తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా.. వణికిపోతున్న జనం | Cold Wave And Low Temperatures Occur In AP And Telangana, Low Temperatures Are Being Recorded | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా.. వణికిపోతున్న జనం

Published Mon, Dec 16 2024 8:43 AM | Last Updated on Mon, Dec 16 2024 10:00 AM

Cold Wave And Low Temperatures Occur In AP And Telangana

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఒక పక్క అల్ప పీడనం కారణంగా పలు చోట్ల వర్షాలు కురుస్తుంటే.. మరోవైపు, చలి తీవ్రత పెరగడంతో కనిష్ట​ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అరకులోయలో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా.. ఇటు ఆదిలాబాద్‌ జిల్లాలో 6 డిగ్రీలుగా నమోదైంది. శీతల గాలులు, చలి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. సోమవారం ఉదయం ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. ఏపీలోని అల్లూరి జిల్లా అరకు లోయలో దట్టంగా పొగ మంచు కురుస్తోంది. కనిష్టంగా 5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక, మినుములూరులో 9 డిగ్రీలు, పాడేరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. దీంతో, ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మరోవైపు.. తెలంగాణలో కూడా చలి పులి వణికిస్తోంది. ఆదిలాబాద్‌ జిల్లాలో 6.2 డిగ్రీలు, నిర్మల్‌ జిల్లాలో 6.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. ఇక, హైదరాబాద్‌లో కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉప్పల్‌లో కనిష్టంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. శేరిలింగంపల్లి, రామచంద్రాపురంలో సైతం చలి తీవ్రత పెరిగింది. చలి కారణంగా పొగమంచు దట్టంగా అలుముకుంది. ఈ నేపథ్యంలో వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగేందుకు అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement