Srihari
-
ఏసీబీ వలలో రావులపాలెం సీఐ
రావులపాలెం : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం టౌన్ సీఐ సీహెచ్ ఆంజనేయులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ డి.శ్రీహరిరాజు కథనం ప్రకారం.. గత నెల 16న రావులపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కోడిపందాల కేసు నమోదు చేశారు. మండలంలోని పొడగట్లపల్లిలో నిర్వహించిన కోడిపందాలపై పోలీసులు దాడి చేసి, అప్పట్లో పలువురిని అరెస్టు చేశారు. కొన్ని వాహనాలను, కోళ్లను స్వా«దీనం చేసుకున్నారు.ఈ కేసులో కోడిపందాలు నిర్వహించిన స్థల యజమాని కుంచెర్లపాటి లక్ష్మణరాజు నుంచి సీఐ ఆంజనేయులు అప్పట్లో కొంత మొత్తం లంచంగా తీసుకున్నాడు. అనంతరం చార్జిషీటులో తక్కువ సెక్షన్లు నమోదు చేసేందుకు, లక్ష్మణరాజుపై రౌడీ షీట్ తెరవకుండా ఉండేందుకు మరో రూ.50 వేలు లంచం ఇవ్వాలని పలుమార్లు డిమాండ్ చేశాడు.దీంతో విసిగిపోయిన లక్ష్మణరాజు రాజమహేంద్రవరం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల పథకం ప్రకారం సీఐ ఆంజనేయులుకు లక్ష్మణరాజు స్థానిక పోలీస్ స్టేషన్లో శనివారం రూ.50 వేలు లంచం ఇచ్చాడు. ఆ మొత్తాన్ని తీసుకుంటున్న సీఐ ఆంజనేయులును అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఏసీబీ డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. -
అల్లు అర్జున్ పుష్ప మూవీ.. ఆ స్టైల్ కాపీ కొట్టేశారా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రం పలు రికార్డులు కొల్లగొట్టింది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. శ్రీవల్లిగా టాలీవుడ్‌ను అభిమానులను అలరించింది. ఎర్రచందనం సిండికేట్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమాతో అల్లు అర్జున్ను ఓ రేంజ్ స్థాయికి తీసుకెళ్లింది. అంతే కాకుండా ఈ సినిమాకు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ కూడా అందుకున్నారు. అయితే ఈ సినిమాలో పుష్పరాజ్ మేనరిజానికి సినీ ప్రియులు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా భుజం కాస్తా పైకి ఎత్తి బన్నీ నటించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఇప్పటికీ ఆ స్టైల్‌కు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఏది ఏమైనా ఈ చిత్రంలో అల్లు అర్జున్ డైలాగ్స్, వాకింగ్ స్టైల్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకున్నాయి. పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదేలే అనే డైలాగ్ అభిమానులను ఓ ఊపు ఊపేసింది. పుష్ప సినిమాలో ముఖ్యంగా అల్లు అర్జున్ నడక ఎప్పటికీ మర్చిపోలేరు. అయితే అచ్చం అల్లు అర్జున్ లాగే ఆ వాకింగ్ స్టైల్‌ను టాలీవుడ్ హీరో చేసి చూపించారు. కాకపోతే ఇప్పుడు కాదండోయ్. దాదాపు 22 ఏళ్ల క్రితమే శ్రీహరి అలాంటి మేనరిజంతో మెప్పించారు. ఇది చూసిన టాలీవుడ్ ఫ్యాన్స్ షాకవుతున్నారు. 2002లో వచ్చిన పృథ్వీ నారాయణ అనే చిత్రంలో సేమ్ బన్నీ వాకింగ్ స్టైల్‌తో అదరగొట్టారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ శ్రీహరి అద్భుతంగా చేశారంటూ కామెంట్స్ చేశారు. మరికొందరేమో పుష్ప మేనరిజం కాపీ కొట్టారా? అంటూ డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ప్రస్తుతం బన్నీ పుష్ప-2 సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. pushpa walking style appatlone srihari gaaru 👌❤️ pic.twitter.com/4PJj9Y1Z1Z — celluloidpanda (@celluloidpanda) March 25, 2024 -
ఐదు భాషల్లో జాలరి
శ్రీహరి హీరోగా రాజ్ తాళ్లూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘జాలరి’ సినిమాప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. తొలి సన్నివేశానికి దర్శకుడు సముద్ర కెమెరా స్విచ్చాన్ చేసి, స్క్రిప్ట్‌ను నిర్మాతలకు అందించారు. ఐదు భాషల్లో ‘జాలరి’ని ఎమ్‌వై3 ప్రోడక్షన్స్ పతాకంపై ఆదిత్య పల్లా, రఘు కుడితిపూడి, సాయికిరణ్ బత్తుల, రక్తం దశరథ్ గౌడ్ నిర్మించనున్నారు. ‘‘1980 నేపథ్యంలో కమర్షియల్ ఫార్మాట్లో తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ఫిబ్రవరిలో ప్రారంభిస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. -
మా తండ్రి మళ్ళీ పుడతాడు అంటున్న కొడుకు
-
నా మనసుకి సుఖం లేదు..!
-
నాకు అన్నయ్య చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం
-
నన్ను ప్రతి రోజు ప్రేమిస్తాడు మా బావ..!
-
శ్రీహరి ఫామ్ హౌస్ చూశారా ..?
-
శ్రీహరి మరణంతో మద్యానికి బానిసయ్యా: డిస్కో శాంతి
డిస్కో శాంతి 1980లో వారికి పరిచయం అక్కర్లేని పేరు. ఐటం సాంగ్స్‌తో సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె అసలు పేరు శాంత కుమారిగా కాగా.. సినిమాల్లో నటనతో డిస్కో శాంతిగా ముద్రపడిపోయింది. ఆగస్టు 28, 1965న జన్మించిన డిస్కో శాంతి పలు భాషలలో దాదాపు 900కి పైగా చిత్రాలలో కనిపించింది. ఆమె ఎక్కువగా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, ఒడియా భాషల్లో నటించారు. మలయాళంలో ఉమై విజిలీ సినిమాలో ఆమె చేసిన డ్యాన్స్‌తో పాపులర్ అయింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. 1986లో తొలిసారి ఉదయగీతం చిత్రంలో నటించారు. మొదట కొన్ని సినిమాల్లో సహాయ నటిగా నటించింది. అదే సమయంలో ఐటెం సాంగ్స్‌లో నర్తించే అవకాశం వచ్చింది. దాదాపు 11 ఏళ్ల పాటు సినీ పరిశ్రమలో ఉన్నారు. అతని తండ్రి సీఎల్ ఆనందన్ సినిమాల్లో కూడా నటించాడు. తమిళం, తెలుగు సినిమాల్లో ప్రముఖ పాత్రలు పోషించారు. శ్రీహరితో ప్రేమ పెళ్లి అయితే టాలీవుడ్ హీరో శ్రీహరిని 1996లో ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లయిన తర్వాత కుటుంబాన్ని చూసుకోవడానికే ఆమె పరిమితయ్యారు. సినిమాలకు గుడ్ బై చెప్పారు. అయితే ఆమె భర్త అక్టోబరు 9, 2013న కాలేయ సంబంధ వ్యాధితో ముంబైలో కన్నుమూశారు. ఇటీవలే యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. శ్రీహరి మరణం తట్టుకోలేక.. డిస్కో శాంతి మాట్లాడుతూ.. 'బావ (శ్రీహరి) చనిపోయాక నేను మద్యానికి బానిసయ్యా. జరిగిన విషాదాన్ని మరచిపోవాలని చాలా ప్రయత్నించా. ఆయన చనిపోయిన మూడు నెలల తర్వాత ధైర్యం తెచ్చుకున్నా. ఆ సమయంలో నా సోదరులు, కుటుంబ సభ్యులు మూడు నెలలకు పైగా నాతోనే ఉన్నారు. కానీ పిల్లల చదువుల కారణంగా వెళ్లిపోయారు. ఆ తర్వాత నా కుమారులు నాకు మద్దతుగా నిలిచారు.' అని శాంతి చెప్పింది. శ్రీహరి, డిస్కో శాంతిలది ప్రేమ వివాహం కాగా.. కెరీర్ ప్రారంభంలో విలన్ పాత్రలు పోషించిన శ్రీహరి, శాంతి డాన్స్ చూసి ప్రేమలో పడ్డారు. ఆమె కుటుంబం గురించి తెలుసుకుని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. శ్రీహరి మరణించే వరకు టాలీవుడ్లో కలిసి మెలిసి ఉన్న జంటలలో ఒకరిగా నిలిచారు. -
కడియం శ్రీహరి గుంటనక్క లాంటివాడు
స్టేషన్‌ఘన్‌పూర్: ఎమ్మెల్సీ కడియం శ్రీహరి గుంటనక్కలాంటి వాడని, ఆనాడు డాక్టర్ రాజయ్య డిప్యూటీ సీఎం బర్తరఫ్‌లో, ప్రస్తుతం బీఆర్ఎస్ టికెట్ రాకపోవడంలో కడియం కుట్ర ఉందని, రెండు సందర్భాల్లో కడియం సూత్రధారుడని ఎమ్మార్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో సోమవారం జరిగిన నియోజకవర్గస్థాయి మాదిగల అస్థిత్వం, ఆత్మగౌరవసభలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో మాదిగల అస్థిత్వం దెబ్బతినే ప్రమాదం ఉందని, కాపాడుకోవాల్సిన బాధ్యత మాదిగలందరిపై ఉందన్నారు. డిప్యూటీ సీఎం హోదాలో రాజయ్య పంచె, ధోతి కట్టుకుని రాష్ట్రమంతా తిరిగితే పెద్దదొర కేసీఆర్, దళితదొర కడియం ఓర్వలేదన్నారు. కడియం మాదిగలను అణగదొక్కేలా గుంటనక్కలా వ్యవహరిస్తున్నారన్నారు. లైంగిక వేధింపుల విషయమై రాజయ్యపై నిరాధారమైన ఆరోపణలతో మహిళా కమిషన్ సుమోటో కేసు ఎలా స్వీకరించిందని మంద కృష్ణ ప్రశ్నించారు. భూపాలపల్లి, బెల్లంపల్లి, ఆర్మూరు ఎమ్మెల్యేలపై లైంగిక వేధింపులపై చర్యలు ఎందుకు తీసుకోలేదన్నారు. కేవలం రాజయ్య మాదిగ ఎమ్మెల్యే కావడంతోనే సుమోటోగా స్వీకరించారన్నారు. -
స్టేషన్ ఘన్‌పూర్‌లో ఉద్రిక్తత
స్టేషన్‌ఘన్‌పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వచ్చే ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ టికెట్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరికే వస్తుందని విస్తృతంగా ప్రచారం కావడం, ఎమ్మెల్యే రాజయ్యపై కడియం వ్యాఖ్యలు చేయడంపై రాజయ్య అనుచరులు భగ్గుమన్నారు. శనివారం ఇక్కడ కడియం దిష్టిబోమ్మను ఎమ్మెల్యే అనుచరులు దహనం చేయనున్నారని పోలీసులు తెలుసుకొని అప్రమత్తమయ్యారు. జెడ్పీటీసీ మారపాక రవితోపాటు పలువురిని ఉదయం అరెస్టు చేశారు. ఘన్పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న ఎమ్మెల్యే అనుచరులను, ప్రజాప్రతినిధులను ఏసీపీ శ్రీనివాస్‌రావు, సీఐ రాఘవేందర్, ఎస్ఐలు నాగరాజు, హరికృష్ణ ఆ«ధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేసి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్యే తమ్ముడు, ఘన్పూర్ సర్పంచ్ తాటికొండ సురేశ్‌కుమార్ గ్రామపంచాయతీ కార్యాలయం నుంచి బయటికి వెళ్లకుండా హౌస్అరెస్టు చేశారు. ఘన్‌పూర్‌లో అవినీతి పెరిగిందని, గోకుడు, గీకుడుగాళ్లు, భూకబ్జాదారులంటూ కడియం అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ మండలంలోని మీదికొండ క్రాస్‌రోడ్డు వద్ద జాతీయ రహదారిపై ఎమ్మెల్యే అనుచరులు ఆయన దిష్టిబోమ్మను దహనం చేశా రు. శ్రీహరి డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. -
శ్రీహరి కట్టిన తాళి మాత్రమే మిగిలింది.. ప్రస్తుతం మా పరిస్థితి ఇదే: డిస్కో శాంతి
శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రీహరి తన బాల్యంలోనే కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం యలమర్రు గ్రామానికి వలస వచ్చారు. అక్కడే అతని పాఠశాల విద్యను పూర్తిచేసుకున్నారు. యలమర్రులో రోడ్డు పక్కన చిన్న పాక వేసుకొని సైకిలు షాపు, సోడాలు అమ్మి అక్కడే జీవనం సాగించారు. అక్కడి నుంచి ఆయన సినిమాలపై మక్కువతో అరెకరం భూమి అమ్మి హైదరాబాద్ వచ్చారు. సినీ ఇండస్ట్రీలో శ్రీహరి మంచి వ్యక్తిత్వం కలిగిన నటుడు, సాయం కోసం తన దగ్గరకు వెళ్లిన వారికి లేదు అనకుండా సాయం చేసే గుణం కలిగిన మనిషి అని పేరు ఉంది. డిస్కో శాంతిని ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమా షూటింగ్ నిమిత్తం ముంబై వెళ్లిన శ్రీహరి అక్కడ తీవ్ర అస్వస్థతకు గురవడంతో వెంటనే అతన్ని లీలావతి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్టోబరు 9, 2013న కాలేయ సంబంధ వ్యాధివలన ముంబై లో కన్నుమూశారు. రాంగ్ ట్రీట్మెంట్ ఇచ్చారు శ్రీహరి మరణం జరిగిన సమయంలో ఏం జరిగిందో తాజాగ ఓ ఇంటర్వ్యూలో డిస్కో శాంతి తెలిపింది. సినిమా షూటింగ్ మధ్యలో అనారోగ్యానికి గురైన శ్రీహరిని ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో జాయిన్ చేసి ఐసీయూలో పెట్టారని ఆమె ఇలా చెప్పింది. 'శ్రీహరి చనిపోయే కొన్ని గంటల ముందు వైద్యులు చెకప్‌కు వచ్చారు. ఆ సమయంలో నన్ను బయటకు పంపించారు. అప్పుడు వాళ్లు కొన్ని మందులతో పాటు ఇంజక్షన్స్ సూచించారు. (ఇదీ చదవండి: Bigg Boss Telugu 7: బిగ్‌బాస్‌లో గ్లామర్ డోస్ పెంచేందుకు హాట్ బ్యూటీస్ ఎంట్రీ ) కొంత సమయం తర్వాత ఒక నర్సు వచ్చి ఆ ఇంజక్షన్ వేసింది. కొన్ని నిమిషాల్లోనే శ్రీహరి కళ్లు,ముక్కు,చెవులు నుంచి మొత్తం బ్లడ్ వచ్చింది. నాకు హిందీ రాదు.. వాళ్లకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. వాళ్లు బ్లడ్ మొత్తం క్లీన్ చేసి ఆయన్ను మరోగదిలోకి తీసుకుపోయారు. నేను ఎంత మొత్తుకున్నా శ్రీహరి దగ్గరకు కూడా పోనియలేదు.. వంద శాతం ఆ డాక్టర్లు రాంగ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇదే హైదరాబాద్‌లో అయింటే ఆయన ఖచ్చితంగా బతికేవాడు.' అని ఆమె తెలిపింది. ఆస్పత్రిలో ఠాగూర్ సినిమా చూపించారు శ్రీహరి చాలా గంటల ముందే చనిపోయినా తమకు ఆస్పత్రి సిబ్బంది చెప్పలేదని డిస్కో శాంతి పేర్కొన్నారు. వైద్యం అందిస్తున్నామని చాలా డబ్బు కట్టించుకున్నారని తెలిపింది. వాళ్లు చేసిన పని తలచుకుంటే చిరంజీవి ఠాగూర్ సినిమానే గుర్తుకొస్తుందని ఆమె పేర్కొంది. ఆస్పత్రి మీద కేసు వేయమని చాలామంది సలహాలిచ్చారు. ఆయన చనిపోతేనే మన అనుకునే వాళ్లు ఎవరూ రాలేదు. మళ్లీ ఈ కేసుల విషయంలో పిల్లలను పట్టుకుని తాను తిరగలేనని భావించి విరమించుకున్నానని శాంతి ఎమోషనల్ అయింది. చాలా మంది మోసం చేశారు శ్రీహరి మరణం తర్వాత సినీ పరిశ్రమ, స్నేహితులు ఏ ఒక్కరూ తమ ఇంటికి రాలేదని శాంతి తెలిపింది. కనీసం తాము ఉన్నామో లేమో కూడా వాళ్లకు తెలియదని గుర్తుచేసుకుంది. శ్రీహరి గతంలో ఎవరికి డబ్బు ఇచ్చారు. ఎవరిదగ్గర దాచారు అనేది తెలియదు. కానీ కొంతమంది ఆర్థిక విషయాల్లో తమను మోసం చేశారని శాంతి వాపోయింది. చుట్టుముట్టిన ఆర్థిక సమస్యలు.. తాళి తప్పా నగలన్నీ తాకట్టలో శ్రీహరి మరణం తర్వాత ఒక్కసారిగా తమకు ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయని శాంతి గుర్తుచేసుకుంది. శ్రీహరి లేరనే బాధ ఒకవైపు ఉండగానే కొంతమంది మోసం వల్ల డబ్బు కోల్పోయాను.. అదే డబ్బు ఉండిఉంటే తన కుమారుడు చదవుకునేందుకు ఫారిన్ వెళ్లేవాడని శాంతి తెలిపింది. తమకు రావాల్సిన డబ్బు అయితే తిరిగిరాలేదు కానీ తాము తీసుకున్న అప్పువాళ్లు మాత్రం ఇంటికి వచ్చారని చెప్పింది. అప్పుడు చేసేదిమి లేకపోవడంతో తమ వద్ద ఉన్న కార్లు, భూమి, బంగారం అన్నీ అమ్మేసి బాకీలు కట్టేశానని శాంతి తెలిపింది. (ఇదీ చదవండి: 'జైలర్' చూసి రజనీకాంత్ ఎలాంటి కామెంట్ చేశారంటే: నెల్సన్) చివరకు ఎంతో ఇష్టంగా కొనుకున్న ఒక కారు ఈఎంఐ కూడా కట్టలేకపోతే బ్యాంకు వారు తీసుకుపోయారని చెప్పింది. తాళి మాత్రమే ఉంచుకుని మిగిలిన బంగారాన్ని మొత్తం కోల్పోయానని శాంతి గుర్తుచేసుకుంది. ప్రస్తుతం జీవనోపాధికి తమ రెండు ఇళ్ల నుంచి అద్దె వస్తుందని తెలిపింది. అంతేకాకుండా ప్రస్తుతం తాము ఉంటున్న ఇళ్లు నుంచి కొంత భాగం రోడ్డు డివైడింగ్ కోసం పోయింది. అందుకు సంబంధించి వచ్చిన డబ్బు బ్యాంకులో డిపాజిట్ చేశామని శాంతి తెలిపింది. సినీ ఇండస్ట్రీ నుంచి ఏమైనా మంచి అవకాశాలు వస్తే తప్పకుండా చేస్తానని శాంతి పేర్కొంది. డిస్కో శాంతికి పేరు తెచ్చిన పాట 'బంగారు కోడిపెట్ట' ( ఘరానామొగుడు) -
కడియం పుట్టుకను ప్రస్తావించిన ఎమ్మెల్యే రాజయ్య.. ‘స్టేషన్’లో వార్
సాక్షిప్రతినిధి, వరంగల్: జనగామ జిల్లా స్టేషన్ఘనపూర్ ఎమ్మెల్యే టి.రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. వ్యక్తిగత విమర్శలు ఆరోపణలు, రాజకీయంగా దుమారం రేపుతుండగా.. గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తున్నాయి. కడియం శ్రీహరి దళితుడు కాదు.. అవినీతిపరుడు అంటూ ఎమ్మెల్యే రాజయ్య చేసిన ఆరోపణలపై కడియం కౌంటర్ ఎటాక్ చేశాడు. కుల ప్రస్తావనతోపాటు అవినీతి ఆరోపణలు నిరూపించాలి.. లేకుంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కొంతకాలంగా ‘స్టేషన్’లో ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రుల మధ్య వైరం సాగుతున్నా.. నాలుగైదు రోజులుగా అది పరాకాష్టకు చేరింది. ఆ ఇద్దరి పోటాపోటీ ప్రెస్మీట్లు, సమావేశాలతో కార్యకర్తలు, నాయకులు సైతం నియోజకవర్గంలో రెండు గ్రూపులుగా చీలిపోయి పాల్గొంటున్నారు. ఇంత జరుగుతున్నా అధిష్టానం మాత్రం వేచిచూసే ధోరణితో ఉండటం.. మరోవైపు సీనియర్ల ద్వారా ఆరా తీస్తుండటం రాజకీయవర్గాల్లో హాట్‌టాఫిక్‌గా మారింది. అటాక్, కౌంటర్ అటాక్.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య అటాక్.. కౌంటర్ అటాక్‌లు, మాటల వాగ్ధాటి, మాటల యుద్ధం పెరిగింది. జానకీపురం సర్పంచ్ నవ్య వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కొంతకాలం మౌనంగా ఉన్న రాజయ్య నాలుగైదు రోజుల నుంచి కడియం శ్రీహరి టార్గెట్‌గా వాగ్ధాటి పెంచారు. కడియం పద్మశాలి కులంలో పుట్టి బైండ్ల కులంలో పెరిగాడని ఆయన కులంపై చర్చ జరగాలంటున్నారు రాజయ్య. బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ దళితులు రాజకీయంగా ఎదిగితే కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేశాడని ఆరోపించారు. 14 ఏళ్లు మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఏ దళిత బిడ్డను ఎదగనీయలేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్లి వర్ధన్నపేట నుంచి కావ్యకు టికెట్ ఇవ్వాలని అడుగుతున్న ఆధారాలు బయటకు వస్తున్నాయంటూ.. కొత్త ఆరోపణలను తెరమీదకు తెచ్చారు. మాదిగల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్న రాజయ్య.. శ్రీహరి అవినీతిపై ఖల్నాయక్ అనే పుస్తకం ఉందని.. దాన్ని త్వరలో ప్రజల ముందు ఉంచుతానని తెలిపారు. ఎవరు ఏంటో తేల్చుకునేందుకు బహిరంగ చర్చకు రావాలని రాజయ్య సవాల్ విసిరారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే రాజయ్య విమర్శలపైన ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కూడా సోమవారం కౌంటర్ ఎటాక్ చేశారు. రాజయ్య స్థాయిని మరిచి వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని ధ్వజమెత్తిన ఆయన.. నా పుట్టుక, నా కూతురు కులాన్ని ఎమ్మెల్యే ప్రస్తావించడం మనస్తాపానికి గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు కోర్టు తీర్పుతో తాను ఎస్సీ, తల్లి బీసీ, తండ్రి ఎస్సీ అని స్పష్టం చేశారని, తల్లి సత్యం, తండ్రి అపోహ అని చేసిన కామెంట్స్‌కు, ఎన్కౌంటర్ సృష్టికర్త అన్నందుకు క్షమాపణ చెప్పాలని శ్రీహరి డిమాండ్ చేశారు. తాను ఎస్సీ అయితే తన కూతురు ఎస్సీ అవుతుందని, ఈ న్యాయ సూత్రాలు తెలియని రాజయ్య ఎమ్మెల్యేగా ఎలా ఉన్నావని ప్రశ్నించారు. అక్రమ ఆస్తులు ఉన్నాయని ఆరోపిస్తున్న రాజయ్య నిరూపిస్తే వాటిని నియోజకవర్గ దళితులకు పంపిణీ చేస్తానని స్పష్టం చేశారు. వారం రోజుల్లో ఆ ఆస్తుల వివరాలు తేల్చి ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధిష్టానం ఆరా.. బజారున పడ్డ ఎమ్మెల్సీ శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్య మధ్య రాజకీయ వైరంపై ఆ పార్టీ అధిష్టానం సీరియస్‌గా స్పందించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. మొదటి నుంచి రాజకీయ ప్రత్యర్థులైన వీరిద్దరి మధ్య కొంతకాలంగా ఆధిపత్య పోరు కొసాగుతోంది. ఎమ్మెల్యేగా తాడికొండ రాజయ్య వ్యవహరిస్తుండగా.. ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కడియం శ్రీహరి కూడా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంనే ఎంచుకున్నారు. 2019 సెప్టెంబర్‌లో వేర్వేరుగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన యాత్ర రెండు వర్గాల మధ్య విభేదాలకు ఆజ్యం పోయగా.. ఆ తర్వాత పరిణామాలు కూడా మరింత దూరం పెంచాయి. ఎవరికీ వారుగా నియోజకవర్గంలో సభలు, సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఫ్లెక్సీలు, ప్రొటోకాల్ వివాదం.. అంటూ ఇరువర్గాల మధ్యన తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అయితే 20 రోజుల వరకు కూడా పరోక్షంగా ఆరోపణలు చేసుకున్న ఇద్దరు నేతలు కాస్తా ఇటీవల దూకుడు పెంచారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో స్వరం మరింత పెంచారు. ఈ క్రమంలో ఒక దశలో అధిష్టానం సూచనలను కూడా ధిక్కరించేందుకు వెనుకాడటం లేదు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు, మాజీ ఉప ముఖ్యమంత్రులు పోటీపోటీగా ప్రెస్మీట్లు ఏర్పా టు చేసి బహిరంగంగా ఆరోపణలు చేసుకోవడం దేనికి సంకేతం? అన్న చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ అధిష్టానం సైతం సీరియస్‌గా ఆరా తీస్తుండటంతో.. ‘స్టేషన్’లో ఏం జరుగబోతోంది? అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. -
పేదరికాన్ని జయించి భాషా సాహిత్యాలలో రాణించిన ఆచార్య రవ్వా శ్రీహరి
నల్లగొండ జిల్లా వెల్వర్తి లోని పేద చేనేత కార్మికుల కుటుంబంలో పుట్టిన (1943) ఒక కుర్రవాడు యాదగిరి లక్ష్మి నరసింహ స్వామి సంస్మృత విద్యా పీఠంలో చేరడమే విశేషమైతే అందులోని అంతా బ్రాహ్మణ సహ విద్యార్థులతో పోటీపడి ఉన్నత స్థానంలో నిలవడం మరో విశేషం. కష్టపడి డీవోఎల్, బివోఎల్, బిఏ, ఎంఏ వంటి ఎన్నో మెట్లు ఎక్కి డాక్టరేట్ కూడా చేసి (1973), హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయం లో బహుకాలం బోధనచేసి, ద్రావిడ విశ్వ విద్యాలయం ఉపాధ్యక్షుడు కాగలిగాడు (2002), ఉత్తమ పాలకుడిగా పేరు తెచ్చుకున్నాడు. సంస్కృతంలో,తెలుగులో భాషా సాహిత్యాలపై ఎన్నో పరిశోథనాత్మకమైన రచనలు చేసి 'మహా మహోపాధ్యాయ' అనిపించుకున్న మహనీయుడు ఆచార్య రవ్వా శ్రీహరి ఇక లేరు అన్న వార్త వారి కుటుంబ సభ్యులను బంధుమిత్రులనే కాదు నా లాంటి ఎంతో మంది వారి అభిమానులను కూడా శోక సాగరంలో ముంచింది. అన్నమయ్య పదకోశాన్ని తయారుచేసిన, శ్రీహరి నిఘంటువు రూపొందించిన, నల్లగొండ జిల్లా మండలికాలు అక్కడి ప్రజల భాషపై ఎన్నో గ్రంధాలు రచించిన అంతటి గొప్ప పండితుడు. వరంగల్ కు చెందిన, సహకార శాఖలో నా సీనియర్ అయిన డాక్టర్ ఏ.సురేంద్ర కుమార్ గారి ద్వారా మా అన్న కీశే వేముల పెరుమాళ్ళు గారి ప్రసిద్ధ గ్రంథం 'తెలంగాణ జాతీయాలు' పుస్తకం గురించి విని తెప్పించుకొని చదివి ప్రశంసించడం ఇంకా గొప్ప విషయం. 2005లో 'మానవతా పరిమళాలు' పేరుతో మా అన్నగారి స్మారక సంచిక ప్రచురించి నప్పుడు దానికి సందేశం పంపుతూ ' రాజకీయ రంగంలో ఉంటూ ప్రజాహిత కార్యాల్లో తలమునకలౌతూ కూడా భాషా, సాహిత్య రంగాల్లో కృషి చేయడం ప్రశంసనీయం. పెరుమాళ్ళు గారి 'తెలంగాణ జాతీయాలు' అన్న గ్రంధం భాషా రంగంలో వారు చేసిన కృషికి అద్దం పడుతుంది.తెలంగాణ భాష ప్రత్యేకతను విశిష్ట తను చాటుతుంది కూడా ' అని అభినందించారు. అంతేకాదు 12 సెప్టెంబర్ 2009 నాడు హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఆ గ్రంధావిష్కరణ సభకు ముఖ్యఅతిథిగా హాజరై ఆనాటి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. -వేముల ప్రభాకర్, రచయిత , రిటైర్డ్ ప్రభుత్వ అధికారి -
రవ్వా శ్రీహరి మృతిపై సీఎం వైఎస్ జగన్ సంతాపం
-
రవ్వా శ్రీహరి కన్నుమూతపై సీఎం జగన్ సంతాపం
సాక్షి, గుంటూరు: ప్రముఖ సాహితీవేత్త ఆచార్య రవ్వా శ్రీహరి(80) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. తెలుగు, సంస్కృత భాషల్లో పండితుడు, సాహితీవేత్త అయిన రవ్వా శ్రీహరి మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలియజేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు సీఎం జగన్. మరోవైపు రవ్వా శ్రీహరి మృతిపట్ల పలువురు సాహితీవేత్తలు, రచయితలు సంతాపం ప్రకటించారు. ఆయన మరణం సంస్కృతాంధ్ర భాషలకు తీరని లోటు అని సాహితీవేత్తలు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు, ద్రావిడ యూనివర్సిటీ వీసీగా పని చేశారు ఆచార్య రవ్వా శ్రీహరి. టీటీడీలోనూ ఆయన కొంతకాలం పని చేశారు. తెలంగాణ నల్లగొండ జిల్లా వెల్వర్తిలో ఒక సామాన్య చేనేత కుటుంబంలో జన్మించారు శ్రీహరి. 2011లో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల విభాగానికి ఎడిటర్-ఇన్-ఛార్జ్‌గా పనిచేశాడు. హైదరాబాద్ మలకపేట యశోద ఆసుపత్రి ఎదురుగా వున్న జడ్జెస్ కాలనీలోని రుక్మిణి అపార్టుమెంట్లో ఆయన నివాసం ఉంది. ఆదివారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
డబ్బులు ఇవ్వకుండా ఆయనను మోసం చేశారు: శ్రీహరి భార్య శాంతి
దివంగత నటుడు శ్రీహారికి చాలామంది డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఆయన భార్య శాంతి శ్రీహరి. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వచ్చి ఆ తర్వాత విలన్‌గా, హీరోగా అంచెలంచెలుగా ఎదుగుతూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారాయన. అంతేకాదు వ్యక్తిగతంగా ఎంతోమందికి సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నారు. ఈ క్రమంలో 2009లో ఆయన హఠాన్మరణం ఇండస్ట్రీలో ఒక్కసారిగా విషాదాన్ని నింపింది. ఆయన చనిపోయాక ఇండస్ట్రీలో తమని పలకరించేవారు కూడా లేరంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఆయన భార్య శాంతి. చదవండి: మహిళా యాంకర్ పట్ల అసభ్య ప్రవర్తన, హీరో అరెస్ట్ ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆమె ఆయన సాయం తీసుకున్న చాలామంది కనీసం పలకరించడానికి కూడా రాలేదని, ఎదురుపడితే సాయం చేయాల్సి వస్తుందనే భయంతోనే అలా చేశారన్నారు. ‘బావకు(శ్రీహరికి) సినిమాలు అంటే పిచ్చి. ఆ ఇష్టంతో ఎవరు వచ్చి అడిగిన కాదనకుండా చేసేవారు. ఆయన రెమ్యునరేషన్ కూడా పెద్దగా డిమాండ్ చేసేవారు కాదు. అలా చాలామంది సినిమా తరువాత డబ్బులు ఇస్తామని చెప్పి ఆ తర్వాత ఇవ్వకుండా ఎగ్గోట్టినవారే ఎక్కువమంది ఉన్నారు. ఆయన ఖచ్చితంగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసి ఉంటే ఇప్పుడు మాకు ఓ 10 బంగ్లాలు ఉండేవి. అయితే చిరంజీవిగారి సంస్థ, మరొక రెండు మూడు సంస్థలు మాత్రమే డబ్బులు కరెక్టుగా ఇచ్చేవారు’ అని ఆమె చెప్పుకొచ్చారు. చదవండి: ఐశ్వర్య, త్రిషల వల్ల చాలా ఇబ్బంది పడ్డా: మణిరత్నం అనంతరం ‘అలా బావ(శ్రీహరి) చేసిన ఎన్నో సినిమాలకు డబ్బులు తీసుకోలేదు. అంతేకాదు ఆయన చనిపోయే ముందు చేసిన సినిమాలకు కూడా రెమ్యునరేషన్ ఇవ్వలేదు. ఆయన చనిపోయాక కనీసం వారు పలకరించేందుకు కూడా రాలేదు. కానీ, ఆయన చనిపోయిన తర్వాత ఓ సారి బాలకృష్ణ గారు కాల్ చేశారు. ఆయన సినిమాలో బావ ఏదో ఒక క్యారెక్టర్ చేశారట. దానికి సంబంధించి ఏమైనా డబ్బులు బ్యాలెన్స్ ఉన్నాయా.. ఏమైనా సాయం కావాలా అని అడిగారు. బాలకృష్ణ గారికి అలా ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆయన కాల్ చేసి మా బాగోగులు ఆరా తీశారు. బావ చనిపోయిన తర్వాత ఆయన యాక్ట్ చేసిన సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ బాలకృష్ణలా ఎవరూ కాల్ చేయలేదు’ అని చెప్పారు ఆమె. శ్రీహరి చనిపోయాక వారి ఇంటి మీద అప్పులు తీర్చడానికి తన నగలు, కార్లు అమ్మానని చెప్పారు శాంతి. -
రియల్ స్టార్ శ్రీహరి నెరవేరని కలలేంటో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: రియల్ స్టార్, విలక్షణతకు పెట్టింది పేరైన శ్రీహరి. తనదైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను మెప్పించిన నటుడుశ్రీహరి. మంచి మనిషిగా కూడా అభిమానుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచి పోయాడు. పేదరికం, ఆకలి బాధ తెలిసిన వ్యక్తిగా తన సాయం కోసం వచ్చిన వారిని కాదనకుండా ఆదుకున్న ఆప్తుడుగా నిలిచాడు. కరియర్ సాఫీగా పోతున్న తరుణంగా తీవ్ర అనారోగ్యంతో 2013, అక్టోబరు 9న కన్నుమూయడంతో అటు శ్రీహరి కుటుంబం, ఇటు రియల్ స్టార్ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. 1964 ఆగస్టు 15న శ్రీకాకుళం జిల్లాలో పుట్టారు శ్రీహరి. యుక్తవయసు నుండే శారీరక ధారుడ్యంపై ఆసక్తినిపెంచుకున్న శ్రీహరి అనేక పోటీల్లో పాల్లొనడంతో పాటు ‘మిస్టర్ హైదరాబాద్’గా ఏడుసార్లు అవార్డును సొంతం చేసుకోవడం విశేషం. రెండుసార్లు జాతీయస్థాయి పోటీలలో పాల్గొని, బహుమతులు గెలుచు కున్నాడు. జిమ్నాస్టిక్స్‌లో రాష్ట్ర చాంపియన్ అయిన శ్రీహరి మంచి అథ్లెట్ అవ్వాలనుకున్నారట. ఈ క్రమంలో జాతీయ స్థాయి జిమ్నాస్టిక్స్‌లో పాల్గొనాల్సి ఉన్నా నటనపై మక్కువ సినిమాలవైపు నడిపించింది. దీంతో ఏషియన్ గేమ్స్ లో భారతదేశం తరపున ఆడాలనే కోరిక ఉన్నా తీరలేదట. అలాగే పాలిటిక్స్ అన్నా కూడా చాలా అసక్తి ఉండేది. కచ్చితంగా రాజకీయాల్లోకి ఎంటర్ కావాలనీ, తద్వారా నలుగురికీ సహాయం చేయాలని ఆయన అనుకునేవారట.(అప్పుడు ఎంత అంటే అంత!) 1986లో స్టంట్ మాస్టర్‌గా కెరీర్ మొదలు పెట్టిన శ్రీహరి ఆ తరువాత నటుడుగా తన కరియర్‌కు బలమైన పునాదులు వేసుకున్నారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ప్రత్యేక డైలాగ్ డెలివరీతో భారీ క్రేజ్ సంపాదించుకున్నారు. హీరోగా, నిర్మాతగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. దాదాపు 900 చిత్రాల్లో నటించి రియల్ స్టార్‌గా ఖ్యాతి గడించారు. పృధ్వీపుత్రుడు సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన ఆయన గణపతి, ఆయోధ్య రామయ్య, శ్రీశైలం, భద్రాచలం, హనుమంతు, విజయరామరాజు ఇలా దాదాపు 28 చిత్రాల్లో హీరోగా చిత్రాల్లో రాణించారు. వీటితోపాటు బావగారు బావున్నారా, వీడెవండిబాబూ, తాజ్ మహల్, ఢీ, కింగ్, డాన్ శీను, బృందావనం సినిమాల్లో ఆయన నటన తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంలో చెల్లెలి కోసం ఆరాటపడే అన్నగా తన నటనతో నూటికి నూరుశాతం మార్కులు కొట్టేశారు. రాంచరణ్ హీరోగా తెరకెక్కిన సూపర్ డూపర్ మగధీరలో షేర్ ఖాన్ పాత్ర, ఆయన కరియర్ గొప్ప మైలురాయి లాంటిది. ఒక విధంగా ఈ సినిమాకు ఆయన నటన పెద్ద హైలెట్. 2005లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రానికి ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డును అదే ఏడాదికి ఇదే చిత్రానికి ఉత్తమ సహాయ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు. నటి డిస్కో శాంతిని ప్రేమించి వివాహం చేసుకున్నారు శ్రీహరి. వీరికి ఇద్దరు కుమారులు శశాంక్, మేఘాంశ్ ఉన్నారు. హీరోగా రాణించానేది మేఘాంశ ఆకాంక్ష. అయితే నాలుగు నెలల కుమార్తె అక్షర అకాల మరణం శ్రీహరిని మానసికంగా కృంగదీసింది. అక్షర పేరుతో ఫౌండేషన్ నెలకొల్పి, మేడ్చల్ పరిధిలోని నాలుగు గ్రామాలను దత్తత తీసుకొని, అక్కడ అభివృద్ధికి కృషి చేయడం విశేషంగా నిలిచింది. కాగా ప్రభుదేవా దర్శకత్వంలో రాంబో రాజ్‌కుమార్ సినిమా షూటింగ్ నిమిత్తం వెళ్లిన శ్రీహరి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రికి తరలించినప్పటికీ పరిస్థితి విషమించి ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో కన్నుమూసారు. -
మరోసారి ఢీ&ఢీకి రెడీ అవుతున్న మంచు విష్ణు
మంచు విష్ణు కెరీర్లో ‘ఢీ’ సినిమాది ప్రత్యేకమైన స్థానం. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. జెనీలియా కథానాయికగా నటించిన ఈ చిత్రంలో శ్రీహరి, బ్రహ్మానందం, సునీల్, చంద్రమోహన్ తదితరులు నటించారు. 2007లో విడుదలైన ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విష్ణు చేసిన ట్వీట్ ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ‘ఢీ’ విడుదల తేదీ పోస్టర్ని పోస్ట్ చేసిన విష్ణు ఈ నెల 23న ఓ ఎగ్జయిటింగ్ అప్డేట్ ఇవ్వబోతున్నాం అని ట్వీట్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ‘కొన్ని వేల మంది సినీప్రియుల అభిమాన చిత్రం ‘ఢీ’. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్క నటుడికీ ఇదొక గేమ్ చేంజర్. ఆ రోజుల్లో సినిమాకి సంబంధించిన కొత్త ఒరవడికి ‘ఢీ’ శ్రీకారం చుట్టింది.‘ఢీ’ కంటే బెటర్ ఏం ఉంటుంది?’ అని ట్వీట్ చేశారు విష్ణు. తాజాగా శ్రీనువైట్లతో డీ&డీ సినిమా చేయనున్నట్లు సోమవారం ప్రకటించారు. బిగ్ బ్రదర్ శ్రీను వైట్లతో మరోసారి పనిచేయడం ఆసక్తిగా ఉందని, డబుల్ డోస్‌తో ఈ సినిమా రాబోతుందని ట్వీట్ చేశారు. Here we go again! But this time it’s D&D Double Dose. Very excited to partner with my big brother Sreenu Vaitla garu again. God speed! #DD #Doubledose pic.twitter.com/TLeCZAq4kd — Vishnu Manchu (@iVishnuManchu) November 23, 2020 -
నా తండ్రిని హీరోను చేసింది ప్రేక్షకులే..
సాక్షి, తూర్పుగోదావరి: కోనసీమ వాసుల ఆదరణను తాము ఎన్నటికీ మరువలేమని సినీనటుడు దివంగత శ్రీహరి భార్య శాంతి శ్రీహరి, కుమారులు మేఘాన్ష్, శశాంక్‌లు అన్నారు. శ్రీహరి కుమారుడు మేఘాన్ష్ నటిస్తున్న సినిమా చిత్రీకరణ కోనసీమలో జరుగుతున్న నేపథ్యంలో శనివారం శాంతి శ్రీహరి, మరో కుమారుడు శశాంక్‌లు అంబాజీపేట వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక హైస్కూల్ ఎదురుగా ఉన్న శ్రీహరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తమ తండ్రిని హీరోను చేసింది ప్రేక్షకులేనని వారికి ఎప్పుడూ రుణపడి ఉంటామన్నారు. తమ తండ్రిపై చూపిన ఆదరాభిమానాలను తమపై కూడా చూపాలని వారు కోరారు. వారి వెంట కొర్లపాటి కోటబాబు, గంధం పల్లంరాజు, గోకరకొండ సూరిబాబు, సూదాబత్తుల రాము, శిరిగినీడి వెంకటేశ్వరరావు, సలాది రాంబాబు, ఇందుగుల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: ఇదంతా బావ చలవే: శాంతిశ్రీహరి -
ఇదంతా బావ చలవే: శాంతిశ్రీహరి
ఏడేళ్ల తర్వాత శ్రీహరి ఇంట దీపావళి పండగకి దీపాలు వెలిగించారు. తమ జీవితంలోని చీకట్లను పారదోలి ఇప్పుడిప్పుడే వెలుగులు నింపుకుంటున్నారు దివంగత నటుడు శ్రీహరి సతీమణి, నటి, నిర్మాత శాంతీశ్రీహరి. 2013లో శ్రీహరి మరణించిన సంగతి తెలిసిందే. శ్రీహరి చిన్న కుమారుడు మేఘాంశ్ హీరోగా చేస్తున్నాడు. మరో తనయుడు శశాంక్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. భర్త దూరం అయిన చేదు నిజం నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న శాంతి తన తనయుడు మేఘాంశ్ తో కలసి పండగ వేళ బోలెడన్ని విషయాలు చెప్పారు. ► ప్రస్తుతం నా దృష్టంతా నటనపైనే. లవ్, క్రష్‌లాంటివేమీ లేవు. నా వయసిప్పుడు 20 ఏళ్లే. నా దృష్టంతా నటనపైనే ఉంది. నాన్న చేసినట్లుగా సామాజిక అంశాలతో వచ్చే చిత్రాలను అప్పుడే చేయదలచుకోలేదు. మంచి ఎంటర్టైనర్స్ చేసి ప్రేక్షకులకు దగ్గర కావాలనుకుంటున్నాను. కొంచెం పరిణితి వచ్చిన తర్వాత.. ఒకవేళ నాన్న సినిమాల్లో ఏదైనా సినిమా రీమేక్ చేయాలనుకుంటే ‘భద్రాచలం’ సినిమా చేస్తాను. ► నేను షూటింగ్లో ఉన్నప్పుడు మా అమ్మను సెట్స్ లోకి రానివ్వను. నా ఫస్ట్ మూవీ ‘రాజ్‌దూత్’ షూటింగ్‌కి ఓసారి అమ్మ సెట్‌కి వచ్చింది. నేను నటిస్తుంటే ఎదురుగా నిలబడి వెక్కిరించింది. ఆమె ఎదురుగా ఉంటే నేను నటించలేను. ► ఎప్పుడు ఎవరికి కష్టమొచ్చినా ‘నేనున్నాను’ అని ధైర్యం ఇచ్చేవారాయన. ఈ రోజు నేను, నా పిల్లలు ఏ కష్టం లేకుండా బతుకుతున్నామంటే అది ఆయన చలవే. ఆయన చేసిన పుణ్యమే.. ఆయన ఉన్నప్పుడు ఎంతోమందికి డబ్బులు ఇచ్చారు. ఆయన పోయాక వారి దగ్గరికెళ్లి మాకు రావాల్సిన డబ్బు ఇవ్వమంటే మీ ఆయనే మాకు ఇవ్వాలి అన్నారు. ► ఇంకా శాంతీశ్రీహరి ఏ సందర్భంగా కన్నీటి పర్యంతం అయ్యారు? ఆమె మనసులోని బాధ ఏంటి? ఈ తల్లీ తనయుడు మనసువిప్పి పంచుకున్న మరెన్నో విషయాల కోసం ఈ వీడియో చూసేయండి మరి... -
అవినీతి లెజెండ్!
-
రియల్ స్టార్ టైటిల్ మా ఇద్దరిదీ!
‘‘ప్రసుత్తం బీబీఏ మూడో సంవత్సరం చదువుతున్నాను. స్టూడెంట్‌గా ఓ 70 శాతం మార్కులు వస్తాయి. చిన్నప్పట్నించి సినిమాల్లోకి రావాలనే ఐడియాతోనే పెరిగాను. అందుకే సినిమా తప్ప నాకు ఏమీ తెలియదు. మా నాన్న కూడా ‘మా చిన్నోడు హీరో అవుతాడు, పెద్దోడు డైరెక్టర్ అవుతాడు’ అని చెప్పేవారు. అది అలాగే నా మైండ్‌లో పడిపోయింది’’ అన్నారు మేఘాంశ్. దివంగత నటుడు, రియల్ స్టార్ శ్రీహరి రెండో కుమారుడు మేఘాంశ్. అర్జున్–కార్తీక్‌ల దర్శకత్వంలో సత్యనారాయణ నిర్మించిన ‘రాజ్‌దూత్’ చిత్రం ద్వారా మేఘాంశ్ హీరోగా పరిచయమవుతున్నారు. ఈ శుక్రవారం విడుదల సందర్భంగా మేఘాంశ్ చెప్పిన విశేషాలు. శ్రీహరి గారి రియల్ స్టార్ టైటిల్ మీ ఇద్దరిలో ఎవరు తీసుకుంటారు? అని కొంతమంది అడిగారు. ఆ టైటిల్ నా ఒక్కడిదే కాదు, నాది, మా అన్నయ్య శశాంక్ ది. నాది అమ్మ పోలిక, కానీ నాన్న యంగ్‌గా ఉన్నప్పుడు ఎలా ఉండేవారో ఇప్పుడు నేను అలానే ఉన్నాను అంటున్నారు. అన్నయ్య ఇంకా ట్రైన్ అవుతున్నాడు. మరో నాలుగైదేళ్లల్లో దర్శకుడు అవుతాడు. మా అమ్మ, అన్న ఎప్పుడూ గైడ్ చేస్తారు నన్ను. ఫ్యూచర్లో నాతో, అన్నతో సి.కళ్యాణ్ మామ సినిమా చేస్తాను అన్నారు. ♦ నాన్న మరణం తర్వాత అనుకోకుండా ఇండస్ట్రీకి అలా దూరమైపోయాం. ఈ గ్యాప్‌లో మేం పర్సనల్‌గా ఫుల్ స్ట్రగుల్ అయ్యాం. అమ్మని మేం చూసుకోవటం, ఆమె మమ్మల్ని చూసుకోవటం జరిగింది. సడెన్‌గా ఇలా హీరోలా ఎంట్రీ ఇస్తే అందరూ నిండు మనసుతో ఆదరించారు. సినీ పరిశ్రమ మొత్తం వెల్కమ్ చేస్తూ ఎంతో ప్రేమతో మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉంది. ♦ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. 44 డిగ్రీస్ ఎండల్లో హైదరాబాద్, రాజమండ్రి, రంపచోడవరంలలో షూటింగ్ జరిపాం. మంచి అవుట్ పుట్ వచ్చింది. ఇది హారర్ జానర్ అని, ఇలా ఒక జానర్ అని అనుకోలేం. రెండు, మూడు జానర్లు కలిసిన కథ. ♦ ఇలాంటి ఓ సినిమా ఉందని టీజర్ లాంచ్ వరకు ఎవరికీ తెలియక పోవటానికి కారణం మొదట్లో చాలా ప్రెజర్ ఉండేది. మా అమ్మ షూటింగ్‌కి వస్తేనే నాకు చాలా ఒత్తిడిగా ఉండేది. ఇక అందరికీ చెప్పి చేస్తే ఆ ఒత్తిడి ఇంకా ఎక్కువ ఉంటుంది. అందుకే ఎవరికీ చెప్పకుండా షూటింగ్ అంతా కంప్లీట్ చేసి టీజర్‌తో మీ ముందుకు వచ్చాను. కొంచెం సినిమా రోడ్ జర్నీతో ముడిపడి ఉంటుంది. ఈ సినిమాకి ‘రాజ్ దూత్ ’ టైటిల్ ఫుల్ యాప్ట్. ఇది కమర్షియల్ సినిమానే కానీ, కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. నా ఫేస్‌కి, నా ఏజ్‌కి ఇది కరెక్ట్ సినిమా అనిపించింది. ♦ మొన్న అమ్మకు సినిమా చూపించాను. మొదట్లో అమ్మ కొంచెం నెర్వస్‌గా ఉండేది. సినిమా అవుట్‌పుట్ ఎలా వస్తుందో అని. సినిమా చూశాక ఆమె ప్రౌడ్‌గా ఫీలయ్యింది. ‘ఏందిరా ఇంత తెల్లగా ఉన్నావు’ అంది. ఇంట్లో మేం డాన్స్ వేసినప్పుడల్లా అమ్మ గైడ్ చేసేది. అంత పెద్ద డాన్సర్ మా ఇంట్లోనే ఉందిగా మరి. ♦ నాన్న ఉన్నప్పుడు అందరినీ బాగా చూడు, ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు, అందరూ సమానమే అని చెప్పేవారు. అందరికీ హెల్ప్ చేయాలనేవారు. నాన్న ఉండి ఉంటే ఇంకా బెటర్ లాంచ్ డెఫినెట్‌గా ఉండేది. ♦ ఈ సినిమా స్టార్ట్ అవక ముందు ఓ నెలరోజుల పాటు నటనలో బేసిక్ ట్రైనింగ్ తీసుకొన్నాను. స్కూల్లోనే థియేటర్ యాక్టింగ్ మీద అవగాహన ఉంది. మా సినిమాలోని బైక్ వాయిస్ టీజర్‌కి మాత్రమే ఉంటుంది. సునీల్‌గారు వాయిన్ ఓవర్ చెప్పారు. సినిమాలో బైక్‌కి వాయిస్ ఉండదు. ♦ మా సినిమాకి ఇద్దరు దర్శకులు. అర్జున్ అండ్ కార్తీక్. వాళ్లు దర్శకుడు సుధీర్ వర్మ దగ్గర రైటర్స్‌గా ఉండేవాళ్లు. నాకు సినిమా స్టార్టింగ్ నుంచి ఓ డౌట్ ఉండేది. వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వస్తే సినిమా ఆగిపోతుందేమో అనుకొనేవాణ్ని. ఇద్దరూ మంచి కో– ఆర్డినేషన్‌తో ఒకే మాట మీద ఫుల్ క్లారిటీతో ఉంటారు. నిర్మాత సత్యనారాయణ గారు నన్ను చాలా బాగా చూసుకున్నారు. -
‘అందుకే రహస్యంగా షూటింగ్ చేశాం’
శ్రీహరి చిన్నకొడుకు మేఘాంశ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘రాజ్ దూత్’. అర్జున్, కార్తీక్ అనే ఇద్దరు దర్శకుల సంయుక్త దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సత్తిబాబు నిర్మిస్తున్నారు. మేఘాంశ్ సరసన నక్షత్ర హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో మేఘాంశ్ మీడియాతో మాట్లాడారు.. హీరోగా మీ మొదటి సినిమా రాజ్‌దూత్ రిలీజ్ అవుతుంది ఎలా ఫీల్ అవుతున్నారు? హీరోగా ఇది నా మొదటి సినిమా, ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. మండుటెండల్లో చిత్రీకరణ చేశాం. నిర్మాత కూడా ఈ చిత్ర నిర్మాణం కొరకు చాలా కష్టపడ్డారు. చిత్రాన్ని చాలా రహస్యంగా చిత్రీకరించారు ఎందుకు? కేవలం ఒత్తిడి తగ్గించడానికే సినిమా షూటింగ్ ఎటువంటి ప్రచారం లేకుండా రహస్యంగా చిత్రీకరించడం జరిగింది. సినిమాపై ప్యాషన్ తోనే హీరో అయ్యారా? చిత్ర పరిశ్రమకు చెందిన కుటుంబంలో పుట్టి పెరిగినవాడిగా, సినిమాపై ఫ్యాషన్ ఉంది. అలాగే నాన్న కూడా ఓ సందర్భంలో చిన్నవాడిని యాక్టర్‌ని, పెద్దవాడిని డైరెక్టర్ని చేస్తాను అన్నారు. దానితో ఆయన కోరిక మేరకు కూడా హీరో అయ్యాను. సినిమాకు రాజ్‌దూత్ అని బైక్ పేరు ఎందుకు పెట్టారు? చాలా మంది అడుగుతున్న ప్రశ్నఇది. ఈ మూవీలో హీరో తనకిష్టమైన రాజ్ దూత్ బైక్ కోసం, రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ పై అన్వేషిస్తూ ఉంటాడు. రాజ్ దూత్ రోడ్ జర్నీలో సాగే థ్రిల్లర్ మూవీనా? సినిమాలో కొంత భాగం రోడ్ జర్నీలో సాగుతుంది, ఐతే ఇది థ్రిల్లర్ మూవీ కాదు, రెండు మూడు, విభిన్న జోనర్స్లో సాగే ఓ వైవిధ్యమైన కమర్షియల్ చిత్రం అని చెప్పవచ్చు. మీరు హీరో అవుతున్నారంటే మీ అమ్మ గారు ఎలా స్పందించారు? అమ్మ చాలా సంతోషించారు, అలాగే సినిమా ఎలా వస్తుందో అని కొంచెం కంగారుకూడా పడ్డారు. ఐతే నేను సినిమాను అమ్మకు చూపించాను, ఆమెకు చాలా బాగా నచ్చింది. మీ నాన్న గారి నటనలో మీకు నచ్చిన కోణం ఏమిటి? ఆయన నటనలో ప్రతి కోణం నాకు నచ్చుతుంది. ఎమోషనల్ అయినా, యాంగ్రీ సన్నివేశాలలోనైనా ఆయన నటన చాలా బాగుంటుంది. నటనలో శిక్షణ తీసుకున్నారా? సినిమాకి ముందు కొన్ని రోజులు శిక్షణ తీసుకున్నాను. అలాగే స్కూల్ ఏజ్ నుండి థియేటర్ డ్రామాలలో నటించిన అనుభవం కూడా ఉంది. కెమెరా ముందు మొదటి అనుభవం ఎలా అనిపించింది? మొదట్లో కొంత కంగారుపడ్డాను, తరువాత మెల్లగా అలవాటు పడ్డాను. ఇండస్ట్రీ నుండి మీకు అందిన సపోర్ట్ గురించి చెబుతారా? ఇండస్ట్రీ మాపై చాలా అభిమానం, ప్రేమా చూపించింది. సాయి ధరమ్ తేజ్ అన్న, అలాగే మంచు మనోజ్ అన్న కాల్ చేసి మరి అభినందించారు. నాన్నగారి సినిమాలలో మీకు నచ్చిన చిత్రం? చాలా ఉన్నాయి. భద్రాచలం, ఢీ, నువ్వొస్తానంటే నేనొద్దంటానా! సినిమాలంటే చాలా ఇష్టం. ఈ మూవీ డైరెక్టర్స్ గురించి చెప్పండి? అర్జున్, కార్తీక్ డైరెక్టర్ సుధీర్ వర్మ దగ్గర పనిచేశారు. వీళ్లద్దరి మధ్య వర్క్ కో ఆర్డినేషన్ బాగుంటుంది. వీళ్ళ మధ్య విబేధాలు వచ్చి సినిమా ఎక్కడ ఆగిపోతుందో అని భయం వేసింది. అలా ఏం కాకుండా (నవ్వుతూ) ఇద్దరు చిత్రాన్ని పూర్తి చేశారు. మూవీలో జర్నీ ప్రధానంగా సాగుతుందా? ఈ చిత్రంలో కామెడీ, ఎమోషన్స్, లవ్ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. జర్నీ కేవలం చిత్రంలో ఒక భాగం మాత్రమే. -
సీఎం వైఎస్ జగన్ సీపీఆర్వోగా పూడి శ్రీహరి
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి(సీపీఆర్వో)గా సీనియర్ జర్నలిస్ట్ పూడి శ్రీహరి నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం సాధారణ పరిపాలన శాఖ శ్రీహరి నియామక ఉత్తర్వులను జారీ చేసింది. శ్రీహరి రెండు దశాబ్దాలుగా మీడియాలో పనిచేశారు. గత రెండేళ్లుగా వైఎస్ జగన్ మీడియా వ్యవహారాలు చూస్తున్నారు. అలాగే వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ జీవితం, ఆయన చేసిన ప్రజాసంకల్పయాత్ర విశేషాలతో ‘‘అడుగడుగునా అంతరంగం’’ పేరుతో శ్రీహరి పుస్తకాన్ని రాశారు. -
ఈ పాదయాత్ర సమకాలీన రాజకీయాల్లో చరిత్ర సృష్టించింది
-
జ్ఞానపూర్ణిమ
స్థితికారుడైన శ్రీహరి జన్మనక్షత్రం శ్రవణం నిండుగా ఉండేది ఈ శ్రావణ పూర్ణిమనాడే. ఈరోజు అనేక పర్వదినాలకు పునాది. వరాహజయంతి: భూమిని చాప చుట్టలా చుట్టిన హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించడానికి విష్ణుమూర్తి వరాహావతారం దాల్చిన ఈరోజున శ్రీమహావిష్ణువును వరాహావతారంలో పూజించడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం పాపాలను పటాపంచలు చేసి అనేకమైన శుభపలితాలనిస్తుంది. హయగ్రీవ జయంతి: బ్రహ్మవద్దనుంచి వేదాలను దొంగిలించిన సోమకాసురుడనే రాక్షసురుని సంహరించేందుకు శ్రీమహావిష్ణువు హయగ్రీవావతారం దాల్చిన రోజిది. ఈ రోజున విద్యార్థులు ‘జ్ఞానానందమయందేవం నిర్మల స్ఫటికాకృతిం, ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే’అనే శ్లోకాన్ని పఠిస్తూ హయగ్రీవ రూపంలోని విష్ణుమూర్తిని ప్రార్థిస్తే ఉన్నత విద్యలు ప్రాప్తిస్తాయని ప్రతీతి. ఉత్తరాయణ పుణ్యకాలం కాకపోయినప్పటికీ ఈ రోజు అక్షరాభ్యాసానికి ఎంతో మంచిదని పిల్లల చేత అక్షరాలు దిద్దించే ఆచారం కూడా కొన్ని ప్రాంతాలలో ఉంది. జంధ్యాల పూర్ణిమ: యజ్ఞోపవీతం ధరించే ప్రతి ఒక్కరూ నేడు జీర్ణయజ్ఞోపవీతాన్ని విసర్జించి, నూతన యజ్ఞోపవీతాన్ని ధరించడం ఆచారం. అందుకే శ్రావణ పూర్ణిమను జంధ్యాల పూర్ణిమగా కూడా పిలుస్తారు. -
కేన్సర్ ఔషధాలకూ రాయితీ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సెల్ఫోన్లు, దుస్తులే కాదు ఔషధాలూ డిస్కౌంట్లతో ఆన్లైన్లో కొనడం మనకు తెలిసిందే. కానీ, కేన్సర్, గుండె జబ్బులు వంటి ఖరీదైన మందులు సైతం రాయితీలో దొరకటమంటే కష్టం. అందుకే దీన్నే వ్యాపారంగా మార్చి ‘కోమెడ్జ్.కామ్’ను ఆరంభించారు వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన శ్రీహరి అరిగె. వ్యక్తిగత అవసరాలతో పాటు స్థానిక రిటైల్ మందుల షాపులకూ ఔషధాలను అందించడం దీని ప్రత్యేకత. మరిన్ని వివరాలు వ్యవస్థాపకుడు శ్రీహరి మాటల్లోనే... ఎస్వీయూ ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక.. ఐటీలో ఉద్యోగ రీత్యా లండన్కెళ్లా. కుటుంబ వ్యాపారం మెడికల్ స్టోర్ కావటంతో దీనికి టెక్నాలజీని జోడించా. రూ.కోటి పెట్టుబడులతో గతేడాది ఆగస్టులో కోమెడ్జ్.కామ్‌ను ప్రారంభించా. ప్రస్తుతం కోమెడ్జ్.కామ్‌లో 80 వేలకు పైగా ఔషధాలున్నాయి. సాధారణ మందులతో పాటూ మధుమేహం, గుండె జబ్బులు, కేన్సర్ చికిత్స వంటి ఖరీదైన మందులు, పోషకాహార ఉత్పత్తులు, మాతాశిశు సంరక్షణ ఔషధాలు, ఆయుర్వేద మందులు కూడా లభిస్తాయి. ప్రస్తుతం నెలకు 3,000–5,000 ఆర్డర్లు వస్తున్నాయి. వీటి విలువ సుమారు రూ.5 లక్షల వరకుంటుంది. నెలకు రూ.లక్ష వరకు ఆదాయాన్ని ఆర్జిస్తున్నాం. వెయ్యి పైన ఆర్డర్‌కు ఉచిత డెలివరీ, 22 శాతం డిస్కౌంట్ ఉంటుంది. వెయ్యి లోపయితే రూ.50 డెలివరీ చార్జీ, 15 శాతం డిస్కౌంట్ ఉంటుంది. ప్రస్తుతం మాకు 800 మంది కస్టమర్లున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి ఎక్కువగా ఆర్డర్లు వస్తున్నాయి. కేన్సర్, గుండె జబ్బుల మందుల ఆర్డర్లు ఎక్కువగా వస్తుంటాయి. కారణం డిస్కౌంట్లే. హైదరాబాద్‌లో మందుల డెలివరీ కోసం సొంతంగా 15 మంది సిబ్బందిని నియమించుకున్నాం. ఇతర నగరాల్లో డెలివరీ కోసం తపాలా శాఖతో ఒప్పందం చేసుకున్నాం. ప్రస్తుతం మా సంస్థలో 22 మంది ఉద్యోగులున్నారు. త్వరలోనే ల్యాబ్ పరీక్షలను అందించాలని నిర్ణయించాం. ఈ ఏడాది ముగిసేసరికి 5 వేల మంది కస్టమర్లు, నెలకు రూ.కోటి వ్యాపారం చేయాలని లకి‡్ష్యంచాం. ఈ ఏడాది ముగింపులోగా రూ.10 కోట్ల నిధుల సమీకరణ చేయనున్నాం. పలువురు ఇన్వెస్టర్లతో చర్చిస్తున్నాం. -
మాతోనే ఉన్నాడు
నేను నా దైవం నాకు బావే దేవుడు అంటుంది. అలా అయితే దేవుడు భక్తులను వదిలిపోడుగా. బావ వెళ్లిపోయాడు. ఇంతకు ముందు బావ ఎంగిలే ప్రసాదం. ఆ తర్వాత ముద్ద కూడా దిగేది కాదు ఈ కష్టాలలో నాకు తోడుగా ఉంది దేవుడే అంటున్నారు శాంతిశ్రీహరి. హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని శాంతి శ్రీహరి ఇల్లు. ఇంటర్వ్యూ అంటే ‘ససేమిరా!’ అన్న శాంతి ‘నేను–నా దైవం’ అనగానే కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నారు. తర్వాత తనే ముందుగా చెప్పడం మొదలుపెట్టారు.‘నాలుగేళ్ల క్రితం వరకు మా ఇల్లు రోజూ పండగలా ఉండేది. ఏ కష్టమూ మా ఇంటి గుమ్మం దాటి లోపలికి రాదు అని ధీమాగా ఉండేదాన్ని. కానీ, కాలం బావ (శ్రీహరి)ను తీసుకెళ్లిపోయింది. ఒక్కసారిగా స్వర్గం నుంచి అగాధంలోకి పడిపోయినట్టు అనిపించింది. మూడేళ్లు తిండికి, నీళ్లకు దూరమై బావ ధ్యాసలోనే ఉండిపోయాను. బావను మర్చిపోవడానికి ‘మత్తు’కి దగ్గరయ్యాను. ఆరోగ్యం పాడైంది. పూర్తిగా నీరసించిపోయాను. జీవశ్చవంలా పడుండేదాన్ని. నా కొడుకు తన చేతుల్తో ఎత్తుకుపోయి ఆసుపత్రిలో చేర్చాడు. ఆ రోజు ‘నేను పోతే ఈ పిల్లలేం అయిపోతారు, వీళ్ల కోసమైనా బతికించు దేవుడా’ అనుకున్నాను. ఈ రోజుకీ పిల్లల (పెద్దబ్బాయి శశాంక్, చిన్నబ్బాయి మేఘాంశ్) కోసం ఇలా ఉన్నానంటే ఇది ఆ దైవ నిర్ణయమే! ఆస్తులు కరుగుతున్నాయి. బాధ లేదు. పెద్దోడి చదువు పూర్తి కావస్తోంది. చిన్నోడి కాలేజీ చదువు ఇంకా మూడేళ్లు ఉంది. వాడికి మూడేళ్ల ఫీజు ఒకేసారి కట్టేశాను. పెద్దోడు అడిగాడు ‘ఏంటమ్మా! ఎవరైనా మూడేళ్ల ఫీజు ఒకేసారి కట్టేస్తారా’ అని. నేను చెప్పాను ‘ఒరే అప్పటి వరకు ఏమౌతుందో.. నేను ఫీజు కట్టలేని స్థితి వస్తే?! ఒక వేళ ఆరోగ్యం క్షీణించి మీ నాన్నలాగే నేనూ పోతే’ అన్నాను. వాడేం మాట్లాడలేదు. బావ దూరమయ్యాడనే బాధ, రేపేం జరుగుతుందో, ఎలా గడుస్తుందో అనే భయం నుంచి ఇప్పుడిప్పుడే ఎలాగైనా పిల్లలను స్థిరపరచాలనే ధైర్యం కలుగుతోంది. ఏదో దైవశక్తి ఉంది కాబట్టే నన్ను నడిపిస్తోంది.’ అసలు మీ జీవితమే కష్టంతోనే మొదలైంది కదా! అప్పట్లో దైవాన్ని తలుచుకుంటూ గడిపేవారా? నిజమే, కానీ అప్పట్లో అది కష్టం అనిపించలేదు. నలుగురు అక్కచెల్లెళ్లం, ముగ్గురు తమ్ముళ్లు. నాన్న (సి.ఎల్.ఆనందన్ తమిళ సినిమా నటుడు) చనిపోయాడు. కుటుంబం గడవడం కోసం నేనీ సినిమా రంగంలో అడుగుపెట్టాను. అందరి కడుపు నిండాలంటే నేను నటించాలి. వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటున్నాను అనుకునేదాన్ని. అలా రోజులు గడిచిపోయాయి. దైవం అంటే భయమూ, భక్తి రెండూ ఉన్నాయి. కానీ, తలుచుకోవడం అంటూ ఏమీ ఉండేది కాదు. చిన్నప్పుడు మా అమ్మ అప్పుడప్పుడు అమ్మవారి ఆలయానికే తీసుకెళ్లేది. భక్తిగా దండం పెట్టుకోవడం వరకే నాకు తెలిసేది. అయితే అప్పుడూ ఇప్పుడూ ఏదో శక్తి ఉందని, అదే ఈ సమస్త లోకాన్ని నడిపిస్తుందని నమ్ముతాను. మీ ప్రొఫెషన్ని పక్కన పెట్టి మిమ్మల్ని ప్రేమించి పెళ్లిచేసుకున్నారు శ్రీహరి. ఆ ప్రేమలో దైవత్వం ఉందంటారా? ముమ్మాటికి. ఆయనా ఎంతో కష్టపడి ఈ రంగంలో ఎదిగినవారు. నన్నుగా ఇష్టపడిన వ్యక్తి. ఆయన పరిచయమ య్యాక నా ప్రపంచమే మారిపోయింది. బావనే దైవం అయ్యాడు నాకు. బావ తప్ప మరో ప్రపంచం లేదన్నట్టుగా ఉండేది. ఎక్కడికెళ్లినా బావతోనే, ఏం చేసినా బావ కోసమే అన్నట్టుగా ఉండేదాన్ని. ఒకసారి బావ వాళ్ల గురువు (దాసరి నారాయణరావు) గారింట్లో పెద్ద లాఫింగ్ బుద్ధని చూశాడట. భలేగా ఉందే అన్నాడు ఇంటికి వచ్చి. అంతే, ఆ రోజు సిటీ అంతా తిరిగాను. ప్రతీ షాప్ వెతికాను. బావ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఎదురుగా ఆయన కోరుకున్న లాఫింగ్ బుద్ధ. ఎంత సంతోషపడిపోయాడో... అలాగే నాకేదైనా నచ్చితే ఎంత కష్టమైనా సరే ఆ రోజుకు దాన్ని నా ముందుంచేవాడు. బావ నన్ను ఎంతలా అర్థం చేసుకున్నాడో ఒక్కమాటలో చెప్పలేను. ఏ దేవుడో కరుణించి నాకు దేవుడిలాంటి భర్తను ఇచ్చాడు అనుకునేదాన్ని. కానీ, ఆ దేవుడే నా బావను తీసుకెళ్లిపోయాడు. దైవం దగ్గర చేసిన మనిషిని దైవమే తీసుకెళ్లిపోతే ఆ దైవం మీద కోపం రాలేదా? బావ పోయాక నా ప్రపంచమే తలకిందులైపోయింది. దేవుడ్ని తిట్టుకున్న సందర్భాలు ఎన్నో. కానీ, నా రాత ఇలా ఉంటే దేవుడు మాత్రం ఏం చేస్తాడు? అని ఇప్పుడు నాకు నేను నచ్చజెప్పుకుంటాను. ఈ మిగిలిన జీవితాన్ని గడిపే ధైర్యం ఇవ్వు స్వామి అని వేడుకుంటున్నాను. బావ ఉన్నప్పుడు అంతా చుట్టూ ఉన్నారు. ఇప్పుడు ఎవరూ లేరు. జీవితం నేర్పిన కఠినపాఠాలను అర్థం చేసుకుంటున్నాను. చాలాసార్లు అనిపించింది నేనూ బావతో పాటే వెళ్లిపోతే బాగుండు అని. కానీ, పిల్లలు... మా బావ శరీరంగా లేడు. కానీ, మాతోనే ఉన్నాడు. లేకపోతే, ఈ నాలుగేళ్లలో నేనూ నా పిల్లలు రోడ్డు మీద ఉండేవాళ్లమే కదా! అలా జరగకుండా మా బావనే మమ్మల్ని చూసుకుంటున్నాడు. బావ ముందు కూర్చుని ఇప్పుడూ మాట్లాడతాను. ఎందుకిలా చేసి పోయావని తిడతాను. ఏడుస్తాను. (చెమ్మగిల్లిన కళ్లను తుడుచుకుంటూ) రోజుకు మూడుపూటలా ఆయన ఫొటో ముందు భోజనం పెట్టిన తర్వాతే నేనూ పిల్లలు తింటాం. పిల్లలు ఏం తెచ్చుకున్నా వాళ్ల నాన్నకు ముందు పెట్టి తర్వాత వాళ్లు తింటారు. ఆలయాలకు వెళ్లిన సందర్భాలు? చెన్నైలో మేల్మలయనూర్లో అంగలమ్మన్ ఆలయం ఉంది. అక్కడి అమ్మవారు శక్తిమాత. వెయ్యేళ్ల నాటి గుడి అని చెబుతారు. వారం క్రితమే మా తమ్ముడు కుటుంబంతో కలిసి ఆ అమ్మవారి ఆలయానికి వెళ్లి, మొక్కుతీర్చుకొని వచ్చాను. వేపాకులే దుస్తులుగా కట్టుకొని చెల్లించే మొక్కు అది. నేను, మా బావ అక్కడే పెళ్లి చేసుకున్నాం. శ్రీశైలం, తిరుపుతి, ఇక్కడి పెద్దమ్మగుడి, వరంగల్‌లోని భద్రకాళి ఆలయాలకు చాలాసార్లు వెళ్లాం. తిరుపతిలో నేనూ, పిల్లలు గుండు కూడా చేయించుకున్నాం. ఒకసారి కంచికి వెళ్లాం. అక్కడ మఠంలోని పెద్దస్వామిని దర్శించుకున్నప్పుడు చెయ్యెత్తి ఆశీర్వదించారు. ఎందుకో తెలియదు కళ్లలో నీళ్లు వచ్చాయి. అక్కడ ఏదో శక్తి ఉందనిపించింది. నిత్యం ఏ దేవుణ్ణి ప్రార్థిస్తారు? మా బావకు శివయ్య అంటే ఎంత ఇష్టమో చెప్పలేను. అలా నేనూ శివయ్యను పూజించేదాన్ని. బావతో పాటు నేనూ పూజలో పాల్గొనేదాన్ని. గణేషుడు, శివుడు, లక్ష్మీ దేవి శ్లోకాలన్నీ బావ ఒక డైరీలో రాయించి నాకు ఇచ్చాడు. పూజ సమయంలో వాటిని చదివేదాన్ని. బావ ఎక్కడి నుంచి తెప్పించాడో కానీ శివుడి స్వర్ణలింగం మా ఇంట్లో ఉండేది. దాదాపు మూడు వందల గ్రాముల బరువని చెప్పాడు. ఉదయాన్నే రోజూ పంతులుగారు వచ్చి మా ఇంట్లోని స్వర్ణలింగానికి పూజలు జరిపించేవారు. బావ దాదాపు గంటన్నరసేపు పూజ చేసేవాడు. పూజకు కావల్సినవన్నీ నేను సిద్ధం చేసేదాన్ని. ఇప్పుడు ఇంట్లో నిత్య పూజలు లేవు. కానీ, స్నానం చేసిన తర్వాత దేవుని గదికి వెళ్లి రెండు అగరువత్తులు వెలిగించి దండం పెట్టుకొని వస్తాను. ఈ మధ్యే అమితమైన బాధ కలిగించిన సంఘటన ఒకటి జరిగింది. నాలుగురోజుల క్రితం ఎప్పటిలాగే నేను స్నానం చేసి, దేవుడి గదికి వెళ్లాను. అక్కడ చూస్తే ఏదో వెలితిగా అనిపించింది. బంగారు శివలింగం లేదు. ఎవరో దొంగిలించారు. ఎవరినీ నిందించలేదు. ఎవరికీ కంప్లైంట్ చేయలేదు. ఇంతటి సహనం నాకు ఎలా అబ్బిందా! అని ఆశ్చర్యం కలిగింది. దేవుడు విగ్రహంలో కాదు నా నిగ్రహంలో ఉన్నాడు అనిపించింది. శివయ్య మళ్లీ నా ఇంటికి వస్తాడని నమ్మకం ఏర్పడింది. మీ పిల్లలకు దైవం గురించి ఏం చెబుతుంటారు? పిల్లల చిన్నతనం అంతా వాళ్లు నిద్ర లేస్తూనే శ్లోకాలు వినపడేవి. ఇప్పుడు దేవుడి గదివైపు కూడా రారు. ‘దేవుడికి దండం పెట్టుకోండ్రా’ అని చెబుతాను. కానీ, వారు ఇష్టపడరు. మా నాన్న అన్నేసి గంటలు పూజలు చేసేవాడు. మరి ఆ దేవుడు మా నుంచి మా నాన్నను ఎందుకు తీసుకెళ్లాడు అంటారు. పెద్దవాళ్లయ్యాక వాళ్లే తెలుసుకుంటారని ఊరుకుంటాను. పుష్కరాలప్పుడు మాత్రం పిల్లలను తీసుకెళ్లి వాళ్ల నాన్నకు చేయవలసిన క్రతువును చేయించి వచ్చాను. ఇంత జీవితంలో మనుషుల్లో మీరు చూసిన దైవత్వం...? బావలోనే చూశాను. ఎవరు సాయం అడిగినా లేదనేవారు కాదు. మా పాప జ్ఞాపకంగా అక్షర పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి మేడ్చల్ మండలంలోని నాలుగు ఊళ్లలోని స్కూళ్లకు ఫ్లోరైడ్ ఫ్రీ వాటర్ సదుపాయం కల్పించాడు. ఆ ఫౌండేషన్‌కి నిధులు ఎప్పుడూ అందేలా తనే జాగ్రత్తలు తీసుకున్నాడు. మా ఫామ్‌హౌజ్ నుంచి వచ్చే బియ్యం, కూరగాయలు ఆశ్రమాలకు, జూనియర్ ఆర్టిస్టులకూ పంపించేవాడు. పుట్టినరోజులకు హోమ్‌లకు వెళ్లేవాడు. అన్నదానాలు చేసేవాడు. బావకు సీరియస్‌గా ఉందని తెలిసినక్షణం నుంచి ఆయనను గౌరవంగా సాగనంపేవరకు బావ దగ్గర అన్నం నీళ్లు మాని ఆయన స్నేహితులు సి.కళ్యాణ్, ఆలగడ్డ శ్రీనివాస్ ఉన్నారు. ప్రతియేటా బావ పోయిన రోజున ఆ ఇద్దరు వచ్చి దండంపెట్టుకొని వెళతారు. వాళ్లను చూసినప్పుడు అనిపిస్తుంది దైవం ఇలా కొందరి రూపం లో కనిపిస్తుంటాడని. ఈ నెల 15న బావ పుట్టినరోజు. ఆ రోజున బావ సమాధి దగ్గరే రోజంతా గడుపుతుంటాను. ఈసారి బావ చేసిన కార్యక్రమాలనే నేనూ చేయాలను కుంటున్నాను. సేవలో భాగం అవ్వాలనుకుంటున్నాను. ఈ క్షణం దేవుడు ప్రత్యక్షమై ఏదైనా కోరుకోమంటే..? పిల్లల భవిష్యత్తు. వాళ్లు ఈ లోకాన్ని అర్థం చేసుకొని నిలదొక్కుకోవాలి. అంతవరకు నన్ను బతికించు స్వామి అని దండం పెట్టుకుంటాను. అమ్మనాన్నలతో చిన్నప్పుడు గుళ్లకు తిరిగాం. పూజల్లో పాల్గొన్నాం. కానీ, అమ్మనాన్నలెప్పుడూ పూజలు చేయమని ఒత్తిడి చేయలేదు. ‘మనల్ని నడిపే శక్తి ఒకటి ఉంది. ఆ శక్తి నుంచే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పాజిటివ్‌గా ఆలోచిస్తే మంచి జరుగుతుంద’ ని నాన్న చెప్పేవారు. అదే నమ్ముతాం. శశాంక్ శ్రీహరి మేఘాంశ్ శ్రీహరి – నిర్మలారెడ్డి చిల్కమర్రి -
సలాం నమస్తే హైదరబాద్... ఇరాని హోటల్ జిందాబాద్
పాటతత్వం ‘‘కాఫీడేలు, కాఫీబారుల రాకతో హైదరాబాద్ సంస్కృతిలో భాగమైన ఇరాని హోటళ్ల వైభవం తగ్గుతోందిప్పుడు. ఆ హోటళ్లలో మత సామరస్యం, మంచి చెడు, సరదా సంగతుల గురించి వివరించే పాట ఇది’’ అన్నారు పాటల రచయిత కాసర్ల శ్యామ్. శ్రీహరి హీరోగా నటించిన ‘రియల్‌స్టార్’ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ స్వరకల్పనలో శ్యామ్ రాసిన ‘సలాం నమస్తే హైదరబాద్.. ఇరాని హోటల్ జిందాబాద్’ పాటతత్వం గురించి రచయిత మాటల్లో... చనుబాలు లేక చంటి పోరడు చప్పరించేది చాయ్ బొట్టు బ్రెడ్డు జాము లేని పేద ఇంట డబల్ రొట్టెనే బ్రేక్ ఫాస్ట్... హోటల్ మెట్ల మీద ఓ బిచ్చగత్తె కూర్చుంటుంది. ఏడుస్తున్న పిల్లాడికి పాలు ఇద్దామంటే రావు. అప్పుడు ఓ గ్లాస్లో చాయ్ తెప్పించి పిల్లాడికి పడుతుంది. సినిమాలో పాట అక్కడ్నుంచి ప్రారంభమవుతుంది. పాలుకు డబ్బులు లేక చాయ్, బ్రేక్‌ఫాస్ట్‌కి బదులు ఆ చాయ్‌లో బ్రెడ్ ముంచుకుని తినడం అలవాటు చేసిన పేద కుటుంబాలు మనకు చాలా తారసపడతాయి. ఆదాబ్ అంటడు ఆచారి/ నమస్తే అంటడు నజీరు భాయ్/తీసుకుంటారు అలాయ్ భళాయ్/ ఆర్డరిచ్చి వన్ బై టూ చాయ్ / అందరు ఇక్కడ ఒకటేనయ్యా.. అందరి అడ్డా ఇదేర భయ్యా వన్ బై టూ చాయ్ చెప్పి.. ఓ ముస్లిమ్, ఓ హిందూ కలసి తాగుతారు. సర్వమత జనులు ఇక్కడ స్నేహితులవుతారు. అందరూ ఒక్కటే అని చెప్పడమే ఈ పల్లవి ఉద్దేశం. రెక్కలు ముక్కలు చేసుకునే శ్రమజీవులకు ఇది మజిలీ చెమట చుక్కలను సేదదీర్చుటకె ఇక్కడి పంఖా గాలి నిమిషమైన తన కష్టం మరిచి కూర్చోవాలనే కూలీ ఒడిని పంచుటకె వేచి ఉన్నది అబ్ తక్ కుర్సీ ఖాళీ గుప్పు గుప్పుమని పొగలు గక్కె టీ కప్పు తనను చూడాలని ఎప్పుడేప్పుడని ఎదురుచూసే పేదోడి పెదవి తాకాలని రిక్షావాడి మాడిన పేగుని వేడితో చల్లార్చాలని శ్రీహరిగారు చెప్పి మరీ రాయించుకున్న చరణమిది. రిక్షావాడి కడుపులో పేగులు మాడుతుంటే.. ఆ ఆకలిని తీర్చి వేడి వేడి టీ చల్లారుస్తుందని చెప్పాను. ఆ చాయ్ పేదోడికి పరమాణ్ణం. గల్లీ గ్యాంగ్‌కు టైంపాసు ఇది నిరుద్యోగులకు ఆఫీసు చుట్టుపక్కల బస్తీలకు ఈ కేఫె కేరాఫ్ అడ్రస్సు కలిసే దోస్తులు దొర్లే నవ్వులు బిల్లు కొరకు కొట్లాటలు సిగరెట్ పొగలు భగ్న ప్రేమికులు దొరుకు అప్పు ఓదార్పులు గంటల తరబడి కూర్చున్నా నిను ఆదరించేటి హోటళ్ళు బిడ్డల ఆకలి అడిగిన వెంటనే తీర్చే అమ్మల లోగిళ్ళు ప్రపంచమంతా పరిచయమయ్యే గ్రంథాలయమే ఈ హోటల్ బిల్ నేను కడతానంటే, నేనంటూ స్నేహితులు సరదాగా కొట్టుకుంటారు. అక్కడే అప్పు అడుగుతారు, ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే ఓదారుస్తారు. ప్రపంచంలో జరిగే ఎన్నో విషయాల గురించి చర్చిస్తారు. పక్కన చాయ్ తాగుతుంటే వినపడిన ఆ మాటలు మనకు గుర్తుండిపోతాయి. అందుకే గ్రంథాలయంతో పోల్చాను. కాఫీబారు కలలో రాని కష్టజీవికిది తాజ్ మహల్ అధికారం దరిదాపులో లేని సామాన్యునికిది అసెంబ్లి హాల్ రాజు పేద ఉందా లేదా అడగదు మనను జాతి మతాల్ వచ్చే పోయే పాత్రలు ఎన్నో రంగస్థలమే ఈ హోటల్ పొట్టకూటికై పొద్దుమాపు గిర గిర గిర గిర తిరిగే ఈ నగరం గూటికి చేరిన పక్షిలాగ గుమిగూడుతదిక్కడ సాయంత్రం హోటల్ కాదిది ఒకటిగ వెలిసిన చర్చి మసీదు మందిరం కాఫీ డేలు, చాక్లెట్ రూమ్‌లు అవన్నీ సగటుజీవి తాహతుకు సంబంధించినవి కాదు. అదంతా పేజ్ 3 కల్చర్. అలాంటివాడికి ఈ హోటల్ అపురూపమైన తాజ్ మహల్. ఇరాని హోటళ్లల్లో మన కులమతాలు అడగరు. కాలినడకన, బైక్ మీద, కారులో.. హోటల్‌కి వచ్చే అందర్నీ ఆహ్వానిస్తారు. హోటల్ ఓ స్టేజి, ఎప్పుడూ అక్కడే ఉంటుంది. కస్టమర్లు వస్తుంటారు, వెళ్తుంటారు. వాళ్లందరూ ఆ స్టేజి మీద నాటకం వేసే పాత్రధారులే. ఓ రోజంతా హోటల్లో కూర్చుని గమనిస్తే, ప్రపంచమనే నాటకం మన కళ్ల ముందు కదలాడుతుంది. మార్నింగ్ ఓ టీ తాగి ఉద్యోగానికి వెళ్లిన వారు, గూటికి చేరిన పక్షుల్లాగా సాయంత్రం మళ్లీ వాలతారు. పల్లవిలో చెప్పిన విషయాన్ని చివర్లో ‘హోటల్ కాదిది చర్చి మసీదు మందిరం’ అని చివర్లో మళ్లీ చెప్పాను. జాబ్ శాటిస్ఫాక్షన్ కోసం రాసే పాటలు కొన్ని, జేబు శాటిస్ఫాక్షన్ కోసం రాసే పాటలు కొన్ని ఉంటాయి. నాకు జాబ్ శాటిస్ఫాక్షన్ ఎక్కువ ఇచ్చిన పాటల్లో ‘సలాం నమస్తే..’ పాట అగ్రస్థానంలో ఉంటుంది. శ్రీహరి గారు తమ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ఈ పాట వినిపించేవారు. ప్రముఖ కవి, గాయకుడు గోరటి వెంకన్నగారు పాట విన్న తర్వాత.. ‘‘పల్లే పాట రాయడానికి నా పాటలను ఎలా రిఫరెన్స్‌గా తీసుకుంటారో ఇరాని హోటల్, చాయ్ గురించి రాయడానికి ఈ పాట రిఫరెన్స్‌గా తీసుకుంటారు’’ అని చెప్పిన మాటలు నా జీవితాంతం గుర్తుంటాయి. బతకడానికి రాసిన పాటలు చాలా ఉన్నాయి. రచయితగా నన్ను బతికించిన పాట ఇది. ఇంటర్వ్యూ: సత్య పులగం - కాసర్ల శ్యామ్, గీత రచయిత -
ఘనంగా సినీ నటుడు శ్రీహరి జయంతి
హిమాయత్‌సాగర్ గ్రామ ప్రజలకు సినీ నటుడు స్వర్గీయ శ్రీహరికి మధ్య ఉన్న సంబంధం ఎనలేనిదని ఎంపీపీ తలారీ మల్లేష్ వెల్లడించారు. శ్రీహరి జయంతిని హిమాయత్‌సాగర్ గెస్ట్‌హౌజ్ వద్ద సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీహరి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలోఆయన మాట్లాడుతూ శ్రీహరి తన ప్రతి చిత్రాన్ని హిమాయత్‌సాగర్ గ్రామంలో షూటింగ్ నిర్వహించేవరన్నారు. గ్రామంలోని పలువురిని పేరు పేరునా పిలిచి పలకరించేవారన్నారు. -
పెళ్ళై నాలుగు నెలలు... బయటకు గెంటేశారు
కడప : వివాహం అయిన నాలుగు నెలల తర్వాత తమకు వద్దంటూ ఓ వివాహితను అత్తింటి వారు బయటకు గెంటేశారు. దీంతో బాధితురాలు మౌన పోరాటానికి దిగింది. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు స్టేట్ బ్యాంకు కాలనీలో శనివారం చోటు చేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి... శివలీల అనే మహిళకు గతేడాది నవంబర్ నెలలో జమ్మలమడుగుకు చెందిన శ్రీహరితో వివాహం అయింది. శివలీల రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు... అయితే శ్రీహరి మాత్రం ఆచార్యుల కులానికి చెందిన వాడు... అయితే తామ కులాన్ని దాచి పెట్టి... తాము రెడ్డి కులానికి చెందిన వారమే అని చెప్పడంతో శ్రీహరికి శివలీలను ఇచ్చి ఆమె తల్లిదండ్రులు వివాహం జరిపించారు. ఇటీవల శ్రీహరి కులం వేరని శివలీల తల్లిదండ్రులకు తెలిసింది. దీనిపై నిలదీయడంతో కంగుతున్న శ్రీహరి కుటుంబ సభ్యులు... మీ అమ్మాయి మాకు అక్కర్లేదు. మీ సంబంధం మాకు అక్కర్లేదు అంటూ శ్రీహరి, అతడి తల్లిదండ్రులు శివలీలను శనివారం మధ్యాహ్నం ఇంట్లోంచి బయటకు గెంటేశారు. అనంతరం ఇంటికి తాళం పెట్టి బయటకు వెళ్లిపోయారు. న్యాయం కోసం శివలీల భర్త ఇంటి ముందే బైఠాయించి మౌన పోరాటం మొదలుపెట్టింది. -
బాధ్యతగా వ్యవహరించకపోతే వేటే!
- ఆర్టీసీ సిబ్బందికి ఆర్ఎం హెచ్చరిక - డీఎంలతో సమీక్షాసమావేశం పట్నంబజారు(గుంటూరు) : విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించని పక్షంలో వేటు తప్పదని ఆర్టీసీ రీజియన్ మేనేజర్ జ్ఞానంగారి శ్రీహరి హెచ్చరించారు. ఆర్టీసీ బస్టాండ్‌లోని తన చాంబర్లో గురువారం సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మాచర్ల, నరసరావుపేట, చిలకలూరిపేట డిపో మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. ఇక నుంచి జిల్లావ్యాప్తంగా పదిమందితో కూడిన బృందాలు తిరుగుతాయని, సిబ్బంది, డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పక్కన పెట్టాల్సివస్తుందని స్పష్టం చేశారు. ఆయా డిపోల పరిధిలో బ్రేక్ డౌన్స్ అధికమైపోతున్నాయని, ఎప్పటికప్పుడు బస్సుల స్థితిగతులను చూసుకోవాల్సిన బాధ్యత డీఎంలపైనే ఉందన్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి రీజియన్ పరిధిలో జరుగుతున్న ‘బస్సు ప్రయాణ మాసం’లో అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలని ఆదేశించారు. ప్రతి డిపో మేనేజర్ వారి వారి పరిధిలోని ప్రాంతాల్లో బస్సుల్లో పర్యటిస్తూ ప్రయాణికుల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించాలన్నారు. ప్రతి ఆదివారం డీఎంలు సూపర్వైజర్లతో సమావేశాన్ని నిర్వహించి ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. డ్రైవర్, కండక్టర్లకు అభినందనలు గత నెల 27వ తేదీన శ్రీరామపురం తండా నుంచి ప్రసవం కోసం మాచర్ల బయలుదేరిన అరుణాబాయి బస్సులోనే ప్రసవించింది. ఆ సమయంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా బాధ్యతగా వ్యవహరించిన డ్రైవర్ కృష్ణ, కండక్టర్ రహీంలను ఆర్ఎం శ్రీహరి అభినందించారు. -
రియల్ స్టార్
-
నేను క్షేమంగానే ఉన్నా: శ్రీహరి భార్య శాంతి
తాను ఆరోగ్యంగా ఉన్నానని, విషమ పరిస్థితుల్లో లేనని దివంగత నటుడు రియల్ స్టార్ శ్రీహరి భార్య శాంతి తెలిపారు. తాను విషమ పరిస్థితుల్లో ఉన్నట్టు సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలపై ఆమె స్పందించారు. కాలేయానికి సంబంధించిన వ్యాధితో సింగపూర్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు వచ్చిన వార్తలను ఆమె తోసిపుచ్చారు. తాను పచ్చకామెర్ల కారణంగా అనారోగ్యానికి గురైన మాట వాస్తమేనని చెప్పారు. చెన్నై వెళ్లి చికిత్స చేయించుకుని కోలుకున్నానని తెలిపారు. తన సోదరి లలితకుమారి నివాసంలో ఉంటూ చికిత్స చేయించుకున్నట్టు వివరించారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని, విషమపరిస్థితుల్లో లేనని స్పష్టం చేశారు. -
‘పాడిపై దృష్టి సారించాలి’
నందిపేట : సహకార సంఘాలు పాడిపై దృష్టి సారించి, లాభాలు ఆర్జించాలని జిల్లా సహకార అధికారి శ్రీహరి సూచించారు. గురువారం డొంకేశ్వర్ సొసైటీలో 61వ జాతీయ సహకార వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ సహకార సంఘాల ద్వారా రైతులకు సేవలందించడంతో పాటు వ్యాపారంలో నిజామాబాద్ జిల్లా అగ్రస్థానంలో ఉందన్నారు. జిల్లాలో సహకార సంఘాల పనితీరు బాగుందన్నారు. సొసైటీలను మరింత లాభాల బాటలో నడిపించేందుకు పాలక వర్గాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఇందులో భాగంగా సొసైటీ పరిధిలోని గ్రామాలలో రైతుల నుంచి పాలను సేకరించడం, వే బ్రిడ్జిలను నెలకొల్పడంలాంటి వ్యాపారాలను చేపట్టాలన్నారు. వారానికోసారి ఆర్థిక లావాదేవీలను సరిచూసుకోవాలని సూచించారు. బకాయిల వసూళ్లపై దృష్టి సారించాలన్నారు. అనంతరం వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో డివిజనల్ సహకార అధికారి మనోజ్ కుమార్, సొసైటీ చైర్మన్ భోజారెడ్డి, వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, డెరైక్టర్లు సాయరెడ్డి, నరేందర్, రాజన్న, భూమేశ్, గంగారెడ్డి, సొసైటీ కార్యదర్శి నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
‘రఫ్’న్యూ మూవీ స్టిల్స్
-
నిజమైన నాయకుడు!
హీరోగా విలక్షణమైన పాత్రలు చేసి, జీవితంలో కూడా పదిమందికి సహాయం చేసి, హీరో అనిపించుకున్నారు స్వర్గీయ శ్రీహరి. అందుకే ఆయన్ను ‘రియల్‌స్టార్’ అంటారు. అదే టైటిల్‌తో శ్రీహరి హీరోగా రూపొందిన ఆ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. తమ్మారెడ్డి భరద్వాజ్ కీలక పాత్ర చేయగా, హంసానందిని కథానాయికగా నటించారు. సి.రామచంద్రయ్య సమర్పణలో ర్యాలి శ్రీనివాసరావు దర్శకత్వంలో కొండపల్లి యోగానంద్, కట్టెల లక్ష్మణరావు నిర్మించారు. శ్రీహరి అభినయం హైలైట్‌గా నిలుస్తుందని దర్శక, నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి నిర్మాణ సారథి: ఉగ్గిరాల సీతారామయ్య, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పెద్దిరాజు, సహనిర్మాతలు: కె.వై. గిరిరాజ్, శ్రీనివాస్ ముదిరాజ్. -
రఫ్ మూవీ స్టిల్స్
-
‘రఫ్’న్యూ మూవీ స్టిల్స్
-
కిక్ ఇచ్చే పాత్ర!
ఈ మధ్యకాలంలో ప్రత్యేక పాటలకు, అతిథి పాత్రలకు పరిమితమైన హంసా నందిని ‘రియల్ స్టార్’లో కథానాయికగా నటించారు. స్వర్గీయ శ్రీహరి టైటిల్ రోల్లో సి. రామచంద్రయ్య సమర్పణలో ర్యాలి శ్రీనివాసరావు దర్శకత్వంలో కొండపల్లి యోగానంద్, కట్టెల లక్ష్మణరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ కీలక పాత్ర చేశారు. ఈ నెలాఖరున ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘నిజజీవితంలో శ్రీహరి అందరివాడు అనిపించుకున్నారు. అందుకే ‘అందరివాడు’ అనేది ఈ చిత్రాన్ని ట్యాగ్‌లైన్‌గా పెట్టాం. హంసా నందిని పాత్ర కిక్ ఇచ్చే విధంగా ఉంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పెద్దిరాజు, సహనిర్మాతలు: కె.వై.గిరిరాజ్, పులగం శ్రీనివాస్ ముదిరాజ్. -
శ్రీహరి ప్రథమ వర్ధంతి
-
మా బావకు నేను చేస్తున్న ఆఖరి పెద్ద ఉత్సవమిది : శాంతి
‘‘పిల్లలు కూడా సినిమాల్లోనే స్థిరపడాలని కోరుకునేవారు బావ. నాకు మాత్రం వాళ్లు బాగా చదువుకుని మంచి స్థానాల్లో స్థిరపడాలని ఉండేది. అయితే... పిల్లలు వాళ్ల నాన్న వైపే మొగ్గు చూపారు. వాళ్లు కూడా సినిమాల్లోనే స్థిరపడాలనుకుంటున్నారు. మా బావకు నేను చేస్తున్న ఆఖరి పెద్ద ఉత్సవం ఇది. ఇక నుంచి అంతా మా పిల్లలు చూసుకుంటారు. ఎప్పటిలాగే ఇక నుంచి కూడా అభిమానులతో, శ్రేయోభిలాషులతో సత్సంబంధాలను కొనసాగిస్తాం’’ అని శాంతి శ్రీహరి అన్నారు. గురువారం నటుడు శ్రీహరి ప్రథమ వర్థంతి సందర్భంగా హైదరాబాద్‌లోని శ్రీహరి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాంతి శ్రీహరి మాట్లాడారు. తాను దర్శకునిగా మారతానని, తమ్ముడు హీరోగా నిలబడతాడని, ఇద్దరం కలిసి సేవాకార్యక్రమాలను కొనసాగిస్తామని శ్రీహరి పెద్ద కుమారుడు శశాంక్ నమ్మకం వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో నిర్మాత సి. కల్యాణ్, దర్శకులు వీరశంకర్, దేవి ప్రసాద్, బాబీ, జర్నలిస్ట్ ప్రభు తదితరులు పాల్గొన్నారు. -
బావకు నేను చేస్తున్న చివరి ఉత్సవం ఇదే: శాంతి
మా బావకు నేను చేస్తున్న చివరి పెద్ద ఉత్సవం ఇది. ఇకపై జరిగే అన్ని కార్యక్రమాలను మా పిల్లలు కొనసాగిస్తారు. పిల్లు చదువుకుని మంచి స్థానాల్లో ఉండాలని నేను ఆశపడ్డాను. కాని వాళ్లు సినిమాల్లో స్థిరపడ్డాలని బావ కోరుకున్నారు. వాళ్లు కూడా బావ కోరికను నెరవేర్చాలని అనుకుంటున్నారు. మా ఫ్యామిలీకి మొదటి నుంచి చిత్ర పరిశ్రమలో అందరితోనూ, జర్నలిస్తులతోనూ మంచి సంబంధాలున్నాయి. ఇకపై కూడా తాము ఆ సంబంధాలను కొనసాగిస్తాం అని శ్రీహరి సతీమణి శాంతి ఉద్వేగంగా ప్రసంగించారు. నా కోరిక మేరకు నేను దర్శకుడిగా మారుతాను. తమ్ముడు హీరో అవుతాడు అని శ్రీహరి కుమారుడు శశాంక్ అని అన్నారు. దివంగత సినీనటుడు శ్రీహరి ప్రథమ వర్ధంతి హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో సి. కళ్యాణ్, వీర శంకర్, దేవీ ప్రసాద్, బాబీతోపాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. -
ఒకటే జననం.. ఒకటే మరణం.. బతుకంతా హీరోగానే జీవితం!
సందర్భం శ్రీహరి వర్ధంతి దాదాపు పన్నెండేళ్ళ క్రితం సంగతి... చెన్నై మహానగరం... ఓ వానాకాలపు ఉదయం 6 గంటల వేళ... రాత్రి నుంచి కురుస్తున్న జోరు వాన, చలి మధ్య నగరం బద్ధకంగా ముసుగు తన్ని నిద్రపోతోంది. కానీ, ఆ స్టార్ హోటల్లోని గదిలో కుటుంబంతో సహా బస చేస్తున్న ఆ నటుడు మాత్రం నిద్ర లేచి చాలాసేపైంది. వ్యాయామాలు ముగించుకొని, చెన్నై పోర్ట్‌లోని ఆ నాటి షూటింగ్‌కు అప్పటికే సిద్ధమై కూర్చొని కనిపించారు. అప్పటికి పుష్కరం పైగా ఆయన పద్ధతి అదే! నిజానికి, ఆ క్రమశిక్షణ, పని మీద ఆ శ్రద్ధే ఆయనను మధ్యతరగతి నుంచి స్టార్ హోటల్లో దిగే స్టార్ స్టేటస్‌కు తెచ్చాయి. ఎంత ఎదిగినా ఇచ్చిన మాట, ఒప్పుకొన్న పని, నమ్మినవారి క్షేమం మర్చిపోని ఆ హీరో శ్రీహరి. అయినవాళ్ళు కానీ, ఆర్థికంగా అండదండలు కానీ లేకుండా పైకి రావడం కష్టమైపోతున్న 1990లలో శ్రీహరి అందుకు పూర్తి భిన్నమైన ఉదాహరణ. స్వయంకృషితో పైకొచ్చి, వచ్చిన అవకాశాన్నల్లా సద్వినియోగం చేసుకొన్న సెల్ఫ్‌మేడ్ హీరో! సినిమాను జీవితంగా చేసుకున్న రఘుముద్రి శ్రీహరి జీవితమూ సినిమానే! హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడిన ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన శ్రీహరి బాలానగర్‌లో తిరిగిన చోట్లు, పడిన కష్టాలు, చేసిన శ్రమ- ఇవాళ్టికీ అక్కడ కథలుగా చెబుతారు. ఆయన మొదలుపెట్టింది - చిన్నాచితకా పాత్రలతో! ప్రధానంగా చేసింది - నెగటివ్ పాత్రలు! అయ్యింది - చిన్న చిత్రాలకు పెద్ద హీరోగా! అనేక విజయాల తరువాత మరింత పేరు తెచ్చుకుంది - కథకు కీలకమైన క్యారెక్టర్లతో! దాదాపు రెండు దశాబ్దాల పైగా శ్రీహరి సాగించిన అరుదైన సినీ ప్రస్థానమిది. ‘పాత్రను దర్శకుడు నాలోకి ఎంత బాగా ఎక్కిస్తే, ఆ పాత్రను అంతగా పండిస్తాను’ అని నిజాయతీగా చెప్పిన శ్రీహరి మూసచట్రంలో బందీ కాకుండా, ఎప్పటికప్పుడు తన నట జీవితాన్ని పునర్నిర్వచించుకోవడం విశేషమే. అందుకే, నటుడిగా ఆయన ప్రస్థానమంతా ఓ సహజ పరిణామ క్రమంగా సాగింది. వాచిక, ఆంగిక, ఆహార్యాలు మూడింటి మీదా శ్రీహరిది గట్టిపట్టు. పౌరాణిక, చారిత్రక, సాంఘిక పాత్రలు వేటికైనా సరిపడే నిండైన విగ్రహంతో నిలిచిన ఈ తరం ఆఖరి నటుల్లో ఆయనొకరు. ‘శ్రీకృష్ణార్జున విజయము’, ‘మగధీర’, ‘హలో బ్రదర్’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘ఢీ’ లాంటివే అందుకు ఉదాహరణ. ‘పోలీస్’, ‘సాంబయ్య’ లాంటి పాత్రల్లో ఆయన అటు సామాన్య జనాన్నీ, ఇటు దర్శక - నిర్మాతలనూ సంతోషపెట్టారు. ‘‘సినిమాల్లో నటించడానికి పనికొస్తాయని సోమర్‌సాల్ట్‌లు నేర్చుకొన్న’’ స్పోర్ట్స్‌మన్ ఆయన. వ్యాయామానికీ, క్రీడలకూ చిన్నప్పటి నుంచి ప్రాధాన్యమిచ్చిన ఈ బలశాలి ఒకప్పుడు జిమ్నాస్ట్‌గా 8 సార్లు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. అంతర్జాతీయ జిమ్నాస్ట్ కావాలని ఒకప్పుడు ఆయన కోరిక. కానీ, సినిమాలు బలంగా ఆకర్షించి, ఇటు వైపు రావడంతో అది తీరని కోరికగా మిగిలిపోయింది. విశేషం ఏమిటంటే, వచ్చిన దోవ, ఎక్కిన మెట్లు ఆయన మర్చిపోలేదు. అందుకే, క్రీడలకు సంబంధించి ఏ కార్యక్రమం చేపడుతున్నా, అడిగిన వారికి లేదనకుండా సాయం చేసేవారు. సినీ జీవితపు తొలినాళ్ళలో తన బుడిబుడి అడుగులకు మాట సాయం చేసినవాళ్ళకు కూడా తన స్టార్ ఇమేజ్ తోడ్పడుతుందంటే, సంతోషంగా ముందుకు వచ్చారు. అన్ని బంధాలూ ఆర్థిక సంబంధాలే అయిన సినీ సమాజంలో ‘రియల్‌స్టార్’గా పేరు తెచ్చుకున్నారు. ఏ ‘గాడ్ ఫాదరూ’ లేకుండా, ఎవరికీ వారసుడు కాకుండా సినీ రంగంలో పైకి వచ్చిన శ్రీహరి ‘మనం బతుకుతూ, మరో నలుగురికి బతుకునివ్వడమే జీవితం’ అని నమ్మారు. ఏదైనా సరే మనసులో పెట్టుకోకుండా చెబుతూ, మనసును హాయిగా ఉంచుకోవడాన్ని నమ్మిన శ్రీహరి వీలైనంత వరకు దాన్నే ఆచరించారు. చెన్నైలో డ్యాన్స తరగతుల్లో చూసిన నటి ‘డిస్కో’ శాంతి వ్యక్తిత్వం ఆయనను ఆకర్షించింది. ఆమే తండ్రి అయి, ఎనిమిదిమంది ఉన్న కుటుంబాన్ని సాకుతున్న తీరు మనసుకు హత్తుకుంది. అంతే! పెద్దలతో మాట్లాడి, ఆమెనే పెళ్లాడారు. చనిపోయిన కూతురు అక్షర పేరు మీద చేసిన సేవ, రాష్ట్ర రాజధాని దగ్గరలో కొన్ని గ్రామాలకు మంచినీటి వసతి విషయంలో శ్రీహరి చూపిన చొరవ కూడా సామాన్యుల్ని ఆయనకు మరింత దగ్గర చేశాయి. మానుకోలేకపోయిన అలవాట్లు ముదరబెట్టిన మాయదారి రోగం ముంబయ్‌లో హిందీ చిత్ర షూటింగ్‌కు వెళ్ళిన ఆ మనిషిని మింగేసినప్పుడు సామాన్య జనం జూబ్లీహిల్స్ నివాసానికి తండోపతండాలుగా తరలి వచ్చారంటే ఇలాంటి కారణాలెన్నో! జూబ్లీహిల్స్ నివాసం నుంచి కిలోమీటర్ల దూరమున్న ఖననవాటిక దాకా శ్రీహరి అంతిమయాత్రలో రోడ్డుకు ఇరుపక్కలా క్రిక్కిరిసిన జనం పరుగులు పెడుతూ పాల్గొనడం ఇటీవలి కాలంలో అతి కొద్దిమందికే దక్కిన అరుదైన ఆఖరి వీడ్కోలు! జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో ఇంటి దగ్గర ఓ భారీ వినైల్లో ఇవాళ్టికీ శ్రీహరి చిరునవ్వు చిందిస్తుంటారు. దాని మీద ‘ది లెజెండ్స్ నెవర్ డైస్’ అని ఉంటుంది. అవును. బతికుండగానే జనం మర్చిపోయేవారు ఎందరో! కానీ, కనుమరుగైనా కళ్ళ ముందే కదలాడే వ్యక్తిత్వాలు, వ్యక్తులు కొందరే! ఆ కొందరిలో ఒకడైన శ్రీహరి చిరంజీవి!! - రెంటాల జయదేవ -
‘రియల్ స్టార్’మూవీ స్టిల్స్
-
‘కళింగ’ ఆశయం...
శ్రీహరి హీరోగా పోలీస్, దేవా, సాంబయ్య తదితర చిత్రాలు డెరైక్ట్ చేసిన కేయస్ నాగేశ్వరరావు తాజా ప్రయత్నం ‘కళింగ’. సతీశ్‌బాబు హీరోగా రూపొందనున్న ఈ చిత్రాన్ని మండవ శాంతిశ్రీ నిర్మించనున్నారు. భారీ నిర్మాణ వ్యయంతో, పూర్తి వాణిజ్య హంగులతో ఈ సినిమా చేయనున్నామని, విజయదశమి రోజున పాటల రికార్డింగ్ చేస్తామని నిర్మాత తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘శ్రీహరి మార్కు సినిమా ఇది. శివనాగు అద్భుతమైన స్క్రిప్టు అందించారు. త్వరలోనే చిత్రీకరణ మొదలుపెడతాం. కళింగ అనే యువకుడు తన ఆశయాన్ని ఎలా నెరవేర్చుకున్నాడన్నది ఈ సినిమా ప్రధాన కథాంశం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీ వెంకట్, కెమెరా: కిషన్ సాగర్, సమర్పణ: డి. రామ్మూర్తి తేజ, సహనిర్మాత: టి. లక్ష్మణరావు. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - శ్రీహరి
-
శ్రీహరి పుట్టినరోజుకి...
శ్రీహరి టైటిల్ రోల్లో, హంసానందిని నాయికగా నటించిన చిత్రం ‘రియల్ స్టార్’. చిగురుపాటి రామచంద్రయ్య సమర్పణలో ర్యాలి శ్రీనివాసరావును దర్శకునిగా పరిచయం చేస్తూ కొండపల్లి యోగానంద్, కట్టెల లక్ష్మణరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. వందేమాతరం శ్రీనివాస్ స్వరపరచిన పాటలను ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన తమ్మారెడ్డి భరద్వాజ్ ఆవిష్కరించి, తొలి సీడీని నిర్మాత సి. కల్యాణ్‌కు అందించారు. శ్రీహరి పట్టుబట్టి ఇందులో తనతో ఓ ముఖ్య పాత్ర చేయించారనీ, తమ మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయని భరద్వాజ్ అన్నారు. వెండితెరపైనే కాదు.. నిజజీవితంలోనూ హీరో అనిపించుకున్న శ్రీహరి నటించిన ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం కావడం ఆనందంగా ఉందని శ్రీనివాసరావు చెప్పారు. శ్రీహరి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆగస్ట్ 15న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ ఆడియో వేడుకలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కొడాలి వెంకటేశ్వరరావు, అమ్రిష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నాన్న మెచ్చిన దారిలో..
‘ నాన్ననే నవ్ముకం దూరమై నెలలు గడుస్తున్నాయి. ఇన్నాళ్లూ అపనవ్ముకంతో కాలం గడిపిన మేవుు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాం. నాన్న ఆశ యూలు నిలబెట్టే ప్రయుత్నంలో ఉన్నాం’ అని చెబుతున్నారు రియుల్ స్టార్ శ్రీహరి తనయుులు శశాంక్, మేఘాంశ్. నాన్న మెచ్చిన దారిలో వెళ్తున్నావుంటున్న వీరిని ‘సిటీప్లస్’ పలకరించింది. మేఘాంశ్: నాన్న అన్ని సౌకర్యాలతో ఇంట్లోనే పెద్ద జిమ్ ఏర్పాటు చేశారు. నేను, అన్న ప్రతి రోజూ గం టల తరబడి ఎక్సర్సైజ్లు చేసేవాళ్లం. ఫిట్నెస్ కాపాడుకోవడానికి ఎలాంటి వ్యాయామాలు చేయాలో నాన్న చెప్పేవారు. అన్న నాన్నతో కలసి పోటాపోటీగా ఎక్సర్సైజ్ చేసేవాడు. నాన్న పోయాక అన్న ఇప్పుడు జిమ్‌ను మళ్లీ ప్రారంభించాడు. నాన్న జ్ఞాపకాలతో జిమ్‌లో గడుపుతున్నాం. శశాంక్: మేమంటే నాన్నకు చాలా ఇష్టం. మాకు కూడా నాన్నంటే ఎంతో ఇష్టం. మమ్మల్ని స్నేహితుల్లానే చూసేవారు. నన్ను డెరైక్టర్ చేయాలని, తమ్ముడిని హీరో చేయాలని నాన్నకు కోరికగా ఉండేది. అమ్మ మాత్రం నన్ను డాక్టర్‌గా, తమ్ముడిని లాయర్‌గా చూడాలనుకునేది. నాన్న పోయాక అమ్మ ఆలోచనలూ మారాయి. నాన్న కోరిక మేరకే మమ్మల్ని డెరైక్టర్‌గా, హీరోగా చేయాలనుకుంటోంది. - శిరీష చల్లపల్లి -
ఆకట్టుకొనే హంసానందిని
దివంగత శ్రీహరి కథానాయకునిగా రూపొందిన ‘రియల్‌స్టార్’లో హంసానందిని నాయిక పాత్ర చేశారు. ర్యాలి శ్రీనివాసరావు దర్శకుడు. కొండపల్లి యోగానంద్, కె.లక్ష్మణరావు నిర్మాతలు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ -‘‘శ్రీహరికి ఘనమైన నివాళి ఈ సినిమా. ఇందులో హంసానందిని, శ్రీహరి కాంబినేషన్ మాస్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ‘వందేమాతరం’ శ్రీనివాస్ స్వరాలకు శ్రీహరి, హంసానందిని వేసిన స్టెప్పులు సినిమాకే ప్రత్యేక ఆకర్షణ’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: డా.సి.రామచంద్రయ్య. -
ఘోరం..
వేధింపులు, ఆర్థిక ఇబ్బందులకు బలైన తల్లీకొడుకులు కుమారుడిని నడుముకు కట్టుకొని బావిలోదూకి ఆత్మహత్య మృతదేహాలు తరలించకుండా అడ్డుకున్న బంధువులు శంషాబాద్ మండలం మదన్‌పల్లి పాతతండాలో విషాదం పోలీసుల అదుపులోఅత్తామామలు శంషాబాద్ రూరల్: కట్టుకున్నోడు కుటుంబాన్ని పట్టించుకోకుండా మద్యానికి బానిసయ్యాడు.. దీంతో ఆమె కుటుంబ భారాన్ని తన భుజాలపై వేసుకొని రెక్కలుముక్కలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. భర్త, అత్తామామల వేధింపులు ఎక్కువయ్యాయి. తను చనిపోతే లోకం పోకడ కూడా తెలియని చిన్న కొడుకు పరిస్థితి ఏంటి..? అని ఆ తల్లి మనసు తల్లడిల్లిపోయినట్టుంది. కుమారుడిని చీరతో నడుముకు కట్టుకొని బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. అందరి మనసులను కలచివేసే ఈ ఘటన శంషాబాద్ మండలం మదన్‌పల్లి పాతతండాలో సోమవారం వెలుగుచూసింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మదన్పల్లిపాతతండా నివాసి రమావత్ రవి 15 ఏళ్ల క్రితం రాజేంద్రనగర్ సర్కిల్ గగన్‌పహాడ్‌కు చెందిన నీల(30)ను వివాహం చేసుకున్నాడు. వీరి కుమారులు దీక్షిత్(9), శ్రీహరి(5) ఉన్నారు. పెద్దకొడుకు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. శ్రీహరి తల్లివద్దే ఉంటున్నాడు. రవి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసైన అతడు కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో నీల కూలీ పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటోంది. ఇటీవల కాలంలో భర్త, అత్తమామల వేధింపులు తీవ్రమయ్యాయి. తీవ్ర మనో వేదనకు గురైన ఆమె ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో తన చిన్న కొడుకు శ్రీహరిని తీసుకొని కట్టెల కోసమని వెళ్లి తిరిగి రాలేదు. తండా సమీపంలోని బెంగళూరు జాతీయ రహదారి పక్కన ఓరియంటల్ గార్డెన్లో స్థానికులు కట్టెలు సేకరిస్తుంటారు. భార్యాపిల్లలు సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో రవి ఓరియంటల్ గార్డెన్‌లోకి వెళ్లి వారి కోసం వెతికాడు. అక్కడ ఓ బావి వద్ద నీలకు సంబంధించిన టవల్ కనిపించింది. భార్యాపిల్లల కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో రవి టవల్ తీసుకుని ఇంటికి వచ్చాడు. రాత్రి కూడా తల్లీపిల్లలు ఇంటికి చేరుకోకపోవడంతో రవి విషయం ఇరుగుపొరుగు వారికి చెప్పాడు. బావిలో శవాలై తేలారు.. సోమవారం ఉదయం స్థానికులు, కుటుంబీకులు బావి వద్దకు చేరుకున్నారు. బావిలోని నీళ్లపై పూర్తిగా నాచు ఉండడంతో ఇద్దరు యువకులు లోపలికి దూకారు. నాచును పక్కకు తప్పించి చూడగా నీల, హరి మృతదేహాలు తేలియాడుతూ కనిపించాయి. నీల తన కొడుకును చీర కొంగుతో నడుముకు కట్టుకొని ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బావిలోంచి వెలికితీయించారు. అప్పటి వరకు అక్కడే ఉన్న మృతురాలి భర్త, అత్తింటివారు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. భర్త, అత్తమామల వేధింపులే తల్లీకొడుకుల ఉసురు తీశాయని నీల బంధువులు ఆరోపించారు. రవి, అతడి తల్లిదండ్రులను ఇక్కడికి తీసుకొచ్చేవరకు మృతదేహాలను తీయనీయబోమని బంధువులు పోలీసులను అడ్డుకున్నారు.ఆందోళనకారులకు పోలీసులు నచ్చజెప్పారు. స్థానిక క్లస్టర్ ఆస్పత్రిలో ఇద్దరి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. తండాలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రవితోపాటు అతడి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
శ్రీహరికి ఈ సినిమా అంకితం
‘‘శ్రీహరి కెరీర్లో ‘శివకేశవ్’ ఓ అద్భుతం. ఆయనే బ్రతికి ఉంటే... హీరోగా సెకండ్ ఇన్నింగ్స్‌కి బంగారు బాట వేసేదీ సినిమా. ఆ స్థాయిలో విజృంభించి నటించారు శ్రీహరి’’ అని నిర్మాత బానూరు నాగరాజు(జడ్చర్ల) అన్నారు. స్వర్గీయ శ్రీహరి, భానుచందర్ తనయుడు జయంత్ కథానాయకులుగా రూపొందిన చిత్రం ‘శివకేశవ్’. సంజన, గుర్లిన్‌చోప్రా, శ్వేతాబసు ప్రసాద్ హీరోయిన్లు. ఆర్వీ సుబ్రమణ్యం దర్శకుడు. ఈ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం నాగరాజు విలేకరులతో ముచ్చటించారు. అనుకున్న దానికంటే సినిమా బాగా వచ్చిందని, గత కొన్నాళ్లుగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా విడుదలకు జాప్యం జరిగిందని నాగరాజు చెప్పారు. జయంత్ నటన ఆకట్టుకుంటుందని, గుర్లిన్ చోప్రా, సంజన, శ్వేతాబసు ప్రసాద్ గ్లామర్ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ అని ఆయన తెలిపారు. శ్రీహరికి ఈ చిత్రాన్ని అంకితమిస్తున్నామని, శ్రీను వైట్ల శిష్యుడు వెంకటేశ్ రెబ్బా దర్శకత్వంలో ‘నాక్కొంచెం టైమ్ కావాలి’ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించనున్నామని నాగరాజు తెలిపారు. -
అప్పా పేరు నిలబెడతాం..!
అది.. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నం. 45. ఆ దారిలో వెళ్లే ప్రతి ఒక్కరి చూపూ ఒక ఇంటిపై పడకుండా ఉండదు. అది నటుడు ‘శ్రీహరి’ ఇల్లు అని అందరికీ తెలుసు. ఎనిమిది నెలల క్రితం ఆ ఇంటి సందడి వేరు. ఎప్పుడూ వచ్చేపోయేవాళ్లతో కళకళలాడుతుండేది. ఇప్పుడా కళ లేదు. లంకంత ఆ ఇంట్లో తన ఇద్దరు కొడుకులు శశాంక్, మేఘాంశ్‌లతో మాత్రమే ఉంటున్నారు శాంతీ శ్రీహరి. ఆమెలో పూర్వపు ఉత్సాహం కానీ.. కళ కానీ లేదు. చాలా చిక్కిపోయారు. జీవితంలో హఠాత్తుగా వచ్చిన మార్పుని ఆహ్వానించడానికి ఆమె ఇంకా అలవాటుపడలేదనిపించింది. మరి.. పిల్లల సంగతేంటి...? ఇంతలో శశాంక్, మేఘాంశ్ వచ్చారు. చూడచక్కగా ఉన్నారు. ఇద్దరూ ‘హీరో మెటీరియల్’ అనిపించింది. ఏం చదువుతున్నారని అడిగితే... ఇంటర్ సెకండ్ ఇయర్ అని శశాంక్, టెన్త్ అని మేఘాంశ్ చెప్పారు. దర్శకుడు కావాలన్నది శశాంక్ ఆశయమైతే, హీరో కావాలన్నది మేఘాంశ్ లక్ష్యం. మరి.. వారి ఆశయాల గురించి శ్రీహరికి తెలుసా? ‘‘దర్శకత్వం సులువు కాదనీ, శ్రద్ధపెట్టి చేయాలనీ అప్పా (తమిళంలో నాన్న అని అర్థం) అన్నారు. నేను రెండు షార్ట్ ఫిలిమ్స్ తీసి, యూ ట్యూబ్‌లో పెట్టాను. అవి చూసి అందరూ మెచ్చుకున్నారు’’ అని శశాంక్ చెప్పాడు. ‘‘నాన్న నటించిన ‘భైరవ’లో చేశాను. ‘పెద్దయిన తర్వాత హీరో అవుతా’నంటే, శరీరం ఫిట్‌గా ఉండాలనీ, అంకితభావం అవసరమనీ అప్పా చెప్పారు’’ అని మేఘాంశ్ అన్నాడు. అప్పా లేని లోటు మాటేమిటి? ‘‘మనకేంటిలే.. అప్పా ఉన్నారు.. అన్నీ చూసుకుంటారనే ధైర్యం ఉండేది. ఇప్పుడు మాత్రం అభద్రతాభావం ఉంది’’ అన్నారు అన్నదమ్ములిద్దరూ. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. భర్త చనిపోయిన తర్వాత ఇంటి బాధ్యతలన్నీ పెద్ద కొడుక్కి అప్పజెప్పేశారు శాంతి. పదిహేడేళ్ల వయసులో ఇంటి బాధ్యతా? ‘‘అప్పా ఉన్నంతవరకూ ఏమైనా కావాలంటే, క్రెడిట్ కార్డ్ ఇచ్చి.. కొనుక్కోమనేవారు. అవసరమైనవి ఎంత ఖరీదు అయినా కొనుక్కోమనేవారు. అనవసరమైన వాటికి ఖర్చు చేయొద్దనేవారు. తమ్ముడికి చాక్లెట్లంటే చాలా ఇష్టం. ఒకసారి అప్పా క్రెడిట్ కార్డ్ తీసుకెళ్లి, పదివేల రూపాయలకు చాక్లెట్లు కొనుక్కుని, ఫ్రిజ్‌లో దాచుకుని తిన్నాడు. నేనైతే నెలకో వాచ్ కొనుక్కునేవాణ్ణి. అది కూడా చాలా ఖరీదుగలది. ఇప్పుడు నేను వాచ్‌లు కొనడం మానేశాను. తమ్ముడు కూడా పెద్దగా చాక్లెట్లు కొనుక్కోవడం లేదు. ఇంటికి కావాల్సినవి కొంటుంటే, ‘ఇంత ఖర్చా?’ అనిపించింది. ఆదాయం కూడా లేదు కాబట్టి, అప్పా ఉన్నప్పటిలా విచ్చలవిడిగా ఖర్చుపెట్టకూడదనుకుంటున్నాను’’ అని వచ్చిపడ్డ పెద్దరికం నేర్పిన బాధ్యతతో శశాంక్ అన్నాడు. ‘‘నేనూ, అన్నయ్య బాగా అల్లరి చేసేవాళ్లం. చిన్న చిన్న గొడవలకే కొట్టేసుకునేవాళ్లం. అవుట్డోర్ షూటింగ్‌కి వెళ్లినప్పుడు, నాన్న ఫోన్ చేసి ‘తమ్ముణ్ణి కొట్టొద్దురా..’ అని అన్నయ్యకు ప్రత్యేకంగా చెప్పేవారు’’ అంటున్నప్పుడు, నాన్న లేని బాధ మేఘాంశ్ కళ్లల్లో స్పష్టంగా కనిపించింది. చనిపోయేవరకూ బిజీగా సినిమాలు చేశారు శ్రీహరి. ఎంత బిజీగా ఉన్నా కుటుంబాన్ని విస్మరించలేదాయన. షూటింగ్ నుంచి ఇంటికి రాగానే భార్యాపిల్లలతో గడిపేవారు. ‘‘దాదాపు మూడు నాలుగు గంటలు లాన్లో కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్లం. ఎంత కష్టపడి పైకొచ్చిందీ అప్పా చెప్పేవారు’’ అని మేఘాంశ్ అన్నాడు. అది మాత్రమే కాదు.. దాదాపు రోజూ బ్రేక్‌ఫాస్ట్‌కు మినర్వా కాఫీ షాప్‌కి వెళ్లేవాళ్లమని అన్నాడు శశాంక్. మరి.. ఇప్పుడూ? ‘‘అప్పా చనిపోయిన ఈ ఎనిమిది నెలల్లో ఈ మధ్యే అమ్మ ఒకసారి తీసుకెళ్లింది’’ అన్నాడు మేఘాంశ్. భార్య శాంతి అంటే శ్రీహరికి ప్రాణం. పిల్లలు అల్లరి చేసినప్పుడు, ఆమె కోప్పడితే ‘పిల్లలు చేయకపోతే పెద్దాళ్లు అల్లరి చేస్తారా’ అని భార్యను మందలించేవారు కానీ.. పిల్లలను ఏమీ అనేవారు కాదట. ‘‘కానీ, ‘అమ్మ తిట్టింది.. అప్పా’ అని కంప్లయింట్ చేసినప్పుడు మాత్రం ‘మీ మంచికే తిట్టి ఉంటుంది. మీకు అమ్మ కాక ముందు తను నా భార్య. నా భార్య గురించి నాకే కంప్లయింట్ చేస్తారా’ అని అమ్మని వెనకేసుకొచ్చేవారు’’ అని మేఘాంశ్ చెప్పాడు. అసలు శ్రీహరి ఇంత హఠాత్తుగా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోతారని ఎవరూ ఊహించలేదు. ఆయన ముంబయ్ షూటింగ్‌కి వెళ్లినప్పుడు.. ఇంట్లోవాళ్లకి జాగ్రత్తలు చెప్పి వెళ్లారట. చివరిసారిగా పిల్లలతో శ్రీహరి ఎప్పుడు మాట్లాడారు? ‘‘ముంబయ్ నుంచి ఫోన్ చేసి, ‘‘జిమ్ చేస్తున్న చోట అద్దం బిగించడానికి మనుషులొస్తున్నారు. దగ్గరుండి చూస్కో. తమ్ముడు మేఘాంశ్ కొట్టొద్దు’’ అన్నారని చెప్పేటప్పుడు శశాంక్ ఉద్వేగానికి గురయ్యాడు. కష్టపడి పైకొచ్చిన వ్యక్తి కాబట్టి, పిల్లలకు తన కష్టాలు చెప్పడంతో పాటు కొన్ని సలహాలు కూడా శ్రీహరి ఇచ్చే ఉంటారు. ఆ మాటే శశాంక్, మేఘాంశ్‌లతో అంటే.. ‘‘అటు నావైపు బంధువులను కానీ, ఇటు మీ అమ్మవైపు బంధువులను కానీ, స్నేహితులను కానీ ఈజీగా నమ్మొద్దు. డబ్బు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. తెలివిగా ఉండాలి’’ అని చెప్పేవారన్నారు. నా భార్యా పిల్లలే నా ప్రపంచం అనేవారు శ్రీహరి. దాదాపు ప్రతి ఏడాదీ తన కుటుంబాన్ని విదేశాలకు తీసుకెళ్లేవారట. దాని గురించి చెబుతూ -‘‘యూఎస్, మలేసియా, సింగపూర్, దుబాయ్.. ఇలా చాలా దేశాలకు మమ్మల్ని తీసుకెళ్లారు. అక్కడ ఏం అడిగినా కొనిచ్చేవారు’’ అన్నాడు మేఘాంశ్. మరి.. ఈ ఏడాది సంగతేంటి.. ఎక్కడికైనా వెళ్లారా? ‘‘ఆస్ట్రేలియా తీసుకెళ్లనా అని అమ్మ అడిగింది. కానీ, లెక్కలేసుకుని చూస్తే, బాగా ఖర్చయ్యేట్లు ఉంది. దాంతో, ఇప్పుడు అవసరమా అని మాకే అనిపించింది. నాన్న లేకుండా టూర్ వెళ్లడానికి అమ్మకి ఇష్టం లేకపోయినప్పటికీ మా కోసం అడిగింది. కానీ, మేమే వద్దన్నాం. చెన్నైలో మా పిన్ని ఇంటికెళ్లి ఓ పదిహేను రోజులు ఉండొచ్చాం’’ అని చెప్పాడు శశాంక్. ప్రతి ఏడాదీ తన పుట్టినరోజును అభిమానుల సమక్షంలో చేసుకునేవారు శ్రీహరి. పిల్లల పుట్టినరోజు వేడుకలను చాలా ఘనంగా జరిపేవారు. మరి.. ‘ఫాదర్స్ డే’ నాడు మీరు బహుమతులిచ్చేవారా? ‘‘తప్పనిసరిగా ఇచ్చేవాళ్లం. నాన్న సింపుల్‌గానే ఉండేవారు. మాకేం కొనాలో కూడా తెలిసేది కాదు. షోరూమ్‌కి వెళ్లి, కంటికి ఏది నచ్చితే అది కొనిచ్చేవాళ్లం. అవి చూసి నవ్వుకునేవారు’’ అని పిల్లలిద్దరూ చెప్పారు. ‘‘ఈ ఫాదర్స్ డేకి మా నుంచి దూరం అవుతారని ఊహించలేదు. చాలా షాకింగ్‌గా ఉంది. మా అప్పా ఎక్కడున్నా మమ్మల్ని చూస్తూ ఉంటారని మా నమ్మకం. ఆయన చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. అప్పా పేరు నిలబెడతాం. ఆయన స్థాయికి తగ్గట్టుగా స్థిరపడాలన్నదే మా లక్ష్యం’’ అన్నారు మేఘాంశ్, శశాంక్. ఏ తండ్రి అయినా పిల్లల గురించి కోరుకొనేది అదేగా! - డి.జి. భవాని మా లాన్లో జిమ్నాస్టిక్ బెడ్ ఉంది. అప్పా మాతో జిమ్నాస్టిక్స్ చేయించేవారు. ఎక్కువ సోమర్‌సాల్ట్స్ చేసేవాళ్లం. అప్పా ఉన్నప్పుడు ఎలా వర్కవుట్ చేసేవాళ్లమో ఇప్పుడూ అలానే చేస్తున్నాం. అప్పుడు సలహాలిచ్చే అప్పా లేకపోవడమే ఇప్పుడు పెద్ద లోటు. - శశాంక్ -
రియల్ స్టార్ వస్తున్నాడు!
నటుడిగా విభిన్న తరహా పాత్రలు పోషించి, ‘రియల్ స్టార్’ అనిపించుకున్నారు శ్రీహరి. ఆయన హీరోగా నటించిన ‘టీ సమోసా బిస్కెట్’ విడుదలకు సిద్ధమవుతోంది. అయితే, ఈ సినిమా టైటిల్‌ని ‘రియల్ స్టార్’ అని మార్చారు. ఈ విషయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర నిర్మాతలు కొండపల్లి యోగానంద్, కట్టెల లక్ష్మణరావు తెలియజేశారు. ర్యాలి శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హంసా నందిని కథానాయికగా నటించారు. ఈ నెలలోనే పాటలను, వచ్చే నెలలో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు. శ్రీహరి నటించిన చివరి సినిమా ఇదని, ఆయన నిజజీవితానికి దగ్గరగా ఉంటుందనే ‘రియల్ స్టార్’ అని టైటిల్ పెట్టామని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రంలోని పోరాట సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని, అన్ని వర్గాలవారికీ నచ్చే విధంగా సినిమా ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కథ: ఎస్. బాబ్జీ, సంగీతం: వందేమాతరం శ్రీనివాస్. -
ఆకట్టుకునే కథా కథనాలతో...
శ్రీహరి నటించిన చివరి చిత్రం ‘శివకేశవ్. సీతారామ ఫిలింస్ పతాకంపై బానూరు శ్రావణి-సాయినాథ్ సమర్పణలో బానూరు నాగరాజు (జడ్చర్ల) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆర్వీ సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘శ్రీహరి నటన, ఆయన చేసిన రిస్కీ ఫైట్స్ ఈ సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయి. జయంత్ అద్భుతంగా నటించాడు. దర్శకుడికి ఇది మొదటి సినిమా అయినా బాగా తెరకెక్కించాడు. శివకేశవ్ ఎవరు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఆకట్టుకునే కథా కథనాలతో సాగే యాక్షన్ ఎంటన్టైనర్ ఇది’’ అని చెప్పారు. జయంత్, సంజన, శ్వేతాబసుప్రసాద్, గుర్లిన్ చోప్రా తదితరులు నటించిన ఈ చిత్రానికి సహనిర్మాత: బానూరు మాలతి. -
‘రఫ్’ కుర్రాడి రొమాన్స్
ఇప్పటివరకు చేసిన చిత్రాల ద్వారా లవర్‌బోయ్‌లా కనిపించిన ఆది, ఈసారి రఫ్‌గా కనిపించనున్నారు. ఆది, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా ‘రఫ్’ పేరుతో రూపొందుతోన్న ఈ చిత్రంలో శ్రీహరి ప్రత్యేక పాత్ర పోషించారు. ఎమ్. సుదర్శనరావు సమర్పణలో శ్రీదేవి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సీహెచ్. సుబ్బారెడ్డి దర్శకత్వంలో అభిలాష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ - ‘‘ఓ కొత్త కోణంలో ఆది కనిపించబోతున్న సినిమా ఇది. ఇటీవల స్విట్జర్లాండ్‌లో రెండు పాటలు చిత్రీకరించాం’’ అని చెప్పారు. ‘‘బుల్లెట్‌లాంటి కుర్రాడి కథ ఇది. టైటిల్ ‘రఫ్’ అయినప్పటికీ కుటుంబ సమేతంగా చూసే విధంగా ఉంటుంది. ఒక పాట మినహా ఈ సినిమా పూర్తయ్యింది. ఈ నెలలోనే పాటలను, వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: మరుధూరి రాజా, సంగీతం: మణిశర్మ, కెమెరా: సెంథిల్‌కుమార్. -
స్వచ్ఛమైన ప్రేమకు అచ్చమైన నిర్వచనం
‘‘ఇప్పటివరకూ తెలుగు తెరపై రాని ప్రేమకథ ఇది. స్వచ్ఛమైన ప్రేమకు అచ్చమైన నిర్వచనంగా నిలుస్తుంది. ప్రతి ఒక్కరూ చూడదగ్గ చిత్రమిది’’ అని దర్శకుడు రాజ్ నరేంద్ర చెప్పారు. అనూప్‌తేజ్, రితికా ఆచార్య, సిమ్మిదాస్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘జాబిల్లి కోసం ఆకాశమల్లే’. ఇందులో ‘రియల్‌స్టార్’ శ్రీహరి ముఖ్యపాత్ర పోషించారు. శ్రీ శివభవాని సినిమా పతాకంపై గుగ్గిళ్ల శివప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల రెండో వారంలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘శ్రీహరి నటన ఈ సినిమాకు మెయిన్ హైలైట్. ఆయన నటించిన ఆఖరి చిత్రమిది. ఆయన పాత్ర అందరి హృదయాల్లోనూ నిలిచిపోతుంది. ఈ చిత్రాన్ని ఆయనకే అంకితం ఇస్తున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: జీఎల్ బాబు, సమర్పణ: శశిప్రీతమ్, సహనిర్మాతలు: గుగ్గిళ్ల నాగభూషణం, రాము. -
ఒకే ముహూర్తంలో శ్రీరామ జననం కల్యాణం వనవాసం
సందర్భం - 8న శ్రీరామ నవమి ఎంతో బాగా అర్థమైనట్లు కనిపించేది, లోతుగా ఆలోచిస్తేగానీ ఓ పట్టాన అర్థం కానిదీ శ్రీమద్రామాయణం. అందుకే ఈ రామకథకు ఎందరు ఎన్ని కాలాల్లో ఎన్నెన్ని వ్యాఖ్యానాలను చేస్తున్నా, అందరికీ అన్నన్ని కొత్తకొత్త విశేషాలు కనిపిస్తూనే ఉన్నాయి. వాటిల్లోని ఒక కొత్త విశేషం... రాముడు రావణుని వధ కోసం చక్కగా, చిక్కగా ఓ ప్రణాళికను రచించి, అందులోని ప్రతి సంఘటనకీ ఓ కాల నిర్ణయాన్ని (ముహూర్తాన్ని) చేయడం. రాముని పుట్టుక తత శ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ నక్షత్రే దితి దైవత్యే స్వోచ్ఛ సంస్థేషు పంచసు॥ మహా నియమవంతుడు, శివపూజా ధురంధరుడూ అయిన రావణుణ్ణి సంహరించేందుకు శ్రీహరంతటివానికి ఓ గట్టి ముహూర్తాన్ని నిర్ణయించుకోవలసి వచ్చింది. అందరూ తపస్సు చేస్తున్న వేళ అకస్మాత్తుగా ప్రత్యక్షమై వరాలిచ్చే శ్రీహరికి ఇంతగా ముహూర్తాన్ని నిర్ణయించుకుని జన్మించవలసిన అవసరం రావడానికి కార ణం, రావణునికి ఉన్న తపోబలమే. 12వ నెలలో (మనుష్యజాతి 10 వ నెలలో కదా పుడుతుంది), చైత్రమాసంలో (చైత్రే మధుర భాషే స్యాత్- శత్రువుక్కూడా రుచించేలా మాట్లాడగల శక్తి ఈ మాసంలో పుట్టినవారికి ఉంటుంది. అందుకే అప్పటి వరకు తిట్టిన వాలి కూడా రాముడు మాట్లాడడం ప్రారంభించినంతనే మౌనంగా ఉండి విన్నాడు. తప్పయిందని వేడుకున్నాడు), నవమి తిథిలో (నిర్భయ స్సర్వ భూతేఖ్యో నవమ్యా ముపజాయతే- శత్రువుక్కూడా భయపడకుండా మాట్లాడేతనం నవమినాడు జన్మించిన వారికి ఉంటుంది), పునర్వసు నక్షత్రంలో (ఇది ధనుస్సు ఆకారంలో 5 నక్షత్రాల కూడికతో ఉంటుంది కాబట్టి తనది ధర్మమా? కాదా? అనే అంశాన్ని తనకి తాను తన బాణ ప్రయోగం ద్వారా తెలుసుకుంటాడు ఈ జాతకుడు. అందుకే రాముడు నిత్య ధనుర్ధారి. (ధనువంటే విల్లు కాదు, ధర్మం అని అర్థం). ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా తనని తాను రామునిగా పుట్టించుకోవాలనుకున్నాడు శ్రీహరి. ఆ ప్రణాళికనే అమలు చేస్తూ అలానే జన్మించాడు కూడా! కల్యాణం, పట్టాభిషేకం ఇలాంటి ముహూర్తంలో పుడితే తప్ప ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో పుట్టిన సీతమ్మ తనకి భార్య కాదు. ఆమె భార్యగా కాని పక్షంలో సీతాపహరణ ఘట్టం ఉండదు. ఆ ఘట్టమే లేని సందర్భంలో శ్రీమద్రామాయణ కథే లేదు. అంతటి ప్రణాళికతో తాను పుట్టి ఉండబట్టే 12వ నెలలో పుట్టిన తనకి, సరిగ్గా 12 సంవత్సరాల వయసులో తన వద్దకు విశ్వామిత్రుడు వచ్చి 12 మాసాల పర్యంతం రాముణ్ణి తన వెంట తిప్పుకున్నాక, 12 రోజుల వ్యవధిలో శివధనుర్భంగం, వివాహానికి తరలివెళ్లడం, వివాహం ముగించుకోవడం అనే ఈ కథంతా సవ్యంగా జరిగింది. అంతేకాదు, ఈ కథని గ్రంథస్థం చేసిన వాల్మీకి మహర్షి కూడా 2 ్ఠ 12 కోట్ల మార్లు చేసిన రామనామ జపాన్ని ముగించడం కూడా సశాస్త్రీయంగా జరిగింది. అలాగే ఆ సీతారాముల జంట సరిగ్గా 12 సంవత్సరాల పాటు కాపురం చేసిందో లేదో రాజ్యపట్టాభిషేక ఘట్టం ప్రారంభమయింది. సరిగ్గా 12 గంటల వ్యవధిలో పట్టాభిషేకం భంగమై అరణ్యాలకు వెళ్లవలసి వచ్చింది. (ఉషిత్వా ద్వాదశ సమాః). సరిగ్గా 12 నెలల కాలం పాటు అరణ్యంలో సీతారామలక్ష్మణులు తిరిగారో లేదో రావణుని వధకు అవసరమైన తపోశక్తి కోసం రాముడు మహర్షుల ఆశ్రమాలకు వెళ్లి మరీ ప్రార్థించాడు. వారంతా తపోఫలాన్ని ధారపోస్తే అప్పుడు శూర్పణఖ వచ్చింది... ఆనాటి రాముని పుట్టుకకు పెట్టిన ముహూర్త బలానికి అనుగుణంగా! అంతే, 12 గడియల కాలంలో రామునితో శూర్పణఖ విరోధాన్ని ఏర్పాటు చేసుకుంది. రావణుని వద్దకు వెళ్లింది. అలా కథని నడిపింది. ఖర దూషణ త్రి శిరాది రాక్షసులతో పాటు 14 వేల మందిని వధించే ఏర్పాటు చేసింది. అదికూడా 12 గడియల కాలంలోనే. అదొక్కటే కాదు, రామ విరోధాన్ని రావణునికి కలిగించి రామునితో యుద్ధం చేయాలనే బుద్ధిని కూడా పుట్టించింది. అతడే శ్రీహరి! రాముడు మానవుడు కాదు కాబట్టే 10 వ నెలలో కాక, 12వ నెలలో జన్మించాడు. ఈ జన్మించడం అనేది ఓ సూచన అన్నమాట... ఇతడు శ్రీహరే సుమా! అని. అందుకే వివాహం కూడా ఆ పుట్టిన తిథి నాటి 12 గంటల వేళకే ఏర్పాటు చేశాడు వశిష్ఠుడు. దీన్ని గ్రహించిన మరో దైవజ్ఞుడు అహల్యాగౌతమ పుత్రుడు శతానందుడు జనకుణ్ణి దీవిస్తూ - నీ జన్మ ధన్యం అన్నాడు. లోకంలో సాధారణులమైన మనం ఎన్నో విధాల ఏర్పాట్లను చేసుకుని సక్రమంగా అమలు చేసుకోలేకపోతుంటాం. ఇన్ని సమాచార వ్యవస్థలుండీ సక్రమ కార్యాచరణని మనం చేసుకోలేకపోతూంటే, కేవలం తపశ్శక్తిని మాత్రమే సమాచార వ్యవస్థగా చేసుకుని వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, శతానందుడు, భరద్వాజుడు అటు రావణునితో సహా అందరూ కూడా కథని నడిపించగలిగారంటే ఆ ప్రణాళికా రచనం అత్యద్భుతం కాదూ! ఈ ముహూర్తపు గొప్పతనాన్ని గ్రహించిన భరతుడు కూడా రామునితో... 14 సంవత్సరాలు ముగిసిన మర్నాడు అయోధ్య నగరానికి నువ్వు రాని పక్షంలో ఇక్కడే ప్రాతఃకాల సూర్య సమక్షంలో అగ్నికాహుతినౌతా’నన్నాడు. (యది త్వాంతు న ద్రక్ష్యామి ప్రవేక్ష్యామి హుతాశనమ్). ఇంతటి పట్టాభిషిక్తుడైన రాముడు కూడా వైకుంఠానికి వె ళ్లాల్సి ఉంది కాబట్టే 11 వేల సంవత్సరాలే పరిపాలించి 12 వేల సంవత్సరం ప్రారంభం కాకుండానే రాజ్యాన్ని ముగించి సరయూ నదిలో ప్రవేశం చేశాడు. ద్వాదశ నామాలు (హనుమానంజనా సూను... ద్వాదశైతాని నామాని) తనవైన ఆంజనేయుడు మాత్రం రామకథా వ్యాప్తికి ఇక్కడే ఉండిపోయాడు చిరంజీవిగా. ఇంత ప్రణాళికాబద్ధమైన, అంతటి ముహూర్త గొప్పదనం కల చైత్రే శుద్ధ నవమిని వివరించాలంటే కొంత జ్యోతిషబలం కూడా ఉండాలి. - డా॥మైలవరపు శ్రీనివాసరావు -
వారాంతపు ప్రణయం
ఆదిత్, సుప్రియ శైలజ జంటగా నాగు గవర దర్శకత్వంలో మధు నిర్మిస్తోన్న చిత్రం ‘వీకెండ్ లవ్’. ఒక్క పాట మినహా సినిమా పూర్తయిందని, కేరళలో ఆ పాట చిత్రీకరిస్తామని నిర్మాత తెలిపారు. దివంగత నటుడు శ్రీహరి ప్రోత్సాహంతో ఈ సినిమా మొదలు పెట్టామని దర్శకుడు పేర్కొన్నారు. -
వీకెండ్ మూవీ ప్రెస్ మీట్
-
చుక్కల్లోకెక్కినారు
-
'ఇష్టసఖి' మూవీ స్పైసీ స్టిల్స్.
-
పిల్లలు లేకపోతే నేను కూడా బావతోపాటు...
ఆ రోజు సందర్భం వేరు. దాదాపు ఐదేళ్ల క్రితం... 2009 ఫిబ్రవరి 12.... వాలెంటైన్స్ డేకి రెండురోజుల ముందు నేను... రియల్‌హీరో శ్రీహరి ఇంటర్వ్యూ కోసం వెళ్లినప్పుడు.. ఆయనతో పాటు ఆయన భార్య శాంతి కూడా... రియల్ స్టార్లా అనిపించారు! ఈ రోజు సందర్భం వేరు. శ్రీహరి లేరు. కానీ ఆయన భార్య రియల్ లైఫ్ హీరోలా వాస్తవ జీవితంతో పోరాడుతూ కనిపించారు! ఆ రోజు సరదాగా శ్రీహరి... ‘‘నన్ను ఒక్క పూట వదలవే, కోటి రూపాయలిస్తా’’ అన్నారు. ఈ రోజు శాంతి... కోట్లు ఖర్చుపెట్టయినా బతికించుకుంటానని కన్నీళ్లతో ఎంత వేడుకున్నా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు శ్రీహరి! ఆ రోజు శాంతి... ‘శ్రీహరిని విడిచి ఒక్కపూటైనా ఉండలేను’ అన్నారు. ఈరోజు దేవుడు శాంతిని ఒంటరిని చేసి... జ్ఞాపకాలను మాత్రమే తోడుగా మిగిల్చాడు. ఆ రోజు శాంతి... ‘‘నాకు కారే అక్కర్లేదు బావా... సైకిల్ మీద తీసుకెళ్లినా నీతోపాటు వచ్చేస్తా’’ అన్నారు. ఈ రోజు... శ్రీహరితో కలిసి నడిచే భాగ్యాన్ని కూడా కోల్పోయారు. ఆ రోజు శ్రీహరి... ‘‘పెళ్లి కాకముందు పదమూడేళ్లలో... రెండు మూడు జీవితాలు చూసింది శాంతి’’ అన్నారు. ఈ రోజు శాంతి... భర్త పోయాక ఇంకెన్ని జీవితాలను చూడాల్సి వస్తుందో అనిపించింది. ఆ రోజు శాంతి... ‘‘బావ లేకుండా బతకలేను’’ అన్నారు. ఈ రోజు... బావ ఇంకా బతికే ఉన్నాడన్న భ్రాంతిలో బతుకుతున్నారు. ఎవరి జీవితంలోనైనా ఇంత వైరుధ్యం ఉంటుందా? శాంతి జీవితంలో ఉంది. చదవండి... ఈవారం ‘తారాంతరంగం’లో... - ఇందిర పరిమి, ఫీచర్స్ ఎడిటర్ ఇందిర: 9 అక్టోబర్... అసలు ఆరోజు ఏం జరిగింది? శాంతి: ప్రభుదేవా సినిమా షూటింగ్కోసమని ముంబై వెళ్లాం. ముందురోజు రాత్రి హైదరాబాద్ చేరుకోవాల్సిన వాళ్లం కానీ, ఏదో సాంగ్ సీక్వెన్స్ ఉందని ప్రభుదేవా రిక్వెస్ట్ చేయడంతో ముంబైలోనే ఉండిపోయాం. బావకి ముందురోజు కాస్త జ్వరం ఉన్నా, ఆరోజు బాగానే ఉన్నాడు. రోజూ పాలు, బ్రెడ్ తీసుకునేవాడు, ఆరోజు టీ తెప్పించమని చెప్పి, బెడ్ మీదే కూర్చుని తాగాడు. తర్వాత కాళ్లు లాగుతున్నాయని, నాతో కాళ్లు నొక్కించుకుని కాసేపు పడుకున్నాడు. ఉదయం 8.30 టైంలో అనుకుంటా... తనకిష్టమైన ఉడిపి హోటల్ నుంచి ఇష్టంగా తినే ఊతప్పం తెప్పించాను. కానీ, ‘నాకు తినాలని లేదు, నువ్వు తినెయ్’ అన్నాడు. తను తినందే ఏరోజూ ముందు తినే అలవాటు లేని నేను, ముందురోజు తినకపోవడంతో ఆకలిగా ఉందని, తిందామని కూర్చున్నాను. ఇంతలో బావ మళ్లీ పిలిచి, ఛాతీలో మంటగా ఉందన్నాడు. హోటల్ వాళ్లనడిగి, వెంటనే డాక్టర్ని పిలిపించాను. ‘పల్స్ తక్కువగా ఉంది, హాస్పిటల్‌కు తీసుకెళ్లడం మంచిది’ అన్నారు డాక్టర్. ‘బట్టలు మార్చుకుని వెళ్దాం’ అనే లోపలే బావ గబగబా బయటికెళ్లిపోయాడు. నేను కిందికి వచ్చేలోపలే తనతోపాటు ఉన్న మనుషులను తీసుకుని హాస్పిటల్‌కు వెళ్లిపోయాడు. ‘ఏంటి బావా అలా వెళ్లిపోయావు?’ అని ఫోన్ చేసి అడగ్గానే ‘కంగారేం లేదు... పక్కనే ఉన్న హాస్పిటల్‌కు వెళ్లి ఇంజక్షన్ తీసుకుని అరగంటలో వచ్చేస్తా’ అన్నాడు. కానీ నాకు కంగారు తగ్గక, ప్రతి 10 నిమిషాలకు కాల్ చేస్తూనే ఉన్నా. చివరికి బావ ‘నైట్ షూటింగ్... నిద్దర లేదు... లొల్లి చేయకుండా కాసేపు నన్ను రెస్ట్ తీసుకోనీవే’ అని విసుక్కుని ఫోన్ పెట్టేశాడు. కాసేపటి తర్వాత మళ్లీ కాల్ చేస్తే తెలిసింది... బావని హాస్పిటల్లో అడ్మిట్ చేశారని! అది తెలియగానే నా గుండె ఆగిపోయినట్టయింది! వెంటనే బండి పంపమని చెప్పి, 10.45 కల్లా హాస్పిటల్‌కు చేరుకున్నాను. ఎమర్జన్సీ వార్డ్... బావను చూడగానే ఏడవడం మొదలెట్టాను. ‘ఏమీ లేదు, పల్స్ తక్కువ ఉంది. గ్లూకోజ్‌తోపాటు ఏదో మందు ఎక్కిస్తానన్నారు. అది తీసుకోగానే వెళ్లిపోదాం... నాకేం కాదు, ఏడవకు’ అన్నాడు బావ. తర్వాత చీఫ్ డాక్టర్ వచ్చాడు. ‘మేజర్‌గా ఏమీ లేదు’ అంటూ ఏదో చెప్పి వెళ్లిపోయారు కానీ నాకు విషయం పెద్దగా అర్థం కాలేదు. సెలైన్ ఎక్కిస్తుండగా బావ, నేనూ ఎప్పటిలానే మాట్లాడుకున్నాం. అయితే ఉన్నట్టుండి బావ నాలుక మడత పడడం మొదలైంది. ‘ఏ మైంది బావా’ అంటుండగానే కళ్లు మూతలు పడడం మొదలైంది. డ్యూటీ డాక్టర్ని, నర్సుల్ని గట్టిగా పిలిచాను. వెంటనే ఏవో ఇంజక్షన్లు ఇస్తూ, కాసేపు నన్ను బయటికి పొమ్మన్నారు. నేనలా పోతుండగా బావ ‘వీళ్లిలా గుచ్చేస్తున్నారు... ఏం చేస్తున్నావ్... రావే’ అని గట్టిగా అరిచాడు. అయినా హాస్పిటల్ వాళ్లు నన్ను అక్కడ ఉండనీయకుండా బైటికి పంపించడంతో ఏమీ చేయలేక వెళ్లిపోయాను. బయటికొచ్చి ఫోన్లు చేయడం మొదలెట్టాను... ముందు హైదరాబాద్‌లో ఉన్న ఫ్యామిలీ డాక్టర్ సంజీవ్‌కి, శ్రీనివాస్ అన్నకి (బావ వాళ్ల అన్న)! ఇద్దర్నీ వెంటనే ముంబై బయల్దేరి రమ్మని చెప్పి, మళ్లీ బావ దగ్గరికి వచ్చాను. (బోరున ఏడుస్తూ..) మా ఇద్దరి ప్రేమా మా ఇద్దరికే తెలుసు... మనిషి నిస్తేజంగా అలా పడుకుని ఉన్నాడనే కానీ, తన చూపు మాత్రం నావైపే! ఏం జరుగుతోందో తెలియని అయోమయంలో పిచ్చిదానిలా ఏడుస్తూ కూర్చున్నాను... ఇంతలో బావ నోట్లోంచి ఉన్నట్టుండి రక్తం రావడం మొదలైంది. బావకు తలనొప్పి వస్తేనే తట్టుకోలేని నేను, అంతలా రక్తం రావడంతో గట్టిగా అరవడం మొదలెట్టాను. వెంటనే నన్ను వార్డు నుంచి బయటికి పంపించబోయారు హాస్పిటల్ స్టాఫ్! ‘నాకు ఇక్కడ ఏం జరుగుతోందో చెప్పండి’ అని అడగడంతో, ‘అది తర్వాత... మీరిక్కడుంటే ట్రీట్మెంట్ ఇవ్వలేం’ అంటూ నన్ను బయటికి పంపించేశారు. చేసేదేంలేక పిల్లలకు ఫోన్ చేసి, ‘అప్పకి బాలేదు. వెంటనే వచ్చేయండి’ అని చెప్పి మళ్లీ లోపలికి వచ్చేంతలో డాక్టర్ ‘హి ఈజ్ నో మోర్’ అని చెప్పారు! ‘ఇంతలో ఇంత ఘోరమా?’ అని ఒకవైపు... అస్సలు నమ్మకం కలగకపోవడం మరోవైపు! సాయంత్రం 7.30 టైంలో అనుకుంటా పిల్లలు వచ్చారు... 9.30 దాకా బావ చేయి పట్టుకుని అక్కడే కూర్చున్నా. మర్నాడు పొద్దున బావని తీసుకుని హైదరాబాద్‌కి వచ్చాం. ఇందిర: గత సంవత్సరంగా ఆయన సన్నగా, బలహీనంగా కనిపించారు... అసలు ప్రాబ్లమేంటి? శాంతి: కొన్నాళ్ల క్రితం ఆయనకు షుగర్ వచ్చింది. దానికితోడు లివర్ ప్రాబ్లమ్ కూడా రావడంతో మనిషి సన్నబడిపోయాడు. అయితే వాటన్నిటినీ తక్కువ కాలంలోనే కంట్రోల్‌కి తెచ్చుకున్నాడు. సంవత్సరంగా అయితే తాగడం పూర్తిగా మానేశాడు. మనిషి సన్నబడ్డాడనే గానీ, హెల్త్ పర్ఫెక్ట్గా ఉండింది. చివరి వరకు ఆరోగ్యంగానే ఉన్నాడు. ఇందిర: మీరు కూడా అంత ఆరోగ్యంగా కనిపించట్లేదు... చాలా సన్నబడిపోయారు! శాంతి: నిజమే... 18 కేజీలు తగ్గాను! ఏం చేయను? బావ లేకుండా... తిండి ఎక్కట్లేదు... మనుషుల్ని కలవాలనిపించట్లేదు... బయటికి పోవాలనిపించట్లేదు... ఏమీ చేయాలనిపించట్లేదు... ఏం చేయను? ఇందిర: ఇలాంటి పరిస్థితి ఆకస్మికంగా సంభవించినప్పుడు మనం నమ్మకపోవడం నుంచి అపనమ్మకంలో బతుకుతుంటాం... శాంతి: నాకైతే బావ చనిపోయినట్లేలేదు! షూటింగ్‌కి వెళ్లాడు... ఏడింటికల్లా తిరిగొస్తాడు, బావకోసం వంట చేయాలి... అనే ఆలోచనలతోనే బతుకుతున్నాను. మీకో విషయం తెలుసా.. పిల్లలకు ఇష్టమున్నా లేకున్నా, రోజూ నేను బావకు ఇష్టమైన వంటలే చేస్తుంటా. మూడుపూటలా బావకి (ఫోటో దగ్గర) పెడుతుంటా! ఇందిర: ఒక మనిషి గొప్పతనం పోయిన తర్వాత కానీ తెలీదంటారు. మీ బావ గురించి మీకు తెలీదని కాదు... శాంతి: యస్... యస్... యస్... బావ పోయిన రోజు నేను చూసిన అభిమానం అంతా ఇంతా కాదు. అభిమానులు, నచ్చినవాళ్లు, బంధువులు, స్నేహితులు... ఒకరుకాదు ఆరోజు వచ్చింది! బావ నిజంగా చాలా అదృష్టవంతుడు! అయితే ఇంత మంచి వ్యక్తిని 47 ఏళ్లకే దేవుడలా తీసుకెళ్లిపోవడం చాలా అన్యాయం! ఇందిర: మీరు ఆరోజు అంత నిబ్బరంగా వుండడం చాలా ఆశ్చర్యపరిచింది... శాంతి: ఎందుకంటే... ఆరోజు నాకసలు బావ చనిపోయిన ఫీలింగే లేదు! బతికున్నారని, లేస్తారనే అనిపించింది! పొలంలో పాప పక్కన పెట్టినప్పుడు కూడా బావ లేచి వస్తాడని, మట్టి వేయొద్దని అన్నాను. (ఏడుస్తూ) ఇద్దరు పిల్లలు లేకపోతే ఆరోజు నేను కూడా బావతోపాటు లోపల పడిపోయేదాన్ని! వాళ్లిద్దరికోసమే... బతకడం! ఇందిర: ఆయన మరణం ఆకస్మికంగా జరిగింది... మీకేదైనా జరిగితే పిల్లల సంగతేంటని ఎప్పుడైనా ఆలోచించారా? శాంతి: బావకు ప్లానింగ్ చేసే టైం లేకపోయింది. పైగా తను చావు గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ, ఇప్పుడు నా పరిస్థితి అలా కాదు... కచ్చితంగా ఆలోచిస్తున్నాను. వాళ్లు ఎదిగి వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేదాకా జాగ్రత్తగా ఉంటా! వాళ్లకోసం ప్లానింగ్ చేయాల్సింది చాలా ఉందని తెలుసు. అందుకే ఇప్పటినుంచే మొదలెట్టాను. నాకేదైనా అయినా నా పిల్లల జీవితాలే కాదు, మనవలు, మనవరాళ్ల జీవితాలు కూడా సాఫీగా గడిచిపోయేలా ప్లాన్ చేస్తున్నాను. ఇందిర: పిల్లలు ఉన్నట్టుండి మెచ్యూర్డ్గానో, బాధ్యతగానో అయినట్టు ఏమైనా అనిపించిందా? శాంతి: పెద్దోడు చాలా అండర్స్టాండింగ్! సందర్భాన్ని బట్టి... ఓదారుస్తాడు, నవ్విస్తాడు! చిన్నవాడికి ఇంకా అంత తెలీదు. కానీ వాడు కూడా ఇప్పుడిప్పుడు... తిన్నానా లేదా? నిద్రపోయానా లేదా? అని కనుక్కుంటుంటాడు. నేను తినకపోతే ఒక్కోసారి పిల్లలు కూడా తినరు. అలానే నిద్రపోతారు. అప్పుడు మాత్రం బాధనిపిస్తుంది. అందుకే మర్నాడు వాళ్లకోసమైనా తింటుంటాను. నేను పైకి బెడ్రూంలోకి వెళ్లకపోతే, రాత్రి ఒంటిగంటైనా, రెండయినా వాళ్లు కూడా నాతోపాటే కూర్చుంటారు. అప్పుడప్పుడు బెడ్రూం తలుపు తీసి చూసి, నేను పడుకున్నాను అనుకున్నాక పడుకుంటారు. నేను ఎప్పుడూ ఏడుస్తుంటాననో ఏమో కానీ, నా ముందు ఒక్కసారి కూడా వాళ్లు కంట నీరు పెట్టలేదు. దే కేర్ ఫర్ మి సోమచ్! అయామ్ వెరీ లక్కీ దట్ వే! ఇందిర: ఇప్పుడు పరిస్థితి ఇంతకుముందులా కాదుకదా! జీవితానికి సంబంధించి ఏమైనా నేర్పిస్తున్నారా? శాంతి: యాజ్ సచ్... పిల్లలు చాలా మెచ్యూర్డ్ అండ్ స్మార్ట్! దే కెన్ లుక్ ఆప్టర్ దెమ్సెల్వ్స్ వెల్! దానికితోడు ఇప్పుడిప్పుడు నేను ఇంటి ఖర్చులన్నీ పెద్దోడి చేతుల మీదుగా చేయిస్తున్నాను... డబ్బు విలువ తెలియాలని! ఉల్లిపాయ రేట్ల నుంచీ బియ్యం రేట్ల దాకా అన్నీ చెప్తున్నాను. ఒకవైపు బాధ్యత నేర్పుతూనే, బావ లేని లోటు లేకుండా వాళ్లను ‘శ్రీహరి పిల్లలు’గానే పెంచుతున్నాను! వాళ్లకోసం ఎంతయినా కష్టపడతాను! ఇందిర: పిల్లలు ఏం కావాలని ఆయనకుండేది? శాంతి: ఇద్దరూ ఆయనలా ఇండస్ట్రీలోకి రావాలని! నాకు మాత్రం వాళ్లు చదువుకోవాలని! ఇక పిల్లల విషయానికి వస్తే... పెద్దవాడికి డెరైక్టర్ అవ్వాలని (ఇప్పటికే షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నాడు), చిన్నోడికి యాక్టర్ అవ్వాలని (చైల్డ్ యాక్టర్‌గా చేశాడు అవార్డు కూడా వచ్చింది)! బావ కలగన్నదీ, పిల్లలకు నచ్చింది నెరవేర్చడం నా బాధ్యత... అయితే, ఇద్దరు పిల్లలూ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాకే! ఇందిర: అసలు ఆయనకి ఫ్యూచర్ ప్లాన్స్ ఏముండేవి? శాంతి: బావకు ఎప్పుడూ జనాలతో ఉండాలని, వాళ్లకు చేతనైనంత సాయం చేయాలని, అందుకోసం మినిస్టర్ అవ్వాలని కోరిక ఉండేది. 2009లో రాజకీయాల్లోకి వెళ్లే అవకాశం వచ్చినా రెండు పడవల మీద కాళ్లు పెట్టొద్దని నేనే తనను వెనక్కి లాగా! ఫ్యామిలీ పరంగా చూస్తే పిల్లలు చిన్నవాళ్లు, నేనూ తనను చూడకుండా ఉండలేను... పైగా తన కెరీర్ కూడా అప్పుడు చాలా బాగుంది. ఇటు ఇండస్ట్రీపరంగా చూసినా, తను రాజకీయాల్లోకి వెళ్తే ప్రొడ్యూసర్లు ఇబ్బందులు పడతారని ససేమిరా అన్నాను. అందుకే తను 2014 కల్లా అన్ని కమిట్మెంట్లు పూర్తిచేసుకుని, పూర్తిగా రాజకీయాల్లోకి వస్తానన్నాడు. కానీ, ఆ కోరిక తీరకుండానే వెళ్లిపోయాడు. అందుకే అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది... బావకోసమైనా నేను రాజకీయాల్లోకి రావాలని, తను ప్రజలకు చేయాలనుకున్న మంచి నేను చేయాలని! ఇందిర: ఈ రెండున్నర నెలల్లో ... ‘అసలు మనుషులు ఇలా ఉంటారా?’ అని అనిపించిన సందర్భాలున్నాయా? శాంతి: నాకు ముందే తెలుసు... మనుషులు ‘ఇలానే’ ఉంటారని! నాకేదీ షాకింగ్ కాదు. ఎందుకంటే, జీవితంలో ఢక్కామొక్కిలు తిని వచ్చినదాన్ని! అప్ప (నాన్న ఆనందన్ - తమిళ్లో పెద్ద యాక్టర్) బతికి ఉండగానే అప్స్ అండ్ డౌన్స్ చూసినదాన్ని! ఇక నాన్న పోయాక చెప్పనక్కర్లేదు! ఒక్క జీవితంలో ఎన్నో జీవితాల్ని చూసినదాన్ని కాబట్టి ఈరోజు ఎలాగైనా బతకగలుగుతున్నాను. అయితే, మనుషులం కదా... చిన్న ఆశ ఉంటుంది. ఇన్నాళ్లు నన్ను అక్క, చెల్లి, అమ్మ, వదిన అని పిలిచినవాళ్లు, బావకు అతిదగ్గరగా ఉన్న కొందరు ఈరోజు అసలు కనిపించకపోవడంతో, ఆ ఆప్యాయతను మిస్సవుతున్నాను. అదొక్కటే కొంచెం బాధనిపిస్తుంది. ఎందుకంటే, నేనే కాదు... నా పిల్లలకు కూడా వాళ్లు చాలా క్లోజ్. అయినా మేం కోరుకునేదేంటని? కాస్తంత ఓదార్పు... మాటసాయం! అది కూడా వాళ్లకు అంత కష్టంగా ఉంటే మనమేం చేయగలం! ఇందిర: ఎందుకంటారు? శాంతి: (నిర్వేదంగా నవ్వుతూ) నా దగ్గర డబ్బు లేదు... నేనేమైనా అడుగుతాననుకుంటున్నారేమో! వాళ్లకు తెలీదు... నేను చచ్చేంతవరకు నా చేయి పైన ఉండాల్సిందే కాని, కింద ఉండదని! చిన్నప్పుడు అంత కష్టంలో ఉన్నప్పుడే ఒకరి దగ్గర చేయి చాచలేదు... ఇప్పుడు చేస్తానా! అవసరమైతే తిరిగి సినిమా ఇండస్ట్రీలోకి వస్తా... సినిమాలు పొడ్యూస్ చేస్తా... సీరియల్స్ తీస్తా... ఏదైనా చేస్తాను, ఎంతైనా కష్టపడతాను కానీ, ఒకరి నుంచి ఆశించను! ఇందిర: రివర్స్‌లో... మీ దగ్గరికి డబ్బుకోసం (సాయం) వచ్చినవాళ్లు, డబ్బు ఇవ్వాలని (అప్పులు) వచ్చినవాళ్లు ఉన్నారా? శాంతి: ఉన్నారు. సాయంకోసం వచ్చిన ఎవ్వరినీ బావ కాదనేవాడు కాదు. నమ్ముతారో లేదో ‘మన దగ్గర 10 వేలే ఉన్నాయి బావా’ అన్న రోజున కూడా ‘ఇచ్చెయ్వే... వాళ్లేదో కష్టంలో ఉన్నారు’ అని ఇచ్చేసేవాడు. అటువంటి మనిషి బావ! తనలా నేనెప్పటికీ చేయలేను... అయితే ఇప్పటికీ కుదిరినంత చేస్తున్నాను. ఇక డబ్బులు ఇవ్వాలని వచ్చినవాళ్ల గురించి అంటారా... సరైన డాక్యుమెంట్లు, ప్రూఫ్‌లు చూపిస్తే తప్ప ఇవ్వనని కరాఖండిగా చెప్పేస్తున్నాను. లేకపోతే ప్రతివాళ్లూ మోసం చేస్తారు. ఇందిర: ఆయన ఉండగా ఇల్లంతా సందడిగా, హడావిడిగా ఉండేదేమో కదా? ఇప్పుడు..? మీ సంగతి? శాంతి: బావను తలుచుకుంటూ, గతాన్ని గుర్తుచేసుకుంటూ ఇంట్లోనే కూర్చుంటా. రోజుకో గంటసేపు మాత్రం బావ సమాధి దగ్గర కూర్చుని వస్తా. సాయంత్రం పిల్లలు ఇంటికొచ్చాక, వాళ్లకి కావలసినవి చూసుకుని, ఓ గంటసేపు నిద్రపోతా... ఎందుకంటే, నాకు రాత్రిపూట నిద్రపట్టడం లేదు. బాగా దగ్గరివాళ్లను తప్ప ఎవ్వర్నీ పెద్దగా కలవాలని కూడా ఉండట్లేదు. ఓ వారం నుంచే కాస్తంత బయటికెళ్తున్నా. రికవర్ కావడానికి, దీన్నుంచి బైటికి రావడానికి ట్రై చేస్తున్నాను. ఇందిర: ‘మళ్లీ తెల్లారుతోందా?’ అని భయపడిన సందర్భాలున్నాయా? శాంతి: (నిర్లిప్తంగా) అసలు నిద్రపోతేగా! ఇందిర: బావ విషయంలో బాగా మిస్సయ్యే క్షణాలు..? శాంతి: భోజనం టైం! తను తిని లేచాక కబుర్లు చెబుతూ అదే ప్లేట్లో భోంచేయడం! అది అలవాటయ్యే ఇప్పుడు ఏమీ తినాలనిపించట్లేదు! ఇందిర: మీరు ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుకున్నారు... ఆయన మిమ్మల్ని కనుపాపలా చూసుకున్నారు. ఇద్దరిలో ఎవరు అదృష్టవంతులంటారు? శాంతి: (నవ్వుతూ) నేను ఆయన్ని అనేదాన్ని... ఆయన నన్ను అనేవారు! అది పక్కనపెడితే ఇప్పుడూ, ఎప్పుడూ నేను ఒక్కటే అంటాను... అలాంటి భర్త దొరకడం నా అదృష్టమని! ఎందుకంటే - ఆయన ఒక ట్రెడిషనల్‌గా ఉండే చదువుకున్న అమ్మాయిని చేసుకోలేదు... ఒక ఆర్టిస్ట్‌ని, అందులోనూ గ్లామర్ ఆర్టిస్ట్‌గా ఉన్న నన్ను పెళ్లి చేసుకుని, ఇంతగా నెత్తినపెట్టుకుని చూసుకున్నాడు. అందుకే ఏ జన్మయినా నాకు ఆయనే భర్తగా కావాలనుకుంటున్నాను! ఇందిర: గతంలో డిసెంబర్ 31 అంటే ఎలా ఉండేది? ఈ సంవత్సరం..? శాంతి: ప్రతి ఏడాది డిసెంబర్ 31న ఇంట్లో విపరీతమైన సందడి! ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చేవారు. బయట ఈయన ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తుంటే, నేను వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్‌తో సరదాగా గడిపేదాన్ని! ఈ సంవత్సరం ముగ్గురం (నేను, పిల్లలు) బావ సమాధి దగ్గర గడుపుతాం! మొదట్లో బావ యాక్టింగ్ నాకు నచ్చేది కాదు మొదట్లో ఈయన యాక్టింగ్ నాకు అసలు నచ్చేది కాదు. ‘నీకసలు యాక్టింగ్ రాదు... ఎలా యాక్టర్‌వి అయ్యావు బావా’ అని ఎప్పుడూ ఏడిపించేదాన్ని! కాని ‘సాంబయ్య’, ‘అయోధ్య రాముడు’ చూశాక మాత్రం ‘చాలా బాగా యాక్ట్ చేశావు బావా’ అని మెచ్చుకున్నా! నా అభిప్రాయానికి చాలా విలువ ఇచ్చేవాడు బావ! ప్రివ్యూ అవగానే నా వంకే చూసేవాడు... ఏమంటానా అని! నిర్మొహమాటంగా అభిప్రాయం చెప్పేదాన్ని... తన యాక్టింగ్ గురించే కాదు, మొత్తం సినిమా గురించి! అందుకే మొదట్లో ప్రివ్యూకి తీసుకువెళ్ళేవాడు కాస్తా తరువాత తరువాత ఫస్ట్ కాపీకి తీసుకెళ్లడం మొదలు పెట్టాడు. ‘ఇక్కడ ఇక్కడ ఈ తప్పులు ఉన్నాయి.... ఈ షాట్స్ మార్చాలి’ అని చెబితే మార్పించేవాడు. బావ ఎప్పుడూ అనేవాడు - ‘నీ నాలుక మీద నల్లమచ్చలు ఉన్నాయి... నువ్వు ఏమి చెబితే అదే జరుగుతుంది’ అని! నిజంగానే అన్నట్టే జరిగేది... సినిమా రిజల్ట్! ఆయన భార్యగా నేనెప్పుడూ ఆయన్ని హీరోగా చూడడానికే ఇష్టపడేదాన్ని. అందుకే క్యారెక్టర్ రోల్స్‌కి షిఫ్ట్ అవుతానన్నప్పుడు వద్దని గొడవ చేశాను. కానీ వాటిలో తన యాక్టింగ్ చూశాక మాత్రం గర్వంగా ఫీలయ్యాను... ముఖ్యంగా ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఢీ, మగధీర...’లలో... హీరోలకు సమానంగా తననీ గుర్తుంచుకునేలా యాక్ట్ చేశాడు! బావ - నేను 1991... నా కెరియర్ పీక్‌లో ఉంది... ఎంతోమంది ‘ఐ లవ్ యూ’ చెప్పారు కానీ, ఈయన ఒక్కరే నన్ను ‘పెళ్లి చేసుకుంటాను’ అన్నారు. అది నచ్చే, వెంటనే పెళ్లికి ఒప్పుకున్నాను. చెల్లెళ్లు, తమ్ముళ్ల పెళ్లిళ్లు అయితే కానీ పెళ్లి చేసుకోనని చెప్పినా, నాకోసం ఎన్నాళ్లయినా వెయిట్ చేస్తానన్నాడు. 1993లోగా పెళ్లి చేసుకోకపోతే తనకు పెళ్లి యోగం లేదని ఎవరో జాతకం చెప్పడంతో, మా తల్లిదండ్రులు, తోబుట్టువుల సమక్షంలో బయటెవ్వరికీ చెప్పకుండా, అదే సంవత్సరం నన్ను రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. నా తోబుట్టువులందరి పెళ్లిళ్లు అయిపోయాక 1996లో అందరి సమక్షంలో మళ్లీ చేసుకున్నాడు. పెళ్లి తర్వాత నా ఇంటి నుంచి నన్ను కట్టుబట్టలతో తీసుకెళ్లి, తనే అన్నీ (పెళ్లి నగలు, చీరలు, ఫ్లాట్, కారు..) సమకూర్చి, పువ్వుల్లో పెట్టుకుని చూసుకున్నాడు. నాకు కోరికలు చాలా తక్కువ. బావను ఎక్కువ ఏదీ అడిగేదాన్ని కాదు. కానీ నా నోటి నుంచి ‘బాగుంది’ అన్న పదం వచ్చినా సాయంత్రంకల్లా అది ఇంటికి రావలసిందే... కారైనా, నగైనా! అది కూడా సర్ప్రైజ్ చేస్తూ! ఇద్దరం చాలా పొసెసివ్! టీవీలో ఒక అమ్మాయి వైపు ఇంట్రస్ట్‌తో చూసినా నేను ఊరుకునేదాన్ని కాదు. ఎక్కడున్నా ప్రతి పది నిమిషాలకు కాల్ చేసేదాన్ని. బావ కూడా ఏం తక్కువ కాదు... తను లేకుండా నన్ను ఎక్కడికీ ఒంటరిగా వెళ్లనిచ్చేవాడు కాదు. బావకు ఎప్పుడైనా పిల్లలకన్నా నేనే ఎక్కువ. నేనెలా ఉన్నాను... తిన్నానా లేదా? అని ఎప్పుడూ కనుక్కుంటూనే ఉంటాడు... ఆఖరికి పోయే ముందు కూడా! హోటల్ నుంచి హాస్పిటల్‌కు వెళ్తూ రిసెప్షన్లో ఉన్న అబ్బాయితో ‘మేడమ్ గారు బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు... తినమని చెప్పండి’ అని చెప్పి మరీ వెళ్లాడు! ఎప్పుడూ ‘నేనున్నాను... నీకేంటే?’ అనే బావ ఈరోజు నన్ను ఇలా వదిలేసి వెళ్లినందుకు చాలా కోపంగా ఉంది! -
అన్ని భాషల్లోనూ ‘లిపి’ రావాలి
రవ్వా శ్రీహరి =వేడుకగా ‘తిరుమల’ శతజయంతి సదస్సు సాక్షి, కల్చరల్ కరస్పాండెంట్: తిరుమల రామచంద్ర అపూర్వ రచన ‘లిపి : పుట్టుపూర్వోత్తరాలు’ అన్ని భారతీయ భాషాల్లోనూ రావాలని టీటీడీ పబ్లికేషన్స్ పూర్వ ఎడిటర్-ఇన్-చార్జ్ రవ్వా శ్రీహరి అన్నారు. సుప్రసిద్ధ పత్రికా రచయిత, పండితుడు, బహు భాషావేత్త తిరుమల రామచంద్ర శతజయంతి సందర్భంగా సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో సింపోజియం నిర్వహించారు. సాహిత్య అకాడమీ సలహా సంఘం సభ్యుడు ఎన్.గోపి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీహరి ముఖ్య అతిథిగా ప్రసంగించారు. దక్షిణాది భాషలు-ఉత్తరాది భాషలు-సంస్కృతం మాత్రమే తెలిసినవారు తెలుగు భాష పుట్టుపూర్వోత్తరాలు చెప్పలేరన్నారు. సంస్కృతానికి సైతం పూర్వభాష అయిన ప్రాకృతంలో తెలుగు పదాలున్నాయని తిరుమల మాత్రమే చెప్పగలిగారని కొనియాడారు. ‘ప్రాకృత అకాడమీ’ ఎంతో అవసరం సంస్కృతం, ప్రాకృత భాషలు ఒకే పువ్వులోని రెండు రేకలుగా అభివర్ణించే రామచంద్ర, రుగ్వేదంలోని చందోబద్ధ గీతాలు ప్రాకృత భాషవేనని నిరూపించారని ప్రొఫెసర్ చౌడూరి ఉపేంద్రరావు పేర్కొన్నారు. తిరుమల ఆకాంక్ష అయిన ‘ప్రాకృత అకాడమీ’ని, కేంద్ర సాహిత్య అకాడమీకి అనుబంధంగా ఏర్పరచాలని సీనియర్ జర్నలిస్ట్ బండారు శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో చౌడూరి పేర్కొన్నారు. ఆయన ‘తిరుమల రామచంద్ర: పాళి-ప్రాకృత పరిశోధన’ అంశంపై పరిశోధనాపత్రం సమర్పించారు. సూర్యుడు అస్తమిస్తున్నా కిరణాలు ఉన్నతంగానే ఉంటాయన్నట్టు తిరుమల రామచంద్ర ఉన్నతమైన జీవితాన్ని గడిపారని ‘తిరుమల రామచంద్ర-కలం చిత్రాలు’ పరిశోధనా పత్రం సమర్పించిన సీనియర్ జర్నలిస్ట్ ఏబికే ప్రసాద్ అన్నారు. రాజరాజ నరేంద్రుడు కాలాన్ని ‘నన్నయ లిపి’, కాకతీయుల పరిపాలనా కాలాన్ని ‘తిక్కన లిపి’, రెడ్డిరాజుల పరిపాలనా కాలాన్ని ‘శ్రీనాథ లిపి’ అంటారని డాక్టర్ ఎం.నారాయణశర్మ పేర్కొన్నారు. ఈ విషయాలను రామచంద్ర ఆయా కాలాల్లో లిపిలో చోటుచేసుకున్న మార్పులను వివరించారన్నారు. అనంతరం ‘లిపి-పుట్టు పూర్తోత్తరాలు’పై ఆయన పరిశోధన పత్రాన్ని సమర్పించారు. భారత ఉపఖండంలో పర్యటించి దేశీ నాటకలన్నీ చూసి రాసిన పండితుడు తిరుమల రామచంద్ర అని కల్లూరి భాస్కరం కీర్తించారు. గాథా సప్తశతిలో ‘నాటకం’ ఉందని తిరుమల వెల్లడించినట్టు చెప్పారు. అనంతరం ఆయన ‘తిరుమల రామచంద్ర సాహిత్య వ్యాసాలు-పరిశీలన’ అంశంపై పరిశోధన పత్రం సమర్పించారు. తన ఇంటిలోని గుండ్రాయి గురించి అమ్మను-నాయనమ్మను-తాతను అడిగి తెలుసుకున్న విషయాల ద్వారా తెలుగు వారి చరిత్రను చెప్పిన రామచంద్ర, స్వభావరీత్యా ఆధునికుడని ‘హంపి నుంచి హరప్పాదాకా- ఆత్మ కథాంశాలు’పై పరిశోధనా పత్రం సమర్పించిన ఆర్.వి.రామారావు పేర్కొన్నారు. పేదరికం ఆయన వ్రతం.. సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో రోగిగా చేరిన తిరుమల.. పారితోషికం కోసం వీధిదీపం వెలుతురులో పత్రికలకు వ్యాసాలు రాశారని ‘వ్యక్తిగా తిరుమల రామచంద్ర’ అంశంపై పరిశోధనా పత్రం సమర్పించిన జి.చెన్నయ్య పేర్కొన్నారు. ఆయన పేదరికాన్ని వ్రతంగా స్వీకరించారని అభివర్ణించారు. భావాన్ని తెలియజేయాలనే లక్ష్య సాధనకు పదాలు పనిముట్లని ‘పాత్రికేయుల రచనలు-పలుకుబడి’పై పరిశోధనా పత్రం సమర్పించిన టి.ఉడయవర్లు అన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ, బెంగళూరు ఇన్-చార్జ్ ఎస్.పి.మహాలింగేశ్వర్ స్వాగతోపన్యాసం చేసిన ఈ సదస్సులో తిరుమల రామచంద్ర కుటుంబ సభ్యులు, వయోధిక పాత్రికేయ సంఘం కార్యదర్శి కె.లక్ష్మణరావు, నందిరాజు రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కన్నీటిపర్యంతమైన శాంతి
-
‘ఇష్టసఖి’ స్టిల్స్
అజయ్, వరుణ్, శ్రీరామ్, భాస్కర్, అనుస్మృతి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘ఇష్టసఖి’. శ్రీహరి ప్రత్యేక పాత్ర పోషించిన ఈ చిత్రానికి భరత్ పారేపల్లి దర్శకుడు. వింజమూరి మధు నిర్మాత. ఈ నెల 29న సినిమా విడుదల కానుంది. -
యువతరం ఇష్టసఖి
అజయ్, వరుణ్, శ్రీరామ్, భాస్కర్, అనుస్మృతి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘ఇష్టసఖి’. శ్రీహరి ప్రత్యేక పాత్ర పోషించిన ఈ చిత్రానికి భరత్ పారేపల్లి దర్శకుడు. వింజమూరి మధు నిర్మాత. ఈ నెల 29న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విలేకరులకు ప్రదర్శించారు. కాలేజ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా యుత్‌ని ఆకట్టుకుంటుందని, శ్రీహరి తనకోసమే ఇందులో నటించారని, ఆయన లేకపోవడం బాధగా ఉందని దర్శకుడు అన్నారు. చిత్ర బృందంతో పాటు పంపిణీదారుడు గోపాల్, బాలాజీ నాగలింగం, సీతారాం, పైడిబాబు, రవి కూడా పాల్గొన్నారు. -
‘జాబిల్లి కోసం ఆకాశమల్లె’ పాటలు
‘‘శ్రీహరి వల్ల ఎంతో మంది దర్శకులూ నిర్మాతలూ అయ్యారు. మరెందరికో ఆయన జీవితాన్నిచ్చారు. ఆయన నటించిన ఈ సినిమా ఫంక్షన్లో ఆయనే లేకపోవడం బాధగా ఉంది’’ అని తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు. శ్రీహరి కీలకపాత్రలో అనూప్‌తేజ్, స్మితిక ఆచార్య, సిమ్మిదాస్ ముఖ్యతారలుగా రాజ్ నరేంద్ర దర్శకత్వంలో గుగ్గిళ్ల శివప్రసాద్ నిర్మించిన ‘జాబిల్లి కోసం ఆకాశమల్లె’ పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. పాటల సీడీని సాగర్ ఆవిష్కరించారు. పాటల రచయిత కాసర్ల శ్యామ్ ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకునిగా పరిచయమవుతున్నారు. సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుందని అనూప్‌తేజ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో శివబాలాజీ, చేతన్, సందీప్‌కిషన్, నిఖిల్, ఖయ్యూమ్ తదితరులు మాట్లాడారు. -
‘రఫ్’ ఆడించే కుర్రాడు ప్రేమలో పడితే..!
కోపం వస్తే రఫ్ ఆడించే కుర్రాడు ఓ అందమైన అమ్మాయితో ప్రేమలో పడతాడు. ప్రేమ కోసం ఎంతకైనా తెగించే తత్త్వం అతనిది. ఇంతకూ అతని ప్రేమకు అడ్డుపడింది ఎవరు? వారిని అతనేం చేశాడు? ఈ నేపథ్యంలో ఆది హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘రఫ్’. రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయిక. సీహెచ్ సుబ్బారెడ్డి దర్శకత్వంలోశ్రీదేవి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మాధవరం అభిలాష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఆది మాట్లాడుతూ -‘‘నా గత చిత్రాలతో పోలిస్తే మ్యూజికల్‌గా పెద్ద హిట్ అవుతుంది. మణిశర్మ మంచి సంగీతాన్నిచ్చారు’’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఈ సినిమాలో శ్రీహరిది కీలకపాత్ర. ఆయన మీద 23 సీన్లు తీశాం’’ అని తెలిపారు. సినిమా పూర్తి కావచ్చిందని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: సెంథిల్‌కుమార్, అరుణ్‌కుమార్, మాటలు: మరుధూరి రాజా. -
'శివ కేశవ' ప్లాటినం డిస్క్ ఫంక్షన్
శ్రీహరి, జయంత్, గుర్లిన్‌చోప్రా, సంజన, శ్వేతాబసుప్రసాద్, ఖుషీశర్మ ముఖ్య తారలుగా రూపొందుతోన్న చిత్రం ‘శివకేశవ’. ఆర్.వి.సుబ్రమణ్యం దర్శకుడు. నాగరాజు బానూరి (జడ్చర్ల) నిర్మాత. ఈ సినిమా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ఇటీవల జరిగింది. -
‘శివకేశవ్’ చూసి శ్రీహరి చాలా ఆనందపడ్డారు
‘‘శ్రీహరి లేని లోటు తీర్చలేనిది. ఆయన చేతుల మీదగా జరగాల్సిన వేడుక ఇది. అలాంటిది ఆయనకు శ్రద్ధాంజలి ఘటించాల్సి రావడం చాలా బాధగా ఉంది’’ అన్నారు బానూరు నాగరాజు (జడ్చర్ల). ఆర్వీ సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో శ్రీహరి, జయంత్, గుర్లిన్‌చోప్రా, సంజన కాంబినేషన్లో నాగరాజు నిర్మించిన చిత్రం ‘శివకేశవ్’. సోమవారం హైదరాబాద్‌లో ఈ చిత్రం డబుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుక జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘శ్రీహరి నటించిన పోలీస్, సాంబ, భద్రాచలం తదితర చిత్రాల కోవలో ఈ చిత్రం నిలుస్తుంది. ఈ చిత్రం ఫస్ట్ కాపీ చూసి, ఆయన చాలా ఆనందపడ్డారు. అలాంటి శ్రీహరి హఠాన్మరణం కలచివేస్తోంది. ఆయన సహకారం మరవలేనిది. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చెప్పారు. శ్రీహరి కాంబినేషన్లో నటించడం మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అయ్యిందని జయంత్ తెలిపారు. ఈ వేడుకలో కృష్ణభగవాన్, విజయ్‌కుమార్, వేణు-పాల్, చిన్నం పాండు, సంధ్యాజనక్, మధుమణి తదితర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. సముద్ర యూనిట్ సభ్యులకు డబుల్ ప్లాటినమ్ డిస్క్‌లను ప్రదానం చేశారు. -
రీల్ ఆగింది
-
వారం తర్వాత ‘ఆగడు’
మహేష్‌బాబుతో చేయబోయే ‘ఆగడు’ చిత్రంలో రియల్‌స్టార్ శ్రీహరి కోసం ఓ అద్భుతమైన పాత్రను దర్శకుడు శ్రీను వైట్ల డిజైన్ చేశారట. గతంలో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఢీ, కింగ్ చిత్రాల్లో శ్రీహరి పాత్రలు ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరించాయో తెలిసిందే. వాటిని తలదన్నే పాత్రను శ్రీహరికోసం శ్రీను వైట్ల సిద్ధం చేశారట. కానీ దేవుడు మరోలా తలచాడు. శ్రీహరి హఠాన్మరణం చెందకపోతే... మహేష్, శ్రీహరి కలిసి నటించే తొలి సినిమా ‘ఆగడు’ అయ్యేది. ప్రేక్షకులకు కన్నుల పండుగ చేసేది. నిజానికి ‘ఆగడు’ ప్రారంభోత్సవం ఈ నెల 11న గానీ, 14న గానీ నిర్వహించాలని నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర భావించారు. అయితే... శ్రీహరి కన్ను మూయ డంతో ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని ఓ వారానికి పోస్ట్‌పోన్ చేశారని విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం శ్రీహరి స్థానంలో నటించే నటుడి అన్వేషణలో దర్శక, నిర్మాతలు ఉన్నట్లు తెలిసింది. కచ్చితంగా శ్రీహరి స్థాయి నటుణ్ణే ఎంపిక చేయాలనే కృతనిశ్చయంతో దర్శక, నిర్మాతలు ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రంలో తమన్నాను కథానాయికగా ఎంపిక చేసినట్లు తెలిసింది. అదే నిజమైతే... మహేష్, తమన్నా కలిసి నటించే తొలి సినిమా ఇదే అవుతుంది. -
రియల్ స్టోరీ
-
శ్రీహరికి కేన్సర్ లేదు, చనిపోయారంటే నమ్మలేకపోతున్నా: ప్రభుదేవా
టాలీవుడ్ నటుడు శ్రీహరి అకస్మికమరణాన్ని నమ్మలేకపోతున్నానని ప్రముఖ నటుడు, దర్శకుడు ప్రభుదేవా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రెండు రోజుల ముందు కూడా ఆయన షూటింగ్లో పాల్గొన్నారని, ఎలాంటి అనారోగ్యం లేకుండా ఉల్లాసంగా గడిపారని చెప్పారు. బుధవారం ముంబైలో హఠాన్మరణం చెందిన శ్రీహరి.. ప్రభుదేవా దర్శకత్వంలో 'ఆర్.. రాజ్‌కుమార్' సినిమా షూటింగ్ కోసం అక్కడికి వెళ్లారు. 'శ్రీహరి చనిపోయారంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. తెలుగు సినీ పరిశ్రమలో ఆయనకు ఉక్కు మనిషిగా పేరుంది. నేను పనిచేసిన అత్యంత ఆరోగ్యకరమైన, ఫిట్నెస్ ఉన్న నటుల్లో శ్రీహరి ఒకరు. ఆయనకు కేన్సర్ ఉన్నట్టు వచ్చిన వార్తలు అవాస్తవం. ముంబైలో షూటింగ్లో పాల్గొన్నాక ఊహించనివిధంగా అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటు రావడంతో చనిపోయారు' అని ప్రభుదేవా చెప్పారు. ఆయన హైదరాబాద్ వచ్చి శ్రీహరి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. -
అసలేం జరిగింది?
-
షేర్‌ఖాన్ శ్రీహరికి వీడ్కోలు
ఒక అధ్యాయం ముగిసింది.. ‘నిజమైన తార’ సెలవంటూ వెళ్లిపోయింది.. రీల్ లైఫ్‌లోనూ, రియల్ లైఫ్‌లోనూ రియల్‌స్టార్‌గా ఎదిగిన సినీ నటుడు శ్రీహరికి అభిమాన లోకం ఘనంగా వీడ్కోలు పలికింది. ఆయన హఠాన్మరణంతో చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. కడసారి నివాళులర్పించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. శ్రీహరి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పోటెత్తిన అభిమాన కడలి మధ్య గురువారం రాత్రి ఆయన అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. -
శ్రీహరికి కన్నీటి వీడ్కోలు
బాచుపల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు భారీగా హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు సాక్షి, సిటీబ్యూరో: టాలీవుడ్ రియల్ స్టార్ శ్రీహరి అంత్యక్రియలు బాచుపల్లిలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో గురువారం రాత్రి 7.30 గంటలకు నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి మధ్యాహ్నం ప్రారంభమైన అంతిమ యాత్ర రాత్రి 7 గంటలకు ఫామ్ హౌస్‌కు చేరుకుంది. అంతిమ సంస్కారాలను శ్రీహరి పెద్ద కొడుకు శశాంక్ వెంకట్‌కుమార్ నిర్వహించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు అశ్రు నయనాలతో శ్రీహరికి అంతిమ వీడ్కోలు పలికారు. భార్య శాంతి, కుమారులు శశాంక్, మేఘాంశ్, తల్లిదండ్రులు రఘుముద్రి సత్యనారాయణ, శ్రీలక్ష్మి, కుటుంబ సభ్యులు, సన్నిహితులు శ్రీహరి భౌతిక కాయాన్ని కడసారిగా చూసి కన్నీరు మున్నీరయ్యారు. కూతురు అక్షర సమాధి పక్కనే శ్రీహరి భౌతికకాయాన్ని సమాధి చేశారు. శ్రీహరి బుధవారం ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో హఠాన్మరణం పొందిన విషయం తెలిసిందే. అశ్రునయనాలతో అంతిమయాత్ర: అంతకుముందు గురువారం ఉదయం 6.30 గంటలకు శ్రీహరి భౌతికకాయం ముంబై నుంచి జూబ్లీహిల్స్‌లోని శ్రీహరి స్వగృహానికి చేరుకుంది. ఆ సమయంలో ఆయన భార్య శాంతి, ఇద్దరు కుమారులు శశాంక్ వెంకట్‌కుమార్, మేఘాంశ్‌లను ఓదర్చాడం ఎవరితరం కాలేదు. ఇతర కుటుంబసభ్యులూ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. అప్పటికే అభిమాన హీరోను కడసారి చూసేందుకు ఆయన అభిమానులు అక్కడకు భారీగా చేరుకున్నారు. దాంతో శ్రీహరి భౌతికకాయాన్ని కడసారి చూసి నివాళులర్పించేందుకు వచ్చిన సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఊహించని స్థాయిలో అభిమానులు రావడంతో వారిని కట్టడిచేయడం పోలీసులకు సాధ్యం కాలేదు. పలుమార్లు లాఠీచార్జ్ చేసి అభిమానులను అదుపు చేయాల్సి వచ్చింది. అక్కడి నుంచి భౌతికకాయాన్ని మొదట ఫిలింనగర్‌లోని ఫిలించాంబర్‌కు తరలిద్దామనుకున్న నిర్ణయాన్ని చివరిక్షణంలో మార్చుకుని బాలానగర్‌లోని ఇంటికి తరలించారు. అక్కడ కాసేపుంచి అనంతరం బాచుపల్లికి అంతిమయాత్ర ప్రారంభించారు. బాచుపల్లి వరకు దారిపొడవునా శ్రీహరికి అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. భార్య, కుమారులతో పాటు శ్రీహరి తల్లిదండ్రులు, అన్న శ్రీనివాసరావు, తమ్ముడు శ్రీధర్ పాల్గొన్నారు. సినీ పరిశ్రమకు చెందిన సన్నిహితులు భారీగా అంతిమయాత్రలో పాల్గొన్నారు. చివరి చూపు కోసం... శ్రీహరి భౌతిక కాయానికి నివాళులర్పించి చివరి చూపు చూసేందుకు జూబ్లీహిల్స్‌లోని నివాసం వద్దకు, అంత్యక్రియలు నిర్వహించిన బాచుపల్లిలోని వ్యవసాయక్షేత్రం వద్దకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వచ్చారు. శ్రీహరి భార్య శాంతి, కుమారులు, కుటుంబసభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. శ్రీహరి భౌతికకాయానికి నివాళులు అర్పించిన వారిలో దాసరి నారాయణరావు, చిరంజీవి, డి.రామానాయుడు, మోహన్‌బాబు, ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, డి. సురేష్‌బాబు, జీవిత, రాజశేఖర్, రాంచరణ్ తేజ, జూనియర్ ఎన్టీఆర్, జగపతిబాబు, తమ్మారెడ్డి భరద్వాజ, సాయికుమార్, రవిరాజ పినిశెట్టి, దర్శకుడు ఎన్.శంకర్, సి.కల్యాణ్, సునీల్, ప్రకాశ్‌రాజ్, కృష్ణ, విజయనిర్మల, రఘుబాబు, పరుచూరి వెంకటేశ్వరరావు, తరుణ్, వేణుమాధవ్, వివి. వినాయక్, కె. రాఘవేందర్రావు, రంగనాథ్, రఘుబాబు, బ్రహ్మానందం, జయసుధ, మంచులక్ష్మిప్రసన్న, విష్ణు, సుమన్, వంశీ పైడిపల్లి, రాజకీయ నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి దానం నాగేందర్, మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యే శ్రీైశైలంగౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొండా సురేఖ, గద్దర్ తదితరులు ఉన్నారు. శ్రీహరి మృతి పట్ల పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై. గోపిరెడ్డి గురువారం సంతాపం ప్రకటించారు. -
శ్రీహరి అంత్యక్రియలు పూర్తి
హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ నటుడు రఘుముద్రి శ్రీహరి అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. సన్నిహితులు, అభిమానులు ఆయనకు అంతిమ వీడ్కోలు పలికారు. బాచుపల్లిలోని సొంత వ్యవసాయ క్షేత్రంలో శ్రీహరి అంత్యక్రియలు జరిగాయి. శ్రీహరి తనయులు మేఘాంశ్, శశాంక్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తర్వాత ఆయన పార్థీవదేహాన్ని ఖననం చేశారు. శ్రీహరి భార్య శాంతి, కుటుంబ సభ్యులు, సినిమా ప్రముఖులు, అభిమానులు రియల్ స్టార్‌కు తుదివీడ్కోలు పలికారు. అంతకుముందు నిర్వహించిన అంతిమయాత్రలో పెద్దఎత్తున అభిమానులు పాల్గొన్నారు. ముంబై నుంచి ఈ ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్న శ్రీహరి భౌతికకాయాన్ని పలువురు సినిమా, రాజకీయ ప్రముఖులు సందర్శించి నివాళి అర్పించారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న శ్రీహరి ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో బుధవారం సాయంత్రం 4 గంటల 20 నిమిషాలకు కన్నుమూసిన సంగతి తెలిసిందే.