
సాక్షి, విశాఖపట్నం : రేపు కోస్తాంద్రలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది మరింత బలపడి రేపటికి దక్షిణ బంగాళాఖాతం మధ్యప్రాంతాల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది.
శనివారం సాయంత్రానికి అదే ప్రాంతంలో వాయుగుండం కాస్తా తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ నెల 17 వరకు వాయువ్య దిశగా తుపాను పయనించి, అనంతరం రికర్వ్ తీసుకుని ఈ నెల 18, 19 తేదీల వరకు ఉత్తర, ఈశాన్య దిశగా పయనించనుందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment