ఆగస్టు 15 న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు | On August 15, the birthday celebrated | Sakshi
Sakshi News home page

ఆగస్టు 15 న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Published Sat, Aug 15 2015 1:14 AM | Last Updated on Sun, Sep 3 2017 7:27 AM

ఆగస్టు  15 న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఆగస్టు 15 న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: అర్జున్ (నటుడు), సుహాసిని (నటి), అద్నాన్ సమి (గాయకుడు)     
 
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 4. దీనికి అధిపతి రాహువు. కోర్టు వివాదాలు, పెండింగ్‌లో ఉన్న పోలీస్ కేసులు ఈ సంవత్సరం పరిష్కారమవుతాయి. అందువల్ల ఎంతో రిలీఫ్‌గా అనిపిస్తుంది. ఆస్తులు కొనుక్కోవాలని, ఉన్న ఆస్తులను అభివృద్ధి చేయాలని కంటున్న కలలు నెరవేరతాయి. వారసత్వంగా రావలసిన ఆస్తులు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. మీ పుట్టిన తేదీ 15. ఇది శుక్రునికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల జీవితం ఉత్సాహవంతంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. శుక్ర, రాహువుల కలయిక వల్ల జీవితం చాలా బాగుంటుంది. అవివాహితులకు వివాహ యోగం కలుగుతుంది. పిల్లల పెళ్లిళ్లు తదితర బాధ్యతలు పూర్తి చేస్తారు.

శుభకార్యాలలో పాల్గొంటారు. మీకన్నా పై స్థాయి వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. దానివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే ఆపోజిట్ సెక్స్ వారితో నెరిపే సంబంధాల విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. లక్కీ నంబర్స్: 1,4,6,9; లక్కీ డేస్: శుక్ర, శని, ఆదివారాలు; లక్కీ కలర్స్: వైట్, బ్లూ, క్రీమ్, వయొలెట్; లక్కీ మంత్స్: ఫిబ్రవరి, ఏప్రిల్, ఆగస్ట్, సెప్టెంబర్, నవంబర్. సూచనలు: అవివాహిత  యువతుల పెళ్లి ఖర్చులు భరించడం, అనాథలకు, వికలాంగులకు తగిన విధంగా సహాయం చేయడం మంచిది.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement