
సాక్షి, న్యూఢిల్లీ : భారత వాతావరణ విభాగం (ఐఎండీ) దేశంలో కోట్లాది రైతులకు శుభవార్తను అందించింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని బుధవారం వెల్లడించింది. ఈ సంవత్సరం సాధారణ రుతుపవనాలు ఉంటాయని భూఉపరితల శాస్ర్తాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి మాధవన్ రాజీవన్ పేర్కొన్నారు. మరోవైపు దేశంలోకి నైరుతి రుతుపవనాల రాకకు సంబంధించి ఐఎండీ ప్రారంభ తేదీలను విడుదల చేసింది.
రాజీవన్ తెలిపిన వివరాల ప్రకారం జూన్ 1న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించనుండగా, జూన్ 4న చెన్నైలో, జూన్ 8న హైదారబాద్‌ను తాకనున్నాయి. ఇక జూన్ 10న పుణేలో, జూన్ 11న ముంబైలో రుతుపవానాలు ప్రవేశిస్తాయి. జూన్ 27న నైరుతి రుతుపవనాలు దేశ రాజధాని ఢిల్లీని తాకుతాయని ఐఎండీ తెలిపింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ భారత్‌లో రుతుపవనాల సీజన్ ఉండగా..వరి, గోధుమలు, చెరకు, నూనెగింజలు వంటి పలు ప్రధాన పంటల కోసం రైతులు వర్షాలపైనే అధికంగా ఆధారపడతారు.
Comments
Please login to add a commentAdd a comment