‘నా సోదరి’ అని మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆప్యాయంగా అనేవారు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అన్నకు ఎంతో ఇష్టంగా రాఖీ కట్టేవారు సబిత. వైఎస్ హయాంలో తొలి మహిళా హోంమంత్రిగా సబిత బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.
ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే మహానేత వైయస్సార్ జీవితం ఆధారంగా ‘యాత్ర’ పేరుతో ఓ సినిమా నిర్మాణంలో ఉన్న విషయం తెలిసిందే. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహీ వి. రాఘవ్ దర్శకత్వంలో ‘యాత్ర’ సినిమా తెరకెక్కుతోంది. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో సబితా ఇంద్రారెడ్డి పాత్రను సుహాసిని చేయనున్నారు. త్వరలో లుక్ టెస్ట్ జరగనుంది. వైఎస్ పాత్రలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటిస్తున్నారు. వైఎస్ గెటప్‌లో ఉన్న మమ్ముట్టి ఫస్ట్ లుక్‌కి అనూహ్య స్పందన లభించింది.
Comments
Please login to add a commentAdd a comment