Bengaluru Opposition Meeting Live Updates In Telugu - Sakshi
Sakshi News home page

'జాతీయ సంక్షేమమే అజెండా'.. ముగిసిన ప్రతిపక్ష పార్టీల భేటీ..

Published Mon, Jul 17 2023 3:03 PM | Last Updated on Mon, Jul 17 2023 9:29 PM

26 Parties Attend To Opposition Meeting In Bengaluru Today Updates - Sakshi

బెంగళూరు: బెంగళూరులో జరుగుతున్న ప్రతిపక్ష పార్టీల సమావేశం ముగిసింది. సాంఘీక న్యాయం, సమ్మిళిత వృద్ధి, జాతీయ సంక్షేమమే అజెండాగా పనిచేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఒకే భావాజాలం కలిగిన ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఒకే ధ్యేయం కోసం పోరాడతామని అన్నారు. డిన్నర్ మీటింగ్ అనంతరం ఈ మేరకు మీడియాకు తెలిపారు.  

బెంగళూరులో జరుగుతున్న ప్రతిపక్ష కూటమి భేటీలో పాల్గొన్న వివిధ పార్టీల నేతలు డిన్నర్ మీటింగ్ అనంతరం హోటల్‌ నుంచి బయటకు వస్తున్నారు. 

ప్రతిపక్ష పార్టీలు నేడు బెంగళూరులో సమావేశమయ్యాయి. దాదాపు 24 ప్రతిపక్ష పార్టీల నేతలు డిన్నర్ మీటింగ్‌లో పాల్గొన్నారు. 

ప్రతిపక్ష కూటమికి హాజరవ్వడానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెంగళూరు వెళ్లారు. ఈ మేరకు కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఆయన్ను ఆహ్వానించారు. 

బీజేపీని ఓడించే లక్ష‍్యంతో బెంగళూరు వేదికగా జరుగుతున్న ప్రతిపక్ష భేటీకి బిహార్ సీఎం నితీష్ కుమార్ హాజరయ్యారు. ఈ మేరకు బెంగళూరు చేరిన ఆయనకు సిద్దరామయ్య ఆహ‍్వానం పలికారు. 

ప్రతిపక్ష కూటమి సమావేశంలో హాజరవడానికి కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బెంగళూరు వచ్చారు. ఈ మేరకు కర్ణాటక సీఎం సిద్దరామయ్య .. వారిని ఆహ్వానించారు. 

బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పోరాడతామని సమాజ్ వాదీ పార్టీ అధినేత అకిలేష్ యాదవ్ అన్నారు. మూడింటిలో రెండొంతుల మంది ప్రజలు బీజేపీని ఓడించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలో ఈ సారి బీజేపీ కూటమిని చిత్తుగా ఓడిస్తామని అన్నారు. ఈ మేరకు ప్రతిపక్ష కూటమి భేటీకి బెంగళూరు వచ్చారు. 

రెండు రోజులపాటు జరగనున్న ప్రతిపక్ష కూటమి భేటీకి హాజరవడానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బెంగళూరుకు వచ్చారు. బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పోరాడతామని స్పష్టం చేశారు. 

అర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌లు పాట్నా నుంచి బెంగళూరుకు బయలుదేరారు. 

బెంగళూరు వేదికగా ప్రతిపక్ష పార్టీల భేటీ నేడు ప్రారంభం కానుంది. ఇప్పటేకే కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బెంగళూరుకు చేరారు. కాగా.. బెంగళూరులోని తాజ్‌ హోటల్‌లో వీరు సమావేశం కానున్నారు.   

2024 ఎన్నికల్లో బేజీపీని ఓడించడమే లక్ష‍్యంగా దాదాపు 26 ప్రతిపక్ష పార్టీల నేతలు ఏకమవడానికి వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా నేటి నుంచి రెండు రోజుల పాటు బెంగళూరులో భేటీ కానున్నారు. మంగళవారం అధికారికంగా సమావేశం జరగనుంది. కామన్‌ మనిమమ్‌ ప్రోగ్రామ్‌తో సహా పలు ప్రణాళికలను రచించనున్నారు.

ప్రతిపక్ష కూటమి అజెండాను చర్చించడానికి ఈ సమావేశం వేదిక కానుంది. 2024 ఎన్నికల కోసం కూటమిని నడిపించడానికి ఓ సబ్‌ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. కూటమికి కొత్త పేరును సూచించే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రతిపక్ష కూటమికి ఏం పేరు పెట్టనున్నారనే అంశంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.  పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, నితీష్ కుమార్, తేజశ్వీ యాదవ్, స్టాలిన్ సహా పలువురు ముఖ్య నేతలు హజరుకానున్నారు. 

ఇదీ చదవండి: విపక్షాల సభకు పవార్ వస్తాడా? రాడా? ఇదీ క్లారిటీ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement