AP Rain Forecast: నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం తీరం దాటినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల మధ్య పుదుచ్చేరి - చెన్నై సమీపంలో తీరందాటిందని తెలిపింది. అయితే, వాయు గుండం ప్రభావంతో.. నేడు దక్షిణ కోస్తా, రాయలసీమ సమీపంలో విస్తారంగాను, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
దీని ప్రభావంతో.. తీరంవెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. వేటకు వెళ్లకూడదని మత్స్యకారులను అధికారులు ఆదేశించారు. కాగా, ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు చేరుకుని సహయ కార్యక్రమాలు చేపట్టాయని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్ కె. కన్నబాబు సూచించారు.
(చదవండి: కాకినాడ యాంకరేజి పోర్టు: ఎక్స్‌పోర్ట్‌లో నెంబర్ 1 )
Comments
Please login to add a commentAdd a comment