![ఇది ఇంటింటి కథ - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/71458930738_625x300.jpg.webp?itok=b66IhJk9)
ఇది ఇంటింటి కథ
ప్రస్తుత సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న గృహహింస నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘హ్యాపీ లైఫ్’. పోసాని కృష్ణమురళి, ‘చంటిగాడు’ ఫేమ్ సుహాసిని జంటగా శ్రీ గౌరీదేవి సినీచిత్ర పతాకంపై రామకృష్ణ వీర్నాల దర్శకత్వంలో ఎన్. దేవీ చరణ్ ఈ సినిమా నిర్మించారు. ‘‘మెసేజ్ ఓరియం టెడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రూపొందిన చిత్రమిది. ఈ చిత్రానికి మొదట ‘నా పెళ్ళాం... నా ఇష్టం’ అనే పేరు పెట్టాం. అభ్యంతరాలు రావడంతో ‘హ్యాపీలైఫ్’అనే టైటిల్ నిర్ణయించాం. త్వరలోనే సినిమా రిలీజ్ చేస్తాం’’ అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమేరా: వెంకీ, సంగీతం: రమేశ్.