సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిని శీతల గాలులు ముంచెత్తడంతో వాతావరణ శాఖ ఢిల్లీలో ‘రెడ్’ వార్నింగ్ జారీ చేసింది. దశాబ్ధాల కనిష్టస్ధాయిలో లోథి రోడ్‌లో 2.8 డిగ్రీల సెల్సియస్, సఫ్ధర్‌జంగ్‌లో 2.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ హెచ్చరిక జారీ చేసింది. తీవ్ర వాతావరణ పరిస్థితులు నెలకొంటే ఈ తరహా హెచ్చరిక జారీ చేస్తారు. ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్టస్ధాయికి చేరడం ఢిల్లీలో విమాన, రైళ్ల సేవలపై ప్రభావం చూపుతోంది.
పొగమంచు కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు మంచు కప్పేయడంతో ఢిల్లీ, నోయిడాలను కలిపే రహదారిపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. శీతల గాలులకు తోడు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఢిల్లీలో మరోసారి కాలుష్యం ప్రమాదకర స్ధాయికి పెరిగింది. ఇక రాజస్ధాన్, మధ్యప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయని ఐఎండీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment