- నేటి నుంచి న్యూఢిల్లీలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం
- ఢిల్లీలో నేడు పెద్ద నోట్ల రద్దు, జనం కష్టాలపై విపక్షాల మార్చ్. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు మార్చ్. విపక్షాలు తలపెట్టిన మార్చ్‌లో పాల్గొననున్న శివసేన నేతలు
- నేటి మధ్యాహ్నం ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలవనున్న విపక్షనేతలు. రాష్ట్రపతితో సమావేశంకానున్న మమతా బెనర్జీ, కేజ్రీవాల్, తదితర కీలక నేతలు.
- తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ఉద్రిక్త పరిస్థితులు. గృహ నిర్బంధంలోనే కాపు ఉద్యమనేత ముద్రగడ సహా పలువురు నేతలు
- నేడు దేశవ్యాప్తంగా ఔట్ పేషెంట్ విభాగం సేవల నిలిపివేత. ప్రైవేట్ వైద్యులపై కేంద్రం తీరుకు నిరసనగా నిర్ణయం
- నేడు గోదావరి యాజమాన్య బోర్డు సమావేశం. బోర్డు పరిధిలోకి తేవాల్సిన ప్రాజెక్టులపై చర్చ
- నేడు నెల్లూరు జిల్లాకు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్. దత్తత గ్రామం పుట్టంరాజుగారి కండ్రికలో పర్యటించనున్న సచిన్
- మన టీవీ ద్వారా నేటి నుంచి టీఎస్ క్లాసులు ప్రసారాలు. ప్రసారాలను ప్రారంభించనున్న మంత్రులు కడియం శ్రీహరి, కేటీఆర్
- నేటి నుంచి 24 వరకు ఎల్‌ఆర్ఎస్ క్లియరెన్స్‌పై హెచ్ఎండీఏ స్పెషల్ డ్రైవ్
- విజయవాడలో నేడు ఇంద్రకీలాద్రిపై శతచండీ సహిత రుద్రయాగం
- చిత్తూరు జిల్లా తిరుమల శ్రీవారి ఆలయానికి తగ్గిన భక్తుల రద్దీ
టుడే అప్‌డేట్స్
Published Wed, Nov 16 2016 6:57 AM | Last Updated on Mon, Sep 4 2017 8:15 PM
Advertisement
Advertisement