
శ్రీహరి భౌతికకాయానికి దాసరి నివాళి
హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ నటుడు రఘుముద్రి శ్రీహరి అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. సన్నిహితులు, అభిమానులు ఆయనకు అంతిమ వీడ్కోలు పలికారు. బాచుపల్లిలోని సొంత వ్యవసాయ క్షేత్రంలో శ్రీహరి అంత్యక్రియలు జరిగాయి. శ్రీహరి తనయులు మేఘాంశ్, శశాంక్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తర్వాత ఆయన పార్థీవదేహాన్ని ఖననం చేశారు. శ్రీహరి భార్య శాంతి, కుటుంబ సభ్యులు, సినిమా ప్రముఖులు, అభిమానులు రియల్ స్టార్కు తుదివీడ్కోలు పలికారు.
అంతకుముందు నిర్వహించిన అంతిమయాత్రలో పెద్దఎత్తున అభిమానులు పాల్గొన్నారు. ముంబై నుంచి ఈ ఉదయం హైదరాబాద్కు చేరుకున్న శ్రీహరి భౌతికకాయాన్ని పలువురు సినిమా, రాజకీయ ప్రముఖులు సందర్శించి నివాళి అర్పించారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న శ్రీహరి ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో బుధవారం సాయంత్రం 4 గంటల 20 నిమిషాలకు కన్నుమూసిన సంగతి తెలిసిందే.