Cold waves
-
చలితో వణికిపోతున్న ఉత్తర భారతం
-
తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా.. వణికిపోతున్న జనం
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఒక పక్క అల్ప పీడనం కారణంగా పలు చోట్ల వర్షాలు కురుస్తుంటే.. మరోవైపు, చలి తీవ్రత పెరగడంతో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అరకులోయలో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా.. ఇటు ఆదిలాబాద్ జిల్లాలో 6 డిగ్రీలుగా నమోదైంది. శీతల గాలులు, చలి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. సోమవారం ఉదయం ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. ఏపీలోని అల్లూరి జిల్లా అరకు లోయలో దట్టంగా పొగ మంచు కురుస్తోంది. కనిష్టంగా 5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక, మినుములూరులో 9 డిగ్రీలు, పాడేరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. దీంతో, ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.Rural TG serious coldwave right now. Adilabad, Rangareddy, Nirmal Sangareddy, Medak, Siddipet Asifabad, Vikarabad, Kamareddy under serious coldwave 🥶 pic.twitter.com/ppJdwBYyXz— Telangana Weatherman (@balaji25_t) December 16, 2024మరోవైపు.. తెలంగాణలో కూడా చలి పులి వణికిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో 6.2 డిగ్రీలు, నిర్మల్ జిల్లాలో 6.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. ఇక, హైదరాబాద్‌లో కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉప్పల్‌లో కనిష్టంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. శేరిలింగంపల్లి, రామచంద్రాపురంలో సైతం చలి తీవ్రత పెరిగింది. చలి కారణంగా పొగమంచు దట్టంగా అలుముకుంది. ఈ నేపథ్యంలో వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగేందుకు అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. RECORD BREAKING COLDWAVESerious coldwave in Hyderabad now. Looks at the temperatures, MoulaAli & University of Hyderabad recorded staggering 7.2°C & BHEL recorded 7.4°C, this is just massive cold right now. Early morning office goers, have some warm clothing before you step out pic.twitter.com/MChOhLXNed— Telangana Weatherman (@balaji25_t) December 16, 2024 pic.twitter.com/rWzKwu2Ylg— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) December 15, 2024 -
మంచుకురిసే వేళలో.. వాతావరణశాఖ హెచ్చరికలు!
దేశంలోని పర్వత ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. మైదానాలను చల్లని గాలులు చుట్టుముడుతున్నాయి. ఉత్తర భారతదేశంలోని పలుచోట్ల ఉదయం పూట దట్టంగా పొగమంచు కమ్ముకుంటోంది. హర్యానా, పంజాబ్, చండీగఢ్, త్రిపుర, యూపీలోని పలు ప్రాంతాల్లో డిసెంబర్ 14, 15 తేదీల్లో దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. డిసెంబర్ 14న అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలకు వాతావరణశాఖ ఇదే విధమైన హెచ్చరిక జారీ చేసింది. గడచిన 24 గంటల్లో ఢిల్లీ, హర్యానా, పంజాబ్, చండీగఢ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాలలో 6 నుండి 10 డిగ్రీల సెల్సియస్ మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 24 గంటల్లో ఈ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రత 6 నుంచి 10 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. ఢిల్లీ-ఎన్సీఆర్లోనూ చలి తీవ్రత పెరుగుతోంది. బుధవారం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 7.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువగా ఉంది. మరో రెండు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు తిరిగి పడిపోవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం నగరంలోని గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) అత్యంత పేలవమైన కేటగిరీలో నమోదైంది. డిసెంబర్ 16, 17 తేదీల్లో దక్షిణ తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. డిసెంబర్ 17న కేరళలో కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లలో మంచు కురుస్తోంది. గడచిన 24 గంటల్లో హిమాచల్‌లోని కులు, కిన్నౌర్, లాహౌల్, స్పితి జిల్లాల్లోని ఎత్తయిన ప్రాంతాలు, పర్వత శ్రేణులలో మంచు కురిసింది. ఇది కూడా చదవండి: సీఎం సొంతూళ్లో సంబరాలు... రెస్టారెంట్లో చాయ్ ఫ్రీ! -
మంచు గుప్పెట్లో భాగ్యనగరం
-
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వణికిస్తున్న చలి
-
ఢిల్లీలో స్తంభించిన జనజీవనం
-
ఏపీ, తెలంగాణలో పెరిగిన చలి
-
ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ లో చలి పంజా
-
Telangana: ఇదేం చలి బాబోయ్.. వణికిస్తోంది!
సాక్షి, హైదరాబాద్: చలి తీవ్రత రాష్ట్రంలో విపరీతంగా పెరిగింది. గత రెండుమూడు రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. దీంతో పగటి పూట సైతం జనాలు వణికిపోతున్నారు. ఉదయం పది గంటలకైనా చలి ప్రభావం తగ్గకపోతుండడం.. సాయంత్రం ఆరు, ఏడు గంటల నుంచే జనాలు ఇంటికే పరిమితమైపోతున్నారు చలి దెబ్బకు. చలి కాలానికి మాండూస్ తుపాన్ ప్రభావం తోడవ్వడంతో తీవ్రత మరింతగా ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. వేకువ ఝామున పొగమంచుతో వాహనదారులు .. సాయంత్రం సమయంలో పనుల నుంచి ఇళ్లకు తిరిగి వచ్చేవాళ్లు సైతం ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే.. పది డిగ్రీల సెల్సియస్ లోపుగా అత్యల్ప ఉష్ణోగ్రతలు అక్కడక్కడా నమోదు అవుతుండడం గమనార్హం. దీంతో స్వెటర్లు, చలిమంటలకు ఆశ్రయించక తప్పడం లేదు. చలి తీవ్రత అంతకంతకు పెరుగుతుండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆహారపు అలవాట్ల విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలంటున్నారు. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేవారు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు, గర్భిణులు, బాలింతలు, చిన్ప పిల్లలు, వృద్ధులు మరింత జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు. రాత్రిపూట, తెల్లవారుజామున బయటకు వెళ్లకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌తో పాటు పలు చోట్ల తుపాను ప్రభావంతో చిరు జల్లులు కురుస్తున్నాయి. అయితే చాలా చోట్ల ఈ ప్రభావం చలి తీవ్రత రూపంలోనే కనిపిస్తోంది. -
Telangana: ఇగం.. ఆగమాగం!
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత.. తీవ్రంగా వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం.. దీనికి తోడు తుపాన్ ప్రభావంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. గత వారం రోజులుగా వణికిస్తున్న చలి.. ఇవాళ(గురువారం) ఉదయం మరింత ప్రభావం చూపెట్టింది. వాతావరణ ప్రభావంతో.. మధ్యాహ్నం సమయంలోనూ ఎండ ప్రభావం కనిపించడం లేదు. సాయంత్రం 5 గంటల నుంచే చలి క్రమంగా పెరుగుతోంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో చలి ప్రభావం మరింత తీవ్రంగా ఉంటోంది. రాజధానిలోనూ అదే పరిస్థితి. ఉదయం వేళలో ప్రధాన రహదారులను పొగమంచు కప్పేస్తోంది. మంగళ, బుధవారాలతో పోలిస్తే.. గురువారం ఉదయం ఉష్ణోగ్రతలు కనీస స్థాయికి పడిపోయాయి. హైదరాబాదులో నమోదైన టెంపరేచర్ .. సాధారణ స్థాయికంటే తక్కువగా నమోదైంది. మరోవైపు మాండూస్ తుపాన్ ప్రభావంతో.. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ ప్రభావంతో హైదరాబాదులోనూ వానలు పడొచ్చని భావిస్తోంది. ఇక ఉత్తర తెలంగాణలో చలి ప్రభావం అధికంగా ఉంటోంది. ఆదిలాబాద్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, కామారెడ్డిల్లో చలి తీవ్రత రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందని వాతావరణశాఖ హెచ్చరించింది. వృద్ధులు, చిన్న పిల్లలు, ఆస్తమా పేషెంట్లు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఉన్నందున్న అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరో వారం పాటు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉమ్మడి ఆదిలాబాద్ లో ఉష్ణోగ్రతలు.. అదిలాబాదు జిల్లా నేరడి గోండలో 10.3. డిగ్రీలు, కుమ్రంబీమ్ జిల్లా సిర్పూర్ యులో 10.6 డిగ్రీలు, కెరిమెరిలో 10.7డిగ్రీలు, ఉట్నూర్ లో 10.8 డిగ్రీలు, బోరజ్ 11.1 డిగ్రీలు, కుమ్రంబీమ్ జిల్లా తిర్యాని 11.2 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా జన్నారం11.2 డిగ్రీలు నమోదు అయ్యాయి. ఇదీ చదవండి: ముంచుకొస్తున్న మాండూస్.. ఏపీలో భారీ వర్షాలు! -
తెలుగు రాష్ట్రాల్లో చలి.. మరింత పెరిగే ఛాన్స్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత మరింత పెరిగింది. ఉత్తర భారతం నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పడిపోతున్నాయి. పగటి పూట సైతం చలిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటోంది. శనివారం(ఇవాళ), ఆదివారం చలి మరింతగా ప్రభావం చూపెడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ తెలంగాణలో వికారాబాద్ పరిధిలో 10 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. మరోవైపు విశాఖ ఏజెన్సీ ప్రాంత్లానూ ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయాయి. సింగిల్ డిజిట్ దిశగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో. పోను పోను మరింతగా చలి ప్రభావంగా మరింత పెరుగుతుందని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ. తెలుగు రాష్ట్రాల ప్రజలు గత వారంగా స్వెట్టర్లు, మంకీ క్యాప్స్‌పై ఆధారపడుతున్నారు. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో.. దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఈ ఏడాది చలి కాలంలో రికార్డు స్థాయిలో లో-టెంపరేచర్లు నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇక గుండె జబ్బులు, అస్తమా, అలర్జీ ఉన్నవారు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. శ్వాస కోశ సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లు, వృద్ధులు సాధ్యమైనంత వరకు మార్నింగ్ వాకింగ్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. చిన్నపిల్లలకు చలిగాలులు తగలకుండా చూసుకోవాలని పేరెంట్స్‌కి సూచిస్తున్నారు. -
మరో రెండ్రోజులు చలి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, ఈశాన్య దిక్కుల నుంచి బలంగా గాలులు వీస్తుండగా... దీనికితోడు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదు కావడంతో చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మంగళవారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే ఆదిలాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 11.5 డిగ్రీల సెల్సియస్, ఖమ్మంలో గరిష్ట ఉష్ణోగ్రత 30.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. ప్రస్తుతం నమోదైన గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ నుంచి 5 డిగ్రీల సెల్సియస్ మేర తక్కువగా నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈనెల 27, 28 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మరింత పతనం కానున్నాయి. నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు 5 డిగ్రీల మేర తగ్గనున్నాయి. ఆదిలాబాద్, కుమ్రుంభీం ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల నుంచి 10 డిగ్రీల లోపు నమోదవుతాయని హెచ్చరించింది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. చలి తీవ్రత నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా జిల్లాల అధికారులకు సూచనలు చేసింది. -
రానున్న 2, 3 రోజుల్లో చలిగాలులతో కూడిన వానలు: వాతావరణ శాఖ
న్యూఢిల్లీ: నేడు దేశంలో పలు రాష్ట్రాల్లో చలిగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాలతోపాటు, ఉత్తరప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, విదర్భాలో కూడా నేడు వర్షపాతం ఉంటుంది. తర్వాత ఐదు రోజులలో పొడి వాతావరణం ఉంటుందని అంచనా. ఐతే ఈశాన్య భారతదేశంలో రెండు రోజులపాటు పొడిగా ఉంటుంది. చదవండి: Warning: పెను ప్రమాదంలో మానవాళి! కిల్లర్ రోబోట్ల తయారీకి అగ్రదేశాల మొగ్గు.. ఉత్తర భారతంలో మాత్రం జనవరి 5 నుంచి 7 మధ్య చలిగాలులు వీచే అవకాశం ఉంది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో రాబోయే రెండు రోజుల్లో పగటిపూట, అర్థరాత్రి సమయాల్లో దట్టంగా మంచు కురిసే అవకాశం ఉంది. జనవరి 5 నుండి 7 వరకు పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తర రాజస్థాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, మధ్యప్రదేశ్, దక్షిణ రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో జనవరి 6, 7 తేదీల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రానున్న 2,3 రోజుల్లో చలిగాలుల కారణంగా పంజాబ్‌లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినట్లు వాతావరణ శాఖ తెల్పింది. చదవండి: హెచ్చరిక! అదే జరిగితే మనుషులంతా ఒకరినొకరు చంపుకు తింటారు! -
ఉమ్మడి వరంగల్ జిల్లాపై చలి పంజా
-
తెలంగాణ గజగజ...భారీగా పెరిగిన చలి తీవ్రత
-
చలి తగ్గుతోంది!
సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో తగ్గిన ఉష్ణో గ్రతలు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటు న్నాయి. తుపాను నేపథ్యంలో గత 3 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పతనమయ్యాయి. నివర్ ప్రభావం రాష్ట్రంపై పెద్దగా లేనప్పటికీ... వాతావరణంలో మాత్రం భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. బుధ, గురు, శుక్రవారాల్లో ఉష్ణోగ్రతలు తగ్గడంతోపాటు చలిగాలులు వీయడంతో ప్రజలు వణికిపోయారు. ప్రస్తుతం తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారింది. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం నుంచి చలి తీవ్రత తగ్గుతోంది. మరో రెండు రోజుల్లో చలి తగ్గి ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికి చేరుకుంటాయని వాతావరణ శాఖ అధికారి నాగరత్న ‘సాక్షి’తో అన్నారు. సాధారణం కన్నా 8.6 డిగ్రీలు తక్కువగా... నివర్ తుపాను ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 8.6 డిగ్రీ సెల్సియస్ తగ్గాయి. దీనికితోడు వేగంగా గాలులు వీయడంతో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సమీపంలో ఉండాల్సి ఉండగా... హకీంపేట్‌లో 21.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబ్‌నగర్, భద్రాచలం, దుండిగల్, హన్మకొండ స్టేషన్లలో గరిష్ట ఉష్ణోగ్రతలు అతి తక్కువగా నమోద య్యాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు కాస్త అటుఇటుగా నమోదయ్యాయి. రాష్ట్రంలో అతి తక్కువగా మెదక్‌లో 14.8 డిగ్రీల సెల్సీయస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, దుండిగల్, హకీంపేట్, హైదరాబాద్‌లో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు తక్కువగానే నమోదయ్యాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం వద్ద అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగు తోందని వివరించింది. రాబోయే 48 గంటల్లో ఇది వాయుగుండంగా మారి పశ్చిమ దిశగా పయనిస్తూ డిసెంబర్ 2న దక్షిణ తమిళనాడు తీరాన్ని చేరే అవకాశం ఉందని సూచించింది. మరోవైపు దక్షిణ కోస్తాంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం బలహీన పడిందని వాతావరణ శాఖ ప్రకటించింది. శనివారం ఉదయం 8:30 గం. వరకు ఉష్ణోగ్రతలు ఇలా.. (డిగ్రీ సెల్సియెస్లలో) స్టేషన్ గరిష్టం కనిష్టం అదిలాబాద్ 25.3 18 భద్రాచలం 22.2 16.5 హకీంపేట్ 21.2 17 దుండిగల్ 22.3 16.7 హన్మకొండ 22 17.5 హైదరాబాద్ 22.4 17 ఖమ్మం 23.6 19.2 మహబూబ్‌నగర్ 21.9 18.7 మెదక్ 25 14.8 నల్లగొండ 26.5 18 నిజామాబాద్ 24.1 18.9 రామగుండం 23 18.6 -
రెడ్ వార్నింగ్ : మంచు దుప్పటిలో రాజధాని
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిని శీతల గాలులు ముంచెత్తడంతో వాతావరణ శాఖ ఢిల్లీలో ‘రెడ్’ వార్నింగ్ జారీ చేసింది. దశాబ్ధాల కనిష్టస్ధాయిలో లోథి రోడ్లో 2.8 డిగ్రీల సెల్సియస్, సఫ్ధర్‌జంగ్‌లో 2.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ హెచ్చరిక జారీ చేసింది. తీవ్ర వాతావరణ పరిస్థితులు నెలకొంటే ఈ తరహా హెచ్చరిక జారీ చేస్తారు. ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్టస్ధాయికి చేరడం ఢిల్లీలో విమాన, రైళ్ల సేవలపై ప్రభావం చూపుతోంది. పొగమంచు కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు మంచు కప్పేయడంతో ఢిల్లీ, నోయిడాలను కలిపే రహదారిపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. శీతల గాలులకు తోడు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఢిల్లీలో మరోసారి కాలుష్యం ప్రమాదకర స్ధాయికి పెరిగింది. ఇక రాజస్ధాన్, మధ్యప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయని ఐఎండీ పేర్కొంది. -
మరో మూడ్రోజులు చలిగాలులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాగల మూడురోజులు పొడి వాతావరణం వల్ల చలిగాలులు అధికంగా వీచే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర దిశ, ఈశాన్య దిశ నుంచి గాలులు వీస్తుండటంతో ఆదిలాబాద్, కుమురంభీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యా ల, కామారెడ్డి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉందని పేర్కొంది. గురువారం ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. -
పగలూ గజగజ
సాక్షి, హైదరాబాద్/కోహిర్ (జహీరాబాద్): రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతు న్నాయి. రికార్డు స్థాయి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఉదయం 8 గం. వరకు చలి తీవ్రత తగ్గకపోవడంతో బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. సంగారెడ్డి జిల్లా కోహిర్లో మంగళవారం ఉదయం రికార్డు స్థాయిలో 2.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా అర్లి(టీ), జహీరాబాద్ మండలం అల్గోల్‌లో 3.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదైనట్లు టీఎస్‌డీపీఎస్ వెల్లడించింది. ఇక కోహిర్ మండలానికి పక్కనే ఉన్న మర్పల్లి, ఆసిఫాబాద్ జిల్లా కొమురంభీం మండలం గిన్నెధారిలో 3.8 డిగ్రీల æచొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్, కామారెడ్డి జిల్లా భిక్కనూర్, రంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో 4.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అలాగే రంగారెడ్డి జిల్లా మంగల్‌పల్లి, వికారాబాద్ జిల్లా నాగారంలో 4.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయంలో కోహిర్లో రాష్ట్రంలోనే అత్యల్పంగా 4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రెండ్రోజుల పాటు చలిగాలులు.. ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలుల కారణంగా తెలంగాణలో బుధ, గురువారాల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఈ రెండ్రోజులు ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం, నిజామా బాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, సిద్దిపేట, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు వీచే అవకాశముందని వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు తెలిపారు. ఇదిలావుండగా గత 24 గంటల్లో ఆదిలాబాద్‌లో 5 డిగ్రీలు, మెదక్‌లో 6 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్ర్రతలు
-
రాష్ట్రంలో పెరుగుతున్న చలితీవ్రత
-
ఢిల్లీని కమ్మేసిన పొగమంచు
సాక్షి, న్యూఢిల్లీ : చలిగాలుల తీవ్రతతో దేశరాజధాని గజగజ వణుకుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడంతో చలిపులి పంజా విసురుతోంది. సోమవారం ఉదయం ఢిల్లీని పొగమంచు కమ్మేయడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సీజన్ సగటుతో పోలిస్తే కనిష్ట ఉష్ణోగ్రత మరింత తక్కువగా 6.2 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. ఢిల్లీని ఈ ఉదయం మంచుపొరలు కమ్మేశాయని, అయితే ఆకాశం నిర్మలంగా ఉందని, వర్షం కురిసే అవకాశాలు లేవని వాతావరణ విభాగం తెలిపింది. మరోవైపు చలిగాలులతో పాటు ఢిల్లీని కాలుష్యం వణికిస్తోంది. వాయు నాణ్యత ప్రమాణాలు ఢిల్లీలో ఇంకా దారుణంగానే ఉన్నాయని వాయు కాలుష్య తీవ్రతను తెలిపే పీఎం 2.5, పీఎం 10 ప్రమాదకరస్ధాయిలోనే ఉన్నాయని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) పేర్కొంది. -
చలి గుప్పిట్లో తెలుగు రాష్ట్రాలు
-
మరో రెండురోజులు పగలు కూడా చ...చ... చలే!
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు పగటిపూట కూడా చలిగాలులు తప్పవు. ఈ విషయాన్ని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ఒకటి రెండు ప్రాంతాలలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కన్నా బాగా కిందకు పడిపోయాయి. రాష్ట్రం మొత్తమ్మీద మెదక్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నల్లగొండ, మెదక్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలలో శని, ఆది వారాలలో చలి గాలులు కొనసాగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. రాబోయే ఐదు రోజులకు సంబంధించిన వాతావరణ పరిస్థితులను వివరిస్తూ ఈ విషయం తెలిపారు. -
చలిగాలులకు ఇద్దరి బలి
వరంగల్: వరంగల్ జిల్లాలో చలి తీవ్రత తట్టుకోలేక బుధవారం ఇద్దరు వృద్ధులు మృతి చెందారు. జిల్లాలోని చెన్నారావుపేట మండలం అమీనాబాద్‌కు చెందిన శీలం కనుకయ్య(65) మరణించాడు. నెల్లికుదురు మండలం ఆలేరుకు చెందిన జి. భద్రయ్య(65) నాలుగు రోజులుగా వీస్తున్న చలిగాలులకు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో భద్రయ్య చనిపోయాడు.