
న్యూఢిల్లీ: ఎండలు మండుతున్న వేళ దేశ వాసులకు భారత వాతావరణ శాఖ( ఐఎండీ) చల్లని కబురు చెప్పింది. ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. దేశంలో దీర్ఘకాలిక సగటు(ఎల్‌పీఏ) 87 సెంటీమీటర్లుగా ఉండగా ఈ ఏడాది ఇందులో 106 శాతం వర్షపాతం రికార్డయ్యే చాన్స్ ఉందని వెల్లడించింది.
ప్రస్తుతం మధ్య పసిఫిక్ సముద్రం మీదుగా ఎల్‌నినో(వర్షాభావ) పరిస్థితులు కొనసాగుతున్నాయని, ఇది మెల్లగా తొలగిపోతూ రుతుపవనాలు ప్రారంభమయ్యే సరికి తటస్థ స్థితి(ఈఎన్‌ఎస్‌ఓ) ఏర్పడుతుందని వెల్లడించింది.
కాగా, భారత్‌లోని ఏకైక ప్రైవేట్ వాతావరణ అంచనాల సంస్థ స్కైమెట్ కూడా ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. స్కైమెట్ అంచనాలు ఐఎండీ అంచనాలకు దగ్గరగా ఉండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment