సాక్షి, హైదరాబాద్ : నేటి నుంచి విశాఖపట్నం-విజయవాడ మధ్య విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల ఒత్తిడితో విశాఖపట్నం-విజయవాడ మధ్య విమాన సర్వీసుల పునరుద్దరణకు ఎయిర్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా రాష్ట్రంలోని వివిధ విమానశ్రయాల నుంచి సర్వీస్‌లను పునరుద్దరించాలని పౌరవిమానయన శాఖకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇక నేటి అప్‌డేట్స్ ఇవి..
► రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ నేటి నుంచి ఆరంభం కానుంది. కొత్త విధానంలో ప్రభుత్వం దశల వారీగా మద్యనిషేధానికి అధిక ప్రాధాన్యం ఇవ్వనుంది. ఇందులో భాగంగా మంగళవారం అక్టోబర్ 1 నుంచి పలు కీలక మార్పులను సర్కారు తీసుకొస్తోంది. ప్రధానంగా మద్యం అమ్మకాలు ఇకపై రాత్రి 8 గంటల వరకే పరిమితం చేస్తున్నారు.
► ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. మూడో రోజు ఉత్సవాల్లో భాగంగా నేడు గాయత్రి దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. అదేవిధంగా నేడు గవర్నర్ హరిచందన్ బిశ్శభూషణ్ కుటుంబసమేతంగా కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోనున్నారు.
► శ్రీశైలం దసరా మహోత్సవాలకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా నేడు చంద్రఘంట అలంకారంలో భ్రమరాంబాదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
► తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆదివారం అంకురార్పణ నిర్వహించారు. సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తరుపున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ఉదయం చిన్నశేష వాహనంపై స్వామివారి ఊరేగింపు నిర్వహిస్తారు. రాత్రి 8 గంటలకు శ్రీవేంకటేశ్వర స్వామి హంస వాహనంపై మలయప్ప స్వామి అవతారంలో మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనం కల్పిస్తారు.
తెలంగాణ అప్‌డేట్స్..
నేడు ప్రగతిభవన్‌లో సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినేట్ భేటి జరగనుంది.
హైదరాబాద్‌లో నేడు..
► వేదిక: శిల్పారామం, ఉప్పల్
- ఫోక్ డ్యాన్స్ బై రాధిక శ్రీనివాస్ శక్తి సమయం: సాయంత్రం 5 గంటలకు
- కూచిపూడి రెక్టికల్ వనిరామం స్టూడెంట్స్ సమయం: సాయంత్రం 6 గంటలకు
- భరతనాట్యం రెక్టికల్ సమయం: సాయంత్రం 5 గంటలకు
- కథక్ రెక్టికల్ సమయం: సాయంత్రం 5–30 గంటలకు
- ఒగ్గు డోలు ఫోక్ సమయం: సాయంత్రం 6 గంటలకు
► వేదిక: లాల్ బహదూర్‌స్టేడియం
- వ్రెస్లింగ్ కాంపిటీషన్, సమయం: ఉదయం 8 గంటలకు
- ఆల్ ఇండియా ఒపెన్ ఫైడ్ రేటింగ్ చెస్ టోర్నమెంట్, సమయం: సాయంత్రం 6 గంటలకు
► చిల్డర్న్ ఆఫ్ మెన్ – ఇంగ్లిష్ ఫిల్మ్ ఫ్రీ స్క్రీనింగ్
- వేదిక: నృత్య – ఫోరమ్ ఫర్ ఫర్ఫామింగ్ ఆర్ట్స్, బంజారాహిల్స్ , సమయం: సాయంత్రం 6–30 గంటలకు
► ఆకృతి ఎలైట్ ఎగ్జిబిషన్ ఆండ్ సేల్
వేదిక: తాజ్ డక్కన్, బంజారాహిల్స్, సమయం: సాయంత్రం 4 గంటలకు
► ఫ్లేవర్స్ ఆఫ్ టర్కీ
వేదిక: హైదరాబాద్ షెరటాన్ హోటల్, గచ్చిబౌలి, సమయం: రాత్రి 7 గంటలు
► అక్టోబర్ ఫెస్ట్: ట్రెడిషనల్ ఫుడ్
వేదిక: ది వెస్ట్రన్ హైదరాబాద్ మైండ్ స్పేస్, హోటల్ మాదాపూర్ ,సమయం: సాయంత్రం 5 గంటలు
► మహాత్మ 150 డ్రాయింగ్స్ బై శంకర్ పామర్తి
వేదిక: కళాకృతి, బంజారాహిల్స్ , సమయం: ఉదయం 10–30 గంటలకు
► సౌత్ కాస్ట్ స్పైస్‌ట్రైల్
వేదిక: ఫార్చూన్ పార్క్ వల్లభ హోటల్ , రోడ్‌నం.12, బంజారాహిల్స్ , సమయం: సాయంత్రం 5 గంటలు
► డిస్కో దాండియా
వేదిక– ది పార్క్ హైదరాబాద్, సోమాజీగూడ ,సమయం: సాయంత్రం 6 గంటలకు
► నవరాత్రి ఉత్సవ్ 2019
వేదిక: బేగంపేట్ హాకీ స్టేడియం, రసూల్‌పుర, సమయం: సాయంత్రం 6–30 గంటలకు
► నాందారీ గౌరవ్ నవరాత్రి ఉత్సవ్ 2019
వేదిక: ఎస్ ఎస్ కన్వెంషన్ సెంటర్, శంషాబాద్, సమయం: రాత్రి 9 గంటలకు
► సిల్క్ ఆండ్ కాటన్ ఎగ్జిబిషన్
వేదిక: టీటీడీ బాలాజీ భవన్, హిమాయత్‌నగర్, సమయం: ఉదయం 10–30 గంటలకు
► ఏ జోన్ ఇంటర్నేషనల్ బాస్కెట్‌బాల్ కోచింగ్ క్యాంప్
వేదిక: ఇండోర్ స్టేడియం , గచ్చిబౌలి, సమయం: ఉదయం 7 గంటలు
► రామాయణ్ మేళా
వేదిక: ఎగ్జిబిషన్ గ్రౌండ్, నాంపల్లి, సమయం: రాత్రి 7 గంటలకు
► నవరాత్రి ఉత్సవ్ 2019
వేదిక: కంట్రీ క్లబ్, బేగంపేట్ ,సమయం: రాత్రి 7 గంటలకు
► ఆల్ ఇండియా శారీమేళ, దసరా ఫెస్టివల్
వేదిక: శిల్పారామం , సమయం: ఉదయం 11–30 గంటలకు
► డైమండ్ జ్యువెలరీ – ఎగ్జిబిషన్
వేదిక: ఒఆర్‌ఆర్‌ఎ డైమండ్ జ్యువెలరీ , పంజాగుట్ట, సమయం: ఉదయం 10 గంటలకు
► పాన్ ఏషియన్ ఫుడ్ ఫెస్టివల్
వేదిక: చైనా బిస్ట్రో, జూబ్లీహిల్స్ , సమయం: మధ్యాహ్నం12.30 గంటలకు
► ఇండియన్ ఫొటోగ్రఫీ ఫెస్టివల్
వేదిక:తెలంగాణస్టేట్‌గ్యాలరీఆఫ్‌ఫైన్ ఆర్ట్స్, సమయం: ఉదయం 9 గం.
► వేదిక: అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్
- యోగా క్లాసెస్ సమయం: సాయంత్రం 6 గంటలకు
- భరత నాట్యం క్లాసెస్, సమయం: సాయంత్రం 5–30 గంటలకు
- మోహినీయట్టం క్లాసెస్, సమయం: సాయంత్రం 4.30 గంటలకు.
Comments
Please login to add a commentAdd a comment