్శకుడు. వీరిద్దరి మధ్య ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారి 1988లో వివాహం బంధంతో ఒక్కటయ్యారు. దివంగత దర్శకుడు కె. బాలచందర్ ఒత్తిడి మేరకే తాము వివాహం చేసుకున్నామంటారు సుహాసిని. వీరికి ఒక కుమారుడు నందన్ ఉన్నాడు. (చదవండి: పెద్దన్నయ్య) రేవతి - సురేష్ చంద్ర సురేష్ చంద్ర దర్శత్వంలో రేవతి రెండు చిత్రాల్లో నటించారు. అలా ఏర్పడ్డ పరిచయంతో ఈ జంట ప్రేమలో పడ్డారు. 1986లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ విభేదాలతో విడిపోయారు. కృష్ణవంశీ - రమ్య కృష్ణ కృష్ణవంశీ తెరకెక్కించిన చంద్రలేఖ చిత్రంలో రమ్యకృష్ణ నటించారు. అలా ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. ఈ జంట 2003లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు రిత్విక్ ఉన్నాడు. రోజా - సెల్వమణి రోజాని తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది సెల్వమణి. అలా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. 2002లో రోజా, సెల్వమణిలు వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. బాబు, పాప ఉన్నారు. శరణ్య-పొన్నవనన్ ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తున్నారు శరణ్య. కానీ 1980-90ల కాలంలో ఈమె చాలా తమిళ సినిమాల్లో హీరోయిన్గా చేశారు. అప్పుడే దర్శకుడు పొన్నవనన్తో ప్రేమలో పడ్డారు. వివాహం చేసుకున్నారు.(చదవండి:ఇదే నాకు పెద్ద బర్త్‌డే గిఫ్ట్ ) ఖుష్బూ-సుందర్ ఇద్దరు కలిసి ఒక్క చిత్రం కూడా చేయలేదు. కన్నడ నిర్మాత అయిన సుందర్‌ని ప్రేమించి వివాహం చేసుకున్నారు ఖుష్బూ. ఇక వీరి ప్రేమకు గుర్తుగా ఇద్దరు కుమార్తెలు కూడా జన్మించారు. వారి పేరు అవంతిక అనందిత. సీత- పార్థిపన్ సీనియర్ నటి సీత, దర్శకుడు పార్థిపన్ని ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ 1990లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమర్తెలు, ఓ దత్తత తీసుకున్న కొడుకు ఉన్నారు. 2001లో ఈ జంట విడాకులతో విడిపోయారు. ఆ తర్వాత సీత మరో వ్యక్తిని వివాహం చేసుకున్నారు. (చదవండి: జీవితం ఉన్నది అనుభవించడానికే..) దేవయాని- రాజ్ కుమారన్ దర్శకుడు రాజ్ కుమారన్, దేవయానిల లవ్ ఎఫైర్ అప్పట్లో ఒక సెన్సేషన్. రాజ్ కుమారన్ దర్శత్వంలో దేవయాని నీ వరువై ఏనా అనే చిత్రంలో నటించారు. వీరిద్దరూ 2001లో వివాహం చేసుకున్నారు. అమలాపాల్ - విజయ్ దర్శకుడు అమలాపాల్, విజయ్ ప్రేమ వ్యవహారం గురించి తెలిసిందే. పెళ్లి చేసుకున్న కొద్దిరోజులకే వీరిద్దరూ విభేదాలతో విడిపోయారు. వీరే కాక దర్శకుడు సెల్వ రాఘన్, హరి, ప్రియ దర్శన్ వంటి వారు హీరోయిన్లనే వివాహం చేసుకున్నారు. -
చిట్టి చిలుక
లాక్ డౌన్ లో ఉన్నప్పటికీ ప్రేక్షకులను వినోదపరచడానికి, చైతన్యపరచడానికి పాటలు, వీడియోలు, షార్ట్ ఫిల్మస్ ఇలా ఏదోటి చేస్తున్నారు స్టార్స్. తాజాగా సీనియర్ నటి సుహాసిని కూడా ఓ షార్ట్ ఫిలిం తీశారు. దీని పేరు ‘చిన్నంజిరు కిళియే’ (చిట్టి చిలుక). 20 నిమిషాల నిడివి ఉన్న ఈ షార్ట్ ఫిలిం లో మళయాళ నటి ఆహా కష్ణ ముఖ్య పాత్రలో నటించారు. ఎవరి ఇంట్లో వాళ్లు ఉండి ఈ షార్ట్ ఫిలింను పూర్తి చేశారు. ఐ ఫోన్లో షూట్ చేసిన ఈ షార్ట్ ఫిలిం ఈ వారంలో విడుదల కానుంది. ఇది కరోనా వైరస్‌పై అవగహనకు సంబంధించిందా లేకపోతే వేరే కథాంశంతో తెరకెక్కిందా అనే విషయం తెలియాల్సి ఉంది.