
ప్రతీకాత్మక చిత్రం
అమరావతి: పశ్చిమ,మధ్య బంగాళ ఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని ప్రాంతీయ వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో, కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అదే విధంగా, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.