‘రఫ్’ ఆడించే కుర్రాడు ప్రేమలో పడితే..!
‘రఫ్’ ఆడించే కుర్రాడు ప్రేమలో పడితే..!
Published Sun, Nov 3 2013 11:35 PM | Last Updated on Sat, Sep 2 2017 12:15 AM
కోపం వస్తే రఫ్ ఆడించే కుర్రాడు ఓ అందమైన అమ్మాయితో ప్రేమలో పడతాడు. ప్రేమ కోసం ఎంతకైనా తెగించే తత్త్వం అతనిది. ఇంతకూ అతని ప్రేమకు అడ్డుపడింది ఎవరు? వారిని అతనేం చేశాడు? ఈ నేపథ్యంలో ఆది హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘రఫ్’. రకుల్ ప్రీత్సింగ్ కథానాయిక. సీహెచ్ సుబ్బారెడ్డి దర్శకత్వంలోశ్రీదేవి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మాధవరం అభిలాష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతోంది.
ఆది మాట్లాడుతూ -‘‘నా గత చిత్రాలతో పోలిస్తే మ్యూజికల్గా పెద్ద హిట్ అవుతుంది. మణిశర్మ మంచి సంగీతాన్నిచ్చారు’’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఈ సినిమాలో శ్రీహరిది కీలకపాత్ర. ఆయన మీద 23 సీన్లు తీశాం’’ అని తెలిపారు. సినిమా పూర్తి కావచ్చిందని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: సెంథిల్కుమార్, అరుణ్కుమార్, మాటలు: మరుధూరి రాజా.
Advertisement
Advertisement