సాక్షి, విజయవాడ: అణగదొక్క బడుతున్న దేవదాసీలకు చేయూత నివ్వాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు. ఏపీ షెడ్యూల్డ్ కులాల సహకార ఆర్థిక సంస్థ నేతృత్వంలో దేవదాసీ వ్యవస్థపై నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. దేవదాసీ వ్యవస్థ నిర్మూలనకు 1988లో చట్టం వచ్చిందని..వ్యవస్థలోని కొందరి వలన ఆ చట్టంతో అనుకున్న స్థాయిలో దేవదాసీలకు న్యాయం జరగలేదన్నారు. దేవదాసీ వ్యవస్థ నిర్మూలించడం కోసం నా వంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ వ్యవస్థ నిర్మూలన కోసం న్యాయమూర్తి కేసీ భాను ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
సీఎం జగన్ దేవదాసీ వ్యవస్థ నిర్మూలనకు కృషి చేస్తున్నారు...
దేవదాసీ వ్యవస్థ నిర్మూలన చట్టం రూపొందించిన విశ్రాంత ఐఏఎస్ అధికారి చల్లప్పా మాట్లాడుతూ.. ఐఏఎస్ అధికారులు నాయకులకు లోబడి పనిచేస్తున్నారని..గతంలో ఏ ప్రభుత్వం కూడా దేవదాసీ నిర్మూలన కోసం పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దేవదాసీ నిర్మూలనకు కృషి చేస్తున్నారని ప్రస్తుతించారు. సీఎం జగన్ సాంఘిక సంక్షేమం కోసం విదేశాల్లో మాట్లాడటం ఆనందంగా ఉందన్నారు. ఐఏఎస్‌లు రవిచంద్ర, దమయంతి.. దేవదాసీ నిర్మూల కోసం ఎంతో పాటుపడ్డారన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఇంతియాజ్,ఎస్సీ కార్పొరేషన్ ఎండి గంథం చంద్రుడు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment