attend
-
బంధువుల పెళ్లిలో ప్రభాస్ సిస్టర్స్.. రెబల్ స్టార్ పెళ్లి ఎప్పుడంటోన్న ఫ్యాన్స్ (ఫోటోలు)
-
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం.. సెలబ్రిటీల సందడి (ఫోటోలు)
-
రెండు రోజుల లావోస్ పర్యటనకు ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: 21వ ఆసియాన్-ఇండియా, 19వ తూర్పు ఆసియా సదస్సులలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం లావోస్‌కు బయలుదేరి వెళ్లారు. ఈ లావోస్ పర్యటన ఆసియాన్ దేశాలతో భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ప్రధాని మోదీ తన పర్యటన సందర్భంగా పేర్కొన్నారు.పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ లావోస్‌తో భారతదేశానికి సన్నిహిత సాంస్కృతిక, నాగరికత సంబంధాలు ఉన్నాయని ప్రధాని అన్నారు. లావోస్ ప్రధాని సోనెక్సా సిఫనాడోన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం వియంటియాన్ చేరుకోనున్నారు. అక్కడ జరిగే 21వ ఆసియాన్-ఇండియా సమ్మిట్, 19వ తూర్పు ఆసియా సదస్సులలో ప్రధాని పాల్గొంటారు.విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి జైదీప్ మజుందార్ మాట్లాడుతూ ఆసియాన్-ఇండియా శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని హాజరుకావడం ఇది 10వ సారని తెలిపారు. ప్రధాని మోదీ, సిపాండన్ మధ్య ద్వైపాక్షిక సమావేశం ఉంటుందని మజుందార్ తెలిపారు. సాంస్కృతిక ప్రదేశాల పునరుద్ధరణ, విద్యుత్ ప్రాజెక్టులు తదితర అనేక అంశాలపై చర్చజరగనున్నదని తెలిపారు. మయన్మార్‌లో కొనసాగుతున్న సంఘర్షణలపై ప్రధాని నరేంద్ర మోదీ లావోస్ పర్యటలో చర్చించనున్నారని మజుందార్ తెలిపారు. ఇది కూడా చదవండి: డాలస్‌లో ఘనంగా 'గాంధీ శాంతి నడక-2024' -
కేరళలో దేవీ నవరాత్రి సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న సెలబ్రిటీలు (ఫోటోలు)
-
అనంత్-రాధిక పెళ్లిలో.. సందడి చేసిన ప్రముఖులు (ఫోటోలు)
-
Sonakshi-Zaheer Wedding: సోనాక్షి - ఇక్బాల్ సింపుల్ రిసెప్షన్: సెలబ్రిటీల జబర్దస్త్ సందడి (ఫోటోలు)
-
Indian 2 Audio Launch: ఇండియన్ 2 ఆడియో లాంచ్‌లో సెలబ్రిటీల జోష్ (ఫోటోలు)
-
11 ఏళ్ల క్రితం విడిపోయిన స్టార్ కపుల్.. కుమారుడి కోసం (ఫొటోలు)
-
ప్రముఖ నిర్మాత ఆనంద్ పండిట్ కూతురి పెళ్లి.. మెరిసిన బాలీవుడ్ తారలు (ఫోటోలు)
-
భారత్ జోడో న్యాయ యాత్రకు అఖిలేష్ దూరం?
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సారధ్యంలో ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతున్న భారత్‌జోడో న్యాయ యాత్రలో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్ఫీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పాల్గొనడం లేదని సమాచారం. లోక్‌సభ ఎన్నికల సీట్ల కేటాయింపు విషయంలో ఒప్పందం కుదరకపోవడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. అయితే ఈ రెండు పార్టీల మధ్య సీట్ల విషయంలో సోమవారం తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే రాయ్‌బరేలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ న్యాయ యాత్రలో అఖిలేష్ పాల్గొంటారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆహ్వానాన్నిఅఖిలేష్ అంగీకరించి, అమేథీ లేదా రాయ్ బరేలీలో జరిగే న్యాయ యాత్రలో పాల్గొంటానని స్వయంగా ప్రకటించారు. రాహుల్ యాత్ర సోమవారం అమేథీలో, మంగళవారం రాయ్‌బరేలీలో ఉండనుంది. సోమవారం అఖిలేష్ అమేథీకి వెళ్లడం లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాయ్‌బరేలీలో జరిగే న్యాయ యాత్రలో ఆయన పాల్గొనవచ్చని, అయితే దీనిపై స్పష్టత లేనందున ఎలాంటి సన్నాహాలు చేయడం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. -
ప్రాణప్రతిష్ఠకు అద్వానీ, జోషి దూరం?
అయోధ్యలో నేడు జరిగే బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నేతలు లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి హాజరకావడంలేదంటూ పలు వార్తలు వినిపిస్తున్నాయి. తీవ్రమైన చలి వాతావరణం కారణంగా అద్వాని అయోధ్యకు వెళ్లడం లేదని సమాచారం. రామమందిర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన లాల్ కృష్ణ అద్వానీతో పాటు బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి కూడా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకావడం లేదని తెలుస్తోంది. పెరుగుతున్న వయస్సు, ఆరోగ్య సంబంధిత సమస్యల దృష్ట్యా ఈ సీనియర్ నేతలిద్దరూ బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి లాల్ కృష్ణ అద్వానీ 90వ దశకంలో రామమందిర ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆయన నేతృత్వంలో 1990లో గుజరాత్‌లోని సోమనాథ్ నుంచి బీజేపీ రథయాత్రను ప్రారంభించింది. ‘మందిర్ వహీ బనాయేంగే’ నినాదంతో లాల్ కృష్ణ అద్వానీ రామమందిర ఉద్యమాన్ని సామాన్య ప్రజలలోకి తీసుకెళ్లారు. విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు అలోక్ కుమార్‌తో పాటు ఇతర ప్రముఖులు స్వయంగా ఎల్‌కె అద్వానీ ఇంటికివెళ్లి, శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఇది కూడా చదవండి: మారిషస్ నుంచి డెన్మార్క్ ... అంతా రామమయం! రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. ‘96 ఏళ్ల వయస్సులో ఉన్న లాల్‌కృష్ణ అద్వానీ,90 ఏళ్ల వయస్సు కలిగిన మురళీ మనోహర్ జోషిలను ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానించాం. అయితే వారు వయస్సు, అనారోగ్య కారణాల దృష్ట్యా ఈ కార్యక్రమానికి హాజరుకాలేని స్థితిలో ఉన్నారని’ తెలిపారు. -
దీపావళి పార్టీలో బాలీవుడ్ సెలబ్రిటీలు (ఫోటోలు)
-
రణభూమిలో యోగ సాధన: సిరియా ముఖచిత్రాన్ని మారుస్తున్న రిషికేశ్
సిరియా.. ప్రపంచంలో గడచిన 12 ఏళ్లుగా అంతర్యుద్ధాలతో అట్టుడికికి పోతున్న ఏకైక దేశం. ఈ యుద్ధాల కారణంగా అక్కడున్న వారు సర్వం కోల్పోతున్నారు. ఆర్థిక, శారీరక, మానసిక కష్టాలతో నిత్యం కుంగిపోతున్నారు. ఇంతటి దుర్భర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న ఆ దేశంలోని వారికి ఇప్పుడు యోగవిద్య వరప్రదాయనిగా మారింది. బ్రిటీష్ మ్యాగజైన్ ఎకనామిస్ట్‌లోని ఒక రిపోర్టు ప్రకారం ప్రస్తుతం సిరియాలో ఉన్న అన్ని మైదానాలు, స్టేడియంలు యోగా తరగతులతో కళకళలాడుతున్నాయి. ఈ తరగతులకు పెద్దలు మొదలు కొని పిల్లల వరకూ అన్ని వయసులు వారు హాజరవుతున్నారు. వారి దినచర్య సూర్యనమస్కారాలతో ప్రారంభమవుతోంది. సిరియాలో హిందువుల వేషధారణతో యోగా ట్రైనర్లు యోగ సాధనకు విపరీతమైన ప్రచారం కల్పిస్తున్నారు. యోగ విద్యను మహాశివుని వరప్రసాదంగా చెబుతున్నారు. సిరియాలో యోగ శిక్షణ అందిస్తున్న ఒక అధ్యాపకుడు మాట్లాడుతూ నిత్యం యుద్ధ భయంతో కొట్టుమిట్టాడుతున్న ఇక్కడి ప్రజలకు యోగ ద్వారా ప్రశాంతత పొందే విధానాలను వివరిస్తున్నట్లు తెలిపారు. సిరియాకు చెందిన మాజోన్ ఈసా అనే వ్యక్తి రెండు దశాబ్ధాల క్రితం యోగా అధ్యయనం కోసం భారత్‌లోని హిమాలయాల్లో గల రిషికేశ్ వచ్చారు. తన యోగా అధ్యయనం ముగిశాక తిరిగి సిరియా చేరుకుని, ఒక యోగా సెంటర్ ప్రారంభించారు. ఇప్పుడు అతని ప్రేరణతో దేశంలో వేలాది యోగాకేంద్రాలు నడుస్తున్నాయి. కాగా ఈ కేంద్రాలలో ఉచితంగా శిక్షణ అందించడం విశేషం. సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్ ఇటువంటి యోగ శిక్షణ కేంద్రాలకు మద్దతుగా నిలుస్తున్నారు. సున్నీ ముస్లిం జనాభా అత్యధికంగా కలిగిన సిరియాను అర్ధశతాబ్ద కాలంగా అసద్ కుటుంబ సభ్యులు పరిపాలిస్తున్నారు. వారు గతంలో తమ ప్రభావాన్ని పెంచుకునేందుకు ఇస్లాంలోని మరోశాఖ అల్విత్తో దోస్తీ కుదుర్చుకున్నారు. అయితే ఇప్పుడు అసద్ కుటుంబ సభ్యుల తీరుతెన్నుల్లో మార్పు వచ్చింది. ఇతర మతాల వారికి కూడా తగిన గుర్తింపునిస్తున్నారు. దీనిలో భాగంగానే యోగ విద్యకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. అలాగే ఇక్కడి క్రైస్తవులకు చర్చిలు నిర్మించుకునేందుకు అవకాశం కూడా కల్పిస్తున్నారు. ఇది కూడా చదవండి: ప్రియుని కోసం పాకిస్తాన్ వచ్చిన బ్రిటన్ మహిళ.. పోలీసులకు చుక్కలు! -
'జాతీయ సంక్షేమమే అజెండా'.. ముగిసిన ప్రతిపక్ష పార్టీల భేటీ..
బెంగళూరు: బెంగళూరులో జరుగుతున్న ప్రతిపక్ష పార్టీల సమావేశం ముగిసింది. సాంఘీక న్యాయం, సమ్మిళిత వృద్ధి, జాతీయ సంక్షేమమే అజెండాగా పనిచేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఒకే భావాజాలం కలిగిన ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఒకే ధ్యేయం కోసం పోరాడతామని అన్నారు. డిన్నర్ మీటింగ్ అనంతరం ఈ మేరకు మీడియాకు తెలిపారు. "Like-minded opposition parties shall closely work together to foster an agenda of social justice, inclusive development and national welfare," says Congress President Mallikarjun Kharge after Opposition leaders' dinner meeting in Bengaluru. pic.twitter.com/H27D4nL1iU — ANI (@ANI) July 17, 2023 బెంగళూరులో జరుగుతున్న ప్రతిపక్ష కూటమి భేటీలో పాల్గొన్న వివిధ పార్టీల నేతలు డిన్నర్ మీటింగ్ అనంతరం హోటల్ నుంచి బయటకు వస్తున్నారు. Opposition leaders' dinner meeting concludes in Karnataka's Bengaluru; Opposition leaders leave the meeting venue pic.twitter.com/FijRJO4ANl — ANI (@ANI) July 17, 2023 ప్రతిపక్ష పార్టీలు నేడు బెంగళూరులో సమావేశమయ్యాయి. దాదాపు 24 ప్రతిపక్ష పార్టీల నేతలు డిన్నర్ మీటింగ్‌లో పాల్గొన్నారు. Opposition leaders' dinner meeting gets underway in Karnataka's Bengaluru pic.twitter.com/HENPkecg1g — ANI (@ANI) July 17, 2023 ప్రతిపక్ష కూటమికి హాజరవ్వడానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెంగళూరు వెళ్లారు. ఈ మేరకు కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఆయన్ను ఆహ్వానించారు. #WATCH | Delhi CM Arvind Kejriwal along with AAP MP Sanjay Singh arrives at the venue of the Opposition meeting in Bengaluru, received by Karnataka CM & Congress leader Siddaramaiah, deputy CM DK Shivakumar and party leader KC Venugopal, in Bengaluru pic.twitter.com/ResmhdV5rn — ANI (@ANI) July 17, 2023 బీజేపీని ఓడించే లక్ష్యంతో బెంగళూరు వేదికగా జరుగుతున్న ప్రతిపక్ష భేటీకి బిహార్ సీఎం నితీష్ కుమార్ హాజరయ్యారు. ఈ మేరకు బెంగళూరు చేరిన ఆయనకు సిద్దరామయ్య ఆహ్వానం పలికారు. #WATCH | JD(U) leader and Bihar CM Nitish Kumar arrives for Opposition dinner meeting in Bengaluru, Karnataka pic.twitter.com/Fag2a6OK8a — ANI (@ANI) July 17, 2023 ప్రతిపక్ష కూటమి సమావేశంలో హాజరవడానికి కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బెంగళూరు వచ్చారు. ఈ మేరకు కర్ణాటక సీఎం సిద్దరామయ్య .. వారిని ఆహ్వానించారు. Sonia Gandhi, Mallikarjun Kharge, Rahul Gandhi arrive at Bengaluru ahead of joint Oppn meeting Read @ANI Story | https://t.co/Vb0wqrGsl0#SoniaGandhi #MallikarjunKharge #RahulGandhi #Bengaluru pic.twitter.com/8f3MaeRTvl — ANI Digital (@ani_digital) July 17, 2023 బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పోరాడతామని సమాజ్ వాదీ పార్టీ అధినేత అకిలేష్ యాదవ్ అన్నారు. మూడింటిలో రెండొంతుల మంది ప్రజలు బీజేపీని ఓడించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలో ఈ సారి బీజేపీ కూటమిని చిత్తుగా ఓడిస్తామని అన్నారు. ఈ మేరకు ప్రతిపక్ష కూటమి భేటీకి బెంగళూరు వచ్చారు. #WATCH | Samajwadi Party (SP) chief Akhilesh Yadav, who arrived in Bengaluru today to participate in the joint Opposition meeting, was received by Karnataka Ministers MB Patil and Lakshmi Hebbalkar. (Video: MB Patil) pic.twitter.com/ohxBhot7m2 — ANI (@ANI) July 17, 2023 రెండు రోజులపాటు జరగనున్న ప్రతిపక్ష కూటమి భేటీకి హాజరవడానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బెంగళూరుకు వచ్చారు. బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పోరాడతామని స్పష్టం చేశారు. West Bengal CM and TMC leader Mamata Banerjee and party MP Abhishek Banerjee arrived in Bengaluru for the two-day joint Opposition meeting. Karnataka Deputy CM DK Shivakumar received them. (Pics: Karnataka Pradesh Congress Committee) pic.twitter.com/3VXQG45kCc — ANI (@ANI) July 17, 2023 #WATCH | West Bengal CM and TMC leader Mamata Banerjee arrives in Bengaluru for the two-day joint Opposition meeting. pic.twitter.com/qXmrEtV7uw — ANI (@ANI) July 17, 2023 అర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌లు పాట్నా నుంచి బెంగళూరుకు బయలుదేరారు. #WATCH | RJD chief Lalu Prasad Yadav and party leader-Bihar Deputy CM Tejashwi Yadav leave from Patna. They will participate in the joint Opposition meeting in Bengaluru. pic.twitter.com/cmHOhJWMgR — ANI (@ANI) July 17, 2023 బెంగళూరు వేదికగా ప్రతిపక్ష పార్టీల భేటీ నేడు ప్రారంభం కానుంది. ఇప్పటేకే కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బెంగళూరుకు చేరారు. కాగా.. బెంగళూరులోని తాజ్ హోటల్లో వీరు సమావేశం కానున్నారు. #WATCH | Congress president Mallikarjun Kharge and Congress Parliamentary Party Chairperson Sonia Gandhi arrive in Bengaluru for the joint opposition meeting which will have the participation of 26 like-minded parties. pic.twitter.com/OogxvHsDnK — ANI (@ANI) July 17, 2023 2024 ఎన్నికల్లో బేజీపీని ఓడించడమే లక్ష్యంగా దాదాపు 26 ప్రతిపక్ష పార్టీల నేతలు ఏకమవడానికి వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా నేటి నుంచి రెండు రోజుల పాటు బెంగళూరులో భేటీ కానున్నారు. మంగళవారం అధికారికంగా సమావేశం జరగనుంది. కామన్ మనిమమ్ ప్రోగ్రామ్‌తో సహా పలు ప్రణాళికలను రచించనున్నారు. ప్రతిపక్ష కూటమి అజెండాను చర్చించడానికి ఈ సమావేశం వేదిక కానుంది. 2024 ఎన్నికల కోసం కూటమిని నడిపించడానికి ఓ సబ్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. కూటమికి కొత్త పేరును సూచించే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రతిపక్ష కూటమికి ఏం పేరు పెట్టనున్నారనే అంశంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, నితీష్ కుమార్, తేజశ్వీ యాదవ్, స్టాలిన్ సహా పలువురు ముఖ్య నేతలు హజరుకానున్నారు. ఇదీ చదవండి: విపక్షాల సభకు పవార్ వస్తాడా? రాడా? ఇదీ క్లారిటీ.. -
మద్యం మత్తులో పెళ్లి చేసుకోవాల్సిన విషయమే మర్చిపోయిన వరుడు
ఇటీవల కాలంలో చాలా వివాహతంతు సమయంలో చాలా వింత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటి మొన్న ఒక వ్యక్తి ఫుల్‌గా తాగేసి పెళ్లి పీటలపైనే నిద్రపోయాడు. ఆ ఘటన మరువకు మునేపే అదే తరహాలో మరో ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ ఏకంగా తన పెళ్లి చేసుకోవాల్సిl విషయం మర్చిపోయాడు. తన పెళ్లికి తానే అటెండెంట్ కాలేకపోయాడు. ఈ విచిత్ర ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..బిహార్‌లో ఓ పెళ్లి వేడుకు చాలా ఘనంగా జరుగుతోంది. మండంలో వధువు తరుఫు కుటుంబ సభ్యులు వరుడు కోసం ఎదురు చూస్తున్నారు. ఐతే వరుడు ఫుల్‌గా తాగేసి మండపానికి రావడం మర్చిపోయాడు. అక్కడ ఏమో వరుడు రాక కోసం చూసి, చూసి.. పెళ్లి రద్దు చేసుకుని ఇంటికి వచ్చేశారు వధువు కుటుంబ సభ్యులు. ఆ తర్వాత రోజు వరుడుకి స్పుహ వచ్చి వధువు వధువు ఇంటికి వెళ్లి క్షమాపణలు చెప్పేందుకు యత్నించినా..ఆమె పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది. జీవితంలో అతి ముఖ్యమైన విషయంలోనే ఇంత భాధ్యతరాహిత్యంగా ప్రవర్తించాడు ఇక అతడితో జీవితం ఏం బావుంటుందని గట్టిగా నిలదీసింది వధువు. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పోలీసుల రాకతో ఒక్కసారిగా సద్దుమణిగింది. ఐతే వధువు కుటుంబ సభ్యులు పెళ్లికి అయిన ఖర్చును తిరిగి ఇవ్వాల్సిందిగా వధువు కుటుంబాన్ని డిమాండ్ చేశారు. (చదవండి: పనిలోంచి తీసేశారని క్లీనర్ రివేంజ్..కార్లపై యాసిడ్ పోసి..) -
సీబీఐ విచారణకు హాజరైన వైఎస్ భాస్కర్ రెడ్డి
-
ఎల్లుండి ఈడీ ఎదుట విచారణకు హాజరుకానున్న ఎమ్మెల్సీ కవిత
-
డాక్టర్ల ఫొటోలే వైద్యం చేస్తుంటాయ్! తనిఖీల్లో బండారం బట్టబయలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో 48 ఏరియా ఆసుపత్రులు, 108 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 33 జిల్లా ఆసుపత్రులు ఉన్నాయి. వాటిల్లో ఎండీ, ఇతర సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు వైద్యం చేస్తుంటారు. ఆర్థో, కార్డియాక్, గైనిక్, నెఫ్రాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, గ్యాస్ట్రో వంటి ప్రత్యేక వైద్యం అందుబాటులో ఉంటుంది. కొందరు స్పెషలిస్ట్ వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులకు హాజరుకాకుండా హైదరాబాద్‌లోనూ, తాము పనిచేసే సమీప పెద్ద నగరాల్లోనూ ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇటీవల వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్ క్షేత్రస్థాయి తనిఖీలకు వెళ్లినప్పుడు అనేకచోట్ల డాక్టర్లు విధులకు రాకపోవడాన్ని గుర్తించారు. ఈ మేరకు 50 మంది వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, వివరణ కోరారు. హాజరైనట్లుగా తప్పుడు పద్ధతులు కొన్ని ఆసుపత్రుల్లో ఫేస్ రికగ్నేషన్ మెషీన్, కొన్నిచోట్ల వేలిముద్రల మెషీన్లను వైద్యవిధాన పరిషత్ ఏర్పాటు చేసింది. అయితే ఫేస్ రికగ్నేషన్ మెషీన్లో కొందరు డాక్టర్లు ముఖం కాకుండా ఫొటోలను ఫీడ్ చేశారు. ఆ ఫొటోను ఆ ఆసుపత్రిలో పనిచేసే వైద్యసిబ్బందికి ఇచ్చి, రోజూ ఫొటోను ఫేస్ రికగ్నేషన్ మెషీన్ ముందు పెట్టి హాజరు వేయిస్తుంటారు. కొందరు డాక్టర్లయితే వారాల తరబడి కూడా ఆసుపత్రుల ముఖం చూడటంలేదని తేలింది. కానీ, హాజరైనట్లుగా మెషీన్లో నమోదవుతుంది. కొన్నిచోట్ల తమకు బదులుగా అక్కడి సిబ్బంది వేలిముద్రలను మెషీన్లలో ఫీడ్ చేయించారు. సిబ్బంది వేలిముద్రల సహాయంతో హాజరైనట్లుగా నమోదు చేయించుకుంటున్నారు. కొందరు డాక్టర్లు మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నేతల కుటుంబసభ్యులకు వైద్యం చేస్తూ మెప్పు పొందుతున్నారు. ఇటువంటి వారిని ఏమీ అనలేని పరిస్థితి నెలకొందని ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక జిల్లాలో ఒక మహిళా ఎంబీబీఎస్ డాక్టర్ వారానికి ఒకసారి వచ్చి తన వ్రస్తాలను మార్చి ఇతర వ్రస్తాలను ధరించి ఫొటోలు దిగి బయోమెట్రిక్ అటెండెన్స్‌లో ఫీడ్ చేసిన విషయం వెలుగు చూసింది. ఈ డాక్టర్‌పై చర్యలు తీసుకోవడానికి అధికారులు ప్రయతి్నంచగా కొందరు మంత్రుల ఆఫీసుల నుంచి ఫోన్లు చేసి అడ్డుకున్నట్లు తెలిసింది. మరోవైపు కొన్ని సంఘాలు కూడా ఇటువంటి డాక్టర్లకు వంతపాడుతున్నాయని ఉన్నతాధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయి తనిఖీల్లో వైద్యుల బండారం బట్టబయలు ఆయన పేరు డాక్టర్ దేవేందర్ (పేరు మార్చాం). హైదరాబాద్ సమీపంలోని ఒక ఏరియా ఆసుపత్రిలో స్పెషలిస్ట్ వైద్యుడు. ఆయనకు నగరంలో ప్రైవేట్ ప్రాక్టీస్ ఉంది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లకుండా మేనేజ్ చేస్తున్నారు. కా నీ, ఆయన రోజూ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నట్లుగా హాజరుంటుంది. బయోమెట్రిక్ హాజరున్నా తన మాయాజాలాన్ని ఉపయోగించారు. ఫేస్ రికగ్నిషన్ సందర్భంగా తన ముఖాన్ని కాకుండా ఫొటోను బయోమెట్రిక్ మెషీన్లో ఫీడ్ చేయించాడు. అతను వెళ్లకున్నా సిబ్బంది అతని ఫొటోను బయోమెట్రిక్‌లో హాజరుకోసం ఉపయోగిస్తున్నారు. మరో డాక్టర్ శ్రవణ్ కుమార్ (పేరు మార్చాం). నిజామాబాద్ జిల్లాలోని ఒక ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. అతను వారానికి ఒకరోజు ఆసుపత్రికి వచ్చి కొద్దిసేపు ఉండి వెళ్తాడు. కానీ, అతను రోజూ వచి్చనట్లుగా హాజరుంటుంది. అతను వేలిముద్ర హాజరును దిద్దుబాటు చేశాడు. తన వేలి ముద్ర బదులుగా అక్కడ రోజూ వచ్చే ఇతర సిబ్బంది వేలిముద్రను ఫీడ్ చేశాడు. దీంతో అతను వెళ్లకుండానే హాజరుపడుతుంది. ఆమె పేరు డాక్టర్ రవళి(పేరు మార్చాం). రాష్ట్రంలోని ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తారు. ప్రతీ డాక్టర్ తాను పనిచేసినట్లుగా రోజూ ఫొటో తీసి అప్లోడ్ చేయాలని ఆ జిల్లాలో నిర్ణయం తీసుకున్నారు. కానీ, ఆమె మాత్రం ఒక రోజు వచ్చి తన వ్రస్తాలను ఐదారుసార్లు మార్చి ఇతర వస్త్రాలను ధరించడం, హెయిర్ స్టైల్‌ను కూడా మార్చి రోగులను చూసినట్లు ఫొటోలు దిగుతారు. వారంలో మిగిలిన రోజులు రాకుండానే ఆ ఫొటోలను అప్లోడ్ చేస్తారు. (చదవండి: సీబీఐ ఛాయ్ బిస్కెట్ తినడానికి రాలేదు.. కవితపై బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్) -
ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి అంత్యక్రియలకు హాజరుకానున్న సీఎం జగన్
-
ప్రాణమిత్రుడి పాడె మోసిన ఉస్తాద్ జకీర్ హుస్సేన్
ముంబై: భారత సంగీత విద్వాంసుడు.. సంతూర్ వాయిద్యాకారుడు పండిట్ శివకుమార్ శర్మ మరణం సంగీత ప్రపంచంలో తీరని విషాదం నింపింది. 84 ఏళ్ల సంతూర్ దిగ్గజం మే 10వ తేదీన గుండె పోటుతో కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు ఆ మరుసటి రోజే ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. అయితే అంత్యక్రియల్లో ఓ ప్రముఖుడి ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆయనెవరో కాదు.. తబలా విద్వాంసుడు జకీర్ హుస్సేన్(71). శివకుమార్ శర్మ, జకీర్ హుస్సేన్‌లు సంయుక్తంగా ఎన్నో ప్రదర్శనలు నిర్వహించారు. వయసులో తేడాలున్నా.. ఇద్దరూ మంచి మిత్రులు కూడా. ఈ క్రమంలో తన ప్రాణ స్నేహితుడి అంత్యక్రియలు జకీర్ హుస్సేన్ హజరయ్యారు. అంతేకాదు.. శివకుమార్ పాడె మోసిన జకీర్ హుస్సేన్.. అంత్యక్రియల సమయంలోనూ ఒంటరిగా కాసేపు చితి వద్దే ఉండిపోవడం కెమెరాల దృష్టిని ఆకర్షించింది. ఈ అంత్యక్రియలు ప్రముఖులెవరూ హాజరుకాకపోయినా.. సోషల్ మీడియా ద్వారా తమ నివాళులు అర్పించారు. చదవండి: ‘సంతూర్' శివకుమార్ శర్మ కన్నుమూత.. నేపథ్యం ఏంటంటే.. -
అన్నయ్య పెద్దకర్మకు హాజరైన మహేశ్ బాబు.. కన్నీటి పర్యంతం !
Mahesh Babu Attends Rituals Of His Brother Ramesh Babu: సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు మరణించిన సంగతి తెలిసిందే. 56 ఏళ్ల రమేశ్ బాబు అనారోగ్యంతో జనవరి 8న రాత్రి తుది శ్వాస విడిచారు. దీంతో ఘట్టమనేని కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగిలింది. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఘట్టమనేని కుటుంబ సభ్యులకు మహేశ్ బాబుకు కరోనా వచ్చి రమేశ్ బాబు చివరిచూపుకు నోచుకోకపోవడం మరింత కలిచివేసింది. ఈ విషయం అభిమానులను కూడా ఎంతో బాధపెట్టింది. అయితే ప్రస్తుతం కరోనా నుంచి కోలుకున్న మహేశ్ బాబు శనివారం (జనవరి 22) సోదరుడు రమేశ్ బాబు పెద్దకర్మకు హాజరయ్యారు. (చదవండి: రమేశ్‌బాబు మృతిపై మహేశ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్) ఈ కార్యక్రమంలో తన అన్నయ్య మరణించిన రోజు రాలేకపోయినందుకు ఎంతో బాధపడినట్లు తెలుస్తోంది. అన్నయ్యతో మహేశ్ బాబు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమైనట్లు సమాచారం. అన్నయ్య రమేశ్ బాబు అంటే మహేశ్ బాబుకి ఎనలేని ప్రేమ. ఈ విషయాన్ని అనేకసార్లు ప్రస్తావించిన మహేశ్.. రమేశ్ బాబు చనిపోయినప్పుడు భావోద్వేగంగా ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అలాగే రమేశ్ బాబు పెద్దకర్మకు ఘట్టమనేని కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. (చదవండి: రమేశ్‌బాబు మృతదేహాన్ని చూసి కన్నీరు పెట్టిన కృష్ణ) -
నీట్ పరీక్ష రాస్తున్న వారిలో బాలికలే ఎక్కువ
సాక్షి, హైదరాబాద్: వైద్య వృత్తిపై అమ్మాయిలు అమిత ఆసక్తి కనబరుస్తున్నారు. వైద్య విద్యలో ప్రవేశాలకు ఏటా నిర్వహించే నీట్ పరీక్షను బాలికలే అధిక సంఖ్యలో రాస్తున్నారు. అంతేకాదు ఆ మేరకు ఫలితాలు కూడా సాధిస్తున్నారు. 2021–22 సంవ త్సరానికి సంబంధించి దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్షకు 15.44 లక్షల మంది హాజరయ్యారు. అందులో 8.63 లక్షల మంది బాలికలే ఉండగా, 6.81 లక్షల మంది బాలురున్నారు. పరీక్షకు హాజౖ రెనవారిలో 8.70 లక్షల మంది అర్హత సాధించారు. కాగా బాలుర కంటే బాలికలు 1.19 లక్షల మంది అధికంగా అర్హత సాధించడం విశేషం. అత్యధికంగా 4.94 లక్షల మంది బాలికలు అర్హులుగా నిలవగా, 3.75 లక్షల మంది బాలురు అర్హత సాధించారు. 2020లో నిర్వహించిన నీట్ పరీక్షలోనూ బాలికలే ఎక్కువగా అర్హత సాధించారు. అప్పుడు 4.27 లక్షల మంది బాలికలు అర్హులు కాగా, 3.43 లక్షల మంది బాలురు అర్హులుగా తేలారు. మొదటి ర్యాంకు ముగ్గురిలో ఒకరు బాలిక తాజా నీట్ పరీక్షలో ముగ్గురు విద్యార్థులు సమానంగా అంటే 720 మార్కులకు 720 మార్కులు సాధించి మొదటి ర్యాంకులను సాధించారు. అయితే అందులో తెలంగాణకు చెందిన మృణాల్ కుటేరి నంబర్ వన్ స్థానం సాధించినట్లు ప్రకటించారు. ముగ్గురికీ సమానంగా ఒకే ర్యాంకు, ఒకే మార్కు వచ్చినప్పుడు వివిధ అంశాలను ఆధారంగా చేసుకొని నంబర్ వన్ స్థానాన్ని ప్రకటిస్తారు. అయితే మొదటి ర్యాంకు సాధించిన వారిలో మహారాష్ట్రకు చెందిన కార్తీక్ జి.నాయర్ (బాలిక) కూడా ఉండటం గమనార్హం 2021–22 నీట్‌లోబాలురు, బాలికల సంఖ్య అంశం బాలురు బాలికలు దరఖాస్తు 7,10,979 9,03,782 హాజరు 6,81,168 8,63,093 అర్హత 3,75,260 4,94,806 కష్టపడే తత్వం ఎక్కువ మెడికల్ సీటు సాధించాలన్నా, ఆ తర్వాత దాన్ని కష్టపడి చదవాలన్నా, వైద్య వృత్తిలో రాణించాలన్నా ఓపిక, సహనం ఎక్కువగా ఉండాలి. బాగా కష్టపడేవారికే మెడికల్ సీటు వస్తుంది. ఈ తత్వం బాలికల్లోనే ఎక్కువగా ఉంటుంది. మొదటి నుంచీ బాలికలే వైద్య విద్యపై ఎక్కువగా మక్కువ చూపిస్తుంటారు. ఫలితాలు కూడా సాధిస్తుంటారు. మేము ఇస్తున్న నీట్ కోచింగ్‌ల్లో కూడా 60 నుంచి 70 శాతం మంది బాలికలే ఉంటున్నారు. – శంకర్రావు, డీన్, శ్రీచైతన్య జూనియర్ కాలేజీలు, హైదరాబాద్ -
రేపు ఈడీ విచారణకు హాజరు కానున్న హీరో తరుణ్
-
పెళ్లి వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా మారిన అల్లు అర్జున్..!
-
సీపీ అంజనీకుమార్ కుమారుడి వివాహ ఫోటోలు
-
బోయినపల్లి వినోద్ కుమార్ కుమారుడి నిశ్చితార్థం ఫోటోలు
-
చంద్రయాన్–2 విఫల ప్రాజెక్టు కాదు
కోల్‌కతా: ‘చంద్రయాన్–2’ విజయవంతమైన ప్రాజెక్టేనని, ఆ ప్రయోగం కారణంగా దేశ యువతకు సైన్స్ పట్ల ఆసక్తి పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. శాస్త్ర, సాంకేతిక రంగాల పాత్ర లేకుండా ఏ దేశం కూడా పురోగతి సాధించలేదన్నారు. కోల్‌కతాలో జరుగుతున్న ‘ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్’ను ఉద్దేశించి మంగళవారం వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా భారతదేశ శాస్త్రవేత్తలపై ఆయన ప్రశంసలు కురిపించారు. అత్యున్నత స్థాయి శాస్త్రవేత్తలను ప్రపంచానికి భారత్ అందించిందన్నారు. ‘చంద్రయాన్ 2 ప్రయోగంలో మన శాస్త్రవేత్తలు విశేష కృషి చేశారు. పూర్తిగా మనం ఆశించినట్లుగా జరగకపోయినా.. ఆ ప్రయోగం విజయవంతమైన ప్రాజెక్టే. భారతదేశం సాధించిన శాస్త్ర, సాంకేతిక విజయాల్లో చంద్రయాన్ 2 కూడా ఒక కీలకమైన విజయంగా కచ్చితంగా నిలుస్తుంది’ అని మోదీ వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 7వ తేదీన చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతంపై దిగుతున్న చివరి క్షణాల్లో చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్ 2లోని విక్రమ్ ల్యాండర్ కుప్పకూలిన విషయం తెలిసిందే. ‘శాస్త్ర, సాంకేతిక ప్రయోగాల ఫలితాలు వెల్లడయ్యేందుకు సమయం పడుతుంది. అందుకు ఓపికగా ఎదురుచూడాలి’ అని సూచించారు. సైన్స్ లో వైఫల్యం అనేది ఉండదని, అలుపెరగకుండా ప్రయోగాలు చేస్తూనే ఉండాలని వ్యాఖ్యానించారు. ‘గతంలో అవసరాలే ఆవిష్కరణలకు దారితీసేవని భావించేవారు. కానీ ఇప్పుడు ఆవిష్కరణలు అవసరాల పరిధి దాటి విస్తరించాయి’ అన్నారు. అంతర్జాతీయ నిబంధనలు, ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని, దీర్ఘకాలిక ప్రయోజనాలు లక్ష్యంగా ప్రయోగాలు చేపట్టాలని ప్రధాని మోదీ శాస్త్రవేత్తలకు సూచించారు. -
దేవదాసీలకు చేయూత నిద్దాం..
సాక్షి, విజయవాడ: అణగదొక్క బడుతున్న దేవదాసీలకు చేయూత నివ్వాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు. ఏపీ షెడ్యూల్డ్ కులాల సహకార ఆర్థిక సంస్థ నేతృత్వంలో దేవదాసీ వ్యవస్థపై నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. దేవదాసీ వ్యవస్థ నిర్మూలనకు 1988లో చట్టం వచ్చిందని..వ్యవస్థలోని కొందరి వలన ఆ చట్టంతో అనుకున్న స్థాయిలో దేవదాసీలకు న్యాయం జరగలేదన్నారు. దేవదాసీ వ్యవస్థ నిర్మూలించడం కోసం నా వంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ వ్యవస్థ నిర్మూలన కోసం న్యాయమూర్తి కేసీ భాను ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్ దేవదాసీ వ్యవస్థ నిర్మూలనకు కృషి చేస్తున్నారు... దేవదాసీ వ్యవస్థ నిర్మూలన చట్టం రూపొందించిన విశ్రాంత ఐఏఎస్ అధికారి చల్లప్పా మాట్లాడుతూ.. ఐఏఎస్ అధికారులు నాయకులకు లోబడి పనిచేస్తున్నారని..గతంలో ఏ ప్రభుత్వం కూడా దేవదాసీ నిర్మూలన కోసం పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేవదాసీ నిర్మూలనకు కృషి చేస్తున్నారని ప్రస్తుతించారు. సీఎం జగన్ సాంఘిక సంక్షేమం కోసం విదేశాల్లో మాట్లాడటం ఆనందంగా ఉందన్నారు. ఐఏఎస్‌లు రవిచంద్ర, దమయంతి.. దేవదాసీ నిర్మూల కోసం ఎంతో పాటుపడ్డారన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఇంతియాజ్,ఎస్సీ కార్పొరేషన్ ఎండి గంథం చంద్రుడు తదితరులు పాల్గొన్నారు. -
కళతప్పిన టీడీపీ మహానాడు
-
రేపు నారాయణ రెడ్డి అంత్యక్రియలకు వైఎస్ జగన్
-
రాజ్‌భవన్ ఉగాది వేడుకల్లో వైఎస్ జగన్
-
వివాహ వేడుకలో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి
డీసీఎంఎస్ చైర్మ¯ŒS కుమార్తె వివాహానికి హాజరు కాకినాడ : మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి గురువారం జిల్లాకు విచ్చేసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి రాజమండ్రి చేరుకున్న ఆయన మాజీ ఎంపీ హర్షకుమార్ నివాసానికి వెళ్లారు. భోజన విరామం తరువాత కాకినాడ చేరుకుని జీఆర్టీ హోటల్లో బస చేశారు. రాత్రి 8 గంటలకు కాకినాడ ఎస్.ఆర్.ఎం.టి. ఫంక్ష¯ŒS హాలులో డీసీఎంఎస్ ఛైర్మ¯ŒS కె.వి.సత్యనారాయణ రెడ్డి కుమార్తె వివాహానికి హాజరయ్యారు. వధూవరులు శ్రేష్ఠ, వెంకటేశ్వరరెడ్డిలను ఆశీర్వదించారు. కాకినాడ రామారావుపేటలోని రోటరీ డిస్ట్రిక్ మాజీ ఛైర్మ¯ŒS లక్కరాజు సత్యనారాయణ్ (టిక్కు) నివాసానికి వెళ్ళారు. అక్కడి నుంచి తిరిగి జీఆర్టీ గ్రాండ్‌కు చేరుకుని రాత్రి అక్కడే బస చేశారు. నేడు శేషారెడ్డి నివాసంలో అల్పాహారం శుక్రవారం ఉదయం ఆదిత్య విద్యా సంస్థల «అధినేత, మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి శేషారెడ్డి నివాసానికి వెళ్లి అల్పాహారం అనంతరం అక్కడి నుంచి రాజమండ్రి మధురపూడి చేరుకుని హైదరాబాద్ వెళ్తారు. -
యువరాజ్ తండ్రి చెప్పిన షాకింగ్ న్యూస్
న్యూఢిల్లీ: త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ షాకింగ్ న్యూస్ చెప్పారు. నవంబర్ 30న పంజాబ్ లోని ఫతేగఢ్ సాహిబ్ గురుద్వారాలో జరగనున్న యువరాజ్ వివాహానికి హాజరు కావడం లేదని ప్రకటించారు. హిందూస్తాన్ టైమ్స్ నివేదిక ప్రకారం.. సంప్రదాయ బద్ధంగా జరుగుతున్న తన కుమారుడు యువరాజ్ సింగ్ పెళ్లికి రానని యువరాజ్ తల్లికి ముందే చెప్పానని వివరించారు. ఇది తన దురదృష్టమనీ యోగరాజ్ వ్యాఖ్యానించారు. తనకు దేవుడి మీద భక్తి ఉన్నప్పటికీ, మత గురువుల మీద నమ్మకం లేదని ఆయన స్పష్టం చేశారు. అందుకే వెళ్లడం లేదని విధి అలావుందని చెప్పారు. కానీ, యువరాజ్ కోరిక మేరకు నవంబరు 29 న హోటల్ లలిత్ వద్ద జరిగే మెహిందీ ఫంక్షన్ కు హాజరవుతానని చెప్పారు. అయితే యువరాజ్ కాబోయే భార్య హాజెల్ ను మాత్రం ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. ఆమె దేవతలాంటిదన్నారు. పాశ్చాత్య సంస్కృతిలో పెరిగినా సంప్రదాయ విలువలకు, పద్ధతులకు ప్రాముఖ్యత ఇస్తుందని చెప్పారు. తమ ఆమె కుటుంబంలో సానుకూల మార్పులు తీసుకొస్తుందని నమ్ముతున్నానన్నారు. ఇతర సోదరీ మణులును ఒక చోటుకి చేరుస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అలాగే యువరాజ్ , హాజెల్ దంపతులు కుటుంబంలోని మిగిలిన పిల్లలకు తల్లిదండ్రుల్లా వ్యవహరించాలని కోరుకుంటున్నానంటూ ముగించారు. అందరూ చట్టబద్ధ వివాహాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, విలాసవంతమైన వివాహాలకు స్వస్తి పలకాలని సూచించారు. పెళ్లళ్లలో కోట్లాది రూపాయల వృధా ఖర్చులకు అందరూ దూరంగా ఉండాలని యోగరాజ్ సింగ్ కోరారు. కాగా టీమిండియా డాషింగ్ ఆల్‌రౌండర్ యువీ, బాలీవుడ్ నటి హజెల్ కీచ్‌ను ఈ నెలాఖరున వివాహం చేసుకోబోతున్నాడు. యువరాజ్ సింగ్ తల్లి షబ్నమ్, తండ్రి యోగరాజ్ కొన్ని సంవత్సరాల క్రితమే విడిపోయారు. తల్లి దగ్గరే యువరాజ్ పెరిగిన సంగతి తెలిసిందే. -
రష్యా, సిరియా, శరణార్థులే యూరో ఎజెండా
-
అనుమతి లేకుండా విధులకు హాజరు కాని ఉపాధ్యాయులు వివరణ ఇవ్వాలి
నల్లగొండ టూటౌన్: జిల్లా విద్యాశాఖకు ఎలాంటి సమాచారం తెలపకుండా పాఠశాలల విధులకు గైర్హాజరవుతున్న ఉపాధ్యాయులు వారం రోజులలోగా వివరణ ఇవ్వాలని డీఈఓ వై.చంద్రమోహన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనుమతి లేకుండా దేవరకొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఎస్.విమల 2011 నుంచి, మునగాల మండలం నెలమర్రీ జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయులు పి.సౌజన్య 2005 నుంచి, నల్లగొండలోని ఆర్పీ రోడ్డు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు సబియా జబీన్ 2013 నుంచి, వలిగొండ మండలం దాసిరెడ్డిగూడెం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు కె.శ్రీదేవి 2013 నుంచి విధులకు హాజరుకావడం లేదని పేర్కొన్నారు. వారం రోజుల్లోగా ఏలాంటి వివరణ ఇవ్వకుంటే తదుపరి క్రమశిక్షణ చర్యలు తీసుకోబడునని తెలిపారు. -
ఉపాధ్యాయులు వివరణ ఇవ్వాలి
నల్లగొండ టూటౌన్: జిల్లా విద్యాశాఖకు ఎలాంటి సమాచారం తెలపకుండా పాఠశాలల విధులకు గైర్హాజరవుతున్న ఉపాధ్యాయులు వారం రోజులలోగా వివరణ ఇవ్వాలని డీఈఓ వై.చంద్రమోహన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనుమతి లేకుండా దేవరకొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఎస్.విమల 2011 నుంచి, మునగాల మండలం నెలమర్రీ జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయులు పి.సౌజన్య 2005 నుంచి, నల్లగొండలోని ఆర్పీ రోడ్డు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు సబియా జబీన్ 2013 నుంచి, వలిగొండ మండలం దాసిరెడ్డిగూడెం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు కె.శ్రీదేవి 2013 నుంచి విధులకు హాజరుకావడం లేదని పేర్కొన్నారు. వారం రోజుల్లోగా ఏలాంటి వివరణ ఇవ్వకుంటే తదుపరి క్రమశిక్షణ చర్యలు తీసుకోబడునని తెలిపారు. -
సర్వం సిద్ధం
రేపు ‘అనంత’లో రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడుకలు హాజరుకానున్న సీఎం చంద్రబాబు ఏర్పాట్లన్నీ పూర్తి చేసిన అధికారులు భద్రత, కార్యక్రమ నిర్వహణపై గుబులు రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఇందుకోసం ఇప్పటికే జిల్లా కేంద్రంలోని నీలం సంజీవరెడ్డి స్టేడియాన్ని (పీటీసీ మైదానం) సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రాష్ట్రస్థాయి వేడుకలు జిల్లా చరిత్రలో తొలిసారిగా నిర్వహిస్తుండడంతో అధికారులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. స్టేడియాన్ని శనివారం ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ, సీఎం సెక్యూరిటీ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ రెండు రోజుల పాటు స్టేడియంలోకి బయటి వ్యక్తులకు అనుమతి లేదు. పరిసర ప్రాంతాల్లోనూ ప్రత్యేక ఆంక్షలు విధించారు. నేటి (ఆదివారం) నుంచి మరుసటి రోజు వేడుకలు ముగిసేదాకా నిబంధనలు కఠినతరం చేస్తున్నారు. ఫ్లైఓవర్ నుంచి పీటీసీ మీదుగా లక్ష్మీనగర్, రాంనగర్ మార్గంలో రాకపోకలు నిషేధిస్తున్నారు. ఆ ప్రాంత ప్రజలు అటు నుంచి అటే రాంనగర్ వైపునకు వెళ్లాల్సి ఉంటుంది. వాహన తనిఖీలు, ఇంటింటా సర్వేలను పోలీస్ అధికారులు వేగవంతం చేశారు. పరేడ్, సాంస్కతిక∙బందాలు రిహార్సల్స్‌లో నిమగ్నమయ్యాయి. శకటాలు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. అధికారుల్లో గుబులు ఏర్పాట్లన్నీ తక్కువ సమయంలోనే అధికారులు పూర్తి చేశారు. ఇందుకోసం ఇప్పటి వరకూ రూ. 2.70 కోట్లు వెచ్చించారు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. వేడుకలు జరుగుతున్నంత సేపూ భద్రత, నిర్వహణపై అధికారుల్లో గుబులు మొదలైంది. జిల్లా నుంచి దాదాపు 2,500 మంది పోలీసులను, కొందరు రెవెన్యూ, ఇతర ప్రభుత్వశాఖల అధికారులను కష్ణా పుష్కరాలకు పంపారు. దీంతో పంద్రాగస్టు రోజున భద్రత, నిర్వహణ ఎలా ఉంటుందనే టెన్షన్ అందరిలోనూ మొదలైంది. కేవలం 1,500 మందితోనే బందోబస్తు నిర్వహిస్తున్నారు. దీనివల్ల ట్రాఫిక్ ఆంక్షలు అవసరానికి మించి విధిస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. నగరంలోకి ప్రవేశించే బళ్లారి బైపాస్‌రోడ్డు, కళ్యాణదుర్గం బైపాస్‌రోడ్డు, రుద్రంపేట నుంచి పీటీసీ వైపు వచ్చే లక్ష్మీనగర్రోడ్డు, కోర్టు రోడ్డు, టవర్‌క్లాక్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. దీంతో స్వాతంత్య్ర వేడుకలు చూసేందుకు వచ్చే ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రాంతాల్లో వాహనాలు నిలబెట్టి స్టేడియానికి నడుచుకుని రావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. -
డీఈఈసెట్ సర్టిఫికెట్ల పరిశీలనకు 432 మంది హాజరు
బొమ్మూరు (రాజమహేంద్రవరం రూరల్) : బొమ్మూరులోని జిల్లా విద్యా శిక్షణ సంస్థ(డైట్)లో డీఈఈసెట్–2016లో అర్హత సాధించి డీఎడ్ కోర్సుల్లో చేరే అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన మూడో రోజైన మంగళవారం కూడా కొనసాగింది. 432 మంది సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ఆన్లైన్లో నిర్దేశించిన ఫీజులు చెల్లించిన తరువాత కళాశాల అడ్మిషన్ లేఖలు అందజేసినట్టు ప్రిన్సిపాల్ జయప్రకాశరావు తెలిపారు. -
ఎంసెట్ కౌన్సెలింగ్‌కు 21 మంది హాజరు
ఈ నెల 28 రాత్రి 10గంటలæవరకు గడువు పెంపు సప్తగిరికాలనీ: ఎంసెట్ ఎంపీసీ స్ట్రీమ్ కౌన్సిలింగ్lగడువు ఈనెల 28 వరకు గడువును పొడిగించినట్లు మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ రాజగోపాల్ తెలిపారు. ఆన్లైన్లో వెబ్ ఆప్షన్ పెట్టుకొనే వారు మొదటి ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు ఈనెల 28 రాత్రి 10గంటల వరకు పెట్టుకోవచ్చని అన్నారు. సోమవారం జరిగిన కౌన్సిలింగ్‌కు మొత్తం 21మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. -
మమత ప్రమాణ స్వీకారోత్సవానికి భూటాన్ రాజు
కోల్ కతా: పశ్చిమ బెంగాళ్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారోత్సవానికి భూటాన్ రాజు శెరింగ్ తొబ్గే హాజరు కానున్నారు. మమత ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రత్యక్షంగా హాజరై ఆమెకు శుభాకాంక్షలు చెప్పడానికి ఎదురు చూస్తున్నానని ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. తొబ్గే ట్వీట్ పై స్పందించిన మమత ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. గతేడాది మమత భూటాన్ వెళ్లిన సందర్భంలో ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. భూటాన్ కోల్ కతాతో 180 కి.మీ సరిహద్దును పంచుకుంటుంది. నరేంద్రమోదీ, సోనియా గాంధీ, అరుణ్ జైట్లీ, లాలూ ప్రసాద్ యాదవ్, నితిష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్ లను కూడా మమత తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించింది. మమత రెండోసారి సీఎంగా ఈనెల 27 న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
యోగాడే రోజున ఛండీగఢ్ లో..
న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్సరించుకొని ఈ నెల 21 న ఛండీగడ్ రాష్ట్రంలో అక్కడి ప్రజలతో కలిసి యోగా చేస్తానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ లో తెలిపారు. సమస్య వచ్చిన తర్వాత కంటే ముందు జాగ్రత్త మంచిదని ఆయన అన్నారు. యోగా డే అనేది ఒక్క రోజు వేడుక కాదని ప్రతీ ఒక్కరు తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలన్నారు. ప్రతీ ఒక్కరూ రోజూ 20 నుంచి 30 నిమిషాలు యోగా చేయాలన్నారు. పేదవాళ్లు వైద్యం కోసం ఎంతో ఖర్చు చేస్తుంటారని, యోగా చేయడం మూలాన అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. -
థానే అమ్మాయికి అమెరికా ఆహ్వానం..
మహరాష్ట్రః ముంబై కాలేజీలో చదువుతున్న విద్యార్థినికి ఆమెరికా ఆహ్వానం పలికింది. వచ్చే సంవత్సరం వాషింగ్టన్ లో జరగనున్న కార్యక్రమానికి థానెకు చెందిన విద్యార్థిని ఓయిషికా ఎంపికైంది. దీంతో రానున్న ప్రెసిడెన్షియల్ ప్రారంభోత్సవ లీడర్షిప్ సమ్మిట్ కు రావాల్సిందిగా ఆమెకు ప్రత్యేక ఆహ్వానం పంపింది. మహరాష్ట్ర థానెకు చెందిన పదహారేళ్ళ ఓయిషికా నియోగి... ముంబై కాలేజీలో చదువుకుంటోంది. తన తల్లి చుమ్కీ నియోగి తో పాటు థానే మీరా రోడ్ శివారు ప్రాంతంలో నివసిస్తోంది. ప్రస్తుతం ముంబై మలాద్ లోని బికె గాడియా జూనియర్ కాలేజీలో సైన్స్ గ్రూప్ లో ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన ఓయిషికా... కొత్తగా ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు పాల్గొనే యువ ప్రపంచ సదస్సులో భారత్ కు ప్రాతినిథ్యం వహించనుంది. 2017లో వాషింగ్టన్ లో జరిగే ఈ కార్యక్రమానికి అతి పిన్న నోబెల్ గ్రహీత, పాకిస్తానీ అమ్మాయి, విద్యా కార్యకర్త మలాలా, ఆమె తండ్రి జియావుద్దీన్ కూడ ఇతర ఆహ్వానితులుగా హాజరుకానున్నారు. వారందరినీ కలిసే అవకాశం తనకు రావడంపట్ల ఓయిషికా ఆనందం వ్యక్తం చేస్తోంది. ఓ అద్భుతమైన వక్త, యువ మేధావి కావడంతోనే ఆమెకు ఈ అరుదైన అవకాశం వచ్చిందంటూ బికె గాడియా కాలేజ్ ప్రిన్సిపాల్ అరుంధతి ఓయిషికాను ప్రశంసించారు. ఓయిషికా కలకత్తాలో పుట్టింది. హైదరాబాద్ లో జరిగిన హార్వర్డ్ యునైటెడ్ నేషన్స్ పోటీలో రాణించిన ఆమె... అనంతరం జూన్ 2015 లో అమెరికా గ్లోబల్ యంగ్ లీడర్స్ సదస్సు డిక్లమేషన్ పోటీలోనూ గెలిచింది. తరువాతే ఆమెకు ఈ సదవకాశం వచ్చింది. అంతర్జాతీయ సంబంధాలపై ఆసక్తి ఉన్న విద్యార్థులు... మోడల్ చర్చల్లో పాల్గొని ప్రత్యేకంగా ప్రపంచ ప్రేక్షకులముందు వాటిని బహిర్గతం చేసేందుకు ఐక్యరాజ్యసమితి మోడల్ యునైటెడ్ వేదిక రూపొందించింది. బి. కె. గాడియా జూనియర్ కళాశాల కు చెందిన డి.జి కేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతి సంవత్సరం ఐక్యరాజ్యసమితి మాక్ డిబేట్ నిర్వహిస్తుంది. అందులో గెలిచిన ఓయిషికా గత సంవత్సరం హైదరాబాద్ పోటీలో రాణించి, అనంతరం వాషింగ్టన్ డిసి, న్యూయార్క్ ల్లో జరిగిన గ్లోబల్ యూత్ లీడర్ షిప్ కాన్ఫరెన్స్ కు కూడ హాజరైంది. అయితే ప్రస్తుతం అమెరికా ఆహ్వానంమేరకు ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ సమ్మిట్ కు హాజరు కాబోతోంది. తనకు బరాక్ ఒబామా, మిచెల్లె లు కూడ ఎంతో ఆరాధ్యులని, వారిని కూడ ఎప్పుడోప్పుడు కలుస్తానని ఈ సందర్భంగా చెప్తోంది. రానున్న ఆమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ గెలవాలని తాను వ్యక్తిగతంగా కోరుకుంటున్నానని, అలా జరిగితే వైట్ హౌస్ లో మొదటి మహిళా అధ్యక్షురాలుగా హిల్లరీది చారిత్రక విజయమౌతుందని, ఆమె ఓ మంచి నాయకురాలుగా వర్థిల్లుతుందన్న నమ్మకం కూడ తనకు ఉందని ఓయిషికా చెప్తోంది. అయితే డోనాల్డ్ ట్రంప్ కాస్త దూకుడు మనిషి అయినా ఆమెరికన్లు ఆయన్ను ఇష్టపడుతున్నట్లుగా కనిపిస్తోందని, చాలాకాలం ప్రశాంతంగా కొనసాగిపోవడంతో ఇప్పుడు కాస్త దూకుడు కావాలన్న దృష్టిలో అమెరికన్లు ఉన్నారని అంటోంది. భవిష్యత్తులో టెలివిజన్ మీడియా ప్రొఫెషనల్ కావాలనుకుంటున్న ఓయిషికా.. ఐక్యరాజ్య సమితిలో మీడియా ప్రతినిధిగా పనిచేయాలని కలలుగంటోంది. ప్రపంచ వ్యవహారాల్లో జ్ఞానాన్ని సముపార్జించడమేకాక, వెస్ట్రన్ డ్యాన్స్ అండ్ థియేటర్, పెయింటింగ్ వంటి వాటిలో కూడ ఓయిషికా శిక్షణ పొందుతోంది. -
ఆ మూడు అడుగుల యువతి మహా సంకల్పం
కోల్‌కతా: ఆమె ఎత్తు మూడడుగులు. వయసు మాత్రం 19 ఏళ్లు. పుట్టుకతోనే అకాండ్రాప్లాసియా అనే జబ్బుతో బాధపడుతున్న ఆమెకు శరీర భాగాలు పెరగకుండా మందగించాయి. దీంతో ఆమె మూడు అడుగులకే పరిమితమై పోయింది. కాళ్లు, చేతులు, వేళ్లు అన్ని పెరుగుదల లోపించి ఉన్నాయి. ఫలితంగా ఆమె కూర్చోలేదు, నడవలేదు. దీంతో ఆమెను ఎక్కడికైనా తల్లిదండ్రులు తీసుకెళ్లాల్సిందే. పశ్చిమ బెంగాల్ లోని శాంతిపూర్‌కు చెందిన పియాశా మహల్దార్(19) అనే మూడు అడుగుల ఎత్తుకే పరిమితమైన యువతి అమర్తలా ప్రాథమిక పాఠశాలలో సెకండరీ ఎడ్యుకేషన్ చదువుతోంది. ఆమె చదువులో భాగంగా శాంతిపూర్ ఓరియెంటల్ అకాడమీలో పరీక్షలకు హాజరైంది. ఆమెకోసం అధికారులు ప్రత్యేక గదిలో ఓ టేబుల్ ఏర్పాటుచేశారు. ఆ టేబుల్‌పై పడుకొని పరీక్షను రాసింది. గతంలో జరిగిన పరీక్షల్లో కూడా ఆమె అసాధారణ ప్రతిభ కనబరిచింది. శారీరకంగా కొంత బలహీనమైన పరిస్థితిలో కనిపించినా ఆ ఆలోచనను ఎప్పుడూ తన మనసులోకి రానివ్వకుండా గొప్ప స్థానానికి వెళ్లాలన్న లక్ష్యంతో ఆమె దూసుకెళ్లిపోతుంది. -
కోడిపందేలకు తాము సైతం అంటున్న మహిళలు!!
-
ప్రకాశం జిల్లాలో భోగి సంబరాలు
-
గాలిపటం ఎగరవేసిన 'కవిత'
-
పరీక్ష రాసింది 12,000.. పాసైంది 20,000
ఆగ్రా: బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ బీఈడీ పరీక్షల ఫలితాలను ప్రకటించడానికి ఉపక్రమించిన అధికారులు తమ చేతిలో ఉన్న గణాంకాలను చూసి షాక్‌కు గురయ్యారు. ఆగ్రాలోని ఈ యూనివర్సిటీ తరపున మొత్తం పరీక్ష రాసిన విద్యార్థులు 12,800 మంది ఉన్నట్లు తొలుత తెలిపిన అధికారులు తీరా ఫలితాలను ప్రకటించే సమయానికి 20,089 మంది పాసైనట్లు గుర్తించారు. దీనిపై యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ మహమ్మద్ ముజమ్ముల్ విచారణకు ఆదేశించి, చివరి నిమిషంలో ఫలితాలను వాయిదా వేశారు. యూనివర్సిటీ బీఈడీ పరీక్షల ఫలితాల లిస్టును తయారు చేయడానికి ఓ ప్రైవేట్ ఏజెన్సీని నియమించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ కళాశాలలు నిబంధనలను ఉల్లంఘించి విద్యార్థులకు పరీక్షలు రాయడానికి అనుమతించడం వలనే ఈ గందరగోళం ఏర్పడిందని భావిస్తున్నారు. పరీక్షలు మొదలయ్యే రోజున కూడా కొన్ని కాలేజీలు విద్యార్థులను చేర్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు కళాశాలలు తమకు కేటాయించిన సీట్లకు మించి విద్యార్థులను చేర్చుకున్నట్లు గుర్తించిన అధికారులు.. కళాశాలల యాజమాన్యాన్ని విద్యార్థుల లిస్టును తీసుకురావాల్సిందిగా ఆదేశించారు. -
‘హాజరు’ పేరుతో అదనపు బాదుడు
అటెండెన్స్ ఫీజుల బలవంతపు వసూలు చెల్లించలేకపోతోన్న విద్యార్థులు రశీదులైనా ఇవ్వని కళాశాల సిబ్బంది వెల్దుర్తి: వాళ్లంతా నిరుపేద విద్యార్థులు..ప్రైవేట్ కళాశాలల్లో ఫీజులు కట్టే స్థోమత లేక ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులు..కళాశాలలో హాజరు శాతం తక్కువగా వుందంటూ పరీక్ష ఫీజులతోపాటు అదనంగా రూ. 530 వసూళ్లు చేయడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఆ కళాశాలలో లెక్చరర్లు చేసే ఈ అక్రమ వ సూళ్ల సంగతి ప్రిన్సిపాల్‌కు తెలియకపోవడం విశేషం. వివరాల్లోకెళితే..వెల్దుర్తిలో ఉన్న శ్రీ రాయరావు సరస్వతీ మె మోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి, ద్వితీయ సంవత్సరం తరగతుల్లో 419 మంది విద్యార్థులు చ దువుకుంటున్నారు. అయితే ఈ కళాశాలలో 60మందికి పరీక్షల ఫీజు రూ.370 తోపాటు హాజరు శాతం తక్కువ ఉన్నం దున అదనంగా రూ.530 అధ్యాపకులు బలవంతంగా వసూలు చేస్తున్నారని బా ధిత విద్యార్థులు వాపోయారు. అదనపు సొమ్ము చెల్లిస్తే కనీసం రశీదులు కూడా ఇవ్వడం లేదని విద్యార్థులు తెలిపారు. కరువు కాలం ఉన్నందున అంత డబ్బు కట్టలేని పరిస్థితి ఉందని విద్యార్థులు వాపోయారు. ఫీజుతో పాటు అదనపు డబ్బు కడితేనే హాల్‌టికెట్లు ఇస్తామంటున్నారని, లేకుంటే ఇవ్వమంటున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కమిషనర్ ఆదేశాలతోనే అదనపు రుసుం వసూలు అక్రమ వసూళ్ల విషయమై కళాశాల ప్రిన్సిపాల్ నర్సింలును వివరణ కోరగా విద్యార్థులు నుండి అదనపు వసూళ్లు చేస్తున్నట్లు తన నోటీసులో లేదన్నారు. అనంతరం 22మంది సీఈసీ సెకండ్ ఇయర్ విద్యార్థుల నుండి అదనంగా రూ.530వసూళ్లు చేశామని, హాజరు శాతం తక్కువ ఉన్నందునే ఇలా వసూళ్లు చేశామని లెక్చరర్లు తెలిపారు. దీంతో ప్రిన్సిపాల్ నర్సింలు మాట్లాడుతూ 60నుండి 75శాతం హాజరు శాతం తక్కువ ఉన్న విద్యార్థుల నుండి పరీక్ష ఫీజుతో పాటు కండోనేషన్ ఫీజు కింద రూ.530 వసూళ్లు చేయాలనే ఆదేశం కమిషనర్ నుండి ఉన్నాయన్నారు. కానీ రిసిప్ట్లు ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నిస్తే అధ్యాపకులు నీళ్లు మింగుతున్నారు. మధ్యలో ప్రిన్సిపాల్ కల్పించుకొని వసూళ్లు చేసిన డబ్బును కళాశాల అకౌంట్లోకి మార్చడానికి డీడీలు తీసిన అనంతరం విద్యార్థులకు రసీదులు అందజేస్తామన్నారు. -
’చీకటిరాజ్యం, ప్రీమీయర్ షోకు మంత్రి కేటీఆర్
-
అనంతపురం చేరుకున్న వైఎస్ జగన్
-
ఇజ్రాయెల్ ఎగ్జిబిషన్ కు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
హైదరాబాద్ : ఇజ్రాయెల్ లో జరగనున్న వ్యవసాయ ఎగ్జిబిషన్ కు 8మంది తెలంగాణ ప్రతినిధుల బృందం హాజరుకానుంది. ఈ నెల 27 నుంచి 30 వరకు ఇజ్రాయెల్ లో వ్యవసాయ శాఖ అధికారులు ఈ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. ప్రగతి శీల రైతుల వివాదంలో భాగంగా ఎమ్మెల్యేల పేర్లు చేర్చి విదేశీ పర్యటనకు తెలంగాణ సర్కారు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్ కు రైతుల కోటాలో హాజరయ్యేందుకు ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి, కె.విద్యాసాగర్ రావు, గంగుల కమలాకర్, డి.మనోహర్ రెడ్డిలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. -
విజయవాడలో సచిన్ సందడి
-
సీబీఐ కోర్టుకు హాజరైన జగన్
తదుపరి విచారణ ఆగస్టు 11కి వాయిదా సాక్షి, హైదరాబాద్: తన కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించిన కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్రెడ్డి సోమవారం సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు. అలాగే ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఆడిటర్ వి.విజయసాయిరెడ్డి, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి, మోపిదేవి వెంకటరమణతోపాటు పారిశ్రామికవేత్తలు నిమ్మగడ్డ ప్రసాద్, శ్యాంప్రసాద్‌రెడ్డి, పెన్నా ప్రతాప్‌రెడ్డి, సీనియర్ ఐఏఎస్‌లు బీపీ ఆచార్య, శ్యాంబాబు, ఆదిత్యనాథ్‌దాస్, మన్మోహన్సింగ్ తదితరులు హాజరు కాగా మిగిలిన వారు హాజరు నుంచి మినహాయింపు కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసులో దాఖలు చేసిన మొదటి చార్జిషీట్ (సీసీ 8)లో నిందితులపై అభియోగాల నమోదు ప్రక్రియను చేపట్టాలని సీబీఐ స్పెషల్ పీపీ సురేంద్ర కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు స్పందించిన ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి బాలయోగి...డిశ్చార్జ్ పిటిషన్లపై ముందుగా వాదనలు వినిపించాలని, వాటిపై నిర్ణయం తీసుకున్న తర్వాతే అభియోగాల నమోదు ప్రక్రియపై వాదనలు వింటామని సీబీఐ స్పెషల్ పీపీకి స్పష్టం చేస్తూ తదుపరి విచారణను ఆగస్టు 11కి వాయిదా వేశారు. ఇదిలా ఉండగా సీనియర్ ఐఏఎస్ అధికారి రత్నప్రభపై మోపిన అభియోగాలను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఆ తీర్పును రత్నప్రభ తరఫు న్యాయవాది ప్రత్యేక కోర్టుకు సమర్పించారు. -
ఒక్క రీజే దీక్ష స్ధలికి 40 వేల మంది