IMD report
-
రెండు రోజుల పాటు ఏపీకి వర్ష సూచన
-
ఏపీకి భారీ వర్ష సూచన
-
నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం
-
కోస్తాంధ్రకు భారీ వర్షసూచన
-
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం
-
ఈనెల 20–22 మధ్య మరో అల్పపీడనం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఈనెల 20 నుంచి 22వ తేదీ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 27వ తేదీ నాటికి ఇది తీరం సమీపానికి వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఇది ఉత్తరాంధ్రకు దగ్గరగా వచ్చినా ఆ తర్వాత ఒడిశా వైపు కదిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే తుపాను కూడా ఏర్పడవచ్చని, అది ఏపీపై ఎంత ప్రభావం చూపుతుందనేది వారం రోజుల్లో స్పష్టత వస్తుందని అధికారులు పేర్కొన్నారు.అలాగే, ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం సోమవారం ఒడిశాలోని పూరీ వద్ద తీరం దాటింది. ఇది వాయువ్య దిశగా పయనించి తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. దీని ప్రభావంతో మంగళవారం వరకు ఉత్తరాంధ్ర, ఒడిశా ప్రాంతాల్లో పలుచోట్ల భారీ వర్షాలు, మిగిలిన చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో రాష్ట్రానికి వర్ష ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు..మరోవైపు.. తీవ్ర వాయుగుండం ప్రభావానికి ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకూ ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా వై. రామవరంలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకూ అత్యధికంగా 13.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. చింతపల్లిలో 13.4, ముంచింగిపుట్టులో 13.3, గంగవరంలో 12.4, అడ్డతీగలలో 11.7 సెంటీమీటర్ల వర్షం పడింది.అనకాపల్లి జిల్లా గోలుగుండలో 11.2, విజయనగరం పూసపాటిరేగలో 11, అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగిలో 10.9, శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో 10.5, అనకాపల్లి జిల్లా నాతవరంలో 10 సెంటీమీటర్ల వర్షం పడింది. అల్లూరి, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కాకినాడ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో 5 నుంచి 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మరోవైపు.. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం రాజపురలో 6.2 సెంటీమీటర్ల వర్షం పడింది. ఉత్తరాంధ్రలోని మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. -
దూసుకొస్తున్న రెమాల్ తుపాను
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాను ఉధృతంగా మారి తీవ్ర తుపానుగా కొనసాగుతోంది. అర్థరాత్రి బెంగాల్ సమీపంలో తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను ఎఫెక్ట్‌తో కోల్‌కతాలో పలు విమానాలను రద్దయ్యాయి. బెంగాల్లో తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. తీర ప్రాంతాల్లో 120 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని.. ఉత్తర ఒడిశా, బెంగాల్, ఈశాన్యం రాష్ట్రాలకు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు పడే అవకాశముందని.. రేపటి వరకు వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.మరోవైపు.. నైరుతి రుతుపవనాలు నైరుతి బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన భాగాలు, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని భాగాలు, ఈశాన్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి.ఆదివారం నాటికి నైరుతి బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 31లోగా కేరళ తీరాన్ని తాకే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొంది. రాగల రెండు రోజుల్లో ఏపీలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రెండు రోజుల తర్వాత మళ్లీ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు. -
హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
ఢిల్లీ: దేశంలోని ప్రధాన నగరాల్లో ఎండ తీవ్రత రోజు రోజుకి భారీగా పెరుగుతోంది. ప్రజలు భానుడి వేడి తట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో భారత వాతావరణ శాఖ తీవ్రమైన వేడిగాలులు త్వరలో తగ్గుముఖం పట్టబోతున్నాయని ఓ శుభవార్త చెప్పింది.తూర్పు, దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో వేడిగాలులు తగ్గుముఖం పట్టబోతున్నాయి. తూర్పు ప్రాంతానికి ఈ రోజులో ఉపశమనం లభించవచ్చు. దక్షిణాది రాష్ట్రాలు కూడా త్వరకలోనే వేడి తీవ్రతలు తగ్గుతాయని ఐఎండీ పేర్కొంది. మే 10 వరకు ఈ ప్రాంతాలలో ఉరుములు, గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.గత నెల నుంచి భారతదేశంలో పలు ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు వ్యాపించడంతో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువ అవుతున్నాయి. ఏప్రిల్ చివరి రోజున కోల్‌కతాలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది, కోల్‌కతాలో దశాబ్దాలుగా ఇంతటి ఉష్ణోగ్రత నమోదు కాలేదు.రాబోయే ఐదు రోజుల్లో గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్‌లను ఉష్ణోగ్రతలు తగ్గుతాయని, ఈశాన్య రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మేఘాలయలోని ఖాసీ-జైంతియా హిల్స్ ప్రాంతంలో నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. 400 మందికి పైగా ప్రజలు నష్టపోయినట్లు.. మరో 48 గంటల పాటు ఈ వర్షం కొనసాగుతుందని వాతావరణ సఖ పేర్కొంది. -
దిశ మార్చుకోలేదు..తుఫాన్ తీరం దాటేది ఇక్కడే
-
ఏపీకి వర్షసూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
సాక్షి, విశాఖపట్నం: ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఇక, అల్పపీడనం కారణంగా గంటలకు 40 నుంచి 45 కిమీల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అల్ప పీడనం ప్రభావంతో కోస్తా, రాయలసీమ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే, ఈనెల 17వ తేదీ వరకు మృత్య్సకారుల చేపలవేటపై నిషేధం విధించింది వాతావరణశాఖ. మరోవైపు.. తెలంగాణలోని పలు జిల్లాల్లో బుధవారం రాత్రి నుంచి మోస్తరు వర్షం కురిసింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఇక, రాజధాని హైదరాబాద్‌లో కూడా ఆకాశం మోఘావృతమై ఉంది. ఇది కూడా చదవండి: ఐరాస సదస్సుకు ఏపీ విద్యార్థులు -
ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్.. రెండు రోజుల పాటు భారీ వర్షాలు
సాక్షి, అమరావతి: ఐఎండి అంచనా ప్రకారం పశ్చిమ మధ్య ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరంలో అల్పపీడనం కేంద్రీకృతమైందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా. బీఆర్ అంబేద్కర్ వెల్లడించారు. ఇది నెమ్మదిగా వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడతాయన్నారు. రేపు అక్కడక్కడ భారీ వర్షాలు, ఎల్లుండి నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. రేపు అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అలాగే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నట్లు చెప్పారు. ప్రస్తుత వాతావరణ అంచనా బట్టి ఎల్లుండి నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నట్లు వివరించారు. భారీ వర్షాలు, వరదలు నేపథ్యంలో ప్రభావిత జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. బుధవారం సాయంత్రం 6 గంటల నాటికి శ్రీకాకుళం జిల్లా తామడలో 145 మిమీ, విజయనగరం జిల్లా గోవిందపురంలో 136 మిమీ, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో 114 మిమీ, విశాఖపట్నంలో 111 మిమీ అధిక వర్షపాతం, దాదాపు 41 ప్రాంతాల్లో 60 మి.మీ కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైందని తెలిపారు. చదవండి: భద్రాచలం రామాలయం చుట్టూ వరద నీరు.. మొదటి ప్రమాద హెచ్చరిక ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాల ప్రభావంతో గోదావరి వరద ఉధృతి పెరుగుతున్నట్లు విపత్తుల సంస్థ పేర్కొంది. బుధవారం రాత్రి 7 గంటలకు గోదావరి వరద ప్రవాహం భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని నీటిమట్టం 46.70 అడుగులు, ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 8.26 లక్షల క్యూసెక్కులు ఉందని రేపు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందన్నారు. పొరుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కారణంగా మూడు,నాలుగు రోజులు గోదావరి వరద పెరిగే అవకాశం ఉందన్నారు. రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయి వరకు వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. విపత్తుల సంస్థ ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ సంబంధిత జిల్లాల యంత్రాంగానికి, మండల, గ్రామ స్థాయి అధికారుల వరకు సూచనలు జారీ చేస్తున్నామన్నారు. అత్యవసర సహాయక చర్యల కోసం 6 బృందాలు బృందాలు ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజల ఫోన్లకు హెచ్చరిక, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సందేశాలు పంపుతున్నామన్నారు. ప్రజలు అత్యవసర సహాయం, సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 1070, 1800 425 0101 సంప్రదించాలన్నారు. పూర్తిస్థాయిలో తగ్గే వరకు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. -
వాతావరణశాఖ హెచ్చరిక..ఏపీలో 6 జిల్లాలకు రెడ్ అలర్ట్
-
ఎల్లో అలర్ట్: తెలంగాణలో ఎనిమిది జిల్లాలకు భారీ వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్: మొన్నటి వరకు వేసవి ఎండతాపంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ క్రమంలో ప్రజలకు వాతావరణ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన కొత్త అల్పపీడనం కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు, రేపు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే, ఒకట్రెండు రోజుల్లో తెలంగాణ అంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించే ఛాన్స్ ఉందని స్పష్టం చేశారు. వివరాల ప్రకారం.. తెలంగాణకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. తూర్పు, ఉత్తరాన కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. జూన్ 25, 26 తేదీల్లో ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు.. దక్షిణ తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే, తెలంగాణవ్యాప్తంగా పగటిపూట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా రైతులు విత్తనాలు వేసుకోవడానికి అనుకూలమైన వాతావరణం ఉంటుందని చెప్పారు. ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో భారీ వర్షం..జీహెచ్ఎంసీ అప్రమత్తం! -
మహోగ్రరూపం దాల్చిన బిపర్జోయ్ తుపాను..(ఫొటోలు)
-
TS: రెండు రోజులు భారీ వర్ష సూచన.. వాతావరణ శాఖ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మిగతా ప్రాంతాల్లోనూ తేలికపాటి వానలు పడవచ్చని తెలిపింది. పశ్చిమ విదర్భ నుంచి మరాఠ్వాడ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి దీనికి కారణమని వెల్లడించింది. మరోవైపు పలు ప్రాంతాల్లో మూడు రోజులపాటు 39 డిగ్రీల నుంచి 42 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ఇటు వానలు.. అటు ఎండలు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల విస్తారంగా వానలు పడగా.. మరికొన్ని చోట్ల ఎండలు మండిపోయాయి. పెద్దపల్లి జిల్లా జూలపల్లి, మంచిర్యాల జిల్లా జన్నారంలో అత్యధికంగా 6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. హనుమకొండ జిల్లా శాయంపేట, హసన్‌పర్తి, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, జైపూర్, జగిత్యాల జిల్లా పెగడపల్లి, కొమురంభీం జిల్లా సిర్పూరు, కరీంనగర్ జిల్లా జమ్మికుంట, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట, వరంగల్ జిల్లా ఆత్మకూర్, సంగెంలలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఇక నిర్మల్ జిల్లా తానూరులో 41.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అదే జిల్లా భైంసా, ఆదిలాబాద్ జిల్లా పిప్పలధరిలలో 41.2, అర్లిలో 40.9 డిగ్రీలు, కామారెడ్డి జిల్లా బోమన్‌దేవిపల్లిలో 40.1, నిజామాబాద్ జిల్లా మాచిప్పలో 40, కల్దుర్కి, ఆదిలాబాద్ జిల్లా పొచ్చరలో 39.9, నిజామాబాద్‌లో 38.7, మెదక్‌లో 38.6, ఆదిలాబాద్‌లో 38.3, ఖమ్మంలో 36.2, హైదరాబాద్, రామగుండంలో 33.6 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇది కూడా చదవండి: డ్రైవింగ్‌లోనే గుండెపోటుకు గురై.. -
TS: చల్లని కబురు.. రెండు రోజులు వానలే..
సాక్షి, హైదరాబాద్: విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వర కు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టం నుంచి సగటున 0.9 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండ్రోజులు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియ స్ నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిసర జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 38డిగ్రీల సెల్సియస్ నుంచి 41డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతుందని వాతావరణ శాఖ వివరించింది. సోమవారం గరిష్ట ఉష్ణోగ్రత నిజామాబాద్‌లో 41.7 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 20.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ కసరత్తు.. ఎర్రబెల్లిని ఎదుర్కొనే సత్తా ఉన్న నాయకుడెవరు? -
ఏమిటీ ‘హీట్ ఇండెక్స్’?.. ఎందుకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు?
మహారాష్ట్రలోని నవీ ముంబై శివార్లలో భారీ సభ.. లక్షల్లో జనాలు వచ్చారు.. ఎండాకాలమే అయినా ఉష్ణోగ్రత మరీ ఎక్కువగా ఏమీ లేదు.. అయినా వడదెబ్బ తగిలి ఏకంగా 14 మంది చనిపోయారు. అధిక ఉష్ణోగ్రతకు మరికొన్ని వాతావరణ అంశాలు తోడుకావడమే దీనికి కారణం. అందుకే కేవలం ఉష్ణోగ్రతను కాకుండా.. ‘హీట్ ఇండెక్స్’ను పరిగణనలోకి తీసుకోవాలని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) నిర్ణయించింది. ఏయే ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉండవచ్చన్న అంచనాలతో కలర్ కోడింగ్ మ్యాప్‌లనూ విడుదల చేస్తోంది. మరీ ఏమిటీ ‘హీట్ ఇండెక్స్’? ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు? దీనితో ఏమిటి లాభం? వంటి వివరాలు తెలుసుకుందామా.. ఉష్ణోగ్రత, హ్యూమిడిటీ కలిస్తే.. ఎప్పుడైనా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటే.. కాస్త వేడిగా అనిపిస్తుంది. కానీ దీంతోపాటు వాతావరణంలో నీటిఆవిరి శాతం (రిలేటివ్ హ్యూమిడిటీ) కూడా పెరిగితే.. వేడికి తోడు ఉక్కపోత మొదలవుతుంది. ఆచోట నీడ లేకపోయినా, గాలివీయకపోయినా పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది. విపరీతంగా చెమటపడుతుంది. అప్పటికీ ఎండ/వేడిలో నే ఉంటే శరీరంలో డీహైడ్రేషన్ మొదలవుతుంది. ఒకదశలో ఊపిరి తీసుకోలేక, స్పృహ తప్పే పరిస్థితి ఏర్పడుతుంది. వీటికి ఏమిటి సంబంధం? మామూలుగా ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటే.. అందుకు తగినట్టుగా గాలి, నీరు వేడెక్కుతూ ఉంటాయి. వేడెక్కిన నీరు వేగంగా ఆవిరి అవుతూ గాలిలో హ్యూమిడిటీ పెరిగిపోతూ ఉంటుంది. మరోవైపు ఎండ, వేడి గాలి కారణంగా మన శరీరం వేడెక్కి చెమటపడుతుంది. మామూలుగా అయితే చెమట ఆరినకొద్దీ శరీరం చల్లబడుతుంది. కానీ వాతావరణంలో అప్పటికే హ్యూమిడిటీ ఎక్కువగా ఉండటంతో చెమట ఆరక.. శరీరం వేడెక్కిపోతూనే ఉంటుంది. ఇది శరీరంలోని అవయవాల పనితీరుపై ప్రభావం చూపి.. అస్వస్థతకు గురవుతారు. ఎంత ఉష్ణోగ్రతకు, ఎంత హ్యూమిడిటీ ఉంటే.. ఏంటి పరిస్థితి? - ఒక్కో స్థాయిలో ఉష్ణోగ్రతకు, ఒక్కోస్థాయి వరకు హ్యూమిడి టీ ఉంటే ఇబ్బందిగా ఉండదు. అవి పరిమితి దాటితే సమస్యగా మారుతుంది. - 26 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత, 40% వరకు హ్యూమిడిటీ ఉంటే వాతావరణం హాయి గా ఉన్నట్టు. ఈ పరిస్థితిని మన శరీరం సులువుగా తట్టుకోగలుగుతుందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. - ఈ ఉష్ణోగ్రతలు, హ్యూమిడిటీకి తోడు నేరుగా ఎండలో ఉండటం, వడగాడ్పులు వంటివి కూడా ఉంటే హీట్ ఇండెక్స్ మరింత ఎక్కువగా ఉంటుంది. ఏమిటి దీనితో ప్రయోజనం? ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు బయటికి వెళ్లినా తొలుత బాగానే అనిపిస్తుంది. కానీ కాసేపటికే ఇతర అంశాల ప్రభావంతో ఇబ్బందిగా మారుతుంది. అదే ‘హీట్ ఇండెక్స్’తో పరిస్థితి ఎలా ఉందన్నది తెలిస్తే.. ముందు జాగ్రత్త పడొచ్చు. ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు కూడా ఆయా ప్రాంతాల్లో తగిన ఏర్పాట్లు చేసేందుకు వీలుంటుంది. ఉదాహరణకు ఢిల్లీ, విశాఖపట్నం రెండు చోట్లా 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై.. ఢిల్లీలో 40%, విశాఖలో 50% హ్యూమిడిటీ ఉంటే.. ఢిల్లీలో పరిస్థితి బాగానే ఉంటుంది. కానీ విశాఖలో మాత్రం ఉక్కపోత, వేడి తీవ్రత ఎక్కువ. ఇప్పటికే ‘ఫీల్స్ లైక్’పేరిట.. ఉష్ణోగ్రత, ఇతర అంశాలను కలిపాక.. వాతావరణం ఎంత వేడిగా ఉన్నట్టు అనుభూతి కలుగుతుందనే దాన్ని ‘ఫీల్స్ లైక్’, ‘రియల్ ఫీల్’వంటి పేర్లతో సూచిస్తుంటారు. ఇప్పటికే పలు ప్రైవేటు వాతావరణ సంస్థలు దీనిని అమలు చేస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లలోని వెదర్ యాప్స్‌లో కూడా ఈ హీట్ ఇండెక్స్ అంచనాలను చూడవచ్చు. - ఉష్ణోగ్రత, హ్యూమిడిటీతోపాటు మేఘాలు ఆవరించి ఉండటం, గాలి వీచే వేగం, సదరు ప్రాంతం ఎత్తు, సమీపంలో భారీ జల వనరులు ఉండటం, తీర ప్రాంతాలు కావడం, వర్షాలు కురవడం వంటివాటిని బట్టి హీట్ ఇండెక్స్ మారే అవకాశం ఉంటుంది. ఆయా పరిస్థితులకు అనుగుణంగా ‘హీట్ ఇండెక్స్’ను నిర్ధారించాల్సి ఉంటుంది. ‘హీట్ ఇండెక్స్’ఏ రోజుకారోజు, ఉదయం నుంచి రాత్రి వరకు సమయాన్ని బట్టి మారుతుంది. – సాక్షి సెంట్రల్ డెస్క్. ఇది కూడా చదవండి: అవసరం అయితేనే బయటకు రండి.. రాత్రిపూట కూడా పెరగనున్న ఉష్ణోగ్రతలు -
తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణకు భారీ వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్: రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మోస్తరు నుంచి భారీవర్షాలు సైతం నమోదయ్యే అవకాశం ఉందని సూచించింది. శనివారం ఉదయం ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఈ నెల 8న అల్పపీడన ప్రదేశం ఏర్పడే అవకాశం ఉంది. ఇది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 9న వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఆ తర్వాత దాదాపు ఉత్తరందిశగా పయనిస్తూ మధ్య బంగాళాఖాతం వైపు కదులుతూ తీవ్రతరమై తుపానుగా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశంఉంది. శనివారం నల్లగొండలో 38.0 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నెల 9వ తేదీ నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతాయని వాతావరణ శాఖ సూచించింది. ఇది కూడా చదవండి: ఏపీకి వర్ష సూచన.. మూడు రోజులు వానలు -
TS: వాతావరణశాఖ హెచ్చరిక.. ఆరు జిల్లాలకు భారీ వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా, రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ద్రోణి కారణంగా రేపు.. మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే, ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపుతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వానలు పడుతాయని పేర్కొంది. ఇక, బుధవారం మధ్యాహ్నం తర్వాత ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రైతులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇదిలా ఉండగా.. బుధవారం తెల్లవారుజామున జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ వర్షం కురిసింది. ధరూర్ మండలం నీలహళ్లిలో పిడుగుపాటుకు రైతు నర్సింహులుకు చెందిన రెండు ఎద్దులు మృతిచెందాయి. ఇదిలా ఉండగా.. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు ద్రోణి కొనసాగుతోంది. దీంతో, దక్షిణ, ఆగ్నేయ దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపునకి దిగువ స్థాయిలోని గాలులు వీస్తున్నాయి. దీంతో, రాగల మూడు రోజులు తెలంగాణలో మోస్తారు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ క్రమంలో రాగల ఐదు రోజులు రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 40°C కన్నా తక్కువగా అనేక చోట్ల నమోదు అవుతాయి. కొన్ని చోట్ల 35°C కన్నా తక్కువగా అక్కడక్కడ నమోదు అయ్యే అవకాశముంది. ఇక నేడు, రేపు తెలంగాణలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి గంటకు 40 నుండి 50కిమీ) వేగంతో పాటు వడగళ్ళతో కూడిన వర్షములు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. -
తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఉరుములుతో రెండు రోజులు వానలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో రెండు రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా, తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న రెండ్రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. శుక్రవారం రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. అదిలాబాద్‌లో 37.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత, మెదక్‌లో 20.3 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. -
వాతావరణ శాఖ హెచ్చరికలతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తం
సాక్షి, అమరావతి: ఈ వేసవిలో వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించినందున.. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను విపత్తుల నిర్వహణ సంస్థ ఆదేశించింది. మంగళవారం తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయం నుంచి వివిధ శాఖల అధికారులతో సంస్థ ఎండీ అంబేడ్కర్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. 2020వ సంవత్సరం నుంచి రాష్ట్రంలో వడగాడ్పుల మరణాలు లేవని.. ఈ ఏడాది కూడా అదే విధంగా చర్యలు తీసుకోవాలని, జిల్లా, మండల స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. వడగాడ్పుల తీవ్రత ఆధారంగా పాఠశాలల సమయాలను మార్చాలని ఆదేశించారు. అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే విభాగాన్ని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చదవండి: ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు అలర్ట్.. -
శీతల గాలులు.. వర్షాలపై ఐఎండీ అంచనాలు.. ఈసారి మరింత వణుకుడే!
సాక్షి, విశాఖపట్నం: ఈ ఏడాది శీతాకాలం ఎక్కువ ప్రభావం చూపనుంది. చలి గాలుల తీవ్రత ఎక్కువగా ఉండనుంది. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు దేశంలో శీతాకాలం ప్రభావంపై భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గురువారం అంచనాలను విడుదల చేసింది. ఈ శీతాకాలంలో ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాది రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంకంటే తక్కువగా రికార్డవుతాయని అంచనా వేసింది. ఫలితంగా రాష్ట్రంలో ఈ మూడు నెలలు చలి ఒకింత ఎక్కువ ఉంటుందని పేర్కొంది. రానున్న రెండు నెలల్లో (డిసెంబర్, జనవరిల్లో) అప్పుడప్పుడు అతి శీతల గాలులకు ఆస్కారం ఉంది. గరిష్ట (పగటి) ఉష్ణోగ్రతలు సాధారణంకంటే తక్కువగా నమోదవుతాయని, అందువల్ల పగటి వేళ కూడా శీతల అనుభూతి ఉంటుందని ఐఎండీ అంచనా వేస్తోంది. సాధారణంగా నైరుతి రుతు పవనాల సీజనులో వర్షాలు సమృద్ధిగా కురిసినప్పుడు ఆ తర్వాత వచ్చే శీతాకాలంలో చలి ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది చలి తీవ్రత ఎక్కువగా ఉండటానికి కూడా ఇదే కారణమని వాతావరణ శాఖ రిటైర్డ్ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ చెప్పారు. ఈ సీజనులో రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలతో పోల్చుకుంటే ఉత్తరాంధ్ర, ఏజెన్సీ ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉంటుందని తెలిపారు. మరోవైపు అక్టోబర్ నెలతో మొదలైన ఈశాన్య రుతు పవనాల సీజను డిసెంబర్‌తో ముగియనుంది. ఈ నెలలో రాష్ట్రంలో సాధారణ వర్షాలకే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. 5న అల్పపీడనం! దక్షిణ అండమాన్ సముద్రంలో ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని ఈ నెల ఐదో తేదీన అల్పపీడనం ఏర్పడనుంది. అనంతరం అది పశ్చిమ వాయవ్య దిశగా కదిలి 48 గంటల్లో వాయుగుండంగా బలపడనుంది. 8వ తేదీకి తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు చేరుతుందని ఐఎండీ వెల్లడించింది. దీని ప్రభావం తమిళనాడు, పుదుచ్చేరిలపై అధికంగా, దక్షిణ కోస్తాంధ్రపై మోస్తరుగా ఉండే అవకాశముంది. వాయుగుండం ప్రభావంతో ఈనెల 6 నుంచి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంపైకి తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. ఫలితంగా రానున్న రెండు రోజులు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉత్తర కోస్తాంధ్రలో మాత్రం పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. చదవండి: వద్దన్నా.. వినకుండా ఈవెంట్ బృందంతో వెళ్లి.. -
కొద్దిరోజుల్లో ఏపీలోకి ఈశాన్య రుతుపవనాలు.. భారీ వర్షాలు!
సాక్షి, విశాఖపట్నం: ఈశాన్య రుతుపవనాలు మరికొద్ది రోజుల్లోనే రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. సాధారణంగా ఈశాన్య రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడును అక్టోబర్ 20 లేదా అంతకు రెండు రోజులు అటుఇటుగా తాకుతాయి. కానీ, ఈ ఏడాది నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ఈ నెల 23 వరకు పూర్తి కాలేదు. ఇంతలో బంగాళాఖాతంలో ఏర్పడిన ‘సిత్రాంగ్’ తుపాను కూడా ఈశాన్య గాలులను నిలువరించడం ద్వారా రుతుపవనాల ఆలస్యానికి కారణమైంది. ఈ నెల 25తో సిత్రాంగ్ తుపాను పూర్తిగా బలహీనపడింది. చదవండి: కుమారుడు, భార్య.. తన కళ్లెదుటే.. ఎంత శిక్ష వేశావు దేవుడా.. ఈ నేపథ్యంలో ఈ నెల 29 నుంచి ఆగ్నేయ భారతదేశ ద్వీపకల్పంలో ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమవుతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం నాటి నివేదికలో వెల్లడించింది. ఈ ఏడాది ఈశాన్య రుతుపవనాల ప్రవేశం సాధారణం కంటే వారానికి పైగా ఆలస్యమవుతోంది. నైరుతి రుతుపవనాలు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు దేశమంతటా వర్షాలు కురిపిస్తే ఈశాన్య రుతుపవనాలు మాత్రం దక్షిణ భారతదేశంలోనే ప్రభావం చూపుతాయి. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మూడు నెలల పాటు ఈ రుతుపవనాలు విస్తారంగా వర్షాలను కురిపిస్తాయి. ఈశాన్య రుతుపవనాల వల్ల కోస్తాంధ్రలో 338.1 మిల్లీమీటర్లు, రాయలసీమలో 223.3 మిల్లీమీటర్ల సాధారణ సగటు వర్షపాతం నమోదవుతుంది. ఈ సీజనులో తుపాన్లకు ఆస్కారం.. నైరుతి రుతుపవనాల సీజన్లో కంటే ఈశాన్య రుతుపవనాల సమయంలోనే బంగాళాఖాతంలో తపానులు ఎక్కువగా ఏర్పడతాయి. వాటిలో అధికంగా దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడులపైనే ప్రభావం చూపుతాయి. సాధారణంగా ఈశాన్య రుతుపవనాల సీజను (అక్టోబర్–డిసెంబర్ల మధ్య)లో కనీసం మూడు తుపానులు ఏర్పడుతుంటాయి. కానీ.. ఈ ఏడాది అంతకు మించి ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. 30 నుంచి భారీ వర్షాలకు అవకాశం మరోవైపు ఈశాన్య రుతుపవనాల ఆగమనానికి సూచికగా ఈ నెల 29 నుంచి రాష్ట్రంలో వర్షాలు మొదలు కానున్నాయి. 30వ తేదీ నుంచి భారీ వర్షాలకు ఆస్కారం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. అదే సమయంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. అది తీవ్రరూపం దాలిస్తే రాష్ట్రంలో విస్తారంగా వానలు కురుస్తాయి. -
Cyclone Sitrang: తుపానుగా మారిన వాయుగుండం
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తూర్పుమధ్య ప్రాంతానికి ఆనుకుని కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఆదివారం సాయంత్రానికి అదే ప్రాంతంలో తుపానుగా బలపడింది. దీనికి థాయ్‌లాండ్ సూచించిన ‘సిత్రాంగ్’ అనే పేరు పెట్టారు. ఆదివారం రాత్రి 8 గంటలకు ఈ తుపాను పోర్టుబ్లెయిర్‌కు వాయవ్యంగా 730 కి.మీ., పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపానికి దక్షిణంగా 580 కి.మీ., బంగ్లాదేశ్‌లోని బరిసాల్‌కు దక్షిణ నైరుతి దిశలో 740 కి.మీ. దూరంలో కొనసాగుతోంది. చదవండి: ఏపీ బడిబాటలో యూపీ ఇది ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తూ సోమవారం నాటికి తీవ్ర తుపానుగా మారనుంది. అనంతరం బంగ్లాదేశ్‌లోని టింకోనా ద్వీపం, సాండ్విప్ మధ్య బారిసాల్‌కు సమీపంలో ఈ నెల 25 వేకువజామున తీరాన్ని దాటుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం రాత్రి బులెటిన్‌లో వెల్లడించింది. -
అల్పపీడనం ఎఫెక్ట్.. ఐదు రోజుల్లో ఏపీకి అతి భారీ వర్ష సూచన
సాక్షి, అమరావతి: కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా వాగులు, చెరువులు పూర్తి స్థాయిలో నిండి అలుగులు పారుతున్నాయి. ఈ క్రమంలో ప్రజా రవాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పలుచోట్ల కాలనీలు సైతం నీట మునుగుతున్నాయి. కాగా, అక్టోబర్ 20వ తర్వాత ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ మరోసారి హెచ్చరించింది. అయితే, ఈ నెల 20న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అనంతరం, అల్పపీడనం బలపడి తీవ్ర వాయుగుండంగా మారి ఏపీ వైపు పయనిస్తుందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. దీంతో, రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు.. గుంటూరు జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేని భారీ వర్షం కురుస్తోంది. కాగా.. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కృష్ణా నదికి వరద ప్రవాహం పెరిగింది. ప్రకాశం బ్యారేజ్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజ్ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 4.13 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఇక, బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ముంపు ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కృష్ణా నదీపరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాల నేపథ్యంలో వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని విపత్తుల సంస్థ హెచ్చరించింది. -
ఏపీలో కుండపోత.. మరో రెండు రోజులు భారీ వర్షాలు
సాక్షి, అమరావతి: కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు వర్షాలు పడతాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. శుక్రవారం దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. శనివారం ఉత్తరాంధ్ర, రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపారు. వర్షాల కారణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. చదవండి: ‘సంక్షేమం’ ఖర్చులో ఏపీదే అగ్రస్థానం బుధ, గురువారాల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసినట్లు ఆంధ్రప్రదేశ్ విపత్తులు నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రకాశం జిల్లా కనిగిరిలో 14.40 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం కురిసింది. కనిగిరి మండలం ఏపీ మోడల్ స్కూల్ ప్రాంతంలో 14.27 సెంటీమీటర్లు, బాపట్ల జిల్లా నగరం పరిధిలో 13.80 సెంటీ మీటర్లు, ప్రకాశం జిల్లా పొదిలి మండలం అన్నవరంలో 13.05 సెంటీమీటర్లు, ఒంగోలు మండలం ఏరరేజర్ల ప్రాంతంలో 13 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన ప్రకాశం జిల్లా కంభం చెరువు పూర్తిస్థాయిలో నిండింది. -
ఏపీ వాసులకు అలర్ట్.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి విస్తరించాయి. ఏపీలో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళరాదని అధికారులు సూచించారు.తెలంగాణలోని అక్కడక్కడ తేలిక పాటి వర్షాలు పడతామని వాతావరణ శాఖ పేర్కొంది. చదవండి: టీడీపీ నేత లైంగిక వేధింపులు: బాలిక సెల్ఫీ వీడియో.. బయటపడ్డ షాకింగ్ నిజాలు -
ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో మూడు రోజులు వర్షాలు
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ బుధవారానికి ఏపీ తీరం వైపునకు పయనించే అవకాశం ఉంది. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న మూడు రోజులు కోస్తాంధ్రలో పలుచోట్ల, రాయలసీమలో ఒకటి, రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రాత్రి ప్రకటించింది. చదవండి: రామోజీ అర్ధసత్యాల ‘పంచాయితీ’ అదే సమయంలో కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతోపాటు పిడుగులు పడవచ్చని వివరించింది. మరోవైపు కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 45 కిలో మీటర్లు, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అందువల్ల సముద్రం అలజడిగా ఉంటుందని, రానున్న మూడు రోజులు మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని సూచించింది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు హుకుంపేట (వైఎస్సార్ జిల్లా)లో 3.5 సెం.మీ., కపిలేశ్వరపురం (డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా)లో 3.2, చాట్రాయి (ఏలూరు)లో 3.1, రాజానగరం (తూర్పుగోదావరి)లో 3, ఆళ్లగడ్డ (నంద్యాల జిల్లా)లో 2.9, జగ్గంపేట (కాకినాడ జిల్లా) 2.6, గొలుగొండ (అనకాపల్లి జిల్లా)లో 2.3 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది. -
మబ్బులు మసకేసి.. ఆకాశం ముసుగేసి..
సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఆవర్తనం ప్రభావంతో మంగళవారం గ్రేటర్ సిటీని కారుమబ్బులు కమ్మేశాయి. గరిష్టంగా 27.8 డిగ్రీలు, కనిష్టంగా 21.7 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు గాలిలో తేమ 83 శాతానికి చేరుకోవడంతో పాటు చలిగాలులు సిటీజన్లను వణికించాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. గచ్చిబౌలి పరిధిలోని ఖాజాగూడ వద్ద సాయంత్రం 6 గంటల వరకు అత్యధికంగా 1.5 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. పలు చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. రానున్న 24 గంటల్లో నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోయి వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో రోగులు, శ్వాసకోశ సమస్యలున్నవారు, వృద్ధులు, చిన్నారులు అవస్థలు పడ్డారు. (చదవండి: రాష్ట్రంలో భారీ వర్షాలు) -
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతువపనాలు మంగళ వారం నైరుతి రాజస్తాన్, దాన్ని ఆనుకుని ఉన్న కచ్ ప్రాంతాల నుంచి తొలగిపోయాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మంగళవారం ఉత్తర ఒడిశా–పశ్చిమ బెంగాల్ తీరం వద్ద కొనసాగు తుంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవ ర్తనం సగటు సముద్ర మట్టం నుంచి కొనసా గుతూ ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి వైపుకి వంపు తిరిగి ఉంది. ఈ అల్పపీడనం రాగల 48 గంటల్లో పశ్చిమ వాయ వ్య దిశగా కదులుతూ ఉత్తర ఒడిశా, ఉత్తర చత్తీస్‌గఢ్ మీదుగా వెళ్లే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో తెలంగాణలో బుధవారం నుంచి మూడ్రోజులు ఉరుములు మెరుపులతో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. కొన్నిచోట్ల తేలికపాటినుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. -
AP: ఈ జిల్లాలకు ఉరుములు, మెరుపులతో భారీ వర్ష సూచన
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కొనసాగుతోంది. రాబోయే 24 గంటల్లో అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉంది. దీంతో, ఏపీలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్ప పీడనం ప్రభావంతో కోస్తాలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తీరం వెంబడి గంటలకు 45 కిలోమీటర్ల వేగంలో గాలులు వీచే అవకాశం ఉందని.. ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలని వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక, రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం అక్కడక్కడా భారీవర్షాలు కురవగా చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. గడచిన 24 గంటల్లో పాలకోడేరులో 14 సెంటీమీటర్లు, నూజివీడులో 11, సెట్టిగుంటలో 10.3, పూసపాటిరేగ, బలిజపేటల్లో 9, భీమడోలు, భీమవరం, కళింగపటా్నల్లో 8, ఆళ్లగడ్డలో 7.8, ఇబ్రహీంపట్నంలో 7.4, చింతలపూడి, తెర్లాం, జియ్యమ్మవలసల్లో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
వాయుగుండంగా మారిన అల్పపీడనం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఆదివారం వాయుగుండంగా బలపడింది. అనంతరం ఉత్తర ఒడిశాకు ఆనుకుని పశ్చిమ, వాయవ్య దిశగా పశ్చిమ బెంగాల్ తీరం వైపు పయనించింది. ఆదివారం రాత్రికి జార్ఖండ్ వైపుగా వెళ్లి జంషెడ్‌పూర్‌కు 70 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. సోమవారం వరకు ఈ వాయుగుండం అదే దిశలో కదులుతూ.. అదే తీవ్రతను కొనసాగిస్తుందని ఐఎండీ తెలిపింది. వాయుగుండం జార్ఖండ్ వైపు మళ్లడంతో దాని ప్రభావం రాష్ట్రం పైన, ముఖ్యంగా ఉత్తరాంధ్రపై తగ్గిందని తెలిపింది. రానున్న రెండు రోజుల పాటు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలో ఒకటి, రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. -
Rain Alert : ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, హైదరాబాద్: ఉత్తర బంగాళాఖాతంలో ఈనెల 12న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తదుపరి 24 గంటల్లో బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు వివరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు సూచించింది. మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం గురువారం బలహీనపడింది. రానున్న రెండ్రోజులు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వివరించింది. నైరుతి సీజన్లో రాష్ట్రంలో ఇప్పటివరకు 43.6 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 79.36 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 82 శాతం అధిక వర్షపాతం నమోదైంది. (చదవండి: లక్ష్మీ పంపుహౌస్‌లో బయటపడిన మోటార్లు! 28 రోజుల తర్వాత) -
Rain Forecast: రాయలసీమలో మరో మూడు రోజులు భారీ వర్షాలు
సాక్షి, అమరావతి: రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు నుంచి తెలంగాణ వరకు రాయలసీమ మీదుగా విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ వర్షాలు పడుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గడచిన 24 గంటల్లో (సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి మంగళవారం ఉదయం 8.30 గంటల వరకు) శ్రీసత్యసాయి, అనంతపురం, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలో 13 సెంటీమీటర్ల అత్యధిక వర్షం కురిసింది. జూపాడు బంగ్లా మండలంలో 11.5, అన్నమయ్య జిల్లా బీరొంగి కొత్తకోట మండలంలో 10.6, అనంతపురం జిల్లా డి.హీరేలాల్ మండలంలో 10.4, విడపనకల్ మండలంలో 10.2, కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో 8.8, కర్నూలు అర్బన్, అన్నమయ్య జిల్లా కలికిరి మండలంలో 8.3, చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలో 7.4, అనంతపురం జిల్లా బొమ్మనహళ్ మండలంలో 7.3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మరో 3 రోజులపాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. -
ముంబైను ముంచెత్తుతున్న వర్షాలు... జలదిగ్బంధంలో నగరం
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కురుస్తున్న భారీ వర్షానికి రహదారులు, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మంగళవారం ఉదయం వీధుల్లో నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తెగ ఇబ్బందిపడ్డారు. సియాన్, అంధేరిలో రోడ్డుపై మోకాళ్ల లోతు నీళ్లు చేరుకున్నాయి. కొన్ని రూట్లలో రైళ్లు, బస్సు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. రాబోయే 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. మహారాష్ట్ర వ్యాప్తంగా ఆరు జిల్లాల్లో ఎల్లో అలెర్ట్ జారీ అయింది. ముంబైతో పాటు సమీప జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ దళాలు అప్రమత్తంగా ఉండాలని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ఆదేశించారు. మొదటి వర్షానికే పరిస్థితి ఇలా ఉంటే ఇక ముందుముందు తెరిపి లేకుండా భారీ వర్షాలు కురిస్తే ముంబై పరిస్ధితి ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. వర్షాకాలానికి ముందు బీఎంసీ రూ.కోట్లు ఖర్చుచేసి మురికి కాల్వలు, నాలాలు శుభ్రం చేయిస్తుంది. వర్షా కాలంలో వర్షపు నీరు సాఫీగా సముద్రంలోకి వెళ్లేందుకు వీలుగా పనులు చేపడుతుంది. కానీ ఇప్పటికే కురిసిన భారీ వర్షానికి దాదర్ సర్కిల్, ఫైవ్ గార్డెన్, హిందూకాలనీ, చెంబూర్, వడాల, రఫీ మహ్మద్ కిడ్వాయి మార్గ్ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. గతంలో నీరు నిల్వని ప్రాంతాల్లో కూడా ఇప్పుడు వర్షపు నీరు నిలిచిపోవడం మొదలైంది. వీటితోపాటు రెండు రోజుల కిందట సెంట్రల్ రైల్వే మార్గంలో థానే, కల్యాణ్ దిశగావెళ్లే లోకల్ రైలు సేవలు కొద్దిసేపు స్తంభించిపోయాయి. పశ్చిమ మార్గంలో అంధేరీ స్టేషన్ సమీపంలో ఉన్న సబ్వేలో కూడా వర్షపు నీరు చేరింది. మూడు అడుగుల మేర వర్షపు నీరు చేరడంతో గత్యంతరం లేక సబ్ వేను మూసివేయాల్సిన పరిస్ధితి వచ్చింది. చివరకు విద్యుత్ మోటర్ పంపుల ద్వారా నీటిని బయటకు తోడాల్సి వచ్చింది. నీరంత బయటకు తోడేసిన తరువాత మరమ్మతులు చేసి సబ్వేను పునఃప్రారంభించారు. అదేవిధంగా ముంబైలోని పేడర్ రోడ్‌పై కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ఈ రహదారిని పూర్తిగా మూసివేయాల్సి వచ్చింది. హిందూమాత, దాదర్, తిలక్ నగర్, గాంధీ మార్కెట్ ప్రాంతాల్లో నీరు నిలిచింది. దీంతో బీఎంసీ ఖర్చుచేసిన రూ.కోట్లు వృథా పోయినట్లు స్పష్టమైతోంది. ఏటా వర్షా కాలంలో హిందూమాత, దాదర్ టీటీ, పరేల్ టీటీ, అంధేరీలో మిలన్ సబ్వేలో వర్షపు నీరు చేరడం పరిపాటే. ఏటా వర్షా కాలంలో తమకు ఈ తిప్పలు తప్పవని స్ధానికులు వాపోతుంటారు. కాని బీఎంసీ మాత్రం మురికి కాల్వలు, నాలాలు వంద శాతం శుభ్రం చేశామని, ఈసారి వర్షా కాలంలో నీరు నిల్వదని ప్రగల్భాలు పలుకుతోంది. కానీ ఏటా వర్షా కాలంలో జరిగే పరిణామాల్లో ఏమాత్రం మార్పు ఉండదు. యథాతధంగా రోడ్లన్నీ జలమయం కావడం, లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడం, లోకల్ రైళ్లకు అంతరాయం కల్గడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి. #WATCH | Maharashtra: Sion area of Mumbai witnessed waterlogging in the wake of heavy rains in the city. Visuals from last night. pic.twitter.com/tjniUJ74RE — ANI (@ANI) July 5, 2022 (చదవండి: స్పైస్ జెట్‌లో తలెత్తిన సాంకేతిక లోపం...కరాచీలో అత్యవసర ల్యాండింగ్) -
వాతావరణంలో వేగంగా మార్పులు...త్వరలోనే
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు సోమవారం అండమాన్, నికోబార్ దీవులతోపాటు దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించినట్టు వాతావరణశాఖ ప్రకటించింది. రానున్న రెండ్రోజుల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలోకి వ్యాప్తి చెందుతాయని పేర్కొంది. రుతుపవనాల రాకతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలిపింది. దీని ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయని తెలి పింది. కానీ వాతావరణంలో తేమశాతం ఎక్కువగా ఉండటంతో ఉక్కపోత, అధిక ఉష్ణోగ్రత అనుభూతి ఉంటుందని వెల్లడించింది. రాష్ట్రంలో సోమవారం నల్లగొండలో అత్యధికంగా 41.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టు తెలిపింది. వచ్చే రెండు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వానలు పడతాయని ప్రకటించింది. -
తీవ్ర రూపం దాల్చుతున్న అసనీ తుపాను... భారీ నుంచి అతి భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాన్ మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం విశాఖపట్నానికి ఆగ్నేయంగా 300 కిలోమీటర్లు, కాకినాడకి 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుపాను పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందని, ఆ తర్వాత క్రమంగా దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ బలహీనపడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ తుపాను కారణంగా ఈ రోజు రాత్రి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా, ఒడిశాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ఓడరేవుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ తుఫాన్ హెచ్చరికల అధికారి జగన్నాథ కుమార్ సూచించారు. విమాన కార్యకలాపాలు రద్దు ఈ తుపాను కారణంగా మే 10న చెన్నై, విశాఖపట్నంలో పలు విమానయాన సంస్థలతో వివిధ విమాన కార్యకలాపాలను రద్దు చేసినట్లు ఏమియేషన్ అధికారులు తెలిపారు. ప్రతికూల వాతావరణం కారణంగా 23 ఇండిగో విమానాలు రాకపోకలను రద్దు చేసినట్లు విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. అంతేకాదు నాలుగు ఎయిర్ఏషియా విమానాలు కూడా రద్దు చేసినట్లు కూడా వెల్లడించారు. (చదవండి: బెంబేలెత్తిస్తున్న ‘అసని’ తుపాన్.. అసలు ఆ పేరు ఎలా వచ్చిందంటే?) -
Weather Report: ఏపీకి ఐఎండీ చల్లని కబురు..
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఏటా జూన్ నుంచి మొదలయ్యే నైరుతి రుతుపవనాల సీజను ఈ ఏడాది రాష్ట్రంలో సాధారణానికి మించి వర్షాలను కురిపిస్తుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) చల్లని కబురు చెప్పింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది సాధారణ వర్షాలే కురుస్తాయని తాజాగా వెల్లడించినా రాష్ట్రానికి మాత్రం సమృద్ధిగా వానలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. ఈ వార్త ఇటు రైతాంగానికి, ప్రభుత్వానికి ఎంతో ఊరటనిస్తోంది. గడచిన మూడేళ్లుగా రాష్ట్రంలో ఇటు నైరుతి, అటు ఈశాన్య రుతుపవనాలు మంచి వర్షాలే కురిపిస్తున్నాయి. ఫలితంగా పంటల దిగుబడులు ఆశాజనకంగా ఉంటున్నాయి. గత ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లో రాష్ట్రంలో సాధారణం కంటే 19 శాతం అధిక వర్షపాతం నమోదైంది. చదవండి: సర్ప్రైజ్ అంటూ కళ్లు మూసుకోమని కాబోయే భర్త గొంతు కోసి.. 2021లో ఈ జిల్లాల్లో అధికం ఇక రాష్ట్రంలో నైరుతి సీజనులో సగటు సాధారణ వర్షపాతం 514 మిల్లీమీటర్లు కాగా.. 2021లో (జూన్–సెపె్టంబర్) 613.3 మిల్లీమీటర్లు (+19 శాతం) కురిసింది. కడప, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదైంది. అనంతపురం, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో సాధారణ వర్షపాతం రికార్డయింది. -
ఈ ఏడాది వేసవి బాధించదు: ఐఎండీ
న్యూఢిల్లీ: ఈ ఏడాది వేసవి అంతగా బాధించే అవకాశాల్లేవని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఉత్తర భారతంలో గరిష్ట స్థాయి ఉష్ట్రోగతలు తక్కువగానే నమోదవుతాయని మంగళవారం వెల్లడించింది. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, బిహార్లలో మార్చి నుంచి మే వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదవుతాయని తెలిపింది. తూర్పు, ఈశాన్య, ఉత్తర భారతం, గంగా నది మైదాన ప్రాంతాల్లో వడ గాడ్పులు సాధారణం కంటే తక్కువగానే ఉంటాయని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్రో చెప్పారు. పశ్చిమ, వాయవ్య భారతాన్ని ఈ వేసవిలో వడగాడ్పులు బాధిస్తాయని, కానీ ఉత్తర భారతంలో అంతగా ఉండవని తెలిపారు. -
గట్టి కంపెనీలుగా గూగుల్, టెస్లా
IMD Research On Future Readiness Companies: భవిష్యత్‌లో పరిస్థితులను ఎదుర్కొనేందుకు తగు వ్యూహాలతో సన్నద్ధంగా ఉన్న కంపెనీల జాబితాలో టెస్లా, లులులెమన్, మాస్టర్‌కార్డ్, గూగుల్ అగ్రస్థానంలో ఉన్నాయి. స్విట్జర్లాండ్‌కి చెందిన ఇనిస్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ (ఐఎండీ) రూపొందించిన నివేదికలో ఈ అంశం వెల్లడైంది. ఫ్యాషన్..రిటైల్, ఆటోమోటివ్, ఆర్థిక సేవలు, టెక్నాలజీ అనే నాలుగు రంగాల్లో అ త్యధికంగా ఆదాయాలు ఆర్జిస్తున్న 86 లిస్టెడ్ కంపెనీలను వాటి పోటీ కంపెనీలతో పోల్చి, భవిష్యత్‌ను ఎదుర్కొనేందుకు అవి ఎంత సంసి ద్ధంగా ఉన్నాయి, వాటి నిలదొక్కుకునే సామర్థ్యా లేమిటి తదితర అంశాలను అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించారు. ఇందుకోసం దశాబ్ద కాలం (2010–2021) పైగా డేటాను పరిశీలించారు. ఈ జాబితాలో 40 అమెరికన్ కంపెనీలు, చైనా.. జర్మనీ నుంచి చెరి ఏడు, ఫ్రాన్స్.. జపాన్ నుంచి చెరి ఆరు కంపెనీలకు చోటు దక్కింది. నివేదిక ప్ర కారం ఫ్యాషన్.. రిటైల్‌లో లులులెమన్, నైకీ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఆటోమోటివ్ సెగ్మెంట్లో టెస్లా, టయోటా టాప్ 2 స్థానాల్లో నిల్చా యి. ఆర్థిక సేవల విభాగంలో మాస్టర్‌కార్డ్, వీసా తొలి రెండు ర్యాంకుల్లో ఉన్నాయి. టెక్నాలజీ లో గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ టాప్ 3లో నిలిచినట్లు ఇనిస్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ నివేదిక పేర్కొంది. భారత్ కంపెనీలు ఎందుకు లేవంటే.. ఐఎండీ లిస్టులో భారత కంపెనీలేవీ చోటు దక్కించుకోలేకపోయాయి. ఇందుకు భారత్‌లో మౌలిక సదుపాయాలపరమైన సమస్యలే కారణమని నివేదికను రూపొందించిన ప్రొఫెసర్ హోవార్డ్ యు తెలిపారు. ‘ఆటోమోటివ్ రంగంలోని టాప్ కంపెనీల్లో భారత్ నుంచి ఒక్కటి కూడా లేవు. అలాగని టాటా, మహీంద్రా వంటి దిగ్గజాలు కొత్తవి ఆవిష్కరించలేవని కాదు. అవి చేయగలవు. కానీ రేపటితరం స్మార్ట్ వాహనాలన్నీ నగరంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అనుసంధానించే సాఫ్ట్వేర్, ఎలక్ట్రానిక్స్‌పై ఆధారపడి ఉంటాయి. ఎలక్ట్రిక్ వాహనాలు అమ్మకాలు పుంజుకోవాలన్నా సూపర్‌చార్జర్ల విస్తృత నెట్వర్క్ అవసరమవుతుంది. చైనాలోని ఎన్ఐవో, బీవైడీ వంటి ఆటోమోటివ్ సంస్థలు తమ సొంత నెట్‌వర్క్‌తో పాటు ప్రభుత్వ మౌలిక సదుపాయాల వల్ల కూడా ప్రయోజనం పొందుతుంటాయి. ప్రభుత్వ స్థాయిలో మద్దతు లేకుండా ఎన్ఐవో సొంతంగా బ్యాటరీ మార్పిడి స్టేషన్లను అభివృద్ధి చేయడం అసాధ్యం. కాబట్టి భారత్‌లోనూ అదే తరహాలో మౌలిక సదుపాయాల కల్పనల సమస్యల పరిష్కారంపై రాష్ట్రాల ప్రభుత్వాలు మరింతగా దృష్టి పెట్టాలి‘ అని హొవార్డ్ పేర్కొన్నారు. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేయడంలో అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోవడానికి భారత్‌కి ఇంకా సమయం పడుతుందని ఆయన తెలిపారు. అయితే, యూనికార్న్‌ల (1 బిలియన్ డాలర్ల పైగా వేల్యుయేషన్ గల స్టార్టప్‌లు) సంఖ్యాపరంగా భారత్, ఈ ఏడాది చైనాను అధిగమించిందని హొవార్డ్ తెలిపారు. ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, ఓలా వంటి వంటివి దేశీ స్టార్టప్ వ్యవస్థలో పెను సంచలనాలు సృష్టించాయని పేర్కొన్నారు. చదవండి: టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎలన్ మస్క్ -
వాయు గుండం ప్రభావం: భారీ నుంచి అతి భారీ వర్షాలు..
AP Rain Forecast: నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం తీరం దాటినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల మధ్య పుదుచ్చేరి - చెన్నై సమీపంలో తీరందాటిందని తెలిపింది. అయితే, వాయు గుండం ప్రభావంతో.. నేడు దక్షిణ కోస్తా, రాయలసీమ సమీపంలో విస్తారంగాను, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో.. తీరంవెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. వేటకు వెళ్లకూడదని మత్స్యకారులను అధికారులు ఆదేశించారు. కాగా, ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకుని సహయ కార్యక్రమాలు చేపట్టాయని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్ కె. కన్నబాబు సూచించారు. (చదవండి: కాకినాడ యాంకరేజి పోర్టు: ఎక్స్‌పోర్ట్‌లో నెంబర్ 1 ) -
Tamil Nadu: మరో వరుణ‘గండం’!
రాష్ట్రానికి మరో వరుణ‘గండం’ ఎదురుకానుంది. ఇప్పటికే అల్పపీడనాలు, ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో దాదాపు అన్ని జిల్లాలోనూ భారీ వర్షాలు కురిశాయి. ఫలితంగా రోడ్లు దెబ్బతినడంతో పాటు పంటనష్టం వాటిల్లింది. ఇక లోతట్టు ప్రాంతాలు నీట మునిగి ప్రజలు అవస్థలు పడ్డారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో ముప్పు రానుంది. వాయుగుండం కారణంగా నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధనా కేంద్రం స్పష్టంచేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సాక్షి, చెన్నై(తమిళనాడు): తమిళనాడులో మళ్లీ భారీ వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలోని అండమాన్ దీవుల సమీపంలో కేంద్రీకృతమైన అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. ఇది ఉత్తర తమిళనాడు–దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లోని సముద్రతీర ప్రాంతాల మీదుగా ఈనెల 18వ తేదీన తీరం దాటనుంది. ఫలితంగా మంగళవారం అర్ధరాత్రి లేదా బుధవారం తెల్లవారుజాము నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెన్నై వాతావరణ పరిశోధనా కేంద్రం సంచాలకులు పువియరసన్ ప్రకటించారు. దీని ప్రభావంతో చెన్నై సహా పలు జిల్లాల్లో 17,18 తేదీల్లో భారీ వర్షాలు పడుతాయి. 17వ తేదీన చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, సేలం, అరియలూరు, పెరంబలూరు, పుదు చ్చేరి రాష్ట్రంలోని కారైక్కాల్ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయి. అలాగే 18వ తేదీన చెన్నై, తిరువళ్లూరు, రాణీపేట్టై, కాంచీపురం, సేలం, ధర్మపురం, కృష్ణగిరి, కల్లకురిచ్చి, ఈరోడ్, కడలూ రు, అరియలూరు, పెరంబలూరు, తిరుచ్చిరాపల్లి, విళుపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలకు అవకాశం ఉంది. అండగా ఉంటాం.. భారీ వర్షాల వల్ల పంట దెబ్బతిని నష్టపోయిన వారికి అండగా ఉంటాం.. ఆదుకుంటామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హామీ ఇచ్చారు. చేతికొచ్చిన పంటను కోల్పోయిన వ్యవసాయ కుటుంబాలకు హెక్టారుకు రూ.20వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈశాన్య రుతువపనాల ప్రభావంతో సుమారు 15 రోజులపాటూ విరుచుకుపడిన భారీ వర్షాలు రాష్ట్రాన్ని కుదిపేశాయని దీంతో జన జీవనం అతలాకుతలమై పోయిందన్నారు. వర్షాలు అదుపులోకి వచ్చిన తరుణంలో ఏడుగురు మంత్రులు, పలువురు ఐఏఎస్ అధికారులతో నియమించిన సర్వే బృందం ఈనెల 12వ తేదీన డెల్టా జిల్లాల్లో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసింది. ఇందుకు సంబంధించిన నివేదికను ఆ బృందం సీఎంకు మంగళవారం సమర్పించింది. ఈ నివేదికపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరయన్బు, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన అనంతరం సీఎం స్టాలిన్ ఓ ప్రకటన విడుదల చేశారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటకు హెక్టారుకు రూ.20వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని తీర్మానించినట్లు సీఎం చెప్పారు. నీట మునిగిన పంటకు సంబంధించి.. నష్టపోయిన రైతులకు అవసరమైన మేరకు వ్యవసాయ పనిముట్లు అందజేయాలని, అలాగే ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు సరఫరా చేయాలని ఆదేశించారు. దెబ్బతిన్నరోడ్లు, సైడు కాలువల మరమ్మతుల కోసం రూ.300 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఇక చెన్నైలో బుధవారం నుంచి మళ్లీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్తల దృష్ట్యా నగరానికి తాగునీటి సరఫరా చేసే చెంబరబాక్కం, పుళల్, పూండి చెరువుల నుంచి బుధవారం ఉపరితల నీటిని విడుదల చేశారు. వరద ముంపు బాధిత ప్రాంతాల పునరుద్ధరణ పనులు బుధవారంతో పూర్తవుతాయని చెన్నై కార్పొరేషన్ కమిషనర్ గగన్‌దీప్‌సింగ్ బేడీ మీడియాకు తెలిపారు. -
మరో నాలుగు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు..
సాక్షి, చెన్నై(తమిళనాడు): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి అండమాన్ సముద్రం మధ్యలో కేంద్రీకృతమై ఉంది, ఈ ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలో మరో 4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెన్నై వాతావరణ పరిశోధనాకేంద్రం ఆదివారం ప్రకటించింది. వచ్చే 48 గంటల్లో చెన్నై నగరం మేఘావృతమై ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వానలు పడే అవకాశం ఉంది. కన్యాకుమారిపై తీవ్ర ప్రభావం.. గత 11 రోజులుగా భారీ వర్షాలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా కన్యాకుమారి జిల్లా భారీ నష్టాన్ని చవిచూసింది. 50 వేల ఇళ్లు నీటమునిగాయి. ఇంకా భారీ వర్షాలు పడే ప్రమాదం ఉన్నందున కన్యాకుమారి జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. సేలం జిల్లాల్లోని మేట్టూరు డ్యామ్ నిండు కుండలా మారింది. కావేరి నది నీటి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా శనివారం రాత్రి 11.35 గంటలకు మేట్టూరు డ్యాం పూర్తి నీటి సామర్థ్యం (120 అడుగులు)కి చేరింది. ప్రజా పనుల శాఖ అధికారులు ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు 93.47 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సెకనుకు 25,150 ఘనపుటడుగుల నీరు చేరుతోంది. సెకనుకు 25,150 ఘనపుటడుగుల నీటిని విడుదల చేస్తుండగా, 286 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. కావేరినదీ పరివాహక ప్రాంతాల్లో.. కావేరి నది తీర ప్రాంతంలోని 12 జిల్లాలకు వరద ప్రమాదం ఉండటంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా హెచ్చరికలు జారీ చేశారు. చెన్నైలో దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులు 90 శాతం పూర్తయినట్లు చెన్నై కార్పొరేషన్ అధికారులు తెలిపారు. 22 సబ్వేలలో ట్రాఫిక్‌ను పునరుద్ధరించామని చెప్పారు. అయితే వాస్తవానికి చెన్నైలోని 70 వీధుల్లో వరదనీటి ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఆదివారం రాత్రి లోగా వాటిని తొలగిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. పీఎం సహాయాన్ని కోరుతా : సీఎం స్టాలిన్ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టం అంచనా నివేదిక అందిన తరువాత ప్రధాని నరేంద్రమోదీకి లేఖరాసి సహాయాన్ని కోరనున్నట్లు సీఎం స్టాలిన్ తెలిపారు. పార్లమెంట్ సభ్యులను స్వయంగా పంపి వరద సహాయక చర్యల నిమిత్తం నిధులను కోరుతామని చెప్పారు. వరద సహాయక చర్యలను సమీక్షించేందుకు సీఎం స్టాలిన్ చెన్నై సచివాలయంలో ఉన్నతాధికారులతో ఆదివారం సమావేశమై పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. -
TS: రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు
అదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీగా వర్షపాతం నమోదైంది. జిల్లాలోని పలు మండలాల్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. బోథ్, ఇచ్చోడ, నేరెడిగొండ, సిరికొండ బజార్హత్నూర్, గుడిహత్నూర్‌లో వర్షం కారణంగా పరీవాహక ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి. అదే క్రమంలో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచనలు చేశారు. నిర్మల్: కుంటాలలో ఎడతెరిపిలేని వర్షం వల్ల వెంకూర్ చెరువుకట్ట తెగింది. బాసర మండలంలో వర్షం కారణంగా లోతట్టుప్రాంతాలన్నీ జలమయంతో పాటు పలు ఇళ్లలోకి వరదనీరు చేరింది. గ్రామాల్లో మురుగుకాల్వలు, ప్రధాన రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. టాక్లి, కిర్గుల్(బి) ప్రధాన కాల్వల ద్వారా వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో ఆ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ వర్షాల వల్ల పత్తి, సోయా, మినుము పంటలు మునిగాయి. కామారెడ్డి: జుక్కల్ నియోజకవర్గంలో మూడు రోజులుగా ఎడతెరిపిలేని వర్షాల వల్ల చెరువులు, కుంటలు పూర్తిగా నిండాయి. నల్గొండ: దేవరకొండ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో వర్షాలు జనజీవనాన్ని స్తంభింపచేశాయి. యాదాద్రి సమీపాన రెండో ఘాట్ రోడ్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో భక్తులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వెంటనే ఆ రాళ్లను అధికారులు తొలగిస్తున్నారు. నిజామాబాద్: జిల్లాలో వానల కారణంగా సిరికొండలో కప్పలవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఖమ్మం: మూడు రోజులుగా వర్షం కురుస్తునే ఉంది. దీంతో సత్తుపల్లిలో జేవీఆర్ ఓసీలో 25 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, భద్రాద్రి కొత్తగూడెంలో జి.కె.6 ఓపెన్‌కాస్ట్‌లో 6 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, ఇల్లందు సింగరేణి జెకె5, కోయగూడెం ఓసీ గనుల్లో 28 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి పెరుగుతోంది. నల్గొండ: జిల్లాలో మిర్యాలగూడ పరిధి వేములపల్లి, మిర్యాలగూడ, దామరచర్ల.. అడవిదేవులపల్లి, మాడుగులపల్లి మండలాల్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. సిద్దిపేటలో ఎడతెరిపిలేని వర్షం వల్ల కుడవెళ్లి వాగు పొంగిపొర్లుతోంది. -
వడగాలుల ముప్పు; ఉత్తర భారతదేశానికి ఐఎండీ హెచ్చరిక
ఢిల్లీ: ఉత్తర భారతదేశానికి వడగాలుల ముప్పు ఉందంటూ భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గురువారం హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్తాన్ నుంచి వాయువ్య భారతదేశం దిశగా వీస్తున్న పొడిగాలుల ప్రభావంతో ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. దీంతో రానున్న రెండు రోజుల్లో తీవ్ర వేడి గాలులు వీస్తాయని తెలిపింది. ముఖ్యంగా ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్‌పై వేడి గాలుల ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఇప్పటికే జమ్మూకశ్మీర్‌లో పలు చోట్ల వేడి గాలులు వీస్తున్నట్లు ఐఎండీ గుర్తించింది. పాకిస్తాన్లో పొడి గాలులతో ఉష్టోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 6.5 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ స్పష్టం చేసింది. ఇదే విషయమై ఐఎండీ అధికార ప్రతినిధి కుల్దీప్ శ్రీవాత్సవ స్పందించారు. '' మైదాన ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు "హీట్ వేవ్'' అని ప్రకటిస్తాం. ప్రస్తుత పరిస్థితుల దృశ్యా వర్షాకాలం సీజన్లోనూ 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.సాధారణంగా, జూన్ 20 వరకు దేశ రాజధాని సహా పలు ప్రాంతాల్లో వేడి తరంగాలు రావడం సహజమే. కానీ ఈసారి గరిష్ట ఉష్ణోగ్రత పెరగడం వెనుక రుతుపవనాల రాక ఆలస్యం కావడమే కారణం'' అని చెప్పుకొచ్చారు. ఇక అమెరికాతో పాటు కెనడాలో ఎండలు మండిపోతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా నమోదవుతుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గత నాలుగైదు రోజుల్లోనే వడగాడ్పులకు తాళలేక కెనడాలోని వెన్కౌర్ ప్రాంతంలో 200 మందికి పైగా మృతి చెందారు. ఫసిఫిక్ మహాసముద్రంలో వాతావరణంలోని మార్పుల కారణంగా తీవ్రమైన ఒత్తిడి వల్ల హీట్ డోమ్ ఏర్పడడంతో అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి కెనడాలోని ఆర్కిటిక్ ప్రాంతాల వరకు ఎండలు భగభగలాడుతున్నట్టుగా బెర్కెలే ఎర్త్‌కి చెందిన పర్యావరణ శాస్త్రవేత్త జెకె హస్ఫాదర్ చెప్పారు -
ఊపందుకోని ‘నైరుతి’.. ఆందోళనలో రైతులోకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నైరుతి రుతుపవ నాలు అంతగా ప్రభావం చూపించడం లేదు. సీజన్ ప్రారంభంలో చురుకుగా వ్యాప్తి చెందడంతో రాష్ట్రమంతటా భారీ వర్షాలు పడతాయని వాతా వరణ శాఖ హెచ్చరించింది. బంగాళా ఖాతంలో జూన్ రెండోవారంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభా వంతో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదవు తాయనే సూచనలు కూడా వచ్చాయి. దీంతో అన్ని ప్రభుత్వ విభాగాలు అప్రమత్తమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం సాగు పనులకు సిద్ధమైంది. కానీ ఒకట్రెండు చోట్ల మాత్రమే భారీ వర్షాలు పడగా చాలాచోట్ల తేలికపాటి వానలు ఉసూరుమని పించాయి. అడపాదడపా తేలికపాటి జల్లులే పడుతున్నాయి మినహా భారీ వర్షాల జాడే లేదు. అక్కడి వాతావరణ పరిస్థితులే మూలం రాష్ట్రంలో సీజనల్ వర్షాలకు మూలం బంగాళా ఖాతం, అరేబియా సముద్రంలోని వాతా వరణ పరిస్థితులే. అక్కడ ఏర్పడే ఉపరితల ఆవర్త నాలు, ఉపరితల ద్రోణులు, అల్పపీడనాలు తదితర పరి స్థితులతో రాష్ట్రంలో వర్షాలు నమోదవుతాయి. గత నాలుగైదు రోజులుగా రాష్ట్రంలో పొడి వాతావర ణమే ఉంటోంది. ప్రస్తుతం బంగాళా ఖాతం, అరేబియా సముద్రంలో వాతావరణం స్థిరంగా ఉంది. ఎలాంటి మార్పులు లేవు. మరోవైపు రాష్ట్రానికి తక్కువ ఎత్తు నుంచి బలమైన గాలులు వీస్తుండడం కూడా రుతుపవనాల కదలికలపై ప్రభావం చూపు తున్నాయి. మరో నాలుగైదు రోజులు ఇదే వాతా వరణ పరిస్థితులు కొనసాగే అవకాశమున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వేచి చూసి సాగు చేయండి రాష్ట్ర రైతాంగానికి ఈ సీజన్ కీలకమైంది. మెట్ట పంటలన్నీ వర్షాలపై ఆధారపడి సాగు చేస్తారు. తొలకరి సమయంలో కురిసే వర్షాల తీరును బట్టి విత్తనాలు వేస్తారు. ఈసారి తొలకరి ఊరించినప్పటికీ.. చాలాచోట్ల విత్తు విత్తే స్థాయిలో వర్షాలు కురవలేదని అధికా రులు చెబుతున్నారు. మరో 4,5 రోజులు వేచి చూసి సంతృప్తికర వర్షాలు కురిసిన తర్వాతే సాగు పనులు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. -
న్యూఢిల్లీ: 70 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి..
న్యూఢిల్లీ: రెండురోజుల నుంచి కురుస్తున్న వర్షాలు, వాతావరణంలో మార్పులు కారణంగా దేశరాజధానిలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గుముఖం పట్టాయి. దీంతో ఢిల్లీ నగరం కాస్త చల్లబడడంతో మే నెలలో ఏకంగా ఉష్ణోగ్రతలు 16 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. దీంతో గత 70 ఏళ్లలో మే నెలలో ఇంత స్వల్ప స్థాయికి చేరడం ఇదే తొలిసారని వాతావరణ శాఖ తెలిపింది. ఇటీవల కాలంలో కాలుష్యం కారణంగా నగరాల్లో ఉష్ణోగ్రతలు ప్రతీ ఏటా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు 1951లో నమోదైన 23.8 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలే అత్యల్పంగా ఉండేది. కానీ ప్రసుత టౌటే తుపాను ప్రభావం వర్షాలు కురవడం వాతావరణం చల్లబడడంతో దేశరాజధానిలో 70 ఏళ్ల రికార్డు చెరిగిపోయిందని ఐఎండీ ప్రాంతీయ అంచనా కేంద్రం అధిపతి కుల్దీప్ శ్రీవాస్తవ అన్నారు. ఈ మధ్యలో 1982 మే 13 న 24.8 డిగ్రీల సెల్సియస్ కనిష్ట స్థాయి నమోదైందని ఆయన చెప్పారు. కానీ ప్రస్తుత నమోదైన ఉష్ణోగ్రత 1951 కంటే అత్యల్పమని ఆయన అన్నారు. 35 ఏళ్ల తర్వాత అత్యధిక వర్షాలు ఢిల్లీలో టౌటే తుపాను కారణంగా బుధవారం రాత్రి 8.30 గంటల వరకు 60 మిల్లీ మీటర్ల వర్షాపాతం నమోదైంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తర రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్‌లలో బుధవారం కురిసిన వర్షపాతం టౌటే తుపాను, పాశ్చాత్య కారణాల ఫలితంగా ఏర్పడిందని ఐఎండి తెలిపింది. ఇంతకుముందు 1976 లో మే 24 న 24 గంటల వ్యవధిలో రాజధాని 60 మిమీ వర్షపాతం నమోదైంది. నిన్నటి వర్షపాతంతో, ఇప్పటి వరకు ఉన్న మునపటి గణాంకాలను ఇది చెరిపేసిందని జాతీయ వాతావరణ అంచనా కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త ఆర్.కె జెనమణి అన్నారు. మే నెలలో వాతావరణం పొడిగా ఉంటుంది, సాధారణంగా ఈ నెలలో ఢిల్లీలో గరిష్ఠంగా 30-40 మిల్లీ మీటర్ల వర్షం (24గంటల్లో) నమోదవుతుందని అధికారులు పేర్కొన్నారు. అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన తుఫానుకు పాశ్చాత్య అవాంతరాలు తోడవడంతో రికార్డు స్థాయిలో వర్షాపాతం నమోదైందని ఆయన చెప్పారు. చదవండి: ఢిల్లీ సీఎం ట్వీట్‌పై సింగపూర్ విదేశాంగ మంత్రి ఫైర్ -
రెడ్ అలర్ట్: ముంచుకొస్తున్న తుపాను..
కేరళ: తౌక్టే తుపాను నేపథ్యంలో కేరళలో రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. కేరళ, కర్ణాటక పశ్చిమ తీరంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొల్లాం జిల్లాలో తుపాను ధాటికి చెట్లు నేలకొరిగాయి. వయనాడ్, ఇడుక్కి జిల్లాల్లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. కేరళలో లోతట్టు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. గోవాకు 350 కి.మీ దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. తౌక్టే తుపాను గుజరాత్ తీరం వైపు కదులుతూ బలపడుతుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. చదవండి: Arabian Sea: వాయుగుండంగా మారిన అల్పపీడనం Israel vs Hamas: కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు! -
Arabian Sea: వాయుగుండంగా మారిన అల్పపీడనం
న్యూఢిల్లీ: అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ప్రస్తుతం దక్షిణ గుజరాత్ తీరప్రాతానికి 920 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. క్రమంగా అల్పపీడనం బలపడి ఈ నెల 16 నాటికి తుపాన్‌గానూ, ఆ తర్వాత మరింత బలపడి తీవ్ర, అతి తీవ్ర తుపాన్‌గా రూపాంతరం చెందుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది రానున్న నాలుగు రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడున్నాయని పేర్కొంది. ఈ తుపానుకు 'తౌక్టే' అని నామకరణం చేసినట్టు తెలుస్తోంది. 'తౌక్టే' తీవ్ర తుపానుగా మారి ఈనెల 18న గుజరాత్ వద్ద తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అదే విధంగా తౌక్టే' తుపాన్ ప్రభావంతో కేరళలో భారీ వర్షాలుకురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏపీ, యానాం, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రపై తుపాను ప్రభావం ఉండనుందని, అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాల్లో ‘తౌక్టే’ ప్రభావం అరేబియా సముద్రంలో లక్షద్వీప్ వద్ద అల్పపీడనం కొనసాగుతోంది. దక్షిణ గుజరాత్ తీర ప్రాంతానికి 920 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుఫాన్.. మరో 12 గంటల్లో తీవ్రమైన తుఫానుగా రూపాంతరం చెందనుందని వాతావరణ కేంద్ర తెలిపింది. ఆ తర్వాత అతి తీవ్ర తుపాన్‌గా మారే అవకాశం ఉందని. గుజరాత్ పరిసరాల్లో తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. తుఫాను ప్రభావంతో ఏపీ, తెలంగాణ, రాయలసీమ పలు ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయని, ఋతుపవనాల రాకకు ఇది శుభ సంకేతమని వాతావరణ శాఖ పేర్కొంది. చదవండి: తుఫాన్ అలర్ట్: దూసుకొస్తున్న ‘తౌక్టే’ -
ఏపీలో రేపు, ఎల్లుండి వర్షాలు
సాక్షి, అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రెండు రోజులు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. రేపు(సోమవారం) ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో మోస్తరు భారీ వర్షాలు.. కృష్ణా, గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఎల్లుండి (మంగళవారం) నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు భారీ వర్షాలు.. ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి వర్షాలు పడే అవకాశముందని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కన్నబాబు తెలిపారు. -
నేడు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షం
సాక్షి ప్రతినిధి, చెన్నై/మహారాణిపేట (విశాఖ దక్షిణ)/తిరుమల: బురేవి తుపాను వాయుగుండంగా బలహీన పడి మన్నార్ గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతోంది. తమిళనాడులో భారీ వర్షాలతో 17 జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. 9 మంది మరణించారు. బురేవి శనివారం మ.12 గంటలకు దక్షిణ, వాయవ్య దిశగా కేరళ వైపు పయనిస్తూ తీరందాటే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. శని, ఆదివారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కాగా, తిరుమలలో ఈ సంవత్సరం రికార్డుస్థాయిలో 1,750 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పటికే తిరుమలలో అన్ని డ్యామ్‌లు నిండుకుండలను తలపిస్తున్నాయి. -
ముంబైలో భారీ వర్షం
-
ముంబైలో రెండు రోజుల పాటు అన్ని బంద్!
ముంబై: భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముంబై నగరానికి రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరో రెండు రోజులు పాటు భారీ వర్షాలు కొనసాగుతాయని హెచ్చరిక జారీ చేసింది. రాబోయే రెండు రోజుల్లో ముంబై, దాని శివారు ప్రాంతాల్లో వర్షాలు తీవ్రమవుతాయని ఐఎండీ అంచనా వేస్తోంది. మంగళవారం మధ్యాహ్నం 12:47 గంటలకు 4.51 మీటర్ల ఎత్తైన ఆటుపోట్లు వస్తాయని తెలిపింది. అరేబియా సముద్రంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా, సోమవారం ముంబైలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో అనేక సేవలకు అంతరాయం కలిగింది. గత 10 గంటల్లో ముంబైలో 230 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ముంబై మున్సిపల్‌కార్పొరేషన్ తెలిపింది. ఐఎండీ ఇచ్చిన హెచ్చరికలతో అత్యవసర సేవలు మినహా మిగిలిన కార్యాలయాలన్నింటికి ముంబై ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అత్యవసరమైతే తప్ప రెండు రోజుల పాటు ఎవరు ఇళ్లు దాటి బయటకు రావద్దని విజ్ఞప్తి చేసింది. Owing to the heavy rainfall since last night and forecasts of extremely heavy rain by @IndiaMetDept, all offices and establishments in Mumbai, except emergency services, will remain closed.#MyBMCUpdates#MyBMCMonsoonUpdates — माझी Mumbai, आपली BMC (@mybmc) August 4, 2020 చదవండి: బిహార్‌కు మరో చేదు వార్త -
ముంబైలో భారీ నుంచి అతిభారీ వర్షాలు
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై ఇప్పటికే వర్షంలో తడిసి ముద్దవుతున్న వేళ భారత వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. ముంబైతో పాటు థానే, రాయ్‌గఢ్, రత్నగిరి జిల్లాల్లో రానున్న 18 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు మంగళవారం నాటి ఆరెంజ్ అలెర్ట్‌ను రెడ్ అలెర్డ్‌గా మారుస్తూ బుధవారం ప్రత్యేక బులెటిన్ విడుదల చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. గురువారం కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. కాగా మంగళవారం రాత్రి నుంచి ముంబైలో కుండపోతగా వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యుత్, మంచినీటి సరఫరా, రవాణా వ్యవస్థకు అంతరాయం కలిగే అవకాశం ఉందని, లోతట్లు, తీర ప్రాంతాలకు వెళ్లొదని బ్రిహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. -
కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
-
మాన్సూన్ వచ్చేసింది..
-
గుడ్‌న్యూస్ : కేరళను తాకిన రుతుపవనాలు
తిరువనంతరం : మండే ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు చల్లని కబురు అందింది. కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) సోమవారం వెల్లడించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కేరళలోని 9 జిల్లాలకు ఐఎండీ యల్లో అలర్ట్ జారీ చేసింది. తిరువనంతపురం, కొల్లాం, పతనంథిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి, మలప్పురం, కన్నూర్ జిల్లాలను అప్రమత్తం చేసింది. మత్స్యకారులు చేపలవేటకు సముద్రంలోకి వెళ్లరాదని అధికారులు పేర్కొన్నారు. కేరళను తాకిన రుతుపవనాలు చురుగ్గా కదులుతూ దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, బంగాళాఖాతంలోని ఆగ్నేయ ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రుతుపవనాల ప్రభావంతో లక్షదీప్, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఏపీలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. చదవండి : వచ్చే 3 రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు -
వచ్చే 3 రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాగల 24 గంటల్లో మాల్దీవులు, కోమోరిన్‌లోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం, అండమాన్ – నికోబార్ దీవుల్లో మిగిలిన ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు ఆగ్నేయ అరేబియా సముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రం ప్రాంతాల్లో ఈ నెల 31న అల్పపీడనం ఏర్పడవచ్చునని తెలిపింది. దీని ప్రభావం వల్ల జూన్ 1న కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు వెల్లడించారు. మరోవైపు పశ్చిమ మధ్య అరేబియా సముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న నైరుతి అరేబియా సముద్రం ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల పశ్చిమ మధ్య అరేబియా సముద్ర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందన్నారు. దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పియర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని ఆయన తెలిపారు. ఇది మరింత బలపడి రాగల 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. అలాగే రాగల 72 గంటల్లో ఇది వాయవ్య దిశగా దక్షిణ ఒమన్, తూర్పు యెమెన్ తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉందన్నారు. ఇక విదర్భ నుంచి ఇంటీరియర్ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితలద్రోణి కొనసాగుతోందని రాజారావు తెలిపారు. వచ్చే 3 రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు రాగల మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతోపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని రాజారావు వెల్లడించారు. శుక్రవారం ఆదిలాబాద్, కొమురంభీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, జనగామ, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ వడగాడ్పులు వీచే అవకాశం ఉందని చెప్పారు. -
గుడ్‌న్యూస్: 1న కేరళకు రుతుపవనాలు
సాక్షి, న్యూఢిల్లీ : నిప్పులకొలిమిని తలపిస్తున్న మండే ఎండల నుంచి ఉపశమనంలా చల్లని కబురు అందింది. జూన్ 1న నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని ఉపరితల శాస్ర్తాల మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ మాల్దీవులు-కొమోరిన్ ప్రాంతంతో పాటు దక్షిణ బంగాళాఖాతం మీదుగా అండమాన్-నికోబార్ దీవులకు చేరుకున్నాయి. మరోవైపు అరేబియా సముద్రంలో అల్పపీడన ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) వెల్లడించింది. ఇక రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు 3-4 డిగ్రీలు తగ్గుతాయని శుభవార్త అందించింది. ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్ర వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. చదవండి : 24 గంటల్లో దేశంలోకి ‘నైరుతి’ -
నిప్పులకొలిమి : మరో 24 గంటలు ఇదే తీరు..
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరాది సహా దేశంలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న వడగాడ్పులు మరో 24 గంటలు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం వెల్లడించింది. బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు మరింత బలపడినప్పటికీ మరో ఒకట్రెండు రోజులు అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలులు కొనసాగుతాయని తెలిపింది. ఉత్తర, మధ్య భారత్‌లో పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ వేడిగాలులు వీస్తున్నాయని, కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 47 డిగ్రీల సెల్సియస్ దాటుతోందని ఐఎండీ పేర్కొంది. ప్రస్తుత వడగాడ్పులు, అత్యధిక ఉష్ణోగ్రతలు రానున్న 24 గంటల్లో కొనసాగే అవకాశం ఉందని వెల్లడించింది. రానున్న 24 గంటల్లో తెలంగాణ, మరాఠ్వాటా, ఒడిషా, జార్ఖండ్, బిహార్, పంజాబ్, కర్ణాటకల్లో వేడిగాలులు వీస్తాయని..విదర్భ, పశ్చిమ రాజస్ధాన్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలతో వేడిగాలులు వీస్తాయని ఐఎండీ పేర్కొంది. చదవండి : ఉత్తర భారతంలో రెడ్ అలర్ట్ -
రేపు కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం : రేపు కోస్తాంద్రలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది మరింత బలపడి రేపటికి దక్షిణ బంగాళాఖాతం మధ్యప్రాంతాల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. శనివారం సాయంత్రానికి అదే ప్రాంతంలో వాయుగుండం కాస్తా తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ నెల 17 వరకు వాయువ్య దిశగా తుపాను పయనించి, అనంతరం రికర్వ్ తీసుకుని ఈ నెల 18, 19 తేదీల వరకు ఉత్తర, ఈశాన్య దిశగా పయనించనుందని తెలిపింది. -
16 నాటికి అండమాన్‌కు రుతుపవనాలు
సాక్షి, న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల సాధారణం కన్నా సుమారు ఆరు రోజుల ముందే, మే 16 నాటికి నైరుతి రుతుపవనాలు అండమాన్, నికోబార్ దీవులను చేరుకుంటాయని బుధవారం భారత వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణంగా రుతుపవనాలు అండమాన్, నికోబార్ దీవులను మే 20వ తేదీ వరకు చేరుకుంటాయి. ఆ తరువాత కేరళ చేరుకునేందుకు వాటికి 10, 11 రోజులు పడుతుంది. అప్పుడే వర్షాకాలం ప్రారంభమైనట్లు భావిస్తారు. కేరళకు రుతుపవనాలు చేరుకునే కచ్చితమైన సమయాన్ని వారం రోజుల్లో వాతావరణ శాఖ ప్రకటించే అవకాశముంది. (తెల్లరంగు దుస్తులు ధరించండి) మే 15 నాటికి దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై, ఆ మర్నాడు సాయంత్రానికి తుపానుగా మారనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ కారణంగా నైరుతి రుతుపవనాలు ముందుగానే దేశంలో ప్రవేశించనున్నాయంది. ఈ సంవత్సరం నుంచి రుతుపవనాల ప్రారంభం, ముగింపునకు సంబంధించిన వివరాలను 1960–2019 డేటా ఆధారంగా ప్రకటించాలని నిర్ణయించారు. ఇప్పటివరకు 1901–1940 మధ్య డేటా ఆధారంగా ఆ వివరాలను ప్రకటించేవారు. -
రైతులకు తీపికబురు
సాక్షి, న్యూఢిల్లీ : భారత వాతావరణ విభాగం (ఐఎండీ) దేశంలో కోట్లాది రైతులకు శుభవార్తను అందించింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని బుధవారం వెల్లడించింది. ఈ సంవత్సరం సాధారణ రుతుపవనాలు ఉంటాయని భూఉపరితల శాస్ర్తాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి మాధవన్ రాజీవన్ పేర్కొన్నారు. మరోవైపు దేశంలోకి నైరుతి రుతుపవనాల రాకకు సంబంధించి ఐఎండీ ప్రారంభ తేదీలను విడుదల చేసింది. రాజీవన్ తెలిపిన వివరాల ప్రకారం జూన్ 1న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించనుండగా, జూన్ 4న చెన్నైలో, జూన్ 8న హైదారబాద్‌ను తాకనున్నాయి. ఇక జూన్ 10న పుణేలో, జూన్ 11న ముంబైలో రుతుపవానాలు ప్రవేశిస్తాయి. జూన్ 27న నైరుతి రుతుపవనాలు దేశ రాజధాని ఢిల్లీని తాకుతాయని ఐఎండీ తెలిపింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ భారత్‌లో రుతుపవనాల సీజన్ ఉండగా..వరి, గోధుమలు, చెరకు, నూనెగింజలు వంటి పలు ప్రధాన పంటల కోసం రైతులు వర్షాలపైనే అధికంగా ఆధారపడతారు. చదవండి : హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం -
రెడ్ వార్నింగ్ : మంచు దుప్పటిలో రాజధాని
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిని శీతల గాలులు ముంచెత్తడంతో వాతావరణ శాఖ ఢిల్లీలో ‘రెడ్’ వార్నింగ్ జారీ చేసింది. దశాబ్ధాల కనిష్టస్ధాయిలో లోథి రోడ్లో 2.8 డిగ్రీల సెల్సియస్, సఫ్ధర్‌జంగ్‌లో 2.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ హెచ్చరిక జారీ చేసింది. తీవ్ర వాతావరణ పరిస్థితులు నెలకొంటే ఈ తరహా హెచ్చరిక జారీ చేస్తారు. ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్టస్ధాయికి చేరడం ఢిల్లీలో విమాన, రైళ్ల సేవలపై ప్రభావం చూపుతోంది. పొగమంచు కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు మంచు కప్పేయడంతో ఢిల్లీ, నోయిడాలను కలిపే రహదారిపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. శీతల గాలులకు తోడు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఢిల్లీలో మరోసారి కాలుష్యం ప్రమాదకర స్ధాయికి పెరిగింది. ఇక రాజస్ధాన్, మధ్యప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయని ఐఎండీ పేర్కొంది. -
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
మహారాణిపేట (విశాఖ దక్షిణ): బంగాళాఖాతంలో రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల అవర్తనం కూడా కొనసాగుతోంది. 4.5 కిలో మీటర్లు ఎత్తు వరకు ఆవర్తనం కొనసాగుతోంది. తూర్పు మధ్య అరేబియా సముద్రం నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్ వరకు ఉత్తర ఇంటిరియర్ కర్నాటక, తెలంగాణ మీదుగా 2.1 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీంతో రాగల 48 గంటల్లో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా, ఆంధ్రా తీరాలకు దగ్గరలో నైరుతి బంగాళాఖాతం.. దానిని అనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతోందని అధికారులు పేర్కొన్నారు. కోస్తా ఆంధ్రా, యానం, తదితర ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసేఅవకాశం వుందని వాతావరణ శాఖ చెబుతోంది. కాగా నేడు, రేపు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. -
ఈసారి వర్షాల్లో దూకుడెందుకు?
సాక్షి, న్యూఢిల్లీ : భారత ఉపఖండం నుంచి సాధారణంగా రుతు పవనాలు సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి వెనక్కి పోతాయి. ఈ సారి నెల పది రోజులు ఆలస్యంగా అక్టోబర్ పదవ తేదీ నుంచి వెనక్కి మళ్లే అవకాశం ఉందని భారత వాతావరణ పరిశోధన శాఖ అంచనా వేసింది. ఈసారి సాధారణ వర్షపాతాలే ఉంటాయని గత ఏప్రిల్ నెలలో వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే అందుకు విరుద్ధంగా ఈసారి రుతు పవనాల సీజన్ పూర్తి అనూహ్యంగా కొనసాగింది. మొట్టమొదట కేరళలోని వారం రోజులు ఆలస్యంగా రుతుపవనాలు ప్రవేశించాయి. మూడు వారాల అనంతరం ముంబైకి చేరుకున్నాయి. రుతుపవనాల ఆలస్యం వల్ల జూన్ నెలలో 33 శాతం లోటు వర్షపాతం నమోదయింది. సీజన్ ముగిసే సమయానికి సాధారణ వర్షపాతం కన్నా పది శాతం ఎక్కువ కురిసింది. అనతి కాలంలోనే భారీ వర్షాలు కురియడం మరో విశేషం. దీని వల్లనే అధిక వర్షపాతం నమోదయింది. ఎనిమిది రాష్ట్రాల్లో భారీ వర్షాల వల్ల వరదలు సంభవించాయి. మొదట్లో కర్ణాటక వరదల్లో 80 మంది మరణించారు. బీహార్‌లో సెప్టెంబర్ నెలలో వరదలు సంభవించి అంతే మంది మరణించారు. 1951 నుంచి 2000 వరకు 50 సంవత్సరాల్లో జూన్ నెల నుంచి సెప్టెంబర్ నెల వరకు సరాసరిన 88 శాతం వర్షపాతం నమోదయింది. ఈ ఒక్క ఏడాదే రుతుపవనాల కాలంలో 97 శాతం వర్షపాతం కురిసింది. సీజన్ పూర్తి కాలానికి అంటే అక్టోబర్ మొదటి వారానికి సరాసరి తీసుకున్నట్లయితే 110 శాతం వర్షపాతం నమోదయింది. జూన్ మొదటి వారంలో వర్షపాతం లోటు సెప్టెంబర్ మూడోవారంలో వర్షపాతం లోటు సీజన్లో మొదటి మూడు వారాలపాటు అతి తక్కువ వర్షపాతం కురిసి, ఆ తర్వాత వెనువెంటనే భారీ వర్షాలు కురిశాయి. ఈసారి వర్షపాతం ఇలా కొనసాగడం అన్నది ఓ ప్రత్యేకమైనదని, వచ్చే ఏడాది ఇది పునరావృతం అవుతుందని భావించడం తప్పని పుణెకు చెందిన వాతావరణ శాస్త్రవేత్త డీఎస్ పాయ్ తెలిపారు. ఈసారి మధ్య, దక్షిణ ప్రాంతాల్లో అధిక వర్షపాతం కురిసింది. ఈ రెండు ప్రాంతాల్లో గతేడాది తక్కువ వర్షపాతం నమోదయింది. ఇప్పటికీ ఈశాన్య ప్రాంతాల్లో, ముఖ్యంగా ఢిల్లీ, హర్యానా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్ ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం కురిసింది. గతేడాది కూడా ఈ ప్రాంతాల్లో 24 శాతం తక్కువ వర్షపాతం నమోదయింది. గతేడాది 9 శాతం తక్కువ వర్షపాతం నమోదుకాగా, ఈసారి 110 శాతం నమోదవడం విశేషం.ఆలస్యంగా వర్షాలు కురవడం వల్ల కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతినడం వాస్తవమే అయినా అధిక వర్షపాతం వల్ల దేశంలోని పలు రిజర్వాయర్లు నిండడం, భూగర్భ జలాలు పెరగడం హర్షించతగ్గ పరిణామం. అల్ప పీడనాల వల్లనే ఈసారి అధిక వర్షం కురిసినట్లు డీఎస్ పాయ్ తెలియజేశారు. -
‘లోటు’ తీరుతుంది!
సాక్షి, విశాఖపట్నం: ఈశాన్య, ఆగ్నేయ గాలులు కలిసే జోన్లు ఎక్కువ ప్రభావాన్ని చూపుతూ.. ఉత్తర భారతం నుంచి దక్షిణం వైపు పయనిస్తున్నాయి. ఈ ప్రభావంతో బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పడనున్నాయి. దీనివల్ల రాష్ట్రంలో అక్టోబర్ 15 వరకూ విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. గతేడాదికంటే ఈ ఏడాది అనుకూల వాతావరణం ఉండటంతో ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లాలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కాగా.. 8 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. రాయలసీమ జిల్లాల్లో మాత్రం ఇప్పటికీ లోటు వర్షపాతమే ఉంది. అక్టోబర్ నాటికల్లా ఆ లోటు తీరేలా పుష్కలంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అనుకూల వాతావరణమే ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 7 శాతం లోటు వర్షపాతం ఉంది. ఇందులో సింహభాగం లోటు దక్షిణ భారత దేశంలోనే ఉంది. ఇది సెప్టెంబర్ నుంచి అక్టోబర్ రెండో వారం నాటికి భర్తీ కానుంది. రుతు పవనాల కాలంలో నెలకు కనీసం అల్పపీడనం, వాయుగుండం, తుపాను వంటి ఏవైనా నాలుగు మార్పులు రావాల్సి ఉంటుంది. గతేడాది రుతుపవనాల కాలమైన జూన్ నుంచి సెప్టెంబర్ వరకు చూసుకుంటే ఒక తుపాను, ఒక తీవ్ర వాయుగుండం, 4 వాయుగుండాలు, 4 అల్పపీడనాలు ఏర్పడ్డాయి. అందుకే గతేడాది 91 శాతం సరాసరి వర్షపాతం నమోదైంది. ఈసారి అవి ఆశించిన విధంగా లేకపోవడం వల్ల ఇబ్బంది తలెత్తింది. రుతు పవనాలు 13 రోజులు ఆలస్యం కావడంతో వర్షాలు కూడా ఆలస్యమవుతున్నాయి. సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకూ విస్తారంగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు పుష్కలంగా ఉండటంతో రాష్ట్రంలో లోటు వర్షపాతం ఉండబోదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 24 గంటల్లో అల్పపీడనం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 నుంచి 4.5 కి.మీ ఎత్తులో ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఆవరించి ఉంది. అదే విధంగా పశ్చిమ బెంగాల్ దాని పరిసర ప్రాంతాల్లో 7.6 కి.మీ ఎత్తు వరకు ఆవర్తనం ఏర్పడింది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి వైపు వంగి ఉంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) శనివారం రాత్రి విడుదల చేసిన నివేదికలో తెలిపింది. దీని ప్రభావంతో రానున్న రెండు మూడు రోజుల పాటు కోస్తా, రాయలసీమలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని ఐఎండీ తెలిపింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు రాయలసీమపై చురుగ్గా ప్రభావం చూపుతున్నాయి. గడచిన 24 గంటల్లో రుద్రవరంలో 16 సెం.మీ వర్షపాతం నమోదుకాగా, ఎస్.కోటలో 9, అవనిగడ్డ, వెంకటగిరి కోట, ఆళ్లగడ్డలో 6 సెం.మీ వర్షం కురిసింది. శనివారం సాయంత్రం విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం దిబ్బపాలెం గ్రామానికి చెందిన తుంపాల కన్నయ్య(53) అనే రైతు పొలంలో పనిచేస్తుండగా పిడుగు పడి మృతి చెందాడు. -
మరో రెండ్రోజులు భారీ వర్షాలు
సాక్షి, న్యూఢిల్లీ : మరో రెండురోజులు తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, గోవా, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం బుధవారం పేర్కొంది. ఇప్పటికే ఉత్తరాదిని వర్షాలు ముంచెత్తుతుండగా జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, రాజస్ధాన్, ఉత్తరాఖండ్ సహా పశ్చిమ బెంగాల్, సిక్కిం, అసోం, చత్తీస్‌గఢ్, ఉత్తర కర్ణాటకలో వర్షాలు విస్తారంగా కురుస్తాయని తెలిపింది. రానున్న రెండ్రోజుల్లో ముంబై నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. పంజాబ్, హర్యానా, ఢిల్లీల్లోనూ వరుణుడి ప్రతాపం కొనసాగుతుందని ఐఎండీ అంచనా వేసింది. మరోవైపు బిహార్‌లో వరద ఉధృతి కొనసాగుతోంది. వరదలతో ఇప్పటికే బిహార్ 129 మంది మరణించగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మహారాష్ట్రలోనూ పలు జిల్లాలను వరదలు ముంచెత్తాయి. -
వచ్చే నాలుగు రోజులు పలుచోట్ల వర్షాలు
-
నేడూ భగభగలే..!
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. వర్షాలతో చల్లదనం పంచాల్సిన కాలంలో వడగాడ్పులు విజృంభిస్తూ మరింత మంటెక్కిస్తున్నాయి.. ఇప్పటికే ఉష్ణతాపంతో కోస్తాంధ్ర భగ్గుమంటోంది. సాధారణం కంటే 3నుంచి6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ దడ పుట్టిస్తున్నాయి. ఇదే పరిస్థితి శనివారం కూడా కొనసాగుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం రాత్రి నివేదికలో తెలిపింది. కోస్తాంధ్ర అంతటా శనివారం వడగాడ్పులు వీస్తాయని, రాయలసీమలో సాధారణంకంటే 2నుంచి4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు రికార్డవుతాయని పేర్కొంది. అలాగే శనివారం నుంచి నాలుగు రోజులపాటు కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు గానీ, వర్షం గానీ కురుస్తుందని వివరించింది. అదే సమయంలో దక్షిణ కోస్తాంధ్రలో గంటకు 30నుంచి40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, వర్షంతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా శుక్రవారం రాష్ట్రంలో పలుచోట్ల వడగాడ్పులు వీచాయి. -
సైక్లోన్ అలర్ట్ : బీచ్‌ల మూసివేత
ముంబై : అరేబియా సముద్రం తీరంలో వాయు తుపాన్ ప్రభావంపై మహారాష్ట్ర అప్రమత్తమైంది. కొంకణ్ ప్రాంతంలోని పాలఘర్, థానే, ముంబై, రాయ్‌గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్‌లోని అన్ని బీచ్‌లను మూసివేయాలని, ఆయా బీచ్‌ల్లోకి రానున్న రెండు రోజుల్లో ప్రజలను అనుమతించరాదని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. వాయు తుపాన్ ప్రభావంతో గురువారం ఉదయం నుంచే సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడతాయని, తుపాన్ ప్రభావంతో మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. వాయు తుపాన్ గురువారం గుజరాత్ తీరంలో పోర్బందర్, దియూల మధ్య తీరం దాటుతుందని, ఈ సమయంలో గంటకు 145 నుంచి 155 కిమీ వేగంతో గాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది. -
చల్లని కబురు చెప్పిన భారత వాతావరణ విభాగం
-
ఈసారి రుతుపవనాల రాక మరింత ఆలస్యం
-
ఉడికిపోతున్న ఉత్తర భారతం
జైపూర్: ఉత్తరభారతం వడగాడ్పులతో ఉడుకెత్తిపోతోంది. ఆదివారం ప్రపంచ వ్యాప్తంగా నమోదైన 15 అత్యంత వేడి ప్రదేశాల్లో 10 ఉత్తర భారతంలోవే కావడం విశేషం. మిగతా ఐదు పాకిస్తాన్లో ఉన్నాయి. రాజస్థాన్‌లోని చురు (48.9 డిగ్రీలు) , శ్రీ గంగానగర్ (48.6 డిగ్రీలు)లు ఈ జాబితాలో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి . తర్వాత స్థానాల్లో పాకిస్తాన్‌లోని జకోబాబాద్(48 డిగ్రీలు), ఉత్తర ప్రదేశ్‌లోని బండా(47.4డిగ్రీలు), హరియాణాలోని నర్నాల్(47.2డిగ్రీలు) ఉన్నాయి. ఈఐ డొరాడో వెదర్ వెబ్సైట్ ఈ వివరాలు వెల్లడించింది. శనివారం నుంచి అగర్తలలో ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదవుతున్నా ఈ ప్రాంతంలో ఎండలు మండిపోయాయి. దేశంలోని పర్వత ప్రాంతాల్లో గత రెండు దశాబ్దాలుగా ఎండ ఎక్కువుండే రోజులు పెరుగుతున్నాయని, ముస్సోరీ లాంటి ప్రాంతంలో ఈ జూన్ 1న 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మహాపాత్ర చెప్పారు. పశ్చిమ దిశ నుంచి వస్తున్న పొడిగాలులు పాకిస్తాన్, రాజస్తాన్ ఎడారుల్లోని వేడిని గ్రహించడమే ప్రస్తుతం వేడిగాలుల ఉధృతికి కారణమని ఆయన చెప్పారు. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు రెండూ పెరుగుతుండటం వల్ల భూతలం బాగా వేడెక్కుతోందని,ఫలితంగా వేడిగాలులు ఎక్కువ కాలం కొనసాగుతున్నాయని, రెండు దశాబ్దాలుగా ఇలాంటి పరిస్థితిని గమనిస్తున్నామని మహాపాత్ర వివరించారు. 2010–2018 మధ్య కాలంలో దేశంలో వడగాడ్పుల కారణంగా 6,167 మంది చనిపోయారని, ఒక్క 2015లోనే 2,081 మంది వడగాడ్పులకు బలయ్యారు. మైదాన ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటితే వడగాడ్పుగా పరిగణిస్తారు. రెండు దశాబ్దాలుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు -
వడగాడ్పులు.. పిడుగుల వానలు!
సాక్షి, విశాఖపట్నం/తాడేపల్లి: రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకపక్క ఉష్ణతీవ్రతతో వడగాడ్పులు కొనసాగుతుండగా మరోపక్క పిడుగులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. సాధారణంకంటే 3–5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల వడగాడ్పులు ప్రభావం మరో మూడు రోజుల పాటు కొనసాగుతాయని ఐఎండీ సోమవారం రాత్రి నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలో సోమవారం వడగాడ్పులకు 8 మంది మృతి చెందారు. గుంటూరు జిల్లాలో ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. రాయలసీమ నుంచి కొమరిన్ ప్రాంతం వరకు తమిళనాడు మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో రానున్న మూడు రోజులు కోస్తాంధ్రలో, రెండు రోజులు రాయలసీమలో గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని, కొన్నిచోట్ల పిడుగులు పడతాయని ఐఎండీ హెచ్చరించింది. గడచిన 24 గంటల్లో ఆళ్లగడ్డ, గుత్తిలో 5, వింజమూరు, అర్థవీడు, జియ్యమ్మవలస, మార్కాపురం, కోయిలకుంట్ల, రాయదుర్గం, పమిడిల్లో 3 సెం.మీ వర్షపాతం నమోదైంది. సోమవారం రాత్రి విశాఖలో ఉరుములు, పిడుగులతో వర్షం కురిసింది. రానున్న 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు ఇలా.. - మే 28న ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో 46 నుంచి 48 డిగ్రీలు, శ్రీకాకుళం, ప్రకాశం, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో 44 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నివారణ సంస్థ తెలిపింది. - మే 29న విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో 46 నుంచి 47 డిగ్రీల వరకు, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో 44 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి. - మే 30న ఉభయగోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు, శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 43 నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. - మే 31వ తేదీన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 43 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతల నమోదుకు అవకాశం ఉంది. జూన్ ఒకటిన.. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 44 నుంచి 45 డిగ్రీల వరకు, విశాఖ, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంత జిల్లాల్లో 42 నుంచి 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. -
రుతుపవనాలకు అననుకూల పరిస్థితులు
న్యూఢిల్లీ: అరేబియా సముద్రంపై క్రాస్–ఈక్వెటోరియల్ ఫ్లో అననుకూలంగా ఉన్న కారణంగా రుతుపవనాల కదలికల్లో పురోగతి లేదని, రుతుపవనాలు ఆలస్యం కావడానికి ఇదో కారణమని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆది వారం వెల్లడించింది. మే 18న రుతుపవనాలు అండమాన్, నికోబార్ దీవులను తాకినప్పటికీ ఆ ప్రాంతం మొత్తానికి ఇంకా విస్తరించలేదు. బుధ లేదా గురువారం నాటికల్లా దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ దీవులు, ఉత్తర అండమాన్ సముద్రం ప్రాంతాల్లోకి రుతుపవనాలు ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉండొచ్చని ఐఎండీ తెలిపింది. అలాగే సాధారణం కన్నా ఐదు రోజులు ఆలస్యంగా, జూన్ 6న కేరళను రుతుపవనాలు తాకొచ్చని పేర్కొంది. హిందూ మహా సముద్రంలోని దక్షిణ భాగంలో మ్యాడెన్–జూలియన్ ఆసిలేషన్ (ఎంజేవో), యాంటి–సైక్లోన్ సర్క్యులేషన్ అనుకూలంగా లేకపోవడం వల్ల క్రాస్–ఈక్వెటోరియల్ ఫ్లో సరిగ్గా లేదని ఐఎండీ అదనపు డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మోహపాత్ర చెప్పారు. బుధ, గురువారాల్లో అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందనీ, అలాగే ఆదివారం నుంచి మంగళవారం మధ్యలో తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కర్ణాటకల్లోనూ వర్షాలు కురవొచ్చని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వడగాడ్పులు కొనసాగుతాయని తెలిపింది. -
ఆంధ్రప్రదేశ్ : నిప్పుల గుండం
సాక్షి, అమరావతి/విశాఖపట్నం/ తాడేపల్లి రూరల్(మంగళగిరి): భగభగ మండుతున్న ఎండలతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. గడిచిన వారం రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోయాయి. రాష్ట్రంలో అనేకచోట్ల 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. శుక్రవారం ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో 47.10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైబడి నమోదవుతున్నాయి. ఒకవైపు భారీగా ఉష్ణోగ్రతలు పెరిగిపోగా.. దీనికితోడు అగ్నికీలల్లా వడగాడ్పులు వీస్తున్నాయి. దీంతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఈసీజన్లో వడదెబ్బతో మరణించిన వారి సంఖ్య వంద దాటినట్టు అనధికారిక లెక్కలు సూచిస్తున్నాయి. ఒక్క శుక్రవారమే 28 మంది వడదెబ్బ వల్ల చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకూ ఈ వేసవిలో ఏడుగురు వడదెబ్బ వల్ల చనిపోయినట్లు విపత్తు నిర్వహణ శాఖ అధికారులు చెబుతుండటం గమనార్హం. (చదవండి: తెలంగాణ.. నిప్పుల కొలిమి..!) సెగలు.. సెగలు.. రాష్ట్రంలో ఎండలు ప్రజలను ఠారెత్తిస్తున్నాయి. మధ్యాహ్నం సమయంలో బయటకు వెళితే కొద్దిసేపటికే ఒళ్లంతా చెమటతో తడిసిపోయి కళ్లు బైర్లు కమ్మి పడిపోయేలా పరిస్థితి తయారైంది.ఇళ్లల్లోనూ తీవ్ర వేడిమితో అల్లాడిపోతున్న పరిస్థితి నెలకొంది. ఇళ్లల్లో సైతం ఏసీనో ఎయిర్ కూలరో లేకపోతే ఎండ వేడిని తట్టుకోలేని పరిస్థితి. ఇళ్ల దగ్గర కుళాయి తిప్పితే నీరు సలసలమంటూ పొగలు కక్కుతూ వస్తోంది. రాత్రి పది పదకొండు గంటలు దాటినా ఇళ్ల పైనున్న ట్యాంకుల్లోని నీరు చల్లబడటం లేదు. కుంటలు, చెరువుల్లోని నీళ్లు కూడా కాలిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సూరీడి ప్రతాపానికి జనమే కాదు జంతు జీవాలు, పక్షులు, జలచరాలు కూడా తట్టుకోలేకపోతున్నాయి. రోజూ వందల సంఖ్యలో చనిపోతున్నాయని గ్రామాల్లోని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లోనూ ఎండల తీవ్రత ఇదేవిధంగా కొనసాగుతుందన్న హెచ్చరికలు మరింత భయపెడుతున్నాయి. శనివారం నుంచి ఈ నెల 15వ తేదీ వరకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీల నుంచి 47 డిగ్రీల వరకు నమోదవుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తాజాగా విడుదల చేసిన ప్రకటన వెల్లడించింది. శుక్రవారం రాష్ట్రంలోని చాలాచోట్ల అధిక ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకంలో 47.10 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు ప్రకాశం జిల్లాలో 18 మండలాల్లో 44 – 47 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. శనివారం కూడా వడగాడ్పుల తీవ్రత ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రియల్‌టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) సూచించింది. వడదెబ్బకు 28 మంది మృతి రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం వడదెబ్బకు 28 మంది మృతి చెందారు. నెల్లూరు జిల్లాలో 10 మంది, గుంటూరు జిల్లాలో 7 మంది, వైఎస్సార్ జిల్లాలో నలుగురు, విశాఖ జిల్లాలో ముగ్గురు, తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. ప్రాణాలు కోల్పోతున్న పశువులు ఎండకు తట్టుకోలేక పశువులు కూడా మృత్యువాత పడుతున్నాయి. వేడి నుంచి రక్షణ కోసం రైతులు తమ ఇళ్లలోని పాడిగేదెలు, ఆవులను మధ్యాహ్నం మూడు గంటల సమయంలో చల్లని నీటితో తడుపుతున్నారు. అడవుల్లో సైతం నీరు దొరక్క జంతువులు, పక్షలు అలమటిస్తున్నాయి. వేసవిని దృష్టిలో పెట్టుకుని అటవీశాఖ కొంత వరకూ జంతువులకు నీటిని అందించే ఏర్పాట్లు చేసినా అవి చాలడంలేదు. తక్షణమే చికిత్స చేయించకపోతే చావే.. పొలాల్లో ఒంటరిగా పనులు చేస్తున్నవారు, ఎండలో బయటకు వెళ్లిన వారు వడదెబ్బకు గురైతే ఎవరైనా వెంటనే గుర్తించి చికిత్స చేయించకపోతే ప్రాణాలు కోల్పోవడం ఖాయమని వైద్యులు చెబుతున్నారు. తీవ్రమైన ఉష్ణతాపం వల్ల మనిషి శరీరం నుంచి చెమట రూపంలో నీరు, లవణాలు బయటకు వెళ్లిపోతాయి. దీనివల్ల సోడియం, పొటాషియం నిల్వల్లో మార్పులు వస్తాయి. వీటి దామాషా పడిపోవడంవల్ల మనిషి శరీరం వేడిని నియంత్రించే శక్తిని కోల్పోతుంది. శరీర ఉష్ణోగ్రత పెరిగిపోవడం, పొటాషియం, ఇతర లవణాలు తగుమోతాదులో లేకపోవడంవల్ల మనిషి వడదెబ్బకు గురవుతారు. కాగా ప్రస్తుత వేసవిలో ఇప్పటికే వంద మందిపైగా వడదెబ్బవల్ల ప్రాణాలు కోల్పోయినట్లు మీడియాలో వార్తలు వస్తుంటే పదుల సంఖ్యలోనే ప్రభుత్వం లెక్కలు చూపుతోంది. దీనిపై వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఒక అధికారితో ‘సాక్షి’ ప్రస్తావించగా.. ‘గుండె సంబంధిత సమస్యలున్న వారు వడగాడ్పులకు తట్టుకోలేరు. ఇలాంటి వారికి వెంటనే గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. ఈ మరణాలను అధికారులు గుండెపోటుగానే పరిగణిస్తారేగానీ వడదెబ్బ మృతులుగా గుర్తించరు. అందువల్లే వడదెబ్బ మరణాల నిర్ధారించే ముగ్గురు సభ్యుల కమిటీ నివేదికలో ఈ సంఖ్య తక్కువగా ఉంటోంది’ అని వివరించారు. గుండె సమస్యలున్న వారు వీలైనంత వరకు ఎండలో బయట తిరగరాదని హైదరాబాద్‌కు చెందిన గుండె వైద్య నిపుణుడు డాక్టర్ పీఎల్ఎన్ కపర్థి తెలిపారు. వడదెబ్బ లక్షణాలు - రోజుకు ఐదారుసార్లు కంటే ఎక్కువగా నీళ్ల విరేచనాలు కావడం, వాంతులు, వికారం, మెలిపెట్టినట్లుగా కడుపునొప్పి ఉండటం. - జ్వరం 101 డిగ్రీల కంటే ఎక్కువగా ఉండటం. - అయిదారు గంటలపాటు మూత్ర విసర్జన నిలిచిపోవడం, నాలుక పిడచగట్టుకుపోయినట్లు తడారిపోవడం. - పాక్షిక లేదా పూర్తి ఆపస్మారకస్థితిలోకి వెల్లడం. - పిల్లల శరీరంపై దద్దుర్లు రావడం, నుదురు ఎక్కువ వేడిగా ఉండటం. వడదెబ్బ తగిలితే ఈ లక్షణాలన్నీ ఉండాలని కాదు. వీటిలో ఏ లక్షణాలు కనిపించినప్పటికీ వైద్యులను సంప్రదించి వైద్యం చేయించాలి. వడదెబ్బకు గురైన వారిని బాగా గాలి తగిలేలా నీడలో పరుండబెట్టి చల్లని నీటిలో ముంచిన వస్త్రంతో శరీరమంతా తుడవాలి. దీనివల్ల ఉష్ణోగ్రత తగ్గి ఉపశమనం కలుగుతుంది. ఈ జాగ్రత్తలు పాటించడం ఉత్తమం మండే ఎండలను దృష్టిలో పెట్టుకుని వడదెబ్బకు గురికాకుండా ఉండాలంటే తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ కపర్థి సూచించారు. వృద్ధులు, పిల్లలు, బాలింతలు, గర్భిణులు, గుండెజబ్బులు లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. – ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య సాధ్యమైనంత వరకూ ఎండలో బయటకు వెళ్లకపోవడం ఉత్తమం. – తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే తల, మొహంతోపాటు హృదయ భాగంపై నేరుగా ఎండ పడకుండా చూసుకోవాలి. – శరీరానికి బాగా గాలి తగిలేలా వదులుగా ఉన్న తెలుపు లేదా లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలి. – రోజుకు కనీసం మూడు నాలుగు లీటర్ల నీరు తీసుకోవాలి. ప్రతి అరగంటకొకసారి నీరు తాగుతూ ఉండాలి. – ఎండలో నుంచి వచ్చిన వెంటనే నిమ్మ రసం, ఉప్పు కలిపిన చల్లని నీరు లేదా, మజ్జిగ, కొబ్బరి నీరు తాగడంవల్ల మేలు కలుగుతుంది. – ఎలక్ట్రాల్ పౌడర్ దగ్గర ఉంచుకుని ఏమాత్రం బడలికగా ఉన్నా నీటిలో కలుపుకుని తాగాలి. దీనివల్ల చెమట రూపంలో వెళ్లిన లవణాల స్థానే శరీరానికి అవసరమైన సోడియం, పొటాషియం లభిస్తాయి. – చివరి అంతస్తుల్లో ఉన్న ఇళ్లలో వేడి ఎక్కువగా ఉంటుంది. కిటికీలకు వట్టి వేళ్లు, గోనెసంచులు వేసి వాటికి నీరు చల్లడం ద్వారా కొంత వరకూ గది వేడిని తగ్గించుకునే ఏర్పాట్లు చేసుకోవాలి. రానున్న 5 రోజుల్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు రానున్న ఐదు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ఈ మేరకు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం వివిధ జిల్లాల్లో నమోదయ్యే ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి. మే 11వ తేదీ: 46 – 47 డిగ్రీలు – ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు 43 – 45 డిగ్రీలు – కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ అనంతపురంలలో కొన్ని ప్రదేశాలు 39 – 42 డిగ్రీలు – శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు మే 12వ తేదీ: 45 – 46 డిగ్రీలు – నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు 42 – 44 డిగ్రీలు – కృష్ణా, గుంటూరు, ప్రకాశం, వైఎస్సార్, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు 39 – 41 డిగ్రీలు – శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు మే 13వ తేదీ: 43 – 44 డిగ్రీలు – నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు 41 – 42 డిగ్రీలు – శ్రీకాకుళం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు 38 – 40 డిగ్రీలు – విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు మే 14వ తేదీ: 43 – 44 డిగ్రీలు – గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు 41 – 42 డిగ్రీలు – ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు 37 – 39 డిగ్రీలు – శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనంతపురం జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు మే 15వ తేదీ: 43 – 44 డిగ్రీలు – ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు 41 – 42 డిగ్రీలు – శ్రీకాకుళం, విజయనగరం, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు 38 – 39 డిగ్రీలు – విశాఖపట్నం జిల్లాలో కొన్ని ప్రదేశాలు వడగాడ్పులు.. వర్షాలు రాష్ట్రంలో విభిన్న వాతావరణం రాష్ట్రంలో ఒకపక్క వడగాడ్పులు, మరోపక్క తేలికపాటి వర్షాలతో విభిన్న వాతావరణం నెలకొంది. దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మరోపక్క ఒడిశా నుంచి కొమరిన్ ప్రాంతం వరకు దక్షిణ ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, రాయలసీమ, తమిళనాడుల మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అదే సమయంలో గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, కొన్ని ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది. మరోవైపు శనివారం కోస్తాంధ్రలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. -
ప్రచండ తుపానుగా ఫొని తుపాను
-
పెను తుపాను!
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: తుపాను ఫణి (ఫొణిగా కూడా వ్యవహరిస్తున్నారు) తన దిశను మార్చుకుంటోంది. తీవ్రతను సైతం పెంచుకుంటోంది. శనివారం ఉదయం తీవ్ర వాయుగుండం నుంచి తుపానుగా మారిన అనంతరం మధ్యాహ్నానికే తీవ్ర తుపానుగా బలపడింది. ఆదివారం నాటికి మరింత బలపడి అతి తీవ్ర తుపానుగా మారనుంది. ప్రస్తుతం ఈ తుపాను గంటకు 9 కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా కదులుతోంది. శనివారం రాత్రికి ఈ తీవ్ర తుపాను చెన్నైకి ఆగ్నేయంగా 1,200 కిలోమీటర్లు, మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 1,390 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా వాయవ్య దిశగా కదులుతూ ఈ నెల 30వ తేదీ నాటికి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరం వైపు పయనిస్తుంది. అనంతరం ఈశాన్య దిశగా మలుపు తిరిగి బంగ్లాదేశ్ వైపు మళ్లే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా మే 2వ తేదీ వరకు బంగాళాఖాతంలోనే పయనించి పెను తుపానుగా బలపడే వీలుందని వారు అంచనా వేస్తున్నారు. అంచనాకు అందట్లేదు.. ప్రస్తుతం ఫణి తుపాను తీరును బట్టి అది ఎక్కడ తీరాన్ని దాటుతుందో భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ఇంకా ఒక అంచనాకు రాలేకపోతోంది. మరోవైపు తుపాను ప్రభావంతో నైరుతి బంగాళాఖాతంలో ఆదివారం గంటకు 125–150, సోమవారం 145–170, మంగళ, బుధవారాల్లో 125–150 కిలోమీటర్ల వేగంతో బలమైన పెనుగాలులు వీస్తాయని ఐఎండీ శనివారం రాత్రి విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఆదివారం నుంచి మంగళవారం వరకు తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రల్లో గంటకు 50–70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో మే 2వ తేదీ వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరించింది. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు వానలు ఫణి తుపాను ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్ల మంచి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. ఈ నెల 30వ తేదీ, వచ్చే నెల ఒకటో తేదీన తమిళనాడు, దక్షణ కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ‘‘ప్రస్తుతం తుపాను తీరానికి చాలా దూరంలో ఉంది. అందువల్ల దీని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పలేం. మరో 24 గంటల తర్వాత కొంత వరకూ పరిస్థితిని అంచనా వేయవచ్చు. మొత్తం మీద చూస్తే ఈ తుపాను దక్షిణ కోస్తా, తమిళనాడు మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు ప్రస్తుతం కనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ దక్షిణ కోస్తా, తమిళనాడు, పాండిచ్చేరి ప్రాంతాల్లో ఈ నెల 30, మే 1వ తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది’’ అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి తెలిపారు. నిజాంపట్నం హార్బర్లో రెండో నెంబర్ ప్రమాద సూచిక ఫణి తుపాను హెచ్చరికల నేపథ్యంలో గుంటూరు జిల్లా నిజాంపట్నం హార్బర్లో శనివారం రెండో ప్రమాద సూచిక ఎగురవేశారు. తుపాను ఈ నెల 30న లేదా మే ఒకటో తేదీన తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారని పోర్టు కన్జర్వేటర్ మోపిదేవి వెంకటేశ్వరరావు వివరించారు. తుపాను ప్రభావంతో తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని స్పష్టం చేశారు. అల్లకల్లోలంగా మారిన సముద్రం తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలోని తీర ప్రాంత ప్రజలను ప్రభుత్వ అధికారులు అప్రమత్తం చేశారు. సముద్రంలో అలల ఉధృతి తీవ్రంగా ఉంది. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో ఎప్పుడేం జరుగుతుందోనని తీర ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాకాడు వద్ద సముద్రం దాదాపు 15 మీటర్లు ముందుకొచ్చింది. విడవలూరు వద్ద సముద్రంలో అలలు ఉధృతంగా ఉన్నాయి. మత్స్యకార ప్రాంతాల్లో పోలీసులు, రెవెన్యూ అధికారులు పర్యటించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. తీర ప్రాంతానికి ప్రత్యేక బలగాలను పంపేందుకు చర్యలు తీసుకుంటున్నామని నెల్లూరు జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగీ తెలిపారు. విశాఖ జిల్లాలో వర్షాలు విశాఖ జిల్లాలో పలు ప్రాంతాల్లో శనివారం భారీ వర్షాలు కురిశాయి. వర్షంతోపాటు ఈదురు గాలుల ధాటికి విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకూలాయి. మామిడి పంట నేల రాలడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. విద్యుత్ తీగలు తెగిపడడంతో పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నర్నీపట్నం, కోటవురట్ల, డుంబ్రిగుడ, అరకులోయ, రావికమతం, నాతవరం, గొలుగొండ తదితర మండలాల్లో వర్షాలు కురిశాయి. నర్సీపట్నం ఎంపీడీవో కార్యాలయం సమీపంలో విద్యుత్ లైన్‌పై తాటిచెట్టు విరిగిపడడంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. డుంబ్రిగుడ, నర్సీపట్నంలో ఈదురు గాలుల తీవ్రతకు హోర్డింగ్‌లు విరిగి పడ్డాయి. భారీ వర్షాల ఆశలు గల్లంతేనా? తుపాను వస్తుంది.. మంచి వానలు తెస్తుందని ఆశించిన రాష్ట్ర ప్రజల ఆశలు గల్లంతయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముందుగా అంచనా వేసినట్టుగా ఫణి తుపాను ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరానికి చేరుతుందని ఐఎండీ అంచనా వేసింది. అయితే ఇది తీవ్ర, అతి తీవ్ర తుపానుగా బలపడినప్పటికీ తన దిశను కోస్తాంధ్ర వైపు కాకుండా బంగ్లాదేశ్ వైపు మార్చుకునే అవకాశం లేకపోలేదని, దీంతో తేలికపాటి వర్షాలు తప్ప భారీ వర్షాలు కురిసే వీలు లేనట్టేనని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రానున్న రెండు రోజులు రాష్ట్రంలో తేలికపాటి జల్లులు లేదా వర్షాలు కురవవచ్చని ఐఎండీ తెలిపింది. 30న కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో, మే ఒకటో తేదీన కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అదే సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2–3 డిగ్రీలు అధికంగా నమోదు కానున్నాయి. శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలివీ..(డిగ్రీల్లో) -
పిడుగుల వర్షం.. గాలుల బీభత్సం
సాక్షి నెట్వర్క్/విశాఖపట్నం : ఛత్తీస్‌గఢ్ నుంచి కర్ణాటక వరకు తెలంగాణ మీదుగా సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి, భూమధ్య రేఖపై హిందూ మహా సముద్రానికి ఆనుకుని దక్షిణ బంగాళాఖాతంలో మరో ద్రోణి.. అలాగే కర్ణాటక పరిసరాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ప్రభావం కారణంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో శనివారం తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో వడగండ్లు బీభత్సం సృష్టించాయి. మరికొన్ని చోట్ల పెద్దఎత్తున పిడుగులు పడ్డాయి. అనేకచోట్ల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పిడుగులకు ఐదుగురు మృతిచెందారు. అనేకచోట్ల పశువులూ బలయ్యాయి. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో వడగళ్లు, పిడుగులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. పిడుగుపాటుతో నలుగురు ప్రాణాలు కోల్పోగా, చెట్టు కూలి మరొకరు ప్రాణం విడిచారు. వినుకొండ మండలం ఉప్పరపాలెం గ్రామానికి చెందిన గుమ్మా చిర్రయ్య (45) గేదల మేత కోసం పొలానికి వెళ్లగా పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందాడు. నూజెండ్ల మండలం ముతరాశుపాలెం గ్రామానికి చెందిన చిక్కుడు వెంకటకోటయ్య (30) గేదెలు తోలుకుని పొలం వెళ్లి వస్తుండగా, ఈపూరు మండలం అగ్నిగుండాలకు చెందిన సంకటి వెంకటేశ్వరరెడ్డి (70) పొలం పనుల కోసం వెళ్లగా పిడుగుపాటుతో మృతిచెందారు. అలాగే, మండల కేంద్రమైన కారంపూడికి చెందిన వ్యవసాయ కూలి షేక్ మస్తాన్‌బీ (45) పొలంలో మిరపకాయలు కోస్తుండగా పిడుగుపడి మృతిచెందింది. నూజెండ్ల మండలం పమిడిపాడు బ్రాంచ్ కెనాల్‌పై లస్కరు కర్రల శ్యాంసన్ (57) పమిడిపాడు బ్రాంచ్ కెనాల్‌కు నీరు విడుదల చేసేందుకు సిబ్బందితో ప్రకాశం జిల్లా బయ్యారం హెడ్ రెగ్యులేటర్ వద్దకు వెళ్లగా పెనుగాలులకు చెట్టుకొమ్మ విరిగిపడటంతో శ్యాంసన్ అక్కడిక్కడే మృతిచెందాడు. నూజెండ్ల మండలం పమిడిపాడు, కారంపూడి మండలం ఒప్పిచర్లలో ఒక పాడి గేదె, సింగరుట్ల తండాలో మరో గేదె పిడుగులు పడి మృత్యువాత పడ్డాయి. పలు గ్రామాల్లో చెట్లు విరిగిపడ్డాయి. ఇళ్ల పైకప్పులు ధ్వంసమయ్యాయి. ఐనవోలు వద్ద వినుకొండ కురిచేడు ప్రధాన రహదారిపై చెట్టు విరిగిపడటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. బొల్లాపల్లి మండలంలో ఈదురుగాలులు, వడగళ్ల వర్షానికి సుమారు 100 ఎకరాల్లో వరిపంట నీటమునగగా మిర్చి, బొప్పాయి పంటలు నేలవాలాయి. ఎస్సీ కాలనీలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. పలుచోట్ల చెట్లు నేలకూలాయి. విద్యుత్ తీగలు తెగిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వైఎస్సార్ జిల్లాలో.. వైఎస్సార్ జిల్లా సంబేపల్లి మండలం శెట్టిపల్లెలో శనివారం సాయంత్రం పిడుగుపాటుకు ఐదు గొర్రెలు, మూడు మేకలు మృత్యువాతపడ్డాయి. బద్వేలులో బలమైన ఈదురుగాలులు వీచాయి. కొన్నిచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో కరెంట్ నిలిచిపోయింది. ఓ చోట ఇంటి గోడ కూలడంతో ఒక మహిళ గాయపడింది. ప్రకాశం జిల్లాలోనూ పలుచోట్ల శనివారం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దర్శి మండలం ఎర్రఓబయనపల్లిలో ఏడెకరాల బొప్పాయి తోట నేలమట్టమైంది. రూ.7 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. అలాగే, కొనకమిట్ల మండలం పెదారికట్లలో వడగండ్ల వాన పడింది. పొదిలి మండలం మల్లవరం గ్రామంలో పిడుగుపాటుకు కోతి మృతిచెందింది. కనిగిరి, పామూరు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పిడుగుపాటుకు గేదె మృతి చెందింది. రెండుచోట్ల చెట్లు దగ్ధమయ్యాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కొన్నిచోట్ల ఇళ్లపై చెట్లు పడడంతో పాక్షికంగా దెబ్బతిన్నాయి. మర్రిపాడు మండలం పొంగూరు గ్రామంలో తన పొలంలో పనులు చేస్తుండగా పిడుగుపడడంతో సత్యాల చిన్నయ్య (46) అనే వ్యక్తి షాక్‌కు గురై మృతిచెందాడు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం, ముమ్మిడివరం, ప్రత్తిపాడు, తొండంగి మండలాలతోపాటు ఏజెన్సీలోని రాజవొమ్మంగి, దేవీపట్నం మండలాల్లోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. విశాఖ నగరం చల్లని గాలులతో సేదతీరింది. మధ్యాహ్నం తీవ్రమైన ఎండ.. ఉక్కబోతతో జనం అల్లాడిపోయారు. అంతలోనే దట్టంగా మేఘాలు కమ్ముకున్నాయి. భారీగా గాలులు వీచాయి. పెద్దపెద్ద ఉరుములు మెరుపులు వచ్చాయి. చిరు జల్లులు కూడా పడడంతో జనం పులకించిపోయారు. పెందుర్తి మండలం కృష్ణరాయపురంలో పిడుగుపాటుకు ఈశ్వరరావు (35) అనే కలాసీ మరణించాడు. విజయనగరం జిల్లాలో.. ఇక్కడ కూడా పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వేసవితో అల్లాడిపోతున్న జనానికి కాస్త ఊరట లభించగా.. వర్షానికి వడగండ్లు తోడవడంతో పలుచోట్ల పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. బలమైన ఈదురుగాలులు వీయడంతో అరటి చెట్లు నేలకూలాయి. ముఖ్యంగా బొబ్బిలి, రామభద్రపురం, శృంగవరపుకోట, లక్కవరపుకోట, సీతానగరం, బలిజిపేట మండలాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. బొబ్బిలి పట్టణంలో భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్లు పడ్డాయి. పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అనేక ప్రాంతాల్లో మామిడి కాయలు రాలిపోయాయి. దత్తిరాజేరు మండలం టి.బూర్జవలస గ్రామంలో ఈదురుగాలుల తాకిడికి చంద్రమ్మ (53) అనే వృద్ధురాలు అదుపుతప్పి రోడ్డుపై పడి మరణించింది. ఈరోజు, రేపు అప్రమత్తంగా ఉండండి ఆది, సోమవారాల్లో కూడా కోస్తాంధ్ర, రాయలసీమల్లో గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని విశాఖపట్నంలోని ఐఎండీ వెల్లడించింది. అదే సమయంలో పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఆదివారం కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు.. రాయలసీమలో సాధారణం కంటే 2–3 డిగ్రీలు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. అకాల వర్షాలు, పిడుగులతో ప్రాణాపాయం ఏర్పడకుండా ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గడచిన 24 గంటల్లో మెంటాడలో నాలుగు సెంటీమీటర్లు, శృంగవరపుకోట, తిరుమల, చిలమత్తూరు, వెంకటగిరికోటల్లో 2, లేపాక్షి, పార్వతీపురం, అర్థవీడు, బాలిజనపేట, ఎర్రగొండపాలెంలలో ఒక్కో సెంటీమీటరు చొప్పున వర్షం కురిసింది.