కంట తడి పెట్టిన మోహన్ బాబు, వంశీ పైడిపల్లి, ఎన్టీఆర్
తెలుగు తెర నటుడు శ్రీహరి మృతదేహానికి నివాళులర్పించడానికి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు వంశీ పైడిపల్లి కంటతడి పెట్టారు.
తెలుగు తెర నటుడు శ్రీహరి మృతదేహానికి నివాళులర్పించడానికి వచ్చిన మోహన్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు వంశీ పైడిపల్లి కంటతడి పెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ నటించి, వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన బృందావనం చిత్రంలో శ్రీహరి ప్రధాన పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. శ్రీహరి మృత దేహానికి నివాళులర్పించే సమయంలో మోహన్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, వంశీలు కంటతడిపెట్టడం అందర్ని ఉద్వేగానికి గురి చేసింది. నటుడు శ్రీహరికి మోహన్ బాబుకు ప్రత్యేక అనుబంధముంది.
శ్రీహరి మృతదేహానికి నివాళులర్పించిన వారిలో కేంద్ర మంత్రి చిరంజీవి, రాంచరణ్ తేజ, దిల్ రాజు, నల్లమల్లపు బుజ్జి, సుమన్, పరుచూరి గోపాలకృష్ణ, సుమన్, కృష్ణం రాజు, తరుణ్, వందేమాతరం శ్రీనివాస్, జగపతిబాబు, ఎంపీలు అంజన్ కుమార్ యాదవ్, వి. హనుమంతరావు తదితరులు ఉన్నారు. హిందీ చిత్రం రాంబో రాజ్ కుమార్ షూటింగ్ లో పాల్గొనేందుకు ముంబై వెళ్లిన శ్రీహరి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో లీలావతి ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చేరిన శ్రీహరి గుండెపోటుతో తుదిశ్వాస వదిలారు.