today updates
-
'జాతీయ సంక్షేమమే అజెండా'.. ముగిసిన ప్రతిపక్ష పార్టీల భేటీ..
బెంగళూరు: బెంగళూరులో జరుగుతున్న ప్రతిపక్ష పార్టీల సమావేశం ముగిసింది. సాంఘీక న్యాయం, సమ్మిళిత వృద్ధి, జాతీయ సంక్షేమమే అజెండాగా పనిచేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఒకే భావాజాలం కలిగిన ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఒకే ధ్యేయం కోసం పోరాడతామని అన్నారు. డిన్నర్ మీటింగ్ అనంతరం ఈ మేరకు మీడియాకు తెలిపారు. "Like-minded opposition parties shall closely work together to foster an agenda of social justice, inclusive development and national welfare," says Congress President Mallikarjun Kharge after Opposition leaders' dinner meeting in Bengaluru. pic.twitter.com/H27D4nL1iU — ANI (@ANI) July 17, 2023 బెంగళూరులో జరుగుతున్న ప్రతిపక్ష కూటమి భేటీలో పాల్గొన్న వివిధ పార్టీల నేతలు డిన్నర్ మీటింగ్ అనంతరం హోటల్ నుంచి బయటకు వస్తున్నారు. Opposition leaders' dinner meeting concludes in Karnataka's Bengaluru; Opposition leaders leave the meeting venue pic.twitter.com/FijRJO4ANl — ANI (@ANI) July 17, 2023 ప్రతిపక్ష పార్టీలు నేడు బెంగళూరులో సమావేశమయ్యాయి. దాదాపు 24 ప్రతిపక్ష పార్టీల నేతలు డిన్నర్ మీటింగ్‌లో పాల్గొన్నారు. Opposition leaders' dinner meeting gets underway in Karnataka's Bengaluru pic.twitter.com/HENPkecg1g — ANI (@ANI) July 17, 2023 ప్రతిపక్ష కూటమికి హాజరవ్వడానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెంగళూరు వెళ్లారు. ఈ మేరకు కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఆయన్ను ఆహ్వానించారు. #WATCH | Delhi CM Arvind Kejriwal along with AAP MP Sanjay Singh arrives at the venue of the Opposition meeting in Bengaluru, received by Karnataka CM & Congress leader Siddaramaiah, deputy CM DK Shivakumar and party leader KC Venugopal, in Bengaluru pic.twitter.com/ResmhdV5rn — ANI (@ANI) July 17, 2023 బీజేపీని ఓడించే లక్ష్యంతో బెంగళూరు వేదికగా జరుగుతున్న ప్రతిపక్ష భేటీకి బిహార్ సీఎం నితీష్ కుమార్ హాజరయ్యారు. ఈ మేరకు బెంగళూరు చేరిన ఆయనకు సిద్దరామయ్య ఆహ్వానం పలికారు. #WATCH | JD(U) leader and Bihar CM Nitish Kumar arrives for Opposition dinner meeting in Bengaluru, Karnataka pic.twitter.com/Fag2a6OK8a — ANI (@ANI) July 17, 2023 ప్రతిపక్ష కూటమి సమావేశంలో హాజరవడానికి కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బెంగళూరు వచ్చారు. ఈ మేరకు కర్ణాటక సీఎం సిద్దరామయ్య .. వారిని ఆహ్వానించారు. Sonia Gandhi, Mallikarjun Kharge, Rahul Gandhi arrive at Bengaluru ahead of joint Oppn meeting Read @ANI Story | https://t.co/Vb0wqrGsl0#SoniaGandhi #MallikarjunKharge #RahulGandhi #Bengaluru pic.twitter.com/8f3MaeRTvl — ANI Digital (@ani_digital) July 17, 2023 బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పోరాడతామని సమాజ్ వాదీ పార్టీ అధినేత అకిలేష్ యాదవ్ అన్నారు. మూడింటిలో రెండొంతుల మంది ప్రజలు బీజేపీని ఓడించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలో ఈ సారి బీజేపీ కూటమిని చిత్తుగా ఓడిస్తామని అన్నారు. ఈ మేరకు ప్రతిపక్ష కూటమి భేటీకి బెంగళూరు వచ్చారు. #WATCH | Samajwadi Party (SP) chief Akhilesh Yadav, who arrived in Bengaluru today to participate in the joint Opposition meeting, was received by Karnataka Ministers MB Patil and Lakshmi Hebbalkar. (Video: MB Patil) pic.twitter.com/ohxBhot7m2 — ANI (@ANI) July 17, 2023 రెండు రోజులపాటు జరగనున్న ప్రతిపక్ష కూటమి భేటీకి హాజరవడానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బెంగళూరుకు వచ్చారు. బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పోరాడతామని స్పష్టం చేశారు. West Bengal CM and TMC leader Mamata Banerjee and party MP Abhishek Banerjee arrived in Bengaluru for the two-day joint Opposition meeting. Karnataka Deputy CM DK Shivakumar received them. (Pics: Karnataka Pradesh Congress Committee) pic.twitter.com/3VXQG45kCc — ANI (@ANI) July 17, 2023 #WATCH | West Bengal CM and TMC leader Mamata Banerjee arrives in Bengaluru for the two-day joint Opposition meeting. pic.twitter.com/qXmrEtV7uw — ANI (@ANI) July 17, 2023 అర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌లు పాట్నా నుంచి బెంగళూరుకు బయలుదేరారు. #WATCH | RJD chief Lalu Prasad Yadav and party leader-Bihar Deputy CM Tejashwi Yadav leave from Patna. They will participate in the joint Opposition meeting in Bengaluru. pic.twitter.com/cmHOhJWMgR — ANI (@ANI) July 17, 2023 బెంగళూరు వేదికగా ప్రతిపక్ష పార్టీల భేటీ నేడు ప్రారంభం కానుంది. ఇప్పటేకే కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బెంగళూరుకు చేరారు. కాగా.. బెంగళూరులోని తాజ్ హోటల్లో వీరు సమావేశం కానున్నారు. #WATCH | Congress president Mallikarjun Kharge and Congress Parliamentary Party Chairperson Sonia Gandhi arrive in Bengaluru for the joint opposition meeting which will have the participation of 26 like-minded parties. pic.twitter.com/OogxvHsDnK — ANI (@ANI) July 17, 2023 2024 ఎన్నికల్లో బేజీపీని ఓడించడమే లక్ష్యంగా దాదాపు 26 ప్రతిపక్ష పార్టీల నేతలు ఏకమవడానికి వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా నేటి నుంచి రెండు రోజుల పాటు బెంగళూరులో భేటీ కానున్నారు. మంగళవారం అధికారికంగా సమావేశం జరగనుంది. కామన్ మనిమమ్ ప్రోగ్రామ్‌తో సహా పలు ప్రణాళికలను రచించనున్నారు. ప్రతిపక్ష కూటమి అజెండాను చర్చించడానికి ఈ సమావేశం వేదిక కానుంది. 2024 ఎన్నికల కోసం కూటమిని నడిపించడానికి ఓ సబ్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. కూటమికి కొత్త పేరును సూచించే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రతిపక్ష కూటమికి ఏం పేరు పెట్టనున్నారనే అంశంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, నితీష్ కుమార్, తేజశ్వీ యాదవ్, స్టాలిన్ సహా పలువురు ముఖ్య నేతలు హజరుకానున్నారు. ఇదీ చదవండి: విపక్షాల సభకు పవార్ వస్తాడా? రాడా? ఇదీ క్లారిటీ.. -
సాక్షి స్పీడ్ న్యూస్ 10 January 2022
-
సాక్షి స్పీడ్ న్యూస్ 01 September 2021
-
టుడే అప్డేట్స్..
సాక్షి, హైదరాబాద్ : నేటి నుంచి విశాఖపట్నం-విజయవాడ మధ్య విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల ఒత్తిడితో విశాఖపట్నం-విజయవాడ మధ్య విమాన సర్వీసుల పునరుద్దరణకు ఎయిర్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా రాష్ట్రంలోని వివిధ విమానశ్రయాల నుంచి సర్వీస్‌లను పునరుద్దరించాలని పౌరవిమానయన శాఖకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇక నేటి అప్డేట్స్ ఇవి.. ► రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ నేటి నుంచి ఆరంభం కానుంది. కొత్త విధానంలో ప్రభుత్వం దశల వారీగా మద్యనిషేధానికి అధిక ప్రాధాన్యం ఇవ్వనుంది. ఇందులో భాగంగా మంగళవారం అక్టోబర్ 1 నుంచి పలు కీలక మార్పులను సర్కారు తీసుకొస్తోంది. ప్రధానంగా మద్యం అమ్మకాలు ఇకపై రాత్రి 8 గంటల వరకే పరిమితం చేస్తున్నారు. ► ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. మూడో రోజు ఉత్సవాల్లో భాగంగా నేడు గాయత్రి దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. అదేవిధంగా నేడు గవర్నర్ హరిచందన్ బిశ్శభూషణ్ కుటుంబసమేతంగా కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోనున్నారు. ► శ్రీశైలం దసరా మహోత్సవాలకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా నేడు చంద్రఘంట అలంకారంలో భ్రమరాంబాదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ► తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆదివారం అంకురార్పణ నిర్వహించారు. సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తరుపున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ఉదయం చిన్నశేష వాహనంపై స్వామివారి ఊరేగింపు నిర్వహిస్తారు. రాత్రి 8 గంటలకు శ్రీవేంకటేశ్వర స్వామి హంస వాహనంపై మలయప్ప స్వామి అవతారంలో మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనం కల్పిస్తారు. తెలంగాణ అప్డేట్స్.. నేడు ప్రగతిభవన్‌లో సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినేట్ భేటి జరగనుంది. హైదరాబాద్‌లో నేడు.. ► వేదిక: శిల్పారామం, ఉప్పల్ ఫోక్ డ్యాన్స్ బై రాధిక శ్రీనివాస్ శక్తి సమయం: సాయంత్రం 5 గంటలకు కూచిపూడి రెక్టికల్ వనిరామం స్టూడెంట్స్ సమయం: సాయంత్రం 6 గంటలకు భరతనాట్యం రెక్టికల్ సమయం: సాయంత్రం 5 గంటలకు కథక్ రెక్టికల్ సమయం: సాయంత్రం 5–30 గంటలకు ఒగ్గు డోలు ఫోక్ సమయం: సాయంత్రం 6 గంటలకు ► వేదిక: లాల్ బహదూర్స్టేడియం వ్రెస్లింగ్ కాంపిటీషన్, సమయం: ఉదయం 8 గంటలకు ఆల్ ఇండియా ఒపెన్ ఫైడ్ రేటింగ్ చెస్ టోర్నమెంట్, సమయం: సాయంత్రం 6 గంటలకు ► చిల్డర్న్ ఆఫ్ మెన్ – ఇంగ్లిష్ ఫిల్మ్ ఫ్రీ స్క్రీనింగ్ వేదిక: నృత్య – ఫోరమ్ ఫర్ ఫర్ఫామింగ్ ఆర్ట్స్, బంజారాహిల్స్ , సమయం: సాయంత్రం 6–30 గంటలకు ► ఆకృతి ఎలైట్ ఎగ్జిబిషన్ ఆండ్ సేల్ వేదిక: తాజ్ డక్కన్, బంజారాహిల్స్, సమయం: సాయంత్రం 4 గంటలకు ► ఫ్లేవర్స్ ఆఫ్ టర్కీ వేదిక: హైదరాబాద్ షెరటాన్ హోటల్, గచ్చిబౌలి, సమయం: రాత్రి 7 గంటలు ► అక్టోబర్ ఫెస్ట్: ట్రెడిషనల్ ఫుడ్ వేదిక: ది వెస్ట్రన్ హైదరాబాద్ మైండ్ స్పేస్, హోటల్ మాదాపూర్ ,సమయం: సాయంత్రం 5 గంటలు ► మహాత్మ 150 డ్రాయింగ్స్ బై శంకర్ పామర్తి వేదిక: కళాకృతి, బంజారాహిల్స్ , సమయం: ఉదయం 10–30 గంటలకు ► సౌత్ కాస్ట్ స్పైస్ట్రైల్ వేదిక: ఫార్చూన్ పార్క్ వల్లభ హోటల్ , రోడ్‌నం.12, బంజారాహిల్స్ , సమయం: సాయంత్రం 5 గంటలు ► డిస్కో దాండియా వేదిక– ది పార్క్ హైదరాబాద్, సోమాజీగూడ ,సమయం: సాయంత్రం 6 గంటలకు ► నవరాత్రి ఉత్సవ్ 2019 వేదిక: బేగంపేట్ హాకీ స్టేడియం, రసూల్‌పుర, సమయం: సాయంత్రం 6–30 గంటలకు ► నాందారీ గౌరవ్ నవరాత్రి ఉత్సవ్ 2019 వేదిక: ఎస్ ఎస్ కన్వెంషన్ సెంటర్, శంషాబాద్, సమయం: రాత్రి 9 గంటలకు ► సిల్క్ ఆండ్ కాటన్ ఎగ్జిబిషన్ వేదిక: టీటీడీ బాలాజీ భవన్, హిమాయత్‌నగర్, సమయం: ఉదయం 10–30 గంటలకు ► ఏ జోన్ ఇంటర్నేషనల్ బాస్కెట్‌బాల్ కోచింగ్ క్యాంప్ వేదిక: ఇండోర్ స్టేడియం , గచ్చిబౌలి, సమయం: ఉదయం 7 గంటలు ► రామాయణ్ మేళా వేదిక: ఎగ్జిబిషన్ గ్రౌండ్, నాంపల్లి, సమయం: రాత్రి 7 గంటలకు ► నవరాత్రి ఉత్సవ్ 2019 వేదిక: కంట్రీ క్లబ్, బేగంపేట్ ,సమయం: రాత్రి 7 గంటలకు ► ఆల్ ఇండియా శారీమేళ, దసరా ఫెస్టివల్ వేదిక: శిల్పారామం , సమయం: ఉదయం 11–30 గంటలకు ► డైమండ్ జ్యువెలరీ – ఎగ్జిబిషన్ వేదిక: ఒఆర్ఆర్ఎ డైమండ్ జ్యువెలరీ , పంజాగుట్ట, సమయం: ఉదయం 10 గంటలకు ► పాన్ ఏషియన్ ఫుడ్ ఫెస్టివల్ వేదిక: చైనా బిస్ట్రో, జూబ్లీహిల్స్ , సమయం: మధ్యాహ్నం12.30 గంటలకు ► ఇండియన్ ఫొటోగ్రఫీ ఫెస్టివల్ వేదిక:తెలంగాణస్టేట్గ్యాలరీఆఫ్ఫైన్ ఆర్ట్స్, సమయం: ఉదయం 9 గం. ► వేదిక: అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్ యోగా క్లాసెస్ సమయం: సాయంత్రం 6 గంటలకు భరత నాట్యం క్లాసెస్, సమయం: సాయంత్రం 5–30 గంటలకు మోహినీయట్టం క్లాసెస్, సమయం: సాయంత్రం 4.30 గంటలకు. -
టుడే న్యూస్ రౌండప్
కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఛలో అమరావతి పాదయాత్ర నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో భారీగా పోలీసులు మోహరింపు పెరిగిపోయింది. పాదయాత్రకు అడ్డంకులు ఎదురుకావడంపై కాపు ఉద్యమనేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ► లార్డ్స్‌లో జరుగుతున్న ఫైనల్లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడుతోంది. టాస్ నెగ్గిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ హోదాలో మిథాలీ రాజ్ రెండోసారి వరల్డ్ కప్ ఫైనల్ ఆడుతున్నారు. మరిన్ని ప్రధాన వార్తల అప్డేట్స్ మీ కోసం.. <<<<<<<<<<<<<<<<పాలిటిక్స్>>>>>>>>>>>>>>>>> పోలీసుల గుప్పిట్లో కిర్లంపూడి! బీసీ రిజర్వేషన్ సాధన కోసం ఉద్యమిస్తున్న కాపులపై చంద్రబాబు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఏపీ మంత్రి ఓవరాక్షన్! జెడ్పీ సమావేశంలో మంత్రి ఆదినారాయణరెడ్డి ఓవరాక్షన్ చేశారు టీడీపీ మరో దిగజారుడు ఫార్ములా.. నంద్యాల ఉప ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర మంత్రులు, సీఎం నారా చంద్రబాబు నాయుడు సైతం నంద్యాలలో మకాం వేశారు. రాస్తే రామాయణం.. చెప్తే భారతం: లక్ష్మణ్ భారత ప్రధాని నరేంద్రమోదీని యావత్ ప్రపంచం మరో వివేకానందుడిగా కీర్తిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఎక్కడా లేని అభివృద్ధి ఇక్కడే జరుగుతోంది: మంత్రి లక్ష్మారెడ్డి దేశంలోనే ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి, సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమలవుతున్నాయని ఆర్యోగ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. <<<<<<<<<<<<<<<<అంతర్జాతీయం>>>>>>>>>>>>>>>>> డోక్లాంపై చర్చలే ఉత్తమం: అమెరికా భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు ఆ రెండు దేశాలు ముఖాముఖి చర్చలు జరపాలని అమెరికా సూచించింది. విదేశీ ప్రధాని.. దేశీ అవతార్! హిందూ సంప్రదాయ దుస్తులు కుర్తాపైజామా ధరించి ఆయన టోరంటోలోని బాప్స్ శ్రీ స్వామినారాయణ్ మందిరాన్ని దర్శించుకున్నారు. భారత్‌లో ఏకంగా 927 ఉగ్రదాడులు.. భారత్‌కు ఉగ్రముప్పు రోజురోజుకు పెరుగుతోంది. <<<<<<<<<<<<<<<<జాతీయం>>>>>>>>>>>>>>>>> రాష్ట్రాలకు ప్రత్యేక జెండా.. డిమాండ్ ఉధృతం కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టమాట వ్యాపారుల అనూహ్య నిర్ణయం! టమాట ధరలు చుక్కలనంటడంతో కూరగాయాల్లో అత్యంత ఖరీదైన వస్తువుగా మారింది. పాకిస్థాన్‌కు వెంకయ్య ఘాటు వార్నింగ్! ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతున్న పొరుగుదేశం పాకిస్థాన్ 1971 యుద్ధంలో ఏం జరిగిందో ఓ సారి గుర్తుకుతెచ్చుకోవాలని ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎం వెంకయ్యనాయుడు హెచ్చరించారు. <<<<<<<<<<<<<<<<క్రీడలు>>>>>>>>>>>>>>>>> మహిళా క్రికెటర్లకు బంపర్ ఆఫర్.. ప్రపంచకప్ ఫైనల్‌కు చేరిన భారత మహిళా జట్టులోని రైల్వే క్రికెటర్లకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభూ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ధోని హ్యాట్రిక్ సిక్సర్లు! చెన్నైలోని చెపాక్ స్టేడియంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు. మిథాలీ సేనకు ధోని సందేశం నేడు మహిళల క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ భారత్ ఇంగ్లండ్ మద్య జరగనుంది. <<<<<<<<<<<<<<<<సినిమా>>>>>>>>>>>>>>>>> సూపర్ స్టార్ ఒక్కడే మిగిలాడు..! క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకుడిగానే కాక, నిర్మాతగానూ బిజీ అవుతున్నాడు. 'బిగ్ బాస్' నుంచి నన్ను ఎలిమినేట్ చేయండి! టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ షో ఏడో ఎపిసోడ్లో ఊహించని సన్నివేశం చోటుచేసుకుంది. సమ సమాజ్ పార్టీలో ఎన్టీఆర్..! యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హీరో కూతురి ఫొటోలు మళ్లీ వైరల్ వెండితెరపై కనిపించక ముందే బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. సాహసాలు చేస్తున్న స్టార్ హీరోయిన్ ఉత్తరాది భామలు ఎలాంటి రిస్క్ చేయడానికైనా రెడీ అంటున్నారు. -
టుడే రౌండప్: ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవే!
టాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో హీరో తరుణ్‌ను సిట్ విచారించింది. సిట్ విచారణకు తరుణ్ సహకరించినట్టు అధికారులు తెలిపారు. మరోవైపు డ్రగ్స్ విచారణ ప్రకంపలను కొనసాగుతున్నాయి. ఈ కేసు విచారణపై దర్శకుడు రాంగోపాలవర్మ చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి. ఇంకా నేటి ప్రధాన వార్తలు.. ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవి.. నా నిజాయితీని నిరూపించుకుంటా: తరుణ్ సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో సిట్ ఎదుట తన నిజాయితీని నిరూపించుకుంటానని ప్రముఖ నటుడు తరుణ్ అన్నారు. · 'మేం ఎవర్నీ టార్గెట్ చేయట్లేదు.. అర్ధం చేసుకోండి' సినిమా పరిశ్రమను టార్గెట్ చేశారనడం సరికాదని తెలంగాణ ఎక్సైజ్‌శాఖ కమిషనర్ చంద్రవదన్ అన్నారు. బ్రేకింగ్: జుబ్లీహిల్స్ నడిరోడ్డు మీద.. పట్టపగలు.. నగరంలో సంపన్నప్రాంతం జుబ్లీహిల్స్.. అలాంటి జుబ్లీహిల్స్‌లో నడిరోడ్డు మీద శనివారం పట్టపగలు దారుణం జరిగింది. చంద్రబాబు టూర్లో కనిపించని శిల్పా చక్రపాణి చంద్రబాబు శనివారం నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. డ్రగ్స్ కేసుపై వర్మ స్పందన టాలీవుడ్ ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో ఫిలిం స్టార్స్ ప్రమోయం పై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. దర్శకుడు పూరి · 'నిజాలు తొక్కిపెడుతున్నారు..' ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న భూకుంభకోణం విచారణ విషయంలో నిజాలను కావాలనే తొక్కిపెడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. హైందవి హత్యకేసులో వీడిన మిస్టరీ! వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో దారుణ హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని కడపన హైందవి కేసు మిస్టరీ వీడింది. సిట్ అధికారులను కలిసిన విష్ణుకుమార్ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు శనివారం సిట్ అధికారులను కలిశారు. · చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు: ఎక్సైజ్ శాఖ డ్రగ్స్ రాకెట్ కేసులో పబ్ ఓనర్లను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారించారు. ఖమ్మంలో మెగా జాబ్‌మేళా ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ చేపడుతున్న మెగా జామ్మేళాను హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు. 'దేవరపల్లిలో ఎమర్జెన్సీ.. ఇంతదారుణమా?' ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళిత వ్యతిరేకి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. ఏపీలో పోలీసులు రాజ్యమేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మో... అమరావతి డ్యూటీయా! ఏపీ రాజధాని అమరావతిలో డ్యూటీ అంటే పొరుగు జిల్లాల పోలీసులు బెంబేలెత్తి పోతున్నారు. స్పాలో సెక్స్ రాకెట్ గుట్టురట్టు స్పా పేరుతో నడుపుతున్న సెక్స్ రాకెట్‌ను రాజస్థాన్ పోలీసులు బట్టబయలు చేశారు. ఎవరి వారసులున్నా వదలం: హోంమంత్రి డ్రగ్ మాఫియాపై ప్రభుత్వం లోతుగా దర్యాప్తు సాగిస్తోందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. నో డౌట్.. డైరెక్టర్ వర్మ అరెస్టు ఖాయం! డ్రగ్స్ కేసులో సినీప్రముఖులను విచారిస్తున్న సిట్ అధికారులపై దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై.. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఎవరికి? ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఎవరికి ? ప్రజలకా ? మాఫియా గుండాలకా ? జాతీయం యుద్ధం వస్తే 10రోజుల కన్నా పోరాడలేం: కాగ్ భారత్ మీదకు ఏ దేశమైనా దండెత్తితే పది రోజులకు మించి పోరాడే ఆయుధ సంపత్తి మన వద్ద లేదని కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) తన రిపోర్టులో పేర్కొంది. 51 ఏళ్ల మహిళపై రేప్: కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు 51 ఏళ్ల మహిళను రేప్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను పోలీసులు శనివారం అరెస్టు చేశారు.. సంచలనం: పోలీస్ Vs ఆర్మీ కల్లోల కశ్మీర్లో కలిసి పనిచేయాల్సిన సైనికులు, పోలీసులు కొట్లాటకు దిగడం సంచలనంగా మారింది. రాహుల్‌తో చాయ్.. మోదీతో డిన్నర్! సాయంత్రం రాహుల్‌గాంధీతో చాయ్‌పే చర్చ.. రాత్రి ప్రధాని నరేంద్రమోదీతో డిన్నర్ మంతనాలు. ‘ఆయన’ నిష్క్రమణ కాంగ్రెస్‌కు దెబ్బే మాజీ ముఖ్యమంత్రి, గుజరాత్ ప్రతిపక్ష నాయకుడు శంకర్‌సింగ్ వాఘేలా కాంగ్రెస్ పార్టీ నుంచి నిష్క్రమిస్తారని గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపించాయి. దినకరన్‌కు చుక్కెదురు! బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న వీకే శశికళను కలిసేందుకు వెళ్లిన అన్నాడీఎంకే (అమ్మ) డిప్యూటీ జనరల్ సెక్రటరీ టీటీవీ దినకరన్‌కు చుక్కెదురైంది. అంతర్జాతీయం అది భారత్, చైనాకు నష్టమే: అమెరికా భారత్, చైనా దేశాల మధ్య కొనసాగుతోన్న సరిహద్దు వివాదాలపై అమెరికా మరోసారి స్పందించింది. 'బాగ్దాదీ చావలే.. మేం చంపాకే నమ్ముతాం' ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాదీ ఇప్పటికీ బతికే ఉన్నట్లు భావిస్తున్నామని అమెరికా తెలిపింది. బిజినెస్ చైనీస్ సంస్థతో ఆపిల్ సీక్రెట్‌గా... ఎలక్ట్రిక్ కార్లు రూపకల్పన రోజురోజుకి పెరిగిపోతుంది. వచ్చేళ్లలో మొత్తంలో ఎలక్ట్రిక్ కార్ల హవానే సాగించాలని ఇటు ఆటో దిగ్గజాలు అటు టెక్నాలజీ కంపెనీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇవీ అంబానీ లెక్కలు పోటీ సంస్థలకు గట్టి షాకిచ్చేలా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ శుక్రవారం సమావేశంలో బ్లాక్‌బస్టర్ ప్రకటనలు చేశారు. అదరగొట్టిన డీమార్ట్ డీమార్ట్‌లను నిర్వహించే అవెన్యూ సూపర్‌మార్ట్స్ స్టాక్మార్కెట్లో లిస్టు అయిన తొలిరోజే దుమ్మురేపి, అనంతరం కొన్ని రోజుల్లోనే ఆ సంస్థ అధినేత రాధాకృష్ణ దమానీని అపరకుబేరుడిని చేసిన సంగతి తెలిసిందే. 25 మోస్ట్ డేంజరస్ పాస్‌వర్డ్‌లివే! ప్రపంచవ్యాప్తంగా ర్యాన్సమ్వేర్ దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వేల కొద్దీ సిస్టమ్‌లను దీన్ని బారిన పడి అతలాకుతలమవుతున్నాయి. ముకేశ్ మేజిక్! టెలికం రంగంలోకి అడుగుపెడుతూనే వినూత్న ఆఫర్లతో సంచలనం సృష్టించిన రిలయన్స్ ఇండస్ట్రీస్...మరో సరికొత్త సంచలనంతో ప్రత్యర్థి కంపెనీల్లో దడ పుట్టించింది. సినిమా వర్మ మాటలు పట్టించుకోవద్దు: శివాజీరాజా టాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ రాకెట్ కేసుపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు శివాజీరాజా మండిపడ్డారు. నా సంతోషానికి జన్మదిన శుభాకాంక్షలు:ఎన్టీఆర్ నేడు జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు అభయ్ రామ్ రెండవ పుట్టిన రోజు. 'దిల్ సే' విత్ భూమిక కమర్షియల్ హీరోయిన్‑గా ఎంట్రీ ఇచ్చి తరువాత లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనూ ఆకట్టుకున్న భామ భూమిక చావ్లా. మంచు కాంపౌండ్ లోకి క్రేజీ యాంకర్..! బుల్లితెరపై తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకున్న యాంకర్ అనసూయ. జబర్థస్త్ షోతో ఒక్కసారిగా స్టార్ లీగ్ స్పోర్ట్స్ మిథాలీ గ్యాంగ్ కు భారీ నజరానా మహిళల వన్డే వరల్డ్ కప్‑లో అద్వితీయ ప్రదర్శనతో ఫైనల్ కు చేరుకున్న భారత క్రికెట్ జట్టుకు భారీ నజరానాను బీసీసీఐ ప్రకటించిది. కౌర్ ఇన్నింగ్స్:'నాతో పోల్చకండి ప్లీజ్!' ఇలా పోల్చడం న్యాయం కాదు. ఆ రెండింటినీ పోల్చలేం. గతంలో ఏం జరిగిందో ఇప్పుడు తెరపైకి తీసుకురాకూడదు. ఢిల్లీ పేస్ బౌలర్ పై దాడి ఢిల్లీ పేస్ బౌలర్ పర్వీందర్ అవానాపై కొంతమంది వ్యక్తులు దాడి చేసిన ఘటన శనివారం చోటు చేసుకుంది. కపిల్ ఇన్నింగ్స్ తో పోలికా?: గంభీర్ మహిళల వన్డే వరల్డ్ కప్‑లో చరిత్ర సృష్టించడానికి అడుగుదూరంలో ఉన్న భారత జట్టుపై వెటరన్ ఓపెనర్ గౌతం గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. సచిన్ టెండూల్కర్ చొరవతోనే.. భారత్ ను ఫైనల్ కు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన హర్మన్ ప్రీత్ కౌర్ కు.. -
టుడే అప్ డేట్స్
► హైదరాబాద్ : ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ వైఎస్ జగన్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సమావేశం సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ ►హైదరాబాద్ : ఇవాళ గవర్నర్‌ను కలవనున్న టీ.కాంగ్రెస్ నేతలు రైతాంగ సమస్యలను గవర్నర్‌కు వివరించనున్న టీ.కాంగ్రెస్ ► హైదారాబాద్ : రేపటి నుంచి 27వ తేదీ వరకు సెలవులో అకున్ సబర్వాల్ డ్రగ్స్ కేసు కీలక దశలో ఉన్నప్పుడు వెళ్లడంపై అనుమానాలు ►మహిళల వరల్డ్ కప్ : ఇవాళ భారత్ న్యూజిలాండ్ ఢీ మధ్యాహ్నం 3 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం న్యూజిలాండ్‌తో చావోరేవో మ్యాచ్‌కు సిద్ధమైన భారత్ ► అమరావతి : నేడు, రేపు గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ఏపీ, హైదరాబాద్‌లో 171 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు ► లండన్ : ఇవాళ వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్ వీనస్ విలియమ్స్‌తో తలపడనున్న ముగురుజా ► లండన్ : తొలిసారి వింబుల్డన్ ఫైనల్లోకి సిలిచ్ సెమీస్‌లో సామ్ క్వెరీ పై విజయం రేపు స్విస్ దిగ్గజంతో టైటిల్ పోరు -
టుడే అప్ డేట్స్
విపక్షాలతో రాజ్‌నాథ్, సుష్మ చర్చలు పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో విపక్షాల విమర్శల వేడికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. జమ్మూకశ్మీర్‌లో తాజా పరిస్థితి, సిక్కిం సరిహద్దుల్లో చైనాతో ఘర్షణ విషయాలపై పూర్తి వివరాలను విపక్షాలకు తెలపాలని నిర్ణయించింది. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్ శుక్రవారం విపక్షాల నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి రావాలంటూ ఇప్పటికే విపక్ష నేతలకు ఆహ్వానం అందింది. కశ్మీర్ విషయంలో ఏకాభిప్రాయం సాధించేందుకే కేంద్రం ఈ సమావేశాన్ని వినియోగించుకోవాలని ప్రయత్నిస్తోంది. వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ రేపు హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈ నెల 15వ తేదీన జరగనుంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన శనివారం సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సమావేశంలో.. త్వరలో ప్రారంభమవనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. 17న విజయవాడకు వైఎస్ జగన్ హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 17న విజయవాడకు వెళుతున్నారు. అమరావతి అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. రేపటి నుంచి ‘మెడికల్’ సర్టిఫికెట్ల పరిశీలన విజయవాడ : ఏపీలో ఎంబీబీఎస్/బీడీఎస్ కోర్సుల్లో కాంపిటెంట్ అథారిటీ సీట్ల (కన్వీనర్ కోటా) కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 15 నుంచి 21వరకు ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. ఈ మేరకు గురువారం రాత్రి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రాథమిక మెరిట్ లిస్టును కూడా విడుదల చేశారు. నడక భక్తులకు రోజుకు 20 వేల మందికే దర్శనం శ్రీవారి కాలిబాట దివ్యదర్శనాన్ని ఇకపై టైం స్లాట్‌లో కేటాయించాలని టీటీడీ నిర్ణయించింది. రూ.300 టికెట్ల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంటకు 2500 మంది భక్తులకు కేటాయించి సజావుగా శ్రీవారి దర్శనం కేటాయిస్తున్నారు. దీనివల్ల క్యూలైన్లు కనిపించవు. అదే తరహాలోనే రోజులో 20వేల మంది కాలిబాట భక్తులకు టైం స్లాట్ కేటాయించనున్నారు. ఈ కొత్త విధానం ఈనెల 17వ తేది సోమవారం నుండి గురువారం వరకు నాలుగురోజుల పాటు అమలు చేయాలని నిర్ణయించారు. ఇక వారాంతంలో.. (శుక్ర, శని, ఆదివారాల్లో) కాలిబాట దివ్యదర్శనం రద్దు అమలు చేయనున్నారు. మహబూబాబాద్ ఘటన నేపథ్యంలో భేటీ మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతి మీనా పట్ల ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనుచితంగా ప్రవర్తించిన నేపథ్యంలో ఐఏఎస్ అధికారుల సంఘం గురు వారం మంజీరా అథితిగృహంలో ప్రత్యేకంగా సమావేశమైంది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీపీ ఆచార్య అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో సుమారు 35 మంది ఐఏఎస్ అధికారులు పాల్గొనగా.. దాదాపు ఏడు గంటలపాటు సుదీర్ఘంగా చర్చిం చారు. కాగా, ఐఏఎస్ అధికారుల సంఘం శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ను కలవనుంది. విశాఖ : ఇవాళ మన్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా వరంగల్ : టీఆర్ఎస్ కార్పొరేటర్ అనిశెట్టి మురళీ భౌతికకాయానికి ఇవాళ ఎంజీఎంలో పోస్టుమార్టం మురళీ హత్యకు నిరసనగా నేడు వరంగల్ బంద్‌కు పిలుపు వీనస్ (Vs) ముగురుజా వింబుల్డన్‌లో మహిళల పోరు చివరి అంకానికి చేరింది. అమెరికా స్టార్ వీనస్ విలియమ్స్, స్పెయిన్ క్రీడాకారిణి ముగురుజా టైటిల్ పోరుకు అర్హత పొందారు. వీనస్, ముగురుజాల మధ్య శనివారం ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. -
టుడే అప్ డేట్స్
► హైదరాబాద్ : నేటి నుంచి మూడో విడత హరితహారం ఉ.11గంటలకు కరీంనగర్లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం అంబేద్కర్ స్టేడియంలో బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం రాష్ట్ర వ్యాప్తంగా 40 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయం ► హైదరాబాద్ : రేపటి నుంచి ఓయూసెట్ వెబ్ ఆప్షన్లు రేపటి నుంచి 16 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి : ఓయూ అడ్మిషన్స్ డైరెక్టర్ ► ఏయూ క్యాంపస్ : ఏయూ పీహెచ్డీ దరఖాస్తు గడుపు పెంపు ► హైదరాబాద్ : వ్యవసాయ అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ ► హైదరాబాద్ : హైకోర్టు విభజనపై తీసుకున్న చర్యలేంటి ? సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలి : కేంద్రం, ఏపీ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం ► హైదరాబాద్ : నేటి నుంచి కొలొంబోకు నేరుగా విమాన సర్వీసులు ► విజయవాడ : ఇవాళ మెడికల్ కౌన్సెలింగ్ దరఖాస్తులకు తుది గడువు ► విజయవాడ : జీఎస్టీకి వ్యతిరేకంగా జాతీయ ఉద్యమం త్వరలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన : సీపీఐ రామకృష్ణ ► హైదరాబాద్ : నేడు హైకోర్టులో జేసీ దివాకర్ రెడ్డి పటిషన్ విచారణ తనపై దేశీయ విమానయాన సంస్థలు నిషేదం విధించడంపై జేసీ పిటిషన్ ► మహిళల వరల్డ్ కప్‌లో నేడు భారత్- ఆస్ట్రేలియా ఢీ -
టుడే అప్డేట్స్
► ఢిల్లీ : ఇవాళ వివిధ రాష్ట్రాల సీఎస్‌లతో ప్రధాని నరేంద్రమోదీ భేటీ నీతిఆయోగ్ ఆధ్వర్యంలో సీఎస్‌లతో నేషనల్ కాన్ఫరెన్స్ ► అమరావతి : ప్లీనరీ ముగింపులో పేదల కోసం 9 సంక్షేమ పథకాలను ప్రకటించిన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ► తిరుమల : ఇవాళ్టి నుంచి శ్రీవారి భక్తులకు జీఎస్టీ ఎఫెక్ట్ రూ.వెయ్యి నుంచి 2 వేలలోపు అద్దె గదులపై 12 % జీఎస్టీ రూ. 2500 నుంచి 6వేలలోపు అద్దె గదులపై 18% జీఎస్టీ రూ.వెయ్యిలోపు అద్దె గదులకు జీఎస్టీ మినహాయింపు ► ఢిల్లీ : కిడ్నాపర్ చెరలోనే డాక్టర్ శ్రీకాంత్ గౌడ్ నిందితుడి కోసం 200 మంది పోలీసుల గాలింపు ► కింగ్స్టన్ టీ20 : భారత్‌పై వెస్టిండీస్ గెలుపు 9 వికెట్ల తేడాతో భారత్‌పై వెస్టిండీస్ విజయం ► ఇవాళ టీమిండియా కొత్త కోచ్ ఎంపిక ఇంటర్వ్యూలు రేసులో రవిశాస్త్రి, సెహ్వాగ్, రాజ్‌పుత్, టామ్ మూడీ, సిమన్స్, పైబస్ కోచ్ అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయనున్న క్రికెట్ అడ్వైజరీ కమిటీ ► లంక పర్యటనకు భారత జట్టు ఖరారు 15 మంది సభ్యులతో జట్టును ప్రకటించిన బీసీసీఐ -
టుడే అప్డేట్స్
► హైదరాబాద్ : నేడు హైదరాబాద్‌కు మీరాకుమార్ మధ్యాహ్నం 12 గంటలకు గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలతో సమావేశం ► హైదరాబాద్ : ఓయూసెట్ ఫలితాలు విడుదల 7 నుంచి 11 వరకు వెబ్ ఆప్షన్స్ ► అమరావతి : ఇవాళ ఉదయం 10 గంటలకు కేబినెట్ సమావేశం ► విజయవాడ : పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌లో వెంకటేశ్వర వైభవోత్సవాలు నేడు సాయంత్రం 4 గంటలకు విగ్రహ ప్రతిష్టాపన ► ఇవాళ్టి నుంచి తమిళనాడు వ్యాప్తంగా సినిమా థియేటర్ల నిరవధిక బంద్ జీఎస్టీని వ్యతిరేకిస్తున్న థియేటర్ యాజమాన్యాలు ► ఢిల్లీ : ఇవాళ ఉదయం 11:30 గంటలకు ప్రకాశ్ జవదేకర్‌తో కడియం, కేటీఆర్ భేటీ మధ్యాహ్నం 12:30 గంటలకు దత్తాత్రేయను కలవనున్న కడియం, కేటీఆర్ ► ఇవాళ దేశంలో తయారీ రంగానికి చెందిన పీఎంఐ గణాంకాల వెల్లడి జూన్ నెల గణాంకాలను వెల్లడించనున్న మార్కెట్ ఎకనామిక్స్ సంస్థ ► రేపు హైదరాబాద్, విజయవాడలో రామ్‌నాథ్ కోవింద్ పర్యటన హైదరాబాద్‌లో వైఎస్ఆర్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీకానున్న కోవింద్ ► లండన్ : ఇవాళ్టి నుంచి వింబుల్డన్ టోర్నీ ఫేవరేట్లుగా బరిలో ఫెదరర్, నాదల్, జకోవిచ్, ముర్రే -
టుడే అప్డేట్స్
► విజయవాడ : నీట్–2017 మెడికల్ లోకల్ (ఏపీ) ర్యాంకులను డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆదివారం విడుదల చేయనుంది. ► హైదరాబాద్ : ఇవాళ ఓయూ సెట్ ఫలితాలు విడుదల ► హైదరాబాద్ : వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ వచ్చే ఏడాది నుంచే ప్రవేశపెట్టాలని కేసీఆర్ నిర్ణయం ► హైదరాబాద్ : విజయ నూనె ధర తగ్గింపు వేరుశనగ నూనె రూ.2, పామాయిల్ రూ.1 తగ్గింపు జీఎస్టీ అమలుతో తగ్గిన ధరలు ► విశాఖ : ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కోస్తాంధ్ర, రాయలసీమలో మూడ్రోజులపాటు తేలికపాటి వర్షాలు ► హైదరాబాద్ : జీఎస్టీతో పెరిగిన వస్తువులు, సేవల ధరలు బాగా పెరిగిన ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫోన్ల ధరలు యథాతథంగా నిత్యావసరాల ధరలు పన్ను తగ్గినా వస్తువల ధరల్లో కనిపించని మార్పు పాత స్టాక్ అంతా ఇంకా పాత రేట్లకే విక్రయిస్తున్న వ్యాపారులు ► ఇవాళ భారత్, వెస్టిండిస్ మధ్య నాలుగో వన్డే సాయంత్రం 6: 30 గంటలకు మ్యాచ్ ప్రారంభం ► ముంబై : ఈ నెల 10న భారత జట్టు కోచ్ ఇంటర్వ్యూ రేసులో సెహ్వాగ్, రవిశాస్త్రి, టామ్ మూడీ, రాజ్‌పుత్, రిచర్డ్, దొడ్డ గణేశ్ ► ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో నేడు కీలక పోరు నేడు పాకిస్తాన్‌తో భారత్ ‘ఢీ’ -
టుడే అప్డేట్స్
► తూర్పు గోదావరి : నేడు రంపచోడవరంలో వైఎస్ జగన్ పర్యటన రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో జ్వరపీడితులకు పరామర్శ చాపరాయికి వెళ్లి బాధితులను పరామర్శించనున్న వైఎస్ జగన్ ► ఢిల్లీ : భారత ఆర్థిక రంగంలో సరికొత్త విప్లవం ప్రారంభం దేశవ్యాప్తంగా అమల్లోకి చ్చిన వస్తు- సేవల పన్ను(జీఎస్టీ) నేటి నుంచి ఒకే దేశం ఒకే పన్ను విధానం అమలు ► నేడు ఐసీఏఐ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమం పాల్గొననున్న ప్రధాని మోదీ, జీఎస్టీపై ప్రసంగించనున్న మోదీ ► నేడు చెన్నైకు రాష్ట్రపతి అభ్యర్థులు విపక్షాల మద్దతు కోరనున్న రామనాథ్ కోవింద్, మీరా కుమార్ ► అంటిగ్వా వన్డేలో 93 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై భారత్ గెలుపు -
టుడే అప్డేట్స్
►నేడు కశ్మీర్‌కు కోవింద్ న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నిక ప్రచారంలో భాగంగా ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ నేడు జమ్మూ కశ్మీర్లో పర్యటించనున్నారు. ఆయనతో పాటు కేంద్రమం త్రి వెంకయ్య నాయుడు ప్రచారంలో పాల్గొంటారు. జూలై 4న రామ్‌నాథ్ కోవింద్ తెలుగు రాష్ట్రాలలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా 4 వ తేదీ ఉదయం హైదరాబాద్‌కు చేరుకుంటారు. ►రేపు నింగిలోకి జీశాట్–17 జీశాట్–17 ఉపగ్రహ ప్రయోగానికి రంగం సిద్ధమైంది. గురువారం వేకువ జామున 2.29 గంటలకు ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థ సహకారంతో ఫ్రెంచి గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి దీనిని ప్రయోగిస్తారు. ఈ ఉపగ్రహం బరువు 3,425 కిలోలు. దీనిని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టేందుకు బుధవారం కౌంట్‌డౌన్ ప్రారంభించ నున్నట్టు సమాచారం. ఏరి యన్–5 ఈసీఏ, వీఏ238 అనే రాకెట్ ద్వారా దీనిని ప్రయోగించనున్నారు. ఫ్రాన్స్‌తో ఉన్న ఒప్పందం ప్రకారం ఇస్రోకు చెందిన సమాచార ఉపగ్రహాలను కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి రోదసీలోకి పంపిస్తుంటారు. ►నేడు వైఎస్సార్సీపీ జిల్లా ప్లీనరీ శ్రీకాకుళం అర్బన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లాస్థాయి ప్లీనరీ సమావేశానికి రంగం సిద్ధమైంది. శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఉదయం 10 గంటల కు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి, పార్టీ రాజకీయ వ్యవహారాల కమి టీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. ►ఢిల్లీ : ఇవాళ సా.5గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం ►ఢిల్లీ : ఇవాళ విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా మీరా కుమార్ నామినేషన్ ►ఇవాళ మాజీ ప్రధాని పీవీ నరసింహారావుజయంతి పీవీ ఘాట్‌లో అధికారికంగా జయంతి ఉత్సవాలు ►శ్రీనగర్ : నేటి నుంచి అమర్ నాథ్ యాత్ర ప్రారంభం. దాడులకు అవకాశముందని నిఘా వర్గాల హెచ్చరిక అమర్ నాథ్ యాత్రకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు ►హైదరాబాద్ : తెలంగాణ హౌసింగ్‌పై ఇవాళ కేబినెట్ సబ్ కమిటీ భేటీ -
టుడే అప్ డేట్స్
నేడు ‘సేవ్ విశాఖ’ మహాధర్నా విశాఖపట్నం: అధికార పార్టీకి చెందిన కబ్జారాయుళ్ల కబంధహస్తాల్లో చిక్కుకున్న విశాఖ నగరాన్ని రక్షించేందుకు ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ గురువారం నిర్వహించే ‘సేవ్ విశాఖ’ మహాధర్నాకు తరలివచ్చేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. టీడీపీ నేతల భూ కబ్జాల వల్ల రూ. కోట్ల విలువైన భూములను ఎలా కోల్పోయామో చెప్పుకునేందుకు ఇదే సరైన వేదికగా బాధితులంతా భావిస్తున్నారు. జీవీఎంసీ ఎదుట గాంధీ బొమ్మ వద్ద జరిగే ధర్నాలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొంటారు. వైఎస్ జగన్ ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి విమానంలో బయల్దేరి 9.30 గంటలకు విశాఖ చేరుకుంటారు. పీఎస్ఎల్వీ సీ38 కౌంట్‌డౌన్ ప్రారంభం శ్రీహరికోట (సూళ్లూరుపేట): శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని షార్ నుంచి శుక్రవారం నిర్వహించనున్న పీఎస్ఎల్వీ సీ38 రాకెట్ ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్‌ను గురువారం ఉదయం ప్రారంభించారు. లాంచ్ రిహార్సల్స్ నిర్వహించి కౌంట్ డౌన్, ప్రయోగ సమయాలను అధికారికంగా ప్రకటించారు. ఢిల్లీకి సీఎం కేసీఆర్ హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. బుధవారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకున్నారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ 23న నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. కోవింద్ అభ్యర్థిత్వానికి టీఆర్ఎస్ ఇప్పటికే సంపూర్ణ మద్దతు ప్రకటించడం తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతోనూ ముఖ్యమంత్రి భేటీ అవుతారు. భారత్ x మలేసియా లండన్: హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) సెమీఫైనల్స్ టోర్నమెంట్లో గురువారం భారత జట్టు కీలకపోరుకు సిద్ధమైంది. మలేసియా జట్టుతో జరిగే క్వార్టర్ ఫైనల్లో టీమిండియా బరిలోకి దిగనుంది. నెదర్లాండ్స్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో 1–3తో ఓడిన భారత్ ఈ నాకౌట్ మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా పోరాడనుంది. ► ఇవాళ చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ► హైదరాబాద్ : ఇవాళ్టి నుంచి గ్రూప్- 1 ఫిజికల్ పరీక్షలు -
టుడే న్యూస్ అప్డేట్స్
► నేడు అనంతపురం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన. అనంతపురం మాజీ ఎమ్మెల్యే బి.నారాయణరెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించనున్న వైఎస్ జగన్ ►వైఎస్ఆర్ జిల్లా : ఇవాళ ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ► నేడు మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాల డీజీపీలతో రాజ్‌నాథ్ సింగ్ సమీక్ష ► గుంటూరు : నేటి నుంచి పీసెట్ ప్రవేశపరీక్షలు ► ఢిల్లీ: దాణా కుంభకోణంపై నేడు సుప్రీం కోర్టు తీర్పు ►విజయవాడ : ఇవాళ గ్రూప్-2 స్క్రీనింగ్ పరీక్ష కీ విడుదల ► హైదరాబాద్ : నేటి నుంచి ఆసుపత్రుల్లో రెండు రంగుల దుప్పట్లు, ప్రతి సోమవారం గులాబీ, మంగళవారం తెలుపు బెడ్‌షీట్ ► జూన్ 1నుంచి ఛాంపియన్స్ ట్రోపీ భారత జట్టు ఎంపికపై నేడు సెలక్షన్ కమిటీ భేటీ ► నేటితో ముగియనున్న పీజీ ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ► జూన్ 5 నుంచి ఓయూ సెట్ ► నేటి నుంచి ఒంటరి మహిళల ఆర్థిక భృతికి దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 13 వరకు దరఖాస్తులు స్వీకరించనున్న ప్రభుత్వం ► సిరిసిల్ల : నేటి నుంచి పవర్‌లూం కార్మికుల సమ్మె కూలీ గిట్టు బాటు కోసం నేతన్నల పోరుబాట ► అమరావతి : ఇవాళ లాసెట్, ఎడ్‌సెట్, పాలిసెట్ ఫలితాలు మ.3 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్న మంత్రి గంటా ► ఐపీఎల్: నేడు హైదరాబాద్ vs ముంబై రాత్రి 8 గంటలకు హైదరాబాద్‌లో మ్యాచ్ -
నేటి వార్తా విశేషాలు
ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పర్యటన డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పర్యటించనున్నారు. రాష్ట్రంలోని ప్రసిద్ధ బద్రినాథ్ ఆలయంలో ప్రణబ్ ముఖర్జీ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. లక్నోలో సీఎం యోగి స్వచ్ఛ్ భారత్ లక్నో: స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో పాల్గొననున్న యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్. లక్నో లోని బాలు అడ్డా మాలిన్ బస్తీలో స్వయంగా చీపురు పట్టి ఊడ్చి అవగాహన కల్పించనున్న సీఎం యోగి. జపాన్ పర్యటనకు అరుణ్ జైట్లీ న్యూఢిల్లీ: మూడు రోజుల పర్యటనలో భాగంగా జపాన్‌కు వెళ్లనున్న కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ. పలు వ్యాపార సంబంధ కార్యక్రమాలలో పాల్గొని జపాన్ అధికారులతో భేటీ కానున్న జైట్లీ నేడు టీఎస్ ఈసెట్-2017 హైదరాబాద్: టీఎస్ ఈసెట్-2017 పరీక్షకు సర్వం సిద్ధమైంది. శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించే ఈ పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 25,138 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. నేడు పాలీసెట్ ఫలితాలు హైదరాబాద్: పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలీసెట్ 2017 పరీక్ష ఫలితాలను 6వ తేదీన విడుదల చేసేందుకు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి (ఎస్బీటీఈటీ) ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఫలితాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేయనున్నారు. నాంపల్లిలోని రూసా సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేస్తారు. గత నెల 22న నిర్వహించిన ఈ పరీక్షకు దాదాపు 1.3 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. నేడు ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల అమరావతి: పదో తరగతి పరీక్ష ఫలితాలు శనివారం విడుదలవుతాయని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ వీఎస్ భార్గవ తెలిపారు. విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలోని డాక్టర్ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేస్తారని ప్రకటించారు. కాగా, ఈ ఫలితాలను www.sakshi.com , www.sakshieducation.com వెబ్సైట్లో కూడా పొందవచ్చు. ఐపీఎల్ షెడ్యూలు సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడనున్న రైజింగ్ పుణే సూపర్ జెయింట్. సాయంత్రం 4 గంటలకు మ్యాచ్ ప్రారంభం ఢిల్లీ డేర్ డెవిల్స్ తో తలపడనున్న ముంబై ఇండియన్స్. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం అజ్లాన్ షా హాకీ టోర్నమెంట్ టోర్నీలో భాగంగా నేటి మ్యాచ్ లో న్యూజిలాండ్ తో తలపడనున్న భారత్ -
టుడే న్యూస్ అప్డేట్స్
నల్లగొండ జిల్లాలో పర్యటించనున్న గవర్నర్ నల్లగొండ: నేడు నల్లగొండ జిల్లాలో పర్యటించనున్న గవర్నర్ నరసింహన్. మహాత్మాగాంధీ వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొననున్న గవర్నర్. అనంతరం ప్రభుత్వాసుపత్రిని సందర్శించనున్న గవర్నర్ నరసింహన్. నిర్భయ కేసుపై నేడు సుప్రీంకోర్టు తీర్పు న్యూఢిల్లీ: నిర్భయ కేసుపై నేడు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. నలుగురు నిందితులకు ఉరిశిక్ష విధించిన కింది కోర్టులు. శిక్షలను సవాల్ చేస్తూ నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2012 డిసెంబర్ 16న యువతిపై ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా, ఆరుగురిలో ఓ నిందితుడు శిక్ష అనుభవిస్తూ జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మైనర్ కావడంతో శిక్ష అనుభవించి బయటకొచ్చిన మరో నిందితుడు ఖమ్మం మిర్చి యార్డ్ ను సదర్శించనున్న కిషన్ రెడ్డి ఖమ్మం: ఇటీవల రైతుల ఆగ్రహానికి గురైన ఖమ్మం మిర్చి యార్డ్ ను శుక్రవారం బీజేపీ నేత కిషన్ రెడ్డి సందర్శించనున్నారు. మిర్చి యార్డ్ ధ్వంసం కేసుల్లో జైల్లో ఉన్న రైతులను పరామర్శించనున్న కిషన్ రెడ్డి హైదరాబాద్ లో పీసీసీ విస్తృతస్థాయి సమావేశం హైదరాబాద్: శుక్రవారం సాయంత్రం 4 గంటలకు పీసీసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత అంశాలపై నేతలు చర్చిస్తారు. ఈ సమావేశంలో పాల్గొననున్న ఏఐసీసీ కార్యదర్శి కుంతియా నేడు అంతరిక్షంలోకి జీఎస్ఎల్వీ ఎఫ్09 శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి శుక్రవారం సాయంత్రం 4.57 నిమిషాలకు జీఎస్ ఎల్వీ ఎఫ్09 ఉపగ్రహ వాహక నౌకను ప్రయోగించనున్నారు. దీనికి సంబంధించి గురువారం మధ్యాహ్నం 12.57 నిమిషాలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ రాకెట్ ద్వారా 2,230 కిలోల బరువు కలిగిన విశాట్–9(దక్షిణాసియా దేశాల శాటిలైట్) ఉపగ్రహాన్ని భూమికి 36వేల కి.మీ ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. దక్షిణాసియా దేశాలైన శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, భారత్, మాల్దీవులు దేశాలకు ఈ ఉపగ్రహం 12 ఏళ్లపాటు సేవలందించనుంది. నేడు ఏపీఎంసెట్ ఫలితాలు అమరావతి: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు గాను ఏపీ ఎంసెట్–2017 ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. మంత్రులు గంటా శ్రీనివాస రావు, కామినేని శ్రీనివాస్, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విజయవాడలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఎంసెట్ కన్వీనర్ సీహెచ్ సాయిబాబు గురువారం మీడియాకు వెల్లడించారు. ర్యాంకుల సమాచారాన్ని ఆయా అభ్యర్థుల ఫోన్ నంబర్లకు పంపిస్తామని తెలిపారు. ‘గురుకుల’ దరఖాస్తు గడువు పెంపు హైదరాబాద్: గురుకుల టీచర్ పోస్టుల భర్తీకి చేపట్టిన దరఖాస్తుల ప్రక్రియలో భాగంగా ఈ నెల 4, 6 వరకు ఉన్న దరఖాస్తుల గడువును 9 వరకు పొడిగించినట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. 9 రకాల నోటిఫికేషన్లకు అభ్యర్థులు 9 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్(పీఈటీ) పోస్టులకు నిర్ణీత అర్హతలుంటే సరిపోతుంది. స్కూల్/కాలేజీ/జిల్లాస్థాయి గేమ్స్/ స్పోర్ట్స్‌లో పాల్గొన్న సర్టిఫికెట్ ఉండాలన్న నిబంధనను తొలగించింది. ఐపీఎల్-10 షెడ్యూలు బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్. బెంగళూరు వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. పరువు కోసం కోహ్లీసేన తాపత్రయం. పాయింట్లు మెరుగు పరుచుకోవాలని భావిస్తున్న పంజాబ్ -
నేటి వార్తా విశేషాలు
నేడు కొత్త బస్సులకు మోక్షం హైదరాబాద్: బ్యాంకుల నుంచి అప్పు తెచ్చి మరీ కొనుగోలు చేసిన దాదాపు 300 బస్సులకు 4 నెలల తర్వాత మోక్షం కలుగుతోంది. ఎట్టకేలకు వాటిని సీఎం కేసీఆర్ గురువారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో జరిగే కార్యక్రమంలో ప్రారంభించబోతున్నారు. కొత్తగా ప్రవేశపెట్టబోయే ఏసీ మినీ వజ్ర బస్సులు 60, నాన్ ఏసీ మినీ పల్లెవెలుగు బస్సులు 50 ఉన్నాయి. సూపర్‌లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సులు 190 ఉన్నాయి. నేటి నుంచి చంద్రబాబు బృందం అమెరికా పర్యటన ఈ నెల 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్థిక మంత్రి యనమల, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ ఇతర అధికారులు మొత్తం 15 మంది అమెరికాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలతో లోకేశ్ ఒప్పందాలు చేసుకుంటారని ప్రభుత్వ వర్గాలు ముందుగా ప్రచారం చేశాయి. అక్కడ ఆశించిన స్థాయిలో ఒప్పందాలు జరగకపోతే పరువు పోతుందనే భావనతో పాటు రాజకీయంగా కూడా సరికాదనే భావనతో లోకేశ్ అమెరికా పర్యటన రద్దుచేసుకున్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ సమావేశం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాల విషయంపై ఇవాళ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ సమావేశం కానుంది. ప్రాజెక్టుల ద్వారా నీటి కేటాయింపులపై చర్చించనున్న ట్రిబ్యునల్. నదీ జలాల పంపకాల విషయంలో ఏపీ, తెలంగాణ ఇచ్చే స్టేట్మెంట్లను తమకు ఇవ్వాలన్న కర్ణాటక ప్రభుత్వ తరఫు న్యాయవాది వినతిని ఇటీవల ట్రిబ్యునల్ తిరస్కరించింది. 5న ఏపీ ఎంసెట్–17 ఫలితాలు కాకినాడ: ఏపీ ఎంసెట్–17 ఫలితాలు మే 5న విడుదల కానున్నాయి. శుక్రవారం సాయంత్రం 3 గంటలకు విజయవాడ స్టేట్ గెస్ట్‌హౌస్‌లో విడుదల చేస్తున్నట్లు ఏపీ ఎంసెట్ కన్వీనర్ సీహెచ్ సాయిబాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేటి సాయంత్రం జీఎస్ఎల్వీ ఎఫ్–09 కౌంట్ డౌన్ సూళ్లూరుపేట: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లో రెండో ప్రయోగ వేదిక నుంచి మే 5వ తేదీ సాయంత్రం 4.57 గంటలకు జీఎస్ఎల్వీ ఎఫ్–09 ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు ఇస్రో ప్రకటించింది. ప్రయోగ సమయానికి 22 గంటల ముందు మే 4న సాయంత్రం 6.57 కు కౌంట్‌డౌన్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఉపగ్రహం సుమారు12 ఏళ్ల పాటు సేవలను అందిస్తుంది. చిత్తూరులో కేంద్ర మంత్రి పర్యటన తిరుపతి: కేంద్ర మంత్రి కల్ రాజ్ మిశ్రా నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. రేణిగుంట సమీపంలోని ఓ ఎలక్ట్రానిక్ హబ్ ను పరిశీలించనున్న కేంద్ర మంత్రి. నేటి నుంచి 6వ తేదీ వరకు ఆర్జిత సేవలు రద్దు తిరుమల: నేటి నుంచి మూడ రోజులపాటు పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలు నిర్వహిస్తారు. నారాయణగిరివనంలో ఉత్సవ ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇవాళ మలయప్పస్వామి, రేపు అశ్వవాహనం, ఎల్లుండి గురడ వాహనంపై అమ్మవారిని ఊరేగిస్తారు. నేటి నుంచి 6వ తేదీ వరకు పలు ఆర్జిత సేవలను టీటీడీ అధికారులు రద్దు చేశారు. ఐపీఎల్-10 షెడ్యూల్ ఢిల్లీ: నేటి మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తో తలపడనున్న గుజరాత్. ఢిల్లీ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం -
టుడే న్యూస్ అప్ డేట్స్
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన అవసరాన్ని చాటి చెప్పడానికి గుంటూరులో గురువారం నిర్వహిస్తున్న ‘యువభేరి’ లో ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటున్నారు. స్థానిక నల్లపాడు రోడ్డులోని మిర్చియార్డు పక్కన, గతంలో ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ జగన్ అమరణ దీక్ష చేపట్టిన ప్రాంగణంలోనే ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. జార్ఖండ్: నేడు రాజధాని రాంఛీలో ప్రారంభంకానున్న మూమెంటమ్ జార్ఖండ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు-2017. సదస్సుకు హాజరుకానున్న కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కరీ, తదితరులు. యూపీ ఎన్నికల చివరిదైన ఏడో దశ ఎన్నికలకు నేటితో ముగియనున్న నామినేషన్ల తుది గడువు. బుధవారం వరకు 365 నామినేషన్లు దాఖలయ్యాయి. మహారాష్ట్ర: నేడు జిల్లా పరిషత్‌లు, పంచయతీ సమితీలకు తొలిదశ పోలింగ్ నిర్వహణ యూపీ ఎన్నికలు: హర్దాయ్ లో బీజేపీ ఎన్నికల ర్యాలీలో పాల్గొననున్న ప్రధాని నరేంద్ర మోదీ. సీతాపూర్ లో కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో పాల్గొననున్న రాహుల్ గాంధీ. అలహాబాద్ వెస్ట్ నియోజకవర్గంలో (ఝాల్వాలో) సిద్ధార్థనాథ్ సింగ్ తరఫున ప్రచారం చేయనున్న వెంకయ్యనాయుడు -
టుడే న్యూస్ అప్డేట్స్
ఢిల్లీ : రిపబ్లిక్ డే వేడుకలకు అతిథిగా విచ్చేసిన అబుదాబి యువరాజు నహ్యన్తో నేడు ప్రధాని మోదీ భేటీకానున్నారు. భారత్, యూఏఈ మధ్య వ్యూహాత్మక ఒప్పందాలపై చర్చ. ఢిల్లీ : రిపబ్లిక్ డే సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. ఢిల్లీ : నేడు జాతీయ ఓటరు దినోత్సవం. దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో పలు అవగాహన కార్యక్రమాలు. హైదరాబాద్ : ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు ఉదయం 11గంటలకు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. ప్రత్యేక హోదా, ప్రభుత్వ ఆంక్షలపై వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడతారు. హైదరాబాద్ : నేటి నుంచి వచ్చే నెల 3 వరకు జేఈఈ దరఖాస్తుల్లో సవరణలకు అవకాశం ఆంధ్రప్రదేశ్ : నేడు ఏపీ కేబినేట్ భేటీ. రాష్ట్రంలో అద్దె నియంత్రణ బిల్లు, విద్యుత్ పెంపు ప్రతిపాదనలపై చర్చ. తెలంగాణ : నేటి నుంచి టీఎస్పీఎస్సీ గ్రూప్-2 దరఖాస్తులో సవరణలకు అవకాశం. స్పోర్ట్స్ : ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నేటి మ్యాచ్‌లు ప్లిస్కోవా (చెస్ రిపబ్లిక్) vs మిర్యానా లుసిచ్(క్రొయేషియా) సెరెనా విలియమ్స్ (అమెరికా) vs జొహనాకొంటా(బ్రిటన్) గాఫిన్ (బెల్జియం) vs దిమిత్రోవ్(బల్గేరియా) రాఫెల్ నాదల్ (స్పెయిన్) vs మిలోస్ రావ్‌నిచ్ (కెనడా). -
టుడే న్యూస్ అప్డేట్స్
ఢిల్లీ : ఇవాళ ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినేట్ సమావేశం. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌తో పాటు పలు కీలక అంశాలపై చర్చ. ఢిల్లీ : నేడు చంద్రబాబు నేతృత్వంలోని ముఖ్యమంత్రుల కమిటీ ప్రధాని మోదీని కలవనున్నారు. నగదు రహిత లావాదేవీలపై ప్రధానికి నివేదిక. హైదరాబాద్ : ఇవాళ తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫీజు పోరు ధర్నా. ఇందిరాపార్క్ వద్ద 4వేల మంది విద్యార్థులతో ఆందోళన. తెలంగాణ : నేడు నిజామాబాద్ జిల్లాలో ఎంపీ కవిత పర్యటిస్తారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్ : కర్నూలులో నేటి నుంచి రెండు రోజుల పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం. మంత్రులు కామినేని శ్రీనివాస్, పైడికొండల మాణిక్యాలరావు సహా పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ : ఏపీ ప్రభుత్వం వంశధార నిర్వాసితులకు నేడు చెక్కుల పంపిణీ చేయనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ రూ.150 కోట్లు మంజూరు చేసింది. -
టుడే న్యూస్ అప్డేట్స్
విజయనగరం : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు విజయనగరంలో పర్యటిస్తారు. కూనేరు రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలిస్తారు. రైలు ప్రమాద ఘటన బాధిత కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శిస్తారు. అమరావతి : పోలవరం ప్రాజెక్టుపై ఇవాళ సీఎం చంద్రబాబు సమీక్ష. ఢిల్లీ : నేడు ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. నగదు రహిత లావాదేవీలపై బాబు నేతృత్వంలోని ముఖ్యమంత్రుల కమిటీ రేపు ప్రధాని మోదీకి నివేదిక ఇవ్వనున్నారు. తెలంగాణ : నేడు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో నెదర్లాండ్ ప్రతినిధుల బృందం భేటీ. అగ్రి బిజినెస్, ఫుడ్ ప్రాసెసింగ్‌పై ఎంవోయూ. చెన్నై : తమిళనాడులో జల్లికట్టు కోసం విద్యార్థులు చేస్తున్న పోరాటం ఏడో రోజు కొనసాగుతోంది. అసెంబ్లీలో తీర్మానం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. బిజినెస్ : ఇవాళ్టి నుంచి బాంబే స్టాక్ ఎక్సేంజ్ తొలి పబ్లిక్ ఆఫర్(ఐపీవో)ను ప్రారంభించనుంది. దీని ద్వారా రూ.1243 కోట్ల నిధులు సేకరించనున్న బీఎస్ఈ. -
టుడే న్యూస్ అప్డేట్స్
యూపీ: నేడు అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్న సమాజ్ వాదీ పార్టీ. ఉదయం 11 గంటల సమయంలో మేనిఫెస్టో విడుదల చేయనున్న సీఎం అఖిలేష్ యాదవ్ నేడు డెహ్రాడూన్ లో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ. ఇక్కడి ఇండియన్ ఆర్మీ అకాడమీలో యుద్ధ స్మారకస్థూపాన్ని పరిశీలించనున్న ప్రధాని విజయనగరం: శనివారం రాత్రి పట్టాలు తప్పిన హిరాఖండ్ ఎక్స్ ప్రెస్ రైలు. ఇప్పటివరకూ దాదాపు 35 మంది మృతి, పలువురికి గాయాలు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కొనసాగుతున్న సహాయక చర్యలు. చెన్నై: ఇవాళ జల్లికట్టును ప్రారంభించనున్న తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం. ఉదయం పది గంటలకు అలంగనల్లూర్‌లో జల్లికట్టు వేడుకను ప్రారంభించనున్న పన్నీర్ సెల్వం. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్‌లో ప్రారంభమైన 28వ జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు. పాల్గొన్న రవాణా మంత్రి మహేందర్ రెడ్డి, సీపీ మహేందర్ రెడ్డి. ప్రతి మూడు నెలలకోసారి రోడ్డు సేఫ్టీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్న అధికారులు. కోల్‌కతా: నేడు భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మధ్యాహ్నం1.30 గంటలకు ఈడెన్ గార్డెన్ లో ఇక్కడ చివరి వన్డే జరగనుంది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న భారత్ -
టుడే న్యూస్ అప్డేట్స్
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల చీఫ్ ఎలక్షన్ కమిషనర్ భన్వర్‌లాల్ నేడు భద్రాచలంలో పర్యటన తెలంగాణ : భద్రాద్రి జిల్లాలో రెండో రోజు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు తెలంగాణ : ఇవాళ మహబూబ్‌నగర్‌లో స్వచ్ఛ సర్వేక్షన్ బృందం పర్యటన. ఆంధ్రప్రదేశ్ : నేడు ఆంధ్రా యూనివర్శిటీలో పీవీ స్మారక ఉపన్యాస కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమంలో గోరటి వెంకన్నకు లోక్‌నాయక్ పురస్కార ప్రదానం. స్పోర్ట్స్ : నేటి నుంచి హాకీ ఇండియా లీగ్. తొలి మ్యాచ్‌లో తలపడనున్న దబాంగ్ ముంబై, రాంచీ రేస్ జట్లు. -
టుడే న్యూస్ అప్ డేట్స్
ఢిల్లీ : నేడు ప్రధాని మోదీని తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కలవనున్నారు. జల్లికట్టుపై ఆర్డినెన్స్ జారీ చేయాలని మోదీని కోరనున్న సెల్వం. ఆంధ్రప్రదేశ్ : ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి ప్రాంత గ్రామాల్లో ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల సమస్యలపై నిడమర్రు, లింగాయపాలెం గ్రామాల్లో వైఎస్ జగన్ ముఖాముఖి. ఆంధ్రప్రదేశ్ : కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఉద్దానంలో నేడు అధికారుల బృందం పర్యటన. తెలంగాణ : పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై తెలంగాణ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు. స్పోర్ట్స్ : నేడు కటక్‌లో మధ్యాహ్నం 1.30 గంటలకు భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో వన్డే. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్. స్పోర్ట్స్ : నేడు ప్రొ రెజ్లింగ్ లీగ్-2 ఫైనల్ మ్యాచ్‌లో హరియాణాతో తలపడనున్న పంజాబ్ రాయల్స్. -
టుడే న్యూస్ అప్ డేట్స్
ఢిల్లీ : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై నేడు ప్రకటన చేయనున్న అఖిలేష్ యాదవ్. హైదరాబాద్ : నేటితో తెలంగాణ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ముగియనున్నాయి. శాసనసభ, మండలిలో ఎస్సీ, బీసీ, మైనార్టీ సంక్షేమంపై చర్చ. హైదరాబాద్ : నేడు ఎన్టీఆర్ 21వ వర్ధంతి. ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించనున్న ఎన్టీఆర్ కుటుంబసభ్యులు. తెలంగాణ : తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ్టి నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. 10 రోజుల పాటు దక్షిణ కోరియా, జపాన్ దేశాలలో పర్యటిస్తారు. ఆంధ్రపద్రేశ్ : చిత్తూరు జిల్లాలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నేడు పర్యటించనున్నారు. తిరుపతి స్విమ్స్ లో డయాలసిస్ బ్లాక్‌ను ఆయన ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్ : నేడు ఏపీ కాంగ్రెస్ కో ఆర్డినేషన్ కమిటీ విజయవాడలో సమావేశం కానుంది. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఎస్బీఐ జోనల్ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ మహాధర్నా. -
టుడే న్యూస్ అప్ డేట్స్
ఢిల్లీ : ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నేడు తొలిదశ నోటిఫికేషన్ వెలువడనుంది. ఢిల్లీ : దేశవ్యాప్తంగా జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు మంగళవారం నుంచి జరగనున్నాయి. హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు నేటి నుంచి పున:ప్రారంభంకానున్నాయి. శాసనసభలో గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిపై, మండలిలో మైనార్టీ సంక్షేమంపై చర్చ జరగనుంది. తెలంగాణ : రాష్ట్ర టూరిజం శాఖ ఆధ్వర్యంలో నేడు వరంగల్‌లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ : ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన కొనసాగుతోంది. నేడు వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో చంద్రబాబు పాల్గొంటారు. స్పోర్ట్స్ : నేడు హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ ఎన్నికలు. -
టుడే న్యూస్ అప్ డేట్స్
నేడు యాదాద్రిలో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ పాల్గొననున్న 26 దేశాల ప్రతినిధులు ఇవాళ్టి నుంచి ఆస్ట్రేలియా ఓపెన్ 19న సీఆర్డీఏ గ్రామాల్లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన భూసేకరణ బాధితులకు అండగా పర్యటించనున్న వైఎస్ జగన్ ఏపీలో నేటి నుంచి ఈహెచ్ఎన్(ఎమర్జెన్సీ హెల్త్ నెట్ వర్క్) సేవలు బంద్ చర్చలకు వెళ్లేది లేదు :సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ రెండేళ్లుగా చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోంది గతేడాది సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్ మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు లీటరు పెట్రోల్‌పై రూ.0.42 పైసలు, డీజిల్‌పై 1.03 పైసల ధరను పెంచుతున్నట్లు ప్రకటించిన ఆయిల్ కంపెనీలు ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటూ చంద్రబాబు దావోస్ పర్యటన రేపు వరల్డ్ ఎకనామిక్ సదస్సుకు హాజరు కానున్న చంద్రబాబు నేడు రంగారెడ్డి జిల్లా ముచ్చింతలకు కేసీఆర్ నేడు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం హాజరుకానున్న అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు -
టుడే అప్డేట్స్
అమరావతి: తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం గురువారం అమరావతికి రానున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఆయన వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును కలవనున్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. తమిళనాడుకు తెలుగు గంగ నీటిని విడుదల చేయాలని కోరేందుకు ఆయన వస్తున్నారు. విజయవాడలో నేటి నుంచి మూడు రోజులపాటు ఎయిర్ షో. ఇందులో పాల్గొననున్న బ్రిటన్‌కు చెందిన నాలుగు ఎయిర్‌క్రాఫ్ట్‌లు. కార్యక్రమానికి హాజరుకానున్న కేంద్రమంత్రులు అశోక్ గజపతిరాజు, బండారు దత్తాత్రేయ, సీఎం చంద్రబాబునాయుడు నేడు ముంబైలో రెండో స్కార్పీన్ క్లాస్ సబ్‌మెరైన్ ను ప్రారంభించనున్న భారత్ నేడు జాతీయ యువజన దినోత్సవం. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని 1984లో జనవరి12ను జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించిన అప్పటి కేంద్ర ప్రభుత్వం నేటి నుంచి తెలంగాణలో కాంట్రాక్ట్ లెక్చరర్ల ఆమరణ దీక్ష నేడు కృష్ణాజిల్లా గన్నవరం ఎయిర్‌పోర్టులో నూతన టెర్మినల్ ప్రారంభం విజయనగరం: నేడు భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్న అధికారులు కాకినాడలో నేటి నుంచి నాలుగు రోజులపాటు జరగనున్న బీచ్ ఫెస్టివల్ ప్రారంభం ముంబైలో నేడు రెండో వార్మప్ మ్యాచ్. ఇంగ్లండ్ ఎలెవన్‌తో తలపడనున్న భారత్-ఏ టీమ్ వరంగల్: నేటి నుంచి మూడు రోజులపాటు ఐనవోలు మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు. -
టుడే అప్డేట్స్
నేడు ప్రధాని మోదీతో అన్నాడీఎంకే ప్రతినిధి బృందం భేటీ. జల్లికట్టుపై ఆర్డినెన్స్ తీసుకురావాలని విజ్ఞప్తి చేయనున్న నేతలు పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని ఓ స్డేడియంలో సమావేశాన్ని నిర్వహించనున్న కాంగ్రెస్ నేతలు నేడు విజయనగరం జిల్లాలో సీఎం చంద్రబాబునాయుడు పర్యటన. ముందస్తుగా మానవహక్కుల వేదిక జిల్లా కన్వినర్ జయశ్రీ హౌస్ అరెస్ట్. గండికోట ముంపువాసుల పరిహారం కోసం ఐదురోజులు దీక్ష చేసిన కన్వినర్ జయశ్రీ నేడు ఆసిఫాబాద్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో మంత్రి హరీష్‌రావు పర్యటన. కుమ్రంభీం ప్రాజెక్టు కాల్వ పనులను పరిశీలించనున్న హరీష్. చదర్మట్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేయనున్న మంత్రి హరీష్ అమరావతి: సంక్రాంతి పండుగ దృష్ట్యా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే విశాఖ, తిరుపతి, కాకినాడలకు ఏడు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సీపీఆర్వో ప్రకటించారు. నేడు రైలు నెం.07449 సికింద్రాబాద్-కాకినాడ పోర్టు(వయా భీమవరం), హైదరాబాద్-తిరుపతి-హైదరాబాద్(02764, 02763) సర్వీసులు నడుస్తాయని చెప్పారు. విజయనగరం: నేడు బోగాపురం ఎయిర్‌పోర్టుపై ప్రజాభిప్రాయ సేకరణ. ప్రజాభిప్రాయ సేకరణ నేపథ్యంలో పలువురు వామపక్ష నేతల ముందస్తు అరెస్ట్ ఢిల్లీ: పొగమంచు కారణంగా 26 రైళ్లు ఆలస్యం, 7 రైళ్లు రీ షెడ్యూల్ చేసిన రైల్వేశాఖ. 11 రైలు సర్వీసులు రద్దు. 5 డొమెస్టిక్ సర్వీసులు, ఒక అంతర్జాతీయ విమాన సర్వీసులు ఆలస్యం. నేటి నుంచి 14 వరకు రోడ్డు భద్రతా వారోత్సవాలు సంక్రాంతి పర్వదినం నేపథ్యంలో నేటి నుంచి 17 వరకు శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. -
టుడే అప్డేట్స్
గాంధీనగర్: నేటి నుంచి మూడు రోజులపాటు వైబ్రెంట్ గుజరాత్ సదస్సు. ఈవెంట్ ప్రారంభించనున్న ప్రధాన నరేంద్ర మోదీ. హాజరుకానున్న 500 సంస్థల సీఈవోలు. నేడు కర్నూలో జిల్లాలో ఆరో రోజుకు చేరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతు భరోసా యాత్ర. వెంగల్రెడ్డిపేట నుంచి ప్రారంభం కానున్న వైఎస్ జగన్ భరోసా యాత్ర. మహానందీశ్వరున్ని దర్శించుకోనున్న వైఎస్ జగన్ నేడు లక్నోలో భేటీ కానున్న ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్, ఆయన తనయుడు, యూపీ సీఎం అఖిలేష్ యాదవ్. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపికపై చర్చించే అవకాశం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్న కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్. నేటి ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న రాజ్‌నాథ్. సీపీఐ ఆధ్వర్యంలో నేటి నుంచి దళిత హక్కుల సాధన బస్సు యాత్ర ప్రారంభం నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబునాయుడు. గూడూరులో జన్మభూమి సభకు హాజరుకానున్న చంద్రబాబు. నేడు హైదరాబాద్ లో నగదు రహిత లావాదేవీలపై మెగా క్యాంప్ కార్యక్రమం. ఏవీ కాలేజీ గ్రౌండ్లో బ్యాంకుల ఆధ్వర్యంలో క్యాంప్ నిర్వహణ ముంబై: నేడు ఇంగ్లండ్ ఎలెవన్‌తో తలపడనున్న భారత్'ఏ' జట్టు. వార్మప్ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్న మహేంద్రసింగ్ ధోనీ. మధ్యాహ్నం 1:30 గంటలకు ముంబైల్ మ్యాచ్ ప్రారంభం రంజీ ట్రోఫీ ఫైనల్: టైటిల్ కోసం ముంబైతో తలపడనున్న గుజరాత్ జట్టు. ఇండోర్‌లో మ్యాచ్ ప్రారంభం -
టుడే అప్డేట్స్
నేటి నుంచి రెండు రోజులపాటు గుజరాత్లో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ: నేడు ఈసీని కలవనున్న ఎస్పీ నేత ములాయంసింగ్ యాదవ్. పార్టీ అధ్యక్షుడిని తానేనని అందుకు తగిన ఆధారాలు, డాక్యుమెంట్లు సమర్పించనున్న ములాయం కర్నూలు జిల్లాలో ఐదో రోజుకు చేరిన వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర. నేడు లింగాపురం నుంచి ప్రారంభంకానున్న వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర. ఓంకారం, కడమలకాల్వ, వెంగళ్‌రెడ్డిపేటలో వైఎస్ జగన్ రోడ్ షో జమ్ముకశ్మీర్: అఖ్నూర్ సెక్టార్ లోని ఆర్మీక్యాంపుపై ఉగ్రదాడి. భద్రతా బలగాలే లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు జవాన్ల మృతి. ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు కొనసాగుతున్న ఎదురుకాల్పులు నేడు శబరిమలలో పర్యటించనున్న తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు విద్యాసాగర్, విఠల్‌రెడ్డి. పంపా సంగమం కాన్ఫరెన్స్ లో పాల్గొననున్న ఇంద్రకరణ్ బృందం. కృష్ణా జిల్లాలో నేడు కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ కేంద్రానికి శంకుస్థాపన. కార్యక్రమానికి హాజరుకానున్న కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబునాయుడు నేడు పంజాబ్ కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక విడుదల చేయనున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఢిల్లీ: పొగమంచు కారణంగా 6 అంతర్జాతీయ, 7 డొమెస్టిక్ విమానాల రాకపోకలు ఆలస్యం. 41 రైళ్ల ఆలస్యం, 9 సర్వీసుల రీషెడ్యూలుతో పాటు 3 రైళ్లను రద్దుచేసిన రైల్వే అధికారులు నేడు అనంతపురంలో పర్యటించనున్న రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర. గన్నవరం నుంచి బెంగుళూరుకు విమానంలో రానున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా పరిగిలో జరిగే జన్మభూమి మా ఊరులో పాల్గొంటారు. మధ్యాహ్నం కళ్యాణదుర్గంలో జన్మభూమి కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నట్లు సమాచారం భద్రాచలం: రామాలయంలో ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు విశాఖ సింహాచలం దేవాలయంలో ఉత్తరద్వార దర్శనం. అప్పన్నస్వామి దర్శనం కోసం పోటెత్తిన భక్తులు -
టుడే అప్డేట్స్
బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోదీ నేడు కర్ణాటకలో పర్యటించనున్నారు. 14వ ప్రవాసీ భారతీయ దివాస్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించనున్న ప్రధాని మోదీ. ముఖ్య అతిథిగా పాల్గొననున్న పోర్చుగల్ ప్రధాని ఆంటోనియో కోస్టా నేడు కర్నూలు జిల్లాలో నాలుగోరోజుకు చేరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర. వేల్పనూరు నుంచి ప్రారంభంకానున్న నేటి యాత్ర. లింగాపురంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న వైఎస్ జగన్ విజయవాడలో నేటి ఉదయం ఇందిగాంధీ మున్సిపల్ స్డేడియం నుంచి అమరావతి మారథాన్ రన్ ఘనంగా ప్రారంభమైంది. జెండా ఊపి మారథాన్ రన్ ప్రారంభించిన మంత్రులు దేవినేని, ప్రతిపాటి పుల్లారావు, ఎంపీ కేశినేని, కలెక్టర్ బాబు, సీపీ గౌతం సవాంగ్ ఢిల్లీ: పొగమంచు కారణంగా 41 రైళ్ల ఆలస్యం. 14 సర్వీసులు రీ షెడ్యూలు, 5 రైళ్లను రద్దు చేసిన రైల్వేశాఖ. 7 అంతర్జాతీయ విమాన రాకపోకలకు, 2 డొమెస్టిక్ విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడగా, రెండు విమాన సర్వీసులు రద్దుచేసిన అధికారులు పాక్ జలసంధి వద్ద పదిమంది భారత జాలర్లను అదుపులోకి తీసుకున్న లంక నేవీ అధికారులు సిరియా: అజాజ్‌లో తిరుగుబాటుదారుల దుశ్చర్య. భారీ ట్యాంకర్ పేలుడు ఘటనలో 48 మంది మృతి నెల్లూరు జిల్లాలో స్వల్ప భూ ప్రకంపనలు. నేటి ఉదయం వింజమూరు, దుత్తలూరు సహా పలు గ్రామాల్లో ప్రకంపనలు. భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు తిరుమల: వైకుంఠ ఏకాదశి సందర్భంగా అర్ధరాత్రి నుంచే తిరుమలకు పొటెత్తిన భక్తులు. నేటి నుంచి రెండు రోజులపాటు స్వామివారి దివ్యదర్శనం, ప్రత్యేక దర్శనాలతో పాటు సిఫారసు లేఖలు, ఆర్జిత సేవలను రద్దుచేసిన టీటీడీ. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. పొగమంచు కారణంగా రోడ్డు స్పష్టంగా కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
టుడే అప్డేట్స్
న్యూఢిల్లీ: నేడు రెండోరోజు కొనసాగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం. త్వరలో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీజేపీ చర్చ. కర్నూలు జిల్లాలో మూడో రోజుకు చేరుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతు భరోసా యాత్ర. కర్నూలు జిల్లా రైతులతో వైఎస్ జగన్ ముఖాముఖి నేడు సూర్యాపేట కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష. నోట్ల రద్దు సమస్యలపై మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి ఆధ్వర్యంలో దీక్ష చేయనున్న నేతలు. హాజరుకానున్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి తిరుపతిలో నేటితో ముగియనున్న ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదరస్సు. ముఖ్య అతిథిగా మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ హాజరవనున్నారని ఎస్వీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఆవుల దామోదరం తెలిపారు. నేడు ఢిల్లీలో వక్ఫ్ బోర్డు జాతీయస్థాయి సమావేశం. హాజరుకానున్న అన్ని రాష్ట్రాల బోర్డుల చైర్ పర్సన్స్, సీఈవోలు, ఇతర ఉన్నతాధికారులు నేడు పుణేలో రెండో డిజీ ధన్ మేళా నిర్వహించనున్న కేంద్ర ప్రభుత్వం నేడు శ్రీలంకలో పర్యటించనున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు భారత పర్యటనలో ఉన్న పోర్చుగల్ ప్రధాని ఆంటోనియో కోస్టా. నేడు ఢిల్లీలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని నరేంద్రమోదీలతో ఆంటోనియా కోస్టా భేటీ. ఫ్లోరిడా ఎయిర్ పోర్టులో గుర్తుతెలియని దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ దాడిలో ఐదుగురు మృతిచెందగా, 8మందికి గాయాలయ్యాయి. ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్డేల్ ఎయిర్ పోర్టును మూసివేశారు. ఢిల్లీ: పొగమంచు కారణంగా పలు రైలు, విమాన సర్వీసులకు అంతరాయం. 70 రైళ్లు ఆలస్యం, 16 రైళ్ల వేళలలో మార్పులు. 7 సర్వీసులకు రద్దు చేసిన రైల్వేశాఖ. ఢిల్లీలో రెండు విదేశీ విమాన సర్వీసులు, నాలుగు డొమెస్టిక్ సర్వీసులు ఆలస్యం. పీబీఎల్-2: నేడు బెంగళూరు బ్లాస్టర్స్ వర్సెస్ హైదరాబాద్ హంటర్స్ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్‌లో నేడు ముంబై మహారథి వర్సెస్ యూపీ దంగల్ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం -
టుడే అప్డేట్స్
నేడు ఢిల్లీలో దీక్ష చేయనున్న ఉత్తరాఖండ్ సీఎం హరీష్ రావత్. ఉత్తరాఖండ్ అభివృద్ధిపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని సీఎం ఆరోపణ నేటి నుంచి కర్నూలు జిల్లాలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు భరోసా యాత్ర. శ్రీశైలం నుంచి ప్రారంభమయ్యే ఈ భరోసా యాత్ర మొదటి విడతలో శ్రీశైలం, నంద్యాల నియోజకవర్గాల్లో జరగనుంది. అప్పుల బాధతో, రుణమాఫీ అమలుకాక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఈ సందర్భంగా ఆయన భరోసా ఇవ్వనున్నారు. నేడు విజయవాడలో ఏపీ కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం. నోట్లరద్దు సమస్యలు, నల్లధనం వెలికితీతపై చర్చ నేడు తిరుపతిలో కొనసాగనున్న ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు నేడు జమ్ముకశ్మీర్‌లో పర్యటించనున్న నూతన ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ నేడు హైదరాబాద్‌లో టీకాంగ్రెస్ నేతల నిరసన ర్యాలీ. చార్మినార్ నుంచి అబిడ్స్ వరకు ర్యాలీ చేపట్టనున్న కాంగ్రెస్. నోట్ల రద్దు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ నేడు తూర్పుగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబునాయుడు పర్యటన. పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన నేటి నుంచి తెలంగాణలో విజయ డెయిరీ పాల ధర పెంపు. లీటర్ పాలపై రూ.2 పెంపు హైదరాబాద్: నేడు ఆరో రోజుకు చేరిన క్యాబ్ డ్రైవర్ల ఆందోళన. మణికొండ సర్పంచ్ ఆఫీసులో దీక్ష కొనసాగిస్తున్న ఉబర్, ఓలా డ్రైవర్-ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ ఢిల్లీ: పొగమంచు కారణంగా 70 రైళ్లు ఆలస్యం. 22 రైళ్ల వేళలను రీషెడ్యూలు. 7 సర్వీసులను రద్దుచేసిన రైల్వే అధికారులు ఆస్ట్రేలియా ఆర్మీ సాయాన్ని తాత్కాలికంగా రద్దుచేసుకున్న ఇండోనేషియా ప్రభుత్వం నేడు తెలంగాణాలో విద్యాసంస్థల బంద్‌కు ఎన్ఎస్యూఐ పిలుపు. ఫీజు రీయింబర్స్ మెంట్ పై ప్రభుత్వ వైఖరికి నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చిన ఎన్ఎస్యూఐ -
టుడే అప్డేట్స్
ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టు కొత్త సీజేఐగా బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్ జగదీష్‌సింగ్ ఖేహర్ హైదరాబాద్: పదవీ విరమణ పొందిన తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్రకు సచివాలయంలో బుధవారం వీడ్కోలు సమావేశం నిర్వహించనున్నారు. డీ బ్లాక్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహణ. చెన్నై: రాష్ట్ర రాజకీయాల్లో నేడు పలు కీలక సమావేశాలు జరగనున్నాయి. రాష్ట్ర కేబినెట్ బుధవారం అత్యవసర సమావేశం నిర్వహించనుంది. సీఎం పన్నీర్ సెల్వం నేతృత్వంలో ఉదయం 9.30 గంటలకు మంత్రి వర్గ సభ్యులు భేటీకానున్నారు. పార్టీ చీఫ్ శశికళ ముఖ్యమంత్రి అని వదంతులు వస్తున్న నేపథ్యంలో దీనిపై కేబినేట్ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే పార్టీ సర్వ సభ్య సమావేశం నేడు జరగనుంది. అన్నా అరివాలయంలోని డీఎంకే రాష్ట్ర కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి రెండు నెలల అనంతరం డీఎంకే అధినేత ఎం.కరుణానిధి హాజరుకానున్నారు. ఈ సమావేశంలో పార్టీ కోశాధికారి, ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ కు నిర్వాహక అధ్యక్ష పగ్గాలు అప్పగించే అవకాశముంది. నేడు భారత్‌కు రానున్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్. ఢిల్లీలో స్మాల్ అండ్ మిడియం ఎంటర్ ప్రైజెస్ ఈవెంట్లో పాల్గొననున్న పిచాయ్ క్యాబ్ డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం బుధవారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. బుధవారం ఉదయం 9 గంటలకు గన్‌పార్కు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి.. భారీ క్యాబ్ ర్యాలీతో ఇందిరా పార్కుకు చేరుకుంటామని, ధర్నా చౌక్ వద్ద ఆమరణ దీక్ష చేపడతామని అసోసియేషన్ అధ్యక్షుడు శివ ఉల్‌కొందూల్కర్ తెలిపారు. కోల్ కతా: నేడు ధర్నాలకు పిలుపునిచ్చిన సీఎం మమతా బెనర్జీ. ఎంపీ సుదీప్ అరెస్ట్ కు వ్యతిరేఖంగా న్యాయపోరాటానికి సిద్ధమైన టీఎంసీ నేతలు. హైదరాబాద్: నేడు ఆలస్యంగా బయలుదేరనున్న తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలు. సాయంత్రం 6:25 గంటలకు బయలుదేరనున్న ఎక్స్ ప్రెస్ రైలు చిత్తూరు జిల్లా తిరుపతిలో నేడు రెండో రోజు కొనసాగనున్న ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. ఉభయ సభల్లో ఫీజు రీయింబర్స్ మెంట్ పై చర్చ జరగనుంది నేడు దేశ రాజధాని ఢిల్లీలో ప్రి బడ్జెట్ సమావేశం నిర్వహించనున్నారు. నేడు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నేటి సాయంత్రం 6 గంటలకు పార్టీ నేతలతో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ భేటీ. హాజరుకానున్న రాష్ట్రాల ఇంఛార్జ్‌లు, ప్రధాన కార్యదర్శులు త్వరలో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్: నేటి మ్యాచ్‌లో హైదరాబాద్ హంటర్స్ వర్సెస్ రాకెట్స్ -
టుడే అప్డేట్స్
నేటి నుంచి శనివారం వరకూ తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరగనున్న 104వ సైన్స్ కాంగ్రెస్. నేటి ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. తర్వాత నోబెల్ పురస్కార గ్రహీతలతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, గవర్నర్ నరసింహన్, కేంద్ర, రాష్ట్రమంత్రులు హాజరవుతున్నారు. నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి. బాణసంచా యూనిట్ దగ్ధమై మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించడానికి నెల్లూరుకు వెళుతున్న వైఎస్ జగన్. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని కూడా జగన్ పరామర్శిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్న సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. ఇఛ్చాపురంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులతో పవన్ ముఖాముఖి చిత్తూరు జిల్లా తిరుమలలో శ్రీవారిని దర్శించుకోనున్న ప్రధాని నరేంద్ర మోదీ. స్వల్ప విశ్రాంతి తర్వాత తిరుగు ప్రయాణం. ప్రధాని రాక సందర్భంగా తిరుమల ఆలయంలో మంగళవారం వీఐపీ దర్శనం రద్దు చేశారు. నేడు ఢిల్లీలో సీఈసీని కలవనున్న యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ వర్గం. సైకిల్ గుర్తు తమకే ఇవ్వాలని కోరనున్న రాంగోపాల్ యాదవ్ ఢిల్లీ: దట్టమైన పొగమంచు కారణంగా పలు విమాన, రైలు సర్వీసులు ఆలస్యం. కొన్ని సర్వీసులను రద్దు చేసిన అధికారులు. నేడు ఎర్రవల్లి, నరసన్నపేటలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించనున్న కేంద్ర మంత్రి విజయ్ గోయల్ న్యూఢిల్లీ: ఎన్నికలు జరిగే అయిదు రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లతో సీఈసీ సమావేశం. 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌పై సీఈసీ కసరత్తు. ఎన్నికల ఏర్పాట్లు బందోబస్తుపై సమీక్షించనున్న సీఈసీ హైదరాబాద్: ఉత్తరాదిలో పొగమంచు కారణంగా తెలంగాణ ఎక్స్ ప్రెస్ ఆలస్యం. మధ్యాహ్నం 1:25 గంటలకు బయలుదేరనున్న తెలంగాణ ఎక్స్ ప్రెస్ తిరుమల: నేడు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు ఆలయశుద్ధి కార్యక్రమం. 11 తర్వాతే భక్తులకు స్వామివారి దర్శనం -
టుడే అప్డేట్స్
ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న నూతన సంవత్సర వేడుకలు. పలు దేశాల్లో నిన్న రాత్రి నుంచి అంబరాన్నంటిన సంబరాలు ఐక్యరాజ్యసమితి నూతన సెక్రటరీ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించనున్న పోర్చుగల్ మాజీ ప్రధానమంత్రి ఆంటోనియో గుటెరెస్. ప్రస్తుత సెక్రటరీ జనరల్ బాన్ కి-మూన్ పదవీ కాలం నిన్న (డిసెంబర్ 31న) ముగిసింది. ఈ నేపథ్యంలో సమితి 9వ సెక్రటరీ జనరల్‌గా 67 ఏళ్ల గుటెరెస్ నియామకానికి గతంలోనే ఆమోదం. నేటి నుంచి ఏటీఎంల్లో రూ.4500 తీసుకునే అవకాశం ఏపీ, తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. గవర్నర్ నరసింహన్ తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన వైఎస్ జగన్ టర్కీ: న్యూ ఇయర్ వేడుకలలో విషాదం. నైట్‌క్లబ్‌లో కాల్పులకు పాల్పడ్డ దుండగులు. హైదరాబాద్: నేడు రాజ్ భవన్లో ప్రజలను కలుసుకోనున్న గవర్నర్ ఢిల్లీలో దట్టంగా కమ్ముకున్న పొగమంచు. 48 రైళ్ల సర్వీసులు ఆలస్యం, 12 రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు తిరుమలలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. ఆలయం ముందు గోవింద నామస్వరణతో కొత్త ఏడాదికి స్వాగతం పలికిన భక్తులు. -
టుడే అప్డేట్స్
నేటితో ముగియనున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శీతాకాల విడిది. సాయంత్రం ఢిల్లీకి ప్రణబ్ తిరుగు పయనం యూపీ: నేడు సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థులతో భేటీ కానున్న పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్. తాజా సంక్షోభం నేపథ్యంలో నేటి సమావేశానికి ప్రాధాన్యం ఢిల్లీ: రద్దయిన పెద్ద నోట్లపై నేటి నుంచి అమల్లోకి ఆర్డినెన్స్. రద్దయిన నోట్లు ఉంటే జైలు శిక్ష నిబంధన తొలగింపు. రూ.10 వేలు జరిమానా విధించాలని నిర్ణయం నేటి ఉదయం 9 గంటలకు లక్నోలో పార్టీ ఎమ్మెల్యేలతో భేటీకానున్న యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ నేడు విజయవాడలో ఉదయం 10:30 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ. జనవరి 2 నుంచి నిర్వహించే జన్మభూమి కార్యక్రమంపై చర్చ ఓలా క్యాబ్ సంస్థకు వెళితే బౌన్సర్లతో క్యాబ్ డ్రైవర్లపై దాడి చేయించినందుకు నిరసనగా శుక్రవారం అర్ధరాత్రి నుండి జనవరి 4 వరకు తెలంగాణ వ్యాప్తంగా క్యాబ్‌ల బంద్. అసోసియేషన్‌లో ఉన్న ఏడు వేల మందితో పాటు అన్ని సంఘాల క్యాబ్ డ్రైవర్స్, ఓనర్స్ కూడా బంద్ లో పాల్గొననున్నారు అమరావతి: నేడు ఆర్బీఐ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రూ.2 వేల కోట్లు పంపిణీ ఢిల్లీ: పొగమంచు కారణంగా 69 రైళ్ల ఆలస్యం, 16 రైళ్లు రీషెడ్యూల్. 4 రైళ్లను రద్దుచేసిన అధికారులు నేటి ఉదయం జపాన్ తూర్పు తీరంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.5గా నమోదు రాష్ట్రంలోని గ్రూప్–3 కేటగిరీ పోస్టుల భర్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) శనివారం ప్రకటన విడుదల చేయనుంది. చెన్నై: నేడు పార్టీ పగ్గాలు పుచ్చుకోనున్న మాజీ సీఎం జయలలిత నెచ్చెలి శశికళ. అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టనున్న శశికళ -
టుడే అప్డేట్స్
నేడు రాష్ట్రపతి నిలయంలో తేనేటి విందు. రాష్ట్రపతి నిలయంలో ప్రభుత్వ ప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు, వీఐపీలకు విందు కార్యక్రమం రద్దయిన పెద్ద నోట్ల డిపాజిట్‌కు నేటితో ముగియనున్న గడువు నేడు ఢిల్లీలోని తల్కకటోరా స్డేడియంలో డిజిధన్ మేళాలో పాల్గొననున్న ప్రధాని నరేంద్ర మోదీ. ఆధార్ పే, ఇతర కార్యక్రమాలను ప్రారంభించనున్న మోదీ హైదరాబాద్: నేటి నుంచి జీహెచ్ఎంసీలో క్యాష్ లెస్ సేవలు అమలు పోలవరం స్పిల్ వే కాంక్రీట్ పనులకు నేడు ఏపీ సీఎం చంద్రబాబు శంకుస్థాపన నేటి ఉదయం 11:30 గంటలకు తెలంగాణ బీఏసీ సమావేశం. అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై చర్చ నేడు తెలంగాణ అసెంబ్లీలో మత్స్యశాఖ సంబంధిత అంశాలపై చర్చ ఢిల్లీ: పొగమంచు కారణంగా 54 రైళ్ల ఆలస్యం. 12 రైళ్లను రీషెడ్యూల్ చేసిన రైల్వేశాఖ వైఎస్ఆర్ జిల్లాలో నాలుగో రోజుకు చేరుకున్న గండికోట ముంపువాసుల ఆందోళన. రాత్రంతా రోడ్డుపైనే జాగారం చేసిన ముంపువాసులు -
టుడే అప్డేట్స్
నేటి ఉదయం తిరువనంతపురంలో జరిగే ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సమావేశాలకు హాజరుకానున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. అనంతరం మైసూరులో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జాతీయ సమ్మేళనంలో పాల్గొంటారు. తిరిగి నేటి రాత్రి హైదరాబాద్‌కు చేరుకోనున్న రాష్ట్రపతి నేడు (గురువారం) తమిళనాడు రాష్ట్రమంతటా నెలకొన్న ఉత్కంఠ. అందరిచూపులూ అన్నాడీఎంకే వైపు. ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక జరిగేనా లేదా అనే చర్చ నేపథ్యంలో చెన్నైలో గురువారం జరుగుతున్న పార్టీ సర్వ సభ్య సమావేశమే ఈ ప్రత్యేక పరిస్థితులకు కారణం. తమిళనాడు మాజీ సీఎం జయలలిత మృతిపై నేడు మద్రాసు హైకోర్టులో విచారణ జరగనుంది. అనుమానాస్పద రీతిలో తమిళనాడు సీఎం జయలలిత మృతి చెందినందున సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులు ముగ్గురితో కమిటీని ఏర్పాటు చేయాలని చెన్నై అరుంబాక్కంకు చెందిన జోసెఫ్ హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లో నేటి ఉదయం 9 గంటలకు సీఎల్పీ సమావేశం హైదరాబాద్: నేడు రాష్ట్ర వ్యాప్తంగా సీపీఎం నిరసనలు. భూ సేకరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సీపీఎం నేతల ఆందోళనలు ఢిల్లీ: దట్టమైన పొగమంచు కారణంగా 5 అంతర్జాతీయ, 9 దేశీయ విమాన సర్వీసులు ఆలస్యం. ఒక విమాన సర్వీసు రద్దు చేసిన అధికారులు హాలీవుడ్ ప్రముఖ నటి డెబ్బీ రెనాల్డ్స్(84) కన్నుమూత. కూతురు, నటి క్యారీ ఫిషర్ చనిపోయిన మరుసటి రోజే ఈ ఘటన -
టుడే అప్డేట్స్
నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. తిరుమలలో శ్రీవారిని దర్శించుకోనున్న ప్రణబ్. తిరుమలేశుని దర్శనానంతరం తిరిగి పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు. సాయంత్రం 4.10గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు పయనమవుతారు నేడు ఢిల్లీలో సమావేశం కానున్న కేంద్ర మంత్రివర్గం నేడు మద్రాస్ హైకోర్టులో మాజీ సీఎం జయలలిత మరణంపై వేసిన పిటిషన్‌పై విచారణ జరుగుతుంది. జయలలిత మరణంపై విచారణ జరిపించాలని అన్నాడీఎంకే కార్యకర్తల పిటిషన్ నేడు అనంతరపురం జేఎన్టీయూ ఎనిమిదవ స్నాతకోత్సవం. షార్ డైరెక్టర్ పి.కున్నికృష్ణన్కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్న యూనివర్సిటీ డీమానిటైజేషన్పై నేడు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం తిరుపతి: డాక్టర్ గుణశేఖర్ యాదవ్ ఇంటిపై ఐటీ సోదాలు. మంగళవారం రాత్రి నుంచి కొనసాగుతున్న తనిఖీలు. ఏపీ మంత్రి నారాయణకు గుణశేఖర్ యాదవ్ అత్యంత సన్నిహితుడు. ఉత్తరప్రదేశ్ లోని కాన్పుర్ సమీపంలో సెల్దా-అజ్మీర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్రమాదం.. 14 బోగీలు పట్టాలు తప్పడంతో ట్రెయిన్ గార్డు సహా పలువురు ప్రయాణికులకు గాయాలు -
టుడే అప్డేట్స్
నేడు రాజ్‌భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి విందు ఇవ్వనున్న గవర్నర్ నరసింహన్. హాజరుకానున్న తెలంగాణ సీఎం కేసీఆర్, పలువురు మంత్రులు, ప్రముఖులు. నేడు ఢిల్లీలో ఆర్ధిక నిపుణులతో సమావేశం కానున్న ప్రధాని నరేంద్ర మోదీ విపరీతమైన చలి, వాతావరణ పరిస్థితుల కారణంగా యూపీ లోని వారణాసిలో నేడు, రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం కృష్ణా జిల్లా విజయవాడలో నేటి నుంచి జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన నెల్లూరులో నేటి నుంచి మూడు రోజులపాటు ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణ డెహ్రాడూన్‌లో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్న ప్రధాని. పరివర్తన్ ర్యాలీలో పాల్గొననున్న మోదీ నేడు వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించనున్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు హైదరాబాద్: నేడు ఇందిరాపార్క్ వద్ద రైతు ధర్నా చేపట్టనున్న బీజేపీ నేడు తిరుపతి ఎస్వీయూలో భారత ఆర్థిక సంఘం 99వ వార్షిక సదస్సు. మూడు రోజులపాటు జరగనున్న సదస్సు. హాజరుకానున్న సీఎం చంద్రబాబు -
టుడే అప్డేట్స్
నేడు బెంగళూరులో జరిగే 89వ భారత్ బంగా సాహిత్య సమ్మేళనం కార్యక్రమానికి హాజరుకానున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ క్రిస్మస్ పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవులందరికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు నేడు మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి జన్మదినం సందర్భంగా హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన పార్టీ నేతలు వైఎస్ఆర్ జిల్లాలో కొనసాగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన. నేడు జిల్లాలో జరిగే క్రిస్మస్ వేడుకలకు హాజరుకానున్న వైఎస్ జగన్ న్యూఢిల్లీ: నేటి నుంచి డిజిటల్ లక్కీ డ్రా ప్రారంభం. నేటి నుంచి 100 రోజులపాటు ప్రతిరోజు, ప్రతివారం లక్కీ డ్రాలు తీస్తారు నేటి ఉదయం 11 గంటలకు రేడియో కార్యక్రమం మన్ కీబాత్‌లో ప్రసంగించనున్న ప్రధాని మోదీ నేడు గుంటూరులో పర్యటించనున్న ఏపీ సీఎం చంద్రబాబు. పెదకాకాని క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్న చంద్రబాబు నేడు హైదరాబాద్ లో సమావేశం కానున్న టీజేఏసీ నేతలు. తెలంగాణ ప్రభుత్వ ప్రజా వ్యతిరేఖ విధానాలపై కార్యాచరణ ఉంటుందన్న జేఏసీ చైర్మన్ కోదండరామ్ సిద్ధిపేట జిల్లాలో నేడు కొమురవెల్లి మల్లన్న కల్యాణ మహోత్సవం. తోటబావి కల్యాణ మండపం వద్ద ఏర్పాట్లు పూర్తి. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్న మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి నేడు క్రిస్మస్ పర్వదినం సదర్భంగా మెదక్ సీఎస్ఐ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకల నిర్వహణ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్డేడియంలో కొనసాగుతోన్న కూచిపూడి నాట్యోత్సవాలు. నేడు ఏడు వేల మందితో మహా బృంద నాట్యం. 'జయము జయము' గీతానికి గిన్నిస్ రికార్డ్ దక్కే అవకాశం -
టుడే అప్డేట్స్
నేడు హైదరాబాద్‌లో మహిళా దక్షత సమితి, బన్సీలాల్ మాలాని నర్సింగ్ కళాశాలను ప్రారంభించనున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేడు ముంబై, పుణేలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ. పలు కార్యక్రమాలలో పాల్గొని ప్రసంగించనున్న మోదీ నేటి నుంచి మూడు రోజులపాటు వైఎస్ఆర్ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన. శని, ఆదివారాలలో క్రిస్మస్ పండుగ కార్యక్రమాలలో కుటుంబసభ్యులతో కలిసి పాల్గొననున్నారు. కాకినాడ ప్రభుత్వాసుప్రతిలో జూనియర్ డాక్టర్ల ఆందోళన. డాక్టర్ సలీంను పిఠాపురం ఎమ్మెల్యే(టీడీపీ) వర్మ దుర్భాషలాడారంటూ జూడాల నిరసన. వర్మను అరెస్ట్ చేయనిపక్షంలో నేటి నుంచి ఎమర్జెన్సీ విధులు బహిష్కరిస్తామని జాడాల హెచ్చరిక నేడు హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో చేపట్టనున్న ర్యాలీలో పాల్గొననున్న ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేటి ఉదయం విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన "స్వస్థ వైద్య వాహిని" కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ: పొగమంచు కారణంగా ఢిల్లీకి వెళ్లనున్న 52 రైళ్ల ఆలస్యం. మరో 5 రైళ్ల రీషెడ్యూల్. ఓ ట్రైన్ సర్వీస్ రద్దు చేసిన అధికారులు -
టుడే అప్డేట్స్
నేడు హైదరాబాద్ లోని ఆర్మీ కాలేజీ స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేడు సీఎం దత్తతగ్రామాలు ఎర్రవల్లి, నర్సన్నపేటలో డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభోత్సవం. ఎర్రవల్లిలో డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొననున్న సీఎం కేసీఆర్ నేడు మాజీ ప్రధాని పీవీ నరసింహరావు 12వ వర్ధంతి. ఈ సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని పీవీ జ్ఞానభూమిలో నేటి ఉదయం సర్వమత ప్రార్థనలు నేడు దేశ రాజధాని ఢిల్లీలో రెండో రోజు కొనసాగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నేడు తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి ఎస్ఎఫ్ఐ పిలుపు. ప్రైవేట్ వర్సిటీల బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీని ముట్టడించాలని విద్యార్థి యూనియన్ నిర్ణయం విజయవాడలో నేడు ఛలో వెలగపూడి కార్యక్రమానికి ఏపీసీసీ పిలుపు. సీఎం చంద్రబాబు ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ నేతల ఆందోళన హైదరాబాద్: నేడు ఎల్బీ స్డేడియంలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవగాహన కార్యక్రమం. హాజరుకానున్న కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ నేటి ఉదయం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద దర్నా చేపట్టనున్న యూత్ కాంగ్రెస్. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, లక్ష ఉద్యోగాల హామీ అమలుకు యూత్ కాంగ్రెస్ డిమాండ్ నేటి నుంచి అంతర్జాతీయ కూచిపుడి నృత్యోత్సవాలు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్డేడియంలో మూడు రోజులపాటు కొనసాగనున్న ఉత్సవాలు నేడు విడుదలకానున్న 1999 గ్రూప్-2 మెరిట్ అభ్యర్థుల జాబితా -
టుడే అప్డేట్స్
దక్షిణాది రాష్ట్రాల శీతాకాల విడిదిలో భాగంగా నేడు హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. 22వ తేదీ నుంచి ఈ నెల 31 వరకు ఆయన బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో బస . నేటి సాయంత్రం 5.30కు ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఈనెల 31 వరకు బొల్లారంలో శీతాకాల విడిది. నేడు వారణాసిలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ. 20 వేల మంది బూత్ లెవల్ కార్యకర్తలతో సమావేశం కానున్న ప్రధాని నేడు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ను కలవనున్న మణిపూర్ బీజేపీ నేతల బృందం. పలు సమస్యలను రాజ్‌నాథ్ దృష్టికి తీసుకెళ్లనున్న పార్టీ నేతలు హైదరాబాద్‌లో నేడు ఏపీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం. హాజరుకానున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పిన్నెల్లి. నేడు తెలంగాణ శాసనసభలో టీఎస్ ఐపాస్ పై చర్చ. నేడు తెలంగాణ శాసనమండలిలో వ్యవసాయరంగంపై కొనసాగనున్న చర్చ చిత్తూరు జిల్లా తిరుమలలో పర్యటించిన లంక ప్రధాని విక్రమ సింఘె. నేటి ఉదయం శ్రీవారి ఆలయాన్ని సందర్శించిన విక్రమ సింఘె అమరావతిలో నేడు రెండో రోజు కూడా కలెక్టర్లతో సమావేశం కానున్న సీఎం చంద్రబాబు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలుతీరుపై సమీక్ష -
టుడే అప్డేట్స్
నేటి నుంచి మూడు రోజులపాటు సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు. హైదరాబాద్‌లో నేడు ప్రారంభంకానున్న సమావేశాలు నేడు ఐదవరోజు కొనసాగనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. నేడు వ్యవసాయరంగంపై సభలో చర్చ నేడు ఢిల్లీలో ఉదయం 10 గంటలకు సమావేశం కానున్న కేంద్ర మంత్రివర్గం నేడు ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అమరావతిలో నేడు, రేపు కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమావేశం. క్షేత్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్ష మెక్సికోలో పెను విషాదం చోటుచేసుకుంది. ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి తర్వాత భారీ పేలుడు సంభవించింది. పొగమంచు కారణంగా ఢిల్లీకి వెళ్లనున్న 32 రైళ్లు ఆలస్యం. మరో ఐదు రైళ్ల వేళలను రీషెడ్యూల్ చేసిన రైల్వే అధికారులు నెల్లూరు జిల్లా వెంకటాచలం వద్ద తెగిపడిన రైల్వే విద్యుత్ వైర్లు. దీంతో నేటి ఉదయం గూడూరు-నెల్లూరు మార్గంలో కొంత సమయం నిలిచిన రైళ్ల రాకపోకలు -
టుడే న్యూస్ అప్డేట్స్
పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు వివరించనున్నారు. ఇందుకోసం ఒక ప్రతినిధి బృందంతో నేటి సాయంత్రం 4 గంటలకు రాజభవన్లో గవర్నర్‌ను ఆయన కలుసుకోనున్నారు. నేటి నుంచి ఏపీలో చంద్రన్న క్రిస్మస్ కానుకల పంపిణీ. విజయవాడ మండలం ఎనికేపాడులో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పంపిణీ తెలంగాణలో నేడు కొనసాగనున్న అసెంబ్లీ సమావేశాలు. శాసనసభలో నేడు మిషన్ భగీరథపై, శాసనమండలిలో మిషన్ కాకతీయపై చర్చ జరనుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)లో భారీ కుంభకోణం. రూ.120 కోట్ల కుంబకోణానికి పాల్పడినట్లు డిలైట్ సంస్థ దర్యాప్తులో వెల్లడి. హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్షద్ అయుబ్, సెక్రటరీ జాన్ మనోజ్ పై ఉప్పల్ పీఎస్ లో కేసు నమోదు. విచారణ చేపట్టిన పోలీసులు బెర్లిన్ లోని క్రిస్మస్ మార్కెట్లో ట్రక్కు బీభత్సం. జనావాసాలపై దూసుకెళ్లడంతో పలువురు దుర్మరణం. 50 మందికి పైగా గాయపడ్డారని చెబుతున్న అధికారులు నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించనున్న అధికారులు న్యూఢిల్లీలో నేడు అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య నుంచి అవార్డు స్వీకరించనున్న బాక్సర్ మేరీ కోమ్ చెన్నై చెపాక్ స్డేడియంలో ఇంగ్లండ్, భారత్ మధ్య చివరిటెస్టు ఐదో రోజు ఆట కొనసాగింపు -
టుడే న్యూస్ అప్డేట్స్
♦ రేపు విజయనగరంలో వైఎస్ జగన్ యువభేరి పూల్ బాగ్ రోడ్డులోని జగన్నాథ ఫంక్షన్ హాల్లో యువభేరి ♦ ఇవాళ ఏపీ అసిస్టెంట్ ఇంజీర్ పోస్టులకు స్ర్కీనింగ్ టెస్ట్ హాజరుకానున్న 32,247 మంది అభ్యర్థులు, 59 సెంటర్లు ఏర్పాటు ♦ ఇవాళ్టి నుంచి ఉద్యోగులు, జర్నలిస్టులకు కార్పొరేట్ వైద్యం కార్పొరేట్ ఆస్పత్రులతో తెలంగాణ ప్రభుత్వం ఎంవోయు ♦ ఇవాళ నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో ముదిరాజ్‌ల సింహగర్జన బీసీ-డీ నుంచి బీసీ-ఏ లోకి మార్చాలని ముదిరాజ్‌ల డిమాండ్ ♦ ఇవాళ జూనియర్ హాకీ ప్రపంచ కప్ ఫైనల్ బెల్జియంతో తలపడనున్న భారత్, సా.6గంటలకు మ్యాచ్ ♦ ఇవాళ ఐఎస్ఎల్-2016 ఫైనల్ కేరళ బ్లాస్టర్స్‌తో తలపడనున్న అట్లెటికో డి కోల్‌కతా -
టుడే న్యూస్ అప్డేట్స్
నేడు నరసరావు పేటకు వైఎస్ జగన్ గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో మాజీ సీఎం కాసు బ్రహ్మనందరెడ్డి మనవడు కాసు మహేష్ రెడ్డి ఆయన అనుచరులతో కలిసి వైఎస్ఆర్ సీపీలో చేరుతారు. అనంతరం నరసరావు పేట రెడ్డి కాలేజీ గ్రౌండ్లో సా.4గంటలకు జరిగే భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సభా సమరానికి రంగం సిద్ధం హైదరాబాద్: నేటి నుంచి తెలంగాణ శాసనసభ, శాసనమండలి శీతాకాల సమావేశాలు చలికాలంలోనూ వేడి పుట్టించనున్నాయి. శుక్రవారం ఉదయం 10 గంటలకు శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని గురువారం జరిగిన బీఏసీ భేటీలో నిర్ణయించారు. సెలవు రోజులు పోగా 12 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. అవసరమైతే మరిన్ని రోజులు పొడిగించేందుకు సిద్ధమని ప్రభుత్వం వెల్లడించింది. ఈ సమావేశాల్లో ప్రధానంగా 20 దాకా అంశాలు చర్చకు రావచ్చని అంచనా వేస్తున్నారు. కరుణానిధికి మరోసారి అస్వస్థత చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ అధ్యక్షుడు కరుణానిధి మరోసారి అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి అనారోగ్యానికి గురైన ఆయన్ను కుటుంబసభ్యులు కావేరి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. గొంతు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా శ్వాస తీసుకోవడానికి ఆయన ఇబ్బంది పడుతున్నారని ఆస్పత్రి విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నామని పేర్కొంది. నేటితో ముగియనున్న పార్లమెంటు సమావేశాలు పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ఒకరోజు మాత్రమే మిగిలుంది. నవంబర్ 16న సమావేశాల ప్రారంభం నుంచి ఒక్కరోజు కూడా సభ సజావుగా జరగలేదు. ఉభయ సభల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం, పట్టువిడుపులు విడవకపోవటం తో ఈసారి సమావేశాలు ఎలాంటి చర్చ లేకుండానే నిరవధిక వాయిదా పడేట్లు కనబడుతున్నాయి. నేడు ప్రధాని వద్దకు రాహుల్ బృందం ఉత్తరప్రదేశ్‌లో తాను చేపట్టిన ‘కిసాన్ యాత్ర’ సందర్భంగా రైతులు చేసిన డిమాండ్లను తెలియజేసేందుకు రాహుల్ గాంధీ నేతృత్వంలోని విపక్ష పార్టీల బృందం శుక్రవారం ఉదయం ప్రధానిని కలవనుంది. ఆ తర్వాత ఈ బృందం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలసి నోట్లరద్దు సమస్యలపై ఫిర్యాదు చేయనుంది. నేడు ఆలస్యంగా 'సికింద్రాబాద్-గోరఖ్‌పూర్' సికింద్రాబాద్- గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్(12590) రైలు శుక్రవారం ఆలస్యంగా బయలు దేరనుంది. ఉదయం 7.20 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరాల్సి ఉండగా..4 గంటలు ఆలస్యంగా ఉదయం 11.20కి బయలుదేరనుంది. ఇవాళ బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ ఢిల్లీ: ఇవాళ బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ కానుంది. ఎంపీలనుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. నేడు ఆర్టీసీ సీసీఎస్ ఎన్నికలు ఆర్టీసీలో సీసీఎస్ (క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ) డెలిగేట్స్ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరగనున్నాయి. 126 డిపోలు, 5 వర్క్ షాపుల్లో 56,500 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 236 డెలిగేట్ పోస్టులకు 700 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. స్పెయిన్‌పై గెలుపుతో సెమీస్‌లోకి దూసుకెళ్లిన భారత్ లక్నో: టైటిల్ ఫేవరెట్ హోదాకు తగ్గట్టు ఆడిన భారత జట్టు జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 2–1తో స్పెయిన్‌పై గెలిచింది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో భారత్... ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకుంటుంది. నేటి నుంచి చెన్నైలో చివరి టెస్టు చెన్నై: ‘వర్దా’ తుపాను తర్వాత నెలకొన్న ప్రశాంతత మధ్య భారత్, ఇంగ్లండ్ సిరీస్‌లో ఐదో టెస్టుకు చెపాక్‌లో రంగం సిద్ధమైంది. ఎన్నో ప్రతికూలతల మధ్య మ్యాచ్ నిర్వహణ కోసం చిదంబరం స్టేడియం సిబ్బంది తీవ్రంగా శ్రమించడంతో అనుకున్న ప్రకారం నేటి (శుక్రవారం) నుంచి చివరి టెస్టు జరగనుంది. ఇప్పటికే 3–0తో సిరీస్ నెగ్గి తిరుగులేని ఆధిక్యం కనబరిచిన భారత్ దీనిని మరింత పెంచుకోవాలని భావిస్తోంది. భారత్‌లో అడుగు పెట్టిన నాటినుంచి విజయానికి ఆమడ దూరంలో నిలిచిన ఇంగ్లండ్ ఒత్తిడి లేకుండా ఆడి కాస్త మెరుగ్గా సిరీస్ ముగించాలని ఆశిస్తోంది. -
టుడే న్యూస్ అప్డేట్స్
నేటితో ముగియనున్న ‘గూప్–2’ గడువు ♦ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతనెలలో విడుదల చేసిన గ్రూప్–2 నోటిఫికేషన్‌కు సంబంధించి బుధవారం సాయంత్రం వరకు దాదాపు ఆరు లక్షలవరకు దరఖాస్తులు అందాయి. ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు గడువు గురువారం అర్ధరాత్రితో ముగియనుంది. నేడు బీఏసీ సమావేశం ♦ శాసనసభ శీతాకాల సమావేశాల(ఆరో సెషన్) నిర్వహణపై చర్చించేందుకు బీఏసీ(బిజినెస్ అడ్వైజరీ కమిటీ) గురువారం భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు స్పీకర్ మధుసూదనాచారి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈసారి అసెంబ్లీ సమావేశాలను కనీసం 10 రోజుల పాటు జరపాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. రూ.500 పాతనోటుకు నేటితో రాంరాం ♦ పాత రూ.500 నోటు నేటి అర్ధరాత్రి వరకే చెల్లుబాటవుతుంది. అదీ ప్రభుత్వ సర్వీసుల చెల్లింపుల్లో, మెడికల్ షాపుల్లోనే. రూ.500 నోట్లతో మొబైల్ రీచార్జి సదుపాయానికి అవకాశం ఉండదు. ఈ నోట్ల వినియోగానికి ఇచ్చిన డిసెంబర్ 15 గడువును ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించరాదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇక ప్రజలు తమ వద్ద ఉన్న పాత రూ.500 నోట్లను బ్యాంకుల్లో మాత్రమే డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ‘పాత రూ.500 నోట్ల వినియోగానికి ఇచ్చిన మినహాయింపులు డిసెంబర్ 15వ తేదీ అర్ధరాత్రితో ముగుస్తాయి’ అని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంతదాస్ బుధవారం ట్వీట్ చేశారు. మధ్యాహ్నం 2:30గం.లకు ఏపీ కేబినెట్ భేటీ ♦ పెద్దనోట్ల రద్దు, చిల్లర కొరత, నగదు రహిత లావాదేవీలు..నాలా పన్ను, స్మార్ట్ సిటీల కోసం ఎన్సీపీల ఏర్పాటు పై చర్చించే అవకాశం ♦ హైదరాబాద్: ఉదయం 9 గంటలకు సీఎల్పీ సమావేశం అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం పై కసరత్తు ♦న్యూఢిల్లీ: ఉ.9:30 గంటలకు పార్లమెంట్లో ప్రతిపక్షాల సమావేశం ♦ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీలో ఇవాళ రెండో రౌండ్ చైనా షట్లర్ సున్ యుతో తలపడనున్న పీవీ సింధు ♦ లక్నో: జూనియర్ పురుషుల హాకీ ప్రపంచ కప్ ఇవాళ క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్‌తో తలపడనున్న భారత్ -
టుడే న్యూస్ అప్డేట్స్
♦ న్యూఢిల్లీ: నాలుగు రోజుల వరస సెలవుల తర్వాత పార్లమెంటు సభాకార్యకలాపాలు బుధవారం నుంచి మళ్లీప్రారంభంకానున్నాయి. పాత పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై సభల్లో వాడీవేడీ చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో తమ సభ్యులంతా తప్పక హాజరవ్వాల్సిందిగా బీజేపీ, విపక్ష కాంగ్రెస్ విప్ జారీ చేశాయి. ♦ హైదరాబాద్: ఇవాళ ఉదయం 11 గంటలకు వైఎస్ఆర్సీపీ కేంద్రకార్యాలయంలో టీ-వైఎస్ఆర్సీపీ రంగారెడ్డి కార్యవర్గ సమావేశం జరుగనుంది. ♦ ఢిల్లీ: ఇవాళ సాయంత్రం 6 గంటలకు పార్టీ సీనియర్లతో రాహుల్ గాంధీ భేటీ ♦ అమరావతి: నేటి నుంచి విద్యుత్ పొదుపు వారోత్సవాలు 20వ తేదీ వరకు ఇంధన పొదుపు వారోత్సవాలు ♦ కొత్త జిల్లాల అభివృద్ధి ప్రణాళికల తయారీయే లక్ష్యంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నేడు జిల్లా కలెక్టర్లతో సమావేశమవుతున్నారు. కొత్తగా నిర్మించిన ముఖ్యమంత్రి అధికారిక నివాస ప్రాంగణంలోని ప్రగతిభవన్ లో బుధవారం ఉదయం 11గంటలకు ఈ సదస్సు ప్రారంభమవుతుంది. జిల్లా కలెక్లర్లతో పాటు ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, జాయింట్ కలెక్టర్లు, జీహెచ్ఎంసీ, వరంగల్, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్లు, సబ్ కలెక్టర్లు, అసిస్టెంట్ కలెక్టర్లు ఈ సదస్సుకు హాజరవుతారు. ♦ హైదరాబాద్: రాష్ట్రంలోని ముస్లింలలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల పెంపుదల అంశంపై బుధవారం నుంచి శనివారం వరకు ప్రజా విచారణ అభిప్రాయ సేకరణ చేపడుతున్నట్లు రాష్ట్ర బీసీ కమిషన్ తెలిపింది. ఖైరతాబాద్‌లోని వాటర్ వర్క్స్ బిల్డింగ్‌లోని బీసీ కమిషన్ నూతన కార్యాలయ సమావేశ మందిరంలో ఈ నెల 14 నుంచి 17 వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 5 వరకు పబ్లిక్ హియరింగ్‌ను నిర్వహించనున్నారు. ♦ దుబాయ్: నేటి నుంచి వరల్డ్ సూపర్ సిరీస్ మాస్టర్ ఫైనల్స్ ఈ నెల 18వరకు జరగనున్న టోర్నీ తొలిసారి పోటీ పడుతున్న పీవీ సింధు భారత షట్లర్ గ్రూప్‌లోనే కరోలినా మారిన్ -
టుడే న్యూస్ అప్ డేట్స్
♦ తూర్పు గోదావరి జిల్లాలో రెండో రోజు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. వరా రామచంద్రాపురంలో కాళ్లవాపు వ్యాధితో మృతిచెందిన వారి కుటుంబాలను జగన్ పరామర్శించనున్నారు. అనంతరం రేఖపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పోలవరం నిర్వాసితుల సమస్యలపై మాట్లాడతారు. ♦ సీఎం కేసీఆర్ గురువారం ఢిల్లీలో జరగనున్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూతురి వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులను కలుసుకుంటారు.అపాయింట్మెంట్ లభిస్తే ప్రధాని మోదీతో భేటీ అవుతారు. ♦ ఏపీ వైపు తుపాను దూసుకు వస్తోంది. ఆగ్నేయ బంగాళా ఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం బుధవారం సాయంత్రం వరకు స్థిరంగా ఉంది. ఆ తర్వాత నుంచి ఉత్తర దిశగా నెమ్మదిగా కదులుతూ బుధవారం రాత్రికి విశాఖపట్నానికి ఆగ్నేయంగా 1,160, మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 1,220 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. ఇది గురువారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారనుంది. అనంతరం మరో 24 గంటల్లో (శుక్రవారం నాటికి) తుపానుగా మారుతుందని భారత వాతావరణ విభాగం బుధవారం రాత్రి బులెటిన్‌లో వెల్లడించింది. ♦ ముంబై: నేటి నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్. ఉదమం 9.30గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ♦ లక్నో: నేటి నుంచి జూనియర్ ప్రపంచ కప్ హాకీ టోర్నమెంట్ ♦ గుంటూరు: నేడు అధికారులు, వైద్యులతో వర్క్ షాప్ స్వాస్థ్య విద్యా వాహినిపై అవగాహన కార్యక్రమం ♦ పెద్ద నోట్లు రద్దయి నేటికి నెల బ్యాంకులు, ఏటీఎంల వద్ద భారీ క్యూలైన్లు నగదులేక గ్రామీణుల అవస్థలు పడిపోయిన వ్యాపారాలు వృద్ధిరేటు తగ్గించిన ఆర్బీఐ ప్రజల్లో పెరుగుతున్న అసహనం -
టుడే అప్డేట్స్
న్యూఢిల్లీలో నేటి మధ్యాహ్నం కేంద్ర మంత్రి పియుష్ గోయల్‌తో భేటీకానున్న తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు బ్యాంకులకు సెలవుదినం. దేశవ్యాప్తంగా కొత్తనోట్ల కొరతతో జనాలకు ఇక్కట్లు కొనసాగుతున్నాయి. ప్రపంచంలో మొట్టమొదటగా ఆర్టిఫీసియల్ హార్ట్ ట్రాన్స్ ప్లాంట్ చేసిన ప్రముఖ అమెరికా వైద్యుడు డెంటన్ కూలే(96) మృతి ఉత్తరప్రదేశ్‌లో ఆదివారం వేకువజామున ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. యూపీలోని దేహత్ జిల్లా కాన్పుర్ సమీపంలోని పక్హరయన్ వద్ద పట్నా-ఇండోర్ ఎక్స్‌ప్రెస్ రైలు 14 బోగీలు పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద ఘటనపై సీఎం అఖిలేష్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. హెల్ప్ లైన్ నంబర్లు: 05101072, 051621072, 05121072 రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు గణనీయంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు. పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు నేడు(ఆదివారం) అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం తమిళనాడు రామేశ్వరానికి చెందిన 11 మంది జాలర్లను అదుపులోకి తీసుకున్న శ్రీలంక నేవీ అధికారులు. రెండు బోట్లు కూడా సీజ్ చేశారు. నేడు చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ ఫైనల్. ఫైనల్లో చైనా ప్లేయర్ సున్ యుతో తలపడనున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు -
టుడే అప్డేట్స్
నేడు ఢిల్లీలో మూడోరోజు కొనసాగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు పెద్దనోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా తలెత్తిన పరిస్థితులపై తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీతో గురువారం ఫోన్లో మాట్లాడారు. శుక్రవారం ఢిల్లీకి రావాలని కేసీఆర్‌ను ఆహ్వానించారు. చర్చలకు అందుబాటులో ఉండాలని, ఇప్పుడున్న పరిస్థితుల్లో అవలంబించాల్సిన పంథాను లిఖిత పూర్వకంగా అందించాలని సీఎంను కోరారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. కేసీఆర్ శనివారం ప్రధానితో భేటీ కానున్నట్లు సమాచారం. నేటి నుంచి పాత నోట్ల మార్పిడిపై పరిమితి తగ్గింపు. ఇకపై రోజుకు రూ.4500 నుంచి నోట్ల మార్పిడిని రూ.2000కు తగ్గించిన కేంద్ర ప్రభుత్వం నేడు లోక్‌సభలో చర్చకు రానున్న ఎంపీ వినోద్ ప్రైవేట్ మెంబర్ బిల్లు. తెలంగాణకు ఆర్థిక సాయంపై ప్రైవేట్ మెంబర్ బిల్లు నేటి నుంచి ఐదు రోజులపాటు సెలవుపై వెళ్లనున్న తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ. ఇంఛార్జ్ సీఎస్‌గా ప్రదీప్‌చంద్రకు బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం మొబైల్ కంపెనీ ప్రతినిధులు, బ్యాంకర్లతో భేటీకానున్న ఏపీ సీఎం చంద్రబాబు గాంధీ ఆస్పత్రిలో హర్సే వాహనాలు ప్రారంభించనున్న మంత్రి లక్ష్మారెడ్డి. నేటి నుంచి అన్ని జిల్లాల్లోనూ వాహనాలును ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్న తెలంగాణ మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, మహేందర్ రెడ్డి నేటి నుంచి రష్యాలో గ్రాండ్ ప్రి చెస్ టోర్నీ ప్రారంభం నేడు పునర్వసు నక్షత్రం. భద్రాచలంలో సీతారాములకు భక్తుల కోటి దీపోత్సవం. నేడు ఒంటిమిట్టలో కళ్యాణోత్సవం చిత్తూరు జిల్లా తిరుమల శ్రీవారి ఆలయానికి రోజురోజుకు తగ్గిపోతున్న భక్తుల తాకిడి -
టుడే అప్డేట్స్
నేడు రెండోరోజు కొనసాగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు. నోట్ల రద్దుపై లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం హైదరాబాద్: నేడు హైకోర్టులో విచారణకు రానున్న ఓటుకు కోట్లు కేసు. నేడు వాదనలు వినిపించనున్న ఏపీ సీఎం చంద్రబాబు తరఫు లాయర్ లుథ్రా నేటి నుంచి ఒడిషాలో కొత్త రూ.500 నోట్లు లభ్యం నేటి నుంచి అమరావతిలో ఓట్ల నమోదు ప్రక్రియ హైదరాబాద్‌లో నేడు మలక్ పేట మార్కెట్లకు ఉల్లి రాక నేటి ఉదయం ఢిల్లీ, హరియాణాలో భూ ప్రకంపనలు.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.2 పెద్ద నోట్ల రద్దు: దేశవ్యాప్తంగా కరెన్సీ మార్పిడి ప్రక్రియలో అవస్తలు, కొత్త నోట్ల లభ్యత మితంగా ఉండటంతో సమస్యలు. నేటి నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్. విశాఖ వైఎస్ఆర్ స్డేడియంలో ఉదయం 9:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం -
టుడే అప్డేట్స్
నేటి నుంచి న్యూఢిల్లీలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం ఢిల్లీలో నేడు పెద్ద నోట్ల రద్దు, జనం కష్టాలపై విపక్షాల మార్చ్. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు మార్చ్. విపక్షాలు తలపెట్టిన మార్చ్‌లో పాల్గొననున్న శివసేన నేతలు నేటి మధ్యాహ్నం ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలవనున్న విపక్షనేతలు. రాష్ట్రపతితో సమావేశంకానున్న మమతా బెనర్జీ, కేజ్రీవాల్, తదితర కీలక నేతలు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ఉద్రిక్త పరిస్థితులు. గృహ నిర్బంధంలోనే కాపు ఉద్యమనేత ముద్రగడ సహా పలువురు నేతలు నేడు దేశవ్యాప్తంగా ఔట్ పేషెంట్ విభాగం సేవల నిలిపివేత. ప్రైవేట్ వైద్యులపై కేంద్రం తీరుకు నిరసనగా నిర్ణయం నేడు గోదావరి యాజమాన్య బోర్డు సమావేశం. బోర్డు పరిధిలోకి తేవాల్సిన ప్రాజెక్టులపై చర్చ నేడు నెల్లూరు జిల్లాకు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్. దత్తత గ్రామం పుట్టంరాజుగారి కండ్రికలో పర్యటించనున్న సచిన్ మన టీవీ ద్వారా నేటి నుంచి టీఎస్ క్లాసులు ప్రసారాలు. ప్రసారాలను ప్రారంభించనున్న మంత్రులు కడియం శ్రీహరి, కేటీఆర్ నేటి నుంచి 24 వరకు ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్‌పై హెచ్ఎండీఏ స్పెషల్ డ్రైవ్ విజయవాడలో నేడు ఇంద్రకీలాద్రిపై శతచండీ సహిత రుద్రయాగం చిత్తూరు జిల్లా తిరుమల శ్రీవారి ఆలయానికి తగ్గిన భక్తుల రద్దీ -
టుడే అప్డేట్స్
నేడు థానే కోర్టులో పరువు నష్టం దావా కేసు విచారణ. హాజరుకానున్న ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్: నేడు హైకోర్టులో విచారణకు రానున్న ఓటుకు కోట్లు కేసు నేడు ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చించనున్న ఇజ్రాయెల్ అధ్యక్షుడు రువెన్ రివ్లిన్ నేడు సుప్రీంకోర్టులో పెద్దనోట్ల రద్దుపై విచారణ జరగనుంది. రూ.500, రూ.1000 నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన 4 పిటిషన్లను విచారించనున్న సుప్రీంకోర్టు. నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కానుంది. ఢిల్లీలోని ఏపీ భవన్ ఆస్తుల పంపిణీపై చర్చలు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా పర్యటన వాయిదా పడింది. ఈ నెల 17న జిల్లాలోని తొండంగి దివీస్ ప్రభావిత గ్రామాల్లో వైఎస్ జగన్ పర్యటించాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల ఆయన పర్యటన వాయిదా పడింది. ఈ 22 న ఆయా గ్రామాల్లో జగన్ పర్యటించి దివీస్ వ్యతిరేక ఉద్యమానికి మద్ధతు ఇవ్వనున్నారు. నేడు ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. పెద్ద నోట్ల రద్దుపై చర్చించనున్న ఢిల్లీ కేబినెట్ నేటి నుంచి ఏటీఎంలలో అందుబాటులోకి రానున్న మరిన్ని కొత్త 2 వేల రూపాయల నోట్లు మరో 10 రోజులు పాతనోట్లు చెల్లుబాటు. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసిన కేంద్ర ప్రభుత్వం. పాత నోట్లతో పౌరసేవల బిల్లులు, రైల్వే, విమాన టికెట్ల కొనుగోలుకు వర్తింపు. పెట్రోలు బంకులు, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ అవకాశం. హైవేలపై టోల్ రద్దు నవంబర్ 18 వరకూ కొనసాగింపు. నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. -
టుడే అప్ డేట్స్
- నేడు అమెరికా అధ్యక్ష ఎన్నికలు, బుధవారం మధ్యాహ్నానికల్లా ఫలితాలు వెలువడే అవకాశం - ఇవాళ బెంగుళూరులో బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మే పర్యటన - పార్టీ ఫిరాయింపులపై నేడు సుప్రీం కోర్టులో విచారణ - నేడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టులో ఓట్లుకోట్లు కేసు విచారణ - ఇవాళ నయీం కేసు దర్యాప్తు నివేదికను హైకోర్టుకు సమర్పించనున్న సిట్, ఇప్పటివరకూ 166 కేసులు నమోదు - ఇవాళ ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ వెలువడే అవకాశం, అభ్యర్ధుల వయోపరిమితి 42ఏళ్లకు పెంపు - ఇవాళ జీపీఎస్ లోటర్ యాప్ ను ఆవిష్కరించనున్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు, యాప్ ద్వారా గ్రూప్-2 అభ్యర్ధులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం - పీజీ విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసు: ప్రొ.లక్ష్మీ బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ - ఢిల్లీలో వాయుకాలుష్యంపై నేడు వాదనలు విననున్న సుప్రీంకోర్టు -
టుడే అప్ డేట్స్
♦ న్యూఢిల్లీ: ఇవాళ సీడబ్ల్యూసీ సమావేశం, రాహుల్ గాంధీ పట్టాభిషేకం వాయిదా! ♦ నేడు విజయవాడకు నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియా రాత్రికి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు రానున్న పనగరియా రేపు సీఎం చంద్రబాబుతో సమావేశం అనంతరం ఢిల్లీకి తిరుగుపయనం ♦ నేడు రెండో కార్తీక సోమవారం ఏపీలో కిక్కిరిసిన పంచారామ క్షేత్రాలు పాలకొల్లు, శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు ♦ హైదరాబాద్: ఇవాళ గవర్నర్ నరసింహన్‌తో టీపీసీసీ నేతల సమావేశం ♦ ఇవాళ టీఆర్ఎస్ రాష్ట్ర, జిల్లా కమిటీల జాబితా విడుదల ♦ ఇవాళ మంచిర్యాలలో ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో విద్యార్థి గర్జన ♦ నేటి నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీలో స్కూళ్లకు సెలవు ఢిల్లీ కాలుష్యం తీవ్రస్థాయిలో పెరగడంపై కేజ్రీవాల్ సర్కార్ నిర్ణయం ♦ అభయ గోల్డ్ కేసులో నేడు తొలి ఛార్జిషీటు కేసులో మొత్తం 11 ఛార్జిషీట్లు దాఖలు చేయనున్న సీఐడీ ♦ హైదరాబాద్: నేడు దేవాదుల ఎత్తిపోతల పథకం పై మంత్రి హరీష్ రావు సమీక్ష ప్రాజెక్టు పనుల పురోగతి, భూ సేకరణ పై చర్చ ♦ న్యూఢిల్లీ: పొగాకు నియంత్రణపై ఇవాళ అంతర్జాతీయ సదస్సు ♦ నెల్లూరు: ఈ నెల 16న జిల్లాలో క్రికెటర్ సచిన్ పర్యటన దత్తత గ్రామమైన పీఆర్ కండ్రిగను సందర్శించనున్న సచిన్ -
ఒకే వేదికపై భిన్న ధ్రువాలు
సమాజ్‌వాదీ పార్టీ రజతోత్సవాలు ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ లక్నోలో రజతోత్సవాలు చేసుకుంటోంది. ఇందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. ప్రస్తుతం పార్టీలో లుకలుకలు ఉన్నా, భిన్నధ్రువాలుగా భావిస్తున్న అఖిలేష్ యాదవ్, శివపాల్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ లాంటి నాయకులంతా ఒకే వేదికపై ఈ సభలో పాల్గొంటున్నారు. ♦ విశాఖ: రేపు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో 'జై ఆంధ్రప్రదేశ్ సభ' ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో భారీ ఏర్పాట్లు ♦ ఢాకా: ఇవాళ్టి నుంచి భారత్, బంగ్లా సైనిక విన్యాసాలు ♦హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు ఉద్యోగుల హౌసింగ్ కార్యవర్గ ఎన్నికలు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు 9 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పోస్టుల కోసం ఎన్నిక ♦ నేడు కర్నూలులో సీఎం చంద్రబాబు పర్యటన జనచైతన్య యాత్రలో పాల్గొననున్న చంద్రబాబు ♦ ఇవాళ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల ప్రకటన ♦ నేడు దోహాలో ఆసియా ఫుట్‌బాల్ కప్ ఫైనల్ -
టుడే అప్ డేట్స్
♦ పొంచివున్న ముప్పు: పశ్చిమ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం 24 గంటల్లో బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ♦ ఇవాళ గవర్నర్ నరసింహన్ పుట్టిన రోజు గవర్నర్‌ను కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపనున్న ఇరు రాష్ట్రాల సీఎంలు సచివాలయ బ్లాక్‌ల అప్పగింత పై చర్చ ♦ ఇవాళ హైదరాబాద్ రానున్న కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్ జాతీయ ఐక్యతాదినోత్సవంలో పాల్గొననున్న రవిశంకరప్రసాద్ ♦ తమిళనాడులో ఇవాళ ఉప ఎన్నికల అభ్యర్థుల జాబితా ♦తూ.గో: నేడు కాకినాడలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పర్యటన జేఎన్టీయూలో జరిగే సదస్సుకు హాజరుకానున్న వెంకయ్యనాయుడు -
టుడే అప్ డేట్స్
♦ నెల్లూరు: సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ప్రమాదం సౌండింగ్ రాకెట్ సెంటర్లో పేలుడు, ఇద్దరికి గాయాలు ♦28 జిల్లాలకు పూర్తైన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుల కసరత్తు ఇవాళ పూర్తి స్థాయి టీఆర్ఎస్ అధ్యక్షుల ప్రకటన ♦ లక్నో: నేడు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న సమాజ్ వాదీ పార్టీ నేటి నుంచి సీఎం అఖిలేష్ వికాస్ యాత్ర ♦ ఇవాళ రెండో రోజు నేపాల్‌లో రాష్ట్రపతి ప్రణబ్ పర్యటన ♦ హైదరాబాద్: సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై ఇవాళ కూడా సమావేశం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ♦ ఢిల్లీ: ఇవాళ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ♦కాకినాడ: నేడు పంపాలిపేటలో సీపీఎం బహిరంగ సభ దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా సీపీఎం సభ సభకు ఎలాంటి అనుమతిలేదంటున్న పోలీసులు సభను నిర్వహించి తీరుతామన్న సీపీఎం నేతలు ♦ నేడు ఐదు రాష్ట్రాల్లో బంద్‌కు మావోయిస్టుల పిలుపు ఏవోబీ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా బంద్‌కు పిలుపు -
టుడే అప్డేట్స్
♦ ఢిల్లీ: అమరావతి ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ ఎన్జీటీలో దాఖలైన పలు పిటిషన్లను జస్టిస్ స్వతంత్రకుమార్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారించింది. ఎన్జీటీలో వాదనలు నేడూ కొనసాగనున్నాయి. ♦ చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి బుధవారం చంద్రగిరికి రానున్నారు. వైఎస్ఎంఆర్ కల్యాణ మండపంలో జరిగే బంధువుల వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులు శుభకర్‌రెడ్డి, నళినీరెడ్డిలను ఆశీర్వదించనున్నారు. ♦ హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ఇవాళ మంత్రి హరీష్ రావు సమీక్ష భూ సేకరణ, పనుల పురోగతిపై సమీక్షించనున్న హరీష్ రావు ♦ మల్కన్ గిరి ఎన్‌కౌంటర్‌పై నేడు ఢిల్లీలో ప్రజాసంఘాల నిరసన జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్న ప్రజాసంఘాలు ♦ హైదరాబాద్: నేటి నుంచి రెండ్రోజులపాటు ఇక్రిశాట్లో అంతర్జాతీయ సదస్సు వాతావరణ మార్పులు, నీరు, వ్యవసాయం, ఆహార భద్రత పై సదస్సు పాల్గొననున్న ప్రపంచ ప్రఖ్యాత పరిశోధన సంస్థల ప్రతినిధులు ♦ హైదరాబాద్: టీఆర్ఎస్ జిల్లా కమిటీలపై నేడు తుది కసరత్తు ♦ఇవాళ్టి నుంచి మూడ్రోజులపాటు నేపాల్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పర్యటన ♦ గంభీర్ ఉంటాడా?... ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ కు భారత్ క్రికెట్ జట్టు ఎంపిక నేడు -
టుడే అప్ డేట్స్
నేడు సీపీఐ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం. తెలంగాణ సచివాలయం కూల్చివేత అంశంపై సమావేశంలో చర్చ ఏవోబీ ఎన్ కౌంటర్ లో మరణించిన ఇద్దరు మావోయిస్టులకు నేడు అంత్యక్రియలు నిర్వహణకు పోలీసులు ఏర్పాట్లు ఛత్తీస్ గఢ్ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో పాల్గొననున్న ప్రధాని మోదీ. దీన దయాల్ ఉపాధ్యాయ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మోదీ జమ్ముకశ్మీర్ లో పాఠశాలలపై జరుగుతున్న ఉగ్రవాదుల దాడులను అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలు ఢిల్లీలో నేడు 'అమరావతి' నిర్మాణానికి సంబంధించిన పర్యావరణ అనుమతులపై జాతీయ హరిత ట్రిబ్యునల్ లో విచారణ నేడు విజయవాడలో కాంగ్రెస్ కాపు నేతల ఆత్మీయ సమావేశం. హాజరుకానున్న దిగ్విజయ్ సింగ్ నేటి నుంచి డ్వాక్రా సంఘాల ఖాతాల్లోకి డబ్బులు జమ. డ్వాక్రా మహిళలకు రూ.3వేల చొప్పున జమ చేయనున్న ఏపీ సర్కార్ నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. జన చైతన్యయాత్రలో పాల్గొననున్న సీఎం నేటి నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం. ఉండవల్లిలోని తన నివాసంలో స్థానిక కమిటీ వద్ద సభ్యత్వ నమోదులో పాల్గొననున్న చంద్రబాబు నేటి నుంచి తిరుపతి ఎస్వీయూలోని తెలుగు విభాగంలో జాతీయస్థాయి సదస్సు. రామానుజాచార్యుడి విశిష్టఅధ్వైతం-తెలుగు సాహిత్యం అంశంపై సదస్సు నేడు తిరుమలలో టీటీడీ పాలకమండలి సమావేశం -
టుడే అప్ డేట్స్
ఐక్యరాజ్యసమితిలో అధికారికంగా నిర్వహించనున్న దీపావళి వేడుకలు నేడు దేశవ్యాప్తంగా దీపావళి పండగ సంబరాలు నేడు రాజ్ భవన్ లో గవర్నర్ దంపతుల దర్బార్ దీపావళి సందర్భంగా ప్రజలను కలుసుకోనున్న గవర్నర్ దంపతులు పోలీసుశాఖకు తెలంగాణ ప్రభుత్వం దీపావళి కానుక. రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించిన ప్రభుత్వం నేటి నుంచి దేశంలో ఈశాన్య రుతుపవనాల ప్రవేశం నేటి ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ 'మన్ కీ బాత్' ప్రసంగం జమ్ముకశ్మీర్‌లో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు కొనసాగిన పాక్ దాడులు నేడు శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం. తిరుమల శ్రీవారి ఆలయానికి నేడు పెరిగిన భక్తుల రద్దీ నేడు ఆసియా చాంపియన్స్ హాకీ ఫైనల్ ఫైనల్లో పాకిస్తాన్ తో తలపడనున్న భారత్. సాయంత్రం 6 గంటలకు మ్యాచ్ ప్రారంభం -
టుడే అప్ డేట్స్
- ఇవాళ విశాఖపట్నంలో భారత్-కివీస్ జట్ల మధ్య ఆఖరి వన్డే, మధ్యాహ్నం 1.30గంటలకు మ్యాచ్ ప్రారంభం - కృష్ణా జలాలపై నేడు తెలంగాణ కేబినెట్ సబ్‌కమిటీ భేటీ, సమావేశానికి హాజరుకానున్న సుప్రీం న్యాయవాది వైద్యనాథన్ - నేడు ఆసియా చాంపియన్స్ ట్రోఫి హాకీ సెమీస్, కొరియాతో తలపడనున్న భారత్, మధ్యాహ్నం 3.30మ్యాచ్ -
టుడే అప్ డేట్స్
- ఇవాళ అమరావతి రానున్న కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, రాజధాని భవనాలకు శంకుస్ధాపన. - నేడు నేషనల్ పోలీస్ అకాడమీలో ఐసీఎస్ ల పాసింగ్ పరేడ్, ముఖ్యఅతిథిగా హాజరుకానున్న కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరున్ జైట్లీ - తెలంగాణ సచివాలయ కూల్చివేతపై ఇవాళ హైకోర్టులో విచారణ - నేడు జాతీయ ఆయుర్వేద దినోత్సవం - నేడు ఏపీ ఆర్టీసీ ఈయూ సామూహిక నిరాహారదీక్షలు, అన్ని ఆర్టీసీ రీజనల్ కార్యాలయాల ముందు దీక్షలు చేయాలని నిర్ణయం - నేటి నుంచి తిరుమలలో అందుబాటులోకి రానున్న నడకదారి భక్తుల దివ్యదర్శనం కాంప్లెక్స్ - నేడు చిత్తూరు జిల్లా సర్వసభ్య సమావేశం -
టుడే అప్ డేట్స్
- నేడు తెలంగాణ మంత్రి వర్గ ఉపసంఘం భేటి, దేవాలయ అర్చకుల వేతనాలపై చర్చ - నేడు తెలంగాణ బీసీ కమిషన్ బాధ్యతల స్వీకరణ - నేడు చిత్తూరులో ముగియనున్న ఎర్రచందనం సదస్సు, హజరు కానున్న నెల్లూరు, కడపల ఎస్పీలు, ఇతర అధికారులు - పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న కియాంక్ తుపాను, విశాఖపట్టణానికి ఆగ్నేయంగా 380కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం - తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ, రెండు కంపార్ట్ మెంట్లలో వేచి వున్న భక్తులు -
టుడే అప్డేట్స్
► నేడు కర్నూలులో వైఎస్ జగన్ యువభేరి, వీజేఆర్ ఫంక్షన్ హాల్లో ఉదయం 10 గంటలకు యువభేరి, ప్రత్యేక హోదా ప్రయోజనాలను వివరించనున్న వైఎస్ జగన్ ► హైదరాబాద్: నేడు, రేపు ఏపీ ప్రివిలేజెస్ కమిటీ సమావేశం ► నేడు ఢిల్లీ వెళ్లనున్న మంత్రి హరీశ్‌రావు, పీఎంకేఎస్‌వై సమావేశంలో పాల్గొననున్న హరీశ్‌రావు ► అనంతపురం: బొమ్మనహల్ సీతానగరం క్యాంప్ నుంచి ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి పాదయాత్ర, బ్రహ్మ సముద్రం వరకు 10 కి.మీ మేర కొనసాగనున్న రఘువీరా పాదయాత్ర -
టుడే అప్డేట్స్
♦ హైదరాబాద్: నేడు పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల తుది పరీక్ష, ఉదయం 10 గం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష ♦ హైదరాబాద్: నేడు ఉదయం 10 గంటలకు ఇందిరా పార్క్ వద్ద రైతు దీక్ష, తెలంగాణ ఏర్పాడ్డాక తొలిసారి దీక్షకు దిగుతున్న టీజేఏసీ ఛైర్మన్ కోదండరామ్ ♦ హైదరాబాద్: నేటి నుంచి అన్నోజీగూడలో ఆర్ఎస్ఎస్ అఖిల భారత కార్యవర్గ సమావేశం, హాజరుకానున్న మోహన్ భగవత్, బయ్యజీ జోషి, అమిత్‌షా, తొగాడియా ♦ నేడు తిరుపతిలో సెవెన్స్ హిల్స్ హాఫ్ మారథాన్ ♦ నేడు భారత్, న్యూజిలాండ్ మధ్య మూడో వన్డే, మొహాలీలో మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ♦ ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీ: నేడు పాక్‌తో భారత్ ఢీ, క్వాంటన్ (మలేసియా)లో సాయంత్రం 4 గంటలకు మ్యాచ్ ♦ నేడు తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన -
టుడే అప్డేట్స్
►అహ్మదాబాద్: నేడు కబడ్డీ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్, ఇరాన్‌తో తలపడనున్న భారత్ ► నేడు తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ భేటీ, బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ ► నేడు తమ్మిడిహెట్టి-సుందిళ్ల బ్యారేజీ మార్గంలో వ్యాప్కోస్ లైడార్ సర్వే ► నేడు వడోదరలో ప్రధాని మోదీ పర్యటన, హరణి విమానశ్రయ టెర్మినల్‌ను ప్రారంభించనున్న మోదీ ► నేడు కాకినాడలో సీఎం చంద్రబాబు పర్యటన, స్వచ్ఛ ఏపీ, వనం-మనం కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు ► నేడు శ్రీకాకుళం జిల్లాలో ఏపీసీసీ చీఫ్ రఘువీరా పర్యటన, కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజాబ్యాలెట్లో పాల్గొననున్న రఘువీరా ► హైదరాబాద్: నేడు ఉల్లిధరపై అధికారులతో మంత్రి హరీశ్‌రావు సమీక్ష ► నేడు చెన్నై అపోలో ఆస్పత్రికి రానున్న లండన్ వైద్య బృందం -
టుడే అప్ డేట్స్
ఢిల్లీ: సెబీ వద్ద రూ.200కోట్లు డిపాజిట్ చేయనున్న సహారా గ్రూపు హైదరాబాద్: నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం కృష్ణా నీటి పంపకంపై బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పుపై తెలంగాణ కేబినెట్ చర్చ కొత్త సెక్రటేరియట్ నిర్మాణంపై భేటిలో చర్చించనున్న తెలంగాణ కేబినెట్ నేడు అమరావతిలో ఎస్ బీఐ, ఆంధ్రాబ్యాంకు శాఖల ప్రారంభం నేడు అమరావతిలో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం నేడు హైదరాబాద్ లో తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ సమావేశం నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం. గోషామహల్ లో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమం హైమా తుపాన్ కారణంగా 200కు పైగా విమాన సర్వీసులు ఆపివేసిన హాంకాంగ్ ప్రపంచకప్ కబడ్డీ సెమీస్ మ్యాచ్‌లు కొరియా వర్సెస్ ఇరాన్ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం భారత్ వర్సెస్ థాయ్ లాండ్ మ్యాచ్ రాత్రి 9 గంటలకు ప్రారంభం -
టుడే అప్డేట్స్
♦ సీఎం కేసీఆర్ కొత్త క్యాంప్ కార్యాలయంలో నేడు అమ్మవారి ఆలయం పున ప్రతిష్టాపన, ఉదయం 11 గంటలకు బేగంపేట కార్యాలయంలో కార్యక్రమం ♦ నేడు మహబుబాబాద్‌లో టీపీసీసీ రైతు గర్జన, హాజరుకానున్న దిగ్విజయ్, కుంతియ, ఉత్తమ్, జానారెడ్డి తదితరులు ♦ నేడు భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే, ఢిల్లీలో మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ♦ నేటి నుంచి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫి హాకీ టోర్నీ, జపాన్‌తో తలపడనున్న భారత్, సా. 6 గంటలకు మ్యాచ్ ♦ నేడు గుంటూరు కలెక్టరేట్ ముందు రైతు సంఘాల ధర్నా, కల్తీ విత్తన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ♦ నేడు రీజినల్ కనెక్టివిటీ స్కీమ్ విధివిధానాలు ఖరారు, రేపు వివరాలు వెల్లడించనున్న కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు ♦ నేడు విశాఖ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ♦ నేటి నుంచి విశాఖ ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ క్లాసులు, ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు ♦ డెన్మార్క్ ఓపెన్ సిరీస్: నేడు సయాకా సాటో (జపాన్)తో తలపడనున్న సింధు -
టుడే అప్డేట్స్
► నేడు పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రులో వైఎస్ జగన్ పర్యటన, మెగా ఆక్వాఫుడ్ పార్క్ బాధిత గ్రామాల్లో పర్యటించనున్న వైఎస్ జగన్ ►నేడు ఉదయం 11 గంటలకు చార్మినర్ వద్ద రాజీవ్ సద్భావన స్మారక సభ, పాల్గొననున్న దిగ్విజయ్ సింగ్, టి.కాంగ్రెస్ ముఖ్య నేతలు ► నేడు పన్నురేట్లపై తుది నిర్ణయం తీసుకోనున్న జీఎస్టీ కౌన్సిల్ ► ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో కరువు మండలాలను ప్రకటించనున్న ప్రభుత్వం ► ఇవాళ హైదరాబాద్‌కు రానున్న బీజేపీ జాతీయ నేత శివప్రకాశ్ పర్యటన, బీజేపీ పరిస్థితిపై మూడ్రోజులపాటు ఉద్యమం ► నేడు ఏపీసెట్ ఫలితాలు విడుదల ► నేడు ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్లతో మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక సమావేశం, రబీకి సాగునీటి రోడ్‌మ్యాప్, మిషన్ కాకతీయ-3 కార్యాచరణపై చర్చ ► నేటి నుంచి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ఏరియల్ సర్వే, పదిరోజులపాటు ఇంజినీర్ల సర్వే ► నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎస్ రాజీవ్‌శర్మ, కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో రాజీవ్‌శర్మ భేటీ -
టుడే అప్డేట్స్
♦ నేడు ఏపీ కేబినెట్ సమావేశం, కేబినెట్ ముందుకు రానున్న ఏపీఐడీఈ సవరణలు ♦ విజయనగరం: నేడు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ♦ నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్, యాదాద్రి ఆలయ పనులు పరిశీలించనున్న కేసీఆర్ ♦ నేటి నుంచి పోలవరం చుట్టూ పోలీస్ పికెటింగ్, ప్రైవేట్ వ్యక్తుల రాకపోకలపై నిఘా ♦ నేడు చెన్నై రానున్న ప్రధాని నరేంద్ర మోదీ, అపోలో ఆస్పత్రిలో జయలలితను పరామర్శించనున్న మోదీ ♦ నేటి నుంచి డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్, ఒలింపిక్స్ తర్వాత పీవీ సింధుకు తొలి టోర్నీ ♦ ఢిల్లీ: నేటి నుంచి మూడ్రోజులపాటు జీఎస్టీ సమావేశాలు ♦ ఢిల్లీ: నేడు కావేరీ జలాలపై సుప్రీంకోర్టు తీర్పు, సుప్రీం తీర్పుపై తమిళనాడు, కర్ణాటకల్లో ఉత్కంఠ ♦ కబడ్డీ వరల్డ్ కప్‌లో నేటి మ్యాచ్‌లు.. అమెరికా వర్సెస్ కెన్యా, రాత్రి 8 గంటలకు మ్యాచ్. భారత్ వర్సెస్ ఇంగ్లండ్ రాత్రి 8 గంటలకు మ్యాచ్ -
టుడే అప్డేట్స్
♦ నేటి నుంచి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) దరఖాస్తులు ♦ ఈ రోజు నుంచి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో సీపీఎం మహాజన పాదయాత్ర, ఇబ్రహీంపట్నం నుంచి పాదయాత్ర ప్రారంభం ♦ నేటి నుంచి తెలంగాణలో ధాన్యం కొనుగోలు, 2 వేల కేంద్రాలు ఏర్పాటు ♦ పశ్చిమగోదావరి: నేడు పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటన ♦ నేడు చైనాలో మానవసహిత అంతరిక్ష యాత్ర, ఇద్దరు వ్యోమగాములు పయనం ♦ నేడు మరోసారి మంత్రి కడియం శ్రీహరితో ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు భేటీ -
టుడే అప్డేట్స్
♦ న్యూఢిల్లీ: బీసీసీఐకి సుప్రీం కోర్టు అల్టిమేటం లోధా కమిటీ సూచనలు అంగీకరిస్తూ ఇవాళ అఫిడవిట్ సమర్పించాలని ఆదేశం ♦ ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలపనున్న కేబినెట్ ♦ నేడు ఆలస్యంగా సికింద్రాబాద్-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ సాంకేతిక కారణాలతో ఉ.7:20కి బదులుగా ఉ.10:20కి బయల్దేరనున్న రైలు ♦ అహ్మదాబాద్: నేటి నుంచి కబడ్డీ ప్రపంచ టోర్నీ టోర్నీలో పాల్గొననున్న 12 దేశాల జట్లు రాత్రి 8గంటలకు భారత్‌తో తలపడనున్న దక్షణకొరియా ♦ ఢిల్లీ : ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు ఇండియా ఎకనమిక్ సమ్మిట్ సదస్సుకు హాజరుకానున్న సీఎం చంద్రబాబు ♦ ఇవాళ మహబూబ్‌నగర్‌లో తెలంగాణ బీజేపీ కార్యవర్గ సమావేశాలు ♦ ఇవాళ సుప్రీం కర్టులో సీఎం జయలలిత ఆస్తుల కేసు విచారణ ♦ ఇవాళ్టి నుంచి రైలు ప్రయాణికులకు ఒక్క పైసాకే రూ.10 లక్షల బీమా ఈ నెల 31 వరకు తీసుకున్న అన్ని టిక్కెట్లపైనా బీమా వర్తింపు ♦ హైతీలో సుడిగాలి తుపాను బీభత్సం, వందలాది మంది మృతి కరీబియన్ దేశాలు అతలాకుతలం