సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతువపనాలు మంగళ వారం నైరుతి రాజస్తాన్, దాన్ని ఆనుకుని ఉన్న కచ్ ప్రాంతాల నుంచి తొలగిపోయాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మంగళవారం ఉత్తర ఒడిశా–పశ్చిమ బెంగాల్ తీరం వద్ద కొనసాగు తుంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవ ర్తనం సగటు సముద్ర మట్టం నుంచి కొనసా గుతూ ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి వైపుకి వంపు తిరిగి ఉంది.
ఈ అల్పపీడనం రాగల 48 గంటల్లో పశ్చిమ వాయ వ్య దిశగా కదులుతూ ఉత్తర ఒడిశా, ఉత్తర చత్తీస్‌గఢ్ మీదుగా వెళ్లే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో తెలంగాణలో బుధవారం నుంచి మూడ్రోజులు ఉరుములు మెరుపులతో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. కొన్నిచోట్ల తేలికపాటినుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment