Mahesh Babu Attends Rituals Of His Brother Ramesh Babu: సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు మరణించిన సంగతి తెలిసిందే. 56 ఏళ్ల రమేశ్ బాబు అనారోగ్యంతో జనవరి 8న రాత్రి తుది శ్వాస విడిచారు. దీంతో ఘట్టమనేని కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగిలింది. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఘట్టమనేని కుటుంబ సభ్యులకు మహేశ్ బాబుకు కరోనా వచ్చి రమేశ్ బాబు చివరిచూపుకు నోచుకోకపోవడం మరింత కలిచివేసింది. ఈ విషయం అభిమానులను కూడా ఎంతో బాధపెట్టింది. అయితే ప్రస్తుతం కరోనా నుంచి కోలుకున్న మహేశ్ బాబు శనివారం (జనవరి 22) సోదరుడు రమేశ్ బాబు పెద్దకర్మకు హాజరయ్యారు.
(చదవండి: రమేశ్‌బాబు మృతిపై మహేశ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్)
ఈ కార్యక్రమంలో తన అన్నయ్య మరణించిన రోజు రాలేకపోయినందుకు ఎంతో బాధపడినట్లు తెలుస్తోంది. అన్నయ్యతో మహేశ్ బాబు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమైనట్లు సమాచారం. అన్నయ్య రమేశ్ బాబు అంటే మహేశ్ బాబుకి ఎనలేని ప్రేమ. ఈ విషయాన్ని అనేకసార్లు ప్రస్తావించిన మహేశ్.. రమేశ్ బాబు చనిపోయినప్పుడు భావోద్వేగంగా ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అలాగే రమేశ్ బాబు పెద్దకర్మకు ఘట్టమనేని కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది.
Mahesh Babu: అన్నయ్య పెద్దకర్మకు హాజరైన మహేశ్ బాబు.. కన్నీటి పర్యంతం !
Published Sat, Jan 22 2022 8:14 PM | Last Updated on Thu, Apr 14 2022 12:33 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment