
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణం కేంద్రం తెలిపింది. మహారాష్ట్రలోని విదర్భలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో శనివారం సాయంత్రం నుంచి హైదరాబాద్ సహా తెలంగాణ అంతటా కురుస్తున్న వర్షాలు మరో 48 గంటలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది.
తెలంగాణలో ఆదివారం 50 శాతం, సోమవారం 35 శాతం వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ (హైదరాబాద్) డైరెక్టర్ వై కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. మహారాష్ట్రలోని విదర్భలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు. ఏపీలోని అన్ని జిల్లాల్లో 50 శాతం వర్షపాతం నమోదవుతుందని, పలుచోట్ల ఉరుములుమెరుపులతో కూడిన జల్లులు కురుస్తాయని అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో రోడ్ల తక్షణ మరమ్మత్తులకు సంబంధిత అధికారులు, తుపాన్ బృందాలు రాగల 48 గంటలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిషోర్ ఇంజనీరింగ్, మెయింటెనెన్స్ విభాగం అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment